సాక్షి, హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయ్యింది. భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 19 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హఫీజ్‌పేట భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ముఖ్య నిందితులు అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులతో సహా మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే)
అఖిలప్రియకు బెయిల్ మంజూరు
అఖిలప్రియకు శుక్రవారం సెసెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియ.. రేపు(శనివారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డిసెంబర్‌లోనే స్కెచ్ వేశారు!
Comments
Please login to add a commentAdd a comment