Paislee Shultis Missing Case: Abducted Child Found After Two Years With Parents - Sakshi
Sakshi News home page

చిన్నారి మిస్సింగ్​! రెండున్నరేళ్ల తర్వాత అమ్మ ఒడిలో.. మైండ్​ బ్లాక్​ అయ్యే ట్విస్టులు ఇచ్చిన కన్నవాళ్లు

Published Wed, Feb 16 2022 6:02 PM | Last Updated on Wed, Feb 16 2022 6:28 PM

Paislee Shultis Missing Case: Abducted Child Found After Two Years With Parents - Sakshi

ఏదో మలయాళం సినిమాను తలపించేలా ట్విస్టుల మీద ట్విస్టులు..​ ఇప్పుడు చెప్పుకోబోయే కేసులో ఉంటాయి.. ఉన్నపళంగా ఓరోజు నాలుగేళ్ల ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో అంతా ఆమె కోసం వెతికారు. మిస్సింగ్​ కేసు నమోదు కావడంతో పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఈ లోపు ఆ చిన్నారి మీద అయినవాళ్లు ఆశలు వదిలేసుకున్నారు.  కానీ, కేసును టేకప్​ చేసిన పోలీసులు, ప్రైవేట్​ డిటెక్టివ్​లు మాత్రం వెనక్కి తగ్గలేదు. రెండున్నరేళ్ల తర్వాత తమకు అందిన ఫోన్​ టిప్​తో ఓ ఇంటిపై దాడి చేశారు. నాటకీయ పరిణామాల నడుమ అక్కడ వాళ్లకు ఊహించని సీన్​ కనిపించడంతో కంగుతిన్నారు. రెండున్నరేళ్లు వెనక్కి వెళ్తే..

అది.. న్యూయార్క్ స్టేట్​లోని కయుగ హైట్స్​ గ్రామం. 2019 జులైలో ఓ రోజు నాలుగేళ్ల చిన్నారి పైస్లీ తన అక్క స్కూల్​కి వెళ్లడంతో ఒంటరిగా బయట ఆడుకుంటోంది. కాసేపటికే చిన్నారి కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది జరిగిన రెండున్నరేళ్ల తర్వాత.. పక్కా సమాచారంతో మొన్న ఫిబ్రవరి 14వ తేదీన సౌగర్​టిస్​(అల్బెనీకి 45 మైళ్ల దూరం..కయుగ హైట్స్​కి 150 మైళ్లకు పైగా దూరం) లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారే.. పైస్లీనే.. రెండున్నరేళ్ల తర్వాత కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. అయితే ఆ చిన్నారి అలా కనిపించడం వెనుక బోలెడన్ని ట్విస్టులు దాగున్నాయండోయ్​​. 

సీక్రెట్​ గదిలో హాయిగా.. 
ఆ చిన్నారి అదే ఇంట్లోనే ఉందన్న సమాచారంతో డిటెక్టివ్​ ఎరిక్​ థెయిలె నేతృత్వంలో సౌగర్​టిస్​ పోలీసులు  సుమారు గంటపాటు సోదా నిర్వహించారు. అంతా వెతికినా లాభం లేకపోయింది. ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించిన ప్చ్​.. ప్రయోజనం కనిపించలేదు. ఇక వెళ్లిపోతున్న క్రమంలో.. డిటెక్టివ్​ ఎరిక్​కు మెట్ల మధ్య ఓ దుప్పటి కప్పి ఉండడం, దాని కింద ఏదో వెలుతురు కనిపించడంతో అనుమానంతో తొలగించి చూశాడు. అక్కడ చిన్న సందు కనిపించింది. అనుమానంతో.. చెక్క మెట్లను పదునైన టూల్స్​తో తొలగించి చూడగా.. ఓ సీక్రెట్​ చాంబర్​లో బయటపడింది. ఆ చాంబర్​లో కింబర్లీ కూపర్ ఒడిలో చిన్నారి పైస్లీ హాయిగా నిద్రపోతూ కనిపించింది. పోలీసుల దాడులు.. ఊహించని ఆ పరిణామంతో ఆ ఇంటి ఓనర్​ క్రిక్​ షుల్టిస్​(సీ.), అతని కొడుకు క్రిక్​ షుల్టిస్​(జూ.)లు బిత్తరపోయారు. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆరేళ్ల వయసున్న చిన్నారి పైస్లీని స్వయంగా దగ్గరుండి డిటెక్టివ్ ఎరిక్​.. ఆమె అక్క దగ్గరికి చేర్చాడు. ఇంతకీ ఈ కిడ్నాప్​కు పాల్పడింది ఆ చిన్నారి కన్నతల్లిదండ్రులే కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్​.

​       

కన్నవాళ్లే వాళ్లు..
పైస్లీ షుల్టిస్​.. క్రిక్​ షుల్టిస్​(జూ.) కింబర్లీ కూపర్ చిన్న కూతురు. కయుగ హైట్స్​లో కాపురం ఉన్న ఈ జంటకు.. ఇద్దరు కూతుళ్లు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. తమ ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతల్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. కోర్టు ఆ పిల్లలను సంరక్షణను అదే ఊరిలో ఉండే ఓ లీగల్​ గార్డియన్​కు(ఐడెంటిటీ రివీల్​ చేయలేదు) అప్పగించింది. దీంతో ​ పైస్లీ షుల్టిస్​, ఆమె అక్కను లీగల్​ గార్డియన్​ దగ్గరికి చేర్చింది ఆ జంట. కానీ, కన్నప్రేమపై మమకారం చంపుకోని ఆ పేరెంట్స్​.. అలా పైస్లీని ఎత్తుకెళ్లి ఈ రెండున్నరేళ్లు తమతో పాటే ఉంచుకున్నారు. మధ్యలో పైస్లీ అక్కను కూడా ఎత్తుకెళ్లాలనే ప్లాన్​ వేసినా.. అది జరగలేదట. పైస్లీ కనిపించకుండా పోయినా టైంలో.. వీళ్లు పడిన బాధ(నటన) వర్ణనాతీతం. అందుకే ఎవరికీ వీళ్ల మీద అనుమానం రాలేదు. అఫ్​కోర్స్​.. ఆ చిన్నారి తాత క్రిక్​ షుల్టిస్​ చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ వాళ్లు పోలీసులకు దొరికేవాళ్లు కాదేమో!.


 
తాతే ఎందుకు పట్టించాడంటే.. 
క్రిక్​ షుల్టిస్​ సీనియర్​, జూనియర్​లు, కింబర్లీ కూపర్​ అరెస్ట్​తో ఆ ప్రాంతం ఒక్కసారిగా షాక్​ తింది. రెండున్నరేళ్లు ఒక చిన్నారిని బయటకు రాకుండా.. జాగ్రత్తగా మ్యానేజ్​ చేయడంపై ఆశ్చర్యపోతున్నారు వాళ్లు. అయితే.. మనవరాలు కొడుకు కోడలుతో సంతోషంగా ఉన్నప్పటికీ.. పైస్లీ అలా ఆ బంధీఖానాలో మగ్గిపోవడం భరించలేకపోయాడట ఆ పెద్దాయన. అందుకే  పోలీసులకు ఆ చిన్నారి గురించి సమాచారం అందించాడు. ఈ రెండున్నరేళ్లలో ఆ పేరెంట్స్​ మీద, ఆ పెద్దాయన మీద పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాలేదంటే అర్థం చేసుకోవచ్చు.. వాళ్లెంత పక్కాగా ఆ చిన్నారిని కాపాడుకున్నారో!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement