బాలికపై అకృత్యం; పబ్లిక్‌ టాయిలెట్‌లో.. | Maharashtra Nine Year Old Girl Body Found in Public Toilet | Sakshi
Sakshi News home page

బాలికపై అకృత్యం.. పబ్లిక్‌ టాయిలెట్‌లో శవం

Published Sat, Apr 6 2019 6:42 PM | Last Updated on Sat, Apr 6 2019 6:44 PM

Maharashtra Nine Year Old Girl Body Found in Public Toilet - Sakshi

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడు ఆమె శవాన్ని పబ్లిక్‌ టాయిలెట్‌లో పడేసి అమానుషంగా ప్రవర్తించాడు. ముంబైలోని నెహ్రూ నగర్‌ విలే పార్లే రైల్వేస్టేషను సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసు స్టేషనుకు చేరుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

ఈ ఘటన గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ..‘ నెహ్రూ నగర్‌లోని చాల్‌కు చెందిన బాలిక గురువారం నుంచి కనపడకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు జుహు పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నెహ్రూ నగర్‌లోని ఓ పబ్లిక్‌ టాయిలెట్‌లో బాలిక శవం లభించడంతో అక్కడికి చేరుకున్నాం. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. బాలికపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. అతడిపై హత్యా, అత్యాచార, కిడ్నాప్‌ కేసులతో పాటుగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement