సిద్ధార్థ మృతిపై అశ్విన్‌ దిగ్భ్రాంతి | Ashwin Posts Heartfelt Message after Death Of CCD Owner Siddhartha | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ మృతిపై అశ్విన్‌ దిగ్భ్రాంతి

Published Thu, Aug 1 2019 1:19 PM | Last Updated on Fri, Aug 2 2019 12:23 AM

Ashwin Posts Heartfelt Message after Death Of CCD Owner Siddhartha - Sakshi

చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే(సీసీడీ) వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణంపై టీమిండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తాను స్నేహితులతో కలిసి కేఫ్‌ కాఫీడేలోనే తొలిసారి కాఫీ తాగానని అశ్విన్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. బుధవారం ఉదయం మంగళూరు శివారులోని నేత్రావతి నదీతీరంలో సిద్ధార్థ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే.

ఇది చాలా విషాదకరమైన వార్తని,  సిద్ధార్థ ఆత్మకు శాంతి చేకూరాలని అశ్విన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.  సోమవారం సాయంత్రం అదృశ్యమైన సిద్ధార్థ బుధవారం తెల్లవారుజామున నదీతీరంలో శవమై కనిపించారు. శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులు అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement