
భైంసా: భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. భైంసాకు భరోసా కల్పించేందుకే ఇక్కడకు వచ్చానని, అధికారంలోకి రాగానే పేరు మారుస్తామని సంజయ్ స్పష్టం చేశారు. కార్యకర్తలపై పెట్టిన పీడీ యాక్ట్‌లు తీసివేస్తామన్నారు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భైంసాకు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ ప్రసంగించారు.
‘కేసీఆర్ అప్పు చేసిన రూ. 5 లక్షల కోట్లు ఏమయ్యాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఒక్కో బిడ్డకు రూ. లక్ష అప్పు చేస్తాడు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా యుద్ధానికి మేము సిద్ధం’ అని సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment