చల్‌గల్‌లో విలేకరులతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్
జగిత్యాల టౌన్/జగిత్యాల రూరల్: తండ్రికి ఇష్టమైన లిక్కర్ దందా కోసమే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వెళ్లారని, తప్పు చేసిన తన కూతురును కాపాడేందుకే సీఎం కేసీఆర్ డ్రామాలకు తెరతీశారని, తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
అనంతరం జిల్లాకేంద్రానికి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ దొంగసారా, పత్తాల దందా నేరాల్లో ఇరుక్కున్న కూతురు కవిత కోసం రోడ్లపైకి రావాలంటూ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా? అని ప్రశ్నించారు. బతుకమ్మ పేరిట డిస్కో డ్యాన్సులు చేస్తూ కవిత బతుకమ్మ తల్లిని కించపర్చారని మండిపడ్డారు.
ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఆంధ్రా నేతలతో కుమ్మక్కై విద్వేషాలు రెచ్చగొడుతూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. నిషేధిత సంస్థలకు నిధులు సమకూరుస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మెజారిటీ ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొండగట్టు, వేములవాడ, బాసర, ధర్మపురి ఆలయాలకు నిధులు మంజూరు చేస్తామన్న సీఎంక కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
రైతు రుణమాఫీ, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితబంధు, దళితులకు మూడెకరాలు, దళిత సీఎం హామీలు నెరవేర్చకుండా చెల్లని రూపాయిలా మారిని సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పేరుతో ఢిల్లీలో చెల్లుబాటు అవుతారా? అని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర చిచ్చు రగిల్చి సెంటిమెంట్‌తో మళ్లీ లబ్ధిపొందాలని చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో తెలంగాణయాగం చేసిన తర్వాత రాష్ట్రానికి ఏం న్యాయం చేశారో కేసీఆర్ చెప్పాలన్నారు. ‘ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే పాపాలు పోతాయా..? రాజశ్యామల యాగం సాక్షిగా ప్రజలకు నిజాలు చెప్పు.. లిక్కర్ కేసులో నీ కూతురు (కవిత) ప్రమేయంపై ఎందుకు స్పందించడం లేదు’అని ప్రశ్నించారు. రాజశ్యామల యాగం ‘సాక్షి’గా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూతురు ప్రమేయం లేదని ప్రమాణం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment