కాఫీ డే ఆఫర్.. 1.81 రెట్లు సబ్‌స్రిప్షన్ | Coffee Day offer 1.81 times the Sub sripsan .. | Sakshi
Sakshi News home page

కాఫీ డే ఆఫర్.. 1.81 రెట్లు సబ్‌స్రిప్షన్

Published Sat, Oct 17 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

కాఫీ డే ఆఫర్.. 1.81 రెట్లు సబ్‌స్రిప్షన్

కాఫీ డే ఆఫర్.. 1.81 రెట్లు సబ్‌స్రిప్షన్

 ముంబై: కేఫ్ కాఫీ డే (సీసీడీ) చెయిన్‌ను నిర్వహించే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 1.81రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. రూ.316-328  ప్రైస్‌బాండ్ ఉన్న ఈ ఐపీఓ మూడేళ్లలో అతి పెద్దది.ఈ కంపెనీ ఇప్పటికే రూ.334 కోట్లను యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా సమీకరించింది.

 పోర్టియాలోకి భారీ పెట్టుబడులు!
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా హోమ్ హెల్త్ కేర్ సేవలందిస్తున్న పోర్టియా సిరీస్ బీ విభాగం కింద భారీ నిధులను సమీకరించింది. వెంచర్ క్యాప్టలిస్ట్ ఆక్సెల్, వెంచరీస్ట్, క్వాల్‌కంలతో పాటుగా వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మెంబర్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ)లు పోర్టియాలో 37.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘ఈ నిధులను సంస్థ విస్తరణకు ఉపయోగిస్తాం. ప్రస్తుతం పోర్టియా దేశంలోని 24 నగరాల్లో నెలకు 60 వేలకు పైగా రోగులకు సేవలందిస్తుంది.ప్రస్తుతమున్న 3 వేల మంది ఉద్యోగులకు తోడుగా వచ్చే 18 నెలల్లో మరో 5 వేల మందిని నియమించుకుంటాం’అని  ఎండీ అండ్ సీఈఓ మీనా గణేష్  ఒక ప్రకటనలో వివరించారు.

 నవంబర్ 5న టి-హబ్ ప్రారంభం
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ స్టార్టప్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంకుబేషన్ కేంద్రం ‘టి-హబ్’ ప్రారంభోత్సవం నవంబరు 5న జరగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రూ.40 కోట్ల వ్యయంతో గచ్చిబౌలిలో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టి-హబ్‌ను నిర్మించారు. సీటింగ్ సామర్థ్యం 800. టి-హబ్‌లో స్థలం కోసం 400 స్టార్టప్స్ దరఖాస్తు చేసుకున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారమిక్కడ వెల్లడించారు. 40 ఎంపిక చేశామని, వచ్చే నెలకల్లా వీటి సంఖ్య 200లకు చేరొచ్చని చెప్పారు.

త్వరలో ప్రకటించనున్న ఇన్నోవేషన్ పాలసీతో స్టార్టప్స్‌కు జోష్‌నిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అవసరమైన ఉత్పత్తులను స్టార్టప్స్ నుంచి కొనుగోలుతోపాటు ఈ కంపెనీలకు ఆర్థిక సహాయం, మెంటార్‌షిప్, తక్కువ ధరకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సామాజికంగా ప్రభావం చూపే స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement