kidnap case
-
కిడ్నాప్ కేసులో ఎస్పీ చెప్పిన.. సంచలన విషయాలు
-
స్నేహితులే అలా చేసేసరికి.. నంద్యాల ఇంటర్ విద్యార్థి కేసులో విస్తుపోయే విషయాలు!
నంద్యాల, సాక్షి: ఆత్మకూరు ఇంటర్ విద్యార్థి అదృశ్యం కేసు.. విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు విస్తుపోయే వివరాల్ని మీడియాకు వెల్లడించారు. స్నేహితులే అతన్ని ఎత్తుకెళ్లడం, ఆపై అమానవీయంగా ప్రవర్తించడంతో అతను బలవర్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. ఆత్మకూరు మండలం కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ బాషా ఈ నెల 13న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అడిగారు. వహీద్ కళాశాల ప్రాంగణంలో తిరిగి వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే వహీద్ స్నేహితులే అతన్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. ఆ నలుగురు యువకులపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈలోపు మూడు రోజులు గడిచాయి. అయినా వహీద్ జాడ తెలియకపోవడంతో అతని కుటుంబంలో ఆందోళన పెరిగిపోయింది. ఈలోపు.. ఆత్మకూరు శివారులోని ఓ బావిలో వహీద్ శవమై కనిపించాడు. దీంతో.. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. చివరకు.. స్నేహితుల వల్లే వహీద్ చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అర్బన్ సీఐ లక్ష్మినారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. వహిద్‌కు స్నేహితులతో ఏవో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసిన తీవ్రంగా కొట్టిన యువకులు.. అతన్ని దుస్తులు విప్పించి బలవంతంగా ఫొటోలు తీశారు. దాడి గురించి బయట ఎవరికైనా చెబితే ఆ ఫొటోల్ని నెట్లో పెడతామని బెదిరించారు. దీనిని అవమానభారంగా భావించిన వాహిద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు కారకులైన నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశాం అని తెలిపారయన. -
అబిడ్స్ పీఎస్ వద్ద టెన్షన్.. కిడ్నాపర్‌పై పాప బంధువుల దాడి
సాక్షి, అబిడ్స్: హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆరేళ్ల పాపను కిడ్నాప్ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం, పాప కుటుంబ సభ్యులు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని చితకబాదారు. దీంతో, స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివరాల ప్రకారం.. అబిడ్స్‌లో కిడ్నాప్‌నకు గురైన ఒకటో తరగతి బాలిక ప్రగతి సురక్షితంగా ఉంది. శనివారం సాయంత్రం అబిడ్స్‌లోని కట్టెలమండిలో ఆడుకుంటున్న చిన్నారిని ఎండీ బిలాల్(కిడ్నాపర్) చాక్లెట్ ఇచ్చి ఆటోలో తీసుకెళ్లాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు బృందాలతో గాలించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, కిడ్నాపర్ బిలాల్‌ను బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించారు. చిన్నారిని అబిడ్స్ పీఎస్‌కు పోలీసులు తీసుకువచ్చారు. మరోవైపు నిందితుడిని కూడా పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో చిన్నారి కుటుంబసభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టంమీద నిందితుడిని పీఎస్ లోపలికి తీసుకెళ్లారు. దీంతో, అక్కడ ఉద్రికత్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
కర్ణాటక హైకోర్టులో ప్రజ్వల్ తల్లి భవానికి ముందస్తు బెయిల్
బెంగళూరు: లైంగిక వేధింపు కేసులో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆర్కే.నగర్‌కు చెందిన బాధితురాలి కిడ్నాప్ కేసులో మంగళవారం హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. భవానీ రేవణ్ణ ఇప్పటికే సిట్ అడిగిన 85 ప్రశ్నలకు సమాధానమిచ్చారని కోర్టు తెలిపింది. ఆమె విచారణకు సహకరించడం లేదని సిట్ చెప్పడం సరికాదని కోర్టు పేర్కొంది.Karnataka High Court grants anticipatory bail to Bhavani Revanna, mother of suspended JD(S) leader Prajwal Revanna. The bail has been granted to her on the condition that she is not allowed to enter Mysuru and Hassan. Court says that when she has already answered 85 questions…— ANI (@ANI) June 18, 2024 తన ఇంట్లో పనిచేసే ఆర్కే నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణ నిందితురాలు. ఆ మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 31న జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్‌ను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్‌పై సిట్ విచారణ కొనసాగుతోంది. -
తిరుపతి కిడ్నాప్ కథ సుఖాంతం...
-
KNR: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి నుంచి పసికందు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రాత్రి ప్రభుత్వ మతా శిశు కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన నిర్మలా దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. చికిత్స కోసం నిర్మలా దేవిని ఆస్పత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పసికందు మంచం దగ్గర తన ఏడేళ్ల కొడుకును తండ్రి భర్త మనోజ్ రామ్ కాపాలా ఉంచారు. ఆ తర్వాత తమ పాప కనిపించడం లేదంటూ ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అంతా వెతికినా పాప దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో పసికందు అపహరణపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ లో కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు -
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
-
బహదూర్‌పురా: 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్‌పురా పీఎస్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో సోమవారం ఏడాదిన్నర వయసున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. పాపను ఓ మహిళ అపహరించి తీసుకెళ్లుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే పసికందు ఆచూకీని బహదూర్‌పురా పోలీసులు కనుగొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేశారు. చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసుల అప్పగించారు. తన కొడుకుకి 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో మహిళ.. పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సురక్షితం
సాక్షి, తిరుపతి: తిరుపతి బస్టాండ్‌లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని స్థానిక మహిళ ఒకరు కాపాడినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఉన్న చిన్నారిని ఏర్పేడులో క్షేమంగా పోలీసులకు అప్పగించింది. అసలేం జరిగిందంటే.. చెన్నైకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని అర్ధరాత్రి ఫ్లాట్ ఫారం 3 వద్ద కోసం సోమవారం రాత్రి బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుని పోయాడు. ఆందోళనతో తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన బాలుడిని చెన్నై, వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్‌గా (2) గుర్తించారు. బాలుడితోపాటు కిడ్నాపర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు కిడ్నాపర్ బాలుడ్ని వదిలేసి వెళ్లడం.. చిన్నారి ఆ మహిళ కంట పడడం, ఆమె పోలీసులకు అప్పగించడం జరిగిపోయాయి. -
పాతబస్తీ ఫలక్‌నుమాలో మరో బాలుడు కిడ్నాప్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చిన్నారుల వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు అపహరణకు గురవ్వడం తీవ్రం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అయిదేళ్ల బాలుడిని ఇద్దరు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు చేధించారు. బాలుడిని రక్షించి.. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే పాతబస్తీ ఫలక్ నుమాలో మరో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడు అయాన్‌ను ఓ అగంతకుడు కిడ్నాప్ చేశాడు. ఇంటి నుండి నడుచుకుంటూ వస్తున్న బాలుడిని వ్యక్తి తీసుకొని వెళ్తునట్టు స్థానిక సీసీటీవీ ఫుటేజీ రికార్డయ్యాయి. కొడుకు కనిపించకపోవడంతో ఫలక్‌నుమా పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అయిదు బృందాలుగా విడిపోయి కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు. చదవండి: HYD: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య -
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
-
HYD: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కలకలం..
సాక్షి, సరూర్ నగర్: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరూర్ నగర్లో జీఎస్టీ సీనియర్ అధికారిపై దాడి పాల్పడి అతడిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్‌ను చేధించారు. వివరాల ప్రకారం.. సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ అధికారి మణిశర్మ కిడ్నాప్‌నకు గురయ్యారు. అయితే, దిల్‌షుక్‌నగర్‌లోని కృష్ణానగర్‌లో జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్ చేసేందుకు ఆఫీసర్ మణిశర్మ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను షాప్ ఓనర్, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్ చేశారు. జీఎస్టీ ఆఫీసర్‌పై వారు దాడికి పాల్పడ్డారు. ఇక, కిడ్నాప్ సమయంలో నిందితులు వాడిన కారుపై టీడీపీ నేత ముజీబ్ పేరుతో స్టికర్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల్లో టీడీపీ నేత ముజీబ్ అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. ముజీబ్ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి అధికారిని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కిడ్నాప్‌నకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. అనంతరం, నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. -
విశాఖ: గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసు చేధన
సాక్షి, విశాఖపట్నం: నగరంలో కిడ్నాప్ వ్యవహారం వెలుగుచూసింది. ఓ రియల్టర్‌ను భార్యతో సహా కిడ్నాప్ చేశారు దుండగులు. అయితే అంతేవేగంగా స్పందించిన పోలీసులు కేసును చేధించారు. బాధితుల్ని రక్షించడంతో పాటు నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. రియల్టర్ శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు అంతే చాకచక్యంగా చేధించారు. నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. భర్తపై ఛీటింగ్ కేసు.. కిడ్నాపర్ల డిమాండ్ మరోవైపు శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖ కి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు. గతంలో శ్రీనివాస్‌పై విజయవాడ పడమటలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జూన్ 2021లో శ్రీనివాస్ అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ సమయంలో రూ.3 కోట్లు కాజేజినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ తరుణంలో వాళ్ల దగ్గరి నుంచి రూ. 60 లక్షలు డిమాండ్ చేస్తూ కిడ్నాప్‌కు దిగారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుండగా.. ఈస్ట్ ఏసిపి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో రియల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: విశాఖలో అదృశ్యం.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం -
ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్
పీఎం పాలెం(భీవిులి)/ దొండపర్తి(విశాఖ దక్షిణ) : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ కేసులో మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివారాలిలా ఉన్నాయి. కోలా వెంకటహేమంత్‌కుమార్, ఉలవల రాజేష్, బమ్మిడి రాజేష్ మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావులను ఈ నెల 15వ తేదీన కిడ్నాప్ చేశారు. బాధితులను భయభ్రాంతులకు గురిచేసి సుమారు రూ.1.75 కోట్లు వసూలు చేయడంతో పాటు బంగారు నగలు లాక్కున్నారు. నగర పోలీస్ కమిషనర్‌కి ఎంపీ ఘటనపై ఫోన్లో తెలియజేయగా పోలీసులు బృందాలుగా ఏర్పడి సినీ ఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి ఆటకట్టించారు. కిడ్నాప్‌నకు గురైన ఎంపీ భార్య, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. ప్రధాన నిందితుడైన కోలా వెంకటహేమంత్‌కుమార్, అతడికి సహకరించిన ఉలవల రాజేష్, న్యాయవాది బమ్మిడి రాజేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న యర్రోలు సాయి(19), బాడితబోయిన బాలాజీ(24)ను ఆనందపురం హైవే కూడలి వద్ద బుధవారం అరెస్ట్ చేశారు. దమ్ము ఆనందబాబు (26)ను ఆదర్్శనగర్ హైవే రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. వీరి ముగ్గురిదీ గాజువాక. వీరి నుంచి రూ.10 లక్షలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించామన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీకి భద్రత పెంపు ఎంపీ ఎంవీవీకు భద్రత పెంచారు. ఎంపీ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)కు కూడా భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్ జీవీని హేమంత్‌కుమార్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో పోలీసులు హేమంత్‌కుమార్, రాజేష్, సాయితో పాటు మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎంపీకి టూ ప్లస్ టూ, అతని కుటుంబ సభ్యులతో పాటు జీవీకి వన్ ప్లస్ వన్ భద్రతా సిబ్బందిని కేటాయించారు -
మల్కాజ్గిరి కిడ్నాప్ కేసు: చంపేస్తామని బెదిరించి 2కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉందని డీసీపీ జానకి స్పష్టం చేశారు. కాగా, డీసీపీ జానకి ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి అదృశ్యంపై కేసు నమోదైంది. కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. వాట్సాప్ ద్వారా బాలుడి పేరెంట్స్‌కు కాల్ వచ్చింది. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని కిడ్నాపర్లు బెదిరించారు. ఒకే కాలనీలో ఉండేవాళ్లే బాలుడిని కిడ్నాప్ చేశారు. రవి, శివ నెలరోజులుగా బాలుడి కిడ్నాప్‌నకు ప్లాన్ చేశారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉంది. 8 బృందాలతో 36 గంటల్లోనే కేసును ఛేదించాం. జనగామ జిల్లా రామన్నగూడెం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నాం. ప్రధాని నిందితుడు రవి సహా ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాబు తండ్రి శ్రీనివాస్ కిడ్నాప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నాపర్ల నుంచి మా బాబును కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చెబితే బాబును చంపేస్తామని బెదిరించారు. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారని అనుకోలేదు. 1989 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. నాకు, నా కుటుంబానికి శత్రవులు ఎవరూ లేరు అని తెలిపారు. ఇది కూడా చదవండి: నిఘా ఉన్నా కూడా.. కక్కుర్తిపడి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు -
కోటి 75 లక్షలు తీసుకుని ఏం చేసాడు అంటే..!
-
రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది: డీజీపీ రాజేంద్రనాథ్
సాక్షి, మంగళగిరి: విశాఖలో కిడ్నాప్ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ వివరణ ఇచ్చారు. డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయని వెల్లడించారు. రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది. ఏపీ క్రైమ్‌రేట్ తగ్గిందని స్పష్టం చేశారు. కాగా, డీజీపీ రాజేంద్రనాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్ విషయం విశాఖ ఎంపీ ఫోన్ చేసి అక్కడి సీపీకి సమాచారం ఇచ్చారు. ఆడిటర్, ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు సమాచారం వచ్చింది. రిషికొండలో బాధితులు ఉన్నట్టు ట్రేస్ చేశాం. పోలీసులకు సమాచారం వచ్చినట్టు నిందితులకు తెలిసింది. ఎంపీ కొడుకు, భార్య, మరో వ్యక్తిని తీసుకుని మళ్లీ పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. పద్మనాభపురం వరకూ వెళ్లి అక్కడ బాధితులను వదిలి పారిపోయారు. డబ్బు కోసమే ముందుగా ఎంపీ కుమారుడిని కిడ్నాప్ చేశారు. కుమారుడితో ఫోన్ చేయించి తల్లిని రప్పించారు. గంటల వ్యవధితోనే కిడ్నాపర్లను పట్టుకున్నాం. కిడ్నాపర్లు రూ.కోటి 75లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.85లక్షలు రికవరీ చేశాం. కత్తితో చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ఇవాళ నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందనడం సరికాదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయి. రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది. పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టే గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకోగలిగాం. భూ కబ్జాల కేసులు తక్కువ నమోదవుతున్నాయి. గంజాయి పంటలను రెండు సంవత్సరాల నుండి ధ్వంసం చేస్తున్నాం. గంజాయి అమ్మేవాళ్లపై పీడీ యాక్ట్‌లు పెడుతున్నాం. ఒరిస్సా నుండి గంజాయి వస్తోంది.. మన రాష్ట్రంలో గంజాయి సాగు లేదు. నిందితులకు వేగంగా శిక్షలు పడుతున్నాయి అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: పవన్ పార్టీకి అతీగతీ లేదు.. లోకేష్‌ది దిగజారుడు రాజకీయం -
ఆడిటర్ సహా.. విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్
దొండపర్తి (విశాఖ దక్షిణ)/విశాఖ విద్య: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ జీవీ కిడ్నాప్ వ్యవహారం గురువారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. సినీ ఫక్కీలో దుండగులు ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోకి చొరబడి.. ముగ్గురి మెడపై కత్తిపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. 48 గంటల పాటు నిర్బంధించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కానీ, పోలీసులు నాలుగు గంటల్లోనే కిడ్నాపర్ల ఆచూకీ కనిపెట్టి సినిమా స్టైల్లో వెంబడించి రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను అరెస్టుచేయడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వారి చెర నుంచి ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) సురక్షితంగా బయటపడ్డారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో ఐదుగురి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. వివరాలివీ.. కిడ్నాప్ జరిగింది ఇలా.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్ రుషికొండ ప్రాంతంలో తారకరామ లేఅవుట్లో ఉంటున్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం కొందరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. లోపల శరత్ ఒక్కడే ఉండడంతో అతడిని నిర్బంధించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇంకా డబ్బు కావాలని దాడిచేశారు. తన వద్ద లేదని చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజు బుధవారం శరత్‌తో లాసెన్స్ బే కాలనీలో ఉంటున్న తల్లి జ్యోతికి ఫోన్ చేయించారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి రావాలని బలవంతంగా చెప్పించారు. అది నిజమని నమ్మిన అతడి తల్లి జ్యోతి కంగారుగా బుధవారం కొడుకు ఇంటికి వచ్చారు. ఆమెను కూడా బంధించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను కాజేశారు. భారీగా డబ్బులు కావాలన్న ఉద్దేశంతో ఎంపీతో సన్నిహితంగా ఉండే ప్రముఖ ఆడిటర్ జీవీకి జ్యోతితో ఫోన్‌చేసి రప్పించారు. జీవీని కూడా నిర్బంధించి రూ.2 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని ముగ్గురి మెడపై కత్తిపెట్టి బెదిరించారు. దీంతో జీవీ తనకు తెలిసిన వారికి ఫోన్‌చేసి రూ.1.75 కోట్లు సమకూర్చి వారికి అందించారు. అయినప్పటికీ వారిని విడిచిపెట్టకుండా ఇంకా డబ్బులు కావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. మధ్యలో ఎంపీ తన కుమారుడు శరత్‌కు ఫోన్‌చేసినప్పటికీ కిడ్నాపర్ల సూచనల మేరకు మామూలుగానే మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆడిటర్ ఫోన్ ట్రాక్‌కు ఎంపీ వినతి ఐటీ రిటర్నుల పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఎంవీవీ.. ఆడిటర్ జీవీకి బుధవారం మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదు. అతడి సన్నిహితులకు ఫోన్‌చేయగా.. శ్రీకాకుళం వెళ్లినట్లు చెప్పారు. అక్కడి వారికి ఫోన్‌చేసి ఆరా తీస్తే శ్రీకాకుళం కూడా రాలేదని సమాచారమిచ్చారు. గురువారం ఉదయం కూడా ఫోన్ చేసినప్పటికీ జీవీ స్పందించలేదు. ఒకవైపు రిటర్నుల పనులు, మరోవైపు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జీవీకి ఏమైందన్న ఆందోళనతో ఎంపీ విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్‌చేసి అతని నెంబర్‌ను ట్రాక్ చేయాలని కోరారు. వెంటనే పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జీవీ రుషికొండలోనే ఉన్నట్లు గుర్తించారు. అతని డ్రైవర్‌తో పాటు మరికొంత మంది ద్వారా సమాచారం సేకరించి సాంకేతికత సాయంతో విచారణ చేపట్టారు. దీంతో కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి.. మరోవైపు.. రెండ్రోజులుగా ముగ్గురిని ఇంట్లోనే నిర్బంధించిన విషయాన్ని పోలీసులు గుర్తించే అవకాశం ఉందని గ్రహించిన కిడ్నాపర్లు వారిని అక్కడ నుంచి విజయనగరం వైపు తరలించేందుకు ప్రయత్నించారు. శరత్‌కు చెందిన ఆడి కారులో వారిని ఎక్కించుకుని పద్మనాభం నుంచి ఎస్.కోట మీదుగా విజయనగరం వెళ్లేందుకు బయల్దేరారు. పోలీసులు అప్పటికే మొబైల్స్, ఇతర టెక్నాలజీల ఆధారంగా ప్రతి ప్రాంతంలోనూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు చేపట్టారు. వారు ఆనందపురం మీదుగా పద్మనాభం వైపు వెళ్తున్నట్లు తెలుసుకుని వారి కారును వెంబడించారు. ఆనందపురం మండలం పందలపాక గ్రామానికి వారి కారు చేరుకోగానే ముందు నుంచి పద్మనాభం సీఐ బృందం, వెనుక నుంచి పీఎంపాలెం సీఐ బృందాల వాహనాలు అడ్డగించాయి. అయినప్పటికీ కిడ్నాపర్లు కారు ఆపకుండా ముందుకు వెళ్లే ప్రయత్నంలో పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. వెంటనే కారులో ఉన్న కిడ్నాపర్లు రౌడీషీటర్ కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లు బయటకు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. అయితే, వారిని బాకురుపాలెం ప్రాంతంలోనే విడిచిపెట్టినట్లు చెప్పడంతో మరో పోలీస్ బృందం వారికోసం గాలింపు చేపట్టింది. ఇంతలో వారు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్లు తెలుసుకుని వారిని సురక్షితంగా కమిషనరేట్‌కు తరలించారు. హేమంత్‌కుమార్‌పై 12 కేసులు.. భీమిలి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ హేమంత్‌కుమార్ ఇప్పటికే రెండు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకుంటున్నప్పటికీ అతనిపై బ్లాక్‌మెయిలింగ్, కిడ్నాప్‌లు వంటి నేర చరిత్ర ఉంది. 2022లో రామకృష్ణ అనే వ్యక్తిని.. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరి 17న మధుసూధనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్‌చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ రెండు కేసుల్లోను పోలీసులు హేమంత్‌కుమార్‌ను అరెస్టుచేసి జైలుకు పంపించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే మరో కిడ్నాప్‌కు పాల్పడి జైలుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఇతడిపై మొత్తం 12 కేసుల వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎంపీని పరామర్శించిన మంత్రి అమర్నాథ్ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ ఉదంతాన్ని తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ నగరంలోని ఎంపీ ఇంటికి గురువారం సాయంత్రం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిడ్నాప్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో మాట్లాడి, వివరాలు తెలుసుకోమని పంపినట్లు అమర్నాథ్ చెప్పారు. కిడ్నాప్ ఉదంతాన్ని మంత్రికి ఎంపీ వివరించారు. ఆ ఐదుగురు కోసం గాలింపు : సీపీ ఇక కిడ్నాప్ విషయం తెలుసుకున్న వెంటనే 17 బృందాలను ఏర్పాటుచేశామని నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వెల్లడించారు. టెక్నాలజీ ఆధారంగా కిడ్నాపర్ల కదలికలపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేశామని చెప్పారు. నాలుగు గంటల్లోనే కిడ్నాపర్లు కోలా వెంకటహేమంత్కుమార్తో పాటు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఐదుగురి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించామని, వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరికోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీపీ వివరించారు. కేసు దర్యాప్తులో ఉందని, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని త్రివిక్రమ్ వర్మ చెప్పారు. -
విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం.. ముగ్గురు సేఫ్..
-
విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో నలుగురు దుండగులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడుని దుండగులు కిడ్నాప్ చేశారు. ముగ్గురిని అపహరించి రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు. అయితే కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసును పోలీసులు చేధించారు. నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్గా పోలీసులు గుర్తించారు. 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. కాగా గన్నమనేని గతంలో వైజాగ్ స్మార్ట్ సిటీ మాజీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం వైఎస్సార్సీపీ పరిశీలకులుగా బధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగేఓ ఎంపీ వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. -
మరోసారి తెరపైకి మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు
సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైశాలి కిడ్నాప్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వైద్య విద్యార్థినిని అపహరించిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిపై నమోదైన పీడీ యాక్ట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో గతేడాది వైశాలి కిడ్నాప్ కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని నవీన్ డిసెంబర్ 9న కిడ్నాప్ చేశాడు తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై, అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమెను వదిలేశాడు. వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని సైతం పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు రిమాండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు -
ఎంత పని చేశావ్.. తల్లీ! పోలీసులను పరుగులు పెట్టించి చివరికీ..
సాక్షి, నరసరావుపేట/నరసరావుపేట రూరల్: నరసరావుపేటలో కనిపించకుండాపోయిన ఏడాది బాలుడు బావిలో శవమై తేలాడు. కిడ్నాప్ అయ్యాడని బాలుడి తల్లి ఫిర్యాదు చేయడంతో పరుగులు పెట్టిన పోలీసులు పట్టణంలోని 60 సీసీ కెమెరాలను పరిశీలించి.. కిడ్నాప్ జరగలేదని నిర్ధారించుకున్నారు. అనుమానంతో తల్లిని ప్రశ్నించగా.. పిల్లాడిని ఆడిస్తుండగా పొరపాటున బావిలో పడిపోయాడని తెలిపింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటోంది. బావి నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలేం జరిగిందంటే.. పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం బండివారిపాలేనికి చెందిన బండి వాసు, సాయిలక్ష్మి దంపతులకు కుమార్తె మోక్ష, కుమారుడు భానుప్రకాష్ (1) ఉన్నారు. కాగా, వాసు, సాయిలక్ష్మి దంపతులు నరసరావుపేట శివారులోని బ్యాంక్ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తమ ఏడాది కుమారుడు భానుప్రకాష్ కనిపించడం లేదని తల్లి సాయిలక్ష్మి తన భర్త, బంధువులకు సమాచారం అందించింది. దీంతో తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని తండ్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంట్రుకలు కొనుగోలు చేసే వ్యక్తులు శుక్రవారం రెక్కీ నిర్వహించారని, శనివారం సాయంత్రం తమ బాబును అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసును తక్షణమే అక్కడికి బదిలీ చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్బీ సీఐ ప్రభాకర్ తమ సిబ్బందితో ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. దాదాపు 60 సీసీ కెమెరాలను పరిశీలించగా.. బాలుడి ఆచూకీ ఎక్కడా నమోదు కాలేదు. తల్లిని ప్రశ్నించడంతో.. బాలుడు భానుప్రకాష్ ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో బాలుడి తల్లి సాయిలక్ష్మిని రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రహరీపై ఆడుకుంటున్న బాలుడు కిందకు జారి పాత బావిలో పడిపోయాడని సాయిలక్ష్మి తెలిపింది. ఈ విషయం చెబితే భర్త, బంధువులు ఏమంటారోనన్న భయంతో చెప్పలేదని భోరున విలపించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు బావిలో వెతకగా బాలుడి మృతదేహం లభించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాలుడి తల్లి సాయిలక్ష్మి మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో తేలింది. మొదటి కాన్పు సమయంలోనే ఆమె మానసిక సమస్య రావడంతో చికిత్స అందిస్తున్నట్టు భర్త తెలిపారు. నెల రోజుల క్రితం లక్ష్మి తల్లిదండ్రులు క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో 15 రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం చిన్నారి తన చేతుల్లో ఆడుకుంటూ కిందపడిపోవడంతో ఆమె భయపడి బాలుడు కనిపించడం లేదని భర్త, బంధువులకు చెప్పిందని ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: అద్భుతాలు చేస్తున్న అత్తోట రైతులు.. ప్రైవేటు రంగంలో తొలి విత్తన నిధి) -
వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి ఇక్కడకు హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కిన ఎన్.ప్రవీణ్ కుమార్‌పై గతంలో కిడ్నాప్ కేసు ఉంది. 2015లో కూకట్పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు కోర్టులో వీగిపోయింది. ఇప్పటి వరకు అంతా ఆ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని అంతా భావించారు.. భావిస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న ఆసక్తికర కోణాన్ని ప్రవీణ్ ఇప్పుడు పోలీసుల ఎదుట బయటపెట్టాడు. నిజామాబాద్ మహిళ.. దుబాయ్‌లో సహజీవనం... నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడే ఉద్యోగం చేస్తున్న మంచిర్యాలకు చెందిన వ్యక్తితో ఈమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దాదాపు రెండేళ్ల పాటు అతడితో సహజీవనం చేసిన ఆమె ఆపై నిజామాబాద్ తిరిగి వచ్చేసింది. అయితే ఇక్కడ బతకడం కష్టసాధ్యంగా మారడంతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో మళ్లీ విదేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో దుబాయ్‌లో ఉన్న మంచిర్యాల వాసి నుంచి వీలున్నంత డబ్బు గుంజాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అతడిని పదేపదే ఫోన్లు చేసి ‘నిజామాబాద్ వచ్చాక తాను గర్భం దాల్చిన విషయం తెలిసిందని, తనకు మగ బిడ్డ పుట్టాడని, వాడికి తండ్రివి నువ్వే’ అంటూ చెప్పింది. ఆరేళ్లకు అతడు వస్తాననడంతో... తామిద్దరం బతకడానికి ప్రతి నెలా డబ్బు పంపాలని డిమాండ్ చేసింది. అప్పటికే వివాహితుడైన అతడు తన కుటుంబాన్ని మంచిర్యాలలోనే ఉంచాడు. తాను దుబాయ్‌లో మరో మహిళతో సహజీవనం చేసిన విషయం భార్యకు తెలియనీయలేదు. నిజామాబాద్ మహిళను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన అతగాడు ఆమెకు డబ్బు పంపుతూ వచ్చాడు. ఇది జరిగిన ఆరేళ్లకు తాను నిజామాబాద్ వస్తున్నట్లు దుబాయ్ నుంచి సమాచారం ఇచ్చాడు. అలా అతడు వచ్చి తనను కలిస్తే తన బండారం బయటపడటంతో పాటు అసలు విషయం తెలుస్తుందని ఆమె భావించింది. అదే జరిగితే తనకు ప్రతి నెలా వచ్చే డబ్బు రాకపోవడంతో పాటు ఇప్పటి వరకు పంపిందీ తిరిగి ఇమ్మంటాడని భయపడింది. దీంతో అతడు వచ్చేలోపు ఓ ఆరేళ్ల బాలుడు తన వద్ద ఉండాలని భావించింది. అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో అతడు, ప్రవీణ్ కుమార్‌తో సహా మొత్తం ఐదుగురు రంగంలోకి దిగారు. ఈ ఐదుగురిలో కూకట్‌పల్లికి చెందిన వాళ్లూ ఉన్నారు. దీంతో వీళ్లు ఆ ప్రాంతంలో కనిపించిన ఓ ఆరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి నిజామాబాద్‌లో ఆమెకు అప్పగించారు. ఫ్రీగా అప్పగించడం ఇష్టంలేక... దుబాయ్ నుంచి వచ్చిన ‘బాలుడి తండ్రి’ నిజామాబాద్‌లో ఆ మహిళ వద్ద కొన్ని రోజుల పాటు ఉన్నాడు. ఆ చిన్నారి తమకు పుట్టిన బిడ్డగానే భావించాడు. అయితే ఓ రోజు.. ఆ బాలుడు తన కుమారుడు కాదని తెలుసుకొని ఆమెను నిలదీశాడు. ఆ తరువాత వారిని వదిలి మంచిర్యాల వెళ్లిపోయాడు. దీంతో ఆమె బాలుడిని తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా ప్రవీణ్ సహా ఐదుగురికీ చెప్పింది. నిజామాబాద్ వెళ్లి బాలుడిని తీసుకువచి్చన వీళ్లు తల్లిదండ్రులకు అప్పగించడానికి వెనుకాడారు. ఊరికే ఇవ్వడం ఎందుకని భావించి ఎంతో కొంత వసూలు చేసే ప్రయత్నం చేశారు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడు తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులకు ఈ విషయం తెలిసింది. డబ్బు డిమాండ్ విషయం తెలుసుకున్న పోలీసులు వలపన్ని ఐదుగురినీ అరెస్టు చేశారు. అప్పట్లో విచారణలో మాత్రం తాము కేవలం డబ్బు కోసమే ఈ పని చేశామని నిందితులు చెప్పడంతో అలానే రికార్డుల్లోకి ఎక్కింది. -
హిజ్రాల తెగింపు.. రోజంతా హోటల్లో ఉంచి.. అర్థనగ్నంగా వీడియో తీసి!
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో ఓ వ్యక్తిని హిజ్రాలు నిలువు దోపిడీ చేశారు. ఒక రోజు పాటు ఓ హోటల్లో ఉంచుకుని రూ. 4 లక్షలు వసూలు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు షేక్ శ్రీనివాససన్ అశోక్‌నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాలు... ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ శ్రీనివాసన్ (49) గత నెల 30న రాత్రి నగరంలోని ఓ హోటల్లో భోజనం చేసి ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో ఇద్దరు హిజ్రాలు శ్రీనివాసన్‌ను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. ఆటోలో తిప్పుతూ 31 తేదీ రాత్రి వేకువజామున రెసిడెన్సీ రోడ్డులోని హోటల్‌కు తీసుకెళ్లారు. మరో ఇద్దరు హిజ్రాలను పిలిపించుకుని శ్రీనివాసన్‌ను అర్దనగ్నంగా వీడియో తీసి అతడి వద్ద గల గడియారం, ఉంగరం, డెబిట్ కార్డు, బంగారుచైన్, రూ.40 వేల నగదు లాక్కుని బెదిరించి వీడియో వైరల్ చేస్తామని గూగుల్‌పే ద్వారా లక్ష రూపాయలు, డెబిట్‌కార్డు పిన్ నెంబరు తెలుసుకుని రూ.2.90 లక్షలు నగదు డ్రా చేసుకుని ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కిడ్నాప్ హైడ్రామా.. యువకుడిని చితకబాది కారులో ఎత్తుకెళ్లిన యువకులు
సాక్షి, నిజామాబాద్: యువకుడి కిడ్నాప్ హైడ్రామా జిల్లాలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం క్రేటా కారులో వచ్చిన ముగ్గురు ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న నరేశ్‌ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. యువకుడిని చితకబాది కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. అక్కడున్న వారు కారు ఫొటోలను మీడియా, పోలీసులకు పంపించారు. దీంతో మూడోటౌన్ ఎస్సై శ్రావణ్‌కుమార్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పెట్రోకారు బృందంతో పాటు మరో మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కారు నంబర్ ఆధారంగా బోధన్ వీడీసీ అధ్యక్షుడు బాగ య్యదిగా గుర్తించారు. పోలీసులు బాగయ్యను ఫోన్ లో విచారించగా తన అల్లుడైన అఖిలేష్ యాదవ్ ఉదయం ఇంటి నుంచి కారు తీసుకువెళ్లినట్లు చెప్పారు. అఖిలేష్‌యాదవ్‌తో పాటు అతని స్నేహితులు నిఖిల్, సాయికృష్ణ ఉన్నారు. పోలీసులు బాగయ్య కుమారుడు భరత్‌ను పిలిపించి ఫోన్లో కాన్ఫరెన్స్ కలిపి అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడించగా తాను బోధన్‌కు వస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు అఖిలేష్‌యాదవ్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని, యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో నరేశ్‌ను ఎడపల్లి మధ్యలో దింపేశారు. కాగా నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని బాధితుడు నరేశ్ పోలీసులకు తెలిపాడు. అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత ఎడపల్లి మధ్యలో విడిచిపెట్టారని చెప్పాడు. ఎవరినీ తాను టీజ్ చేయలేదని, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఎలాంటి కిడ్నాప్ జరగలేదన్నారు. ప్రేమ వ్యవహారం మాట్లాడినట్లు తెలిపారు. చదవండి: ఇటీవలే యువకుడితో నిశ్చితార్థం.. తల్లి దగ్గరకు వెళ్లొచ్చి..