సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో నాలుగేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి అమానుషమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో షర్మిలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్ట పురుషోత్తంరెడ్డి, మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సంజీవరావు మద్దతు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రజాసేవ సంస్థ వ్యవస్థాపకుడు రత్నకుమార్ తన అనుచరులతో కలసి షర్మిలకు మద్దతు తెలిపారు. సెంట్రల్ వర్సిటీకి చెందిన ఓబీసీ విద్యార్థి సంఘం నేత కిరణ్ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పూర్తి రీయింబర్స్‌మెంట్ అందేదని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం 10 వేల లోపు ర్యాంకు వచ్చినవారికి మాత్రమే పూర్తి రీయింబర్స్‌మెం ట్ ఇస్తున్నారని వాపోయారు. షర్మిల స్పందించిస్తూ తాము అధికారంలోకి వచ్చాక పూర్తి రీయింబర్స్‌మెంట్ అందిస్తామని భరోసా ఇచ్చారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment