Coffee Day
-
ఒకప్పుడు భర్త, ఇప్పుడు తండ్రి మరణం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ఎం కృష్ణ ఇటీవల కన్నుముశారు. ఆయన కుమార్తె మాళవిక హెగ్డే ప్రముఖ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణి. మంగళూరు కాఫీ ఘుమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టిన విషయం తెలిసిందే.భర్త మరణం.. చెదరని విశ్వాసం2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.సగానికిపైగా అప్పులు క్లియర్కేఫ్ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.ఇదీ చదవండి: బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్భర్త, తండ్రిని కోల్పోయిన మాళవిక అధైర్య పడకుండా రెట్టించిన ఉత్సాహాంతో పని చేసి కంపెనీని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసి లాభాల్లోకి తీసుకురావాలని శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు. -
దశ తిరిగిన కాఫీడే! ఎట్టకేలకు లాభాల్లోకి..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాఫీడే (కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్- సీడీజీఎల్) దశ తిరిగిట్టు కనిపిస్తోంది. నష్టాల ఊబి నుంచి బయటపడి ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.24.57 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.73 కోట్ల నష్టాన్ని కాఫీడే చవిచూసింది. మొత్తంగా ఏడాది క్రితం తొలి త్రైమాసికంలో రూ.189.63 కోట్లుగా ఉన్న కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం ఈ ఏడాది రూ.223.20 కోట్లకు చేరుకున్నట్లు క్యూ1 ఫలితాల వెల్లడి సందర్భంగా కాఫీ డే పేర్కొంది. సీడీజీఎల్ అన్‌లిస్టెడ్ కంపెనీ కావడంతో దాని మాతృ సంస్థ కాఫీడే ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ (సీడీఈఎల్) ప్రతి త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తుంది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 250 కోట్లు. మరోవైపు ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కాఫీ డే దేశవ్యాప్తంగా ఉన్న తమ అవుట్లెట్ల సంఖ్యను సీక్వెన్షియల్ ప్రాతిపదికన 467కి తగ్గించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 493 అవుట్లెట్లు ఉండేవి. కానీ, వెండింగ్ యంత్రాలను మాత్రం 46,603 నుంచి 50,870కి పెంచుకుంది. ఒక్కో అవుట్‌లెట్‌లో సరాసరి రోజువారీ ఆదాయం రూ.19,537 నుంచి రూ.20,824కి పెరిగినట్లు కాఫీడే కంపెనీ వెల్లడించింది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేర్లు ఆగస్ట్ 16న లాభాల బాటలో పయనించాయి. ఇదీ చదవండి: Vietnam Richest man: అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద.. -
కాఫీ డే గ్లోబల్‌పై దివాలా పిటిషన్!
న్యూఢిల్లీ: ప్రముఖ కేఫ్ కాఫీ డే చైన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ (సీడీజీఎల్)పై దాఖలైన దివాలా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ అడ్మిట్ చేసింది. రూ.94 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ, బకాయిలను రాబట్టుకునేందుకుగాను కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను (సీఐఆర్‌పీ) ప్రారంభించాలని కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిటార్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ స్వీకరించింది. సీడీజీఎల్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎన్సీఎల్టీ లిఖితపూర్వక ఆదేశాల కోసం సీడీజీఎల్ ఎదురుచూస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి తన అనుబంధ సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సీడీజీఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సీడీజీఎల్ ఆదాయం రూ. 920.41 కోట్లు. నష్టం రూ.67.77 కోట్లు. -
కాఫీడే కష్టాలు: రూ. 440 కోట్ల రుణాల డీఫాల్ట్
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రూ. 440 కోట్ల మొత్తాన్ని డీఫాల్ట్ అయ్యింది. రూ. 220 కోట్ల రుణానికి సంబంధించి రూ. 190 కోట్ల అసలు, సుమారు రూ. 6 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు అలాగే, ఎన్సీడీలు మొదలైన బాకీల విషయంలో దాదాపు రూ. 245 కోట్లు డీఫాల్ట్ అయినట్లు వివరించింది. 2019లో వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ మరణానంతరం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిన సీడీఈఎల్ ఆ తర్వాత నుంచి అసెట్ల విక్రయం తదితర మార్గాల్లో రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదీ చదవండి: Jio Bharat Phone: జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
కాఫీ డే ఆడిటర్లకు రూ. 1.25 కోట్లు జరిమానా.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: కాఫీ డే గ్లోబల్ (సీడీజీఎల్), ఎంఏసీఈఎల్ ఖాతాల ఆడిటింగ్‌లో అవకతవకలకు సంబంధించి నలుగురు ఆడిటర్లు, ఒక ఆడిట్ సంస్థకు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) రూ. 1.25 కోట్ల జరిమానా విధింంది. అలాగే ఆడిటింగ్ పనులు చేపట్టకుండా వేర్వేరుగా రెండు నుంచి అయిదేళ్ల పాటు నిషేధింంది. దివంగత వీజీ సిద్ధార్థకు చెందిన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్)కు ఈ రెండూ అనుబంధ సంస్థలు. సీడీఈఎల్ నుం ఎంఏసీఈఎల్ (మైసర్ అవల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్)కు రూ. 3,535 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి గాను సీడీజీఎల్, ఎంఏసీఈఎల్ ఆర్థిక ఫలితాల స్టేట్మెంట్ల తయారీలో ఆడిటర్లు నిబద్ధతతో వ్యవహరించలేదని ఎన్ఎఫ్ఆర్ఏ నిర్ధారింంది. ఆడిట్ సంస్థ ఏఎస్ఆర్ఎంపీతో పాటు ఏఎస్ సుందరేశా, మధుసదన్ యూఎ, లవితా శెట్టి, ప్రణవ్ జి అంబేకర్ తదితరులకు తాజా జరివనాలు విధింంది. -
'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ..కొండంత అప్పును మంచులా కరిగించేసింది..కానీ!
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కేఫె కాఫీ డే సంస్థ తెలిపింది. వీటిలో ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్ తదితర అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీలున్నట్లు పేర్కొంది. అయితే భర్త వీజీ సిద్ధార్థ మరణంతో కొండలా పేరుకు పోయినా అప్పును మాళవిక హెగ్డే మంచులా కరిగించేశారు.కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కెఫె కాఫీ డే ఆర్ధిక వ్యవహారాలు బిజినెస్ వరల్డ్‌లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే? మాళవిక హెగ్డే మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. భర్త మరణంతో వెలుగులోకి 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కొండంత అప్పును మంచులా కరిగించేసింది కేఫె కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కెఫె కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
కాఫీడే....చేదు ఫలితాలు
న్యూఢిల్లీ: కాఫీడే ఎంటర్ప్రైజెస్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి–మార్చి)కి సంబంధించి రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 69 శాతం క్షీణించి రూ. 165 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 534 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. క్యూ4లో సికాల్ లాజిస్టిక్స్‌లో గల ఈక్విటీ షేర్ల విలువ తగ్గిన కారణంగా రూ. 151 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాఫీ డే పేర్కొంది. కోవిడ్–19 కారణంగా తలెత్తిన లాక్డౌన్లు, ఆంక్షలు బిజినెస్ కార్యకలాపాలు, సప్లై చైన్ దెబ్బతిన్నట్లు తెలియజేసింది. డైరెక్టర్ రాజీనామా క్యూ4లో కాఫీ, తత్సంబంధిత ఆదాయం 61 శాతంపైగా క్షీణించి రూ. 141 కోట్లకు పరిమితమైనట్లు కాఫీడే పేర్కొంది. అయితే ఆతిథ్య సర్వీసుల టర్నోవర్ 40 శాతం ఎగసి రూ. 11 కోట్లను తాకినట్లు వెల్లడించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 652 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో దాదాపు రూ. 1,849 కోట్ల నికర లాభం సాధించింది. మొత్తం ఆదాయం 67 శాతం పడిపోయి రూ. 853 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 2,552 కోట్ల ఆదాయం నమోదైంది. అయితే 2019–20లో ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీలో ఈక్విటీ వాటా విక్రయం ద్వారా లభించిన రూ. 1,828 కోట్లు కలసి ఉన్న విషయాన్ని కాఫీడే ఫలితాల సందర్భంగా ప్రస్తావించింది. అంతేకాకుండా గ్లోబల్ విలేజ్ ప్రాపర్టీ అమ్మకం ద్వారా మరో రూ. 1,190 కోట్లు లభించినట్లు తెలియజేసింది. కాగా.. 2020–21లో వే2వెల్త్ సెక్యూరిటీస్ విక్రయం ద్వారా రూ. 151 కోట్లు లభించినట్లు పేర్కొంది. జర్మనీలో నివసిస్తున్న కంపెనీ డైరెక్టర్ ఆల్బర్ట్ జోసెఫ్ హీరోనిమస్ వ్యక్తిగత ఆరోగ్య రీత్యా పదవికి రాజీనామా చేసినట్లు కాఫీడే వెల్లడించింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా కస్టమర్ల ప్రాంతాల నుంచి వెండింగ్ మెషీన్ల వినియోగానికి రూపొందించిన 30,000 కేబినెట్లను వెనక్కి తీసుకున్నట్లు కాఫీడే తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేరు ఎన్ఎస్ఈలో 2.6 శాతం ఎగసి రూ. 41.30 వద్ద ముగిసింది. చదవండి : జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు! -
స్వయంగా రంగంలోకి మాళవిక..
ఇద్దరికీ మొక్కలు నాటడం ఇష్టం. పెళ్లయిన కొత్తలోనే... ఇద్దరూ కలిసి కాఫీ మొక్కను నాటారు. ‘కాఫీ డే’ అని పేరు పెట్టారు. ఆ మొక్క మహా వృక్షమయింది. ఆరు దేశాలకు వేర్లను చాపుకుంది. అకస్మాత్తుగా అతడు.. చెట్టుపై నుంచి ఎగిరిపోయాడు. ఆమె ఒక్కటే మిగిలింది. ఆ వృక్షాన్ని మళ్లీ ఇప్పుడు..మొక్కలా పెంచబోతోంది! భర్తకు వారసత్వంగా వచ్చిన కాఫీ తోటలు ఉన్నాయి. మంగళూరులో సెయింట్ అలోయ్సియస్ కాలేజ్ నుంచి ఇకనమిక్స్లో పొందిన మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఆర్థికంగా అంత సంపద, ఆర్థశాస్త్రంలో అంత తెలివి ఉన్న భర్త ఓ రోజు ‘‘కాఫీ షాప్ పెడదాం.. కాఫీ ఇరవై ఐదు రూపాయలకు అమ్మితే లాభాలే లాభాలు..’’ అన్నప్పుడు మాళవిక వెంటనే ‘నాట్ ఎ బ్రైట్ ఐడియా’ అనేశారు! ఆమెకు కూడా కొంచెం చదువుంది. బెంగళూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేశారు. అయితే భర్త ఆలోచనను కాదన్నది ఆమె ఇంజినీరింగ్ కాదు. ఆమె కామన్ సెన్స్. (కాఫీ కింగ్ అదృశ్యం) 1990ల నాటి రోజులు అవి. కప్పు కాఫీ ఐదు రూపాయలకు దొరుకుతున్నప్పుడు ఎంత మంచి కాఫీ అయినా ఇరవై ఐదు రూపాయలకు ఎవరు కొంటారు అని ఆమె పాయింట్. భార్య అలా అనగానే తన ఆలోచనను కొద్దిగా మార్చారు సిద్ధార్థ. ‘‘పోనీ, ఇంటర్నెట్ సర్ఫింగ్ కమ్ కాఫీ?’’ అన్నారు. మాళవికకు ఆ ఐడియా నచ్చింది. అప్పటికి కొన్నాళ్ల ముందే 1991లో వాళ్ల పెళ్లయింది. 1996లో వాళ్ల ఉమ్మడి ఐడియా ‘కఫే కాఫీ డే’ (సిసిడి) గా కళ్లముందుకు వచ్చింది. మొదట కాఫీ డే బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్లో మొదలైంది. గత ఏడాది జూలై 29న సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునే నాటికి ఈ ఇరవై ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 243 పట్టణాలకు 1760 కాఫీ డేలు విస్తరించాయి. ఆస్ట్రియా, ఈజిప్ట్, చెక్ రిపబ్లిక్, మలేషియా, నేపాల్‌లలో కొన్ని బ్రాంచిలు ఉన్నాయి. అయితే సిద్ధార్థ మరణం తర్వాత ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో 280 ‘కాఫీ డే లు’ మూతపడ్డాయి! కొన్ని అప్పులు మిగిలి ఉన్నాయి. 2,693 కోట్ల రూపాయల అప్పన్నది మాళవిక తీర్చలేనిదేమీ కాదు. ఇన్వెస్టర్లు, ఇన్‌కం టాక్స్ అధికారులు, వడ్డీలు, ఆడిటర్లకు సైతం లెక్కతేలని కొన్ని ఆర్థిక వ్యవహారాల బకాయీలు అవన్నీ. శనివారం మాళవిక తమ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ‘‘అప్పులన్నీ తీర్చేస్తున్నాం. మునుపటిలా సంస్థను ముందుకు తీసుకెళదాం’’ అని సారాంశం. భర్త మరణం నుంచి తేరుకోడానికి సరిగ్గా ఏడాది పట్టింది మాళవికకు. ప్రస్తుతం ఆమె సిసిడి (కఫే కాఫీ డే)లో నాన్–ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు. ప్రస్తుతం అనే కాదు, బెంగళూరులోని వారి చిన్న ప్రారంభ దుకాణం ఒక పెద్ద కంపెనీగా అవతరించిన నాటి నుంచీ ఆమె.. జీతం తీసుకోని నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలే. తమ కాఫీ డే ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (సిడిఇఎల్) లో కొన్ని నిధులను ఇటు మళ్లించి కంపెనీని పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నారు మాళవిక. సిడిఇఎల్ అనుబంధ సంస్థే కఫె కాఫీ డే. (కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా) ఆరు దేశాలలో ఏడాదికి వందకోట్ల అరవై లక్షల కాఫీ కప్పులు అమ్మిన కాఫీ డే ఇప్పుడు రోజుకు సగటున పదిహేను వేల కప్పులు తక్కువగా అమ్ముతోంది. ఇది తాత్కాలికమైన క్షీణతేనని ఇప్పటికీ కాఫీ డే లపై కస్టమర్లకు ఉన్న ఆకర్షణే చెబుతోంది. ఇక మాళవికే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కనుక సమీప భవిష్యత్తులోనే ఆమె తన భర్తకు నివాళిగా సంస్థను మళ్లీ పూర్తిస్థాయి లాభాల్లోకి తీసుకెళ్లే అవకాశాలు నమ్మకంగా ఉన్నాయి. కస్టమర్లు ఎంతసేపైనా గడిపేందుకు అనువైన,ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండటంతో పాటు.. శాండ్విచ్, బర్గర్ల వంటి ఫాస్ట్ఫుడ్స్ లభించడం కూడా కాఫీ డే ప్రత్యేకతలు. బెంగళూరులో తొలి కాఫీ డే షాపు నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడి కిటికీల్లోంచి బయటికి చూస్తూ.. ఎవరెవరు తమ కాఫీ డేకు వస్తారో అంచనా వేయడం తమకొక ఆటగా ఉండేదని మాళవిక ఒక ఇంటర్వూ్యలో చెప్పారు. అంతగా ఈ దంపతులకు కాఫీ డేతో అనుబంధం ఉంది. ఆ బంధాన్ని చెక్కు చెదరన్వికుండా బిజినెస్‌లో తల్లికి సాయం చేసేందుకు ఇద్దరు కొడుకులు ఇషాన్, అమర్త్యలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆమె తండ్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అండగా ఉన్నారు. సిద్ధార్థ, మాళవికలకు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. మొక్కలు నాటడం ఇష్టమైన వ్యాపకం. ఇద్దరూ కలిసి మూడు వేల వరకు చెట్ల మొక్కల్ని నాటి ఉంటారు. దగ్గర లేని ఆ జీవిత సహచరుడిS కోసం కాఫీ డే అనే మహా వృక్షాన్ని మళ్లీ ఒక మొక్కలా సంరక్షించబోతున్నారు మాళవిక. కాఫీ డే కి చైర్పర్సన్ అవడం, కాకపోవడంతో నిమిత్తం లేకుండానే. (వ్యాపారవేత్తగా విఫలమయ్యా... ) మాళవిక (గత ఏడాది భర్త అంత్యక్రియల సమయంలో) -
కాఫీడే టెక్ పార్క్ విక్రయానికి యస్ బ్యాంకు బ్రేక్!
బెంగళూరు: కాఫీడే ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై హామీ ఇవ్వాలని యస్ బ్యాంకు కోరినట్లు తెలిసింది. ఇతర రుణదాతలంతా ఇప్పటికే కాఫీడే టెక్ పార్క్– బ్లాక్‌స్టోన్ ఒప్పందానికి ఆమోదం తెలిపారని, యస్ బ్యాంకు మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాఫీ డేకు చెందిన ట్యాంగ్లిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంగళూరులో గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ నడుస్తోంది. ఈ కంపెనీ యస్ బ్యాంకుకు రూ.100 కోట్లు బకాయి పడింది. కాఫీ డే కూడా యస్ బ్యాంకుకు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆకస్మిక ఆత్మహత్య తర్వాత కంపెనీ యాజమాన్యం ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు చెల్లించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600– 3,000 కోట్ల విలువకు విక్రయించేందుకు నాన్ బైండింగ్ ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలతో బీఎస్ఈలో కాఫీడే షేరు సోమవారం 9 శాతం నష్టంతో రూ.43.85 వద్ద క్లోజయింది. -
కాఫీ డే రేసులో లేము: ఐటీసీ
న్యూఢిల్లీ: రుణభారంలో ఉన్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ను (సీడీఈ) కొనుగోలు చేయబోతోందన్న వార్తలను వ్యాపార దిగ్గజం ఐటీసీ ఖండించింది. సీడీఈ కొనుగోలు రేసులో తాము లేమని స్పష్టం చేసింది. ‘ఐటీసీకి ఇలాంటి ప్రతిపాదనలు తరచూ వస్తుంటాయి. వాటిని పరిస్థితులను బట్టి మదింపు చేయడం జరుగుతుంటుంది. కేఫ్ కాఫీ డేకి సంబంధించి ఒక మధ్యవర్తిత్వ సంస్థ నుంచి ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. అయితే, ఈ విషయంలో ఎలాంటి పురోగతి మాత్రం లేదు‘ అని ఐటీసీ ప్రతినిధి తెలిపారు. రూ. 4,970 కోట్ల రుణభారం ఉన్న కాఫీ డే గ్రూప్ ప్రమోటరు వీజీ సిద్ధార్థ జూలైలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆర్థిక సమస్యలే కారణమనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రుణభారాన్ని తగ్గించుకోవడానికి సీడీఈ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ అసెట్స్‌ను విక్రయించడంపై దృష్టి సారిస్తోంది. -
అమ్మకానికి కాఫీ డే ’గ్లోబల్ పార్క్’
న్యూఢిల్లీ: వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈ) తాజాగా రుణాల భారం తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. అలాగే, అనుబంధ సంస్థ అల్ఫాగ్రెప్ సెక్యూరిటీస్‌లో కూడా వాటాలను ఇల్యూమినాటి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించే ప్రతిపాదనకు కూడా సీడీఈ బోర్డు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ‘రుణభారం తగ్గించుకునే మార్గాలపై డైరెక్టర్ల బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా అనుబంధ సంస్థ టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో భాగమైన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కి విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. మదింపు ప్రక్రియ, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించడం మొదలైనవన్నీ పూర్తయ్యాకా వచ్చే 30–45 రోజుల్లో ఈ డీల్ పూర్తి కావచ్చు‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు సీడీఈ తెలియజేసింది. ఈ రెండు ఒప్పందాలతో కాఫీ డే గ్రూప్ రుణభారం గణనీయంగా తగ్గగలదని పేర్కొంది. ఇన్వెస్టర్లు, రుణదాతలు, ఉద్యోగులు, కస్టమర్లు మొదలైన సంబంధిత వాటాదారులందరికీ ఈ డీల్స్ ప్రయోజనకరంగా ఉండగలవని వివరించింది. ఆతిథ్య, రియల్టీ తదితర రంగాల్లోని అన్‌లిస్టెడ్ వెంచర్స్ కారణంగా వీజీ సిద్ధార్థ నెలకొల్పిన సీడీఈ రుణభారం రెట్టింపై రూ. 5,200 కోట్లకు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెల సిద్ధార్థ అదృశ్యం కావడం, ఆ తర్వాత నేత్రావతి నదిలో శవమై తేలడం ఆయన మరణంపై సందేహాలు రేకెత్తించాయి. సిద్ధార్థ అకాల మరణంతో జూలై 31న స్వతంత్ర డైరెక్టర్ ఎస్వీ రంగనాథ్ సీడీఈ తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. రంగనాథ్‌తో పాటు సీవోవో నితిన్ బాగ్మానె, సీఎఫ్‌వో ఆర్ రామ్మోహన్‌లతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటైంది. కాఫీ డే గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది. -
సిద్ధార్థ మృతిపై అశ్విన్ దిగ్భ్రాంతి
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే(సీసీడీ) వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణంపై టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తాను స్నేహితులతో కలిసి కేఫ్ కాఫీడేలోనే తొలిసారి కాఫీ తాగానని అశ్విన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. బుధవారం ఉదయం మంగళూరు శివారులోని నేత్రావతి నదీతీరంలో సిద్ధార్థ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఇది చాలా విషాదకరమైన వార్తని, సిద్ధార్థ ఆత్మకు శాంతి చేకూరాలని అశ్విన్ ట్విటర్లో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అదృశ్యమైన సిద్ధార్థ బుధవారం తెల్లవారుజామున నదీతీరంలో శవమై కనిపించారు. శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులు అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. My first memories of going out with friends and having a cup of coffee happened only with the inception of cafe coffee day. Sad news #RIPSiddhartha #cafecofeeday — Ashwin Ravichandran (@ashwinravi99) July 31, 2019 -
సిద్ధార్థతో పోల్చుకున్న మాల్యా..
న్యూఢిల్లీ : ఆర్ధిక సమస్యలతో కేఫ్ కాఫీడే వ్యవస్ధాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై లిక్కర్ కింగ్, రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా స్పందించారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన బ్రిలియంట్ ఎంట్రపెన్యూర్ సిద్ధార్థకు ఎదురైన పరిస్ధితులే తాను అనుభవిస్తున్నానని మాల్యా పోల్చుకున్నారు. సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రమకు లోనయ్యానని, తనదీ సిద్ధార్ధ పరిస్ధితేనని వ్యాఖ్యానించారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎవరినైనా నిస్సహాయులను చేస్తాయని, తన పట్లా ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలను పూర్తిగా చెల్లిస్తానని తాను ముందుకొచ్చినా వేధిస్తున్నారని మాల్యా ట్వీట్ చేశారు. కాగా ఆర్థిక సమస్యలతో అదృశ్యమైన పారిశ్రామికవేత్త వీజీ సిద్ధార్ధ మృతదేహం మంగుళూర్ సమీపంలోని నేత్రావతి నది వద్ద బయటపడిన సంగతి తెలిసిందే. -
వ్యాపారవేత్తగా విఫలమయ్యా...
ఆర్థిక ఒత్తిళ్లతో అదృశ్యమైన వీజీ సిద్ధార్థ కాఫీ డే ఉద్యోగులు, బోర్డు సభ్యులకు రాసినట్లు పేర్కొంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిద్ధార్థ కనిపించకుండాపోవడానికి రెండు రోజుల ముందు(ఈ నెల 27న) తేదీతో ఈ లేఖ ఉండటం గమనార్హం. ఆయన లేఖలో ఏం చెప్పారంటే... ‘గడిచిన 37 ఏళ్లుగా ఎంతో నిబద్ధతతో కష్టపడిపనిచేస్తూ నేను స్థాపించిన కంపెనీలు, అనుబంధ సంస్థల్లో 30 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించా. అదేవిధంగా నేను అతిపెద్ద వాటాదారుగా ఉన్న మరో టెక్నాలజీ కంపెనీలో కూడా 20 వేల కొలువులను తీసుకొచ్చా. అయితే, నా కష్టమంతా ధారపోసినప్పటికీ.. ఆయా సంస్థలను లాభదాయకమైన వ్యాపార దిగ్గజాలుగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యా. నామీద నమ్మకంతో చేదోడుగా నిలిచినవారందరినీ క్షమించమని కోరుతున్నా. ఎందుకంటే నేను ఎంతగా ప్రయత్నించినా నామీద ఉన్న ఒత్తిళ్లతో నిస్సహాయుడిగా ఉండిపోయా. ప్రైవేటు ఈక్విటీ(పీఈ) భాగస్వామ్య సంస్థల్లో ఒకదాని నుంచి షేర్ల బైబ్యాక్ కోసం విపరీతమైన ఒత్తిడి రావడంతో స్నేహితుల నుంచి భారీ మొత్తంలో అప్పులుతెచ్చిమరీ కొంత మేరకు ఈ లావాదేవీలను ఆరు నెలల క్రితం పూర్తిచేశాను. మరోపక్క, రుణ దాతల నుంచి కూడా ఒత్తిడి పెరిగిపోవడంతో పరిస్థితి దిగజారింది. అంతేకాదు.. మైండ్‌ట్రీలో షేర్ల అమ్మకం డీల్‌కు సంబంధించి గతంతో ఆదాయపు పన్ను(ఐటీ) డీజీ నుంచి కూడా వేధింపులను ఎదుర్కొన్నా. ఒప్పందాన్ని అడ్డుకోవడం కోసం రెండుసార్లు నా వాటా షేర్లను అటాచ్ చేయడంతో పాటు కాఫీ డే షేర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్నులను వాళ్లు చెప్పినట్లు సవరించి వేసినా నన్ను వేధించారు. ఈ అన్యాయమైన చర్యలతో కంపెనీలో తీవ్రమైన నగదు కొరతకు దారితీసింది. నా ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఈ సమయంలో మీరంతా కొత్త యాజమాన్యం నేతృత్వంలో మన వ్యాపారాన్ని కొనసాగించేందుకు శక్తివంచనలేకుండా కృషిచేయాలని కోరుతున్నాను. జరిగిన తప్పులన్నింటికీ నాదే పూర్తి బాధ్యత. అంతేకాదు సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నింటికీ కూడా నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఆడిటర్లు, సీనియర్ మేనేజ్మెంట్ ఇతరత్రా ఉద్యోగులెవరికీ వీటి గురించి తెలియదు. చివరికి నా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలను చెప్పలేదు. మోసం చేయడం, తప్పుదోవపట్టించాలన్నది నా ఉద్దేశం కానేకాదు. చట్టపరంగా ఈ మొత్తం పరిణామాలన్నింటికీ నాదే బాధ్యత. ఒక వ్యాపారవేత్తగా నేను విఫలమయ్యాను. ఎదో ఒకరో జు నా నిజాయితీని మీరంతా గుర్తించి, నన్ను క్షమిస్తారని భావిస్తున్నా. నాకున్న ఆస్తుల విలువతో పాటు వాటి జాబితాను కూడా మీకు తెలియజేస్తున్నా. అప్పులన్నీ తీర్చేయడానికి నా ఆస్తులు సరిపోతాయి’ – వీజీ సిద్ధార్థ -
కాఫీ కింగ్ అదృశ్యం
సాక్షి, బెంగళూరు : దేశ కార్పొరేట్ ప్రపంచమంతా మంగళ వారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాఫీ కింగ్‌గా పేరొందిన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే(సీసీడీ) వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, వ్యాపారవేత్తగా తాను విఫలమయ్యానని పేర్కొంటూ సిద్ధార్థ సంతకంతో ఒక లేఖ బయటపడింది. అందులో ఆదాయపు పన్ను అధికారులు, పీఈ భాగస్వామ్య సంస్థ నుంచి తీవ్రమైన వేధింపులు ఉన్నాయంటూ ఆయన పేర్కొనడం పారిశ్రామిక వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. సిద్ధార్థ అదృశ్య వార్తలతో కాఫీ డే షేరు ధర 20 శాతం కుప్పకూలింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సిద్ధార్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తు పడిపోయారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇలా అదృశ్యమయ్యారు ‘సోమవారం సాయంత్రం సకలేశపురకు అని చెప్పి డ్రైవర్ బసవరాజు దేశాయితో కలసి వీజీ సిద్ధార్థ బయలుదేరారు. కానీ సకలేశపురకు చేరుకోగానే, అక్కడి నుంచి మంగళూరుకు వెళ్లు అని డ్రైవర్‌కు సూచించారు. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ వద్దనున్న నేత్రావతి నది వద్దకు చేరుకోగానే కారు నిలపమని డ్రైవర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత కారును వంతెనకు అటువైపు చివరకుతీసుకెళ్లి నిలిపి ఉండు, నేను నడుచుకుంటూ కారు దగ్గరికి వస్తాను అని చెప్పి దిగేశారు. అయితే వంతెనపై నడుచుకుంటూ ఎంతసేపటికీ రాకపోవడంతో డ్రైవర్ వెనక్కి వచ్చి చూడగా చుట్టుపక్కల ఎక్కడా సిద్ధార్థ కనిపించలేదు. ఫోన్ చేస్తేనేమో స్విచ్చాఫ్ అయింది. దీంతో డ్రైవర్ పోలీసులకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు’ అని దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ సెంథిల్ శశికాంత్ సెంథిల్ పేర్కొన్నారు. అదృశ్య వార్తను సిద్ధార్థ కుమారుడికి ఫోన్ చేసి డ్రైవర్ వెల్లడించాడు.. వారు కూడా స్థానిక కాఫీడే సిబ్బందికి తెలియజేసి గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి గాలింపు ప్రారంభించింది. సిద్ధార్థ అదృశ్యంపై అతని కారు డ్రైవర్ని మంగళూరు పోలీసులు ప్రశ్నించారు. సిద్ధార్థ కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు. మంగళూరులో సిద్ధార్థ బస చేసే హోటళ్లు, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని హోటల్లు, బంధువుల ఇళ్లలోనూ గాలింపు చేపట్టారు. ఆత్మహత్యా అనుమానాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆయన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు నుంచి మంగళూరుకు కారులో వెళుతున్నంత సేపు తన స్నేహితులకు ఫోన్లు చేసి ‘నన్ను క్షమించండి’ అంటూ భాగోద్వేగానికి లోనవడంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, మంగళూరు నగరంలోని డీసీపీలు హనుమంతరాయ, లక్ష్మి గణేశ్‌ల నేతృత్వంలోని సుమారు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది, అధికారులు సోమవారం రాత్రి నుంచి సిద్ధార్థ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిద్ధార్థ అదృశ్యమైన నేత్రావతి నదిలో గజ ఈతగాళ్లు, 25 బోట్లు ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టారు. నది చుట్టుపక్కల కూడా వెతుకుతున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి శోధిస్తున్నారు. అలాగే వీరికి కోస్టుగార్డు సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది కూడా సాయపడుతున్నారు. స్థానిక మత్స్యకారుల సాయం కూడా తీసుకుంటున్నామని, చివరిగా ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో కూడా చెక్ చేస్తున్నామని మంగళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఎస్ఎం కృష్ణకు నేతల పరామర్శ సిద్ధార్థ అదృశ్యంతో బెంగళూరు సదాశివనగరలో ఆయన మామ ఎస్ఎం కృష్ణ ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య తదితరులు కృష్ణకు ధైర్యం చెప్పారు. సిద్ధార్థ నదిలో దూకడాన్ని చూశా కాఫీ డే యజమాని సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు సైమన్ డిసోజా అనే స్థానిక జాలరి తెలిపారు. తను చేపలకు వల వేస్తుండగా నీటిలోకి ఎవరో దూకిన శబ్దం వినిపించిందని మంగళవారం స్థానిక మీడియాకు తెలిపారు. తను అక్కడికి వెళ్లేలోపు దూకిన వ్యక్తి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ లోపలికి మునిగిపోయాడని చెప్పారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ అనేకం జరిగినట్లు తెలిపారు. దేశీ కాఫీ కింగ్ సిద్ధార్థ .. దాదాపు 140 ఏళ్లుగా కాఫీ వ్యాపారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ జీవితంలో పలు మలుపులు ఉన్నాయి. ఆయన ముందుగా భారతీయ ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పట్టా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరుగా మారారు. 1984లో సొంతంగా శివన్ సెక్యూరిటీస్ పేరిట ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించారు. దాన్నుంచి వచ్చిన లాభాలతో కర్ణాటకలోని చిక్మగళూర్ జిల్లాలో కాఫీ తోటలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కుటుంబ కాఫీ వ్యాపారంపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. 1993లో అమాల్గమేటెడ్ బీన్ కంపెనీ (ఏబీసీ) పేరిట కాఫీ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. అప్పట్లో రూ. 6 కోట్లుగా ఉన్న ఈ సంస్థ వార్షిక టర్నోవరు ఆ తర్వాత రూ. 2,500 కోట్ల స్థాయికి చేరింది. దేశీయంగా ఇది ప్రస్తుతం అతి పెద్ద గ్రీన్ కాఫీ ఎగుమతి సంస్థ. ఇక, జర్మన్ కాఫీ చెయిన్ ’చిబో’ స్ఫూర్తితో సొంత కెఫేలను కూడా సిద్ధార్థ ప్రారంభించారు. తేనీటిప్రియులను కూడా ఘుమఘుమలాడే కాఫీ వైపు మళ్లేలా చేశారు. 1994లో బెంగళూరులో తొలి కెఫే కాఫీ డే ప్రారంభమైంది. ప్రస్తుతం వియన్నా, ప్రాగ్, కౌలాలంపూర్ తదితర 200 పైచిలుకు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,750 కెఫే కాఫీ డే అవుట్‌లెట్స్ ఉన్నాయి. 2015లో కాఫీ డే పబ్లిక్ ఇష్యూకి కూడా వచ్చింది. బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారు: ఐటీ శాఖ అదృశ్యమైన కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థను తాము గతంలో దర్యాప్తు సందర్భంగా వేధించామన్న ఆరోపణలను ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. లేఖలోని సిద్ధార్థ సంతకం, తమ దగ్గరున్న సంతకానికి చాలా తేడా ఉందని ఐటీ శాఖ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. గతంలో తాము జరిపిన సోదాల్లో తనవద్ద బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారని కూడా ఐటీ శాఖ తెలిపింది. భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు తగిన ఆధారాలు దొరకడంతోనే షేర్లను అటాచ్ చేశామని, 2017లో కాఫీ డే గూపు కంపెనీల్లో సోదాలను కూడా చేశామని ఐటీ అధికారులు చెప్పారు. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేశారు. కాగా, మైండ్ ట్రీ షేర్ల విక్రయం ద్వారా సిద్ధార్థకు దాదాపు రూ.3,200 కోట్లు వచ్చాయని.. ఈ డీల్ విషయంలో కనీస ప్రత్యామ్నాయ పన్నుగా రూ.300 కోట్లను సిద్ధార్థ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.46 కోట్లను మాత్రమే కట్టారని కూడా ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వద్ద రూ.362.11 కోట్ల లెక్కలో చూపని ఆదాయం(బ్లాక్ మనీ) తో పాటు, తన వద్ద రూ.118.02 కోట్ల నగదు ఉన్నట్లు సిద్ధార్థ ఒప్పకున్నారని ఐటీ వర్గాలు వివరించాయి. సీసీడీడీలో 6% వాటా ఉంది: కేకేఆర్ సీసీడీ వ్యవస్థాపకుడు సిద్దార్థ అదృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్దార్థపైన నమ్మకంతో సీసీడీలో తాము తొమ్మిదేళ్ల క్రితం చేసిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని గతేడాది విక్రయించామని.. దీంతో తమ వాటా 10.3 శాతం నుంచి ప్రస్తుతం 6 శాతానికి పరిమితమైనట్లు కేకేఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఒక పీఈ ఇన్వెస్టర్ నుంచి షేర్ల బైబ్యాక్ కోసం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానంటూ సిద్దార్థ రాసినట్లు చెబుతున్న లేఖలో బయటపడిన నేపథ్యంలో కేకేఆర్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా పీఈ ఫండ్స్ ఏడాది నుంచి ఏడేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడులు పెట్టి వైదొలగుతుంటాయని, అయితే తాము మాత్రం సీసీడీ వృద్ధి చెందేంతవరకూ సహకారం అందించి కొంత వాటాను మాత్రమే విక్రయించామని కేకేఆర్ వివరించింది. బకాయిలేమీ లేవు: హెచ్డీఎఫ్సీ సిద్ధార్థతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి తమకు రుణ బకాయిలు ఉన్నట్లు వచ్చిన వార్తలను హెచ్డీఎఫ్సీ తోసిపుచ్చింది. ‘సీసీడీకి చెందిన టాంగ్లిన్ డెవలప్మెంట్స్ బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్‌పార్క్ ప్రాజెక్టు కోసం గతంలో మేం రుణాలిచ్చాం. అయితే, 2019 జనవరిలో ఈ మొత్తం రుణాన్ని సంబంధిత సంస్థ చెల్లించేసింది. ప్రస్తుతం కాఫీడే ఎంటర్ ప్రైజెస్ గ్రూపు నుంచి మాకు ఎలాంటి బకాయిలూ లేవు’ అని హెచ్డీఎఫ్సీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం: సీసీడీ సిద్ధార్థ అదృశ్యంతో సీసీడీ డైరెక్టర్ల బోర్డు మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. సిద్దార్థ రాసినట్లు బయటికొచ్చిన లేఖలోని అంశాలను సమీక్షించడంతోపాటు లేఖ కాపీలను సంబంధిత అధికారులకు అందజేసినట్లు కంపెనీ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కాగా, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా తగిన చర్యలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. ‘సిద్దార్థ అదృశ్య సంఘటనతో మేం షాక్‌కు గురయ్యాం. ఆయన కుటుంబ సభ్యులు, ఆప్తులకు మా పూర్తి మద్దతను తెలియజేస్తున్నాం. ఆయన ఆచూకీ కోసం మేం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. నిపుణులైన నాయకత్వంలో కంపెనీ నడుస్తున్నందున వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి’ అంటూ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. మైండ్‌ట్రీ డీల్‌తో రూ.3,200 కోట్లు కాఫీ దగ్గరే ఆగిపోకుండా సిద్ధార్థ కొంగొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఇటు ఆర్థిక సేవల నుంచి అటు ఐటీ దాకా వివిధ రంగాల్లో కార్యకలాపాలు విస్తరించారు. ఐటీ రంగంలో ప్రవేశించి గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్‌ని ఏర్పాటు చేశారు. అటు ఆర్థిక సేవలు అందించే శివన్ సెక్యూరిటీస్ కింద చేతన్ ఉడ్ ప్రాసెసింగ్, బేర్‌ఫుట్ రిసార్ట్స్ (ఆతిథ్య రంగం), డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ (కలప వ్యాపారం) పేరిట మరో మూడు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశారు. 1999లో సుబ్రతో బాగ్చీ, కేకే నటరాజన్, రోస్టో రవనన్‌లు మైండ్‌ట్రీ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సిద్ధార్థను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా తీసుకొచ్చారు ఐటీ రంగంలో సీనియర్ అయిన అశోక్ సూతా. ఒక దశలో మైండ్‌ట్రీలో ఆయన అతి పెద్ద వాటాదారు కూడా. ఈ ఏడాది మార్చిలోనే తనకున్న 20.41 శాతం వాటాలను లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)కి విక్రయించారు. ఈ వివాదాస్పద డీల్ ద్వారా రూ. 3,200 కోట్లు వచ్చాయి. దాదాపు రూ. 2,900 కోట్ల రుణభారాన్ని ఈ నిధులతో తగ్గించుకున్నారు. అప్పుల కుప్ప.. కాఫీ డే కాఫీ డే చెయిన్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 6,550 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. రుణాలతో పాటు నష్టాలు కూడా భారీగా పెరిగిపోయాయి. దేశీయంగా కాఫీ ఉత్పత్తి తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు 13 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కీలకమైన సిద్ధార్థ వ్యాపారాన్ని గట్టిగానే దెబ్బతీసింది. అయితే, రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించేసిన సిద్ధార్థ.. ఇతర వ్యాపారాల్లో కూడా వాటాలను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. రూ. 10,000 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో కెఫే కాఫీ డే (సీసీడీ)లో కొంత వాటాలను కోక కోలా సంస్థకు అమ్మేసేందుకు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. రియల్టీ రంగంలో సిద్ధార్థ నెలకొల్పిన టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో దాదాపు రూ. 2,800 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా
సాక్షి, ముంబై : సౌమ్యుడు, అత్యంత సాధారణ జీవితాన్ని ఇష్టపడే వ్యాపారవేత్త కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజి సిద్ధార్థ అదృశ్యం వార్త వ్యాపారవర్గాల్లో కలవరాన్ని రేపింది. ప్రధానంగా కాఫీడే బోర్డుకు సిద్ధార్థ రాసినట్లుగా భావిస్తున్న లేఖ మీడియాలో వ్యాపించింది. కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ను లాభదాయకంగా నిర్వహించడంలో విఫలమైనందుకు మనస్తాపంతోనే ఆయన ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఎంత కష్టపడినా, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ను విజయవంతం చేయడంలో విఫలమయ్యాననీ, వేధింపులను తట్టుకోలేకపోతున్నానంటూ లేఖ సాగడం గమనార్హం. తనపట్ల ఉంచిన నమ్మకానికి న్యాయం చేయలేక పోతున్నానని వాపోయారు. అయితే దీనికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. ఆస్తులతో పోలిస్తే అప్పులు చాలా తక్కువనీ మొత్తం అన్ని రుణాలనూ తీర్చేందుకు కంపెనీకి అవి సరిపోతాయని స్పష్టం చేశారు. ప్రధానంగా ప్రైవేట్ ఈక్వీటీ ఇన్వెస్టర్ల ఒత్తిడితోపాటు, ఆదాయ పన్ను ఉన్నతాధికారి వేధింపులను ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ముమ్మర గాలింపు సోమవారం సాయంత్రం కర్ణాటక మంగళూరులోని నేత్రావతి నది వద్దగల బ్రిడ్జి నుంచి కారు దిగిన సిద్ధార్థ తదుపరి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా సిద్ధార్థ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నపాటిల్ అందించిన సమాచారం ప్రకారం సాయంత్రం ఎనిమిది గంటలకు బ్రిడ్జ్‌మీద దిగన సిద్ధార్థ, గంట తరువాత రమ్మని చెప్పారు. అనంతరం పాటిల్ అక్కడికి చేరుకొని ఆయనకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సిద్ధార్థ కుమారుడికి సమాచారం అందించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, తదితర బృందాలు సిద్ధార్థ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. స్పెషల్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపాయి. స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపును తీవ్రం చేశాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలు, షేరు డీలా వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారన్నవార్తలు అటు ఇన్వెస్టర్లను కూడా షాక్‌కు గురి చేశాయి. దీంతో కాఫీడే ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. భారీ అమ్మకాలతో షేరు 20శాతం నష్టాలతో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అంటే అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు లేకపోవడంతో రూ. 153.40 వద్ద ఫ్రీజయ్యింది. మైండ్ ట్రీ డీలే కొంపముంచిందా? ఈ ఏడాది మార్చిలో టెక్ సంస్థ మైండ్‌ట్రీలో తనకున్న 20 శాతం మొత్తం వాటాను రూ. 3300 కోట్లకు ఎల్ అండ్ టీకి విక్రయించి సిద్ధార్థ వార్తల్లో నిలిచారు. అలాగే 1993లో స్థాపించిన స్నాక్ ఫుడ్ కోలా జెయింట్ 1500 ఔట్లెట్లను విక్రయించడానికి కోకాకోలాతో చర్చలు జరిపినట్టు కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 2017లో ఆదాయపు పన్నుఅధికారులు దాడి చేయడం తెలిసిందే. అయితే మైండ్ ట్రీ డీలే కొంపముంచిందా. ఐటీ అధికారులు సీజ్ చేసిన షేర్లు సిద్ధార్థ అనూహ్య నిర్ణయానికి కారణమా లాంటి సందేహాలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. కాగా దేశంలో అత్యధికంగా కాఫీ గింజలనుఎగుమతి చేసే వారిలోఆయన ఒకరు. 130 సంవత్సరాలకు పైగా సిద్ధార్థ కుటుంబం కాఫీ పండించే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌లో 32.75 శాతం వాటాను సిద్ధార్థ కలిగి ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సికల్ లాజిస్టిక్స్ ప్రమోటర్లలో ఒకరు. అలాగే కన్సల్టెన్సీ సంస్థ మైండ్‌ట్రీలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు స్వయానా అల్లుడు సిద్ధార్థ. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎస్ఎం కష్ణను కలిసి ధైర్యం చెప్పారు. -
పన్ను బకాయిలేమీ లేవు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ చెబుతున్నట్లుగా తమ కంపెనీ కట్టాల్సిన పన్ను బాకీలేమీ లేవని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ స్పష్టం చేసింది. బాకీలు రాబట్టుకోవడం కోసమంటూ ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసుకున్న మైండ్‌ట్రీ షేర్లను విడిపించుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపింది. ‘ఆదాయ పన్ను శాఖ 148, 153ఎ సెక్షన్ల కింద ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా ప్రమోటరు, కంపెనీ సవరించిన రిటర్నులను దాఖలు చేయడం జరిగింది. వీటి ప్రకారం.. కంపెనీ, దాని అనుబంధ సంస్థలు గానీ, ప్రమోటరు గానీ కట్టాల్సిన పన్ను బాకీలేమీ లేవు‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తెలిపింది. సీసీడీ కాఫీ చెయిన్‌ను కాఫీ డే ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తోంది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్, దాని ప్రమోటరు సిద్ధార్థ రిటర్నుల్లో చూపిన దానికంటే మరింత ఎక్కువ మొత్తం పన్నులు చెల్లించాల్సి ఉంటుందనే కారణంతో.. ఐటీ సంస్థ మైండ్‌ట్రీలో వారికున్న వాటాల్లో కొంత భాగాన్ని ఐటీ శాఖ అటాచ్ చేసింది. వీటినే విడిపించుకునేందుకు కాఫీ డే, సిద్ధార్థ ప్రయత్నాల్లో ఉన్నారు. వివాదమిదీ.. ఐటీ సంస్థ మైండ్‌ట్రీ ఏర్పాటైన తొలినాళ్ల నుంచి పెట్టుబడులతో తోడ్పాటునందించిన వీజీ సిద్ధార్థ గ్రూప్‌నకు ఈ కంపెనీలో 21 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం మరో ఐటీ సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్‌కు ఈ వాటాలను విక్రయించేందుకు సిద్ధార్థ చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది పూర్తయితే నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం టేకోవర్ చేసిన కంపెనీ ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి రావొచ్చు. అయితే, మైండ్‌ట్రీలో కాఫీ డే వాటాల విక్రయాన్ని సుబ్రతో బాగ్చి, ఎన్ఎస్ పార్థసారథి తదితర వ్యవస్థాపకులు వ్యతిరేకిస్తున్నారు. మేనేజ్మెంట్ మద్దతు లేకుండా ఈ డీల్ సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈలోగా మైండ్‌ట్రీలో సిద్ధార్థకు ఉన్న షేర్లలో 22.2 లక్షల షేర్లు, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కున్న 52.7 లక్షల షేర్లను ఐటీ శాఖ అటాచ్ చేసుకుంది. జనవరి 25తో మొదలుకుని ఆరు నెలల పాటు ఈ ఆర్డరు అమల్లో ఉండనుంది. దీంతో సిద్ధార్థ వాటాల విక్రయ ప్రక్రియకు మరిన్ని అడ్డంకులు ఎదురయ్యేట్లు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. -
మత్తు మందు చల్లి ప్రొద్దుటూరులో చోరీ
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మైదుకూరు రోడ్డులోని బాలాజీనగర్–2లో నివాసం ఉంటున్న కాఫీడే డిస్ట్రిబ్యూటర్ ప్రదీప్‌రెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిద్రపోతున్న వ్యక్తిపై మత్తు మందు చల్లి అతని వద్ద ఉన్న తాళం చెవి తీసుకొని ఇంట్లోకి చొరబడ్డారు. టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రదీప్‌రెడ్డి కాఫీడే డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. అతను రెండు రోజుల క్రితం ఏజెన్సీ పనిపై క్యాంప్‌నకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన తండ్రి నరసింహారెడ్డి ప్రధాన ద్వారానికి తాళం వేసి మంగళవారం మిద్దెపై పడుకున్నారు. ప్రదీప్‌రెడ్డి భార్య శశికళ, కుమార్తె అనితశ్రీలు ఇంట్లోని రెండో బెడ్రూంలో పడుకున్నారు. ఈ క్రమంలో మిద్దెపై పడుకున్న నరసింహారెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిద్రలేచి చూడగా దిండు కింద తాళాలు, సెల్‌ఫోను ఉన్నాయి. బుధవారం వేకువ జామున 3.30 గంటలకు మెలకువలోకి వచ్చిన ఆయన దిండు కింద చూసుకోగా తాళాలు, సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో కంగారుగా అతను కిందికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరచి ఉంది. ఇంట్లో ఉన్న బీరువా కూడా తెరవబడి, అందులోని వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రోజూ హాల్లోని ఫ్రిజ్‌పై మొదటి గది తాళం చెవి, బీరువా తాళాలు పెట్టే అలవాటు ఉందని, వాటిని తీసుకొని దుండగులు గదిలోకి ప్రవేశించారని నరసింహారెడ్డి తెలిపారు. తనపై మత్తు మందు చల్లడంతోనే వేకువ జాము వరకూ మెలుకువ రాలేదని, ఇప్పుడు కూడా మత్తుగా ఉందని ఆయన అన్నారు. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం అధికారులు కూడా సంఘటనా స్థలం లో వేలి ముద్రలు సేకరించారు.కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కాఫీ డే ఐపీఓ ఇష్యూ ధర రూ.328
- రూ.1,150 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తన ఐపీఓ ఇష్యూధరను రూ.328గా నిర్ణయించింది. గత శుక్రవారం(అక్టోబర్ 16న) ముగిసిన ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.316-328ని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా 3.5 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేశామని, రూ. 328 ఇష్యూధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.1,150 కోట్ల నిధులు వస్తాయని తెలిపింది. ఈ ఇష్యూ 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని, రూ.2,000 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయని పేర్కొంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో చర్చించి ఇష్యూ ధరను రూ.328గా నిర్ణయించామని వివరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా పూర్తిగా సబ్‌స్క్రైబ్ కానప్పటికీ, ప్రైస్‌బాండ్ గరిష్ట ధరను ఇష్యూధరగా కంపెనీ నిర్ణయించింది. 2012 డిసెంబర్లో వచ్చిన రూ.4,000 కోట్ల భారతీ ఇన్ఫ్రాటెల్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. -
కాఫీ డే ఆఫర్.. 1.81 రెట్లు సబ్స్రిప్షన్
ముంబై: కేఫ్ కాఫీ డే (సీసీడీ) చెయిన్‌ను నిర్వహించే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 1.81రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. రూ.316-328 ప్రైస్‌బాండ్ ఉన్న ఈ ఐపీఓ మూడేళ్లలో అతి పెద్దది.ఈ కంపెనీ ఇప్పటికే రూ.334 కోట్లను యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా సమీకరించింది. పోర్టియాలోకి భారీ పెట్టుబడులు! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా హోమ్ హెల్త్ కేర్ సేవలందిస్తున్న పోర్టియా సిరీస్ బీ విభాగం కింద భారీ నిధులను సమీకరించింది. వెంచర్ క్యాప్టలిస్ట్ ఆక్సెల్, వెంచరీస్ట్, క్వాల్కంలతో పాటుగా వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మెంబర్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ)లు పోర్టియాలో 37.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘ఈ నిధులను సంస్థ విస్తరణకు ఉపయోగిస్తాం. ప్రస్తుతం పోర్టియా దేశంలోని 24 నగరాల్లో నెలకు 60 వేలకు పైగా రోగులకు సేవలందిస్తుంది.ప్రస్తుతమున్న 3 వేల మంది ఉద్యోగులకు తోడుగా వచ్చే 18 నెలల్లో మరో 5 వేల మందిని నియమించుకుంటాం’అని ఎండీ అండ్ సీఈఓ మీనా గణేష్ ఒక ప్రకటనలో వివరించారు. నవంబర్ 5న టి-హబ్ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ స్టార్టప్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంకుబేషన్ కేంద్రం ‘టి-హబ్’ ప్రారంభోత్సవం నవంబరు 5న జరగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రూ.40 కోట్ల వ్యయంతో గచ్చిబౌలిలో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టి-హబ్‌ను నిర్మించారు. సీటింగ్ సామర్థ్యం 800. టి-హబ్‌లో స్థలం కోసం 400 స్టార్టప్స్ దరఖాస్తు చేసుకున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారమిక్కడ వెల్లడించారు. 40 ఎంపిక చేశామని, వచ్చే నెలకల్లా వీటి సంఖ్య 200లకు చేరొచ్చని చెప్పారు. త్వరలో ప్రకటించనున్న ఇన్నోవేషన్ పాలసీతో స్టార్టప్స్‌కు జోష్‌నిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అవసరమైన ఉత్పత్తులను స్టార్టప్స్ నుంచి కొనుగోలుతోపాటు ఈ కంపెనీలకు ఆర్థిక సహాయం, మెంటార్షిప్, తక్కువ ధరకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సామాజికంగా ప్రభావం చూపే స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. -
కాఫీ డే ఐపీఓకు సెబీ అనుమతి
ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: కేఫ్ కాఫీ డే చెయిన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరించాలని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ యోచిస్తోంది. ఈ ఐపీఓ నిధులతో రూ.632 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకుంటామని, కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తామని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ పేర్కొంటోంది. కాగా సెబీ ఇప్పటిదాకా ఐపీఓకు అనుమతిచ్చిన కంపెనీల సంఖ్య 25కు పెరిగింది. -
నేడు వరల్డ్ కాఫీ డే!
-
మీకూ ఉందా హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్..?!
జీవితంలో ఎన్నడూ చూడని రుచుల్లో కాఫీ టేస్ట్ కూడా ఒకటి అయినా, నచ్చిన అమ్మాయిని కాఫీ డేకి రమ్మని అడిగింతే ధైర్యం వస్తుంది! కాఫీ కొత్తదే, ప్రేమ కూడా కొత్త రుచే! ఇంత వరకూ చేతన్ రచించిన నవలల్లో వేటికీ రానంత క్రేజ్ ఈ నవలకు కనిపిస్తోంది. అసలు హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ ఏమిటనేదే ప్రశ్న! స్త్రీ, పురుష బంధాల్లో అంతగా వినిపించని ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’అనే పదానికి చేతన్ ఎలాంటి నిర్వచనం ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం గురించి చేతన్ యూట్యూబ్‌లో విడుదల చేసిన టీజర్ ద్వారా కొంత వివరణ ఇచ్చాడు. ‘ఒకానొకప్పుడు మాధవ్ అనే బీహారీ అబ్బాయి ఉండేవాడు. అతడు రియా అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే మాధవ్ ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడలేడు. అతడు రియాతో బంధాన్ని కోరుకొంటాడు. అయితే రియా అందుకు అంగీకరించదు. రియా అతడితో స్నేహితురాలిగా ఉంటానని అంటుంది.కానీ దానికి మాధవ్ ఒప్పుకోడు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఆమె ఒక ఒప్పందానికి వద్దామంటుంది. అతడికి ‘హాఫ్ గర్ల్‌ప్రెండ్’గా ఉండటానికి ఆమె సిద్ధపడుతుంది...’ అంటూ నవలకు సంబంధించి ఉపోద్ఘాతాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. ఇది పూర్తిగా ప్రేమ కథ అని అంటున్నారు రచయిత. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడికి, నగర జీవితంలోని యువతికి మధ్య నడిచే ప్రేమ కథ ఇది. మరి ఎటొచ్చీ హాఫ్గర్ల్ ఏమిటి?అంటే మాత్రం చేతన్ చెప్పడం లేదు. దాన్ని నవలను చదివి తెలుసుకోవాలని అంటున్నారు. తప్పు అతడిది కాదు... పెనిలిథామిన్ది! ఇష్టమైన అమ్మాయి దూరంగా కనిపిస్తూ ఉంటేఆమెకు దగ్గర కావాలనే కోరికను కలిగిస్తుంది ఈ రసాయనం.. అలాగే ఎగజిమ్మే ఎడ్రినలిన్ అయితే ఆమెవైపు చూడకూడదని బలవంతంగా నిర్ణయించుకొన్నా నియంత్రణ లేకుండా చేస్తుంది! ఇక ఆక్సిటోసిన్ అయితే ఆమె దగ్గరగా ఉన్నప్పుడు తాకాలనిపించే కోరికను జనింపజేస్తుంది... మాధవ్‌ది అచ్చం ఇలాంటి స్థితే. ఆమె పాలరాతి శిల్పంలా ఫ్రీజ్డ్గా ఉన్నా... అతడు పలుచన అవుతాడు. ఆమె పట్టించుకోకపోయినా ప్రేమ ప్రతిపాదన వరకూ వెళతాడు....అంటూ చేతన్ తన నవల సారాంశాన్ని ఇంటర్వ్యూలలో వివరిస్తున్నారు. ప్రేమ ఒక జరిగితీరాల్సిన ప్రక్రియ. శరీరంలోని రసాయనాలు పెట్టే గిలిగింతలతో ప్రేమలో పడటం జరుగుతుందంటారు శాస్త్రవేత్తలు. అలాంటి ప్రేమ ఎప్పుడూ ఒకేసారి రెండు గుండెల తలుపులనూ తట్టకపోవచ్చు. ఒకరు గుండెకు భద్రంగా కీ వేసుకొని కూర్చొండవచ్చు. రియా అలాంటి అమ్మాయేనేమో! మళ్లీ చేతన్ భగత్ దగ్గరకు వస్తే... యుక్తవయసులో ఉన్న వారి సమస్యల గురించి చర్చించడం, వాటినే కథలుగా తీర్చిదిద్దడం ఆయన ఐఐటీలో ఒంటబట్టించుకొన్న విద్య. విభిన్న సంప్రదాయాల నుంచి వచ్చిన అబ్బాయి, అమ్మాయిల ప్రేమ కథ ‘2స్టేట్స్’ ను అబ్బాయి కోణం నుంచి చెప్పుకొచ్చి, అనేకమంది ప్రేమకథలను తడిమిన చేతన్‌భగత్ ఇప్పుడు అనేక జీవితాల్లోని అస్పష్టమైన ప్రేమ రూపాన్ని తడుముతాను అంటున్నాడు. ఈ ప్రేమ కథ కొత్తది కాదు. అనేకమంది జీవితాల్లో ఉన్నదే... ఇప్పుడు హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ అంటే అర్థం కావడం లేదని చాలా మంది అంటున్నారు... కానీ, మనలో చాలా మందికి టీనేజ్లోనో, కాలేజీడేస్లోనో హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ కచ్చితంగా ఉండి తీరుతుందని చేతన్ అంటున్నారు. ఇక్కడే ఫెమినిస్టులకు కోపం వస్తోంది. హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ అనే పదం అమ్మాయి వ్యక్తిత్వాన్ని అవమానించేదని వారు అంటున్నారు. ఇక హాఫ్గర్ల్ఫ్రెండ్ను ఫుల్లెంగ్త్ఫ్రెండ్గా మార్చుకోవడం కూడా అబ్బాయిలకు తెలియని విద్య ఏమీ కాదు. జీవితంలో ఎన్నడూ చూడని రుచుల్లో కాఫీ టేస్ట్ కూడా ఒకటి అయినా, నచ్చిన అమ్మాయిని కాఫీ డేకి రమ్మని అడిగేంత ధైర్యం వస్తుంది! కాఫీ కొత్తదే, ప్రేమ కూడా కొత్త రుచే! అలా ఒక్కొక్కరిదీ ఒక్కోదారి. మరి చేతన్‌భగత్ హీరో ఎలాంటి దారిని ఎంచుకొన్నాడో, అతడి హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ చేతన్ అభిమానులను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో వేచి చూడాలి. -జీవన్‌రెడ్డి.బి