bhainsa
-
బీజేపీ కార్యకర్తల ఆందోళన పోలీసులతో ఘర్షణ
-
50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది : సీఎం కేసీఆర్
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఏపీలో యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. మూడు గంటల కరెంట్ కావాలా 24 గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.ఎవరో చెప్పారని ఓటు వేయద్దని ఏ పార్టీ మంచి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి ఇంకా రాలేదన్నారు. సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ‘అంకాపూర్ అంటే నాకు బాగా ఇష్టం. అంకాపూర్‌ను రైతులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. తెలంగాణ రాక ముందు కరెంటు లేదు. తాగునీరు సాగు నీరు లేదు.. వలసలు ఉండేవి. దళిత బందు పథకం కనిపెట్టిందే నేను. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తీసేస్తే రైతు బంధు ఎవరికి ఇస్తారు. ధరణి లేకపోతే మళ్లీ వీఆర్వోలు వస్తారు. మళ్లీ అవినీతి వస్తుంది. ప్రజల మధ్యే ప్రజల కోసం ఉండే జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని కేసీఆర్ కోరారు. బైంసా సభలో కేసీఆర్... ‘ఓటు చేతిలో నుంచి జారిపోక ముందే అలోచించాలని, ఓటు వేయడంలో తప్పిదం జరిగితే తీవ్రంగా నష్టపోతాం. 24 గంటల కరెంట్ వద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు. మహరాష్ట్రలో కరెంటు లేదు. మనదగ్గర కరెంటు ఉంది. ముథోల్, తానూర్, లోకేశ్వరం మండలాల్లోని యాభై వేల ఎకరాలకు ఎస్సారేస్పీ నీరు అందిస్తాం. ప్రదానికి మోడికి పిచ్చి పట్టింది. విమానాలు, రైల్వేలు అన్ని ప్రైవేటు పరంచేస్తున్నారు. బైంసాలో బీజేపీ అభ్యర్థిని నిలదీయండి. ఎందుకు మోటర్లకు మీటర్లు పెడుతారని ప్రశ్నించండి. బైంసా అంటేనే యుద్దం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. మతం పేరుతో మంటలు చేలరేగాలనా. రక్తం పారలనా..మీరే అలోచించుకోండి’అని కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలి.. ‘దేశ ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాలి. పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో చూడాలి. తెలంగాణ వచ్చినంకనే ఇంటింటికి నీళ్లిచ్చాం.24 గంటల కరెంట్ ఇచ్చాం.చేనేత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచుతాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు.ధరణి తీసేస్తామని కాంగగ్రెస్ అంటోంది.ధరణి ఉండాలన్నా వద్దా తేల్చుకోవాలి’అని కోరుట్ల సభలో కేసీఆర్ ప్రజలను కోరారు. -
మంచినీటి ప్రాజెక్టు లాంచ్ చేసిన వై.యస్. రాజశేఖరరెడ్డి
-
భైంసాను మైసాగా మారుస్తాం
నిర్మల్: ‘కేసీఆర్‌కు ఇక మూడింది. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే. మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటగా భైంసాను మైసా (మహిషా)గా మారుస్తాం. దత్తత తీసుకుని భరోసా ఇస్తాం. అల్లర్ల బాధితులను ఆదుకుంటాం. వారికి ఉద్యోగాలనూ ఇస్తాం. అందుకే ఐదోవిడత ప్రజాసంగ్రామ యాత్రను ఇక్కడ నుంచి ప్రారంభించాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భైంసా బహిరంగ సభలో చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, రూ.5 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ సాధించిందేమిటని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?, ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి ఏమైంది? దళితబంధు, రుణమాఫీ హామీలు అమలు చేశారా? అని నిలదీశారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభ సభ భైంసా శివారులోని గణేశ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో మంగళవారం నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాపూరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి సహా సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు సభకు హాజరయ్యారు. సభ అనంతరం బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు. భైంసా మండలంలోని గుండెగాం సమీపంలోని శిబిరంలో మంగళవారం రాత్రి బస చేశారు. కాంట్రాక్టర్ కేసీఆర్ చుట్టం బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు తమ సమస్యలపై ఉద్యమం చేస్తే, కాంట్రాక్టర్‌గా ఉన్న కేసీఆర్ చుట్టంతో విద్యార్థులపై కక్ష సాధింపు కేసులను పెట్టించాడని బండి సంజయ్ మండిపడ్డారు. కడెం ప్రాజెక్టు గేట్ల మెయింటనెన్స్‌కు నిధులు ఇవ్వలేనోడు.. రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని ప్రశ్నించారు. భైంసా అంటేనే కేసీఆర్‌కు భయమని, సభకు వచ్చిన జన స్పందనను చూసి ఫుల్ బాటిల్ తాగుతాడని ఎద్దేవా చేశారు. భైంసా ఒంటరిది కాదని, ప్రతీ హిందువు భైంసా వెనుక ఉన్నారని అన్నారు. అల్లర్ల సమయంలో హిందూవాహిని యువకులు బాధితుల పక్షాన చేసిన పోరాటం మరిచిపోలేమన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైంది కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ పాలనలో జరుపుకుంటున్న ప్రత్యేక సభ ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా ప్రజాసంగ్రామ యాత్రను అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వేయిమంది కేసీఆర్‌లు, ఒవైసీలు వచ్చినా బీజేపీని అడ్డుకోలేరన్నారు. కేసీఆర్ ఇప్పుడు ప్రగతిభవన్‌లో ఉన్నాడో, ఫామ్‌హౌస్‌లో ఉన్నాడో తెలియదని, అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పెట్టి, నరేంద్రమోదీని అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారు: ఈటల సీఎం కేసీఆర్ తన చెప్పుచేతల్లో ఉండే పోలీసులతో ప్రజాసంగ్రామ యాత్ర, బహిరంగ సభను అడ్డుకోవాలని చూశారని, కానీ కోర్టు అనుమతి ఇచ్చిందని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు సైతం తమ సమస్యలపై ఉద్యమం చేశారని పేర్కొన్నారు. ఎండనకా, వాననకా ఉద్యమించిన విద్యార్థులకు హట్సాఫ్ చెప్పారు. విద్యార్థుల ఉద్యమంతో సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ దిగివచ్చాడన్నారు. రాష్ట్రంలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో బల్లులున్న అన్నం పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి హాస్టళ్లలో కేసీఆర్ తన మనువడిని ఉంచుతాడా అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో ఉంటూ రాజకీయాలు చేసే సీఎంకు విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకునే తీరిక లేదన్నారు. ప్రస్తుత పాలనలో ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని, కేసీఆర్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సభలో పాదయాత్ర ప్రముఖ్ జి మనోహర్‌రెడ్డి, సహ ప్రముఖ్ టి.వీరేందర్‌గౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డపై దాడి చేస్తారా..: కిషన్‌రెడ్డి నిన్న ఆడబిడ్డ అని కూడా చూడకుండా వైఎస్ షర్మిల వాహనాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టారని, పోలీసులు ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మెట్రో రెండోఫేజ్ను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఈటలను హుజూరాబాద్‌లో ఓడించేందుకే దళితబంధు తెచ్చారని తెలిపారు. అది దళితబంధు కాదని, ఈటల రాజేందర్ బంధు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక, గ్రానైట్, సున్నపుక్వారీల భూములన్నీ కేసీఆర్ కుటుంబానివే అని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి, కుంభకోణాలపై బీజేపీ అధికారంలోకి వచ్చాక దర్యాప్తు చేస్తామని, అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతామని కిషన్‌రెడ్డి చెప్పారు. -
భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా?
భైంసా: భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. భైంసాకు భరోసా కల్పించేందుకే ఇక్కడకు వచ్చానని, అధికారంలోకి రాగానే పేరు మారుస్తామని సంజయ్ స్పష్టం చేశారు. కార్యకర్తలపై పెట్టిన పీడీ యాక్ట్‌లు తీసివేస్తామన్నారు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భైంసాకు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ ప్రసంగించారు. ‘కేసీఆర్ అప్పు చేసిన రూ. 5 లక్షల కోట్లు ఏమయ్యాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఒక్కో బిడ్డకు రూ. లక్ష అప్పు చేస్తాడు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా యుద్ధానికి మేము సిద్ధం’ అని సంజయ్ పేర్కొన్నారు. -
వెయ్యి మంది కేసీఆర్‌లు, ఒవైసీలు వచ్చినా..: కిషన్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకునే యత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైతే జైలుకు వెళ్తాం అని ప్రకటించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. భైంసా సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పోలీసులను ఈ ప్రభుత్వం తమ ఏజెంట్లుగా పని చేయించుకుంటోందని, పోలీసుల తీరు పిల్లి కళ్లు మూసుకున్నట్లు ఉందని, కానీ, ప్రజలు ఇది కళ్లు తెరిచి చూస్తున్నారన్నారు కిషన్‌రెడ్డి. మాట్లాడితే బీజేపీని ఓడిస్తాం, ప్రధాని మోదీని గద్దె దించుతామని స్టేట్మెంట్లు ఇస్తున్నారని, తీరా టైంకి ఫామ్‌హౌజ్‌లో ఉంటున్నారని ఎద్దేవా చేశారాయన. వెయ్యి మంది కేసీఆర్‌లు, ఒవైసీలు, వెయ్యి బీఆర్ఎస్లు, ఎంఐఎంలు వచ్చినా మోదీని అడ్డుకోలేరని అన్నారు. బీజేపీని బీఆర్ఎస్ అడ్డుకుంటుందా? 2024లో బీఆర్ఎస్కు ఒక్క సీటైనా వస్తుందా? అని ప్రశ్నించారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ప్రతీ అవినీతి కుంభకోణం మీద దర్యాప్తు చేయిస్తామని, ప్రతీ పైసా వెనక్కి తెప్పించి ప్రజలకు పంచుతామని ప్రకటించారు కిషన్‌రెడ్డి. సంక్షేమం అంటున్న సీఎం కేసీఆర్ తెలంగాణలో.. ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని, దళితులను సీఎం చేస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదని, మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని, గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయలేదని, సైనిక్‌స్కూల్ ఎందుకు రానివ్వడం లేదని నిలదీశారు. ప్రతీది కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉందని విమర్శించిన కిషన్‌రెడ్డి.. దళిత బంధుకి కారణం హుజురాబాద్ ఉపఎన్నిక, ఈటల రాజేందర్ అని పేర్కొన్నారు. -
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట
-
హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కదలనున్న ‘బండి’.. కండీషన్స్ అప్లై!
సాక్షి, నిర్మల్ జిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర జరుపుకోవాలని తెలిపింది. అలాగే బహిరంగ సభ బైంసా టౌన్లో నిర్వహించడానికి వీళ్లేదని.. సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తేనే సభకు అనుమతించాలని కోర్టు పేర్కొంది. కాగా బండి సంజయ్ పాదయాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ సోమవారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ తీరును ఖండిస్తూ పాదయాత్రకు తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్ పాదయాత్రపై విచారణ చేపట్టింది ఉన్నత న్యాయస్థానం. బైంసా సిటీలోకి పాదయాత్ర వెళ్లదని బీజేపీ తరపున న్యాయవాది రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. దీంతో బైంసాలోకి పాదయాత్ర వెళ్లకుంటే పోలీసులకు అభ్యంతరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సభలు, పాదయాత్రలు రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. చదవండి: హైదరాబాద్ మెట్రోకు అయిదేళ్లు.. తీరని నష్టాలు.. తప్పని సవాళ్లు బైంసాలో టెన్షన్ బండి సంజయ్ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించడంతో సోమవారం బైంసాలో టెన్షన్ నెలకొంది. బైంసాలోని ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ వద్ద ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ వద్ద బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బైంసాలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు పోలీసులు తీరుపై బీజేపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భైంసాలో నిలిచిపోయిన బండి సంజయ్ పాదయాత్ర
-
భైంసాలో టెన్షన్.. టెన్షన్..!
భెంసాటౌన్/ఆదిలాబాద్/హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారె తెలిపారు. భైంసాలో నిర్వహించే సభకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. భైంసాలోని సున్నిత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రతోపాటు సభకు ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రెండు, మూడురోజులుగా ఎంపీ సోయం బాపురావు, ఇతర జిల్లాల నాయకులు భైంసాలోనే మకాం వేసి సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్డి(బి) బైపాస్ రోడ్లో జరిగే భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసిన డీసీసీ మాజీ అ«ధ్యక్షుడు రామారావు పటేల్ ఈ సభావేదికగానే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలో భారీఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం చేసుకున్నారు. బీజేపీ టికెట్ ఆశావహులు సైతం భైంసా రహదారులను ఫ్లెక్సీలతో కాషాయమయం చేశారు. ఈ నేపథ్యంలో బండి యాత్రకు అనుమతి నిరాకరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఎంఐఎంకు భయపడే: సోయం ఎంఐఎంకు భయపడే సంజయ్ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని ఎంపీ సోయం బాపురావ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాసమస్యలను పరిష్కరించలేక బండి యాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ‘న్యాయస్థానం తలుపు తడతాం. న్యాయస్థానం అనుమతి తీసుకుని యాత్ర కొనసాగిస్తాం’అని ప్రకటించారు. ‘సభావేదిక వేసేదాక చూసి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దిగే హెలీప్యాడ్‌ను కూడా పరిశీలించిన పోలీసులు అకస్మాత్తుగా అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉంది’అని పేర్కొన్నారు. యాత్రతో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని భయపడి, అనుమతులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. అడ్డుకోవడం పిరికిపంద చర్య: డీకే అరుణ సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం సీఎం కేసీఆర్ పిరికిపంద చర్యకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రజల కోసం చేస్తున్న యాత్రగా కేసీఆర్ గ్రహించి అనుమతించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజల్లో టీఆర్ఎస్పై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే బీజేపీని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘మత ఘర్షణలు జరుగుతాయనే సాకుతో అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ పోలీసులకు సత్తా ఉంటే యాత్రకు అనుమతివ్వాలి. బందోబస్తులో ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.అయితేనే పోలీస్ వ్యవస్థకు మనుగడ ఉన్నట్లు’అని అరుణ పేర్కొన్నారు. భైంసా సభను అడ్డుకోవడం కుట్ర రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించ తలపెట్టిన భైంసా సభకు అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. తెల్లారితే సభ ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిర్మల్ వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని, ఆయన ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ తనకు తాను నయా నిజాం అనుకుంటున్నారని.. నిజాం మెడలు వంచినట్లే కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం పలికే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జగిత్యాలలో హై టెన్షన్.. బండి సంజయ్ మరోసారి అరెస్ట్ -
బండి సంజయ్‌కు బిగ్ షాకిచ్చిన పోలీసులు.. పాదయాత్రకు బ్రేక్!
సాక్షి, నిర్మల్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. రేపటి(సోమవారం) బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. బండి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వివరాల ప్రకారం.. బండి సంజయ్ పాదయాత్ర రేపటి నుంచి భైంసా నుండి ప్రారంభం కానుంది. కాగా, పాదయాత్ర కోసం బీజేపీ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి. బహిరంగ సభ కూడా ఏర్పాటుచేశారు. ఇక, ఈ పాదయాత్రను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు ఊహించని విధంగా షాక్ తగిలింది. అయితే, భైంసా సున్నితమైన ప్రాంతం కావడంతో శాంతి భద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంతో అనుమతి లేదంటూ పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో, బండి సంజయ్ పాదయాత్రపై టెన్షన్ నెలకొంది. -
సహచరులు వేధిస్తున్నారని విద్యార్థి ఆత్మహత్య
భైంసాటౌన్: సహచరుల వేధింపులతో మనస్తాపం చెందన ఓ విద్యార్థి కళాశాలలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా భైంసాలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర కళాశాలలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఫర్హాన్‌నవాజ్ (17) స్థానిక మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నా డు. ఆదివారం తెల్లవారుజామున కళాశాలలోని ప్రార్థనా మందిరంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఉదయం ప్రార్థన కోసం మందిరంలోకి వెళ్లిన విద్యార్థులు ఫర్హాన్ నవాజ్ చనిపోయి ఉండటం గమనించి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడి జేబులో నుంచి సూసైడ్‌నోట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఫర్హాన్‌నవాజ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్లో ‘కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు నన్ను ‘సార్‌కు రైట్ హ్యాండ్’అంటూ ఆట పట్టిస్తున్నారు. ఈ విష యం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా వారిపై చర్య తీసుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. ఆత్మహత్య చేసుకున్నందుకు వారి ని ఏమీ అనొద్దు’అని ఫర్హాన్ పేర్కొన్నాడు. -
సంజయ్ ఐదో విడత యాత్ర.. భైంసాలో మొదలుపెట్టి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విడతలో 20 రోజులపాటు 12, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200–240 కి.మీ మేర పాద యాత్ర నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీమాత ఆలయంలో పూజ చేసి భైంసాలో మొదలుపెట్టి కరీంనగర్లో ముగించేలా యాత్రకు రూపకల్పన చేశారు. వచ్చేనెల మొదటివారంలో మునుగోడు ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన పక్షంలో యాత్ర తాత్కాలికంగా వాయిదాపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 4 విడతల్లో 1,260 కి.మీ. గతేడాది ఆగస్టు 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంజయ్ పాదయాత్ర మొదలుకాగా మధ్య మధ్యలో బ్రేక్‌లు ఇస్తూ 4 విడతలు సాగింది. నాలుగో విడత ఈ నెల 22న రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో ముగిసింది. నాలుగు దశల్లో మొత్తం 102 రోజులపాటు 48 అసెంబ్లీ స్థానాల్లో 1,260 కి.మీ మేర సాగింది. ఒక్కో విడతలో భిన్నమైన సమస్యలు, అంశాలను ఎంచుకుని యాత్ర సాగింది. (క్లిక్: కేసీఆర్ పర్యటనల కోసం రూ.80 కోట్లతో ప్రత్యేక విమానం) -
రాజాసింగ్‌ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా? మహ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొదట బెయిల్ వచ్చినా, రెండోసారి మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాని బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఎందుకని? హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదంగా మారి భారతీయ జనతా పార్టీ వేటుకు గురయ్యారు. మరోవైపు మొదటిసారి జరిగిన పొరపాటును సరిచేసుకుని పీడీ యాక్ట్ పెట్టి మరీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్ తీసుకుని ఇంట్లోనే ఉంటున్న రాజాసింగ్‌ను ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనపై గతంలోనే ఉన్న రౌడీ షీట్ ఆధారంగా బెయిల్ రాకుండా పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకుల నుంచి పెద్దగా స్పందన కానరావడంలేదు. ప్రవక్త మీద వివాదాస్పద కామెంట్స్ చేసిన జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను కూడా పార్టీ సస్పెండ్ చేశారు కమలనాథులు. ఇప్పుడు మునావర్ కామెడీ షో తో రాజాసింగ్ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. దీంతో అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు రాజాసింగ్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. సాధారణంగా ఏవైనా ఆందోళనలు చేసినపుడు అరెస్టులు జరిగితే పార్టీ నేతలు వెంటనే రంగ ప్రవేశం చేసి ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తారు. అయితే రాజాసింగ్ విషయంలో మాత్రం బీజేపీ ఆయన్ను పూర్తిగా వదిలించుకున్నట్లుగా కనిపిస్తోంది. తొలినుంచీ పార్టీ నాయకులతో విభేదిస్తూ.. పార్టీ విధానాలకు భిన్నంగా నడుచుకునే రాజాసింగ్ అంటే పలువురు నేతలు కోపంగానే ఉంటారనేది అందరికీ తెలిసిందే. రాజాసింగ్ వ్యవహారంతో పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆలోచనతోనే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఢిల్లీ పెద్దలు ఎమ్మెల్యే మీద ఆగ్రహంతో ఉన్నపుడు మనకెందుకులే అనుకున్న రాష్ట్ర నాయకులు కూడా రాజాసింగ్‌ను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన్ను దూరంగా ఉంచితేనే ప్రస్తుతానికి పార్టీకి మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. కాని తనకు పార్టీ కంటే ధర్మమే ముఖ్యమంటున్నారాయన. పార్టీ అధిష్టానానికి తాను సంపూర్ణంగా వివరిస్తూ త్వరలో లేఖ రాస్తానని చెప్పుకుంటున్నారు రాజాసింగ్. కాగా, బీజేపీ క్రమశిక్షణ కమిటీకి రాజాసింగ్ భార్య మెయిల్ చేశారు. రేపటితో(సెప్టెంబర్2) రాజాసింగ్‌కు పార్టీ ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ భార్య.. బీజేపీ క్రమశిక్షణ కమిటీకి మెయిల్ చేశారు. రాజాసింగ్ జైలు ఉండటంతో మరికొంత సమయం ఇవ్వాలని మెయిల్లో పార్టీ క్రమశిక్షణా కమిటీని కోరినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెండ్ చేసిన బీజేపీ.. ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
రాజాసింగ్ అరెస్ట్ ఎఫెక్ట్.. షాపులు, పాఠశాలలు బంద్
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసులను ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. కాగా, బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి? -
ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే
సాక్షి, ఆదిలాబాద్: భైంసా పట్టణంలోని రాహుల్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై హ న్మాండ్లు కథనం ప్రకారం.. ముధోల్‌కు చెందిన మౌనిక(21)కు తానూర్ మండలం బెంబర గ్రామానికి చెందిన చుక్కబొట్ల అనిల్‌తో ఏడాదిన్నర కిందట వివాహం జరుగగా, భైంసాలోని రాహుల్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య స్వల్ప తగాదా తలెత్తింది. దీంతో మౌనిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త తలుపు తీసి చూడగా, బాత్రూంలో ఉరివేసుకుని కనిపించింది. వీరికి తొమ్మిదినెలల బాబు ఉన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆ ఎంపీడీవో నలుగురు చెల్లెల్లు ప్రభుత్వ ఉద్యోగులే.. మరో చెల్లె, తమ్ముడు..
