మౌనిక
సాక్షి, ఆదిలాబాద్: భైంసా పట్టణంలోని రాహుల్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై హ న్మాండ్లు కథనం ప్రకారం.. ముధోల్‌కు చెందిన మౌనిక(21)కు తానూర్ మండలం బెంబర గ్రామానికి చెందిన చుక్కబొట్ల అనిల్‌తో ఏడాదిన్నర కిందట వివాహం జరుగగా, భైంసాలోని రాహుల్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య స్వల్ప తగాదా తలెత్తింది.
దీంతో మౌనిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త తలుపు తీసి చూడగా, బాత్రూంలో ఉరివేసుకుని కనిపించింది. వీరికి తొమ్మిదినెలల బాబు ఉన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment