Bowenpally
-
అనుమానంతో ప్రాణాలు తీశాడు
రసూల్‌పురా: భార్య ప్రవర్తనపై అనుమానంతో దారుణానికి తెగబడ్డాడు ఓ భర్త. కట్టుకున్న ఇల్లాలితో పాటు పదకొండు నెలల కన్నకూతురును చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం బోయిన్పల్లి పరిధిలో వెలుగులోకి వచి్చంది. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ డెక్లూర్‌కు చెందిన గణేష్ సంగ్రామ్ (35), స్వప్న దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు తరుణి (6), తరుణశ్రీ (4), నక్షత్ర (11 నెలలు) ఉన్నారు. గణేష్ సంగ్రామ్ జీవనోపాధి కోసం కొన్నాళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చాడు. బోయిన్పల్లి ఆర్యసమాజ్ సమీపంలో అద్దె ఇంటిలో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా గణేష్ సంగ్రామ్, స్వప్న దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గణేష్ సంగ్రామ్.. శనివారం రాత్రి స్వప్నతో గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆమె మెడకు తాడుతో ఉరి వేసి ప్రాణాలు తీశాడు. పదకొండు నెలల చిన్నారి నక్షత్ర గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇంటి యజమానురాలికి, డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. సుచిత్ర– అల్వాల్ మార్గంలోని ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. మిగతా ఇద్దరు చిన్నారులు మరో గదిలో నిద్రిస్తుండటంతో తండ్రి వారి జోలికి వెళ్లలేదు. సమాచారం అందుకున్న పోలీసులు బోయిన్‌పల్లిలోని ఇంటికి వెళ్లి చూడగా స్వప్న, చిన్నారి నక్షత్ర మృతదేహాలు కనిపించాయి. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బోయినపల్లి రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన వైష్ణవి మృతి
సాక్షి, హైదరాబాద్: బోయినపల్లి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వైష్ణవి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. నాన్న ఎలా ఉన్నాడంటూ అడిగిన మాటలే వైష్ణవి చివరి మాటలయ్యాయి. కాగా బుధవారం తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి వైష్ణవి రోడ్డుపై పడిపోవడంతో డీసీఎం ఢీకొట్టిన విషయం తెలిసిందే. వివరాలు.. ఆర్మీ విశ్రాంత ఉద్యోగి విజయ్ కుమార్ బుధవారం తన కుమార్తె వైష్ణవితో కలిసి స్కూటీపై కానాజీ గూడ నుంచి బోయిన్‌పల్లికి బయలుదేరారు. మార్గమధ్యలో ప్రియదర్శిని హోటల్ వద్ద స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయారు. ఇంతలోనే ఆ మార్గంలో వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వైష్ణవి మీదుగా వెళ్లిపోయింది. ఎమ్ఎన్ఆర్ కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న వైష్ణవిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో తీవ్ర గాయాల పాలైన వైష్ణవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం వైష్ణవి ప్రాణాలు విడిచింది. మరోవైపు వైష్ణవి నివాసముండే ఖానాజీగూడాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బోయిన్‌పల్లిలో తీవ్ర విషాదం.. కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: బోయినపల్లి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి.. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని స్వస్థలానికి పంపించినట్లు సమాచారం. తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలోని భవానీపురంలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె భర్త చనిపోగా.. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆ బాధలో కూతుళ్లు చంద్రకళ, దివ్యాంగురాలైన మరో కూతురు సౌజన్య పాలు పంచుకున్నారు. అంతా కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారే ఏమో పాపం.. వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రకళ ఎంబీఏ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదీ చదవండి: కాపీ కొడుతూ దొరికిన దీపిక!.. అందుకే సూసైడ్ చేసుకుందా? -
వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విశాల్
-
బోయినపల్లి నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర
-
కూతురిపై కన్నేసిన తండ్రి.. కాపాడిన సవతి తల్లి
సాక్షి, కంటోన్మెంట్: కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం బోయిన్పల్లి పీఎస్‌లో బేగంపేట ఏసీపీ నరేశ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రమేశ్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి చెత్త సేకరణతో ఉపాధి పొందుతున్నాడు. 15 ఏళ్ల క్రితం సరోజ అనే మహిళను వివాహం చేసుకున్న రమేశ్, వీరికి ఒక పాప జన్మించిన కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నాడు. పదేళ్ల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు, రెండో భార్య, ఆమె కుమారుడితో కలిసి బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి బుధవారం రాత్రి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న అతడి రెండో భార్య రమేశ్‌ను అడ్డుకుంది. కన్నకూతురు కాకపోయినా తల్లి ప్రేమతో ఆమెను కీచక భర్త నుంచి కాపాడింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బోయిన్పల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: 75 పేజీల చార్జిషీట్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో 75 పేజీల చార్జీషీట్‌ను సిద్ధం చేసినట్లు పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 5న భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి అనుచరులతో కలిసి ఐటీ అధికారులమని చెప్పి ప్రవీణ్‌రావు ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత ప్రవీణ్‌రావు సోదరులను సినిఫక్కీలో కిడ్నాప్ చేసిన సంఘటన తెలిసిందే. కాగా, సంచలనంగా మారిన ఈ కేసులో.. అఖిల ప్రియ దంపతులతోపాటు, మరో 30 మందిపై బోయిన్పల్లి పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ క్రమంలో .. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ సమయంలో ఒక్కొక్కరి పాత్రను వివరించారు. చదవండి: Bhuma Akhila Priya: బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు -
బోయిన్పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసులు కిటికీ అద్దాలను పగులగొట్టి తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, విలువైన ఆస్తి పత్రాలను తీసుకెళ్లారని మంగళవారం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల మొదటివారంలో బోయిన్పల్లి పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. దాదాపు నెల రోజుల తర్వాత కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
రూ.7వేల అప్పు.. మనిషి ఉసురు తీసింది
సాక్షి, కంటోన్మెంట్: ఏడు వేల రపాయల బాకీ ఓ వ్యక్తి ఉసురు తీసింది. ఫైనాన్స్ డబ్బుల వసూలుకు వచ్చిన, వడ్డీ వ్యాపారి హత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డి పేట్‌కు చెందిన గంగారామ్ (44 ) బోయిన్పల్లి చిన్నతోకట్టాలో ఒంటరిగా నివాసముంటూ బోన్‌సెట్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న గంగారమ్ తాను అద్దెకు ఉండే ఇంటి ఆవరణలో పడిపోయి ఉండగా స్థానికుల సమాచారం మేరకు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి గొంతుపై చేతులతో నులిమినట్లు గాయాలు ఉండటంతో అనువనాస్పద మృతి కేసు నమోదు చేశారు. గంగారాం ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులు సాయిరాం, కమల్‌కిశోర్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. గంగారాం స్థానిక పాల వ్యాపారి గడ్డం సాయిరాం వద్ద తన ద్విచక్ర వాహనం తనఖా పెట్టి రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు. గత నెలలో రూ. 3వేలు చెల్లిం, మిగతా మొత్తం త్వరలోనే ఇస్తానని ద్విచక్ర వాహనాన్ని విడిపించుకున్నారు. ఈ క్రమంలో మిగతా సొమ్ము వసూలు కోసం సాయిరాం, గంగారాం ఇంటికెళ్లి తలుపుకొట్టగా ఎంతకీ బయటికి రాలేదు. దీంతో సంజీవయ్యనగర్‌కు చెందిన పెయింటర్ కమల్ కుమార్‌ను వెంటబెట్టుకుని మళ్లీ గంగారాం ఇంటికెళ్లి నిలదీశాడు. అప్పు చెల్లించే విషయంలో వాగ్వాదం మొదలైంది. నిందితులు ఇద్దరూ గంగారాం గొంతు నులిమి పట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నిందితులు గంగారాంకు చెందిన ల్యాప్‌ట్యాప్, ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పారిపోయారు. -
తప్పించుకునేందుకు తప్పుడు సర్టిఫికెట్
సాక్షి, కంటోన్మెంట్: బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, అతని సోదరుల కిడ్నాప్ కేసులో కీలక నిందితులైన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్‌రామ్‌లపై మరో కేసు నమోదైంది. కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరును తప్పించుకునే క్రమంలో తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను సమర్పించి పోలీసులకు దొరికి పోయారు. దీంతో వీరిరువురితో పాటు మరో ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసుకు సంబంధించి ఈ నెల 3న టెస్టు ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) నిర్వహించారు. అయితే తనకు కోవిడ్ సోకిందని భార్గవరామ్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. లాయర్ ద్వారా సికింద్రాబాద్‌లోని 10వ ఏసీఎంఎం కోర్టుకు నివేదించారు. పోలీసులు ఆరా తీయగా నిందితుడు తప్పుడు కోవిడ్ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచినట్లు తేలింది. దీంతో భార్గవ రామ్‌కు సహకరించిన జగత్ విఖ్యాత్‌తో పాటు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే వినయ్, ల్యాబ్ టెక్నీషినయన్ శ్రీదేవి, గాయత్రిల్యాబ్‌లో పనిచేసే రత్నాకర్‌లపై కేసు నమోదు చేశారు. వినయ్, రత్నాకర్‌లను రిమాండ్‌కు తరలించారు. భార్గవరామ్, జగత్‌విఖ్యాత్ పరారీలో ఉన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్‌పై ఉన్న వీరిరువురిపై మరో కేసు నమోదు కావడం గమనార్హం. -
ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని..
సాక్షి, కంటోన్మెంట్: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మోసం చేసిన నిందితుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గాందీనగర్‌లో తల్లిదండ్రులతో నివాసముండే యువతి (25) గతంలో బోయిన్పల్లి దుబాయ్ గేటు సమీపంలో నివాసముండేది. ఆమె అక్క పిల్లలకు కటింగ్ చేయించేందుకు వెళ్లే క్రమంలో స్థానిక సెలూన్లో పనిచేసే సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన కనకరాజు (26)తో పరిచయం ఏర్పడింది. గతేడాది లాక్డౌన్ కారణంగా మూడు నెలల పాటు సొంతూరుకు వెళ్లిన కనకరాజు అదే ఏడాది జూన్‌లో తిరిగి బోయిన్‌పల్లికి వచ్చాడు. దీంతో కనకరాజును మళ్లీ కలుసుకున్న యువతికి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు లైంగికంగా లోబరుచుకున్నాడు. గత ఫిబ్రవరి 24న తిరిగి సొంతూరుకు వెళ్లిన కనకరాజు మరుసటి రోజు యువతి ఫోన్ చేయగా షెడ్యూల్ కులానికి చెందిన ఆమెతో కులాంతర వివాహానికి తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. తర్వాత బాధితురాలు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కనకరాజు స్పందించలేదు. ఈ నేపథ్యంలో గత నెల 16న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవలే కనకరాజును అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి:కొవ్వును తగ్గిస్తానని చెప్పి.. గదిలోకి తీసుకెళ్లి ఆమెతో.. -
మిస్సింగ్ కేసు: బాలికకు మాయమాటలు చెప్పి..
కంటోన్మెంట్: మైనర్ బాలికపై లైంగికదాడిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన మేరకు.. ఒంగోలుకు చెందిన బాలిక గతేడాది బోయిన్‌పల్లిలోని పెద్దమ్మ ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన ఇర్షాన్ (25)తో బాలికకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇర్షాన్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. గత బుధవారం బాలిక పెద్దమ్మకు చెప్పకుండా వెళ్లింది. బాలిక ఆచూకీ దొరకకపోవడంతో బంధువులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా బాలిక ఇర్ఫాన్‌తో కలిసి వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక గుంటూరుకు వెళ్లినట్లు ఇర్షాన్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, పోక్సో, అత్యాచారం నేరాల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బంధువుల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ, ఎమ్మార్పీఎస్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, ఎమ్మార్పీఎస్ నేతలు బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం బోయిన్పల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్, బేగంపేట ఏసీపీ నరేశ్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో పోలీసులు బోయిన్పల్లి పీఎస్‌కు చేరుకున్నారు. డీసీపీ కల్మేశ్వర్ ఆందోళన కారులకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. హుస్సేన్ సాగర్‌లో దూకి యువకుడి ఆత్మహత్య రాంగోపాల్‌పేట్: హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంగోపాల్‌పేట్ పోలీసులు తెలిపిన మేరకు..చిలకలగూడకు చెందిన అజీజ్‌ఖాన్ (23) మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నెల 4వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆయన శుక్రవారం హుస్సేన్ సాగర్‌లో శవమై తేలాడు. రాంగోపాల్‌పేట్ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. చొక్కాపై ఉండే టైలర్ స్టిక్కర్ ఆధారంగా మృతుడిని గుర్తించారు. -
బోయినపల్లి కేసు: 14 మందికి బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులోని నిందితులకు సికింద్రాబాద్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. 14 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతివారం పీఎస్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. కాగా ఇప్పటికే అఖిలప్రియకు జనవరిలో కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భార్గవ్‌రామ్ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది. చదవండి: భార్గవ్రామ్కు కోర్టులో చుక్కెదురు.. -
భార్గవ్రామ్కు కోర్టులో చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్రామ్కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయ్యింది. భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) అఖిలప్రియకు బెయిల్ మంజూరు అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియ.. రేపు(శనివారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డిసెంబర్లోనే స్కెచ్ వేశారు! -
డిసెంబర్లోనే స్కెచ్ వేశారు!
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు తదితరుల్ని కిడ్నాప్ చేసేందుకు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ డిసెంబర్లోనే స్కెచ్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే అనివార్య కారణాలతో ఈ నెల మొదటి వారానికి వాయిదా పడింది. మరోపక్క కిడ్నాప్ చేసే సమయంలో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోవడానికి భార్గవ్ విశ్వప్రయత్నం చేశాడు. ఈ కేసులో బందిపోటు అభియోగాలను కూడా పోలీసులు చేరుస్తూ సోమవారం సికింద్రాబాద్ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. అయితే ఈ తరహా నేరాలకు సంబంధించిన పిటిషన్లను నాంపల్లి సెషన్స్ కోర్టు మాత్రమే విచారించాల్సి ఉండటంతో అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను కోర్టు రిటర్న్ చేసింది. స్కెచ్ ఇలా వేశారు.. హఫీజ్‌పేటలోని భూమిని చేజిక్కించుకోవడానికి ప్రవీణ్‌రావు తదితరులను కిడ్నాప్ చేయడమే మార్గమని అఖిలప్రియ, భార్గవ్‌రామ్ గత నెల నిర్ణయించుకున్నారు. గుంటూరు శ్రీను ద్వారా మాదాల సిద్ధార్థ్‌కు సమాచారం ఇచ్చి కొందరు అనుచరులతో రావాలని చెప్పారు. దాదాపు 10 మందిని వెంట తీసుకుని డిసెంబర్ 25న హైదరాబాద్‌కు సిద్ధార్థ్ చేరుకున్నాడు. వారికి శివార్లలోని ఓ లాడ్జిలో బస కల్పించిన భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనులు కుట్ర అమలుకు ఆలస్యమవు తుందని, డిసెంబర్ 31 తర్వాత అమలు చేద్దామని చెప్పి పంపారు. తిరిగి ఈ నెల 2న హైదరాబాద్ రావాలని సమాచారం ఇవ్వడంతో సిద్ధార్థ్ దాదాపు 25 మందిని తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. విజయవాడ, పరిసర ప్రాంతాల వారికి ఒకే బస్సులో టికెట్లు బుక్ చేశాడు. షేర్ల వ్యాపారానికి సంబంధించి బోయిన్‌పల్లికి చెందిన కొందరు ‘మంత్రి గారిని’(అఖిలప్రియ) మోసం చేయడంతో వారిపై ఐటీ దాడులు చేయిస్తోందని సిద్ధార్థ్ తన అనుచరులకు చెప్పాడు. ఆ అధికారులకు మనం సహాయంగా ఉండాలని నమ్మబలికాడు. ఇలా వచ్చిన వారంతా కూకట్‌పల్లిలోని ఓ హోటల్లో బస చేశారు. కిడ్నాప్ చేసే రోజు బాధితుల ఇంటికి వెళ్లకూడదని భార్గవ్ రామ్ తొలుత భావించాడు. అయితే బాధితులతో బలవంతంగా ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నా.. హఫీజ్‌పేట స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చేజిక్కించుకోకపోతే దాన్ని సొంతం చేసుకోవడం కష్టమవుతుందని అనుకున్నాడు. చదవండి: (ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే) దీంతో కిడ్నాప్ రోజు భార్గవ్‌రామ్, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి కూడా బాధితుల ఇంటికి వెళ్లారు. కుటుంబీకులను ఓ గదిలో, ముగ్గురు అన్నదమ్ములను హాలులో నిర్బంధించాక వీరిద్దరూ ఇల్లంతా గాలించారు. అయితే ఆ పత్రాలను ప్రవీణ్‌రావు బ్యాంకు లాకర్లో ఉంచడంతో అవి దొరకలేదు. ముగ్గురు బాధితులను కిడ్నాప్ చేసిన ఈ ముఠా ఇంట్లోని ల్యాప్‌టాప్‌తోపాటు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లింది. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు, ప్రధాన నిందితురాలు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన సికింద్రాబాద్ 11వ అదనపు మెట్రో పాలిటన్ కోర్టు, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా బోయిన్పల్లి పోలీసులకు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియకు మరోసారి కోర్టులో చుక్కెదురయ్యింది. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. సోమవారం భూమా అఖిలప్రియ బెయల్ పిటిషన్‌ని విచారించిన సికింద్రాబాద్ కోర్టు.. జీవిత కాలం శిక్ష పడే నేరాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. పిటిషన్‌ని రిటర్న్ చేసింది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ మరోసారి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్‌ని దాఖలు చేయనున్నారు. ఇక అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు మెమో ధాఖలు చేసిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ)కేసు నమోదు చేశారు. (చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. ) -
ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని హైదరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇప్పటికే టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు మల్లికార్జునరెడ్డి, బోయ సంపత్, బాలా చెన్నయ్‌లకు సంకెళ్లు వేయగా.. తాజాగా పట్టుబడిన వారితో ఈ సంఖ్య 19కి చేరింది. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. అఖిలప్రియ పోలీసు కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఆ నేరం జరిగిన సమయంలో ఉపయోగించిన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ కేసులో నిందితులను అరెస్టు చేస్తున్నారు. అచ్చం ఓ ఈవెంట్లో ప్లాన్ చేసిన ఈ కేసు వివరాలను ఆదివారం బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ మీడియాకు తెలిపారు. ముందస్తు వ్యూహం... కిడ్నాప్ ఎలా చేయాలన్న దానిపై అఖిలప్రియ.. భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనులతో జనవరి 2న కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్మెంట్లోని నివాసంలో, 4న యూసుఫ్‌గూడలోని ఎంజీహెచ్ పాఠశాలలో సమావేశమయ్యారు. గుంటూరు శ్రీను.. సిద్ధార్థను కలసి కిడ్నాప్ చేసేందుకు 15 నుంచి 20 మందిని సమకూర్చాలంటూ కోరాడు. దీనికోసం అతనికి రూ.5 లక్షలు, మిగిలిన వారికి రూ.25,000ల చొప్పున ఇస్తామని చెప్పాడు. ముందుగా రూ.74,000లు చెల్లించాడు. ఆ తర్వాత సిద్ధార్థ పంపిన వారందరికి కూకట్పల్లి ఫోరమ్ మాల్‌కు సమీపంలోని ‘ఎట్ హోమ్’లాడ్జ్‌లో వసతి కల్పించాడు. అనంతరం కిడ్నాప్ చేసే సమయంలో వీరు అధికారులుగా నటించేందుకు ఫార్మల్ డ్రెస్సుల కోసం కొలతలు కూడా తీసుకున్నాడు. మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌ల ద్వారా 10 స్టాంప్ పేపర్లు.. భార్గవ్‌రామ్, విఖ్యాత్‌రెడ్డి పేరులతో 10 స్టాంప్ పేపర్లు ఉండేలా కొన్నాడు. అలాగే ఆరు సెల్ఫోన్లు, బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడు. ఓ జిరాక్స్ షాప్ వద్ద ఓ పేపర్‌పై నకిలీ వాహన నంబర్లు ముద్రించి కిడ్నాప్ సమయంలో ఉపయోగించిన కారు నంబర్ ప్లేట్లపై అతికించారు. (చదవండి: మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్’!) పక్కాగా కిడ్నాప్.. జనవరి 5న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎంజీహెచ్ పాఠశాల వద్ద నిందితులు అందరూ కలిశారు. ఈ కేసులో ఏ2–గా ఉన్న భార్గవ్‌రామ్ ఐటీ అధికారులు, పోలీసు ఆఫీసర్లుగా ఎలా వ్యవహరించాలనే దానిపై మిగిలినవారికి వివరించాడు. బోయ సంపత్, బాలా చెన్నై మనోవికాస్‌నగర్‌లోని కృష్ణా రెసిడెన్సీకు మధ్యాహ్నం సమయంలో వెళ్లి రెక్కీ నిర్వహించారు. బాధితుల కదలికలను ఎప్పటికప్పుడూ చేరవేశారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఐదు కార్లలో బాధితుల ఇంటికి వెళ్లి ఐటీ, పోలీసులుగా చెబుతూ ఐటీ కార్డులు, సెర్చ్ వారంట్లు చూపెట్టి సోదాలు చేశారు. సెల్ఫోన్లు, ట్యాబ్‌లు తీసుకున్నారు. కూర్చోబెట్టి విచారణ చేశారు. అనంతరం ప్రవీణ్‌కుమార్, నవీన్‌కుమార్, సునీల్ కుమార్ల చేతులు తాళ్లతో కట్టేశారు. కళ్లు కనపడకుండా ఉండేందుకు ముఖాలకు మాస్కులు కట్టారు. ఆ తర్వాత ముగ్గురిని వేర్వేరు వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మొయినాబాద్‌లోని భార్గవ్‌రామ్ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత కర్రలతో కొడతామంటూ, చంపుతామంటూ బెదిరించి రాసిన పేపర్లపై కూడా సంతకాలు చేయించారు. అయితే బాధితుల గురించి పోలీసులు వెతుకుతున్నారని సమాచారం తెలుసుకున్న వీరు బాధితులను ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని సన్‌సిటీ దగ్గరలో అదే రోజూ రాత్రి వదిలివెళ్లారు. వాడిన వాహనాలివే... భార్గవ్‌రామ్ తల్లి కిర్మణ్మయి నాయుడు పేరుతో రిజిష్టర్ అయిన ఏపీ21 సీకే 2804 నంబర్ ప్లేట్ గల ఇన్నోవా కారు. దీనికి టీఎస్09 బీజెడ్ 9538(నకిలీ నంబర్) స్టిక్కర్‌ను అంటించారు. అలాగే ఏపీ21సీఈ 1088 నంబర్ ప్లేట్ గల స్కార్పియోకు టీఎస్09 ఎఫ్ఎక్స్ 3625 నంబర్‌ను, ఏపీ07 ఈడీ 0875 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్‌కు టీఎస్07 యూవీ 2583 నంబర్‌ను వినియోగించారు. అలాగే ఏపీ21 బీకే 3999 నంబర్ ప్లేట్ గల ఎక్స్‌యూవీ 500 వాహనానికి, వోక్స్వ్యాగన్ పోలోలకు ఉపయోగించిన నకిలీ నంబర్లను ఇంకా కనుక్కోవాల్సి ఉందని డీసీపీ కల్మేశ్వర్ తెలిపారు. ఎవరెవరి పాత్రలు ఏంటంటే.. మాదాల సిద్ధార్థ: ఈవెంట్ మేనేజర్ అయిన ఇతను కిడ్నాప్‌నకు సహకరించేందుకు 20 మందిని సమకూర్చడంతో పాటు స్విఫ్ట్ డిజైర్ కారును కూడా వినియోగించాడు. ఏపీ 09 ఈడీ 0875 కారుతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బొజ్జగని దేవప్రసాద్: కారును డ్రైవ్ చేయడంతో పాటు కిడ్నాప్‌లో పాల్గొన్నాడు. దేవరకొండ కృష్ణవంశీ, కందుల శివ: పోలీసు డ్రెస్సు ధరించి కానిస్టేబుల్స్‌గా నటించారు. వీరంతా..: మొగిలి భాను, రాగోలు అంజయ్య, పదిర రవిచంద్ర, పంచిగలి రాజా, బానోత్ సాయిలు, దేవరకొండ కృష్ణ సాయి, దేవరకొండ నాగార్జున, బొజ్జగాని సాయి, మీసాల శ్రీను, అనీపాక ప్రకాష్, షేక్ దావూద్ కూడా కిడ్నాప్‌లో పాల్గొన్నారు. -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కొత్త మలుపు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ కుటుంబం మొత్తానికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కిడ్నాప్‌కు సంబంధించిన కుట్రలో పాలు పంచుకున్నారని భార్గవ్ తండ్రి మురళి, తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో అఖిలప్రియ–భార్గవ్‌రామ్ కుటుంబాల్లో ఒక్క మౌనిక రెడ్డి తప్ప మిగిలిన వారంతా కిడ్నాప్ కేసులో నిందితులుగా మారారు. హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావుతో పాటు అతడి సోదరులను కిడ్నాప్ చేయడానికి భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్ కొన్నాళ్ల క్రితమే పథకం వేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దీన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై తమ కుటుంబీకులతో కలసి పదేపదే చర్చలు జరిపారు. గుంటూరు శ్రీను నేతృత్వంలో కిరాయి మనుషులతో కిడ్నాప్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ కుట్ర చేసే సందర్భంలో మురళి, కిరణ్మయి, చంద్రహాస్‌లు భార్గవ్‌రామ్‌తోనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చదవండి: బోయిన్పల్లి కేసు: వెలుగులోకి కీలక సూత్రధారి మరోపక్క కిడ్నాప్‌ను అమలు చేయడానికి భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను వివిధ ప్రాంతాల నుంచి తమ అనుచరులను, కిరాయి గూండాలను హైదరాబాద్‌కు రప్పించారు. వీరికి కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్ హోటల్లో బస కల్పించారు. అక్కడ నుంచి యూసుఫ్‌గూడలోని స్కూలుకు తీసుకువచ్చారు. అక్కడే వీరిలో ఐటీ అధికారులుగా నటించే వారికి కొత్త బట్టలు ఇవ్వగా.. గుంటూరు ప్రాంతానికి చెందిన వంశీకి మాత్రం అద్దెకు తీసుకువచ్చిన పోలీసు యూనిఫాం ఇచ్చారు. ఆదాయపు పన్ను అధికారుల దాడి నేపథ్యంలో తాను బందోబస్తుగా వచ్చినట్లు ఇతడు బాధిత కుటుంబానికి తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న వారి జాబితాలో వంశీ కూడా ఉన్నాడు. భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరులు ప్రస్తుతం బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలిసింది. వీరిలో కొందరికి నేరచరిత్ర ఉండటంతో పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో నిందితులు ప్రత్యేక బృందాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే నిందితులు ముందస్తు బెయిల్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. -
బోయిన్పల్లి కేసు: వెలుగులోకి కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సిద్దార్ధ కిడ్నాప్‌లో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. భార్గవ్‌రామ్‌కి మనుషులను సరఫరా చేసింది కూడా ఇతడే. సిద్దార్థ విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తున్నాడు. అఖిలప్రియ, భార్గవ్‌కు పర్సనల్ గార్డ్‌గా ఉంటున్నాడు. హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కోసం రావాలని భార్గవ్ సిద్దార్థకు చెప్పాడు. భార్గవ్ ఆదేశంతో అతడు 15 మందితో హైదరాబాద్‌కు వచ్చాడు. సిద్దార్థ అండ్ గ్యాంగ్ ముగ్గురిని కిడ్నాప్ చేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం సిద్దార్థతో పాటు అతడి గ్యాంగ్‌లో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ( ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. ) కాగా, భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి తదితరులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్‌రామ్ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ తదితరుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. -
ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే..
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసు నిందితులు చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి 9 రోజులైంది. పోలీసులు సూత్రధారిని అరెస్టు చేసినా ప్రధాన నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ నెల 5న అర్ధరాత్రి కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు సూత్రధారి భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బాధితుల్ని విడిపించారు. ఆ తర్వాతి రోజే ఆమెను అరెస్టు చేశారు. అప్పటికే ఈ కేసులో ఆమె భర్త భార్గవ్‌రామ్, అనుచరుడు గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. అయితే అఖిలప్రియ అరెస్టు తర్వాత మిగిలిన నిందితులు అంతా తమ అదుపులోనే ఉన్నట్లుగా పోలీసులు వ్యవహరించారు. మళ్ళీ ఆదివారం నుంచి వేగంగా స్పందించిన ప్రత్యేక బృందాలు ఆ మరుసటిరోజు అఖిలప్రియ పీఏ బోయ సంపత్, భార్గవ్‌రామ్ పీఏ నాగరదొడ్డి మల్లికార్జున్రెడ్డిలతోపాటు గుంటూరు శ్రీను అనుచరుడు డోర్లు బాల చెన్నయ్యలను పట్టుకున్నారు. చదవండి: ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ ఈలోపు భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి తదితరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్‌రామ్ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్ తదితరుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చదవండి: అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. అఖిలప్రియ పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఈమెను విచారించిన బోయిన్పల్లి పోలీసులు అనేక కీలకాంశాలు రాబట్టారు. కిడ్నాప్ జరిగినరోజు బా ధితుల ఇంటికి భార్గవ్‌రామ్‌తోపాటు జగద్వి ఖ్యాత్రెడ్డి కూడా వెళ్లినట్లు తేలింది. అపహరణకు ముందు కూకట్‌పల్లిలో ఉన్న పార్థ గ్రాండ్ హోటల్లో భార్గవ్‌రామ్ మిగిలిన నిందితులతో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ నుంచి వారిని యూసుఫ్‌గూడలోని ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్‌కు తీసుకువచ్చారు. అక్కడి ప్రొజెక్టర్‌లో గ్యాంగ్, స్పెషల్ 26 సినిమాల్లోని కొన్ని సీన్స్ ప్రదర్శించారు. ఐటీ అధికారులుగా ఎలా నటించాలనేది ఆ సీన్ల ద్వారా చూపించారు. అక్కడే అద్దెకు తెచ్చిన పోలీసు దుస్తులు, కొత్తగా ఖరీదు చేసిన ఫార్మల్ డ్రెస్సులను నిందితులు ధరించారు. అక్కడ నుంచి బోయిన్పల్లి వరకు భార్గవ్‌రామ్, జగద్విఖ్యాత్‌రెడ్డి ఒకే వాహనంలో ప్రయాణించారు. కిడ్నాప్ జరిగిన తర్వాత నేరుగా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్న భార్గవ్ అక్కడే బాధితులతో సంతకాలు చేయించాడు. ఈ కేసులో మొత్తం30 మంది ప్రమేయముందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. మరో పది మంది అదుపులో ఉండగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ పోలీస్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను హాజరపరిచి.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, ఆమె భర్త భార్గవ్‌రామ్ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. (చదవండి: కిడ్నాప్ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..) ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చదవండి: అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ -
అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కారు డ్రైవర్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా.. కిడ్నాప్‌లో జగత్‌విఖ్యాత్‌కు ప్రమేయం ఉన్నట్లు అతడు వెల్లడించినట్లు సమాచారం. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో పాటు అతడు కూడా.. బాధితుడు ప్రవీణ్‌రావు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులమంటూ.. వారిని బెదిరించినట్లు సమాచారం. వీరిద్దరు స్పాట్లో ఉండగా... లోథా అపార్ట్మెంట్లో ఉన్న అఖిలప్రియ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా కిడ్నాప్ తర్వాత.. భార్గవ్, జగత్‌విఖ్యాత్ ఒకే వాహనంలో వెళ్లినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ) మూడోరోజు విచారణ.. 300 ప్రశ్నలు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడోరోజు విచారణ ముగిసింది. ఈ క్రమంలో.. ఆమె భర్త భార్గవ్‌రామ్ సొంత పాంహౌజ్‌లో.. బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అఖిలప్రియకు 300 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. ఈ కేసులో నిందితులైన భార్గవ్‌రామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీను ఆచూకీపై ఆరా తీశారు. టెక్నికల్ సాక్ష్యాలను అఖిలప్రియ ముందు ఉంచటంతో.. పలు ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భార్గవ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
అక్షయ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన అఖిలప్రియ
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అఖిలప్రియ అండ్ గ్యాంగ్ సినిమా తరహాలో కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. భార్గవ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాప్‌కు ముందు అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ అనే సినిమాని అఖిలప్రియ అండ్ గ్యాంగ్‌కు చూపెట్టాడు. అలానే ఐటి అధికారులుగా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్, అఖిలప్రియ అండ్ గ్యాంగ్‌కి కిడ్నాప్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చాడు. ఇక అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపెట్టి కిడ్నాప్ చేయించినట్లు భార్గవ్, చంద్రహాస్ తెలిపారు. అలానే ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్ తయారు చేశాడు. శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్‌లను వీరు అద్దెకు తీసుకున్నారు. (చదవండి: పోలీసుల అదుపులో భార్గవ్‌రామ్!?) -
పోలీసుల అదుపులో భార్గవ్‌రామ్!?
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. గోవాలో నలుగురు నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సిద్ధార్థ్‌తో పాటు ముగ్గురిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, నిందితుడు భార్గవ్‌రామ్ ఆచూకీ మాత్రం లభించలేదు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, గోవా, ఏపీలో ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతడి కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుతో పాటు మరికొంత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.(చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ!) ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది: డీసీపీ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులు పరారీలోనే ఉన్నారని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వర్ తెలిపారు. భార్గవరామ్, గుంటూరు శ్రీను ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా.. న్యాయవాది సమక్షంలో అఖిల ప్రియ విచారణ సాగుతోందన్న డీసీపీ.. రెండో రోజు విచారణ పూర్తయినట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం వరకు అఖిలప్రియ తమ కస్టడీలోనే ఉంటుందని తెలిపారు. ఆమె హెల్త్ కండీషన్ బాగుందని పేర్కొన్నారు. ఇక విచారణలో భాగంగా కొన్ని కాగా కిడ్నాప్ చేయడానికి గల ఉద్దేశంపైనే ప్రధానంగా విచారణ సాగినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుల సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు అఖిల ప్రియ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశ్నలకు మాత్రమే అఖిల ప్రియ జవాబు ఇచ్చారని.. మరికొన్నింటికి గుర్తు లేదంటూ సమాధానం దాట వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నాటి దర్యాప్తు కీలకంగా మారనుంది. -
కిడ్నాప్ కేసు: అఖిలప్రియ వాడిన సిమ్ నంబర్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేడమే కాక.. కీలక ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ‘మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌కుమార్, అఖిలప్రియ పీఏ బాలచెన్నయను అరెస్ట్ చేశాం. నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న కార్లను వాడారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రధాన సూత్రధారి. కిడ్నాప్ చేయడానికి ముందు నిందితులు మియాపూర్‌లో ఆరు సిమ్ కార్డులు కొన్నారు. కాగా వీటిలో 70956 37583 నంబర్ని అఖిలప్రియ వాడారు. మల్లికార్డున్‌రెడ్డి ద్వారా 6 సిమ్‌లు, మొబైల్స్ కొనుగోలు చేశారు. కిడ్నాప్‌నకు ముందు నిందితులు రెక్కి నిర్వహించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది పాత్ర ఉంది’ అని సీపీ తెలిపారు. (చదవండి: అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు) అఖిలప్రియ ఆరోగ్యం బాగానే ఉంది : సీపీ ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో అఖిలప్రియని అరెస్ట్ చేశాం. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు అన్నివైద్య పరీక్షలు చేయించాం. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని రిపోర్టుల్లో వచ్చింది. మెడకల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాం అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అఖిలప్రియను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. చంచలగూడ జైలు నుంచి బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై కూపీ లాగనున్నట్లు పోలీసులు తెలిపారు.