
సాక్షి, నిర్మల్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. రేపటి(సోమవారం) బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. బండి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
వివరాల ప్రకారం.. బండి సంజయ్ పాదయాత్ర రేపటి నుంచి భైంసా నుండి ప్రారంభం కానుంది. కాగా, పాదయాత్ర కోసం బీజేపీ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి. బహిరంగ సభ కూడా ఏర్పాటుచేశారు. ఇక, ఈ పాదయాత్రను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు ఊహించని విధంగా షాక్ తగిలింది.
అయితే, భైంసా సున్నితమైన ప్రాంతం కావడంతో శాంతి భద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ లా అండ్ ఆర్డర్ విషయంతో అనుమతి లేదంటూ పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో, బండి సంజయ్ పాదయాత్రపై టెన్షన్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment