
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసాలో 144 సెక్షన్ ఐదో రోజు కొనసాగుతోంది. గత ఆదివారం పట్టణంలోని కోర్వాగల్లీలో ఇరు వర్గాల ఘర్షణ రాళ్లదాడికి దారితీయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ శుక్రవారం కావడంతో అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి నిర్మల్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారానికి ప్రత్యేక అనుమతులు లభించినట్టు తెలిసింది.
(చదవండి : ఎప్పుడేం జరుగుతుందో..?)
అంతా ప్రశాంతంగా ఉంది : హోంమంత్రి
భైంసాలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎలాంటి ఆందోళనలు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భైంసాలో పరిస్థితులు బాగోలేవనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి తప్ప అక్కడ ఎలాంటి అలజడి లేదని పేర్కొన్నారు. ఇక కేసులు ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల్ని డిపార్ట్‌మెంట్‌లో చేర్చుకోబోమని హోంమంత్రి స్పష్టం చేశారు. 300 మంది కానిస్టేబుల్ అభ్యర్థులపై ఉన్న కేసులపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. అన్ని విధాలుగా విచారణ చేసిన అనంతరమే వారిని పోలీసు శాఖలో జాయిన్ చేసుకుంటామని పేర్కొన్నారు.
(చదవండి : భైంసాలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి)
Comments
Please login to add a commentAdd a comment