సాక్షి,భైంసా(అదిలాబాద్): భైంసా ఎంపీడీవోగా పనిచేస్తున్న అర్ల గంగాధర్ తోబుట్టువులంతా ప్రభుత్వ కొలువులు సాధించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లోని భాగ్యనగర్‌కాలనీలో అర్ల గంగాధర్ కుటుంబం నివసిస్తుంది. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన అర్ల గంగారం–లక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. ఇందులో పెద్దవాడైన గంగాధర్‌తోపాటు అందరినీ ఈ దంపతులు చదివించారు. అర్ల గంగారాం కోపరేటివ్ బ్యాంకులో పనిచేసేవారు. లక్ష్మి నిరక్ష్యరాసురాలు. అందరిలో పెద్దవాడైన గంగాధర్ 2001–05వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తర్వాత గ్రూప్–2 ఉద్యోగం సాధించాడు. 2017 మార్చి 1 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశాడు. ఆయన సహచరిని కరుణశ్రీ మల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గంగాధర్ అటు తర్వాత మళ్లీ ఎక్సైజ్‌శాఖలో కూడా కొలువు సాధించాడు. మూడు ఉద్యోగాలు సాధించిన గంగాధర్ తన తోబుట్టువులైన ఐదుగురు చెల్లెల్లు, ఒక తమ్ముడిని సైతం చదివించాడు. నలుగురు చెల్లెల్లు ప్రభుత్వ కొలువులు సాధించగా మరో చెల్లె, తమ్ముడు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉద్యోగం సాధిస్తామని చెబుతున్నారు. డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా నాలుగవ చెల్లె భాగ్యలక్ష్మి ఆదిలాబాద్ ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా కొలువు సాధించింది. ఎంతో కష్టపడి చదివి లెక్చరర్‌గా ఎంపికైంది. చిన్నతనం నుంచి అక్కయ్యలతో కలిసి చదివి తన ప్రతిభతో ఉద్యోగం సాధించింది. – భాగ్యలక్ష్మి, ఉమెన్స్ డిగ్రీ కళాశాల లెక్చరర్ ఆదిలాబాద్ ప్రైవేటు అధ్యాపకుడిగా గంగాధర్ తమ్ముడు శశిధర్ ఎంఏ బీఎడ్ పూర్తిచేశాడు. ఈయన ప్రైవేటు డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అన్నయ్య సహకారంతోనే చదువు పూర్తిచేశాడు. ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించి తీరుతానని చెబుతున్నాడు. కుటుంబంలో ఉన్నవారంతా ఉద్యోగాల్లో ఉన్నారని ఇక తాను కూడా ఉద్యోగం సాధిస్తానని చెబుతున్నాడు. – శశిధర్, ప్రైవేటు డిగ్రీ కళాశాల లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఐదవ చెల్లె ఉదయరాణి ఖమ్మం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా రు. 2019లో జూనియర్ లెక్చరర్‌గా కొలువుసాధించిన ఉదయరాణి ఏడాదిలోనే మళ్లీ డిగ్రీ లెక్చరర్‌గా ఎంపికైంది. చదువులో చురుకుగా ఉండే ఉదయరాణి గ్రూప్–1కు సైతం సిద్ధమవుతుంది. – ఉదయరాణి, ఖమ్మం డిగ్రీ కళాశాల లెక్చరర్ కష్టపడితేనే ఫలితం మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం. ఐదుగురు చెల్లెళ్లు్ల, తమ్ముడిని కష్టపడి ఉన్నత చదువులు చదివించాం. నలుగరు చెల్లెల్లు ప్రభుత్వ కొలువులు సాధించారు. ఈ నోటిఫికేషన్లో నా తోబుట్టువుల్లో మిగిలి ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారని నమ్మకం ఉంది. కష్టపడి చదివితే ఫలితాలు వస్తాయి. ఎంత పోటీ ఉన్న ప్రతిభ ఉన్న వారికి కొలువులు వచ్చితీరుతాయి. – అర్ల గంగాధర్, ఎంపీడీవో భైంసా అంగన్వాడీ టీచర్‌గా గంగాధర్ మొదటి చెల్లె గంగామణి కుభీర్ మండలం చొండి అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఉపాధ్యాయురాలిగా అన్నింటిల్లోనూ ముందువరుసలో ఉంటుంది. ఆమె పనితీరుకు మెచ్చి ఐసీడీఎస్ అధికారులు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సైతం సన్మానించారు. కోచింగ్ ఇస్తూ రెండవ చెల్లె సంతోషిణి ఎంఏ బీఎడ్ పూర్తిచేసింది. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న సంతోషిణి ప్రతిఏటా గురుకుల పాఠశాలలో నిర్వహించే ప్రవేశపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇస్తుంది. సంతోషిణి వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులంతా ఉద్యోగాలు సాధించారు. – సంతోషిణి, ప్రైవేటు ఉపాధ్యాయురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా మూడవ చెల్లె లావణ్య ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సొనాలలో కష్టపడి చదువుకున్న లావణ్య పెద్దన్న గంగాధర్ సహకారంతో ఉద్యోగాన్ని సాధించింది. అన్నయ్య చెప్పిన విధంగా నడుచుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ గ్రూప్–2కు సైతం సిద్ధమవుతుంది. – లావణ్య, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చదవండి: Pub Drugs Case: డ్రగ్స్ అమ్మేది వాళ్లే.. ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు -
భర్త దుబాయ్‌లో ఉండగా.. తలుపులు బద్దలు కొట్టి వివాహిత చేయి పట్టుకుని..
సాక్షి, భైంసా(ఆదిలాబాద్): లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన వివాహిత పై గతనెల 24వ తేదీన లైంగిక దాడికి యత్నించినట్లు బాధిత మహిళ స్థానిక పోలీస్స్టేన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నగర్ గ్రామానికి చెందిన వివాహితకు 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. బతుకుదెరువు కోసం భర్త దుబాయ్ వెళ్లగా ఇద్దరు చిన్నపిల్లలతో ఇంట్లోనే ఉంటోంది. గత 24న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఫారుక్, అజామ్‌లు తలుపులు కొట్టాడు. వివాహిత కిటికిలో నుంచి చూసి తలుపులు తీయలేదు. ఫారుక్ తలుపులు తొలగించి లోనికి వచ్చి చేయి పట్టుకుని కొట్టి లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయగా పక్కనే ఉన్న మామ ఎవరని అరవగా అతడు పారిపోయాడు. ఎవరికైన చెబితే ఇద్దరు పిల్లలను చంపుతానని బెదిరించడంతో ఈ విషయం చెప్పలేదు. రెండు రోజుల క్రితం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం మధ్యాహ్నం బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై సాయికుమార్ని వివరణ కోరగా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. చదవండి: యువకుడి ప్రేమలో పడి.. శారీరకంగా కలిసి.. చివరికి పోలీస్‌స్టేషన్‌లో.. -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
భైంసా/భైంసాటౌన్ (ముధోల్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేయడం నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ధ్వంసం చేయడంతో విగ్రహం చేయి, కంటిభాగం పాక్షికంగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు, యువకులు అక్కడికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. దుండగుడిని తమకు అప్పగించాలంటూ రాస్తారోకో చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న భైంసా ఏఎస్పీ కిరణ్‌ఖారె నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఆందోళన విరమించాలని సూచించారు. అయినా వినకుండా ఆందోళనకారులు బస్సు లపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించి ఆందోళనకారులను అదుపు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో మూడు రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ విశ్వంబర్ ప్రకటించారు. -
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై కేసు నమోదు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై భైంసా పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివిధ వర్గాల వారిని రెచ్చగొట్టేలా ఎంపీ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ మేరకు సుమోటోగా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. చదవండి: లాక్‌డౌన్‌లోనూ అద్భుత ప్రగతి సాధించాం -
తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం
భైంసా టౌన్: 200 ఏళ్లకుపైగా పురాతన శివాలయం, ప్రకృతి ఒడిలో, పచ్చని చెట్ల మధ్య వెలిసింది. పక్కనే జలపాతం అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, ఎతైన గుట్టలు, పక్కనే జాలువారే జలపాతం.. వీటి మధ్యన వెలిసిన పురాతన శివాలయం.. వెరసి కుభీర్ మండలంలోని బ్రహ్మేశ్వరాలయం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో పూజలు చేసేందుకు శని, సోమవారాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చి పూజలు చేస్తారు. గ్రామం: బ్రహ్మేశ్వర్, మండలం: కుభీర్ భైంసా నుంచి దూరం: 20 కి.మీ(దాదాపు) ఆలయ చరిత్ర... బ్రహ్మేశ్వర ఆలయానికి దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వనవాసం సమయంలో రామలక్ష్మణులు, సీత ఇక్కడ సంచరించారని, శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేశారని నమ్ముతారు. తమ తాతల కాలం నుంచి ఆలయం ఉందని, శివరాత్రితోపాటు ఏటా శ్రావణమాసంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారని చెబుతున్నారు. ఆకట్టుకునే వాతావరణం.. భైంసా నుంచి దాదాపు 20కి.మీ దూరంలో ఉండే బ్రహ్మేశ్వర్ గ్రామంలోని బ్రహ్మేశ్వరాలయం పరిసరాలు, అక్కడి వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయ సమీపంలోని జలపాతంలో స్నానాలు చేస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు దూరప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు. పురాతన ఆలయంగా ప్రసిద్ధి.. కొత్త పంచాయతీలతో బ్రహ్మేశ్వర్ జీపీగా ఏర్పడింది. ఇక్కడి శివాలయానికి దాదాపు 200ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. - దత్తురాం, బ్రహ్మేశ్వర్ గ్రామస్తుడు -
భైంసా అల్లర్లు: అనుమతి ఇవ్వకపోతే చస్తా!
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లలో అరెస్టు అయిన తన కొడుకును కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని భైంసా పట్టణానికి చెందిన సురేఖ ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకును చూసేందుకు గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితో కలిసి జిల్లా ఆదిలాబాద్ జైలుకు రాగా సిబ్బంది అనుమతి నిరాకరించారు. తన కొడుకుతో మాట్లాడించకపోతే జైలు ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. 15 రోజుల కింద తన కొడుకు గోకుల్‌ను అరెస్టు చేసి ఇక్కడికి తీసుకువచ్చారని, అప్పటి నుంచి కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదని కన్నీరుపెట్టుకుంది. తన కొడుకును చూసేంత వరకూ వెళ్లేంది లేదని జైలు ఎదుట బైటాయించింది. అనంతరం జిల్లా జైలర్ శోభన్‌బాబు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జడ్జి ఆదేశాల మేరకు గోకుల్‌ను పోలీస్ కస్టడీలో ఉంచారని, అతడిని కలవడానికి అనుమతి లేదని వివరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మిలాకత్ ప్రారంభిస్తామని, అప్పుడు వచ్చి కలువచ్చని తెలిపారు. చదవండి: భైంసా అల్లర్లు: కీలక విషయాలు వెల్లడించిన ఐజీ -
భైంసా ఘటన అమానుషం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో నాలుగేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి అమానుషమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో షర్మిలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మిట్ట పురుషోత్తంరెడ్డి, మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సంజీవరావు మద్దతు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రజాసేవ సంస్థ వ్యవస్థాపకుడు రత్నకుమార్ తన అనుచరులతో కలసి షర్మిలకు మద్దతు తెలిపారు. సెంట్రల్ వర్సిటీకి చెందిన ఓబీసీ విద్యార్థి సంఘం నేత కిరణ్ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పూర్తి రీయింబర్స్మెంట్ అందేదని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం 10 వేల లోపు ర్యాంకు వచ్చినవారికి మాత్రమే పూర్తి రీయింబర్స్మెం ట్ ఇస్తున్నారని వాపోయారు. షర్మిల స్పందించిస్తూ తాము అధికారంలోకి వచ్చాక పూర్తి రీయింబర్స్మెంట్ అందిస్తామని భరోసా ఇచ్చారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. -
భైంసా అల్లర్లు: కీలక విషయాలు వెల్లడించిన ఐజీ
సాక్షి, హైదరాబాద్: భైంసాలో జరిగిన అల్లర్లలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. అల్లరకు ప్రధాన కారణం హిందూవాహిని కార్యకర్తలే అని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ‘ఈనెల 7వ తేదీన రాత్రి 8.20 గంటలకు గొడవ మొదలైంది.. అందులో ప్రధానంగా హిందూవాహినికి చెందిన తోట మహేశ్, దత్తు పటేల్ అనే ఇద్దరు బైకుపై వెళ్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రిజ్వాన్ అతని మిత్రులు సమీర్, మిరాజ్‌లను వెనక నుంచి తలపై కొట్టారు. కోపంతో ఈ ముగ్గురు మహేశ్‌ను వెంబడిస్తూ బట్టీ గల్లీలోకి వెళ్లి వెదకడం ప్రారంభించారు’’ అన్నారు. ‘‘ఈ క్రమంలోనే ఆ ముగ్గురిపై దత్తు, మహేశ్.. రాకేశ్, గోకుల్‌తో కలసి దాడి చేశారు. అనంతరం ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత మద్యం కొనేందుకు దత్తు బైక్‌పై జుల్ఫికర్ మసీద్ ప్రాంతం నుంచి వెళ్లే క్రమంలో మరో వర్గం ఎదురుపడటంతో మళ్లీ ఘర్షణ మొదలైంది. ఆ సందర్భంగా రమణా యాదవ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌పై ఇటుకతో దాడి చేసి తల పగులగొట్టాడు. అక్కడ ఓ నిర్మాణం కోసం వచ్చిన ట్రక్కులో తెచ్చిన ఇటుకలున్నాయి. వీటిని ఆయుధాలుగా చేసుకుని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ, సీఐ కేవలం గంటన్నర నుంచి రెండు గంటల్లోగా అల్లర్లను అదుపుచేశారు’’ అని తెలిపారు. ‘‘వీరితో పాటు ఎస్పీ విష్ణు వారియర్ అతని బలగాలు, ఇతర జిల్లాల నుంచి రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ, అడిషనల్ ఎస్పీలు తమ బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ అల్లర్లలో 15వ వార్డు కౌన్సిలర్ ఎంఐఎం పార్టీకి చెందిన అబ్దుల్ కరీం అతని అనుచరులు, హిందూవాహినికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ తోట విజయ్ వర్గీయులు పాల్గొన్నారు. ఏడో తేదీ తర్వాత 8, 9, 10వ తేదీల్లో పార్థి, మహాగావ్ భైంసా శివార్లలో జరిగిన అల్లర్లలో హిందూవాహినికి చెందిన సంతోష్, క్రాంతి, లింగోజీ, బాలాజీ, జగదీశ్ పాత్ర ఉన్నట్లు గుర్తించాం. సంతోష్‌కు హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు చెప్పడంతోనే హింసకు దిగారు. లింగోజీ అల్లర్లలో స్పెషలిస్ట్.. గత అల్లర్లలోనూ ఇతని పాత్ర ఉంది. ఇవీ.. ఈ మొత్తం వ్యవహారానికి దారితీసిన పరిస్థితులు. భైంసాలో 500 మంది పోలీసులతో ఎస్పీ వారియర్ ఆధ్వర్యంలో నిరంతర గస్తీతోపాటు 27 పికెట్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ భైంసాలో శాంతిని పునఃస్థాపించాం. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదు. సంతోష్ అతని అనుచరులను అరెస్టు చేయగానే.. అల్లర్లు మొత్తం ఆగిపోయాయి..’ అని వివరించారు. 26 కేసులు..42 మంది అరెస్టు ఇక ఇద్దరు విలేకరులతో కలిపి మొత్తం 12 మంది పౌరులకు అల్లర్లలో గాయాలయ్యాయని నాగిరెడ్డి తెలిపారు. ‘13 షాపులు, 4 ఇళ్లు, 4 ఆటోలు, 6 ఫోర్‌వీలర్లు, 5 టూవీలర్లను దహనం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో భైంసాలోని సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్ కాల్స్ వివరాలు తదితర సాంకేతిక ఆధారాలతోపాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఘటనకు సంబంధించి 26 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 38 మందితోపాటు నలుగురు మైనర్లను కలిపి మొత్తం 42 మందిని అరెస్టు చేశాం. అల్లర్ల సమయంలో రోడ్లపైకి వచ్చిన 70 మందిని గుర్తించాం. మరో 66 మందిని బైండోవర్ చేశాం. ఈ విషయాన్ని పోలీసు శాఖ చాలా తీవ్రంగా తీసుకుంది. అందుకే, శాంతి భద్రతల విషయాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ పర్యవేక్షిస్తుండగా, కేసుల దర్యాప్తు పర్యవేక్షణకు కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డికి అప్పగించాం. ఇలాంటి ఘటనలు పునరావృతం చేయాలని చూసేవారిపై పీడీ కేసులు నమోదు చేస్తాం. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి. అల్లర్లలో పాల్గొన్న నిందితులు శిక్షలు పడేలా చూస్తాం. ఘటనతో సంబంధమున్న వారు ఏ పార్టీ, సంస్థకు చెందిన వారైనా సరే అరెస్టు చేస్తాం. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసుకుంటున్నాం.. అందుకే సీనియర్లను కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షించేలా ఏర్పాటు చేశాం. అల్లర్లు చెలరేగిన 5 నుంచి 10 నిమిషాల్లోపే అదనపు బలగాలు చేరుకుని అదుపు చేశాయి. భైంసాలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి విషయంలోనూ పోలీసు దర్యాప్తు సజావుగా సాగుతోంది. అయితే బాధితులు చిన్నారిని భైంసా ఆసు పత్రికి తీసుకెళ్తే.. వారిని వెనక్కి పంపారు. ఈ ఒక్క పొరపాటు తప్ప కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగలేదు..’అని వెల్లడించారు. ఆ ఐపీఎస్‌లపై హత్యాయత్నం కేసు పెట్టాలి: బండి సంజయ్ భైంసా అల్లర్లపై న్యాయ విచారణ చేపట్టాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ కైలాస్‌నగర్(ఆదిలాబాద్): భైంసా అల్లర్ల విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి హిందూవాహిని కార్యకర్తలు, అమాయక హిందూ యువకులను అమానుషంగా హింసించిన ఐపీఎస్ అధికారులపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న హిందూవాహిని కార్యకర్తలను పరామర్శించేందుకు మంగళవారం అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి.. హిందూ పరిరక్షణ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేసి దారుణంగా హింసించారని దుయ్యబట్టారు. హిందూవాహిని నేతలు సంతోష్, లింగోజి, క్రాంతి (18) అనే యువకుడిని ప్రొహిబిషన్‌లో ఉన్న పోలీసులతో కొట్టించారని ఆరోపించారు. దీన్ని వదిలిపెట్టే ప్ర సక్తే లేదని, న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హిందూ వ్యతిరేకులను పెంచి పోషిస్తున్నారని, బాలికపై అత్యాచారం జరిగినా çస్పందించని ఏకైక సీఎం ఆయనేనని విమర్శించా రు. భైంసా పట్టణాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కబంధహస్తల నుంచి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అల్లర్ల ఘటనపై ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో హిందూవాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తదితరులున్నారు. చదవండి: భైంసాలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల అవస్థలు -
భైంసాలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల అవస్థలు
సాక్షి, రాయికల్(జగిత్యాల): నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను ఆ జిల్లావ్యాప్తంగా నిలిపివేశారు. దీంతో కరోనా కారణంగా వర్క్‌ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన చౌడారపు మహేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది. మద్దిపడగలో ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో జగిత్యాల జిల్లా రాయికల్‌లోని బంధువుల ఇంటికి వచ్చి విధులు నిర్వర్తిస్తోంది. తండ్రితో కలిసి మోటార్‌సైకిల్‌పై సుమారు 40 కిలోమీటర్లు రోజూ వచ్చి వెళ్తోంది. శనివారం కూడా వచ్చి విధులు నిర్వర్తించి వెళ్లింది. ఇదేవిధంగా అనేకమంది ఇంటర్నెట్ సదుపాయం కోసం ఇతర జిల్లాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. -
భైంసా ఘటనలు దురదృష్టకరం
భైంసా/ భైంసా టౌన్/ భైంసా రూరల్: నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, రాజకీయ లబ్ధి కోసమే కొందరు టీఆర్ఎస్పై బురద జల్లుతున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకీతో కలసి శనివారం ఆయన భైంసా మండలం మహాగాంలో పర్యటించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనలో ఆస్తులు నష్టపోయిన బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి భైంసాకు చేరుకుని స్థానిక బస్టాండ్ వద్ద దహనమైన దుకాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అల్లర్ల వెనుక ఏ రాజకీయ పార్టీకి చెందినవారు ఉన్నా ఉపేక్షించేది లేదని అన్నారు. తరచూ జరుగుతున్న ఘర్షణలు ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో భైంసా పట్టణంపై దృష్టి సారించిందని తెలిపారు. ఇలాంటి సమయంలో భైంసా ప్రజలకు అండగా నిలిచేది పోయి రాజకీయం చేయడం పద్ధతి కాదన్నారు. -
భైంసాలో కొనసాగుతున్న144 సెక్షన్
-
భైంసాలో ఉద్రిక్తత.. ఇంటెర్నెట్ సేవలు బంద్
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన గొడవల ప్రభావంతో మంగళవారం కూడా హైఅలర్ట్ కనిపించింది. పట్టణమంతా పోలీసు పికెటింగ్‌లు, పెట్రోలింగ్ వాహనాలు తప్ప జనాలెవరూ రోడ్లపైకి రాలేదు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, మెడికల్ షాపులు, కూరగాయలు, కిరాణా, ప్రైవేట్ ఆస్పత్రులు కూడా మూసే ఉన్నాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. దాదాపుగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. భారీగా బందోబస్తు కొనసాగినా, జనం రోడ్లపై కనిపించకపోయినా.. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో మంగళవారం ఉదయం మరో కారు దహనమైంది. ఇంటిముందు నిలిపి ఉంచిన కారుకు ఎవరో నిప్పంటించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫైరింజన్‌ను రప్పించి మంటలు ఆర్పివేయించారు. దీంతో మళ్లీ ఏదో జరుగుతోందని ప్రజల్లో భయం కనిపించింది. కొనసాగుతున్న విచారణ భైంసాలోని జుల్ఫిగల్ గల్లీలో ఆదివారం రాత్రి బైకు సైలెన్సర్ విషయంగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. నిమిషాల్లోనే ఇరువర్గాల వారు గుమిగూడి పరస్పర రాళ్లదాడికి, హింసకు పాల్పడ్డారు. పోలీసులు త్వరగా స్పందించడంతో రాత్రి 10.30 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే జుల్ఫికర్ గల్లీ, సంజయ్ గాంధీ మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో ఆస్తి, వాహనాల విధ్వంసం జరిగింది. రెండు ఇళ్లు, రెండు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలు, ఐదు కార్లు దహనమయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే సుమారు 14 మందిని అదుపులోకి తీసుకోగా.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ, ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనలో వాహనాలు దహనమైన బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారినుంచి ఫిర్యాదులు తీసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనేది ఆరా తీస్తున్నారు. నిఘా బృందాలు కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నాయి. ఇక రెవెన్యూ అధికారులు రెండోరోజు సైతం ఆస్తి నష్టం వివరాలను అంచనా వేస్తూ కనిపించారు. కొనసాగిన ఆంక్షలు.. ఇంటర్నెట్ బంద్ భైంసా పట్టణం, పరిసర ప్రాంతాల్లో పోలీసు ఆంక్షలు కొనసాగాయి. పట్టణానికి వచ్చే అన్నిమార్గాల్లో, పట్టణంలోని గల్లీల్లోకి వెళ్లే రహదారుల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గల్లీల్లో ఉన్నవారిని బయటికి అనుమతించలేదు. బయటివారిని లోనికి వెళ్లనీయలేదు. వేరే ఊర్ల నుంచి వచ్చేవారిని పట్టణంలోకి రానివ్వలేదు. మొత్తంగా భైంసాలో ఏం జరుగుతోందో బయటి జనానికి అంతుచిక్కని పరిస్థితి ఉంది. వరుసగా రెండోరోజు సైతం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పోలీసు ఆంక్షలతో మంగళవారం సైతం భైంసా డిపో నుంచి బస్సులు బయటికి రాలేదు. పట్టణం నుంచి బయటికి వెళ్లేవారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది. అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బందికి సైతం ఎలాంటి పాసులు జారీ చేయక.. ఇబ్బంది పడ్డారు. భైంసా డివిజన్లో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ ఇబ్బందులు తప్పలేదు. వారంతా భైంసాలో ఉంటూ ఊర్లలో విధులకు వెళ్లొస్తుంటారు. తీవ్ర ఇబ్బందుల్లో జనం పట్టణంలో పోలీసు ఆంక్షలు, దుకాణాలు మూసి ఉండటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ఏరియాల్లో పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందక అల్లాడుతున్నారు. ముఖ్యం గా పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక చాలా మంది వాటర్ ప్లాంట్ల నుంచి రక్షిత మంచినీటిని తెచ్చుకునేవి. ఇప్పుడు వాటర్ సరఫరా చేసే ఆటోలనూ అనుమతించకపోవడంతో నల్లా నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉంది. ఎంపీని అడ్డుకున్న పోలీసులు బాల్కొండ: చలో బైంసా నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఎంపీ సోయం బాపురావును నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ వైపు వెళ్లేందుకు అనుమతి లేదని.. హైదరాబాద్‌లోని నివాసానికి తిరిగి వెళ్లాలని సూచించారు. దీంతో పోలీసులపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీ.. కాసేపటికి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
అదుపులోనే భైంసా
భైంసా/ భైంసాటౌన్/ రాంగోపాల్‌పేట్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం ఉదయానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. భైంసా అల్లర్ల సంఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తలెత్తిన వివాదంతో అల్లరిమూకలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు రువ్వుకోవడం, కత్తులు, ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడడం వంటి సంఘటనల కారణంగా భైంసాలో భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రామగుండం సీపీ సత్యనారాయణ, నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు వారియర్ భైంసా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వారు పట్టణంలోనే మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకి భైంసా పట్టణాన్ని సందర్శించారు. ఘటనకు కారకులను పట్టుకుంటామని, పట్టణవాసులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ప్రజలు సంయమనం పాటించాలని, కొంతమంది అల్లరిమూకల కారణంగా భైంసాలో ఇలాంటి వాతావరణం నెలకొనడం దురదృష్టకరమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. 144 సెక్షన్ అమలుతో భైంసా పట్టణం నిర్మానుష్యంగా కనిపించింది. బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను మూసిఉంచారు. భైంసా పట్టణంలోకి పోలీసులు కొత్తవారిని అనుమతించలేదు. అల్లర్ల ఘటనకు సంబంధించి 28 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజీల ఆధారంగా దోషులను గుర్తిస్తున్నామని ఇన్చార్జి ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. ఈ ఘటనలో 13 మందివరకు గాయాలపాలైనట్లు ఆయన చెప్పారు. ఏడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, అలాగే ఆరు ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, రెండు కార్లు, 16 దుకాణాలు కాలిపోయాయని రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనాలో గుర్తించారు. అల్లర్ల ఘటనకు సంబంధించి పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. గాయపడిన జర్నలిస్టులకు చికిత్స భైంసాలో ఆదివారం రాత్రి జరిగిన అల్లర్లలో గాయపడిన రాజ్ న్యూస్ రిపోర్టర్ విజయ్ (41), ఫొటో గ్రాఫర్ దేవేందర్‌రెడ్డి (27)లను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. దేవేందర్‌రెడ్డి ముఖంపై తీవ్ర గాయాలున్నాయని, దవడ ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేశామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విష్ణురెడ్డి తెలిపారు. తలలో ఏమైనా రక్తస్రావం జరిగిందా అనే విషయం తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇదే ఘటనలో కత్తిపోట్లకు గురైన విజయ్‌కు కడుపులో పలుచోట్ల తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని మూడు రోజులు గడిస్తేనే వారి ఆరోగ్యంపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు యశోద ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గతంలో భైంసాలో జరిగిన అల్లర్లకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావని అన్నారు. ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేసేలా చూడాలన్నారు. కాగా, ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ దాడులు జరిగాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దాడులు జరిగాయని అన్నారు. కొందరు మతాన్ని అడ్డుపెట్టుకుని భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బీజేపీ ఉన్నంత వరకు ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది: హోంమంత్రి సాక్షి, హైదరాబాద్: భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే డీజీపీ, కలెక్టర్‌తోపాటు, జిల్లా ఎస్పీలతో మాట్లాడానన్నారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా సరిపడినన్ని బలగాలను మోహరించామని వెల్లడించారు. భైంసా పట్టణంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సోమవారం ఆయన ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు సమాధానమిచ్చారు. అంతకుముందు భైంసాలో చెలరేగిన హింసను నివారించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కేటీఆర్ ట్విట్టర్లో కోరిన నేపథ్యంలో మహమూద్ అలీ స్పందించారు. -
పలికే చిలుక మూగబోయింది..
-
పలికే చిలుక మూగబోయింది..
సాక్షి, ఆదిలాబాద్ : బైంసాలోని సాయిబాబా మందిరంలో 18 సంవత్సరాలుగా పెంచిన పలికే చిలుక మృతి చెందింది. ఈ జాతి రామ చిలుకలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ చిలుకను ఆలయ పరిసరంలోని దశరత్ కుటుంబం పెంచుకున్నారు. ఈ చిలుకతో ఎవరైనా కాసేపు మాట్లాడితే కొద్ది సమయానికి ఆ పదాలను తిరిగి పలుకుతుంది. ఇది దీని ప్రత్యేకత. చిలుకను చూడడానికి రోజు చాలా మంది వస్తూ ఉండేవారు. అయితే చిలుక మృతితొ కుటుంబ సభ్యుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంలొ ఒకరిగా ఉన్న చిలుకకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం) -
భైంసాలో కొనసాగుతున్న కర్ఫూ
సాక్షి, నిర్మల్: భైంసాలో ఆదివారం రాత్రి జరిగిన అల్లర్లతో పట్టణంలో 24 గంటల కర్ఫూ కొనసాగుతోంది. ఈ అల్లర్లలో ఇద్దరికి గాయాలు కాగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారి పరిస్థితి విషమించడంతో నిజమాబాద్ ఆసుపత్రికి తరలించారు. అల్లర్లకు దిగిన ఇరువార్గాలు ఒక బైక్‌ను తగలబెట్టగా, ఒక కారు, ఆటోను ధ్వంసం చేశారు. ఇరు వార్గాలు పలు ఇళ్లపై రాళ్లు విసిరారు. అల్లర్ల సంఘటన స్థలాన్ని కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. భైంసాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. ఇప్పటి వరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. అల్లర్లపై నాలుగు కేసులు నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. భైంసా పట్టణం అంత 144 సెక్షన్ అమలు చేసి పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. భైంసాలో భారీ బందోబస్తు కొనసాగుతుందని, లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. -
భైంసా బాధితులకు పరిహారం చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్: భైంసా ఘటనలో నిరాశ్రయులై, భయభ్రాంతులకు గురైన పిల్లలు, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే డిమాండ్ చేశారు. నగరంలోని దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భైంసాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, బాధితులు ఇంకా భయంభయంగానే బతుకుతున్నారన్నారు. ఘటనకు కారకులైన వారిని వదిలేసి, అమాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. ఒక వర్గం వాళ్లు మరో వర్గం వారిపై కావాలనే దాడి చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పూరి గుడిసెలు, పెంకుటిళ్లలో పెట్రోబాంబులు వేయడం, రాళ్లు వేయడం వంటి చర్యలు చూస్తుంటే పథకం ప్రకారం చేసినట్లే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. భైంసా ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని తెలిపారు. అక్కడి పరిస్థితులను దాచిపెట్టే ందుకు మీడియాపై ఆంక్షలు విధించినా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుందన్నారు. -
ఖానా‘పురం’ ఎట్టకేలకు ‘కారు’పరం
నిర్మల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఐదేళ్లపాటు పట్టణాభివృద్ధికి అంకితమవుతామంటూ ప్రమాణం చేశాయి. బీసీ జనరల్‌కు రిజర్వు అయిన నిర్మల్‌లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన గండ్రత్ ఈశ్వర్ చైర్మన్ అయ్యారు. భైంసాలో గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా ఉన్న సబియాబేగం మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కొత్త మున్సిపాలిటీ ఖానాపూర్‌ను ఎట్టకేలకు టీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి అంకం రాజేందర్ చైర్మన్‌గా ప్రమాణం చేశారు. మూడు మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశం, ప్రమాణ స్వీకారోత్సవం ప్రశాంతంగా ముగిశాయి. నాలుగువందలకు పైగా ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్ పట్టణం 12వ మున్సిపల్ చైర్మన్‌గా గండ్రత్ ఈశ్వర్ ఎన్నికయ్యారు. ఇక్కడ 42వార్డులకు గానూ టీఆర్ఎస్ ఏకపక్షంగా 30వార్డులను దక్కించుకుంది. మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో హాజరైన కౌన్సిలర్లు 33వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఈశ్వర్‌ను చైర్మన్‌గానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా ఈశ్వర్ పేరును తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ ప్రతిపాదించగా, 24వ వార్డుకు కౌన్సిలర్ మేడారం అపర్ణ బలపరిచారు. దీంతో ఎన్నిక నిర్వహణాధికారి, జెడ్పీ సీఈఓ సుధీర్ చైర్మన్‌గా గండ్రత్ ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్‌గా ఇప్పటి వరకు నిర్మల్‌లో రెండోసారి ఎన్నికై ఈశ్వర్ రికార్డు నెలకొల్పారు. ఆయన గతంలో 2000–05వరకు చైర్మన్‌గా కొనసాగారు. అప్పట్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నిక అనంతరం వైస్ చైర్మన్‌గా 22వ(వైఎస్ఆర్ కాలనీ) వార్డు కౌన్సిలర్ షేక్ సాజిద్ పేరును 41వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్ధుల్ సయీద్ ప్రతిపాదించారు. 23వ వార్డుకు చెందిన సయ్యద్ జహీర్ బలపర్చారు. దీంతో షేక్ సాజిద్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రత్యేక సమావేశానికి హాజరైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎక్స్ అఫిషి యో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేకాధికారి శృతిఓజా, కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భైంసాలో మళ్లీ వాళ్లే.. రాష్ట్రంలో మహారాష్ట్రతో సరిహద్దు పట్టణంగా ఉన్న భైంసా మున్సిపల్లో మరోసారి ఎంఐఎం కొలువుదీరింది. ఇక్కడ బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా కొనసాగిన సబియాబేగంను ఈసారి కూడా చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. పట్టణంలోని రెండోవార్డు నుంచి ఆమె గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా 20వ వార్డు నుంచి ఏకగ్రీవమైన మహ్మద్ జాబిర్ అహ్మద్ కూడా మరోసారి అదే స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌గా సబి యాబేగం పేరును ఒకటోవార్డు కౌన్సిలర్ ఫైజు ల్లాఖాన్ ప్రతిపాదించగా, 16వ వార్డు కౌన్సిలర్ ముదస్సిమ్ బలపర్చారు. వైస్ చైర్మన్‌గా జాబిర్ అహ్మద్‌ను 15వ వార్డు కౌన్సిలర్ ఖాదర్ ప్రతిపాదించగా, 13వ వార్డు కౌన్సిలర్ రాహుల్ దగ్డే బలపర్చారు. ఈమేరకు వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు. అంతకుముందు ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు ముందే బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఖానా‘పురం’ కారుకే... కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డ ఖానాపూర్‌లో తొలిసారే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఈ పురం ‘కారు’ పార్టీ పరమైంది. మొత్తం 12వార్డులకు గానూ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు చెరో ఐదు స్థానాలు రాగా, ఇండిపెండెంట్ ఒకటి, బీజేపీ ఒకటి గెలుపొందారు. టీఆర్ఎస్కు స్వతంత్ర అభ్యర్థిగా 10వ వార్డు నుంచి గెలుపొందిన తొంటి శ్రీనివాస్ మద్దతు పలికారు. అంతకుముందు ఆయన గులాబీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన రెండో వార్డు కౌన్సిలర్ కారింగుల సంకీర్తన సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే రేఖానాయక్ ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా మద్దతు పలికారు. దీంతో టీఆర్ఎస్ బలం ఏడు స్థానాలకు చేరగా, కాంగ్రెస్ నుంచి ఒకరు గైర్హాజరు కావడంతో వారి బలం నాలుగు స్థానాలకు పడిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నాయిని స్రవంతి ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయారు. దీంతో ప్రత్యేకాధికారి ప్రసూనాంబ, కమిషనర్ మల్లేశ్‌లు మెజార్టీ ఉన్న టీఆర్ఎస్కు చైర్మన్ ఎన్నికకు అవకాశం ఇచ్చారు. ఆ పార్టీ నుంచి చైర్మన్‌గా 9వ వార్డు కౌన్సిలర్ అంకం రాజేందర్ పేరును 10వ వార్డు కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్ ప్రతిపాదించగా, 3వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి బలపర్చారు. వైస్ చైర్మన్‌గా 8వ వార్డు కౌన్సిలర్ అబ్ధుల్ ఖలీల్ పేరును ఒకటో వార్డు కౌన్సిలర్ కావలి సంతోష్ ప్రతిపాదించగా, ఐదో వార్డు కౌన్సిలర్ పరిమి లత బలపర్చారు. దీంతో చైర్మన్‌గా అంకం రాజేందర్, వైస్ చైర్మన్‌గా అబ్ధుల్ ఖలీల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఖానాపూర్ టీఆర్ఎస్ కైవసం.. ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే గెలిచారు. చైర్మన్ ఎన్నికకు ఏడుగురి మద్దతు కావాలి. అయితే స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఎక్స్అఫిషియో మెంబర్‌గా ఖానాపూర్‌లో నమోదు చేసుకున్నారు. ఆమె ఓటుతో టీఆర్ఎస్ బలం ఆరుకు చేరింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన 10వ వార్డు కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్ పార్టీలో చేరడంతో చైర్మన్‌గా అంకం రాజేందర్, వైస్ చైర్మన్‌గా అబ్దుల్ ఖలీల్ ప్రమాణ స్వీకారం చేశారు. భైంసాలో గట్టి బందోబస్తు భైంసా(ముథోల్): భైంసా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా పట్టణంలో సోమవారం గట్టి బందోబస్తు నిర్వహించారు. 144సెక్షన్ విధించారు. డీఎస్పీ నర్సింగ్‌రావు గతంలో పనిచేసి బది లీపై వెళ్లిన మరో డీఎస్పీ రాములు భద్రతను పర్యవేక్షించారు. కాగా, ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సత్తా చాటిన మజ్లిస్
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో మజ్లిస్ సత్తా చాటింది. 2 పురపాలక సంఘాలను సొంతంగా కైవసం చేసుకున్న ఆ పార్టీ, అవకాశం వస్తే టీఆర్ఎస్తో కలిసి నిజామాబాద్ కార్పొరేషన్‌పై జెండా ఎగరేసే స్థా యిలో ఉంది. వెరసి పురపాలక సంఘాలకు సంబంధించి 69 వార్డులను, కార్పొరేషన్లకు సంబంధించి 17 డివిజన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య కొంత తగ్గినా.. అధ్యక్ష స్థానాలను ఎక్కువ కైవసం చేసుకోవటం ద్వారా ప్రస్తుత ఎన్నికల్లో సత్తా చాటుకున్నట్టయింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిన ఒకేఒక పురపాలక సంఘం భైంసా. ఈసారి స్పష్టమైన ఆధిక్యంతో దాన్ని నిలబెట్టుకుంది. అక్కడ 26 వార్డులుండగా మజ్లిస్ పార్టీ 15 చోట్ల విజయం సాధించి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా ఏర్పడ్డ నగర శివారులోని జల్పల్లి మున్సిపాలిటీలో 28 స్థానాలుండగా మజ్లిస్ 15 చోట్ల విజయం సాధించి చైర్మన్ కుర్చీని సొంతం చేసుకుంది. వీలైతే టీఆర్ఎస్తో మేయర్ పీఠాన్ని పంచుకునే యోచనలో ఉంది. అందుకోసం స్వయంగా ఆపార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం నిజామాబాద్‌లో హవా.. పుర ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరిన బీజేపీ ఆశలకు గండి కొడుతూ మజ్లిస్ పార్టీ 16 డివి జన్లలో గెలిచి మేయర్ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు బరిలో నిలిచింది. ఇక్కడ 28 చోట్ల గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేయర్ సీటును పొందాలంటే 31 స్థానాలు అవసరం. ఇక్కడ టీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్, స్వతంత్రులను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్–మజ్లిస్‌లు యత్నిస్తున్నాయి. అది సాధ్యమైతే ఈ కూటమి మేయర్ స్థానా న్ని సొంతం చేసుకుంటుంది. పనిచేయని సీఏఏ మంత్రం.. ఈసారి వీలైనన్ని వార్డులు దక్కించుకుని పురపాలికలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరిన మజ్లిస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. గత ఎన్నికల్లో ఒక్క భైంసాను మాత్రమే దక్కించుకుని ఆదిలాబాద్, తాండూరు, నిర్మల్‌లలో వైస్‌చైర్మన్ పదవులను చేజిక్కించుకుంది. ఈసారి కనీసం నాలుగైదు చైర్మన్ స్థానాలతోపాటు నిజామాబాద్ మేయర్ గిరీని సొంతం చేసుకోవాలని కలలుగన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అసదుద్దీన్ ఒవైసీ ముమ్మర ప్రయత్నమే చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీంతో పార్టీకి బలం ఉన్న పట్టణాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేయటం ద్వారా మైనార్టీల ఓట్లను గంపగుత్తగా సాధించాలనుకున్నారు. ఆ వర్గం ఓట్లు చీలకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. కానీ కొంతవరకు ఆశాభంగమే ఎదురైంది. బోధన్‌లో 38 స్థానాలుంటే మజ్లిస్ కేవలం 11 చోట్ల విజయం సాధించింది. ఆదిలాబాద్‌లో 5 వార్డులే దక్కాయి. నిర్మల్ ఓటర్లు రెండు వార్డులే కట్టబెట్టి కంగు తినిపించారు. తాండూరు, నిజామాబాద్, వికారాబాద్, నారాయణ్‌ఖేడ్ ఓటర్లు కూడా నిరుత్సాహపరిచారు. -
ఉత్కంఠ పోరులో ఎంఐఎం విజయం
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం విజయం సాధించింది. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన భైంసాలో పుర పోరు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. విజయం కోసం ఎంఐఎం, బీజేపీ తీవ్రంగా పోటీపడ్డాయి. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కనీసం పోటీలో కూడా లేకుండా పోయాయి. గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీలో సొంతం చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను పునరావృతం చేసి పట్టునిలుపుకుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 9 వార్డుల్లో విజయం నమోదు చేసింది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు కాంగ్రెస్ కంచు కోటకు బీటలు కేటీఆర్‌కు షాకిచ్చిన స్వతంత్రులు కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి షాక్ -
కుదుటపడుతున్న భైంసా
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : అల్లర్ల అనంతరం భైంసాలో పరిస్థితి క్రమంగా కుదుటపడుతోంది. పట్టణంలో వ్యాపార సముదాయాలు శుక్రవారం తెరుచుకున్నాయి. అయితే గిరాకీలు అంతంత మాత్రంగానే కనిపించాయి. పాత పట్టణంలో రోడ్లు మాత్రం నిర్మానుష్యంగానే దర్శనమిచ్చాయి. ఇళ్లకు తాళాలువేసి బంధువుల ఇళ్లకు వెళ్లిన స్థానికులు ఇంకా తిరిగిరాలేదు. కోర్భాగల్లీ, ఖాజీగల్లీ, గుజిరిగల్లీ, కుంట ఏరియా, నయాబాది ప్రాంతాల్లో జనసందడి కనిపించలేదు. బందోబస్తు ముమ్మరం... సుమారు 1000 మందితో పోలీసులు బందోబస్తు మరింత పటిష్టం చేశారు. పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ర్యాపిడ్‌యాక్షన్ ఫోర్స్, ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, కర్ఫ్యూ ఎత్తివేసినా పట్టణంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రత్యేక చెక్ పోస్టులు.. భైంసా నుంచి పలు ప్రాంతాలకు (భైంసా–భోకర్, భైంసా–కుభీర్, భైంసా–పార్డి(బి), భైంసా–నిర్మల్‌కు) వెళ్లే ప్రధాన కూడళ్లలో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టణానికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ నిఘా పటిష్టం చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాకే బయటకు వదులుతున్నారు. వాటి నంబర్లను నమోదు చేస్తున్నారు. అలాగే బస్టాండ్, ఏరియా ఆసుపత్రి, గాంధీగంజ్, కుభీర్ చౌరస్తా, నిర్మల్ చౌరస్తా, ఏపీ నగర్, పాత చెక్‌పోస్టు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. శుక్రవారం పట్టణంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ప్రారంభమైన ప్రచారం.. పట్టణంలో ఎట్టకేలకు మున్సిపల్ అభ్యర్థుల ప్రచారం ప్రారంభమైంది. ఈనెల 22న పోలింగ్ నేపథ్యంలో ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి సైతం అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారం చేపడుతున్నారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు, ఆర్డీఓ రాజు ఎన్నికల ఏర్పాట్లు చేపడుతున్నారు. ఎన్నికలు జరుగనున్న 23 వార్డుల్లో బరిలో ఉన్న 85 మంది అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను కేటాయించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. భైంసాలో అల్లర్ల ఘటన నేపథ్యంలో గత నాలుగు రోజుల నుంచి పట్టణానికి ప్రజల రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆదివారం రాత్రి ఘటన జరుగగా, సోమవారం సైతం కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆర్ఏఎఫ్ బలగాలతోపాటు, ప్రత్యేక పోలీసు బలగాలు భైంసాకు చేరుకున్నాయి. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన వీధుల్లో కవాతులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. శుక్రవారం పట్టణంలో పలు దుకాణాలు తెరుచుకోవడంతో, చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాల రాక పెరిగింది. బస్టాండ్ ప్రయాణికులతో నిండింది. -
ఐదో రోజూ 144 సెక్షన్... ‘అంతా ప్రశాంతం’
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసాలో 144 సెక్షన్ ఐదో రోజు కొనసాగుతోంది. గత ఆదివారం పట్టణంలోని కోర్వాగల్లీలో ఇరు వర్గాల ఘర్షణ రాళ్లదాడికి దారితీయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ శుక్రవారం కావడంతో అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి నిర్మల్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారానికి ప్రత్యేక అనుమతులు లభించినట్టు తెలిసింది. (చదవండి : ఎప్పుడేం జరుగుతుందో..?) అంతా ప్రశాంతంగా ఉంది : హోంమంత్రి భైంసాలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎలాంటి ఆందోళనలు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భైంసాలో పరిస్థితులు బాగోలేవనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి తప్ప అక్కడ ఎలాంటి అలజడి లేదని పేర్కొన్నారు. ఇక కేసులు ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల్ని డిపార్ట్మెంట్లో చేర్చుకోబోమని హోంమంత్రి స్పష్టం చేశారు. 300 మంది కానిస్టేబుల్ అభ్యర్థులపై ఉన్న కేసులపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. అన్ని విధాలుగా విచారణ చేసిన అనంతరమే వారిని పోలీసు శాఖలో జాయిన్ చేసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి : భైంసాలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి) (చదవండి : ‘ప్రజలు రజాకార్ల పాలన చూడాల్సి వస్తుంది’) (చదవండి : భైంసా ప్రశాంతం) -
సెలవుల్లో ఇంటికి వచ్చినా ఆనందం కరువు
భైంసా/భైంసాటౌన్: పండుగపూట భైంసా పట్టణంలో ప్రశాంతత కరువైంది. ఆదివారం సరదాగా సెలవుల్లో వచ్చిన పిల్లలతో కలిసి భైంసాలోని థియేటర్‌కు వెళ్లి సెకండ్‌షో సినిమా చూసిన చాలా కుటుంబాలు బయట జరగుతున్న వాతావరణం చూసి భీతిల్లిపోయారు. సరదా కోసం వెళ్లిన సినిమా చూసి ఇళ్లకు చేరుకునే లోపే భయం వెంటాడింది. ఇళ్లకు చేరుకున్న ఈ కుటుంబాలు రాత్రి భోజనాలు కూడా చేయలేదు. భైంసా పట్టణమంతా అల్లరి మూకల అరుపులు, కేకలు పోలీసు పెట్రోలింగ్ వాహనాల చప్పుళ్లతో హోరెత్తితింది. ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. రాత్రి సమయంలో అల్లరిమూకల చేతిలో గాయాలపాలైన వారిని పరుగుపరుగునా ఆస్పత్రుల్లో చేర్పించడం.. చికిత్స అందించడం మళ్లీ ఇంట్లో ఉన్న తమవారికి ఏం జరుగుతుందోనని తెలియక అయోమయానికి లోనవుతూనే కనిపించారు. సోమవారం తెల్లవారేసరికి భైంసాలో ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి భైంసాలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా పోయింది. భైంసాలో ఉన్న తమవారి బాగోగులు తెలుసుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల వారు నానా తంటాలు పడ్డారు. ఇక మీడియాలోనూ ఏం వస్తుందోనని తెలుసుకుందామని వెళ్లినా ఆంక్షలతో అక్కడా ఏ సమాచారం తెలియకుండా పోయింది. రాత్రి అవుతున్న కొద్ది మళ్లీ భైంసాలో ఏం జరుగుతుందోనన్న భయం భైంసావాసుల్లో కనిపించింది. కుటుంబంలో ఉన్న పిల్లలను పడుకోబెట్టి పెద్దలంతా కిటికీల వద్ద, ప్రధాన ద్వారాల వద్ద కాపలా కాస్తూ ఉండిపోయారు. కార్లు, ఖరీదైన వాహనాలు ఉన్నవారు వాటిని భద్రంగా దాచుకునేందుకు తంటాలు పడ్డారు. భైంసా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలలు, కళాశాలల బస్సులన్నీ భద్రత కోసం ఇతర ప్రాంతాలకు తరలించారు. ద్విచక్ర వాహనాలను ఇళ్లలోకి తీసుకెళ్లి భద్రపరిచారు. ఇలా భోగి సంక్రాంతి పండుగలకు ముందే భైంసాలో భయానక వాతావరణం నెలకొంది. పండుగ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న పిల్లలకు కళ్ల ముందే జరిగిన సంఘటనలు చూసి భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే : ఎంపీ సోయం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే భైంసాలో పథకం ప్రకారమే ఓ వర్గంవారు దాడులకు పాల్పడ్డారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. సోమవారం ఉదయం భైంసాకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రాత్రంతా ఒక వర్గంపై మరో వర్గంవారు రాళ్లు, గాజుసీసాలతో దాడి చేసినా పోలీసులు అడ్డుకోలేకపోయారని, ఘర్షణకు కారకులైన ఏ ఒక్కరినీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. పట్టణంలో కర్ఫ్యూ విధించి, శాంతిభద్రతలను అదుపులోకి తేవాలన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. భైంసాలో దాడులకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దాడుల్లో నష్టపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇళ్లు ధ్వంసమైన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికలు నిలిపేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్, విష్ణుప్రకాశ్‌బజాజ్, రవిపాండే, నారాయణ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
‘ప్రజలు రజాకార్ల పాలన చూడాల్సి వస్తుంది’
సాక్షి, భైంసా(అదిలాబాద్): భైంసాలో ఎంఐఎం పార్టీ గూండాలు సాగించిన హింసాకాండ అధికార పార్టీ టీఆర్ఎస్ అండదండలతోనే జరిగిందని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు హింసాత్మక ఘటనలకు తెరతీశాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది కోసం ఎంఐఎం అరాచకాలకు టీఆర్ఎస్ వంత పాడుతుందని విమర్శించారు. భైంసాలో మున్సిపాలిటీని ఎంఐఎంకు ఏకగ్రీవంగా కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పనుకుని కుట్రలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే.. ప్రజలు రజాకార్ల పాలనను చూడాల్సి వస్తుందన్నారు. వీరోచిత పోరాటం, అమరుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో తిరిగి రజాకార్ల పాలన వచ్చే ముంపు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణ కావాలో... రజాకార్ల పాలనా కావాలో నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. (చదవండి: తెల్లారినా అదే పరిస్థితి.. 144 సెక్షన్ విధింపు) భైంసాలో ఓ వర్గానికి చెందిన దుండగులు హిందువులకు చెందిన 18 ఇళ్లను దగ్ధం చేశారని, పెద్ద సంఖ్యలో ప్రజలను గాయపరిచారని మండిపడ్డారు. ఆస్తులను, వాహనాలను తగలబెట్టారని, దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైనా గూండాలు విరుచుకుపడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులపైనే ఎంఐఎం గుండాలు దాడులకు పాల్పడితే... శాంతి భద్రతలను ఎవరు పర్యవేక్షిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భైంసా ఘటనలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని, పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అప్రమత్తత పాటించలేదని విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే భయపడతామనుకుంటే పొరపాటని, దాడులను ప్రతిఘటిస్తూ.. ఎలాంటి ఉద్యమాలైనా చేపట్టానికి తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ సవాలు విసిరారు. భైంసా ఘటనను వ్యతిరేకిస్తూ.. హిందూ సమాజం ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భైంసాలో పోటీ నుంచి తప్పుకుని ఎంఐఎం పార్టీకి మున్సిపాలిటీని అప్పగించాలని చూస్తున్న టీఆర్ఎస్.. భవిష్యత్తులో అధికారం నుంచి తప్పుకుని ఎంఐఎంకు పాలనను అప్పగిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్టంలో సాగుతున్న అరాచక పాలనపై టీఆర్ఎస్ నేతల శ్రేణులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని, అధినాయకత్వాన్ని ప్రశ్నించాలని ఆయన హితవు పలికారు. -
భైంసాలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి
-
తెల్లారినా అదే పరిస్థితి.. 144 సెక్షన్ విధింపు
భైంసాటౌన్(ముథోల్): పట్టణంలో ఆదివా రం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్లితే.. పట్టణంలోని కోర్వాగల్లి ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, మరో వర్గానికి చెందిన వ్యక్తితో స్వల్ప వాగ్వా దం జరిగింది. ఇది కాస్తా పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్యన ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణతో ఒక్కసారిగా పట్టణంలో భయానక వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లదాడికి పాల్పడ్డారు. కాగా, ఉదయం కూడా ఘర్షణలు తగ్గుముఖం పట్టలేదు. 144 సెక్షన్ అమలు.. కోర్వాగల్లి ప్రాంతంలో చెలరేగిన అల్లర్లు సద్దుమణగలేదు. దీంతో భైంసాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కాగా, ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 11 మంది గాయాలపాలయ్యారు. భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావుతో సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. సీఐ శ్రీనివాస్ తలకు గాయమైంది. 11 ఇళ్లు, 24 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 2 ఆటోలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల బలగాలు భారీగా రంగంలోకి దిగాయి. ఐజీ నాగిరెడ్డి, డీఐడీ ప్రమోద్‌రెడ్డితో పాటు, జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, మరో ముగ్గురు ఎస్పీలు, వెయ్యిమంది పోలీసులు భైంసా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిస్థితిని సమీక్షించారు. -
డబ్బులు సంపాదిద్దాం.. టార్గెట్ రూ.కోటి..!
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : ఆ ముగ్గురు విద్యార్థులవీ దాదాపు మధ్య తరగతి కుటుంబాలే. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని తాము చదువుతున్న హాస్టల్ నుంచి హైదరాబాద్‌కు రైలులో పారిపోయారు. గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో భైంసాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ముగ్గురు బాగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పాఠశాల నుంచి పారిపోయినట్లు వారి వదిలివెళ్లిన లేఖ ఆధారంగా తెలుస్తోంది. పాఠశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకున్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా, విద్యార్థులే తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్నామని.. తిరిగి వస్తున్నామని చెప్పినట్లు సీఐ వేణుగోపాల్‌రావు వివరించారు. సాయంత్రం వచ్చిన విద్యార్థులను మందలించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. గురువారం రాత్రి నుంచే అదృశ్యం.. వివరాల్లోకి వెళ్తే.. భైంసా పట్టణంలోని ఆటోనగర్ బైపాస్‌రోడ్డులో మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో జల్లా శివకుమార్, జాదవ్ వికాస్, మనీష్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. శివకుమార్ తండ్రి భైంసాలో మీడియాలో పని చేస్తుండగా, సారంగపూర్ మండలం మహావీర్తండాకు చెందిన జాదవ్ వికాస్ తండ్రి రవి వేరుగా ఉంటుండటంతో అతడి తల్లి నీలాబాయి చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేస్తూ కొడుకును చదివిస్తోంది. కుభీర్‌కు చెందిన మనీష్ తండ్రి సాయినాథ్ టైలర్‌గా పని చేస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు. గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు హాస్టల్ నుంచి తప్పించుకుపోయినట్లు ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లకు వెళ్లి ఉంటారని భావించి వారి తల్లిదండ్రులకు ఫోన్లో సంప్రదించారు. రాలేదని వారు తెలపడంతో అదృశ్యమైనట్లు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.15వేలు సంపాదిస్తే.. దాదాపు 40 మంది వరకు విద్యార్థులు ఉండే ఈ తరగతి గదిలో శివకుమార్, వికాస్, మనీష్‌లు ఎప్పుడూ ఒక జట్టుగా ఉండేవారని, వీరి ఆలోచనా విధానం అంతా బాగా బతకాలనే ధోరణిలో ఉండేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. శివకుమార్‌కు షార్ట్‌ఫిలింలు తీయాలనే ఆసక్తి, రాజకీయాల్లో రాణించాలనే ఆసక్తిగా ఉండేదని గమనించినట్లు చెప్పారు. ఇక వికాస్ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో డబ్బు సంపాదించాలనుకునేవాడని చెప్పాడు. మనీష్ తండ్రి టైలర్‌గా చేస్తుండగా, పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ముగ్గురు కలిసి పాల్గొనేవారని పేర్కొన్నారు. డబ్బు సంపాదన కోసం వీరు రాసుకున్న లేఖ ఉపాధ్యాయులకు లభించింది. అందులో ఇలా ఉంది..వికాస్ నెల సంపాదన రూ.10వేలు, శివకుమార్‌కు రూ.5వేలు, మనీష్‌కు రూ.5వేలు, ముగ్గురు కలిసి నెలకు రూ.20వేలు సంపాదిస్తామని, ఇందులో రూ.5వేలు ఖర్చులకుపోగా, నెలకు రూ.15వేలు, ఏడాదికి రూ.లక్షా 80వేలు సంపాదించవచ్చని, మరుసటి ఏడాది రూ.3.60లక్షలు, మూడో ఏడాది రూ.5.40లక్షలు.. ఇలా రూ.కోటి వరకు సంపాదించేలా ప్రణాళిక వేసుకున్నారు. ఈ చేతిరాత వికాస్దేనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఆశే వారిని హాస్టల్ వదిలి వెళ్లేలా చేసి ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల భద్రతపై అనుమానాలు.. ఇదిలా ఉండగా, హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు పారిపోయిన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం పాఠశాల నుంచి పారిపోతే తమకు ఉదయం వరకు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. భరోసాతో ఇక్కడ చదివిస్తున్నామని, ఇలా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహించారు. -
వింత శిశువు జననం..వెయ్యి మందిలో ఒకరే..!
సాక్షి, నిర్మల్ : భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో సోమవారం రాత్రి ఓ గర్భిణి వింత శిశువుకు జన్మనిచ్చింది. మహారాష్ట్రకు చెందిన సదరు గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు భైంసాలోని సాక్షి ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకోచ్చారు. ఆపరేషన్ చేయగా.. వింత శిశువు జన్మించింది. శిశువు తల భాగం పోడువుగా ఉండి, పళ్లు బయటకు రావడం, చర్మ మొత్తం కాలిపోయి ఉన్నట్లు పుట్టింది. అయితే శిశువు మాత్రం ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. వెయ్యి మందిలో ఒకరు ఇలా పుట్టే అవకాశముందని చెబుతున్నారు. -
నాటి మహిష్మతే.. నేటి భైంసా
సాక్షి, భైంసా : మరాఠీ పురాణాల ప్రకారం చరిత్రకు సజీవ సాక్షంగా భైంసా పట్టణం నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పూర్వకాలంలో భైంసా పట్టణం మహిష్మతి నగరంగా మహిషాసురుని పాలనలో విరాజిల్లింది. మరాఠీ ఇతిహాసాలే ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. మహిషాసురుడు పెట్టే బాధలు తట్టుకోలేక ప్రజలు మహిష అనే అమ్మవారిని శరణు కోరారు. ప్రజల మొర ఆలకించిన అమ్మవారు ప్రత్యక్షమై మహిషాసురున్ని సంహరించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ పట్టణానికి మహిషాగా నామకరణం చేశారు. అప్పట్లో మహారాష్ట్రలో ఉన్న ఈ ప్రాంతాన్ని మహిషాగా, మైసగా పిలిచేవారు. కాలక్రమేణా మహిషా కాస్త మైసగా ఇప్పుడేమో భైంసాగా రూపాంతరం చెందింది. గణతంత్ర రాజ్యంగా... క్రీ.పూ నాలుగో శతాబ్దం నాటికి భైంసా పట్టణం గణతంత్ర రాజ్యంగా ఉండేదని తెలుస్తోంది. అనంతరం శాతవాహన రాజైన మొదటి శాతకర్ణుడికి సామంత రాజ్యంగా ఉండేది. ఈ రాజు భైంసా పట్టణానికి సమీపంలోని కుభీర్ నుంచి కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల వరకు రాజ్యపాలన చేసినట్లు ఆధారాలున్నాయి. కాకతీయ మూల పురుషుడైన వెన్నరాజు భైంసా ప్రాంతంలోనివాడేనని చరిత్ర చెబుతోంది. 12,13వ శతాబ్దాల కాలంలో మహారాష్ట్రలోని దేవగిరి ప్రాంతాన్ని పరిపాలించిన శకుల అధీనంలోకి వెళ్లింది. శకుల వంశపు రాజులు భైంసా, కుభీర్ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని దౌలతాబాద్ వరకు పరిపాలన చేశారు. 15, 16వ శతాబ్దాల కాలంలో భైంసా పట్టణం గోల్కొండను రాజధానిగా చేసుకొని హైదరాబాద్ ప్రాంతాన్ని పాలించిన నిజాంషాహిల అధీనంలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో హిందూ సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ మైసూరులో ఉన్న తన తండ్రిని కలిసేందుకు పుణె నుంచి భైంసా మీదుగానే వెళ్లాడని తెలుస్తోంది. సుంక్లి గ్రామానికి ఒక కథ... భైంసా పట్టణానికి సమీపంలోని సుంక్లి గ్రామం ఆవిర్భావానికి చరిత్రలో చిన్న కథ ఉంది. చ్యపన మహార్షి సతీసుకన్యల ఉదాంతం ఈ ప్రాంతంలోనే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. సతీ సుకన్య పేరు మీదనే సుకన్య గ్రామం ఏర్పడిందని తెలుస్తోంది. కాలగమనంలో సుకన్య పేరు సుంక్లిగా మారింది. గట్టుమైసమ్మగా... మైసాసురుడిని అంతమొందించిన తర్వాత మహిషమ్మ తల్లి భైంసా పట్టణానికి తూర్పున గుట్టపై ఉండిపోయింది. కొలిచిన వారికి కొంగుబంగారమై దీవిస్తున్న అమ్మవారికి అక్కడ ఆలయం నిర్మించారు. నేటికి ఈ ప్రాంతవాసులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ గుట్టనే మైసమ్మ గుట్టగా పిలుస్తున్నారు. మహిషాసుర ఆనవాలుగా వాటర్ ఫిల్టర్‌బెడ్ సమీపంలో గుట్టపై రాతి పాదాల ముద్రలున్నాయి. భైంసా పట్టణ చరిత్ర తెలుగు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో చాలా విషయాలు వెలుగులోకి రాలేదు. చరిత్ర పరిశోధకులు ముందుకువచ్చి మరాఠీ పురాణాల్లో ఉన్న ఆధారాలను వెలుగులోకి తీసుకొస్తే ప్రత్యేక రాష్ట్రంలో భైంసా చరిత్రకు స్థానం దక్కుతుంది. ప్రత్యేక దీక్షలు... భైంసా పట్టణంలో దుర్గాదేవి మైసమ్మగా ప్రత్యేక పూజలు అందుకుంటోంది. పట్టణానికి చెందిన రామ్‌లాల్ కుటుంబీకులు దశాబ్దాలుగా అమ్మవారి సేవలో ఉంటున్నారు. ఏటా యువత దసరా నవరాత్రుల్లో ప్రత్యేక దీక్షలు స్వీకరిస్తారు. వారంతా గట్టుమైసమ్మ, దుర్గాదేవి ఆలయాల్లో రెండు పర్యాయాలు స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. మహాపాదయాత్ర... దీక్షాపరులంతా దసరా, నవరాత్రి ఉత్సవాలు ముగిసిన వెంటనే మహా పాదయాత్ర చేపడుతారు. భైంసా పట్టణం నుంచి 372 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్‌కు వెళ్లి భవానీమాతను దర్శించుకుంటారు. ఎనిమిది రోజులు పాదయాత్రగా సుమారు 1000 మంది భక్తులు పయనమవుతారు. భైంసా నుంచి మహారాష్ట్రలోని తుల్జాపూర్ వరకు ఊరూరా భైంసా పాదయాత్ర బృందానికి స్వాగతాలు పలుకుతూ భోజనాలు ఏర్పాటు చేస్తారు. భైంసా పట్టణం అనగానే మహారాష్ట్రలోని తుల్జాపూర్‌వాసులకు పాదయాత్ర గుర్తుకొస్తుంది. 13 ఏళ్లుగా ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. తుల్జాపూర్ వెళ్లి భవానీమాతను దర్శించుకుని తిరుగుపయణమవుతారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు తుల్జాపూర్ భవానీ అమ్మవారే ప్రత్యక్షమై ఖడ్గాన్ని బహుకరించారని ఇప్పటికీ చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పట్లో తుల్జాపూర్‌లోని భవానీమాతకు పూజలుచేసేవారని భక్తులంతా ఇప్పటికీ కథలుగా చెబుతారు. -
మారుతి ఏమయ్యాడు..?
సాక్షి, భైంసా(ఆదిలాబాద్) : భైంసా పట్టణంలోని భజరంగ్ స్వీ ట్ హోం యజమాని మారుతి ఇంటి నుంచి వెళ్లిపోయి దాదాపు నెల రోజులు గడుస్తోంది. దీం తో అతని కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు కూడా నమోదు చేశారు. అయితే స్థానికంగా నమ్మకంగా వ్యాపారం నిర్వహిస్తూ వచ్చిన మారుతి తనకు తెలిసిన పలువురి వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో రూ.లక్షల్లో అప్పులు కావడంతో, గత నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు అçప్పుల బాధ తాళలేక ఇం టి నుంచి వెళ్లిపోతున్నానని, తన కోసం వెతకవద్దంటూ అతని కొడుకు సెల్‌ఫోన్‌కు మెసేజ్ పెట్టాడు. దీంతో అప్పులు ఇచ్చినవారు, అతని దుకాణంలో పాలు పోసేవారు ఆందోళనకు గురయ్యారు. మారుతి ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో తాము మోసపోయామని లబోదిబోమన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఉడాయింపు దాదాపు ఏడెనిమిదేళ్లుగా భైంసా పట్టణంలోని బోయిగల్లి ప్రాంతంలో మిఠాయి దుకాణం నిర్వహించిన మారుతి అందరి వద్దా అప్పులు చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.అరకోటి వరకు అప్పులు చేశాడని పలువురు పేర్కొంటున్నారు. కానీ ఎంత మొత్తం అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే దాదాపు తెలిసిన వారందరి వద్ద అప్పులు చేశాడని అతని గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఇలా అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ చెల్లించేవాడని, దీంతో చాలామంది అతనికి మళ్లీ అప్పులు ఇచ్చేవారని తెలిసింది. ఇంకా చాలా మంది అధిక వడ్డీలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అప్పులు ఇచ్చినవారు మాత్రం బయటికి రావడం లేదు. కనీసం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సదరు వ్యాపారి ఉద్దేశపూర్వకంగానే అప్పులు చెల్లించకుండా ఉడాయించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అధిక వడ్డీకి ఆశపడితే.. సదరు మిఠాయి వ్యాపారి పలువురి వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకునేవాడని తెలిసింది. రూ. 5 నుంచి రూ.10 వరకు వడ్డీ చొప్పున అప్పులు తీసుకునేవాడని, దీంతో చాలామంది అధిక వడ్డీ ఆశతో ఎలాంటి ఆధారాలు, ప్రమాణ పత్రాలు లేకుండానే అప్పులు ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కసారిగా సదరు వ్యాపారి మాయమవడంతో అధిక వడ్డీకి అప్పులు ఇచ్చిన వారి పరిస్థితి అయోమయంగా మారింది. అధిక వడ్డీలకు ఆశపడి ప్రస్తుతం కనీసం బయటికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఎలాంటి స్థిర, చర ఆస్తులు, బాండ్‌పేపర్ వంటి వాటిపై అప్పు ఇచ్చి ఉంటే కనీసం 420 కేసు నమోదు చేసేందుకు వీలుండేదని పలువురు చెబుతున్నారు. లుక్ఔట్ నోటీసులు ఇచ్చాం భజరంగ్ స్వీట్ హోం నిర్వాహకులు చాబే మారుతి గత నెల 1వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అతని కొడుకు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. అప్పుల బాధతోనే ఇంటి నుంచి వెళ్లిపోతున్నాని మెసేజ్ పెట్టినట్లు అతని కొడుకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మారుతి ఆచూకీ కోసం అన్ని పోలీస్స్టేషన్లకు లుక్ఔట్ నోటీసులు ఇచ్చాం. డీసీఆర్వోకు సైతం తెలియజేశాం. – శ్రీనివాస్, పట్టణ సీఐ -
‘మీ కోసం ఎదురుచూసే వారుంటారు’
సాక్షి, భైంసా : ‘‘రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించండి.. మనం సక్రమంగా వెళ్తున్నా.. ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి.. మీ మీదే ఆశలు పెట్టుకుని, మీ కోసమే మీ ఇంట్లో ఎదురుచూసే వారుంటారు. జాగ్రత్తగా ప్రయాణించండి.. జాగ్రత్తగా ఇంటికి చేరండి.’’ అంటూ గతేడాది సరిగ్గా స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మృతి చెందిన తన సోదరుడి జ్ఞాపకార్థం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భైంసా మండలం బడ్‌గాంకు చెందిన భోస్లే రాధాకిషన్ పాటిల్ గతేడాది ఆగస్టు 15న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన గ్రామం నుంచి ప్రతిరోజు భైంసాకు పాలు తీసుకొచ్చే రాధాకిషన్ ఆ రోజు సైతం ఉదయం పాలతో బైక్‌పై వస్తుండగా, భైంసాలోని సాత్పూల్ వంతెన సమీపంలో లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాద ఘటన జరగడంతో ఆయన మృతిని జీర్ణించుకోలేని అతని కుటుంబ సభ్యులు గురువారం రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాధాకిషన్ సోదరుడు బాజీరావు పాటిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అతని సోదరుడు మృతి చెందిన ఏడాది గడిచిన సందర్భంగా భైంసా పట్టణంలో ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి, అనంతరం ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ద్విచక్ర వాహన దారులు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఫలితంగా ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, వైద్యులు రామకృష్ణగౌడ్, పట్టణ ఎస్సై బాలకృష్ణ, విష్ణుప్రకాశ్, మోహన్‌రావు పటేల్, టీఎన్జీవోస్ పట్టణ అధ్యక్షులు ఎండపెల్లి అశోక్ తదితరులున్నారు. -
పైసలిస్తేనే సర్టిఫికెట్!
సాక్షి, భైంసా (ఆదిలాబాద్) : ప్రభుత్వ కార్యాలయాల్లో దళారుల రాజ్యం నడుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాల్లో... సామాన్యులు రోజులు, నెలల తరబడి తిరిగినా కాని పనులు, వీరిని ఆశ్రయిస్తే మాత్రం గంటలు, రోజుల వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. అధికారులకు, దళారులకు మధ్య సంబంధాలు ఉండడంతో వారు దగ్గరుండి మరీ పనులు చేయించుకుంటున్నారని విమర్శలున్నాయి. సామాన్య ప్రజలు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రేపు, మాపు అని తిప్పుతుండడంతో విసిగి వేసారి దళారులను ఆశ్రయిస్తున్నారు. వారికి అడిగినంత సమర్పించుకుని పనులు చేయించుకుంటున్నారు. కొందరు దళారులు అధికారులకు తెలియకుండానే నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారుల వద్ద కంటే దళారుల వద్దే అధిక సంఖ్యలో దరఖాస్తులు ఉంటున్నాయనేది బహిరంగ రహస్యం పనికో రేటు.. ఆదాయం, నివాసం, కుల, జనన, మరణ ధ్రువీకరణపత్రాలతోపాటు రైతులకు పట్టాదారుపాస్ బుక్‌లు, పహనీలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల మంజూరు.. ఇలా పని ఏదైనా తహసీల్దార్ కార్యాలయానికి రావల్సిందే. పట్టణ ప్రజలతోపాటు మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కొందరు దళారులు ఏళ్లుగా ఇదే పనిలో పాతుకుపోయి ఉండడంతో.. ఏ అధికారి వచ్చినా వారిని మచ్చిక చేసుకుని పనులు చేసుకుంటారని ఆరోపణలున్నాయి. దీంతో ప్రజలు కూడా దళారులను ఆశ్రయిస్తేనే పనులు త్వరగా పూర్తవుతాయని వారినే సంప్రదిస్తున్నారు. దీంతో దళారులు ప్రతి పనికి ఓ రేటు చొప్పున దరఖాస్తు దారుల నుంచి వసూలు చేసి అధికారులకు వాటాలు అందిస్తారని సమాచారం. దళారుల వద్దే ఎక్కువ దరఖాస్తులు.. దళారులను సంప్రదిస్తే త్వరగా పనులు పూర్తవుతుండడంతో చాలామంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారుల వద్ద కంటే దళారుల వద్దే ఎక్కువ దరఖాస్తులు ఉండడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. పెద్దమొత్తంలో వేతనాలు అందుకునే అధికారుల కంటే దళారులే కోటీశ్వరులుగా మారుతున్నారని, అధికారుల సంపాదన కంటే దళారుల సంపాదనే ఎక్కువగా ఉంటోందని రెవెన్యూ సిబ్బందే చర్చించుకుంటున్నారు. పట్టాపాస్‌బుక్‌ల కోసం పాట్లు.. రైతులకు ఏడాదిలో ఎకరానికి రూ.8వేల పెట్టుబడి సాయం అందించేందుకుగాను రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. ఇందుకుగాను భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి కొత్త పట్టాదారు పుస్తకాలను అందించింది. అయితే ఈ ప్రక్రియలో ఇప్పటికీ చాలామంది రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు రాలేదు. పహనీలో పేరు రాయాలన్నా, రిజిస్ట్రేషన్ అయిన భూమికి మ్యుటేషన్ చేయాలన్నా, కొత్త పాస్‌బుక్ ఇవ్వాలన్నా వీఆర్వోల చేయి తడపాల్సిందే. తాము డబ్బులు పెట్టి కొన్న భూమికి రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా వీఆర్వోకు లంచం ముట్టనిదే పేరు మార్చడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొత్త పట్టాదారుపాస్బుక్లకోసం నెలల తరబడి తిప్పించుకుంటున్నారని వాపోతున్నారు. భూమి కొలవాలన్నా సర్వేయర్లు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీసేవలోనే దరఖాస్తు చేసుకోవాలి ప్రజలు కుల, ఆదాయ, ఇతర సర్టిఫికెట్ల కోసం తహసీల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. గడువులోపు మీసేవ ద్వారానే ధ్రువపత్రాలు అందుతాయి. దరఖాస్తుదారులు దళారులను ఆశ్రయించవద్దు. వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. – రాజేందర్, తహసీల్దార్ -
'ఢిల్లీ నుంచి భయపెడతాం'
సాక్షి, భైంసా(మంచిర్యాల) : బీజేపీ కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉండాలని, ప్రత్యర్థి పార్టీలకు భయపడవద్దని, వారు మిమ్మల్ని భయపెడితే.. వారిని మేం ఢిల్లీ నుంచి భయపెట్టిస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం భైంసా పట్టణంలోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.రమాదేవి నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే వందకుపైగా నియోజకవర్గాలు అభివృద్ధిలో అత్యంత వెనుకబాటులో ఉన్నాయని, అందులో ముథోల్ నియోజకవర్గం స్థానం దయనీయంగా ఉందన్నారు. ప్రధాని మోదీ వెనుకబడిన నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. త్వరలోనే ముథోల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ అయిన బాసర కళాశాలలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. బంగారు తెలంగాణలో కనీసం విద్యార్థులకు సౌకర్యాలు అందడం లేదని ఆయన విమర్శించారు. అధ్యాపకులు లేక ఇప్పటికీ విద్యార్థులకు సిలబస్ ప్రారంభం కాలేదని, వసతిగృహాల్లో సౌకర్యాలు లేవన్నారు. మున్సిపల్ ఎన్నికల లబ్ధి కోసమే.. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికోసమే టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఇటీవల కరీంనగర్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వాఖ్యలు అలాంటివేనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలను తమవైపు తిప్పుకునే కుట్రలో భాగమేనన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీనే గెలిపించాలన్నారు. అలాగే భైంసా మున్సిపల్లో జరిగిన వార్డుల విభజన, ఓటరు జాబితాలో తప్పులపై మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఏ పార్టీకి నష్టం లేకుండా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15వార్డులో పర్యటన పట్టణంలోని 15వ వార్డులో ఎంపీ పర్యటించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేవని, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు లేవని, పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదముందన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా 15వార్డు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏడాదిలోపు కాలనీలో సమస్యలు పరిష్కరించి, మోడల్ కాలనీగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
30 ఏళ్లుగా అదే రుచి..
సాక్షి, భైంసా(ముథోల్) : భైంసాలో ఇప్పటికీ గడ్డెన్న ఆఫీసుగా చెప్పుకునే ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి వచ్చే కార్యకర్తలకు ఆనవాయితీగా అటుకులు, పేలాలే టిఫిన్‌గా అందించడం కొనసాగుతోంది. ముథోల్ గడ్డపై చెరగని ముద్ర వేసుకున్న గడ్డెన్న కాకా వారసత్వం కొనసాగుతోంది. దివంగత గడ్డెన్న ఆరుసార్లు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. గడ్డెన్న బతికున్నంతకాలం ఇక్కడి వారంతా కాకా అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన ఉన్న ప్రతిరోజు ఇక్కడికి వచ్చే కార్యకర్తలందరికీ అల్పాహారాలు తినిపించి, యోగక్షేమాలు తెలుసుకుని పంపేవారు. సలీం చేతిలో.. సలీం.. ఈ పేరు ముథోల్ నియోజకవర్గంలో అందరికీ చూపరిరిచితం. దివంగత గడ్డెన్న మన మధ్యలేక పదిహేనేళ్ల కాలం గడుస్తోంది. గడ్డెన్న బతికున్నంతకాలం అక్కడికి వచ్చేవారికి ఆయన వంట మనిషి సలీం అటుకులు, పేలాలు తాళింపు వేసి సిద్ధంగా ఉంచేవారు. తన వద్దకు వచ్చిన అనుకూలురైనా, వ్యతిరేకులైనా ఉదయం వేళ వస్తే టిఫిన్, రాత్రి వేళ వస్తే భోజనం చేయించి పెట్టేవారు. ముథోల్ నియోజకవర్గ ప్రజలు గడ్డెన్న కాకా అభిమానులు పట్టణానికి ఏ పని కోసం వచ్చినా ఇక్కడి గడ్డెన్న కాకా ఆఫీసులో టిఫిన్ చేసి వెళ్లేవారు. 2004 ఏప్రిల్ 20న గడ్డెన్న కాకా మరణ అనంతరం ఆయన కుమారులు విఠల్‌రెడ్డి, సూర్యంరెడ్డిలు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 30 ఏళ్లుగా.. ముప్పయ్యేళ్లుగా అప్పుడు, ఇçప్పుడు అదే సలీం వంట మనిషిగా ఉన్నారు. గడ్డెన్న కాకా బతికున్న సమయంలోనూ విఠల్‌రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పడు సలీ మే వంట మనిషిగా ఉన్నాడు. ముప్పయ్యేళ్ల నుంచి ఒకే రుచితో అటుకులు, పేలాలు అల్పాహారాన్ని తయారు చేసి పెడుతున్నాడు. కాకా అభిమానులు ఆయన కార్యకర్తలు సలీం చేతి అటుకులు, పేలాలుతినేందుకే ఇష్టపడుతుం టా రు. రుచికరమైన అటుకులు, పేలాలు తినేం దు కు గడ్డెన్న కాకా ఆఫీసుకు వస్తుంటారు. అప్ప ట్లో గడ్డెన్న వద్ద ఇప్పట్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వద్ద వంట మనిషిగా పని చేస్తున్న సలీం ఎలాం టి అహంభావం లేకుండా సదాసీదాగా ఉంటాడు. ఇప్పటికీ ఆ కుటుంబమే.. ఈ కుటుంబం వద్దే పనిచేయాలని అనిపిస్తుంది. గడ్డెన్న సాబ్ జమానా నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ఎంతోమంది పిల్లలు అప్పట్లో తండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడంతా రాజకీయ నాయకులుగా ఎదిగి మండల స్థాయి పదవులు చేస్తున్నారు. గడ్డెన్న కాకా దివంగతులయ్యాక విఠల్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా నేను వంటమనిషిగానే ఉన్నాను. వంటమనిషిలా కాకుండా కుటుంబ సభ్యునిగా చూసుకునే గడ్డిగారి ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నిరోజులైనా ఇక్కడే వంటమనిషిగా కొనసాగుతాను. – సలీం, వంటమనిషి -
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది
-
కేసీఆర్‌కు అంబేద్కర్ నచ్చలేదు: రాహుల్
సాక్షి, భైంసా: దేశం మొత్తం అంబేద్కర్ బాటలో నడుస్తుంటే ఆయన పేరెత్తడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడటం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి అంబేద్కర్ పేరు పెట్టలేదన్నారు. కేసీఆర్‌కు అంబేద్కర్ పేరు నచ్చలేదని, అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఆయన పేరు తీసేశారని తెలిపారు. ఇది అంబేద్కర్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో టీఆర్ఎస్ సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. అవినీతితో కేసీఆర్ కుటుంబం కోట్లు దండుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎంత మందికి వచ్చాయని అడిగారు. ప్రాజెక్టుల పేరు మార్చి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు, ఆదివాసీల కోసం తాము తెచ్చిన పథకాలను పక్కన పెట్టారని పేర్కొన్నారు. అడవులపై గిరిజనులకు తాము పూర్తి హక్కులు కల్పించామని చెప్పుకొచ్చారు. త్వరలోనే మోదీ, కేసీఆర్ పాలన అంతం విదేశాల్లోని నల్లధనం వెలికి తీసి, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఏమైందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రఫేల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి రూ. 30 కోట్లు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి అప్పగించారన్నారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోదీ.. సంపన్నులను మాత్రమే కాపలా కాస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే చెబుతారని అన్నారు. మోదీ, కేసీఆర్ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించనుందని జోస్యం చెప్పారు. -
సీన్ రివర్స్; పట్నం నుంచి పల్లెకు..
సాక్షి, భైంసాటౌన్: గ్రామాల్లో ఉపాధి లేకపోవడం, చిన్నా చితక పనులు చేసుకుందామంటే సమాజంలో చిన్నచూపు, ఉన్నతంగా బతకాలనే ఆశ.. ఇలా కారణమేదైనా.. యువత ఎక్కువగా పట్నం బాట పట్టినవారే.. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరినీ విడిచి ఉద్యోగాల కోసం ఊరు విడిచిన వారే.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. ఐదంకెల జీతం ఉండడంతో తమపై ఆధారపడిన కుటుంబానికి కొంతైనా సహాయ పడవచ్చని భావించినవారే.. అయితే ప్రస్తుతం వారి ఆలోచన మారుతోంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఖర్చులు పెరగడం, వేతనం సరిపోకపోవడం, లేదా ఉద్యోగ సంతృప్తి లేకపోవడంతో సొంతూరిలోనే ఏదైనా పని చేసుకుందామని పట్నం వీడి ఊరిబాట పడుతున్నారు. పని ఒత్తిడి, భద్రత కరువు చదువుకున్న యువత ఎక్కువగా తమ అర్హతకు సరిపోయే ఉద్యోగాలు స్థానికంగా ఉండకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి మహా నగరాలకు వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీల్లో, సాఫ్ట్వేర్ సంస్థల్లో ఐదంకెల జీతం చేసేవారు. తమ వేతనంలోంచి నెలనెలా కొంత తమ కుటుంబ సభ్యులకు పంపేవారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తమ వారిని కలుసుకోవడానికి రావడానికి వీలుంటుంది. ఐటీ, సాఫ్ట్‌వేర్‌లాంటి సంస్థల్లో అధిక వేతనం ఉన్నా.. పని ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. దీంతోపాటు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా.. ఉద్యోగానికి భద్రత కూడా ఉండదు. అంతేగాకుండా మహానగరాల్లో ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, ఇతర ఖర్చులు అధికంగానే ఉంటాయి. దీంతో పని ఒత్తిడి ఓవైపు.. పెరుగుతున్న ఖర్చులు మరోవైపు.. ఇలా మహానగరాల్లో పలువురు విసిగి వేశారుతున్నారు. పలకరించేవారు లేక.. కాలంతో పోటీ పడుతున్న ప్రస్తుత సమాజంలో.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే వారే కరువయ్యారు. పట్టణాల్లోనూ ఇప్పుడు ఈ సంస్కృతి ఎక్కువవుతోంది. మహానగరాల్లోనైతే చెప్పాల్సిన పని లేదు. తమ ఇంటిపక్కన ఉండేవారి ముఖమే తెలియదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ఫోన్ల ప్రభావంతో నలుగురు కలిసినా.. ఎప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌పైనే ధ్యాసంతా.. ఇక మనసారా మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకునే తీరిక ఎక్కడిది.. పక్కనే ఉన్నా పలకరించం కానీ.. వాట్సాప్‌లో మాత్రం గుడ్మార్నింగ్లు.. గుడ్ నైట్లకు తక్కువుండదు.. ఎదురుగా ఉన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పం.. కానీ ఫేస్బుక్లో మాత్రం హ్యాపీ బర్త్‌డేలు.. ఇలా మనవారితో కంటే స్మార్ట్ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నాం. దీంతో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. అనుబంధాలకు దగ్గరవ్వాలని.. పెద్ద, పెద్ద నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసేవారే ఎక్కువగా ఉంటారు. పొద్దున లేచింది మొదలు ఉరుకులు.. పరుగులు.. కాలు బయట పెడితే.. ట్రాఫిక్ తంటా.. సమయానికి ఆఫీసుకు వెళ్లకపోతే బాస్‌తో తంటా.. ఇన్ని తంటాల నడుమ పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో వారు పెడదోవ పట్టే అవకాశం ఉంది. ఇప్పటి పిల్లలకు అమ్మానాన్న తప్పితే అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, ఇతర బంధువుల గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కుటుంబాలు విడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు స్థానికంగా తమవారికి అందుబాటులో ఉంటూ వ్యాపారం, వ్యవసాయంలాంటివి చేసుకుందామని, పిల్లలకు అనుబంధాల విలువ తెలియాలని సొంతూళ్లకు వస్తున్నారు. పాడితో ఉపాధి పొందుతున్నా.. గతంలో ఇక్కడ ఉపాధి సరిగా లేకపోవడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లాను. అక్కడ మూడేళ్లు పనిచేశాను. అక్కడి ఆఫీస్‌లో అడ్మిన్‌గా పని చేశాను. నెలకు రూ.40 వేతనం వచ్చేది. వేతనం బాగానే ఉన్నా.. ఎక్కడో వెలితిగా ఉండేది. ప్రతిసారీ ఊరి వైపు మనసు మళ్లేది. సొంతూళ్లోనే ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాను. ముందునుంచే నాన్న గారు పాలవ్యాపారం చేస్తున్నారు. మాకున్న వ్యవసాయ భూమిలో పాడిపశువులు పెంచుతూ పాల ద్వారా ఉపాధి పొందుతున్నాను. ఇప్పుడు ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేసుకుంటుండటం సంతృప్తిగా ఉంది. – సందీప్, భైంసా 35 వేల వేతనం వదులుకున్నా.. నేను ఐదేళ్లు హైదరాబాద్‌లోని ఫైబర్‌నెట్ సంస్థలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేశాను. నెలకు రూ.35వేల వరకు వేతనం వచ్చేది. అయితే ఎన్ని రోజులు పనిచేసినా సంతృప్తి లేకపోవడం, దాంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవడంతో సొంతూళ్లోనే ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాను. మన కోసం మనం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. అందుకే మాకున్న ఆరెకరాల వ్యవసాయ భూమినే సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాను. ఇటీవలే మల్బరీ సాగు ప్రారంభించాం. పట్టు పురుగుల పరిశ్రమ స్థాపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత పురోగతి సాధిస్తాం. – రజిని శేఖర్, భైంసా ఫార్మసీని వదిలి.. ఫార్మర్‌గా మారి.. మాది సారంగపూర్ మండలం కంకెట గ్రామం. ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో రూ.25 వేల వేతనంతో ఉద్యోగం చేశాను. కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్నా. కానీ పెద్దగా సంపాదన లేదు. వచ్చే వేతనం ఇక్కడితో పోల్చుకుంటే ఎక్కువే. కానీ.. సిటీలో అది చాలా తక్కువ. ఎంత కష్టపడ్డా సంతృప్తి కూడా ఉండేది కాదు. ఈ క్రమంలోనే సొంతూరిలో కష్టపడదామని ఏడాది క్రితం కంకెటకు వచ్చేశాను. భూమిని నమ్ముకుని సాగు చేస్తున్నాను. కాస్త కష్టంగా ఉన్నా.. కన్న ఊరిలో పనిచేసుకోవడం తృప్తిగా ఉంది. – పుస్పూర్ సుభాష్, కంకెట -
మాయమాటలు చెప్పి..డబ్బులు కాజేసి..
భైంసా(ముథోల్): భైంసాలోని ఆంధ్రాబ్యాంకులో తన సేవింగ్ ఖాతాలో దాచుకున్న డబ్బును తీసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి రూ.20వేలు కాజేసిన ఉదంతమిది. సోమవారం కుభీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన భోజన్న ఆంధ్రాబ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకునేందుకు భైంసాకు వచ్చాడు. బ్యాంకులో డబ్బులు తీసుకొని బయటకు రాగానే రోడ్డుపైన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై భోజన్న వద్దకు వచ్చారు. డబ్బులు తక్కువ వచ్చాయని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే మిగతావి వస్తాయని మాయమాటలు చెప్పారు. దీంతో భోజన్న నమ్మి రూ.20వేలను వారి చేతిలో పెట్టాడు. వారు బైక్‌పై వెళ్లగా వెనకాలే భోజన్న వెళ్లాడు. కార్యాలయంలోనికి వెళ్లి వస్తామని ఇద్దరిలో ఒకరు లోపలికి డబ్బులతో వెళ్లారు. మరోవ్యక్తి భోజన్నతో మాట్లాడుతూ ఉండిపోయాడు. కాసేపటికి ఉన్న వ్యక్తి కూడా మాయమయ్యాడు. తనతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో భోజన్న కార్యాలయంలోనికి వెళ్లి చూశాడు. అప్పటికే కార్యాలయం పక్క నుంచి నగదుతో వారు పరారయ్యారు. అక్కడికి భోజన్నకు తెలిసిన వ్యక్తులు రావడంతో జరిగిన ఘటనను వారికి వివరించాడు. డబ్బులు తీసుకుని ఇద్దరు వ్యక్తులు ఉడాయించారని నిర్ధారించుకున్న వారు భైంసా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు. -
ఇంటికి ఇక డిజిటల్ నంబర్
భైంసా(ముథోల్) : పట్టణాల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ విషయంలో ఎన్ని ఆధునిక పద్ధతులు అనుసరిస్తున్నా అక్రమాలు ఆగడంలేదు. షాటిలైట్ ఆధారంగా జియోట్యాగింగ్ విధానంతో ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు ఇంటి పన్ను నిర్ధారణ ప్రక్రియను ప్రారంభించినా అక్రమాలు నిలుపడంలో విఫలమవుతున్నారు. మున్సిపాలిటీల్లోని పెద్దపెద్ద భవనాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాలకు డిజిటల్లో సూచించిన లోన్ల ప్రకారం పన్నులు రావడంలేదు. దీంతో ప్రభుత్వం పట్టణాల్లో ఇళ్లకు డిజిటల్ నంబర్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అమలులోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు మున్సిపాలిటీల్లో... జిల్లాలో నిర్మల్, భైంసా రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ మున్సిపాలిటీలో 36 వార్డులు, 1.10లక్షల జనాభా ఉన్నారు. భైంసా మున్సిపాలిటీలో 23 వార్డులు, 56వేల జనాభా ఉన్నారు. పట్టణాల్లోని వార్డులను వార్డులుగా లేదా బ్లాకులుగా విభజిస్తారు. బ్లాకుకు ఒక నంబరును కేటాయించి ఇళ్లకు వరుసగా నంబర్లు నమోదు చేస్తారు. ఖాళీస్థలాలు, ప్లాట్లు ఉన్న వాటికి నంబర్లు కేటాయించి పన్ను నిర్ధారిస్తారు. మున్సిపాలిటీలో ఒకటవ వార్డును ఒకటవ బ్లాకుగా గుర్తిస్తే ఆ వార్డుకు సైతం ఒకటవ నంబరు నమోదవుతుంది. ఒకటవబ్లాకు, ఒకటవ వీది, ఒకటవ ఇంటి నంబరు(111) ఇలా డిజిటల్ నంబరు నమోదవుతుంది. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో బ్లాకులు, వీధులను, ఇళ్లను ఇలా మూడంకెలతో నిర్ణయించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. వార్డు వారిగా డిజిటల్మ్యాప్లను ఆన్లైన్లో చేర్చి ఇల్లు, చిరునామా తెలుసుకునేలా పూర్తి సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. తొలగనున్న ఇబ్బందులు ఇళ్లకు డిజిటల్ నంబర్లు నమోదుచేస్తే ఇంటి పన్ను విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగవు. మున్సిపాలిటీ నిర్ధారించిన ఆదాయం సమకూరుతుంది. ప్రజలకు చిరునామ ఇబ్బందులు తొలగుతాయి. పట్టణానికి ఎవరైనా కొత్తవారు వస్తే ఇంటి చిరునామా డిజిటల్ నంబరు ఆధారంగా తెలిసిపోతుంది. ఈవిధానంతో పౌర సరఫరాల శాఖ, పోస్టల్, పోలీసు, టెలికాం, విద్యుత్‌శాఖ, జనాభాగణన, ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలు, ఇతర సేవలకు సైతం ఇబ్బందులు తీరనున్నాయి. డిజిటల్ నంబర్లతో మున్సిపాలిటీల్లోనూ పారదర్శకత నెలకొనే అవకాశం ఉంటుంది. -
భైంసాలో ఇద్దరు బాలురు మృతి
విద్యార్థుల మృతితో భైంసాలో విషాదఛాయలు భైంసా : రోజులాగే ఇద్దరు స్నేహితులు బడికి వెళ్లారు. శనివారం సాయంత్రం సెలవు కాగానే పుస్తకాల బ్యాగులు ఇంట్లో పడేశారు. ఆరుబయట ఆడుకున్నారు. అలా అలా ఊరు శివారులోకి వెళ్లారు. అయితే రాత్రయినా తిరిగిరాలేదు. ఇటు కుటుంబసభ్యుల్లో గాబరా మెుదలైంది. విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిపారు. గాలింపు ముమ్మరం చేశారు. చివరికి భైంసా పట్టణంలోని గోపాల్‌నగర్ సమీపంలో జనావాసాలకు ఆనుకుని ఉన్న నీటి గుంతలో స్నానానికి వెళ్లిన సయ్యద్‌ఇమ్రాన్(12), ముజమ్మిల్ ఖురేషి(9) మృతదేహాలుగా కనిపించారు. ఇక్కడి లోతైన గుంత ఇటీవలే వర్షానికి నిండింది. ఇప్పుడిలా ఇద్దరు చిన్నారులను బలిగొంది. ఈ ఘటన భైంసాలో విషాదం నింపింది. తరగతులు వేరైనా స్నేహితులుగా.. భైంసా పట్టణంలోని ఓవైసీనగర్ ప్రాంతంలో సయ్యద్గఫార్ కుటుంబం నివసిస్తుంది. ఈయనకు ఐదుగురు సంతానం. నాలుగేళ్ల క్రితం సయ్యద్ గఫార్ మృతిచెందాడు. ఐదో సంతానమైన సయ్యద్ ఇమ్రాన్(12)ను తల్లి కుతిజాబేగం పట్టణంలోని యూపీఎస్ పాఠశాలలో ఐదో తరగతి చదివిస్తోంది. అతడు రోజూ బడికి వచ్చేవాడు. సోదరులంతా పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. పక్కనే కసాబ్‌గల్లిలో సర్వర్ఖురేషి కుటుంబం నివసిస్తుంది. సర్వర్ ఖురేషి కుమారుడు ముజమ్మిల్ఖురేషి(9) కూడా ఇదే పాఠశాలలో మూడో తరగతి చదివేవాడు. వీరిద్దరూ స్నేహంగా ఉండేవారు. తరగతులు వేరైనా ప్రతీరోజు బడి అయిపోగానే కలిసి ఆడుకునేవారు. అలా శనివారం సాయంత్రం బడికి సెలవు కాగానే పిల్లలిద్దరూ తిరిగొచ్చి.. ఇలా తిరిగిరాని లోకాకు వెళ్లిపోయారు. నీటి గుంతలో స్నానానికని వెళ్లి ప్రాణాలే కోల్పోయారు. పిల్లల మృతదేహాల వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. భైంసా ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పట్టణ ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసుకున్నారు. -
భైంసా ఘటన నిందితుల రెస్ట్
ఆస్తి తగదాలే కారణం : జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి నిర్మల్‌టౌన్ : ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో ఈ నెల 10న జరిగిన ఐదుగురి హత్య కేసులో నిందితులను శనివారం అరెస్టు చేశారు. ఐదుగురిపై మారణాయుధాలతో దాడి చేసి హతమార్చిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేసిన వారి వివరాలను శనివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తరుణ్‌జోషి వెల్లడించారు. భైంసా డీఎస్పీ అందె రాములు ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం నిందితులను పది రోజుల్లోనే అరెస్టు చేసిందని ఎస్పీ అభినందించారు. ప్రధాన నిందితులు మహ్మద్ జావిద్‌ఖాన్, సయ్యద్ మాజీద్ అలీలను బాసర గోదావరి బ్రిడ్జి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నియామతుల్లాఖాన్, యూనిస్‌ఖాన్, వాహిదాఖాన్, అక్రమ్‌బీ, ఆయేషాఖానమ్(14)లను కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ హత్యలకు ప్రధాన కారణం ఆస్తితగాదాలుగా తేలింది. వివరాలు.. 2013 నుంచి వీరి మధ్య ఇంటికి సంబంధించిన గొడవ జరుగుతోంది. భైంసా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జావిద్‌ఖాన్, సయ్యద్ మాజిద్, అతుఖాన్లపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో జావిద్‌ఖాన్, సయ్యద్ మాజిద్, అతుఖాన్లకు నిర్మల్ కోర్టులో బెయిల్ మంజూరైంది. ప్రధాన నిందితులు స్తిరాస్థి విషయమై ఒప్పందం చేసుకోవాలని హత్యకు గురైన ఐదుగురిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ విషయం కొలిక్కి రాకపోవడంతో వారిని హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. హత్యలు చేయడానికి 15 రోజుల ముందు నిజామాబాద్‌లోని అసద్‌బాబానగర్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అనంతరం నిందితులు మూడు రోజుల ముందుగానే తమ కుటుంబ సభ్యులను నిజామాబాద్‌లోని ఇంటికి తరలించారు. అనంతరం పథకం ప్రకారం మారణాయుధాలతో దాడి చేశారు. మొదట భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద ఉన్న తుక్కుదుకాణంలో పనిచేస్తున్న నియామతుల్లాఖాన్, యూనిస్ఖాన్లను హత్య చేసిన అనంతరం వారి ఇంటికి వెళ్లి వాహిదాఖాన్, అక్రమ్ బీ, అయేషాఖానమ్లను హత్య చేశారు. అనంతరం పథకం ప్రకారం నిజామాబాద్‌లోని ఇంటికి వెళ్లిపోయారు. ఎస్పీ తరుణ్‌జోషి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు బాసర వద్ద నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరికి సహకరించిన ఇతర కుటుంబసభ్యులు నిజామాబాద్ పట్టణంలో ఉన్నారని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు. మారణాయుధాలతో పాటు బాధితుల నుంచి దొంగిలించిన 8 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
టిప్పర్ రూపంలో మీదపడ్డ మృత్యువు
- ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆటోపై టిప్పర్ బోల్తా: 16 మంది దుర్మరణం - మృతుల్లో ఏడుగురు చిన్నారులు.. ఇటుక బట్టీల్లో కూలీలుగా జీవనం - భైంసా-బాసర ప్రధాన రహదారిపై దేగాం వద్ద అర్ధరాత్రి ఘటన భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసా-బాసర ప్రధాన రహదారిపై దేగాం గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 16 మంది మృతిచెందారు. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు మహారాష్ట్ర బల్లాడ్ గ్రామానికి చెందిన 18 మంది ఇటుక కార్మికులు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భైంసా వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టి ఆటోపై పడింది. దాంతో ఆటో నుజ్జునుజ్జై అందులో ప్రయాణిస్తున్న 16 మంది మృతి చెందారు. మృతులు నిజామాబాద్ జిల్లా నవీపేట్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలతో సహా నలుగురు పురుషులు ఉన్నారు. ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అధికారులు క్రేన్ తో టిప్పర్‌ను తొలగించారు. క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. బలిచ్చేందుకు తీసుకెళ్తున్న మేక ప్రమాదం నుంచి బయటపడింది. మృతులు వివరాలు: గణపతి, రత్నాభాయి, నారుంగ్, వందనభాయి, రాజేష్, మహేంద్ర, దీప, సాయి ప్రసాద్, సుశీల భాయి, అర్జున్, ప్రియాంక, ప్రేమ్, చాకులి, శ్యామలాభాయి, సంపంగి భాయి, అర్చన. -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య
* కత్తులతో గొంతులు కోసి దారుణంగా చంపేసిన దుండగులు * మృతులంతా రక్త సంబంధీకులే * పాత కక్షలే కారణమంటున్న పోలీసులు భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను దుండగులు దారుణంగా చంపేశారు. పదునైన కత్తులతో గొంతులు కోసి హతమార్చారు. మంగళవారం ఉదయమే ఈ వరుస హత్యలు చోటుచేసుకోవడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భైంసా పట్టణంలో 61వ జాతీయ రహదారిపై నిర్మల్ చౌరస్తా వద్ద ఉన్న తుక్కు (స్క్రాప్) దుకాణంలో మాజీ కౌన్సిలర్ నియామతుల్లాఖాన్(60) తన అన్న కొడుకు యునూస్ఖాన్(34)తో మాట్లాడుతుండగా.. దుండగులు వారిపై కారం చల్లి కత్తులతో దాడికి దిగారు. దారుణంగా గొంతులు కోసి చంపి పరారయ్యారు. దుండగులను అడ్డుకునేందుకు అక్కడే పనిచేస్తున్న అబ్దుల్ జబ్బార్, షేక్ అన్వర్లు ప్రయత్నించగా, వారిని కూడా గాయపర్చారు. అక్కడి నుంచి దుండగులు బార్‌ఇమామ్‌గల్లిలోని నియామతుల్లాఖాన్ ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్య, మాజీ కౌన్సిలర్ వహిదాఖాన్(55)ను కూడా గొంతుకోసి హత్యచేశారు. అంతకుముందే నయాబాదిలోని నియామతుల్లాఖాన్ రక్త సంబంధీకులైన అక్రమ్‌బీ ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో అనారోగ్యంతో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న అక్రమ్‌బీ(62)పై కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఆ సమయంలో టీవీ చూస్తున్న పిల్లలు భయంతో పరుగులు పెట్టారు. 15 ఏళ్ల మనువరాలు అయేషా దుండగులకు అడ్డురావడంతో ఆమెను కూడా కత్తులతో తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. అంబులెన్సులో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో అయేషా చనిపోయింది. ఇద్దరూ మాజీ కౌన్సిలర్లే.. హత్యకు గురైన నియామతుల్లాఖాన్, ఆయన సతీమణి వహిదాఖాన్‌లు గతంలో ఎంఐఎం తరఫున కౌన్సిలర్లుగా పనిచేశారు. హత్యల విషయం తెలియగానే ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్‌అహ్మద్, పలువురు కౌన్సిలర్లు భైంసా చేరుకున్నారు. జాబిర్ అహ్మద్ అందరినీ అప్రమత్తం చేసి హత్యకు గురైన కుటుంబీకులందరికీ రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. మృతదేహాలకు భైంసా ఏరియా ఆస్పత్రిలో సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. పాత కక్షలే కారణం..: డీఐజీ మల్లారెడ్డి రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల వల్లే ఈ దారుణ హత్యలు జరిగి ఉండవచ్చని వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి చెప్పారు. హంతకులను కఠినంగా శిక్షిస్తామన్నారు. మంగళవారం రాత్రి ఆయన భైంసాలో ఓఎస్డీ పనసారెడ్డి, డీఎస్పీ అందె రాములు, నిర్మల్ డీఎస్పీ మనోహర్‌రెడ్డితో పరిస్థితిని సమీక్షించారు. జావిద్‌ఖాన్, నూరుల్లా ఖాన్‌తోపాటు పలువురు దుండగలు తల్వార్లతో ఈ హత్యలకు తెగబడ్డారని చెప్పారు. నియామతుల్లాఖాన్ కుమారుడిపై 2013లో జావిద్‌ఖాన్‌తోపాటు పలువురు దాడికి దిగారని, ఈ కేసులో ఆగస్టు 2015లో కోర్టు నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష విధించినట్లు ఓఎస్డీ పనసారెడ్డి తెలిపారు. వారే ఈ హత్యలు చేసేందుకు కుట్ర పన్ని ఉంటారని డీఐజీ మల్లారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
తునికాకు గోడౌన్లో అగ్నిప్రమాదం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భైంసాలో తునికాకు గోడౌన్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గోడౌన్ నుంచి భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 90 లక్షల విలువైన తునికాకు దగ్ధమైందని గోడౌన్ యజమానులు తెలిపారు.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువరైతు ఆత్మహత్య
వ్యవసాయం కలిసి రాక చెల్లి పెళ్లి చేసే మార్గం తోచక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎలెగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జాదవ్ ప్రదీప్ (25)కు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో సోదరులు వ్యవసాయం చూసుకుంటున్నారు. అయితే, పంటలు సరిగా పండక పోవడంతో గతేడాది చెల్లిపెళ్లిని వాయిదా వేశారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండటంతో చెల్లిపెళ్లి ఎలా చేయాలో వారికి పాలుపోలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రదీప్ గురువారం రాత్రి పొలం దగ్గర పురుగుల మందు సేవించగా ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం గుర్తించారు. -
భైంసాలో ట్రాలీ ఆటోలో మంటలు
భైంసా: ఆదిలాబాద్ జిల్లాలో ఓ ట్రాలీ ఆటోలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆదివారం ఉదయం భైంసా డీఎస్పీ ఆఫీస్ సమీపంలో పార్క్ చేసిన టాటా ఏస్ ఆటోలో మంటలు వచ్చాయి. ఈ మంటల్లో వాహనం క్షణాల్లో పూర్తిగా దగ్థమైంది. ప్రమాదానికి కల కారణాలు తెలియాల్సి ఉంది. సమీపంలో ఉన్న స్థానికులు ఫైర్ సిబ్బంది సమాచారం అందించారు. అప్పటికే వాహనం కాలి బూడిదైంది. -
నిఘా నీడలో భైంసా
- శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి - ఎస్పీ తరుణ్‌జోషి ఆదిలాబాద్‌క్రైం : భైంసాలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగే ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎస్పీ తరుణ్‌జోషి అన్ని చర్యలు తీసుకున్నారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో భైంసా గణేష్ నిమజ్జన శోభాయాత్రపై బందోబస్తు అంశాలను చర్చించారు. డివిజన్లో అదనపు బలగాలు మొహరించాలని తెలిపారు. గణేష్ శోభాయాత్ర, బక్రీద్ పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకుని తెలంగాణ రాష్ట్రానికి శాంతి సందేశాన్ని పంపి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎటువంటి పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగి ఉండకూడదని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, పూర్తిగా నిషేధించామని తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు కలిగితే డయల్ 100కు లేదా, భైంసా డీఎస్పీ రాములు సెల్ 9440795076లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పనసారెడ్డి, జీఆర్ రాధిక, స్పెషల్ బ్రాంచ్‌ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, ఎస్సైలు టీడీ నందన్, కరీం, వెంకటస్వామి, అన్వర్, మల్లేష్, సురేష్ పాల్గొన్నారు. బందోబస్తు వివరాలు.. అదనపు ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు ఎనిమిది మంది, సీఐలు 20 మంది, ఎస్సైలు 50 మంది, ఏఎస్సైలు 40, హెడ్‌కానిస్టేబుళ్లు 210, కానిస్టేబుళ్లు 300 మంది, సాయుధ బలగాలు 110, హోంగార్డులు 200 మంది, మహిళా పోలీసులు 40, నిఘా వర్గాలు 25, డాగ్‌స్క్వాడ్ 3, బాంబు నిర్వీర్య బృందాలు 8, లైట్ డిటెక్టివ్ బృందాలు 12 పాల్గొంటాయి. -
కన్నీళ్లు పెట్టిస్తున్న ‘కల్లు’
- మరో ముగ్గురు కల్లుకు బలి - బావిలోకి దూకిన మరో వ్యక్తి.. - ఐదుకు చేరిన మృతుల సంఖ్య భైంసా/బాసర : కల్లు కన్నీళ్లు పెట్టిస్తోంది. చదువుల తల్లి క్షేత్రం బాసరలో కల్లు మృతుల సంఖ్య పెరుగుతూపోతోంది. కల్తీ కల్లు మహమ్మారిలా ఒక్కొక్కరిని పొట్టనపెట్టుకుంటోంది. కల్లులో మత్తు తక్కువై ఇప్పటికే పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. ఆదివారం బాసర గ్రామానికి చెందిన గైని శంకర్, మోతుకురి స్వరూపం చారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం బాసరలో మరో ఇద్దరు మృతిచెందగా, నిర్మల్‌లో మరొకరు మృతిచెందారు. దీంతో కల్లు బాధిత మృతుల సంఖ్య ఐదుకు చేరింది. స్థానికుడైన ముల్కిపోతన్న కల్లులేక ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలిపోయూడు. దీంతో చికిత్స కోసం స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన నిజామాబాద్‌కు తరలిస్తుండగా ముల్కిపోతన్న(57) కన్నుమూశాడు. మృతిచెందాడు. బాసరకే చెందిన దూజ్‌గాం పోశెట్టి(63) ఫిట్స్ వచ్చి ఇంట్లో సృ్పహతప్పి కిందపడిపోయారు. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయాడు. మైలాపూర్‌లో.. బాసర అనుబంధ గ్రామమైన మైలాపూర్‌కు చెందిన కొందపురం పోశెట్టి కల్లులేక అస్వస్థతకులోనయ్యాడు. బాసర పీహెచ్‌సీకి తరలించి చికిత్సలు చేయించారు. ఇంటికి చేరుకున్నాక విచిత్రంగా ప్రవరిస్తూ పక్కనే ఉన్న బావిలోకి దూకాడు. అపస్మారక స్థితిలో ఉన్న కొందపురం పోశెట్టిని కుటుంబీకులు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా బాసరలో కల్లుదుకాణం మూసి ఉంచారు. కల్లు దొరకక కొందరు, దొరికిన కల్లులో మత్తులేక మరికొందరు అస్వస్థతకు లోనవుతున్నారు. కల్లులేక బాసరలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మృతుల కుటుంబీకులను భైంసాకు చెందిన వ్యాపారవేత్త రామారావుపటేల్ పరామర్శించారు. నిర్మల్‌లో ఒకరి మృతి.. నిర్మల్ అర్బన్ : కల్తీకల్లుకు నిర్మల్‌లో బుధవారం మరొకరు బలయ్యారు. స్థానిక ఈద్గాంకు చెందిన మహమూద్(45) మంగళవారం కల్లు తాగాడు. అందులో మత్తు మోతాదు తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు చికిత్సలు అందించినా బుధవారం పరిస్థితి విషమించడంతో మహమూద్ మృతిచెందారు. ఆయనకు భార్య అమీనాబేగం, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత రెండురోజుల్లో 40 మంది కల్లుబాధితులు నిర్మల్ ఆస్పత్రికి తరలివచ్చారు. -
భైంసాలో ఎమ్మార్పీఎస్ ధర్నా
ఆదిలాబాద్ : పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే సోమవారం ఇద్దరు ఎమ్మార్పీఎస్ నాయకులు హత్యకు గురయ్యారని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆరోపించారు. అందుకు నిరసనగా భైంసాలో మంగళవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో బెల్లంపల్లిలో ఇద్దరు నేతలు హతమయ్యారని విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాము రాస్తారోకో చేశామన్నారు. రాస్తారోకోతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. -
కబ్జాకోరల్లో బాసర ఆలయ భూములు
భైంసా : చదువుల తల్లి బాసర సరస్వతీ క్షేత్రం అమ్మవారి భూములకు రక్షణ కరువైంది. దేశంలో రెండు సరస్వతీ ఆలయాలుండగా.. ఒకటి జమ్మూకాశ్మీర్‌లో మరో టి ఇక్కడ ఉంది. దీంతో బాసర అమ్మవారికి గతంలో భక్తులు భూములను విరాళంగా అందించారు. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం కబ్జాకోరల్లో మగ్గుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములపై దేవాదాయ శాఖ కూడా అంతగా పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు ఆ భూములకు కన్నం వేస్తున్నారు. ఆలయ భూములు ఇవే.. బాసర సరస్వతీ ఆలయానికి 158 ఎకరాల 38 గుంటల భూమి ఉంది. బాసర శివారల్లో 93.7 ఎకరాలు ఉంది. బాసరలో 72 ఎకరా ల్లో ఆలయం, అతిథిగృహలు, ఉద్యానవనాలు ని ర్మించారు. మిగితా 21 ఎకరాల భూమి అర్చకుల అ ధీనంలో ఉంది. ఈ భూమిపై పలు కేసులు న్యాయస్థానాలు, దేవాదాయశాఖ ట్రిబ్యునల్ పరిధిలో విచారణలో ఉన్నాయి. ఏళ్లుగా భూములపై విచారణ కొనసాగడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. డివిజన్ వ్యాప్తంగా భూములు... బాసర గ్రామంతోపాటు నిర్మల్ డివిజన్లో 49.26 ఎకరాలు సరిహద్దు మహారాష్ట్రలోనూ మరో 16.5 ఎకరాల భూమి ఉంది. ధర్మాబాద్ పక్కనే ఉన్న బా లాపూర్ శివారులో ఈ భూమి ఉంది. భైంసా మం డలం గుండేగాంలో 11.28ఎకరాలు, సిరాల గ్రామం లో 6.22 ఎకరాలు, తానూరు మండలం బోల్సాలో 13.18ఎకరాలు, బెల్తరోడాలో 16.15ఎకరాల భూ మి ఉంది. రికార్డుల్లో ఉన్న ఈ భూములు గుర్తించడానికి అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టడం లేదు. గతంలో వేలంపాట ద్వారా అధికారులు ఈ భూములను స్థానిక గ్రామస్తులకు సాగు చేసుకునేం దుకు కేటాయించే వారు. భూములున్న గ్రామాల్లో ముందస్తు చాటింపులు వేయించి వేలం నిర్వహించేవారు. రానురాను ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. సంబంధిత గ్రామాల్లో కొంత మంది ఈ భూములను అనధికారికంగా సాగుచేసుకుంటున్నారు. రెవెన్యూ మంత్రి చెప్పినా.. ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సు నిమిత్తం బాసర వచ్చిన అప్పటి మంత్రి రఘువీరారెడ్డికి బాసర గ్రా మస్తులు, ఆలయ భూములపై ఫిర్యాదు చేశారు. స భా వేదికపైనే మంత్రి ఆలయ భూములపై పూర్తిస్థా యి సర్వే నిర్వహించి న్యాయస్థానాల పరిధిలోని అ న్యాక్రాంతమైన భూముల స్వాధీనానికి చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. సిబ్బంది కొరత సాకుగా చూపి ఇప్పటికీ పూర్తిస్థాయి సర్వే చేపట్టలేదు. కోట్ల రూపాయల విలువ.. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందుతున్న బాసరలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నా యి. చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నలుమూలలా భక్తులు తరలివస్తున్నారు. పక్కనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఆలయ భూములు కూడా కోట్లాది రూపాయల విలువ చేస్తున్నాయి. దీంతో చాలా మంది వీటిపై కన్నేశారు. హద్దులు చెరిపేసి పక్కవారు ఆలయ భూముల్లోకి చొరబడుతున్నారు. ఆలయ భూములకు హద్దురాళ్లు, రక్షణ కంచె లేకపోవడంతో రియల్టర్లు సైతం ఈ భూమిపై కన్నేస్తున్నారు. ఇంత జరుగుతున్నా భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. బడాబాబుల కన్నుపడ్డ ఈ భూములను తెలంగాణ సర్కారే కాపాడాలని భక్తు లు కోరుతున్నారు. కానుకల రూపంలో అమ్మవారికి ఇచ్చిన భూములపై ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టి వాటిని స్వాధీనం చేసుకోవాలంటున్నారు. పకడ్బందీ సర్వే - విజయరామారావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాసర ఆలయ భూములపై పకడ్బందీ సర్వే నిర్వహిస్తున్నాం. ఆలయ భూములు పరుల పరం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ భూములపై ట్రిబ్యునల్ పరిధిలో విచారణ కొనసాగుతోంది. భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. భూముల స్వాధీనానికి నోటీసులు జారీ చేశాం. -
‘కరెంట్’ కరువు
భైంసా రూరల్ : ఈ రైతు పేరు పొల్కం రాములు. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొడుకు నాగేశ్‌ను డిగ్రీ చదివించాడు. చిన్న కొడుకు కిషన్‌ను పదో తరగతి వరకు చదివించి వ్యవసాయ పనులే చేయిస్తున్నారు. ఇద్దరు కొడుకులను చదివించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేస్తూ పైసాపైసా కూడబెట్టి పెద్ద కొడుకు నాగేశ్‌ను డిగ్రీ చదివించారు. అతను భైంసా పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఈ ఏడాది రాములు తనకున్న మూడు ఎకరాలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. మూడుసార్లు విత్తనాలు వేశాడు. సోయా పంట మొలకెత్తినా వేసవిని తలపించే ఎండలతో పంటంతా నాశనమైంది. నమ్ముకున్న వ్యవసాయం అప్పులపాలు చేయడంతో పరిస్థితి ఏమిటని దిగులుపడుతున్నారు. త్రీఫేజ్ కరెంటు సమయానికి రావడం లేదని, ఈ క్రమంలో పంటలు సరిగా పండే అవకాశం లేదని, దీంతో తాను మరింత అప్పులపాలు అయ్యే అవకాశం ఉందని పొల్కం రాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ రైతాంగాన్ని ఆదుకుని కరెంటు సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని కోరుతున్నాడు. ఈ ఏడాది ఖరీదైన ఖరీఫ్ ఖానాపూర్ : మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన కాలేరి నర్సయ్యకు ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. పేద కుటుంబం అయినా రూ.5 లక్షల కట్నంతో కూతురి వివాహం చేశాడు. కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. గతంలో కాకుండా ఈ ఏడాది సాగు అంటేనే అతి ఖరీదుతో కూడుకున్నదైనా ఖాళీగా ఉండలేక తప్పనిసరి పరిస్థితుల్లో పంట సాగు చేస్తున్నానని రైతు పేర్కొంటున్నాడు. తనకున్న ఎకరంనర వ్యవసాయ పంట పొలంలో వరి సాగు చేసేందుకు నారు సైతం పోసినా వర్షాలు కురవక, కరెంటు కోతల కారణంగా ఈ ఏడాది నాట్లు వేయడం ఆలస్యమైంది. గోదావరి పరివాహక ప్రాంతంలో విద్యుత్ ఆధారితంగా సాగు చేస్తున్నానని, గత ప్రభుత్వం ఏడు గంటలు అటు ఇటుగా విద్యుత్ సరఫరా చేసిందని, ప్రస్తుతం అధికారులు ఐదు గంటలు అని చెబుతూనే కనీసం రెండు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఒక పక్క ఎప్పం దాటిపోవడంతో నారు అదును దాటిపోతుందని, నాటు వేయించాలంటేనే పంట చివరి వరకు కరెంటు సరఫరా ఉంటుందో లేదోననే అనుమానం ఉందని అంటున్నాడు. దీనికి తోడు ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది గోదావరిలో నీరు లేదని పంట చివరి వరకు సరిపోతుందో లేదోనని రైతు తెలిపాడు. గతేడాది విద్యుత్ ఆధారితంగా పంట సాగు చేసినా ఈసారి ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతా ఊడిసినట్టయితంది కడెం : నా పేరు పాక భూమన్న. మాది కడెం మండలంలోని అంబారీపేట. నాకు ఉన్నది 3 ఎకరాల భూమి. దాంట్లకెళ్లి ఒక ఎకరం భూమిల పెసర పంట ఏసిన. మిగతా రెండెకరాల భూమిలో సన్న వడ్లు అలికిన, నారు మొలిసింది, మెల్లగా ఎదుగుతుంది. కానీ మల్ల ఎండ సంపుతుంది కద. అందుకే ఎండిపోయేటట్లుంది. ఉన్న నారు ఎండిపోతే ఎట్ల. మరి కనీసం ఇంటికన్న పనికొస్తయి, ఎట్లయితే అట్లాయే అని ఒక చైనా కంపెనీది మోటారు తెచ్చిన. దానికి రూ.18 వేలు, 40 పైపులకు రూ.24వేలు కర్సయింది. ఇది రెండు లీటర్ల డీజిల్‌కు ఒక గంట నడుస్తది. కనీసం ఈ వరి నారునైనా కాపాడుకుందామని, అడ్లు ఇంటికి పనికస్తయని కట్టపడుతున్నం. వానల్లేవు. బావిల కూడా ఎక్కువ నీళ్లు లేవు. ఉన్న నీళ్లతోనే ఈ పారకం పారిస్త. ఆ తర్వాత ఆ దేవుడే దిక్కు. ఎకరం పెసర పంట చేను ఎండలకు ఎండిపోతంది. క ండ్ల ముందే ఇట్లయితాంటే చానా బాధనిపిస్తంది. ఈసారి ఎవుసంతో ఏమీ లాభం లేదు. అంతా ఊడిసినట్టయితంది. అంతకుముందువి ఇప్పుడు కలిపి అప్పులు రూ.లక్ష దాకా అయినయి. ఎవుసం నన్నాదుకుంటదనుకుంటే దానికే నేను అప్పు చేసి కర్సుపెడుతున్న. కరెంటు కోతలతో ఇబ్బందులు పడలేకే ఇలా డీజిల్‌తో మోటారు నడుపుకుంటున్న. -
గొర్రెలకు బీమా.. పెంపకందారులకు ధీమా
భైంసా రూరల్ : ఈ రైతు పేరు పొల్కం రాములు. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొడుకు నాగేశ్‌ను డిగ్రీ చదివించాడు. చిన్న కొడుకు కిషన్‌ను పదో తరగతి వరకు చదివించి వ్యవసాయ పనులే చేయిస్తున్నారు. ఇద్దరు కొడుకులను చదివించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేస్తూ పైసాపైసా కూడబెట్టి పెద్ద కొడుకు నాగేశ్‌ను డిగ్రీ చదివించారు. అతను భైంసా పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఈ ఏడాది రాములు తనకున్న మూడు ఎకరాలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. మూడుసార్లు విత్తనాలు వేశాడు. సోయా పంట మొలకెత్తినా వేసవిని తలపించే ఎండలతో పంటంతా నాశనమైంది. నమ్ముకున్న వ్యవసాయం అప్పులపాలు చేయడంతో పరిస్థితి ఏమిటని దిగులుపడుతున్నారు. త్రీఫేజ్ కరెంటు సమయానికి రావడం లేదని, ఈ క్రమంలో పంటలు సరిగా పండే అవకాశం లేదని, దీంతో తాను మరింత అప్పులపాలు అయ్యే అవకాశం ఉందని పొల్కం రాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ రైతాంగాన్ని ఆదుకుని కరెంటు సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని కోరుతున్నాడు. ఈ ఏడాది ఖరీదైన ఖరీఫ్ ఖానాపూర్ : మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన కాలేరి నర్సయ్యకు ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. పేద కుటుంబం అయినా రూ.5 లక్షల కట్నంతో కూతురి వివాహం చేశాడు. కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. గతంలో కాకుండా ఈ ఏడాది సాగు అంటేనే అతి ఖరీదుతో కూడుకున్నదైనా ఖాళీగా ఉండలేక తప్పనిసరి పరిస్థితుల్లో పంట సాగు చేస్తున్నానని రైతు పేర్కొంటున్నాడు. తనకున్న ఎకరంనర వ్యవసాయ పంట పొలంలో వరి సాగు చేసేందుకు నారు సైతం పోసినా వర్షాలు కురవక, కరెంటు కోతల కారణంగా ఈ ఏడాది నాట్లు వేయడం ఆలస్యమైంది. గోదావరి పరివాహక ప్రాంతంలో విద్యుత్ ఆధారితంగా సాగు చేస్తున్నానని, గత ప్రభుత్వం ఏడు గంటలు అటు ఇటుగా విద్యుత్ సరఫరా చేసిందని, ప్రస్తుతం అధికారులు ఐదు గంటలు అని చెబుతూనే కనీసం రెండు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఒక పక్క ఎప్పం దాటిపోవడంతో నారు అదును దాటిపోతుందని, నాటు వేయించాలంటేనే పంట చివరి వరకు కరెంటు సరఫరా ఉంటుందో లేదోననే అనుమానం ఉందని అంటున్నాడు. దీనికి తోడు ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది గోదావరిలో నీరు లేదని పంట చివరి వరకు సరిపోతుందో లేదోనని రైతు తెలిపాడు. గతేడాది విద్యుత్ ఆధారితంగా పంట సాగు చేసినా ఈసారి ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతా ఊడిసినట్టయితంది కడెం : నా పేరు పాక భూమన్న. మాది కడెం మండలంలోని అంబారీపేట. నాకు ఉన్నది 3 ఎకరాల భూమి. దాంట్లకెళ్లి ఒక ఎకరం భూమిల పెసర పంట ఏసిన. మిగతా రెండెకరాల భూమిలో సన్న వడ్లు అలికిన, నారు మొలిసింది, మెల్లగా ఎదుగుతుంది. కానీ మల్ల ఎండ సంపుతుంది కద. అందుకే ఎండిపోయేటట్లుంది. ఉన్న నారు ఎండిపోతే ఎట్ల. మరి కనీసం ఇంటికన్న పనికొస్తయి, ఎట్లయితే అట్లాయే అని ఒక చైనా కంపెనీది మోటారు తెచ్చిన. దానికి రూ.18 వేలు, 40 పైపులకు రూ.24వేలు కర్సయింది. ఇది రెండు లీటర్ల డీజిల్‌కు ఒక గంట నడుస్తది. కనీసం ఈ వరి నారునైనా కాపాడుకుందామని, అడ్లు ఇంటికి పనికస్తయని కట్టపడుతున్నం. వానల్లేవు. బావిల కూడా ఎక్కువ నీళ్లు లేవు. ఉన్న నీళ్లతోనే ఈ పారకం పారిస్త. ఆ తర్వాత ఆ దేవుడే దిక్కు. ఎకరం పెసర పంట చేను ఎండలకు ఎండిపోతంది. క ండ్ల ముందే ఇట్లయితాంటే చానా బాధనిపిస్తంది. ఈసారి ఎవుసంతో ఏమీ లాభం లేదు. అంతా ఊడిసినట్టయితంది. అంతకుముందువి ఇప్పుడు కలిపి అప్పులు రూ.లక్ష దాకా అయినయి. ఎవుసం నన్నాదుకుంటదనుకుంటే దానికే నేను అప్పు చేసి కర్సుపెడుతున్న. కరెంటు కోతలతో ఇబ్బందులు పడలేకే ఇలా డీజిల్‌తో మోటారు నడుపుకుంటున్న. -
భూకంపం వదంతులు
భైంసా రూరల్ : నిజామాబాద్ జిల్లాలో అప్పుడే పుట్టిన శిశువు భూ కంపం వస్తుందని చెప్పి కన్నుమూసిందని, మహారాష్ట్రలో భూకంపం వచ్చిందని, ఇక్కడ కూడా రాబోతోందనే వదంతులతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మంగళవారం ఉదయం నుంచి సమగ్ర కుటుంబ సర్వేలో బిజీగా గడిపిన ప్రజలు ఈ వదంతులతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి వేళ ఫోన్‌కాల్స్ ఏమిటని లిఫ్ట్ చేసిన ప్రజలు భూకంపం రానుందని అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని షాక్‌కు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలైన ఈ వదంతులు వివిధ మండలాలకు క్షణాల్లో దా వానంలా వ్యాపించాయి. సమాచారం అందడమే ఆలస్యం అన్నట్లుగా.. అనేక మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. జాగారం.. సర్వే పుణ్యమా అని స్థానికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సంతోషంగా గడిపారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వ్యాపించిన భూకంప వదంతులు అందరినీ భయకంపితులను చేశాయి. ఒంటి గంటకు ప్రారంభమైన ఈ పుకార్లు నాలుగు గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అధికశాతం ప్రజలు రోడ్లపైకి వచ్చి జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంతోపాటు గ్రామాల్లోనూ ప్రజలు వేకువజాము వరకు జాగారం చేశారు. మరికొందరు ఆలయాల్లో పూజలు చేసి కాపాడాలని ఇష్టదైవాన్ని వేడుకున్నారు. వాడవాడలా ప్రజలు గుంపులుగా ఏర్పడి చర్చించుకున్నారు. ఫోన్లలో సమాచారం చేరవేత.. భూకంపం వచ్చిందనే వదంతులు వివిధ ప్రాంతాలకు వ్యా పించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా ప్రతిఒక్కరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర, నిజామాబాద్, ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులను సైతం ఆరా తీశారు. మరికొందరు సమాచారం తెలుసుకునేందుకు వేకువజాము వరకు టీవీలకు అతుక్కుపోయారు. అయితే ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెల్లారేసరికి ఆ వార్త పుకారేనని తెలిసిన జనం అజ్ఞాత వ్యక్తిని తిట్టుకుంటూ ఇళ్లలోకి వెళ్లారు. గతంలోనూ... గతంలోనూ ఇలాంటి వదంతులు నిర్మల్ వాసులను తీవ్ర కలవరపెట్టాయి. మహారాష్ట్ర ప్రాంతంలోని ఓ గుడిలో పూజా రి పూజలు చేస్తూ మృతిచెందాడని, అంతకుముందు భూకం పం వస్తుందని చెప్పాడంటూ వచ్చిన పుకార్లు ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేసింది. చివరకు అవన్నీ వదంతులేనని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పల్లె కన్నీరు పెడుతోంది!
భైంసా : అప్పుడు సమయం ఉదయం 7.30 గంటలు అప్పటికే ‘సాక్షి’ బృందం భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చేరుకుంది. పనుల్లేక రైతులు ఇళ్ల ముందు కనిపించారు. గతేడాది ఈ సమయానికి సిరాల ప్రాజెక్టు సీసీ కెనాల్ ద్వారా వచ్చే నీటితో పంటలను సాగు చేసే బిజీలో ఉండిపోయారు. కానీ.. ఈ ఏడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. పొలాల్లో పనుల్లేక.. ప్రాజెక్టు నిండక కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్నారు రైతులు. ఉదయం 8 గంటలకు ఇలేగాం గ్రామంలోని రైతు కొట్టుర్వా ర్ కేసరి వద్దకు వెళ్లి పొలంలోకి పోలేదా అంటూ అడుగగా.. ‘ఏం జేద్దాం ఆనలు లేవు. చెరు రిండలే. ఆడ వోయి ఏం జేయాల’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. 9.15 నిమిషాలకు రైతు కేసరి వద్దకు గట్టు హన్మంతు, జార్దన్ నర్సింలు, గుద్దేటి సాయన్న, బాబుమియా, అల్లకొండ మాదవ్‌రావు, గోవర్ధన్, ఉప్పు దత్తు వచ్చారు. పొలాలకు వెళ్లాల్సిన రైతులంతా ఆవేదనతో మాట్లాడుకోవడం కనిపించింది. ‘కేసరన్న ఆనలు అస్తయ లేవే పొలాలల్ల ఏమన్న అలుకుదమా తుకం పోశటట్లు కనిపిస్తలేదు’ అంటూ ఉప్పు దత్తు మొదలు పెట్టాడు. ‘తుకం పోశి ఏం జేద్దం. ఇప్పుడే ఇంత లాస్ అయినం. తుకం పోశిన పైసలు మనకోలిస్తలు’ అంటూ రైతు కేసరి సమాధానం ఇచ్చాడు. ‘ఆన దేవుడు సూడకచ్చిండు. ఒక్క ఆన ముంతపోతలు పోస్తే చెరు రిండుతది. దుప్పటి తడుపు ఆనలు వడితే పొలాలకు ఫయిదలేదు’ అంటూ మరో రైతు నర్సింలు మాటకలిపాడు. రైతులంతా ఇలా కష్టాలతో మాట్లాడుతుండగానే తన ఇంటికి వచ్చిన వారితో కలిసి పక్కనే ఉన్న ఖలీల్ హోటల్‌కి వెళ్లిపోయారు. అక్కడే అందరూ కలిసి టీ తాగుతూ కష్టసుఖాలను చెప్పుకున్నారు. రైతులంతా వర్షాలు కురియాలంటూ కోరుకోవడమే వారి మాటల్లో కనిపించింది. 10.40 గంటలకు హోట ల్లో టీ తాగిన రైతులు ‘కేసరి అన్న బాల్బక్రీ ఆడుదామంటూ’ మరో రైతు షాదుల్లా వారి వద్దకు వచ్చాడు. ‘ఏం జేద్దాం అట్లన్న టైంపాసవుతది’ అంటూ రైతు కేసరి షాదుల్లాతో మాట కలిపాడు. మాట్లాడుతుండగానే టీ కొట్టు ప క్కనే రోడ్డుపై నిర్మించిన కల్వర్టుపైకి రైతులంతా వెళ్లారు. పక్కనే 24 చిన్న నల్లని బండరాళ్లను రెండు పెద్ద తెల్లని బం డరాళ్లను తీసుకొచ్చారు. కల్వర్టుపై గీసిన గీతలపై రాళ్లను ఉంచి ఆట మొదలుపెట్టారు. మధ్యాహ్నం 12.10 నిమిషా లకు కడుపులో ఆకలి పడడంతో రైతులంతా ఆట విడుపు ను పక్కన పెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. కేసరి ఇంటికి వెళ్లకుం డా నేరుగా తన పొలానికి చేరుకున్నాడు. పొలంలో మట్టిపెళ్లలు తీస్తూ, గాలికి వచ్చిపడ్డ ముళ్ల పొదలను తీస్తూ గట్టుకు వేస్తూ కనిపించాడు. కాసేపు అలా పని చేశాక పొలంలోకి వచ్చిన గొర్రెల కాపరులతో మాట్లాడారు. ‘అన్న పోయిన యాడాది పొలాలల్ల నాట్లు ఏశిండ్లు. ఈయేడు ఇప్పటిదాకా తుకాలు వోయలే గొర్లకు మేపదలికి సుకమైంది లేకుంటే గుట్టకు పోయి మేపవడుతుండ్య’ అంటూ గొర్రెల కాపరి దన్గరి సాయినాథ్ రైతు కేసరితో మాట్లాడుతూ కనిపిం చింది. ‘పొలాలు మాకు ఫాయిదా జేయకున్న మీ గొర్లకు సుకమైందంటే సాలుమరి’ అంటూ కేసరి అన్నాడు. పచ్చ గా ఉన్న పొలాలన్నీ బీళ్లుగా కనిపించాయి. పొలాల్లో గొర్రెలు, ఆవులు, గేదెలు మేస్తూ కనిపించాయి. 1.18 నిమిషాలకు గొర్రెలు బీడు పొలంలో మేస్తూ ఉంటే.. రైతు కేసరి పక్కనే ఉన్న సీసీ కెనాల్ వైపు నడిచాడు. సిరాల ప్రాజెక్టు నీటితో నిండుగా కనిపించే సీసీ కెనాల్ పెరిగిన తుంగ, గడ్డి మొక్కలతో వట్టిపోయి కనిపించింది. పెరిగిన తుంగను చూసి నీళ్లులేని కాలువలను చూయిస్తూ రైతు కేసరి ఆవేదన వ్యక్తం చేశాడు. ‘రైతుల నసీబ్ కరాబ్ ఉన్నది. కెనాల్లో ఎప్పుడూ నీరు కనిపించేది ఈ ఏడు ఆ పరిస్థితి లేదు. ఆనలు పడితే పొలాల్లో తుకాలు పోశి నాట్లు ఏసుకుంటం. లేకుంటే పొలాల్లో ఏ పంట రాదు’ అంటూ రైతు కేసరి సీసీ కెనాల్లోకి దిగాడు. కెనాల్లో మొలిచిన తుంగను తొలగిస్తూ కనిపించాడు. ‘రేపు నీళ్లు వస్తే తుంగ ఆట్లనే పెరిగిపోతది. ఇప్పుడైతే పనిలేదు. పని లేనప్పుడు ఈ తుంగను తీసేద్దాం’ అంటూ రైతు కేసరి కెనాల్లో పనిచేస్తుండగా మరో రైతు వాగ్మారే గంగాధర్ అటువైపు వచ్చాడు. వాగ్మారే గంగాధర్‌తో నడుస్తూ పక్కనే పంట పొలంలో పనిచేస్తున్న వారి వద్దకు వెళ్లిపోయాడు. తదుపరి ఇంటికి చేరాడు. -
గలగల గోదారి
భైంసా : జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. కారు మబ్బులు ఊరిస్తున్నాయి. వర్షించడం లేదు. ఖరీఫ్ పనులు ఆరంభమై నెల రోజులు గడిచినా వరుణుడు కరుణించడం లేదు. ప్రాజెక్టులు, చెరువులు అడుగంటుతున్నాయి. వేసిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. మొలిచిన మొక్కలు నేలవాలుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గోదావరి పరీవాహాక ప్రాంతంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నీరందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మహారాష్ట్ర సర్కారు మంగళవారం ఎత్తింది. పోలీసు బందోబస్తు మధ్య వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎత్తారు. దీంతో బాబ్లీ ప్రాజెక్టులో 0.7 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి చేరుతోంది. గోదావరిలో జలకళ వర్షాలు కురియక గోదావరి నదిలో నీటి ప్రవాహం కనిపించలేదు. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో బుధవారం బాసర గోదావరి వద్ద జలకళ కనిపించింది. గోదావరి నదిలో నీటి ప్రవాహంతో ఎత్తిపోతల పథకాలకు నీరు చేరనుంది. బాసర, కౌట, ఆష్టా ఎత్తిపోతలకు పరీవాహక నీటిరాకతో ఆయకట్టు రైతులకు కొద్దిమేర ఆశ చిగురిస్తుంది. శ్రీరాంసాగర్‌లో బాబ్లీ గేట్లు తెరవడంతో 0.7 టీఎంసీల నీరు చేరి 0.4 అడుగుల నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. అక్టోబర్ 28 వరకు.. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య గోదావరి జలాల కోసం తీవ్రమైన పోరు కొనసాగింది. ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అత్యున్నత న్యాయస్థానం ఇరు రాష్ట్రాల వాదనలు విని మహారాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాల కోసం 2.84 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బాబ్లీ ఇన్‌ఫ్లోను అడ్డుకోకుండా ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నాలుగు నెలలపాటు గేట్లు ఎత్తి ఉంచాలని తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉంటాయి. భారీ వర్షాలు కురిస్తే పెద్ద మొత్తంలోనే ఎస్సారెస్పీలోకి వరద నీరు చేరనుంది. జిల్లా రైతులకు ఊరట మరో వారం రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బాబ్లీ గేట్లు పైకి ఎత్తి వస్తున్న నీరు ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి చేరుతోంది. ఎస్సారెస్పీలోని నీరు చేరుతుండడంతో జిల్లా రైతుల్లో కొత్త ఆశ చిగురిస్తుంది. వర్షాలు కురిసే వరకు ప్రాజెక్టులో చేరే నీటిని అంచనా వేసి పంటలు వేసుకునేందుకు ఎస్సారెస్పీ ఆయాకట్టు రైతులు సన్నద్ధం అవుతున్నారు. -
'అక్రమ' అనుమానం.. కన్నతల్లిని కడతేర్చిన కొడుకులు
సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన ఇది. నలుగురు కొడుకులు కలిసి కన్నతల్లిని కడతేర్చారు. ఈ దారుణ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. లక్ష్మీబాయి (55) అనే మహిళ తన స్వగ్రామం నుంచి ఉపాధి కోసం వచ్చి భైంసాలో అద్దెకు ఉంటోంది. ఆమెకు నలుగురు కొడుకులున్నారు. వాళ్లంతా ఒక శుభ కార్యానికి వెళ్లి తిరిగి వచ్చారు. తర్వాత తల్లిని హతమార్చారు. అయితే.. అందుకు వాళ్లు చెబుతున్న కారణం దారుణంగా ఉంది. తమ తల్లికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై తమకు చాలాకాలంగా అనుమానం ఉన్నా, ఇప్పుడు మాత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో బండరాళ్లు, కర్రలతో దాడిచేసి చంపామని చెబుతున్నారు. కానీ తమలో ఇద్దరం మాత్రమే చంపామని, మిగిలిన ఇద్దరికీ దీంతో సంబంధం లేదని వాళ్లంటున్నారు. దీంతో పోలీసులు ఇద్దరు కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత గానీ ఈ సంఘటనపై తామేమీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు. లక్ష్మీబాయి భర్త గతంలోనే మరణించగా, ఆమె కొడుకులు నలుగురూ వేర్వేరు చోట్ల ఉపాధి పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరికి పెళ్లయింది. ఒకరు ట్రాక్టర్, మరొకరు ఆటో నడుపుకొంటున్నారు. మిగిలిన ఇద్దరూ కూలిపనులు చేసుకుంటారు. -
భైంసా ఎంఐఎం హస్తగతం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం హస్తగతం చేసుకుంది. మొత్తం 23 వార్డులకు గానూ ఎంఐఎం 13 స్థానాల్లో విజయం సాధించింది. కాగా నిర్మల్‌లో బీఎస్పీ హవా కొనసాగుతోంది. 16 వార్డుల్లో 12 వార్డులను బీఎస్పీ కైవసం చేసుకుంది. *ఆదిలాబాద్ బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లలో కౌంటింగ్ పూర్తి *కాగజ్‌నగర్ టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్లు 10 విజయం *ఆదిలాబాద్: నిర్మల్‌లో బీఎస్పీ 12, ఎంఐఎం 5, కాంగ్రెస్ 2, ... *టీఆర్ఎస్ -1, ఇండిపెండెంట్లు 2 చోట్ల విజయం *ఆదిలాబాద్ బైంసాలో ఎంఐఎం 12, బీజేపీ 6.. *టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్ 1 గెలుపు -
నిర్మల్ జిల్లాపై ఆశలు
భైంసా, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పెంపుపై టీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టిన తరుణంలో నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాను ఇప్పటికే తూర్పు, పశ్చిమ జిల్లాలుగా పిలుస్తారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడున్న పది జిల్లాలను 24 జిల్లాలుగా మారుస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పలుమార్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జిల్లాల సగటు జనాభా ఆధారంగా జిల్లాలను అదనంగా పెంచేందుకు కసరత్తు ఆరంభించారు. కాగా, ప్రస్తుతం బాసర నుంచి ఆదిలాబాద్ 147 కిలో మీటర్ల దూరం ఉంది. కొత్తగా ఏర్పడే జిల్లాలోనూ ఈ దూరం తగ్గదు. జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటే పాలనపరమైన ఇబ్బందులు తీరుతాయి. కొత్తగా జిల్లాల పునర్వ్యస్థీకరణలో అన్ని నియోజకవర్గ కేంద్రాలకు మధ్యలో ఉండే విధంగా రూపొందించారు. ఇలాంటి పట్టణాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో వారి ఇబ్బందులు తీరుతాయి. దూరభారం తగ్గుతుంది.. ముథోల్ తాలుకా ఒకప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లాలో ఉండేది. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలో కలిపారు. భైంసా ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ 80 కిలో మీటర్ల దూరంలో ఉంది. నాందేడ్ వెళ్లేందుకు భైంసా నుంచి బస్సు సౌకర్యంతోపాటు బాసర నుంచి రైలు మార్గం ఉంది. అదే జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లాలి. గతంలో ఉన్న జిల్లా కేంద్రం 80 కిలో మీటర్ల దూరంలో ఉంటే ఇప్పుడు 147 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు చాలా మంది వెళ్లలేకపోతున్నారు. నిర్మల్ జిల్లాగా ఏర్పడితే భైంసా ప్రాంతం నుంచి 41 కిలో మీటర్ల దూరమే ఉంటుంది. ఇప్పటికే రాజకీయంగా నిర్మల్‌కు ప్రత్యేక పేరు ఉంది. కొయ్యబొమ్మలతో నిర్మల్ ఖ్యాతి అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. బాల్కొండను కలిపితే.. పాలనపరమైన సౌలభ్యం కోసం ముథోల్, నిర్మల్, ఖానాపూర్ ప్రాం తాలతోపాటు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండను కలిపి నిర్మల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్వీభజనలోనూ కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయి. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండు జిల్లాల పరిధిలో ఉంది. బాల్కొండ ప్రాంతం ఇక్కడ కలిపితే ఎస్సారెస్పీ నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఏర్పడే కొత్త జిల్లాలోనూ బాబ్లీ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు కొత ్తగా ఏర్పడే నిర్మల్ జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారన్న ఆశను ఈ ప్రాంత రైతులు వ్యక్తం చేస్తున్నారు. బాసరలోని చదువులమ్మ కొలువు సరస్వతీ ఆలయం, తెలంగాణలో ఏకైక ట్రిపుల్ఐటీ, భైంసా పత్తి రైతాంగం ముథోల్, నిర్మల్ ప్రాంతంలోని లక్షలాది బీడీ కార్మికుల శ్రేయస్సు కోసమైనా జిల్లా కేంద్రం దగ్గరగా ఉండి తీరాలని మేధావులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. కొత్త జిల్లాల విషయం తెరపైకి రావడం తో నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. -
జలకాలాట.. జర జాగ్రత్త!
భైంసా, న్యూస్‌లైన్ : గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద భద్రత కరువైంది. గేట్ల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదు. ఇక్కడ వెళ్లేవారిని ఎవరూ నియంత్రించడం లేదు. సాయంత్రం దాటితే మందుబాబులు గేట్ల వద్ద జల్సా చేస్తున్నారు. తాగి ఖాళీ సీసాలు అక్కడే పారేస్తుండడంతో గాజు పెంకులు సందర్శకులకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. గజ ఈతగాళ్లు లేరు నియోజకవర్గంలోనే గడ్డెన్నవాగు ప్రాజెక్టు పెద్దది. కాని ఇక్కడ ఒక్క గజ ఈతగా డు లేడు. వేసవిలో ఉపశమనం కోసం యువకులు, పట్టణవాసులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంటారు. ప్రాజెక్టు నీటి లో జలకాలాడుతూ కనిపిస్తారు. కొంతమంది యువకులు వేసవి సెలవుల్లో ప్రాజెక్టు నీటిలో ఈత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కాని ఇక్కడ ఎలాంటి భద్రత లేకపోవడంతో ఇప్పటికే ఈతకు వెళ్లిన ఐదారుగురు యువకులు నీటి మునిగి చనిపోయారు. గత శుక్రవారం భైంసా పట్టణానికి చెందిన భానుచందర్‌గౌడ్ (రాజుగౌడ్) ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాతపడ్డాడు ప్రాజెక్టు వద్ద గజ ఈతగాళ్లు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఎందరో గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాజెక్టులో పడి ఇప్పటి వరకు దాదాపు 15 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాజెక్టు వద్ద భద్రత కల్పిస్తే ఇలాంటి సంఘటనలను అరికట్టవచ్చు. కాని ఎవరూ ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ప్రాజెక్టు గేట్ల వద్దకు వెళ్లే రోడ్డుపై ఉన్న స్తంభాలకు అమర్చిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. తక్కువ ఎత్తులో తీగలు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. అయినా వీటిని ఎవరూ సరిచేయడం లేదు. -
తవ్వేస్తున్నారు..
భైంసా, న్యూస్‌లైన్ : అక్రమార్కులు గుట్టలను తవ్వేస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని గుట్టలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వేసి మొరంను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొరం తవ్వకాలతో ఏర్పడిన గుంతలు, కందకాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోజురోజుకు ఈ అక్రమ తవ్వకాలు అధికమవుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు గుట్టను అక్రమంగా తవ్వేస్తున్నారు. ప్రాజెక్టు పక్క నుంచే ఉన్న ప్రధాన మార్గం అక్రమ తవ్వకాలతో ప్రమాదకరంగా మారింది. ఒకవైపు తవ్వేసిన గుంతలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గుట్ట దిగే ప్రాంతంలో మూలమలుపు వద్ద అక్రమార్కులు పూర్తిగా మొరం తవ్వేశారు. దీంతో వేగంగా వచ్చే వాహన చోదకులు మూలమలుపు వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు. పట్టణ సమీపంలోని డిగ్రీ కళాశాలకు వెళ్లే ప్రాంతంలోనూ మొరం తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. భైంసా పట్టణంలో నిర్మించే భవనాలకు ఇక్కడి నుంచే మొరం తరలిస్తున్నారు. అధికారుల కళ్లముందే ఈ తతంగం జరుగుతున్నా ఎవరు స్పందించడం లేదు. భైంసా మండలం దేగాం, వాలేగాం గ్రామాల్లోనూ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అక్రమార్కులు రోజు వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముథోల్ వద్ద... భైంసా - బాసర ప్రధాన రహదారిని ఆనుకుని ముథోల్ నేత్ర వైద్యశాల, సబ్‌స్టేషన్ ప్రాంతాల్లోనూ ఈ అక్రమ దందా కొనసాగుతోంది. కొందరు కాంట్రాక్టర్లు ఎలాంటి అనుమతి పొందకుండా మొరం తరలించేస్తున్నారు. పెద్దమొత్తంలోనే ఈ వ్యవహారం సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరంగా కందకాలు.. అక్రమ తవ్వకాలతో నియోజకవర్గంలోని భైంసా, ముథోల్, దేగాం, వాలేగాం తదితర ప్రాంతాల్లో భారీ కందకాలు ఏర్పడుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఈ కందకాలు వరద నీటితో నిండిపోతున్నాయి. కందకాల లోతు తె లియక మూగజీవాలు దాహార్తి తీర్చుకునేందుకు వెళ్లి అందులో పడి చనిపోతున్నాయి. ప్రధాన మార్గాల్లోనే ఇలాంటి కందకాలు ఉన్నా ఎవరూ స్పందించడంలేదు. భైంసా-నాందేడ్ అంతర్రాష్ట్ర రహదారికి ఆనుకుని మాంజ్రి గుట్ట వద్ద సైతం ఇలాంటి కందకాలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలతో ఏర్పడ్డ కందకాలను పూడ్చడంలోనూ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు అక్రమ తవ్వకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని, భారీ కందకాలు ఉన్న ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. ఇలా తవ్వకాలు చేపట్టకుండా అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులకు అప్రమత్తం చేస్తాం. అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా తవ్వితే సమాచారమివ్వండి. -
‘పుర’ పోలింగ్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రధాన ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆరు బల్దియాల్లో 189 వార్డులు ఉండగా, ఆదిలాబాద్‌లోని 34వ వార్డు, భైంసాలో మూడో వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 187 వార్డులకు ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు పట్టణాల్లో 3.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 325 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షక అధికారులతో పాటు, ప్రత్యేక అధికారులను నియమించారు. ఎన్నికల సిబ్బంది శనివారం సాయంత్రానికే ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలించింది. 1,095 అభ్యర్థుల్లో అదృష్టవంతులెవరో.. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబర్‌లో ముగిసింది. సుమారు నాలుగేళ్లుగా బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈనెల 3న మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 10 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరించారు. ప్రధాన, ప్రధానేతర పార్టీలతోపాటు, స్వతంత్రులు కౌన్సిలర్ పదవులకు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈనెల 15న నామినేషన్ల పరిశీలన పూర్తవగా, చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈనెల 18న బరిలో ఉండే 1095 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ అభ్యర్థులు పది రోజులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రారంభంలో హంగు, ఆర్భాటం లేకుండా సాగిన ప్రచారం, చివరిరోజు శుక్రవారం మాత్రం హోరెత్తింది. శనివారం అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. డబ్బు, మద్యం పంపకాలతో ఓటర్లను ప్రలోభపెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎన్నికల సంఘంతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రచారం నిర్వహించాయి. భారీ బందోబస్తు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. పోలింగ్ జరుగుతున్న ఆరు మున్సిపాలిటీల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లో 43 అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి. ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ కంపెనీలను దించారు. ఆరు మున్సిపాలిటీల్లో 326 పోలింగ్ కేంద్రాలుండగా, 136 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసు శాఖ గుర్తించింది. 165 సమస్యాత్మక కేంద్రాలుగా భావిస్తోంది. జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌తోపాటు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 70 ఏఎస్సైలు ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీసు సిబ్బంది.. 220 హెడ్‌కానిస్టేబుళ్లు, 1,200 మంది కానిస్టేబుళ్లు, 80 మంది హోంగార్డులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఏపీఎస్పీ నాలుగు కంపెనీలు, ఒక సీఆర్పీఎఫ్ కంపెనీల బలగాలను పట్టణాల్లో మోహరించారు. -
కానిచ్చేద్దాం..
భైంసారూరల్, న్యూస్‌లైన్ : కోట్లాది రూపాయలు వెచ్చించి చేపడుతున్న నిర్మాణలపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పనుల్లో నాణ్యత లోపిస్తోంది. ఫలితంగా చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. మండలంలోని సిరాల గ్రామంలో ఉన్న సిరాల ప్రాజెక్టు నుంచి దేగాం వరకు సీసీ కాలువ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశ పనులు గత ఏడాది ఇలేగాం వరకు రూ.180లక్షతో పూర్తయ్యాయి. ఇలేగాం నుంచి దేగాం వరకు రెండో దశ కాలువ సీసీ పనులు రూ.210.30లక్షలతో చేపట్టారు. గత ఏడాది మొదటి దశ పనుల్లోనూ అధికారుల పర్యవేక్షణ కొరవడి సీసీ కాలువ అప్పుడే ఆనవాళ్లు కోల్పోయింది. ఏడాది తిరక్కుండానే అధ్వానంగా మారింది. గడ్డి, పిచ్చిమొక్కలతో నిండి పగుళ్లు తేలింది. తూములు లేక నీరంతా వృథాగా బయటకు పోతోంది. మూడు కిలోమీటర్ల మేర చేపట్టిన సీసీ పనుల్లో అధికారుల ముందుచూపు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువ పల్లంలో పొలాలు ఎత్తులో ఉండడంతో సాగునీరు అందడం లేదు. ఇప్పుడూ అలాగే.. గత ఏడాది అనుభవాలతోనైనా ఇరిగేషన్ శాఖ అధికారులు తేరుకోలేదు. రైతుల ఇబ్బందులపై సమావేశం నిర్వహించలేదు. ఆయకట్టు రైతులకు మున్ముందు తలెత్తే సమస్యలపై తెలుసుకోలేదు. ఇవేవీ లేకుండా రెండో దశ పనులు చేపట్టారు. ఇసుక దొరకడం లేదన్న సాకుతోనే పక్కనే నాలుగు కిలోమీటర్ల దూరంలోని సుద్దవాగు నుంచి మట్టితో కూడిన ఇసుక తెచ్చి నిల్వ చేశారు. దానితోనే సీసీ పనులు చేపడుతున్నారు. మట్టితోకూడిన ఇసుక వాడకంతో అప్పుడే సీసీ పగుళ్లు తేలి కనిపిస్తోంది. పగుళ్లు తేలిన ప్రాంతాల్లో సిమెంట్ పూతలు వేశారు. నిర్మాణాలు అక్కడక్కడ కూలిపోతున్నాయి. అయినా ఎవరూ స్పందించడం లేదు. నల్లరేగడి నేలల్లో తవ్విన కాలువలకు సరైన క్యూరింగ్ చేయడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే గత ఏడాది దుస్థితే మళ్లీ పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. ప్రారంభంలోనే ఉన్నతాధికారులు తేరుకుంటే ఆయకట్టుకు నీరందించే సీసీ కాలువ కలకాలం నిలుస్తుంది. పనులపైనే రైతుల ఆశలు.. ఒకప్పుడు సిరాల ప్రాజెక్టు కింద ఏడు గ్రామాల రైతులు పంటలు పండించుకునేవారు. ప్రాజెక్టులో పూడిక, కాలువ దుస్థితితో ఏడు గ్రామాల ఆయకట్టు మూడు గ్రామాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం సీసీ పనులు మెరుగ్గా సాగితే ఈ మూడు గ్రామాల ఆయకట్టు అయినా పండుతుంది. ప్రస్తుతం సిరాల, ఇలేగాం, దేగాం రైతులకు ఖరీఫ్ సీజన్లో కాలువల ద్వారా నీరు అందిస్తున్నారు. రబీలో ప్రాజెక్టు సామర్థ్యం మేర ఆయకట్టు నిర్ధారిస్తున్నారు. సీసీ పనులు చేపడితే నీరు వృథాపోకుండా అధికారుల లక్ష్యంమేర సాగుకు ప్రయోజనం చేకూరుతుంది. మూడు గ్రామాల్లో నాలుగు వేల ఎకరాలకుపైగానే పంటలు పండుతున్నాయి. -
యూడీసీని నిలదీసిన అంగన్వాడీ కార్యకర్తలు
ముథోల్, న్యూస్‌లైన్ : స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో యూడీసీ మహేశ్‌ను అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం నిలదీశారు. ప్రాజెక్టు పరిధిలోని కుభీర్, భైంసా, లోకేశ్వరం, తానూర్, ముథోల్ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు టీఏ, డీఏ బిల్లుల విషయమై ప్రశ్నించారు. ఏడాదిగా బిల్లులు రావడం లేదని, అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టీడీఏ, డీఏ, కట్టెల బిల్లులు ఇవ్వాలని కోరితే పర్సంటేజీ అడుగుతున్నాడని ఆరోపించారు. ఐసీడీఎస్ పరిధిలోని 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు రూ.6వేల చొప్పున చెల్లిస్తే బిల్లులు చేస్తానని అంటున్నాడని పేర్కొన్నారు. నెలనెల కోడిగుడ్లు ఇవ్వడం లేదని తెలిపారు. -
మొదటి జెడ్పీ చైర్మన్ రంగారావు
భైంసా, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ మొదటి చైర్మన్ రంగారావు పల్సికర్. కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన ఆయనను సమితి అధ్యక్షులు చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. జిల్లా ఆవిర్భావం 1959 నుంచి ఇప్పటి వరకు జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతోంది. 1987లో జెడ్పీ చైర్మ న్ ఎన్నిక తొలిసారిగా ప్రత్యక్ష పద్ధతిలో జరిగింది. 1987లో మండల వ్యవస్థ ఏర్పడకముందు సమితి అధ్యక్షులు జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేవారు. అప్పట్లో సర్పంచులు సమితి అధ్యక్షులను ఎన్నుకునే పద్ధతి ఉండేది. ప్రతి తాలూకాలో ఇద్దరు సమితి అధ్యక్షులు ఉండేవారు. అప్పట్లో జిల్లాలో తొమ్మిది తాలుకాల పరిధిలో 18 మంది సమితి అధ్యక్షులు, వీరు ఎన్నుకునే ఆరు కో ఆప్షన్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేవారు. మొదటి చైర్‌పర్సన్‌గా పల్సికర్ రంగారావు 29-11-1959 నుంచి 26-1-1960వరకు ఒక పర్యాయం, 29-05-1961 నుంచి 10-9-1964 వరకు రెండో పర్యాయం జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో... జిల్లాలో జెడ్పీ చైర్మన్‌కు ప్రత్యక్ష ఎన్నికలు 1987లో ఒక్కసారే జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గెలుపొందారు. అప్ప ట్లో మండల అధ్యక్షుల ఎన్నికలు ప్రత్యక్షంగానే జరిగాయి. ఆ తర్వాత నుంచి అన్ని పరోక్ష ఎన్నికలతోనే జెడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటున్నారు. ఊరిపేరే ఇంటిపేరు.. మహారాష్ట్ర సరిహద్దులోని పల్సి గ్రామానికి చెందిన రంగరావు చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు గ్రామానికి ఎంతోమంది వచ్చేవారు. మహారాష్ట్ర వాసులకు పెద్దమొత్తంలో ఇక్కడి వారితో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉండేవి. వ్యాపార లావాదేవీలతోపాటు బంధుత్వాలు మెండుగానే ఉండేవి. అలా రంగారావుకు ఊరిపేరే ఇంటి పేరుగా మారింది.. రంగారావు పల్సికర్ అని పిలిచేవారు. ‘మహా’ మాజీ సీఎం పల్సి అల్లుడే.. రంగారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పుష్పకు కుమార్తె, రెండో భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలికి విలాస్‌రావు దేవ్ముఖతో వివాహం జరిపించారు. ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రంగారావు మరణించినప్పుడు పెద్దకర్మ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ పల్సికి వచ్చి వెళ్లారు. విలాస్‌రావు కుమారుడు, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ వివాహం 2012 ఫిబ్రవరిలో నటి జెనీలియాతో జరిగింది. ఆ జంటను ఆశీర్వదించేందుకు అప్పట్లో ఈ ప్రాంత వాసులకు ఆహ్వానం అందింది. వైఎస్సార్ చొరవతో.. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా దివంగత ముఖ్యమం త్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవ చూపారు. భైంసా మండలంలో వాడి గ్రామం వద్ద సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు రంగారావు పల్సికర్ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.