Child abduction
-
ప్రభుత్వాస్పత్రిలో శిశువు అపహరణ
మచిలీపట్నం టౌన్: బందరు ప్రభుత్వాస్పత్రిలో తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరుతున్న ఐదు రోజుల శిశువును ఓ మహిళ అపహరించింది. నర్సు వేషంలో వచ్చి.. తల్లితో మాటలు కలిపి.. ఆమె నిద్రపోగానే శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన మచిలీపట్నంలో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన చిట్టూరి స్వరూపరాణి ఈ నెల 8వ తేదీన డెలివరీ కోసం మచిలీపట్నంలోని సర్వజనాస్పత్రిలో చేరింది. 9వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ.. స్వరూపరాణితో మాటలు కలిపింది. కొద్దిసేపటికి స్వరూపరాణి నిద్రలోకి జారుకోగా.. ఆ మహిళ శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాలకు స్వరూపరాణి మెలుకువ వచ్చి లేచి చూడగా.. పొత్తిళ్లలోని శిశువు కనిపించలేదు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు సమాచారం ఇచ్చింది. వారు ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సీసీ టీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. స్వరూపరాణికి సహాయం చేసినట్లు నటించిన నర్సు వేషంలో ఉన్న మహిళే శిశువును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో..కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో సెల్ఫోన్లు చోరీకి గురవ్వడంతో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిందితుడికి.. శిశువును కిడ్నాప్ చేసిన మహిళే బెయిల్ ఇచ్చిందని ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ రాజు పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆమె వివరాలు సేకరించారు. గంటల వ్యవధిలోనే ఆమె ఇంటికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటలకల్లా పోలీసులు శిశువును క్షేమంగా తల్లి స్వరూపరాణి చెంతకు చేర్చారు. దీంతో స్వరూపరాణి సంతోషం వ్యక్తం చేసింది. ఆడబిడ్డ కోసమని..!నిందితురాలిని తమ్మిశెట్టి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక రామానాయుడుపేట సెంటర్లో కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆడబిడ్డ కోసమని తాను శిశువును అపహరించానని నిందితురాలు విచారణలో తెలిపింది. తాను ఎత్తుకొచ్చింది మగ శిశువనే విషయాన్ని గమనించలేదని వెల్లడించింది. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్సు దీవెన, సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ఎస్ఎన్సీయూ విభాగంలోని ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎఫ్ఎన్ఓ, సెక్యూరిటీ గార్డులకు చార్జ్ మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
రక్షణ లేని బాల భారతం!
న్యూఢిల్లీ: దేశంలో బాలలపై నేరాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 53,874 పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. బాలలపై జరిగే నేరాల్లో ప్రతి మూడింటిలో ఒకటి లైంగిక నేరమే కావడం గమనార్హం. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. దేశంలో బాలలపై నేరాలకు సంబంధించి 2020లో 1,28,531 కేసులు, 2021లో 1,49,404 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదిలోనే కేసులు 16.2 శాతం పెరిగాయి. 2021లో పోక్సో చట్టం సెక్షన్ 4, 6 కింద 33,348 కేసులు నమోదయ్యాయి. వీటిలో 33,036 కేసులు బాలికలపై జరిగిన అఘాయిత్యాలకు, 312 కేసులు బాలురపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించినవి. దేశవ్యాప్తంగా బాలల అపహరణలకు సంబంధించి గతేడాది 67,245 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధిక నేరాలు బాలలపై నేరాల వ్యవహారంలో కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 7,783 కేసులు రిజిస్టరయ్యాయి. 2021లో 140 మంది చిన్నారులు అత్యాచారం, ఆపై హత్యకు గురయ్యారు. మరో 1,402 మంది కేవలం హత్యకు గురయ్యారు. అత్యధిక నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే బయటపడ్డాయి. గర్భంలోనే శిశువులను చిదిమేసినట్లు గతేడాది 121 కేసులు రిజిస్టరయ్యాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో 23, గుజరాత్లో 23 నమోదయ్యాయి. ఆత్మహత్య చేసుకొనేలా బాలలను ప్రేరేపించినట్లు 359 కేసులు వచ్చాయి. గత ఏడాది 49,535 మంది చిన్నపిల్లలు కనిపించకుండా పోయారు. గతేడాది బాల కార్మిక చట్టం కింద 982 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికంగా 305 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. బాల్యవివాహ నిషేధ చట్టం కింద గతేడాది 1,062 కేసులు పెట్టగా, ఇందులో ఎక్కువ కేసులు కర్ణాటక, తమిళనాడు, అస్సాంలో నమోదయ్యాయి. -
చిన్నారి మిస్సింగ్! రెండున్నరేళ్ల తర్వాత.. దిమ్మతిరిగే ట్విస్టులు
ఏదో మలయాళం సినిమాను తలపించేలా ట్విస్టుల మీద ట్విస్టులు.. ఇప్పుడు చెప్పుకోబోయే కేసులో ఉంటాయి.. ఉన్నపళంగా ఓరోజు నాలుగేళ్ల ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో అంతా ఆమె కోసం వెతికారు. మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఈ లోపు ఆ చిన్నారి మీద అయినవాళ్లు ఆశలు వదిలేసుకున్నారు. కానీ, కేసును టేకప్ చేసిన పోలీసులు, ప్రైవేట్ డిటెక్టివ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. రెండున్నరేళ్ల తర్వాత తమకు అందిన ఫోన్ టిప్‌తో ఓ ఇంటిపై దాడి చేశారు. నాటకీయ పరిణామాల నడుమ అక్కడ వాళ్లకు ఊహించని సీన్ కనిపించడంతో కంగుతిన్నారు. రెండున్నరేళ్లు వెనక్కి వెళ్తే.. అది.. న్యూయార్క్ స్టేట్‌లోని కయుగ హైట్స్ గ్రామం. 2019 జులైలో ఓ రోజు నాలుగేళ్ల చిన్నారి పైస్లీ తన అక్క స్కూల్‌కి వెళ్లడంతో ఒంటరిగా బయట ఆడుకుంటోంది. కాసేపటికే చిన్నారి కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది జరిగిన రెండున్నరేళ్ల తర్వాత.. పక్కా సమాచారంతో మొన్న ఫిబ్రవరి 14వ తేదీన సౌగర్టిస్(అల్బెనీకి 45 మైళ్ల దూరం..కయుగ హైట్స్‌కి 150 మైళ్లకు పైగా దూరం) లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారే.. పైస్లీనే.. రెండున్నరేళ్ల తర్వాత కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. అయితే ఆ చిన్నారి అలా కనిపించడం వెనుక బోలెడన్ని ట్విస్టులు దాగున్నాయండోయ్. సీక్రెట్ గదిలో హాయిగా.. ఆ చిన్నారి అదే ఇంట్లోనే ఉందన్న సమాచారంతో డిటెక్టివ్ ఎరిక్ థెయిలె నేతృత్వంలో సౌగర్టిస్ పోలీసులు సుమారు గంటపాటు సోదా నిర్వహించారు. అంతా వెతికినా లాభం లేకపోయింది. ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించిన ప్చ్.. ప్రయోజనం కనిపించలేదు. ఇక వెళ్లిపోతున్న క్రమంలో.. డిటెక్టివ్ ఎరిక్‌కు మెట్ల మధ్య ఓ దుప్పటి కప్పి ఉండడం, దాని కింద ఏదో వెలుతురు కనిపించడంతో అనుమానంతో తొలగించి చూశాడు. అక్కడ చిన్న సందు కనిపించింది. అనుమానంతో.. చెక్క మెట్లను పదునైన టూల్స్‌తో తొలగించి చూడగా.. ఓ సీక్రెట్ చాంబర్లో బయటపడింది. ఆ చాంబర్లో కింబర్లీ కూపర్ ఒడిలో చిన్నారి పైస్లీ హాయిగా నిద్రపోతూ కనిపించింది. పోలీసుల దాడులు.. ఊహించని ఆ పరిణామంతో ఆ ఇంటి ఓనర్ క్రిక్ షుల్టిస్(సీ.), అతని కొడుకు క్రిక్ షుల్టిస్(జూ.)లు బిత్తరపోయారు. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేళ్ల వయసున్న చిన్నారి పైస్లీని స్వయంగా దగ్గరుండి డిటెక్టివ్ ఎరిక్.. ఆమె అక్క దగ్గరికి చేర్చాడు. ఇంతకీ ఈ కిడ్నాప్‌కు పాల్పడింది ఆ చిన్నారి కన్నతల్లిదండ్రులే కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్. కన్నవాళ్లే వాళ్లు.. పైస్లీ షుల్టిస్.. క్రిక్ షుల్టిస్(జూ.) కింబర్లీ కూపర్ చిన్న కూతురు. కయుగ హైట్స్‌లో కాపురం ఉన్న ఈ జంటకు.. ఇద్దరు కూతుళ్లు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. తమ ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతల్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. కోర్టు ఆ పిల్లలను సంరక్షణను అదే ఊరిలో ఉండే ఓ లీగల్ గార్డియన్‌కు(ఐడెంటిటీ రివీల్ చేయలేదు) అప్పగించింది. దీంతో పైస్లీ షుల్టిస్, ఆమె అక్కను లీగల్ గార్డియన్ దగ్గరికి చేర్చింది ఆ జంట. కానీ, కన్నప్రేమపై మమకారం చంపుకోని ఆ పేరెంట్స్.. అలా పైస్లీని ఎత్తుకెళ్లి ఈ రెండున్నరేళ్లు తమతో పాటే ఉంచుకున్నారు. మధ్యలో పైస్లీ అక్కను కూడా ఎత్తుకెళ్లాలనే ప్లాన్ వేసినా.. అది జరగలేదట. పైస్లీ కనిపించకుండా పోయినా టైంలో.. వీళ్లు పడిన బాధ(నటన) వర్ణనాతీతం. అందుకే ఎవరికీ వీళ్ల మీద అనుమానం రాలేదు. అఫ్కోర్స్.. ఆ చిన్నారి తాత క్రిక్ షుల్టిస్ చెప్పకపోయి ఉంటే ఇప్పటికీ వాళ్లు పోలీసులకు దొరికేవాళ్లు కాదేమో!. తాతే ఎందుకు పట్టించాడంటే.. క్రిక్ షుల్టిస్ సీనియర్, జూనియర్లు, కింబర్లీ కూపర్ అరెస్ట్‌తో ఆ ప్రాంతం ఒక్కసారిగా షాక్ తింది. రెండున్నరేళ్లు ఒక చిన్నారిని బయటకు రాకుండా.. జాగ్రత్తగా మ్యానేజ్ చేయడంపై ఆశ్చర్యపోతున్నారు వాళ్లు. అయితే.. మనవరాలు కొడుకు కోడలుతో సంతోషంగా ఉన్నప్పటికీ.. పైస్లీ అలా ఆ బంధీఖానాలో మగ్గిపోవడం భరించలేకపోయాడట ఆ పెద్దాయన. అందుకే పోలీసులకు ఆ చిన్నారి గురించి సమాచారం అందించాడు. ఈ రెండున్నరేళ్లలో ఆ పేరెంట్స్ మీద, ఆ పెద్దాయన మీద పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాలేదంటే అర్థం చేసుకోవచ్చు.. వాళ్లెంత పక్కాగా ఆ చిన్నారిని కాపాడుకున్నారో!. -
9 బృందాలు.. 36 గంటలు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో శిశువు అపహరణ మిస్టరీని తొమ్మిది బృందాల సాయంతో 36 గంటల్లో ఛేదించగలిగామని ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. ఆదోనిలో శనివారం పసికందును తల్లిదండ్రులు రేణుకమ్మ, శ్రీనివాసులుకు అందించారు. చంటి బిడ్డకు ‘దిశ’గా నామకరణం చేసి ఆశీర్వదించారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇవీ.. మండగిరికి చెందిన కనకుర్తి ఝాన్సీలక్ష్మి (30), మంజునాథ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆడపిల్ల కావాలనే కోరికతో దత్తత తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఈనెల 3న ఎస్కేడీ కాలనీలోని ప్రైవేట్ నర్సిగ్‌హోమ్ వద్దకు వచ్చి ఆయాగా పని చేస్తున్న యశోదను ఝాన్సీలక్ష్మి సంప్రదించింది. ఆ సమయంలో అలసందగుత్తికి చెందిన పూజారి రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. దీంతో ఝాన్సీలక్ష్మి బురఖా ధరించి, టీకా పేరుతో డ్రామా నడిపి పసిబిడ్డను అపహరించింది. ఫోన్ సంభాషణ ఆధారంగా పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. -
అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి
ముంబై: పిల్లలను అపహరిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతానికి చెందిన అయిదుగురిని ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..రామవ్తార్ ధోబీ అనే వ్యక్తి తన కూతురిని అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో ఆమె తండ్రి అతడిని వెంబడించాడు. తర్వాత ఓ పదిమంది కలిసి అతడిపై దాడి చేయడంతో ధోబీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అయితే వీరిలో అరెస్ట్ అయిన నిందితులను అతిక్ ఖాన్, మొహసిన్ షేక్, అఫ్సర్ వస్తా, హరీష్ సోలంకి, మహ్మద్ అన్సారీలుగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన మిగితా నిందితులను పట్టుకోవడాకి వేట కొనసాగుతోందని తెలిపారు. వీరిపై భారత శిక్షాస్మృతి, మహారాష్ట్ర పోలీసు చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. (చదవండి: భారతీయ అమెరికన్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష) -
భైంసా ఘటన అమానుషం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో నాలుగేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి అమానుషమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో షర్మిలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్ట పురుషోత్తంరెడ్డి, మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సంజీవరావు మద్దతు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రజాసేవ సంస్థ వ్యవస్థాపకుడు రత్నకుమార్ తన అనుచరులతో కలసి షర్మిలకు మద్దతు తెలిపారు. సెంట్రల్ వర్సిటీకి చెందిన ఓబీసీ విద్యార్థి సంఘం నేత కిరణ్ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పూర్తి రీయింబర్స్మెంట్ అందేదని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం 10 వేల లోపు ర్యాంకు వచ్చినవారికి మాత్రమే పూర్తి రీయింబర్స్మెం ట్ ఇస్తున్నారని వాపోయారు. షర్మిల స్పందించిస్తూ తాము అధికారంలోకి వచ్చాక పూర్తి రీయింబర్స్మెంట్ అందిస్తామని భరోసా ఇచ్చారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. -
గర్భవతినని నాటకమాడి బిడ్డను అపహరించింది
ఓ మహిళ ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చింది. ఇక ఆడ బిడ్డ కావాలనుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా ఇక పిల్లలు పుట్టరని డాక్టర్లు నిర్ధారించడంతో నిరుత్సాహానికి గురైంది. ఎలాగైనా తనకు ఆడ పిల్ల కావాలనుకుంది. గర్భం దాల్చినట్లు పుట్టినింటి వారిని నమ్మించింది. ఆ నమ్మకాన్ని నిజం చేసే క్రమంలో తొమ్మిది రోజుల పసి కందును అపహరించింది. పసికందు తల్లి ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు రెండు గంటల్లోనే పసి పాపను తల్లి ఒడికి చేర్చి, నిందితురాలిని కటకటాలకు పంపి శభాష్ అనిపించుకున్నారు. ఆ వివరాలను ఎస్పీ ఫక్కీరప్ప విలేకరులకు వెల్లడించారు. సాక్షి, కర్నూలు : ఆత్మకూరుకు చెందిన చంద్రకళావతికి ప్యాపిలికి చెందిన నాగమద్దయ్యకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చంద్ర కళావతి ప్యాపిలి బాలికల వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆడబిడ్డ కావాలన్న కోరిక చంద్ర కళావతికి ఉన్నా.. అనారోగ్య కారణాల వల్ల పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే పుట్టినింట్లో మరోసారి గర్భం దాల్చినట్లు చెప్పి నమ్మించింది. నాలుగు రోజుల క్రితం భర్తకు చెప్పకుండా పుట్టినింటికి వెళ్లింది. అటు నుంచి కర్నూలు పెద్దాస్పత్రికి చేరుకుంది. కాగా గోనెగండ్ల మండలం చిన్ననెలటూరు గ్రామానికి చెందిన మరియమ్మ, రామాంజనేయులు దంపతులకు ఇద్దరు సంతానం. తొమ్మిదిరోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం చెల్లెలు పుష్పావతి, తమ్ముడు జగదీష్‌తో కలిసి శనివారం ఉదయం చిన్నపిల్లల వార్డుకు వెళ్లింది. అదే సమయంలో మరియమ్మను చంద్ర కళావతి పరిచయం చేసుకుంది. తమది గుత్తి పట్టణమని తోడి కోడలు కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చినట్లు నమ్మించింది. మరియమ్మ చేతిలో ఉన్న బిడ్దను ఎత్తుకొని ఆడిపించుకుంటూ కొద్దిసేపు అక్కడే ఉండి నమ్మకం కలిగించింది. తొమ్మిదిన్నర గంటల సమయంలో వార్డుకు డాక్టర్ చేరుకోవడంతో మరియమ్మ వైద్య పరీక్షలు చేయించుకొని పరీక్షల కోసం సెంట్రల్ ల్యాబ్‌కు వెళ్లింది. ఆ సయమంలో చంద్ర కళావతి చేతిలో బిడ్డను పెట్టి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఆమెతో పాటు తనబిడ్డ కనిపించకపోవడంతో మరియమ్మ మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. యువకుడు తీసిన వీడియోనే ఆధారం.. చంద్ర కళావతి ముఖానికి గుడ్డను కట్టుకొని పసిబిడ్డను తీసుకొని వెళ్లే సయమంలో సమీపంలో ఉన్న ఓ యువకుడు ఫొటో, వీడియో తీశాడు. అంతకుముందు వాళ్ల పాపను కూడా ఆడించేందుకు తీసుకునే ప్రయత్నం చేయగా వారు నిరాకరించారు. మరియమ్మ కూతురును తీసుకొని వెళ్తుండటంతో యువకుడు అనుమానంతో ఫొటో తీసి పోలీస్ గ్రూప్‌లో పెట్టాడు. అప్పటికే దర్యాప్తులో ఉన్న పోలీస్‌లు ఈ ఫొటో ఆధారంగా కేసును ఛేదించారు. మరో వైపు మిస్సింగ్ కేసు.. చంద్ర కళావతి నాలుగు రోజుల క్రితం భర్తకు చెప్పకుండా పుట్టినిల్లు ఆత్మకూరుకు వెళ్లింది. ఆమె ఫోన్ స్పిచ్ఛాఫ్ రావడంతో తప్పిపోయినట్లు భర్త నాగమద్దయ్య ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీస్ వాట్సాప్ గ్రూప్‌లో పసికందును అపహరించిన మహిళ ఫొటోను చూసి ప్యాపిలి ఎస్ఐ మారుతీ శంకర్ చంద్ర కళావతిపై అనుమానం వచ్చి ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా మంచంపై పసికందుతో ఆడుకుంటూ కన్పించింది. పాప ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీయగా సరైన సమాధానం చెప్పక పోవడంతో అనుమానం వచ్చింది. పసిపాపను ఫొటో తీసి మూడో పట్టణ పోలీస్‌లకు పంపగా మరియమ్మ చూసి తనబిడ్డగా గుర్తించింది. దీంతో పోలీస్‌లు చంద్రకళావతితోపాటు శిశువును తీసుకొని ఎస్పీ చేతుల మీదుగా తల్లి ఒడికి చేర్చారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతమై పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బిడ్డను అప్పగించినందుకు తల్లి కన్నీటి పర్యంతమై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. రెండు గంటల వ్యవధిలోనే కేసును చేధించినందుకు ప్యాపిలి ఎస్ఐ మారుతీ శంకర్‌తో పాటు కర్నూలు సబ్‌డివిజన్ పోలీస్ అధికారులందరిని ఎస్పీ అభినందించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి తుషార్ డుడి, ఓఎస్డీ ఆంజనేయులు, డీఎస్పీలు రమణమూర్తి, బాబా ఫకృద్దీన్, మూడో పట్టణ సీఐ తబ్రేజ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
బాలికపై అకృత్యం; పబ్లిక్ టాయిలెట్లో..
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడు ఆమె శవాన్ని పబ్లిక్ టాయిలెట్లో పడేసి అమానుషంగా ప్రవర్తించాడు. ముంబైలోని నెహ్రూ నగర్ విలే పార్లే రైల్వేస్టేషను సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసు స్టేషనుకు చేరుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ..‘ నెహ్రూ నగర్‌లోని చాల్‌కు చెందిన బాలిక గురువారం నుంచి కనపడకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు జుహు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నెహ్రూ నగర్‌లోని ఓ పబ్లిక్ టాయిలెట్లో బాలిక శవం లభించడంతో అక్కడికి చేరుకున్నాం. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. బాలికపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. అతడిపై హత్యా, అత్యాచార, కిడ్నాప్ కేసులతో పాటుగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు. -
బూచోళ్లు దొరికారు..
పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్ భద్రాచలంలో ముగ్గురు పిల్లల అపహరణ హన్మకొండలో మరో బాలుడి కిడ్నాప్ వరంగల్ క్రైం : కాసుల కోసం కక్కుర్తిపడి కన్నవారికి క డుపు కోత మిగులుస్తున్న కిడ్నాప్ ముఠా గుట్టురట్టరుుంది. పిల్లలను ఎత్తుకె ళుతున్న ఇద్దరు బూచోళ్లను, కొనుగోలు చేస్తున్న వ్యక్తులతోపా టు దళారీని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరం తా రెండేళ్లలోపు మగపిల్లలను టార్గెట్‌గా చేసుకుని కిడ్నాప్ చేయడం గమనార్హం. హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కిరణ్‌కుమార్‌తో కలిసి డీఎస్పీ శోభన్‌కుమార్ వివరాలు వెల్లడిం చారు. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన రా గుల గంగు అనే మహిళ, తమిళనాడు రాష్ట్రం లోని కంచివరం జిల్లా పల్లగూడెం గ్రామం నుంచి వలస వచ్చిన అశోక్ ఖమ్మం జిల్లా భ ద్రాచలంలో పూసల దండలు, బొమ్మల వ్యా పారం చేసేవారు. ఈ క్రమంలో పరిచయమైన వీరిద్దరు సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనకు వచ్చారు. సంవత్సరంన్నర నుంచి భద్రాచలం దైవదర్శనానికి తల్లిదండ్రులతో వచ్చే రెండేళ్లలోపు మగపిల్లలను అపహరించేవారు. ఇలా ముగ్గురు పిల్లల భద్రాచలంలో అపహరించారు. అపహరించిన వారిలో మొదటి బాలుడిని అశోక్ తన మేనకోడలు అయిన పు ష్పకు సంతానం లేని కారణంగా ఇచ్చాడు. నెల రోజుల తర్వాత భద్రాచలంలో అపహరించిన మరో బాలుడిని కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం గాజులపేటకు చెందిన బింగి పరంధామ్కు లక్ష రూపాయలకు విక్రయించారు. ఆ తర్వాత పరంధామ్ ప్రోత్సాహంతో నాలుగు నెలల క్రితం భద్రాచలంలో మరో బాలుడిని అపహరించి అతడి ద్వారానే మెట్పల్లి మండల కేంద్రంలోని మటన్వాడకు చెందిన గసిరెడ్డి మహిపాల్‌కు రూ.30 వేలకు విక్రయించారు. ఈ క్రమంలోనే పరంధామ్ ఆదేశాల మేరకు అశోక్, గంగు కలిసి నవంబర్ 9న రాత్రి హన్మకొండ చౌరస్తా ఏనుగులగడ్డలోని ఖాళీ ప్రదేశంలో బుగ్గలు అమ్ముకునే సంచారజాతికి చెందిన తోట కృష్ణవేణి గుడిసె వద్దకు వచ్చారు. కృష్ణవేణి తన ఏడాదిన్నర కుమారుడితో నిద్రిస్తుండగా వారు కూడా ఆమె పక్కనే పడుకున్నారు. తెల్లవారి చూసేసరికి వారిద్దరితోపాటు కుమారుడు కనిపించకపోవడంతో కృష్ణవేణి రోదిస్తూ వెళ్లి హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా ఆ బాలుడిని కిడ్నాపర్లు కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దంకి గ్రామానికి చెందిన వజ్జల చిన్నయ్యకు రూ.75 వేలకు విక్రరుుంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందస్తుగా మధ్యవర్తి పరంధామ్ ద్వారా రూ.50 వేలు తీసుకుని బాలుడిని అప్పగించారు. మిగతా రూ.25 వేల కోసం సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అశోక్, తన కోడలు పుష్పతో కలిసి పరంధామ్ వద్దకు వెళ్లి రూ.25 వేలు అడిగాడు. అరుుతే మరో బాలుడిని తీసుకొస్తే ఈ రూ.25 వేలతో కలిపి మరో రూ.75 వేలు మొత్తం లక్ష ఇస్తానని చెప్పాడు. దీంతో మరో బాలుడిని అపహరించేందుకు వారు మంగళవారం ఉదయం హన్మకొండలోని లక్ష్మీపురం చేరుకున్నారు. వారిద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హన్మకొండ ఎస్సై బి.శ్రీనివాసరావు, ఐడీ పార్టీ కానిస్టేబుల్ వి.వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా తాము గతంలో నలుగురు పిల్లలను కిడ్నాప్ చేశామని, మరో బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వచ్చినట్లు అంగీకరించారు. వారు చెప్పిన చిరునామాలకు వెళ్లి పోలీసులు వెంటనే నిందితులను, నలుగురు పిల్లలను తీసుకొచ్చారు. నలుగురు పిల్లల్లో ఒకరు కృష్ణవేణి కుమారుడు కాగా ఆమెకు అప్పగించారు. మిగతా వారి వివరాలు తెలియకపోవడంతో వారిని హన్మకొండ సీఐ కిరణ్‌కుమార్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చైర్మన్ అనితారెడ్డికి అప్పగించారు. వారిని సంరక్షణార్థం శిశుసంరక్షణ కేంద్రానికి తరలించినట్లు అనితారెడ్డి తెలిపారు. వారిని తల్లిదండ్రులు గుర్తిస్తే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి, వారిని అప్పగిస్తారు.