sidhartha
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విజయ్ మాల్యా కొడుకు పెళ్ళిలో లలిత్ మోదీ
మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చీఫ్, పరారీలో ఉన్న లలిత్ మోదీ.. ఇటీవల విజయ్ మాల్యాకు కొడుకు 'సిద్ధార్థ మాల్యా' వివాహంలో కనిపించారు. లండన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని విజయ్ మాల్యాకు చెందిన ఎస్టేట్‌లో మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈయన పెళ్ళిలో కాకుండా.. సన్నిహితులు & కుటుంబ సభ్యులు కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కనిపించారు.సిద్ధార్థ మాల్యా పెళ్ళికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం కొంతమంది సన్నితుల సమక్షంలో జరిగింది. ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.సిద్ధార్థ్ మాల్యా & జాస్మిన్లు భార్యాభర్తలుగా ఉన్న మొదటి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో సిద్ధార్థ్ ఆకుపచ్చ రంగు టక్సేడోలో ఉండగా, జాస్మిన్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో వీల్‌తో మరియు ఆమె చేతిలో బొకేతో కనిపించారు. ఈ ఫోటోకు 'మిస్టర్ అండ్ మిసెస్ ముప్పెట్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.Siddharth Mallya gets married in London.Indian middle class : “Yeh taufa humne tumko diya hai”pic.twitter.com/VYapa1ZoMe— Doctor (@DipshikhaGhosh) June 23, 2024 -
విజయ్ మాల్యా ఇంట పెళ్లి సందడి
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరూ ఫొటో షూట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా? లేదంటే కొద్ది మంది సమక్షంలోనే జరపనున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వీళ్లిద్దరూ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. కిందటి ఏడాది హలోవీన్ సందర్భంలో రింగ్ తొడిగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు సిద్ధార్థ్. అలా ఆ ప్రపోజల్‌తో ఈ జంట వార్తల్లోకి ఎక్కింది. జాస్మిన్ ఇన్‌స్టా బయోలో యూఎస్ అని ఉంది. ఆమె ప్రొఫైల్‌ను బట్టి మాజీ మోడల్‌గా తెలుస్తోంది. ఇంతకి మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె కుటుంబ నేపథ్యం తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధార్థ్ నటుడిగా, మోడల్‌గా పరిచయస్థుడే. విజయ్ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతులకు సిద్ధార్థ్ జన్మించాడు. కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో పుట్టి.. లండన్, యూఏఈలో పెరిగాడు సిద్ధార్థ్. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్ తరఫున ఆర్బీబీ డైరెక్టర్‌గానూ వ్యవహరించిన సిద్ధార్థ్.. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్‌ఫిషర్ మోడల్స్ జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్‌గా మారాడు. నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే.. ఆ తర్వాతే సిద్ధార్థ్ కెరీర్లో మార్పు కనిపించింది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ వైపు మళ్లిన సిద్ధార్థ్.. యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు. View this post on Instagram A post shared by Sid (@sidmallya)ఇక.. సిద్ధార్థ్ తండ్రి విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఆయన భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్‌ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది. అతడు ఫ్రాన్స్‌లో 35 మిలియన్ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్మో హోల్డింగ్ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరో వైపు ఫ్రాన్స్ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది. -
రామోజీరావు పట్ల కూడా చట్టం చట్టప్రకారమే వ్యవహరిస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్
-
ఈ వారం బిగ్ బాస్ బిగ్ షాకిస్తాడా?.. హౌస్‌లోకి ఇద్దరు స్టార్ హీరోలు!
ఉల్టా పుల్టా అంటు మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఐదో వారం ముగుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ కాగా.. ఈ రోజు మరొకరు హౌస్‌కు బైబై చెప్పనున్నారు. ఇప్పటికే ఏడుగురు సభ్యులు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేట్ అయినవారిలో శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్దీప్, గౌతమ్, టేస్జీ తేజ, ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు ఉన్నారు. (ఇది చదవండి: అభిమానుల దెబ్బకు మెంటలెక్కిపోయిన జగపతిబాబు!) అయితే ఈ వారంలో ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐదోవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే షాకింగ్ టాక్ వినిపిస్తోంది. గత నాలుగు వారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ కాగా.. ఈ సారి ఆ ఇద్దరు ఎవరా? అనే విషయంపై కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వారంలో పవరస్త్ర గెలుచుకున్న శోభా, సందీప్, ప్రశాంత్ తప్పితే అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్స్ చూస్తే శివాజీ టాప్‌లో ఉండగా.. ఓటింగ్‌లో శుక్రవారం వరకు చూసుకుంటే శివాజీ టాప్‌లో ఉన్నాడు. ఇకపోతే చివరి రోజు ఓటింగ్ రిజల్ట్స్‌ను బట్టి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలనుంది. ఇదిలా ఉండగా తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ రోజు హౌస్‌లో ఇద్దరు సినీ హీరోలు సందడి చేశారు. వారిలో ఒకరు మాస్ మహారాజా రవితేజ, మరొకరు కోలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ అతిథులుగా వచ్చారు. ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్స్‌తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండనున్నట్లు కనిపిస్తోంది. (ఇది చదవండి: యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!) ఈ ప్రోమోలో నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిని ఒక చీకటి గదిలో ఉంచి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్. ఈ ప్రక్రియను సైతం చాలా ఆసక్తికరంగా మార్చేశాడు. వారి వద్దకు ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి లైట్‌తో వచ్చి ఎలిమినేట్ అయ్యేవారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
‘మెంటల్’ అంటున్న సమంత, మంటపెట్టేశారన్న సిద్ధార్థ్!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా వస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.. పెన్ స్టూడియోస్.. లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ఆర్ఆర్ఆర్ నుంచి ఒక్కొ అప్డేట్ వదులుతున్నారు. ఇవాళ ఈ మూవీ నుంచి మాస్ అంథం పేరుతో చిత్ర బృందం సెకండ్ ఫుల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు! ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీలను సైతం ఆకట్టుకుంటోంది. చరణ్, తారక్‌లు మాస్ స్టెప్పులతో ఉర్రుతలుగించారు. వారి డ్యాన్స్‌కు ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. దీంతో ఈ పాటపై పలువురు టాలీవుడ్ స్టార్స్‌తో పాటు డైరెక్టర్లు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలుపుతున్నారు. అలాగే సమంత సైతం ఈ సాంగ్‌పై స్పందించారు. ఈ పాటలోని ఓ క్లిప్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. మెంటల్ అంటూ కామెంట్ చేశారు. అంతలా ఈ పాటకు తను ఫిదా అయినట్లు సామ్ చెప్పకనే చెప్పారు. ఇక సమంతతో పాటు పలువురు సినీ డైరెక్టర్లు సైతం ఈ పాటపై కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్ క్రేజ్.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలీట్ ఈ పాటకు థియేటర్లలో విస్పోటనం ఖాయం అంటూ దర్శకుడు మలినేని గోపీచంద్ కామెంట్ చేయగా.. ‘ఇది ఊరనాటు’ అంటూ అనిల్ రావిపూడి ప్రశంసించాడు. మరో యువ దర్శకుడు బాబీ ‘వాట్ ఏ ఊరనాటు సాంగ్ దిస్ ఈజ్!’ అని పోస్ట్ చేశాడు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ‘నాటు’కు పోయింది పాట! అంటూ కవితాత్మకంగా చెప్పుకొచ్చాడు. ఇక హీరో సిద్ధార్థ్ కూడా ఈ పాటపై తన స్పందనను తెలిపాడు. సిద్ధార్థ్ ట్వీట్ చేస్తూ.. ‘ఎగ్జైయిట్మెంట్ను ఆపుకోలేకపోతున్నా. ఇండియన్ సినిమాలో గొప్ప డ్యాన్సర్లైయిన రామ్‌చరణ్, తారక్‌లు కలిసి మంటపెట్టెస్తున్నారు. ఇక ఈ పాటకు థియేటర్లో ఇక అరుపలే.. ఇదే రాజమౌళి మ్యాజిక్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ రాసుకొచ్చాడు. Can't control my excitement.. India's finest dancers @tarak9999 and @AlwaysRamCharan setting the screen on fire. Theaters will roar! Just @ssrajamouli things. @mmkeeravaani garu rampage! Mind = Blown.https://t.co/vZAq0fl2Fu — Siddharth (@Actor_Siddharth) November 10, 2021 -
కలకలం రేపుతున్న సిద్దార్థ హత్య ఘటన
సాక్షి, నెల్లూరు : బెంగళూరులో హత్యకు గురైన సిద్ధార్థ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. రాపూరు-గుండవోలు అటవీ ప్రాంతంలో సిద్ధార్థ మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు సమాచారం. ఆస్తుల పంపకాలు ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. ఈ నెల 19న బెంగళూరులోని అమృతహళ్లి పోలీస్ స్టేషన్లో సిద్ధార్థ కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ.. కర్నాటక ఓ మాజీ సీఎం బంధువు కూడా అవడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సిద్ధార్థ ఫోన్ కూడా స్విచాఫ్ అయి ఉండటంతో కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయి. కొందరు వ్యక్తులు సిద్ధార్థను కిడ్నాప్ చేసి హత్య చేశారని నిర్ధారించారు. వారిపై కేసు నమోదు చేశారు. చదవండి: తల్లీ, కుమార్తెతో సహజీవనం.. ఆపై హత్య నిందితుల్లో ఒకరైన వినోద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే సిద్ధార్థను కిడ్నాప్ చేసిన తరువాత అతని మృతదేహాన్ని నెల్లూరు జిల్లా రాపూరు-పెంచలకోన సమీపంలోని గు౦డవల్లి అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టినట్లు నిందితుడు వినోద్ చెప్పి నట్లు సమాచారం. ఇవ్వాళ కోర్టు అనుమతితో నిందితు డు వినోద్ ను నెల్లూరు జిల్లా గుండవోలు అటవీ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి కే కొందరు కర్నాటక పోలీసులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఎక్కడో బెంగుళూరులో హత్య చేసిన వ్యక్తిని వందల కిలోమీటర్లు దాటి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి పూడ్చి పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈరోజు నిందితుడు వినోద్‌ను తీసుకొచ్చిన పోలీసులు మృతదేహాన్ని వైద్యుల సమక్షంలో బయటకు తీయబోతున్నారు. -
బోయిన్పల్లి కేసు: వెలుగులోకి కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సిద్దార్ధ కిడ్నాప్‌లో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. భార్గవ్‌రామ్‌కి మనుషులను సరఫరా చేసింది కూడా ఇతడే. సిద్దార్థ విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తున్నాడు. అఖిలప్రియ, భార్గవ్‌కు పర్సనల్ గార్డ్‌గా ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కోసం రావాలని భార్గవ్ సిద్దార్థకు చెప్పాడు. భార్గవ్ ఆదేశంతో అతడు 15 మందితో హైదరాబాద్‌కు వచ్చాడు. సిద్దార్థ అండ్ గ్యాంగ్ ముగ్గురిని కిడ్నాప్ చేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం సిద్దార్థతో పాటు అతడి గ్యాంగ్‌లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ( ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. ) కాగా, భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి తదితరులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్‌రామ్ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ తదితరుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
స్వయంగా రంగంలోకి మాళవిక..
ఇద్దరికీ మొక్కలు నాటడం ఇష్టం. పెళ్లయిన కొత్తలోనే... ఇద్దరూ కలిసి కాఫీ మొక్కను నాటారు. ‘కాఫీ డే’ అని పేరు పెట్టారు. ఆ మొక్క మహా వృక్షమయింది. ఆరు దేశాలకు వేర్లను చాపుకుంది. అకస్మాత్తుగా అతడు.. చెట్టుపై నుంచి ఎగిరిపోయాడు. ఆమె ఒక్కటే మిగిలింది. ఆ వృక్షాన్ని మళ్లీ ఇప్పుడు..మొక్కలా పెంచబోతోంది! భర్తకు వారసత్వంగా వచ్చిన కాఫీ తోటలు ఉన్నాయి. మంగళూరులో సెయింట్ అలోయ్సియస్ కాలేజ్ నుంచి ఇకనమిక్స్లో పొందిన మాస్టర్స్ డిగ్రీ ఉంది. ఆర్థికంగా అంత సంపద, ఆర్థశాస్త్రంలో అంత తెలివి ఉన్న భర్త ఓ రోజు ‘‘కాఫీ షాప్ పెడదాం.. కాఫీ ఇరవై ఐదు రూపాయలకు అమ్మితే లాభాలే లాభాలు..’’ అన్నప్పుడు మాళవిక వెంటనే ‘నాట్ ఎ బ్రైట్ ఐడియా’ అనేశారు! ఆమెకు కూడా కొంచెం చదువుంది. బెంగళూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేశారు. అయితే భర్త ఆలోచనను కాదన్నది ఆమె ఇంజినీరింగ్ కాదు. ఆమె కామన్ సెన్స్. (కాఫీ కింగ్ అదృశ్యం) 1990ల నాటి రోజులు అవి. కప్పు కాఫీ ఐదు రూపాయలకు దొరుకుతున్నప్పుడు ఎంత మంచి కాఫీ అయినా ఇరవై ఐదు రూపాయలకు ఎవరు కొంటారు అని ఆమె పాయింట్. భార్య అలా అనగానే తన ఆలోచనను కొద్దిగా మార్చారు సిద్ధార్థ. ‘‘పోనీ, ఇంటర్నెట్ సర్ఫింగ్ కమ్ కాఫీ?’’ అన్నారు. మాళవికకు ఆ ఐడియా నచ్చింది. అప్పటికి కొన్నాళ్ల ముందే 1991లో వాళ్ల పెళ్లయింది. 1996లో వాళ్ల ఉమ్మడి ఐడియా ‘కఫే కాఫీ డే’ (సిసిడి) గా కళ్లముందుకు వచ్చింది. మొదట కాఫీ డే బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్లో మొదలైంది. గత ఏడాది జూలై 29న సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునే నాటికి ఈ ఇరవై ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 243 పట్టణాలకు 1760 కాఫీ డేలు విస్తరించాయి. ఆస్ట్రియా, ఈజిప్ట్, చెక్ రిపబ్లిక్, మలేషియా, నేపాల్‌లలో కొన్ని బ్రాంచిలు ఉన్నాయి. అయితే సిద్ధార్థ మరణం తర్వాత ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో 280 ‘కాఫీ డే లు’ మూతపడ్డాయి! కొన్ని అప్పులు మిగిలి ఉన్నాయి. 2,693 కోట్ల రూపాయల అప్పన్నది మాళవిక తీర్చలేనిదేమీ కాదు. ఇన్వెస్టర్లు, ఇన్‌కం టాక్స్ అధికారులు, వడ్డీలు, ఆడిటర్లకు సైతం లెక్కతేలని కొన్ని ఆర్థిక వ్యవహారాల బకాయీలు అవన్నీ. శనివారం మాళవిక తమ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ‘‘అప్పులన్నీ తీర్చేస్తున్నాం. మునుపటిలా సంస్థను ముందుకు తీసుకెళదాం’’ అని సారాంశం. భర్త మరణం నుంచి తేరుకోడానికి సరిగ్గా ఏడాది పట్టింది మాళవికకు. ప్రస్తుతం ఆమె సిసిడి (కఫే కాఫీ డే)లో నాన్–ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యురాలు. ప్రస్తుతం అనే కాదు, బెంగళూరులోని వారి చిన్న ప్రారంభ దుకాణం ఒక పెద్ద కంపెనీగా అవతరించిన నాటి నుంచీ ఆమె.. జీతం తీసుకోని నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలే. తమ కాఫీ డే ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (సిడిఇఎల్) లో కొన్ని నిధులను ఇటు మళ్లించి కంపెనీని పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నారు మాళవిక. సిడిఇఎల్ అనుబంధ సంస్థే కఫె కాఫీ డే. (కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా) ఆరు దేశాలలో ఏడాదికి వందకోట్ల అరవై లక్షల కాఫీ కప్పులు అమ్మిన కాఫీ డే ఇప్పుడు రోజుకు సగటున పదిహేను వేల కప్పులు తక్కువగా అమ్ముతోంది. ఇది తాత్కాలికమైన క్షీణతేనని ఇప్పటికీ కాఫీ డే లపై కస్టమర్లకు ఉన్న ఆకర్షణే చెబుతోంది. ఇక మాళవికే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కనుక సమీప భవిష్యత్తులోనే ఆమె తన భర్తకు నివాళిగా సంస్థను మళ్లీ పూర్తిస్థాయి లాభాల్లోకి తీసుకెళ్లే అవకాశాలు నమ్మకంగా ఉన్నాయి. కస్టమర్లు ఎంతసేపైనా గడిపేందుకు అనువైన,ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండటంతో పాటు.. శాండ్విచ్, బర్గర్ల వంటి ఫాస్ట్ఫుడ్స్ లభించడం కూడా కాఫీ డే ప్రత్యేకతలు. బెంగళూరులో తొలి కాఫీ డే షాపు నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడి కిటికీల్లోంచి బయటికి చూస్తూ.. ఎవరెవరు తమ కాఫీ డేకు వస్తారో అంచనా వేయడం తమకొక ఆటగా ఉండేదని మాళవిక ఒక ఇంటర్వూ్యలో చెప్పారు. అంతగా ఈ దంపతులకు కాఫీ డేతో అనుబంధం ఉంది. ఆ బంధాన్ని చెక్కు చెదరన్వికుండా బిజినెస్‌లో తల్లికి సాయం చేసేందుకు ఇద్దరు కొడుకులు ఇషాన్, అమర్త్యలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆమె తండ్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అండగా ఉన్నారు. సిద్ధార్థ, మాళవికలకు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. మొక్కలు నాటడం ఇష్టమైన వ్యాపకం. ఇద్దరూ కలిసి మూడు వేల వరకు చెట్ల మొక్కల్ని నాటి ఉంటారు. దగ్గర లేని ఆ జీవిత సహచరుడిS కోసం కాఫీ డే అనే మహా వృక్షాన్ని మళ్లీ ఒక మొక్కలా సంరక్షించబోతున్నారు మాళవిక. కాఫీ డే కి చైర్పర్సన్ అవడం, కాకపోవడంతో నిమిత్తం లేకుండానే. (వ్యాపారవేత్తగా విఫలమయ్యా... ) మాళవిక (గత ఏడాది భర్త అంత్యక్రియల సమయంలో) -
బిగ్‌బాస్: ‘నువ్వు లేకుండా నేనుండలేను’
ఎన్నో పోట్లాటలు, త్యాగాలు, ప్రేమలు, కోపాలు అన్నింటి మిళితంంగా బిగ్‌బాస్ 13 హిందీ సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కెప్టెన్సీ టాస్కులో తనకు మద్దతు ఇవ్వట్లేదని సిద్ధార్థ్ శుక్లాపై షెహనాజ్ ఫైర్ అయింది. కోపంలో కాస్త నోరు జారి నోటికొచ్చినట్లుగా తిట్టింది. దీంతో అప్పటి నుంచి వారిమధ్య మాటలు కరువయ్యాయి. గొడవ జరిగి రెండు రోజులు కావస్తున్నా వాళ్లు కలవకపోవడంపై అభిమానులు కలవరపడ్డారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ప్రకారం వాళ్లిద్దరూ గిల్లికజ్జాలు మాని మళ్లీ కలిసిపోయారని తెలుస్తోంది. ఈ ప్రోమో ప్రకారం.. చిన్న గొడవ వారి మధ్య రిలేషన్‌షిప్‌ను చెడగొడుతుందని భావించిన షెహనాజ్ సిద్ధార్థను పలకరించింది. అలిగి పడుకుని ఉన్న సిద్ధార్థ్‌ను ఆమె తన ఒడిలోకి తీసుకుని బుజ్జగించింది. ‘ఇక చాలు..’ అంటూ సిద్ధార్థ్ ఆమెతో విసురుగా మాట్లాడినప్పటికీ ఆమె దాన్ని పట్టించుకోలేదు. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను’ అంటూ షెహనాజ్ గద్గద స్వరంతో మాట్లాడింది. ఈ వీడియోను చూసిన అభిమానులు ‘వాళ్లిద్దరు కలిసిపోయారోచ్..’ అంటూ పండగ చేసుకుంటున్నారు. ‘షెహనాజ్ ప్రవర్తన వల్లే సిద్ధార్థ్ ఎంతగానో బాధపడ్డాడు. అతనికి ఇంట్లో ఎంతోమంది స్నేహితులున్నారు. కానీ అతని బాధను అర్థం చేసుకోగలిగేవారు ఎవరూ లేరు. అతన్ని అలా దిగులుగా చూడలేకపోతున్నాం అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘మనుషులన్నాక తప్పు చేయడం సహజం. కానీ షెహనాజ్ తాను చేసింది పొరపాటని గ్రహించి దాన్ని సరిదిద్దుకోడానికి ప్రయత్నించింది’ అని మరికొందరు కామెంట్ చేశారు. ఎట్టకేలకు నేటి ఎపిసోడ్లో ఈ జంట కలిసిపోనుంది. -
సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం
సాక్షి, బెంగళూరు : కన్నడ ప్రముఖ వ్యాపార వేత్త, కెఫె కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు సంబంధించిన శవ పరీక్షల నివేదిక రావడానికి మరింత ఆలస్యమవుతుందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక రావడానికి రెండు నెలలకు పైగా సమయం పడుతుందని, ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత అది హత్య లేక ఆత్మహత్య తేలుతుందన్నారు. అయితే సిద్ధార్థ నీటిలో పడి ఊపిరి ఆడక మృతి చెందాడని ప్రాథమిక నివేదిక వచ్చిందని తెలిపారు. కాగా గత సోమవారం నేత్రావతి నది వద్ద అదృశ్యమైన వీజీ సిద్ధార్థ్ మృతదేహం బుధవారం ఉదయం సమీపంలోని నదీ జలాల్లో లభ్యమైన విషయం తెలిసిందే. మరోవైపు సిద్ధార్థ అనుమానస్పద మృతిపై మంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ వేధింపులే కారణం ‘కెఫె కాఫీ డే యజమాని సిద్ధార్థ ఆత్మహత్యకు ముఖ్య కారణం ఐటీ అధికారుల వేధింపులే. ఐటీ శాఖ రిటైర్డు ఉన్నతాధికారి బాలకృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ డిమాండ్ చేశారు. సిద్ధార్థ తన ఇబ్బందులపై లేఖలో రాశారని, ఇబ్బందులకు కారణమైన ఐటీ శాఖ అధికారులను తక్షణమే అరెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షించాలని ఆయన అన్నారు. -
సిద్ధార్థ ఆత్మహత్యకు కారణాలు ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : బరిస్టా బ్రాండ్‌తోపాటు దేశంలో భిన్న రుచుల కాఫీలను తాగే సంస్కతిని ప్రోత్సహిస్తూ రెండు దశాబ్దాల పాటు ఫ్రాంచైజ్‌లను విస్తరిస్తూ పోయిన ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ? వ్యాపారంలో పరాజయం కారణంగా తలెత్తిన ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగానే ఆయన ఆర్థిక పరిస్థితి అంతకు దిగజారిందా? దేశంలోనే అతిపెద్ద కాఫీ బ్రాండ్‌గా విస్తరించినప్పటికీ ‘కేఫ్ కాఫీ డే’ ఎందుకు లాభాలను గడించలేకపోయింది? దేశంలో 200 స్టోర్లను కలిగిన బరిస్టా కంటే కాస్త మెరుగ్గా, కాస్త చౌకగా కాఫీలను అందించడం ద్వారా కేఫ్ కాఫీ డే దేశంలో వేగంగా విస్తరించగలిగింది. కోస్టా కాఫీ, కాఫీ బీన్, టీ లీఫ్ లాంటి కొత్త బ్రాండులు మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ కాఫీ డేకు అవి పోటీకాలేక పోయాయి. కాఫీ డేకు 2015లో 155 కోట్ల రూపాయలు, ఆ మరుసటి ఏడాది, 2016లో 80 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 2017లో మూడేవేల కోట్ల రూపాయల అమ్మకాల ద్వారా కేవలం 8 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. 2018లో 49 కోట్లు, 2019లో 60 కోట్ల లాభాలను ఆర్జించింది. కాకపోతే కాఫీ డే అనుబంధ సంస్థ ‘గ్లోబల్ ఎడ్జ్ సాఫ్ట్వేర్’ అమ్మకాల ద్వారానే 98 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రస్తుతం కాఫీ డే ఏటా సరాసరి 4,200 కోట్ల రూపాయల అమ్మకాలు నిర్వహిస్తున్న పెద్దగా లాభాలు ఎందుకు రాలేదు ? ఈ రంగంలో ఇతర సంస్థలకు కూడా లాభాలేమీ లేవు. బరిస్టా దేశవ్యాప్తంగా ఉన్న తన కాఫీ చైన్లను తగ్గించుకుంటూ వస్తోంది. కోస్టా కాఫీ అయితే ఒక్క విమానాశ్రయాల్లో మినహా అంతటా కనుమరుగైంది. ‘స్టార్‌బక్స్’ ఓ మోస్తారుగా నడుస్తోంది. దేశవ్యాప్తంగా వెయ్యి స్టోర్ల ఫ్రాంచైజ్ కలిగిన ‘కేఫ్ కాఫీ డే’నే మార్కెట్లో నిలబడగలుగుతుందని నిపుణులు భావించారు. వినూత్నమైన కాఫీ సంస్కతికి ప్రసిద్ధి చెంది యునెస్కో జాబితాలో చోటు చేసుకున్న ఒక్క ‘వియన్నా’ నగరంలో స్టోర్‌ను ఏర్పాటు చేయడం మినహా వీజీ సిద్ధార్థ వ్యాపార పరంగా ఏ పొరపాటు చేయలేదు. క్యాపిటల్ మార్కెట్లో రాణించడం ద్వారా వ్యాపారస్థుడైన సిద్ధార్థ ఇన్ఫోసిస్‌లాంటి అనేక సాంకేతిక టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బడా వ్యాపారిగా ఎదిగారు. ఇప్పటికీ అలాంటి సంస్థలే తన కాఫీ డేను బతికిస్తున్నప్పటికీ ఎందుకు ఆయన బతకాలని అనుకోలేదు ? సహజంగా పెద్ద రైతు బిడ్డ సిద్ధార్థ. తన పొలాల్లోనే తన కాఫీ బ్రాండ్‌ను పండిస్తున్నారు. అందుకనే ఈ బ్రాండ్‌పైనే ఆయన కు ప్రత్యేక మమకారం ఏర్పడి ఉంటుంది. పలు ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. 20 ఏళ్లు అయినప్పటికీ ఈ రంగంలో నిలదొక్కుకోలేక పోతున్నాననే బాధ ఆయన్ని కుంగదీసి ఉంటుంది. కాఫీ తాగే సంస్కతి భారత్‌లో బలంగా ఉన్నప్పటికీ ‘కాఫీ డే సంస్కతి’ ఇంకా అంతగా ఎదగలేదు. పాశ్చాత్యుల్లాగా ఖరీదైన భవనాల్లోని అందమైన లాంజీల్లో గంటల తరబడి కూర్చొని కాఫీలు తాగుతూ డాలర్లలో డబ్బులు చెల్లించడం భారతీయులకు సాధ్యమయ్యే పనికాదు. విదేశాల్లో ఇలాంటి కాఫీ కేఫుల్లోనే గంటల తరబడి కూర్చునే ఆఫీసు పనులు కూడా చేసుకుంటారు. ఇంకా ఆ సంస్కతి సంపూర్ణంగా మనకు రాకపోవడం ఈ రంగంలో వైఫల్యాలకు మరో కారణం. ఇప్పటికీ కార్మికులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న భారత్‌లో అందుబాటులో ఉండే చిన్న చిన్న కేఫ్‌లకే ఆదరణ ఎక్కువ. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోక పోవడం కూడా పొరపాటే. -
సిద్ధార్థ మృతిపై అశ్విన్ దిగ్భ్రాంతి
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే(సీసీడీ) వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణంపై టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తాను స్నేహితులతో కలిసి కేఫ్ కాఫీడేలోనే తొలిసారి కాఫీ తాగానని అశ్విన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. బుధవారం ఉదయం మంగళూరు శివారులోని నేత్రావతి నదీతీరంలో సిద్ధార్థ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఇది చాలా విషాదకరమైన వార్తని, సిద్ధార్థ ఆత్మకు శాంతి చేకూరాలని అశ్విన్ ట్విటర్లో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అదృశ్యమైన సిద్ధార్థ బుధవారం తెల్లవారుజామున నదీతీరంలో శవమై కనిపించారు. శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులు అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. My first memories of going out with friends and having a cup of coffee happened only with the inception of cafe coffee day. Sad news #RIPSiddhartha #cafecofeeday — Ashwin Ravichandran (@ashwinravi99) July 31, 2019 -
కార్పొరేట్ భారతంలో భారీ కుదుపు
బెంగళూర్ : కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ విషాదాంతం కార్పొరేట్ భారతం ఎదుర్కొంటున్న సంక్షోభం, లిక్విడిటీ క్షీణతలను ప్రతిబింబిస్తోంది. సిద్ధార్ధ బలవన్మరణానికి పాల్పడే ముందు కంపెనీ బోర్డు సభ్యులు, ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు భారత పారిశ్రామికవర్గాల్లో భారీ కుదుపునే రేపాయి. రుణదాతలు, ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి ఎదురైన ఒత్తిళ్లు అప్పుల ఊబిలో మూసుకుపోయిన దారులు సిద్ధార్థను ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు కార్పొరేట్ భారతానికి పెను ప్రమాద సంకేతాలు పంపాయి. రెండున్నర దశాబ్ధాల సుదీర్ఘ వ్యాపార పయనంలో కేఫ్ కాఫీ డే(సీసీడే)ను ఆయన శాఖోపశాఖలుగా విస్తరించిన తీరు, కాఫీ తోటల నుంచి కస్టమర్‌కు పొగలు కక్కే కాఫీని కాఫీ టేబుల్‌పైకి అందించే వరకూ అన్ని దశల్లో ఆయన ఒడుపు అనితరసాధ్యమే. తేనీరును ఆస్వాదించే భారత్‌లో ఏకంగా 1700 స్టోర్లు, 54,000 వెండింగ్ మెషీన్లతో ఒంటి చేత్తో కాఫీని దశదిశలా చేర్చిన సిద్ధార్థ రుణభారంతో తనువు చాలించడం విషాదకరం. అప్పులు గుదిబండగా మారడంతో పాటు కంపెనీలో తనఖాలో ఉన్న తన షేర్లను రుణదాతలు తమకు మళ్లించాలని కోరడం, మరోవైపు హామీలున్నా అత్యధికంగా 14 శాతం వడ్డీతో కొత్త రుణాలను సమీకరించాల్సి రావడం రుణభారాన్ని ఇబ్బడిముబ్బడి చేసింది. ఇదే సమయంలో ఓ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ షేర్లను బైబ్యాక్ చేయాలని ఒత్తిడి చేయడం, మైండ్‌ట్రీ విక్రయం ద్వారా సమకూరిన నిధులపై తమకు రావాల్సిన మొత్తం కోసం ఆదాయ పన్ను అధికారుల నుంచి ఒత్తిళ్లతో సిద్ధార్థ తీవ్ర నిర్ణయం దిశగా కదిలారు. తన ముందున్న సంక్లిష్ట పరిస్ధితుల్లో తనువు చాలించడం మినహా మరోమార్గం లేదనే రీతిలో తను రాసిన లేఖలో సిద్ధార్ధ స్వయంగా వెల్లడించారు. ‘వీజీ సిద్ధార్ధ ఒక్కరే కాదు దేశంలో ఇలాంటి వారు మరో 100 మంది ఇతర పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. కంపెనీల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవడం, రీఫైనాన్సింగ్ లభించకపోవడంతో వారు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నార’ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్‌కు చెందిన చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పడం కార్పొరేట్ భారతంలో సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. -
‘క్యాప్చినో’ పరిచయం చేసింది సిద్దార్థే..
కాఫీలో దిగ్గజం కేఫ్ కాఫీ డే. కేఫ్ కాఫీడేలో ఒక్క కాఫీ తాగితే చాలు ఆ కిక్కే వేరు. తెలుగు రాష్ట్రాల్లో 100కిపైగా అవుట్‌లెట్స్‌ని కలిగిఉన్న కేఫ్ కాఫీడేకు నగరంలో 70 వరకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. అత్యంత రద్దీ ప్రదేశాల్లో, షాపింగ్ మాల్స్, ఐటీ కారిడర్‌కు సమీపంలో టెక్కీలను దృష్టిలో పెట్టుకుని అవుట్‌లెట్స్‌ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకు సుమారు రూ. 4.5 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఒక్క హైదరాబాద్‌లోనే దీని టర్నోవర్ రూ.3.15 కోట్లకుపైగా ఉండటం గమనార్హం. భారతదేశంలో ‘క్యాప్చినో’ (కాఫీ)ని పరిచయం చేసిన కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో కాఫీ లవర్స్ ఒకింత ఆవేదనకు గురయ్యారు. హైదరాబాద్ సిటీలో కేఫ్ కాఫీడేకు 70 అవుట్‌లెట్స్ ఉండగా, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో సుమారు 30కిపైగా అవుట్‌లెట్స్ ఉన్నాయి. 37 ఏళ్ల క్రితం ‘కేఫ్ కాఫీడే’ పేరుతో వీజీ సిద్ధార్థ దేశానికి ‘క్యాప్చినో’ (కాఫీ)ని పరిచయం చేశారు. దీని ధర రూ.135. కాఫీతో పాటు ప్రతి రోజూ కాఫీ, పిజ్జా, బర్గర్, స్నాక్స్, కూల్కాఫీ, మిల్క్‌షేక్స్ వంటి వాటితో రోజుకు ఒక్కో షాప్‌పై సుమారు రూ.15వేల ఆదాయం వస్తోంది. ఇలా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న 70 అవుట్‌లెట్స్ నుంచి నిత్యం సుమారు రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు రెండు రాష్ట్రాల నుంచి సుమారు రూ.4.5కోట్లు వస్తుండగా.. ఒక్క హైదరాబాద్ సిటీ నుంచే సుమారు రూ.3.15 కోట్లకుపైగా ఆదాయం రావడం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 400 మందికి ఉపాధి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్స్‌లో సుమారు 400 మందికిపైగా ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో బ్రాంచ్‌లో నలుగురు లేదా ఐదుగురు చొప్పున విధులు నిర్వర్తిసున్నారు. వీరికి కనీస వేతనం రూ.8వేలు నుంచి రూ.60, 70వేలు సంపాదించే వాళ్లూ ఉన్నారు. నెలసరి జీతం, ఇతర అలవెన్స్ వంటివి ఏవీ కూడా ఇంత వరకు నిలిపివేసిన ఘటనలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి నెలా మొదటి రోజునే తమకు వేతనాలు ఆన్లైన్ ద్వారా వచ్చేస్తాయని వివరించారు. తమ యజమాని సిద్ధార్థకు కోట్లాది రూపాయలు అప్పు ఉందనే విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యామంటున్నారు. నాగార్జున సర్కిల్లో మొదటిసారిగా.. బంజారాహిల్స్: అది 2004 ఆగస్ట్ 16. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–1/3 చౌరస్తాలోని నాగార్జున సర్కిల్లో కొత్తగా తెరుచుకుంది కేఫ్ కాఫీ డే. అప్పటికి నగరవాసులకు కాఫీ రుచులు ఇన్ని ఉన్నాయన్న విషయం తెలియదు. కాఫీ కెఫె పేరుతో ఓ హోటల్ తెరచుకోవడమే అప్పట్లో సంచలనం. ఇక్కడ కాఫీ అంటే వేడివేడిగా గ్లాసులో పొగలు కక్కడమే తెలుసు. దీని యజమాని సిద్ధార్ధ మాత్రం మొదటిసారిగా కోల్డ్ కాఫీని రుచి చూపించారు. యువత కోల్డ్ కాఫీకి ఫిదా అయిపోయారనే చెప్పాలి. మొట్టమొదటి కేఫ్ కాఫీ డే నగరంలో నాగార్జున సర్కిల్లోనే తెరుచుకుంది. ఆ తర్వాత ఏడాదికి ఒకటి, రెండు చొప్పున పాష్ లొకాలిటీలలో వీటిని విస్తరించారు. కాఫీకి కొత్త రుచులను పరిచయం చేసిన కేఫ్కాఫీ డేలోకి వెళ్లి వివిధ రకాల కాఫీ రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు అలవాటు పడ్డారు. దీంతో ఈ 15 సంవత్సరాల్లో మొత్తం 21 ఫ్రాంచైజీలు నగరవ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. నాగార్జున సర్కిల్లో ప్రారంభమైన మొదటి కాఫీ డే ఆ తర్వాత రెండోది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్– 36లో ఏర్పాటైంది. ప్రస్తుతం నెక్లెస్ రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్–14, రాజ్‌భవన్ రోడ్డు, కుందన్‌బాగ్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–36, 47, ఉస్మానియా యూనివర్సిటీ, లక్డీకాపూల్, ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్, వారాసిగూడ, బేగంపేట, సింధీకాలనీ, శ్రీనగర్‌కాలనీ, సోమాజిగూడ, ప్రసాద్ ఐమాక్స్, జీవీకే వన్ మాల్, హైదరాబాద్ సెంట్రల్, అపోలో ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో విస్తరించుకుంది. దాదాపు అన్ని కాఫీ షాపులు నగరవాసుల ఆదరణను చూరగొన్నాయి. ఒకేసారి 76 మంది కూర్చునేలా.. ప్రస్తుతం 21 ఫ్రాంచైజీల్లో కొనసాగుతున్న కాఫీ రుచులకు నగరవాసులు బాగానే అలవాటు పడ్డారని చెప్పొచ్చు. యువతీయువకుల కలయికకు ఈ కేఫ్ కాఫీ డేలు వేదికలుగా మారాయి. ఒక్కో కాఫీ షాపులో 42 రకాల రుచులతో కాఫీలను విక్రయిస్తున్నారు. ఎక్కువగా సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేశారు. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేఫ్ కాఫీ డే యజమాని సిద్ధార్థ హైదరాబాద్‌లో మొదటి ఫ్రాంచైజీని ఏర్పాటు చేసినప్పుడు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. గత ఏప్రిల్ 6న జూబ్లీహిల్స్‌లో కాఫీ డే స్క్వేర్ పేరుతో గ్లోబల్ రుచులను అందించేందుకు సరికొత్త రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఒకేసారి 76 మంది అతిథులు కూర్చొనేందుకు వీలుగా దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఎంతోమంది అభిమానాన్ని చూరగొని.. దేశానికి క్యాప్చినోని పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ. కస్టమర్లను గంటలతరబడి కేఫ్ కాఫీ డేలో కూర్చోబెట్టేలా చేశారు ఆయన. టైంపాస్ కోసమైనా,సరదాగా ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌కైనా కేఫ్ కాఫీ డే కేరాఫ్ అనే చెప్పాలి. మొదట్లో సంపన్న వర్గాల వారికే పరిమితమైన కాఫీ డే క్రమేణా ఐదేళల్లో మధ్యతరగతి ప్రజానీకానికి కూడా చేరువయ్యింది. 42కిపైగా రుచులను కాఫీడే అందించడం విశేషం. వేడి వేడి క్యాప్చినోని సిప్ వేస్తే మైండ్ రిఫ్రెష్ అవుతుందనేది కాఫీలవర్స్ అభిప్రాయం. తమకు ఇంతటి చక్కటి కాఫీని అందించిన సిద్ధార్థ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నామని నగరానికి చెందిన కాఫీ లవర్ మహిమ పేర్కొన్నారు. గచ్చిబౌలిలో యథావిధిగా.. గచ్చిబౌలి: కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. కాగా బుధవారం గచ్చిబౌలిలోని కేఫ్ కాఫీ డే అవుట్లెట్ యథావిధిగా కొనసాగింది. తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో కేఫ్ కాఫీ డేను యథావిధిగా తెరిచినట్లు ఇక్కడి ఉద్యోగులు తెలిపారు. కేఫ్‌కు రోజు మాదిరిగానే వినియోగదారులు వచ్చి వెళ్లారు. కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ మృతిపై మాట్లాడేందుకు సిబ్బంది నిరాకరించారు. సిద్ధార్థ మృతి బాధాకరం.. వివిధ పనులతో అలసిపోయిన నేను, నా స్నేహితులు ప్రతిరోజూ బంజారాహిల్స్ సిటీ సెంటర్ సమీపంలోని కేఫ్ కాఫీ డేకి వస్తాం. మా డెయిలీ బాతాఖానీ ఇక్కడే. క్యాప్చినోని ఆరగిస్తూ.. నచ్చిన చిప్స్, బిస్కెట్స్ తింటూ ఎంజాయ్ చేస్తాం. క్యాప్చినోను దేశానికి పరిచయం చేసిన వీజీ సిద్ధార్థ మృతి ఎంతో బాధాకరం. – భరత్, కాఫీ లవర్ డెయిలీకస్టమర్లం.. కాఫీ డే అప్పుల్లో ఉన్న విషయం అసలు తెలీనే తెలీదు. కాఫీడేలోకి అడుగుపెట్టగానే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. 2009 నుంచి కాఫీడేకి నేనూ, నా స్నేహితులం డెయిలీ కస్టమర్లం. వీజీ సిద్ధార్థ చనిపోయాడని మేనేజ్మెంట్ను చేంజ్ చేస్తే కాఫీ డే కుప్పకూలిపోవచ్చు.– కృష్ణయాదవ్, కాఫీ లవర్ -
కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు
ఏ కాఫీ తోటలతో ఆయన వ్యాపారఅధినేతగా ఎదిగారో చివరకు అవే కాఫీ తోటల్లో చితిమంటల్లో పంచభూతాల్లో కలిసిపోయారు. కోట్లాది మందికి కాఫీ రుచుల్ని చేరువ చేసిన కాఫీ డే స్థాపకుడు వీజీ సిద్ధార్థ్ చివరి ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. కుటుంబం,వేలాది మంది ఉద్యోగులు, మిత్రులనుంచి బాధాకరమైన రీతిలో వీడ్కోలు తీసుకున్నారు. సాక్షి, బెంగళూరు: ప్రముఖ కార్పొరే ట్ దిగ్గజం, కెఫే కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ్ విజయగాథ మధ్యలో విషాదంతో ముగిసింది. నేత్రావతి నది వద్ద అదృశ్యమైన ఆయన అక్క డే విగతజీవిగా కనిపించారు. సోమ వారం రాత్రి మంగళూరు సమీపంలో ఉళ్లాల వద్ద నేత్రావతి నది వంతెనపై కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం బుధవారం ఉదయం సమీపంలోని నదీ జలాల్లో లభ్యమైంది. పోస్ట్‌మార్టం తదితరాలను మంగళూరులో నిర్వహించి చిక్కమగళూరులో స్వస్థలంలో దహన సంస్కారాలు జరిపారు. వేలాదిగా తరలివచ్చిన రాజకీయ సినీ ప్రముఖులు, కెఫే కాఫీడే సిబ్బంది, చిక్కమగళూరు వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. సీఎం యడియూరప్పతో పాటు మాజీ సీఎం కుమారస్వామి, మంత్రులు, పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబం కన్నీటి సంద్రం మృతదేహం కనిపించిందనే విష యం తెలిసిన తర్వాత బెంగళూరు సదాశివనగర్‌లోని ఆయన మామ, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ నివాసంలో కుటుంబ సభ్యుల్లో కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో విషాద వాతా వరణం తాండవించింది. హెఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కుటుంబ సభ్యులు చిక్కమగళూరుకు చేరుకున్నారు. అక్కడ సిద్ధార్థ్ పార్థివ దేహాన్ని చూసిన ఎస్ఎం కృష్ణ కుటుంబ సభ్యులు విలపించారు. ఎస్ఎం కృష్ణ సతీమణి ప్రేమ, సిద్ధార్థ్ సతీమణి మాళవిక, తల్లి వాసంతి, పిల్లలు అమర్థ్య, ఇషాన్‌లను ఓదార్చడం అక్కడ ఎవరివల్ల కాలేదు. ఎస్టేట్‌లో అంత్యక్రియలు భౌతికకాయాన్ని బెంగళూరుకు తరలించాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యుల సూచన మేరకు సొంతూరు చిక్కమగళూరు జిల్లా చేతనహళ్లికి తీసుకెళ్లారు. చిక్కమగళూరు నగరంలోని ఏబీసీ కాఫీ ఫ్యాక్టరీలో చివరిసారిగా వేలాదిమంది సిద్ధార్థ్ భౌతికకాయాన్ని సందర్శించారు. చేతనహళ్లి ఎస్టేట్‌కు తరలించి సాయంత్రం 6.55 నిమిషాలకు చితికి నిప్పంటించారు. సిద్ధార్థ్ అనుమానస్పద మరణంపై మంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వ్యాపారవేత్తగా విఫలమయ్యా...
ఆర్థిక ఒత్తిళ్లతో అదృశ్యమైన వీజీ సిద్ధార్థ కాఫీ డే ఉద్యోగులు, బోర్డు సభ్యులకు రాసినట్లు పేర్కొంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిద్ధార్థ కనిపించకుండాపోవడానికి రెండు రోజుల ముందు(ఈ నెల 27న) తేదీతో ఈ లేఖ ఉండటం గమనార్హం. ఆయన లేఖలో ఏం చెప్పారంటే... ‘గడిచిన 37 ఏళ్లుగా ఎంతో నిబద్ధతతో కష్టపడిపనిచేస్తూ నేను స్థాపించిన కంపెనీలు, అనుబంధ సంస్థల్లో 30 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించా. అదేవిధంగా నేను అతిపెద్ద వాటాదారుగా ఉన్న మరో టెక్నాలజీ కంపెనీలో కూడా 20 వేల కొలువులను తీసుకొచ్చా. అయితే, నా కష్టమంతా ధారపోసినప్పటికీ.. ఆయా సంస్థలను లాభదాయకమైన వ్యాపార దిగ్గజాలుగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యా. నామీద నమ్మకంతో చేదోడుగా నిలిచినవారందరినీ క్షమించమని కోరుతున్నా. ఎందుకంటే నేను ఎంతగా ప్రయత్నించినా నామీద ఉన్న ఒత్తిళ్లతో నిస్సహాయుడిగా ఉండిపోయా. ప్రైవేటు ఈక్విటీ(పీఈ) భాగస్వామ్య సంస్థల్లో ఒకదాని నుంచి షేర్ల బైబ్యాక్ కోసం విపరీతమైన ఒత్తిడి రావడంతో స్నేహితుల నుంచి భారీ మొత్తంలో అప్పులుతెచ్చిమరీ కొంత మేరకు ఈ లావాదేవీలను ఆరు నెలల క్రితం పూర్తిచేశాను. మరోపక్క, రుణ దాతల నుంచి కూడా ఒత్తిడి పెరిగిపోవడంతో పరిస్థితి దిగజారింది. అంతేకాదు.. మైండ్‌ట్రీలో షేర్ల అమ్మకం డీల్‌కు సంబంధించి గతంతో ఆదాయపు పన్ను(ఐటీ) డీజీ నుంచి కూడా వేధింపులను ఎదుర్కొన్నా. ఒప్పందాన్ని అడ్డుకోవడం కోసం రెండుసార్లు నా వాటా షేర్లను అటాచ్ చేయడంతో పాటు కాఫీ డే షేర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్నులను వాళ్లు చెప్పినట్లు సవరించి వేసినా నన్ను వేధించారు. ఈ అన్యాయమైన చర్యలతో కంపెనీలో తీవ్రమైన నగదు కొరతకు దారితీసింది. నా ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఈ సమయంలో మీరంతా కొత్త యాజమాన్యం నేతృత్వంలో మన వ్యాపారాన్ని కొనసాగించేందుకు శక్తివంచనలేకుండా కృషిచేయాలని కోరుతున్నాను. జరిగిన తప్పులన్నింటికీ నాదే పూర్తి బాధ్యత. అంతేకాదు సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నింటికీ కూడా నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఆడిటర్లు, సీనియర్ మేనేజ్మెంట్ ఇతరత్రా ఉద్యోగులెవరికీ వీటి గురించి తెలియదు. చివరికి నా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలను చెప్పలేదు. మోసం చేయడం, తప్పుదోవపట్టించాలన్నది నా ఉద్దేశం కానేకాదు. చట్టపరంగా ఈ మొత్తం పరిణామాలన్నింటికీ నాదే బాధ్యత. ఒక వ్యాపారవేత్తగా నేను విఫలమయ్యాను. ఎదో ఒకరో జు నా నిజాయితీని మీరంతా గుర్తించి, నన్ను క్షమిస్తారని భావిస్తున్నా. నాకున్న ఆస్తుల విలువతో పాటు వాటి జాబితాను కూడా మీకు తెలియజేస్తున్నా. అప్పులన్నీ తీర్చేయడానికి నా ఆస్తులు సరిపోతాయి’ – వీజీ సిద్ధార్థ -
కాఫీ కింగ్ అదృశ్యం
సాక్షి, బెంగళూరు : దేశ కార్పొరేట్ ప్రపంచమంతా మంగళ వారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాఫీ కింగ్‌గా పేరొందిన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే(సీసీడీ) వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, వ్యాపారవేత్తగా తాను విఫలమయ్యానని పేర్కొంటూ సిద్ధార్థ సంతకంతో ఒక లేఖ బయటపడింది. అందులో ఆదాయపు పన్ను అధికారులు, పీఈ భాగస్వామ్య సంస్థ నుంచి తీవ్రమైన వేధింపులు ఉన్నాయంటూ ఆయన పేర్కొనడం పారిశ్రామిక వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. సిద్ధార్థ అదృశ్య వార్తలతో కాఫీ డే షేరు ధర 20 శాతం కుప్పకూలింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సిద్ధార్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తు పడిపోయారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇలా అదృశ్యమయ్యారు ‘సోమవారం సాయంత్రం సకలేశపురకు అని చెప్పి డ్రైవర్ బసవరాజు దేశాయితో కలసి వీజీ సిద్ధార్థ బయలుదేరారు. కానీ సకలేశపురకు చేరుకోగానే, అక్కడి నుంచి మంగళూరుకు వెళ్లు అని డ్రైవర్‌కు సూచించారు. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ వద్దనున్న నేత్రావతి నది వద్దకు చేరుకోగానే కారు నిలపమని డ్రైవర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత కారును వంతెనకు అటువైపు చివరకుతీసుకెళ్లి నిలిపి ఉండు, నేను నడుచుకుంటూ కారు దగ్గరికి వస్తాను అని చెప్పి దిగేశారు. అయితే వంతెనపై నడుచుకుంటూ ఎంతసేపటికీ రాకపోవడంతో డ్రైవర్ వెనక్కి వచ్చి చూడగా చుట్టుపక్కల ఎక్కడా సిద్ధార్థ కనిపించలేదు. ఫోన్ చేస్తేనేమో స్విచ్చాఫ్ అయింది. దీంతో డ్రైవర్ పోలీసులకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు’ అని దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ సెంథిల్ శశికాంత్ సెంథిల్ పేర్కొన్నారు. అదృశ్య వార్తను సిద్ధార్థ కుమారుడికి ఫోన్ చేసి డ్రైవర్ వెల్లడించాడు.. వారు కూడా స్థానిక కాఫీడే సిబ్బందికి తెలియజేసి గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి గాలింపు ప్రారంభించింది. సిద్ధార్థ అదృశ్యంపై అతని కారు డ్రైవర్ని మంగళూరు పోలీసులు ప్రశ్నించారు. సిద్ధార్థ కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు. మంగళూరులో సిద్ధార్థ బస చేసే హోటళ్లు, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని హోటల్లు, బంధువుల ఇళ్లలోనూ గాలింపు చేపట్టారు. ఆత్మహత్యా అనుమానాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆయన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు నుంచి మంగళూరుకు కారులో వెళుతున్నంత సేపు తన స్నేహితులకు ఫోన్లు చేసి ‘నన్ను క్షమించండి’ అంటూ భాగోద్వేగానికి లోనవడంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, మంగళూరు నగరంలోని డీసీపీలు హనుమంతరాయ, లక్ష్మి గణేశ్‌ల నేతృత్వంలోని సుమారు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది, అధికారులు సోమవారం రాత్రి నుంచి సిద్ధార్థ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిద్ధార్థ అదృశ్యమైన నేత్రావతి నదిలో గజ ఈతగాళ్లు, 25 బోట్లు ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టారు. నది చుట్టుపక్కల కూడా వెతుకుతున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి శోధిస్తున్నారు. అలాగే వీరికి కోస్టుగార్డు సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది కూడా సాయపడుతున్నారు. స్థానిక మత్స్యకారుల సాయం కూడా తీసుకుంటున్నామని, చివరిగా ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో కూడా చెక్ చేస్తున్నామని మంగళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఎస్ఎం కృష్ణకు నేతల పరామర్శ సిద్ధార్థ అదృశ్యంతో బెంగళూరు సదాశివనగరలో ఆయన మామ ఎస్ఎం కృష్ణ ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య తదితరులు కృష్ణకు ధైర్యం చెప్పారు. సిద్ధార్థ నదిలో దూకడాన్ని చూశా కాఫీ డే యజమాని సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు సైమన్ డిసోజా అనే స్థానిక జాలరి తెలిపారు. తను చేపలకు వల వేస్తుండగా నీటిలోకి ఎవరో దూకిన శబ్దం వినిపించిందని మంగళవారం స్థానిక మీడియాకు తెలిపారు. తను అక్కడికి వెళ్లేలోపు దూకిన వ్యక్తి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ లోపలికి మునిగిపోయాడని చెప్పారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ అనేకం జరిగినట్లు తెలిపారు. దేశీ కాఫీ కింగ్ సిద్ధార్థ .. దాదాపు 140 ఏళ్లుగా కాఫీ వ్యాపారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ జీవితంలో పలు మలుపులు ఉన్నాయి. ఆయన ముందుగా భారతీయ ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పట్టా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరుగా మారారు. 1984లో సొంతంగా శివన్ సెక్యూరిటీస్ పేరిట ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించారు. దాన్నుంచి వచ్చిన లాభాలతో కర్ణాటకలోని చిక్మగళూర్ జిల్లాలో కాఫీ తోటలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కుటుంబ కాఫీ వ్యాపారంపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. 1993లో అమాల్గమేటెడ్ బీన్ కంపెనీ (ఏబీసీ) పేరిట కాఫీ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. అప్పట్లో రూ. 6 కోట్లుగా ఉన్న ఈ సంస్థ వార్షిక టర్నోవరు ఆ తర్వాత రూ. 2,500 కోట్ల స్థాయికి చేరింది. దేశీయంగా ఇది ప్రస్తుతం అతి పెద్ద గ్రీన్ కాఫీ ఎగుమతి సంస్థ. ఇక, జర్మన్ కాఫీ చెయిన్ ’చిబో’ స్ఫూర్తితో సొంత కెఫేలను కూడా సిద్ధార్థ ప్రారంభించారు. తేనీటిప్రియులను కూడా ఘుమఘుమలాడే కాఫీ వైపు మళ్లేలా చేశారు. 1994లో బెంగళూరులో తొలి కెఫే కాఫీ డే ప్రారంభమైంది. ప్రస్తుతం వియన్నా, ప్రాగ్, కౌలాలంపూర్ తదితర 200 పైచిలుకు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,750 కెఫే కాఫీ డే అవుట్‌లెట్స్ ఉన్నాయి. 2015లో కాఫీ డే పబ్లిక్ ఇష్యూకి కూడా వచ్చింది. బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారు: ఐటీ శాఖ అదృశ్యమైన కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థను తాము గతంలో దర్యాప్తు సందర్భంగా వేధించామన్న ఆరోపణలను ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. లేఖలోని సిద్ధార్థ సంతకం, తమ దగ్గరున్న సంతకానికి చాలా తేడా ఉందని ఐటీ శాఖ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. గతంలో తాము జరిపిన సోదాల్లో తనవద్ద బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారని కూడా ఐటీ శాఖ తెలిపింది. భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు తగిన ఆధారాలు దొరకడంతోనే షేర్లను అటాచ్ చేశామని, 2017లో కాఫీ డే గూపు కంపెనీల్లో సోదాలను కూడా చేశామని ఐటీ అధికారులు చెప్పారు. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేశారు. కాగా, మైండ్ ట్రీ షేర్ల విక్రయం ద్వారా సిద్ధార్థకు దాదాపు రూ.3,200 కోట్లు వచ్చాయని.. ఈ డీల్ విషయంలో కనీస ప్రత్యామ్నాయ పన్నుగా రూ.300 కోట్లను సిద్ధార్థ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.46 కోట్లను మాత్రమే కట్టారని కూడా ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వద్ద రూ.362.11 కోట్ల లెక్కలో చూపని ఆదాయం(బ్లాక్ మనీ) తో పాటు, తన వద్ద రూ.118.02 కోట్ల నగదు ఉన్నట్లు సిద్ధార్థ ఒప్పకున్నారని ఐటీ వర్గాలు వివరించాయి. సీసీడీడీలో 6% వాటా ఉంది: కేకేఆర్ సీసీడీ వ్యవస్థాపకుడు సిద్దార్థ అదృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్దార్థపైన నమ్మకంతో సీసీడీలో తాము తొమ్మిదేళ్ల క్రితం చేసిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని గతేడాది విక్రయించామని.. దీంతో తమ వాటా 10.3 శాతం నుంచి ప్రస్తుతం 6 శాతానికి పరిమితమైనట్లు కేకేఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఒక పీఈ ఇన్వెస్టర్ నుంచి షేర్ల బైబ్యాక్ కోసం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానంటూ సిద్దార్థ రాసినట్లు చెబుతున్న లేఖలో బయటపడిన నేపథ్యంలో కేకేఆర్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా పీఈ ఫండ్స్ ఏడాది నుంచి ఏడేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడులు పెట్టి వైదొలగుతుంటాయని, అయితే తాము మాత్రం సీసీడీ వృద్ధి చెందేంతవరకూ సహకారం అందించి కొంత వాటాను మాత్రమే విక్రయించామని కేకేఆర్ వివరించింది. బకాయిలేమీ లేవు: హెచ్డీఎఫ్సీ సిద్ధార్థతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి తమకు రుణ బకాయిలు ఉన్నట్లు వచ్చిన వార్తలను హెచ్డీఎఫ్సీ తోసిపుచ్చింది. ‘సీసీడీకి చెందిన టాంగ్లిన్ డెవలప్మెంట్స్ బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్‌పార్క్ ప్రాజెక్టు కోసం గతంలో మేం రుణాలిచ్చాం. అయితే, 2019 జనవరిలో ఈ మొత్తం రుణాన్ని సంబంధిత సంస్థ చెల్లించేసింది. ప్రస్తుతం కాఫీడే ఎంటర్ ప్రైజెస్ గ్రూపు నుంచి మాకు ఎలాంటి బకాయిలూ లేవు’ అని హెచ్డీఎఫ్సీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం: సీసీడీ సిద్ధార్థ అదృశ్యంతో సీసీడీ డైరెక్టర్ల బోర్డు మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. సిద్దార్థ రాసినట్లు బయటికొచ్చిన లేఖలోని అంశాలను సమీక్షించడంతోపాటు లేఖ కాపీలను సంబంధిత అధికారులకు అందజేసినట్లు కంపెనీ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కాగా, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా తగిన చర్యలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. ‘సిద్దార్థ అదృశ్య సంఘటనతో మేం షాక్‌కు గురయ్యాం. ఆయన కుటుంబ సభ్యులు, ఆప్తులకు మా పూర్తి మద్దతను తెలియజేస్తున్నాం. ఆయన ఆచూకీ కోసం మేం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. నిపుణులైన నాయకత్వంలో కంపెనీ నడుస్తున్నందున వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి’ అంటూ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. మైండ్‌ట్రీ డీల్‌తో రూ.3,200 కోట్లు కాఫీ దగ్గరే ఆగిపోకుండా సిద్ధార్థ కొంగొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఇటు ఆర్థిక సేవల నుంచి అటు ఐటీ దాకా వివిధ రంగాల్లో కార్యకలాపాలు విస్తరించారు. ఐటీ రంగంలో ప్రవేశించి గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్‌ని ఏర్పాటు చేశారు. అటు ఆర్థిక సేవలు అందించే శివన్ సెక్యూరిటీస్ కింద చేతన్ ఉడ్ ప్రాసెసింగ్, బేర్‌ఫుట్ రిసార్ట్స్ (ఆతిథ్య రంగం), డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ (కలప వ్యాపారం) పేరిట మరో మూడు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశారు. 1999లో సుబ్రతో బాగ్చీ, కేకే నటరాజన్, రోస్టో రవనన్‌లు మైండ్‌ట్రీ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సిద్ధార్థను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా తీసుకొచ్చారు ఐటీ రంగంలో సీనియర్ అయిన అశోక్ సూతా. ఒక దశలో మైండ్‌ట్రీలో ఆయన అతి పెద్ద వాటాదారు కూడా. ఈ ఏడాది మార్చిలోనే తనకున్న 20.41 శాతం వాటాలను లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)కి విక్రయించారు. ఈ వివాదాస్పద డీల్ ద్వారా రూ. 3,200 కోట్లు వచ్చాయి. దాదాపు రూ. 2,900 కోట్ల రుణభారాన్ని ఈ నిధులతో తగ్గించుకున్నారు. అప్పుల కుప్ప.. కాఫీ డే కాఫీ డే చెయిన్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 6,550 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. రుణాలతో పాటు నష్టాలు కూడా భారీగా పెరిగిపోయాయి. దేశీయంగా కాఫీ ఉత్పత్తి తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు 13 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కీలకమైన సిద్ధార్థ వ్యాపారాన్ని గట్టిగానే దెబ్బతీసింది. అయితే, రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించేసిన సిద్ధార్థ.. ఇతర వ్యాపారాల్లో కూడా వాటాలను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. రూ. 10,000 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో కెఫే కాఫీ డే (సీసీడీ)లో కొంత వాటాలను కోక కోలా సంస్థకు అమ్మేసేందుకు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. రియల్టీ రంగంలో సిద్ధార్థ నెలకొల్పిన టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో దాదాపు రూ. 2,800 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఒంగోలులో పలు పీఎస్‌ల్లో ఎస్పీ తనిఖీలు
ఒంగోలు: నగరంలోని పలు పోలీసుస్టేషన్లను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బుధవారం తనిఖీలు చేశారు. ఒక్కో పోలీసుస్టేషన్లో దాదాపు గంట పాటు పోలీసు అధికారులు, సిబ్బందితో భేటీ అయ్యారు. గతంలో ఆ పోలీసుస్టేషన్ చరిత్ర, ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన వివాదాలు తదితరాలపై చర్చించారు. ఎంతమందిని బైండోవర్ చేశారు. బెట్టింగ్‌కు సంబంధించిన అంశాలపై పూర్తి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు సంబంధించిన హద్దులు అడిగి తెలుసుకున్నారు. వివాదాలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఎస్పీ కౌశల్ ఆదేశించారు. ఒంగోలు టూటౌన్‌తో పాటు ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లను ఆయన పరిశీలించారు. కౌంటింగ్ రెండు రోజుల ముందునుంచే ప్రత్యేక బందోబస్తు అనంతరం ఎస్పీ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలోని పోలీసుస్టేషన్లను పరిశీలించామని, సంబంధిత స్టేషన్లలోని పరిస్థితులపై ఒక అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019లో 45 శాతం మంది భద్రత సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. అయినా ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా నిర్వహించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కౌంటింగ్‌ను కూడా అత్యంత ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని అందరు పోలీసు అధికారులు, సిబ్బందికి తగు సూచనలు ఇస్తున్నామన్నారు. జిల్లా పోలీసులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని, ఒక వైపు ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు పెరగ్గా భద్రత సిబ్బంది మాత్రం తగ్గారన్నారు. అయినా ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ఎన్నికలు అత్యంత కట్టుదిట్టమైన వాతావరణంలో జరిగాయన్నారు. బేసిక్ పోలీసింగ్, ట్రాఫిక్ సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలపై కూడా దృష్టి సారించామన్నారు. కలనూతలలో ఎడ్జాయినింగ్ పోలింగ్‌కు సైతం బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. బెట్టింగ్ జరుగుతుందన్న ప్రచారం తమ దృష్టికి కూడా వచ్చిందని, ప్రజలు ఎవరైనా ఇటువంటి సమాచారాన్ని గుర్తిస్తే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మొట్టమొదటి కారణం రాష్ట్రంలోనే అత్యధికంగా బైండోవర్లు చేయడమేనన్నారు. దాదాపు 26 వేల మందిని బైండోవర్ చేయడంతో 99.6 శాతం మంది బైండోవరైన ఎటువంటి వివాదాల్లో తారసపడ లేదన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లకు దగ్గరగా ఉన్న తొలి అంచెలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సు, రెండో అంచెలో ఎపీఎస్పీ బెటాలియన్, మూడో అంచెలో స్థానిక పోలీసులు కాపలాగా ఉంటున్నారని, తాము కూడా అప్రమత్తంగా తనిఖీలు చేస్తూ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. అంతే కాకుండా ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు కూడా అక్కడే ఉండి బందోబస్తు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సమయంలో జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల రోజు ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేపట్టామో అదే బందోబస్తు ఏర్పాట్లు కౌంటింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు నుంచి కొనసాగిస్తామన్నారు. కౌంటింగ్‌కు ముందు, కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. కౌంటింగ్ సమయంలో కూడా బైండోవర్లు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో 13 చోట్ల పోలీసు పికెట్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో చాలామంది వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్తుంటారని, ఈ నేపథ్యంలో విలువైన వస్తువులు ఇళ్లల్లో ఉంచవద్దని విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్హెచ్ఎంఉస్)ను ఉచితంగా అందిస్తుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు బంధువుల ఇళ్లల్లో ఉంచుకోవడం లేదా లాకర్లలో పెట్టుకోవాలని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, అనుమానాస్పద వ్యక్తుల సంసరిస్తే పోలీసు శాఖ దృష్టికి తీసుకు రావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. బైక్‌పై ఎస్పీ ప్రయాణం టూటౌన్ పోలీసుస్టేషన్‌ను పరిశీలించిన అనంతరం ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కొద్దిసేపు బైకుపై ప్రయాణం చేశారు. ఎస్పీ బైక్ నడుపుతుండగా ఒంగోలు టౌన్ డీఎస్పీ రాథేష్ మురళి వెనుక కూర్చున్నారు. స్టేషన్ నుంచి కమ్మపాలెం, గోపాలనగరం, గోరంట్ల కాంప్లెక్స్ జంక్షన్, కరుణా కాలనీ రోడ్డు మీదుగా ట్రంకు రోడ్డుకు చేరుకున్నారు. అక్కడి నుంచి అద్దంకి బస్టాండు, మస్తాన్‌దర్గా సెంటర్, కొత్తపట్నం బస్టాండు, ఎస్బీఐ మెయిన్ బ్రాంచి జంక్షన్, చర్చి సెంటర్ మీదుగా ఒన్‌టౌన్ వరకు బైక్ నడుపుకుంటూ నగరంలో ప్రయాణించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా గమనించారు. -
రండి కలిసి పనిచేద్దాం!
చిత్తూరు, బి.కొత్తకోట: ‘వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆశయాలకనుగుణంగా కలిసి పనిచేద్దాం రండి’ అంటూ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు కొండా సిద్దార్థను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. సోమవారం పెద్దతిప్పసముద్రం ఎంపీపీ కొండా గీతమ్మ, ఆయన తనయుడు కొండా సిద్ధార్థ టీడీపీకి రాజీనామా చేశారు. వీరిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు మిథున్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి మంగళవారం ఉదయం కుర్రావాండ్లపల్లెకు వచ్చారు. సిద్ధార్థను కలిసి మాట్లాడారు. పార్టీలో యువతకు కల్పిస్తున్న ప్రాధాన్యం, పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరించారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ కొండా సిద్ధార్థ కుటుంబానికి తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో బంధు, అనుచరగణం ఉందన్నారు. రాజకీయంగా కొండా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సిద్ధార్థ ఆస్ట్రేలి యాలో ఉన్నత స్థాయి ఉద్యోగం, ఆదాయం వదులుకుని సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. టీడీపీలో ఉంటూ విలువలతో కూడిన రాజకీయం చేశారని ప్రశంసించారు. పార్టీపరంగా టీడీపీలో ఉన్నప్పటికీ కొండా కుటుంబంపై తమకు గౌరవం ఉందన్నారు. ఈ కుటుంబం ఏనాడూ దిగజారుడు రాజకీయాలు చేయలేదన్నారు. చదువుకునే రోజుల్లో జగన్మోహన్రెడ్డితో సిద్ధార్థకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఆయన తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని, తంబళ్లపల్లె రాజకీయాలు మలుపు తిరుగుతాయని అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధార్థను పార్టీలో చేరమని కోరుతున్నట్టు చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబంతోనే కార్యకర్తలకు అండ.. కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టమొచ్చినా అండగా నిలబడడం పెద్దిరెడ్డి కుటుంబానికేచెల్లుతుందని కొండా సిద్ధార్థ అన్నారు. పార్టీ శ్రేణులను కాపాడుకునే సత్తా ఆ కుటుంబానికే ఉందన్నది వాస్తవమని స్పష్టం చేశారు. పార్టీ వీడినా తాను టీడీపీకి చెందిన ఎవర్ని విమర్శించబోనని అన్నా రు. ‘టీడీపీ ఆవిర్భావంలో రాజకీయ విలు వలు ఉండేవి.. ఇప్పుడా విలువలు కనిపిం చడం లేదు.. నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు అందరికి తెలిసిందే’ అని పేర్కొన్నారు. మనస్సాక్షిని చంపుకుని టీడీపీలో కొనసాగే పరిస్థితి లేకపోవడం వల్లే తన తల్లి ఎంపీపీ గీతమ్మ, తాను రాజీ నామా చేశామన్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చాక విద్యలో తనకు సీనియర్ అయిన జగన్మోహన్రెడ్డిని ఒక మిత్రునిగానే కలిశాను తప్ప, టీడీపీ వీడే ఆలో చన చేయలేదన్నారు. అయినప్పటికీ పార్టీలో అవమానాలు భరించాల్సి వచ్చిం దని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీలో చేరే విషయమై రెండు రోజుల్లో నిర్ణ యం వెల్లడిస్తానని చెప్పారు. విండో చైర్మన్‌కూ ఆహ్వానం.. కొండా సిద్ధార్థను పార్టీలో చేర్చుకునేందుకు కుర్రావాండ్లపల్లెకు వచ్చిన మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇక్కడికి వచ్చిన పెద్దతిప్పసముద్రం మండల టీడీపీ సింగిల్‌విండో చైర్మన్ ఎం.భాస్కర్‌రెడ్డితో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. రైతులకు ఎంతో సహకారం అందించిన భాస్కర్‌రెడ్డి పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుం దని ఆయనకు భరోసా ఇవ్వగా సానుకూలంగా స్పందించారు. చేరికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో పెద్దతిప్పసముద్రం మండలంలోని టీడీపీ ము ఖ్యనేతలంతా వైఎస్సార్సీపీలోకి చేరిపోనున్నారు. -
లిప్‌లాక్ అదిరింది
తమిళసినిమా: నటుడు సిద్ధార్థ్ చాలా గ్యాప్ తరువాత నటి ఆండ్రియాతో కలిసి అవళ్ అంటూ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. అరణ్మణై–2 చిత్రం తరువాత సిద్ధార్థ్ కోలీవుడ్‌లో కనిపించలేదు. అయితే కొంచెం గ్యాప్ తీసుకుని అవళ్ చిత్రంతో ఏకంగా కథానాయకుడు, నిర్మాతగా రానున్నారు. ఈయన సొంత నిర్మాణ సంస్థ ఎడాకీ, వయాకాంమ్ 18 మోషన్ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం అవళ్. ఇందులో సిద్ధార్థ్‌తో సంచలన నటి ఆండ్రియా రొమాన్స్ చేయగా. ఇతర ముఖ్య పాత్రల్లో అతుల్ కులకర్ణి, సురేశ్, అనిషా విక్టర్, ప్రకాశ్ బెలవాడి, భావన అనేజా, ఖుషీ హజారే, యూసఫ్ హూసేన్, మందాకిని గోస్వామి నటించారు. వ్రేయాస్ క్రిష్ణ ఛాయాగ్రహణం, గిరీష్ సంగీతాన్ని అందించిన అవళ్ చిత్రానికి నటుడు సిద్ధార్థ్‌నే కథను అందించడం విశేషం. ఆయన చిరకాల మిత్రుడు మిలింద్ దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ మూడో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. మా కల నెరవేరింది: సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆండ్రియా మాట్లాడుతూ తనకు అన్నీ వైవిధ్యభరిత కథా చిత్రాల అవకాశాలే వస్తున్నాయని, అలాంటి చిత్రాల్లో నటించడం కష్టతరమైనా, సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించడం సంతోషంగా ఉందని అంది. సిద్ధార్థ్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు మిలింద్ తనకు 17 ఏళ్ల మిత్రుడని తెలిపారు. హాలీవుడ్ హర్రర్ చిత్రాలు ఎక్కువగా చూసేవాళ్లమని, ఎప్పటిౖకైనా హాలీవుడ్ స్థాయి హర్రర్ చిత్రాన్ని రూపొందించాలన్న తమ కల ఈ అవళ్ చిత్రంతో నెరవేరిందని పేర్కొన్నారు. ఇది అలాంటి ఇలాంటి హర్రర్ చిత్రం కాదని, ఎలాంటి వారినైనా భయపెడుతుందని అన్నారు. చిత్రాన్ని నవంబర్ మూడో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సిద్ధార్థ్ వెల్లడించారు. చిత్ర ట్రైలర్ భయపెట్టినా, ఒక పాటలో మాత్రం సిద్ధార్థ్, ఆండ్రియాల లిప్‌లాక్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలను మరపించేలా ఉన్నాయని చెప్పకతప్పదు. -
జాతీయ స్థాయి పోటీలకు కంబదూరు విద్యార్థి
కంబదూరు : జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జె.సిద్ధార్థ అనే విద్యార్థి ఎంపికయ్యాడు. ఈనెల 19–21 తేదీల్లో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో జరిగిన 62వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ త్రోబాల్ పోటీల్లో సిద్ధార్థ ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మధుసూదనమ్మ, పీడీ అంజయ్య, పీఈటీ మురళి గురువారం తెలిపారు. జనవరి 2 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. విద్యార్థి ఎంపికపై స్థానిక ఉపాధ్యాయులు హరికృష్ణ, చైతన్య హర్షం వ్యక్తం చేశారు.