సాక్షి, హైదరాబాద్: బోయినపల్లి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వైష్ణవి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. నాన్న ఎలా ఉన్నాడంటూ అడిగిన మాటలే వైష్ణవి చివరి మాటలయ్యాయి. కాగా బుధవారం తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి వైష్ణవి రోడ్డుపై పడిపోవడంతో డీసీఎం ఢీకొట్టిన విషయం తెలిసిందే.
వివరాలు.. ఆర్మీ విశ్రాంత ఉద్యోగి విజయ్ కుమార్ బుధవారం తన కుమార్తె వైష్ణవితో కలిసి స్కూటీపై కానాజీ గూడ నుంచి బోయిన్‌పల్లికి బయలుదేరారు. మార్గమధ్యలో ప్రియదర్శిని హోటల్ వద్ద స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయారు. ఇంతలోనే ఆ మార్గంలో వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వైష్ణవి మీదుగా వెళ్లిపోయింది. ఎమ్‌ఎన్‌ఆర్ కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న వైష్ణవిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
దీంతో తీవ్ర గాయాల పాలైన వైష్ణవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం వైష్ణవి ప్రాణాలు విడిచింది. మరోవైపు వైష్ణవి నివాసముండే ఖానాజీగూడాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment