
భైంసాలో ట్రాలీ ఆటోలో మంటలు
ఆదిలాబాద్ జిల్లాలో ఓ ట్రాలీ ఆటోలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
భైంసా: ఆదిలాబాద్ జిల్లాలో ఓ ట్రాలీ ఆటోలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆదివారం ఉదయం భైంసా డీఎస్పీ ఆఫీస్ సమీపంలో పార్క్ చేసిన టాటా ఏస్ ఆటోలో మంటలు వచ్చాయి. ఈ మంటల్లో వాహనం క్షణాల్లో పూర్తిగా దగ్థమైంది. ప్రమాదానికి కల కారణాలు తెలియాల్సి ఉంది. సమీపంలో ఉన్న స్థానికులు ఫైర్ సిబ్బంది సమాచారం అందించారు. అప్పటికే వాహనం కాలి బూడిదైంది.