
ఖైరతాబాద్‌లో ఆటో దగ్ధం
హైదరాబాద్:
ఖైరతాబాద్ కూడలిలో ఓ ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న బకెట్లతో నీళ్లను తెచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.