ఢిల్లీ అగ్ని ప్రమాదం.. గుండెల్ని పిండేసింది | Delhi Fire Accident : Injured Shifted To Hospital By Auto | Sakshi
Sakshi News home page

దేశ రాజధానిలో కరువైన అంబులెన్స్‌...

Published Sun, Dec 8 2019 1:52 PM | Last Updated on Sun, Dec 8 2019 2:10 PM

Delhi Fire Accident : Injured Shifted To Hospital By Auto - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ రాణి ఝాన్సీ రోడ్డులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పదుల సంఖ్యలో గాయలపాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ప్రమాదం తరువాత అక్కడ కనిపించిన కొన్ని దృశ్యాలు గుండెల్ని కదిలించేలా ఉన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చడానికి కనీసం అంబులెన్స్‌లు కూడా లేకుండా పోయాయి. అలాగే నివాస ప్రాంతాల్లో అక్రమంగా ఉన్న ఫ్యాక్టరీలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకుగా ఉండటంతో.. మంటలను అదుపులోకి తీసుకురావడానికి భద్రత సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇందులో చాలా మంది ఊపిరాడకనే చనిపోయినట్టుగా తెలుస్తోంది.  

అయితే ప్రమాదం జరిగిన తరువాత అగ్నిమాపక సిబ్బంది గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించడానికి చాలా కష్టపడ్డారు. కనీసం అంబులెన్స్‌లు కూడా అందుబాటులో లేకపోవడంతో.. గాయపడ్డవారిని రోడ్డు వరకు భజాలపై మోసుకుంటూ రోడ్లపైకి తీసుకువచ్చి.. లోకల్‌ ఆటోల్లో ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులను తరలించడానికి కనీసం అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కనీస భద్రత ప్రమాణాలు పాటించని భవనాల్లో అగ్నిప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఈ ప్రమాదం మరోసారి రుజువు చేసింది.

చదవండి : ఢిల్లీలో విషాదం, 43మంది మృతి!

అతి భయంకరమైన సంఘటన: ప్రధాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement