![Bowenpally Kidnap Case Vijayawada Siddhartha Play Key Role - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/15/bhargava-ram.jpg.webp?itok=FqdqHpNQ)
భార్గవ్‌రామ్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సిద్దార్ధ కిడ్నాప్‌లో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. భార్గవ్‌రామ్‌కి మనుషులను సరఫరా చేసింది కూడా ఇతడే. సిద్దార్థ విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తున్నాడు. అఖిలప్రియ, భార్గవ్‌కు పర్సనల్ గార్డ్‌గా ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కోసం రావాలని భార్గవ్ సిద్దార్థకు చెప్పాడు. భార్గవ్ ఆదేశంతో అతడు 15 మందితో హైదరాబాద్‌కు వచ్చాడు. సిద్దార్థ అండ్ గ్యాంగ్ ముగ్గురిని కిడ్నాప్ చేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం సిద్దార్థతో పాటు అతడి గ్యాంగ్‌లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ( ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. )
కాగా, భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి తదితరులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్‌రామ్ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ తదితరుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment