khairathabad
-
ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 -
ఖైరతాబాద్ మెట్రో దగ్గర నిలిచిన వరద నీరు
-
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకమైన భారీ క్రేన్ సిద్ధం
-
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించకున్న హీరో గోపీచంద్
-
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి
-
పని ఉందంటూ బయటకు వెళ్లి...
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ శేఖర్ తెలిపిన మేరకు...కార్మిక నగర్ బ్రాహ్మ శంకర్ నగర్ లో నివసించే మైనర్ బాలిక ఎం.శాంతి (17) ఈ నెల 17న తన మేనమామ బ్రాహ్మజీ ఇంటికి వచ్చింది. కొద్ది సేపటి తరువాత పని వుందంటూ బయటకి వెళ్లి తిరిగి రాలేదు. బ్రాహ్మజీ అన్ని ప్రాంతాల్లో గాలించాడు. బంధు మిత్రుల ఇళ్ళల్లో ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలసులు కి ఫిర్యాదు చేశాడు. వివరాలకు 9490616589 ఫోన్ చేయాలన్నారు. -
ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గణేష్ విగ్రహ చిత్రపట ఆవిష్కరణకు తనను పిలవలేదని వైస్ ప్రెసిడెంట్ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అతను ఈ కార్యక్రమం జరిపేది లేదంటూ మైక్ విరగొట్టారు. ఖైరతాబాద్ గణపతి నమూనా చిత్రాన్ని విడుదల చేసిన కమిటీ సభ్యులు ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల చేశారు. ఆ పటంలో శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. కాగా ఈ ఏడాది 40 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడు ప్రతిష్ఠించనున్నారు. వినాయకుడికి కుడివైపు కృష్ణకాళీ, ఎడమవైపు కాలనాగేశ్వరి ఉన్నారు. -
ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : కేరళ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయడం, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. సోమవారం ఉదయం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బస్సులలో చేరుకొని ధర్నాకు దిగారు. రోడ్డుకు ఇరువైపులా బస్సులు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్టీఏ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మొహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నాను విరమించబోమని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. బార్డర్ టాక్స్ ఏడాది పాటు రద్దు చేయాలి ఆంధ్ర, తమిళనాడు, కేరళకు వేళ్లే వాహనాల బార్డర్ టాక్సులు రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా బస్సులు రోడ్డు ఎక్కలేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని కోరారు. -
హైదరాబాద్‌లో కరోనా మరణం.. అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనాతో మరణించిన తొలి వ్యక్తి అంత్యక్రియలు ముగిశాయి. కరోనా వైరస్‌తో మృతిచెందిన 74 ఏళ్ల వృద్ధుడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. హెల్త్ వర్కర్లు దగ్గరుండి అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోతే అతని రక్త నమూనాలు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించిన విషయం తెలిసిందే. శనివారం అతని అంత్యక్రియలు జరిగాయి. కరోనా మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచడంతోపాటూ, లాక్డౌన్ నేపథ్యంలో అంత్యక్రియలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించారు. కాగా, మరణించిన తర్వాతనే అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. అతనికి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు, దాంతోనే అతను ఆస్పత్రిలో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14న మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన వృద్ధుడు 17న తిరిగి వచ్చారు. 20న శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. గత గురువారం రాత్రి అతను మృతిచెందాడు. వృద్ధుడి మృతదేహాన్ని ఆరోగ్య శాఖ సూచనలమేరకు కుటుంబ సభ్యులు సైఫాబాద్ పోలీసుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. -
ఖైరతాబాద్‌లో జల్లెడ పట్టిన అధికారులు
ఖైరతాబాద్: కరోనా లక్షణాలతో మృతిచెందిన ఖైరతాబాద్ ప్రాంతవాసి నివాసముండే పరిసర ప్రాంతాలను ఆదివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ వైద్యాధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఖైరతాబాద్ డివిజన్ ఓల్డ్‌సీఐబీ క్వార్టర్స్‌లో నివాసముండే మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు ఆరా తీయడంతో పాటు పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు ఓల్డ్‌సీఐబీ క్వార్టర్స్, ఇందిరానగర్లలో మొత్తం 200 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. రోడ్లపై, ఇళ్లపై ఎంటమాలజీ సిబ్బంది ప్రత్యేక వాహనాలతో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. మేయర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ విజయారెడ్డి, డీఎంసీ గీతారాధికతో పాటు జీహెచ్ఎంసీ, ఎంటమాలజీ, శానిటేషన్, వైద్యాధికారులు పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి కరోనా మరణం ఖైరతాబాద్‌లో చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయందోళనకు గురికాకుండా ఇంటింటికి తిరిగి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ఎవరైనా ఇటీవల విదేశాలు, దేశంలోని ఇతర నగరాలకు వెళ్లి వచ్చివుంటే వారి వివరాలు సేకరిస్తూ, ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తున్నామన్నారు. నగరవ్యాప్తంగా 10 జెట్ మిషన్లు, 18 ఏయిర్‌టెక్ మిషన్ల సాయంతో రసాయన ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నామన్నారు. నగరంలో 18వేల మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలో 2500 మంది ఉన్నారని, వీరిలో చాలా మందిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించామని తెలిపారు.దుకాణదారులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నగరంలో 40 వేల మందికి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నామని, ఇందుకుగాను తనవంతుగా వ్యాపారవేత్త వి.నిరంజన్ రూ.5 లక్షలు అందజేసినట్లు మేయర్ తెలిపారు. -
ఫ్యాన్సీ నంబర్స్‌కు భలే క్రేజ్
సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖ ఖైతరాబాద్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలంలో పలువురు వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. నచ్చిన నంబర్‌ను రూ.లక్షలు పోసి దక్కించుకున్నారు. ఇలా ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా బుధవారం ఒక్కరోజే సంస్థకు రూ.27,44,157 ఆదాయం వచ్చింది. రేంజ్ రోవర్ 3.0 ఎల్‌డబ్ల్యూబీ వాహనానికి టీఎస్09 ఎఫ్హెచ్ 9999 నంబర్‌కు రూ.10.35 లక్షలకు బిడ్ వేసి ట్రాక్స్ అండ్ టవర్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ దక్కించుకుంది. అలాగే మసరట్టి లవెంటి వాహనం కోసం టీఎస్09 ఎఫ్‌జే 0009 నంబర్‌కు గంగవరం పోర్ట్ లిమిటెడ్ కంపెనీ రూ.4.01 లక్షలు వెచ్చించింది. స్కోడా సూపర్బ్ ఎల్ అండ్ కే వాహనానికి టీఎస్09 ఎఫ్‌జే 0099 నంబర్‌కు రూ.2.97 లక్షలకు బిడ్ వేసి ఈటీఏ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. -
ఫ్రెండ్లీ పోలీసింగ్
బంజారాహిల్స్: సమయం ఆదివారం మధ్యాహ్నం. మండుటెండ. ఖైరతాబాద్ చౌరస్తాలో ఓ ఆటో ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై ఆగిపోయిన ఆటోను పక్కకు తొలగించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. ఆటో డ్రైవర్ ముందు టైరును పైకి ఎత్తి పట్టుకోగా ట్రాఫిక్ పోలీసులు ఆటోను ముందుకు నెట్టారు. కష్టపడి రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. -
రమేష్.. బరిలో బహుఖుష్!
బంజారాహిల్స్: షాబాద్ రమేష్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే ముందుగా గుర్తుకువచ్చే పేరు ఇది. ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంతంలో నివసించే షాబాద్ రమేష్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికలు వచ్చాయంటే నామినేషన్ వేయడానికి రమేష్ ఇంకా రాలేదా అనేంతగా పాపులర్ అయిపోయారు. ప్రతీ ఎన్నికల్లోనూ మొట్టమొదటి నామినేషన్ ఆయనే వేస్తారు. ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగిస్తూ మొదటి నామినేషన్ సమర్పించారు. 1994 ఎన్నికల్లో అప్పటి రాజకీయ దిగ్గజం పీజేఆర్‌పై పోటీ చేసి ‘నేను పీజేఆర్పైనే పోటీ చేశా’నంటూ గర్వంగా చెప్పుకొన్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావుపై పోటీకి నిలిచారు. 2004లో మళ్లీ పీజేఆర్, కేవీఆర్లపైనా పోటీచేశారు. పీజేఆర్ మరణాంతరం 2008 ఉప ఎన్నికల్లో విష్ణుపై పోటీ చేశారు. 2009లో మాజీ మంత్రి దానం నాగేందర్‌పై, 2014లో బీజేపీ అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డిపైనా పోటీ చేశారు. దిగ్గజాలపైనే పోటీ చేశానని గర్వంగా ఫీలయ్యే రమేష్ ఐదేళ్లపాటు గల్లాబుడ్డీలో డబ్బు జమ చేసుకుని నామినేషన్ ఫీజుతోపాటు, ప్రచార ఖర్చులకు వాడతారు. నామినేషన్ వేసే ముందు భార్య తిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపుతుంటే ఇద్దరు కొడుకులు చెరో వైపు బాడీగార్డుల్లా నామినేషన్ కేంద్రం దాకా వస్తారు. తాను మరణించేంతవరకూ పోటీ చేస్తునే ఉంటానని ఆయన వెల్లడించారు. -
ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత
బంజారాహిల్స్: టీఆర్ఎస్ ఖైరతాబాద్ టికెట్‌ను మన్నె గోవర్ధన్‌రెడ్డికి కేటాయించాలంటూ ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. వరుసగా రెండోరోజు మంగళవారం తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన చేసేందుకు ‘మన్నె’ ఇంటి దగ్గరి నుంచి వెళ్తుండగా బంజారాహిల్స్ పోలీసులు కార్యకర్తను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు ముందుకు వెళ్లకుండా తాడు ఏర్పాటు చేయగా, దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో గోవర్ధన్‌రెడ్డి కూడా అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే జరిగిన తోపులాటలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవర్ధన్‌రెడ్డి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తమ నేతకు గుండెపోటు వచ్చిందని, రోడ్డుపై కుప్పకూలిపోయాడని తెలుసుకున్న టీఆర్ఎస్ నేత, ఎన్బీటీనగర్ వాసి సత్యనారాయణ రాయితో తలబాదుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో రక్తస్త్రావం జరిగి ఆయన కూడా కుప్పకూలిపోయారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్వీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్‌లోని పెరిక భవన్ పక్కన హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గోవర్ధన్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోవర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీగా ఆస్పత్రి దగ్గరికి చేరుకొని నినాదాలు చేశారు. -
వీడని పీటముడి!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఖైరతాబాద్ పీటముడి క్రమంగా బిగుస్తోంది. మాజీ మంత్రి దానం నాగేందర్‌కు గోషామహల్ టికెట్ దాదాపు ఖరారు చేసినా, ఆయన ఆ నియోజకవర్గానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. పోటీ అంటూ చేస్తే ఖైరతాబాద్లోనేననిసంకేతాలిచ్చారు. దీంతో ఇప్పటికే పార్టీ ముఖ్య నేతల వద్ద అభయం పొందిన కార్పొరేటర్లు విజయారెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డిలు ఎవరికి వారు టికెట్ తనకంటే తనకేనన్న ధీమాతో ఉన్నారు. త్వరలోటీఆర్ఎస్ విడుదల చేసే రెండవ జాబితాలో నీ పేరే ఉంటుందని విజయారెడ్డికి పార్టీ ముఖ్యనేతలు భరోసా ఇవ్వటంతో ఆమె తన ఎన్నికల ప్రచారానికి వ్యూహాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి సైతం పార్టీ భరోసాతోనే ఇంటింటికీ టీఆర్ఎస్ కార్యక్రమాన్నివిస్తృతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా దానం నాగేందర్ గోషామహల్‌కు తాను వెళ్లేది లేదని పేర్కొంటూ ఖైతరాబాద్లోనే విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల వినాయక మండపాలను సందర్శించి తానే వస్తున్నానని సంకేతాలివ్వటం, గత మూడు రోజులుగా పార్టీ ముఖ్యనేతలను కలుస్తూ, తన నివాసంలో వివిధ సంఘాలతో సమావేశమవుతూ ఖైరతాబాద్ నుండే పోటీ చేస్తున్నానని బాహాటంగానే పేర్కొంటున్న అంశం నియోకజవర్గంలో పూర్తి గందరగోళానికి దారితీస్తోంది. ఇదే విషయమై విజయారెడ్డి సైతం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తనకు పార్టీ ముఖ్య నాయకులు ఇచ్చిన హామీపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. దానం నాగేందర్ వ్యవహారశైలి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను ఆయోమయానికి గురి చేస్తుందంటూ ఆమె ఫిర్యాదులకు సిద్ధమవుతున్నారు. ఇక ఖైరతాబాద్ టికెట్‌ను కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా ఆశించినప్పటికీ ఆమెకు ఎమ్మెల్యే సీటు ఇవ్వటం సాధ్యపడదని, అదే హోదాతో మరో ముఖ్యమైన పదవి కట్టబెట్టే ఆలోచన చేస్తామని పార్టీ ముఖ్య నేత భరోసా ఇచ్చారని తెలిసింది. పోటీ తప్పదని సంకేతాలు ఖైరతాబాద్ టీఆర్ఎస్ టికెట్‌ను ఎవరికి ఇచ్చినా తాము తప్పక బరిలో ఉంటామన్న సంకేతాలు ముగ్గురు నాయకులూ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం నేతల మద్దతు కూడకట్టిన దానం నాగేందర్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని, ఇక్కడి నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తుండగా, విజయారెడ్డి సైతం తాను బరిలో ఉండటం ఖాయమని కార్యకర్తల వద్ద తేల్చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి గోవర్ధన్‌రెడ్డి సైతం పార్టీ వెంట నడిచిన వారికి నష్టం చేయరని, తానే అభ్యర్థి అవుతానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఐతే పార్టీ అభ్యర్థిని ప్రకటించే అంశం ఆలస్యం చేస్తున్న కొద్ది..ముగ్గురి మధ్య విబేధాలు, వివాదాలు పెరిగిపోతున్నాయని టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. -
టీఆర్ఎస్లో టికెట్ ఎవరికో మరి?
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మినహా అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారపార్టీ టీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నేతలతోపాటు కార్యకర్తల్లోనూ టెన్షన్ కొనసాగుతోంది. మొహర్రం, వినాయక నిమజ్జనం తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం కూడా ఎలాంటి జాబితా వెలువడలేదు. టికెట్ రేసులో ప్రధానంగా మాజీ మంత్రి దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్యనే కొనసాగుతోంది. రేసులో వీరిద్దరే నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. తామే పోటీ చేస్తామని టీడీపీ బల్లగుద్ది చెబుతుండగా తామే పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ ధీమాగా ఉంది. నియోజకవర్గాన్ని తమకే కేటాయించాలంటూ రెండు పార్టీలు పట్టుపట్టి కూర్చున్నాయి. టీడీపీ అభ్యర్థిని ప్రకటించారంటూ ఓ పేరు వాట్సప్‌లో వైరల్ అవుతుండగా ఇంకా పొత్తు కుదరలేదని అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ టీడీపీపై కాంగ్రెస్ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డి చాపకింద నీరులా ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థి ఎవరో తేలక చోద్యం చూస్తున్నాయి. -
ఖైరతాబాద్ ఆర్టీఏలో ఏసీబీ నుంచి వచ్చామంటూ..
సాక్షి, సిటీబ్యూరో: స్థలం : ఖైరతాబాద్ ఆర్టీఏ కేంద్ర కార్యాలయం, సమయం : శనివారం ఉదయం 11 గంటలు, సందర్భం : నలుగురు వ్యక్తులు ఆర్టీఏ కార్యాలయంలోకి ప్రవేశించారు. తాము ఏసీబీ నుంచి వచ్చామంటూ నేరుగా ఒక మహిళా ఉద్యోగి వద్దకు వెళ్లారు. ఆమెను తమ వెంట తీసుకెళ్లారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. దీంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురయ్యారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయనే వార్త దావనలంలా వ్యాపించింది. కొన్ని చానళ్లలో స్క్రోలింగులు కూడా వచ్చాయి. కొందరు మీడియా ప్రతినిధులు సైతం అక్కడకు చేరుకున్నారు. కానీ వచ్చిన అగంతకులు ఆ మహిళా ఉద్యోగిని నేరుగా తమ వెంట తీసుకెళ్లారు. ఆర్టీఏ ఆఫీస్ బయట ఉన్న ఏసీ బస్టాపులో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం లకిడికాపూల్‌లోని ఒక హోటల్‌కు వెళ్లి అక్కడ కొద్ది సేపు మాట్లాడిన అనంతరం ఆమెను వదిలి అయితే వచ్చిన ఆ నలుగురు అగంతకులు అటు ప్రాంతీయ రవాణా అధికారి రమేష్‌కు కానీ, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్నాయక్కు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రేణుక అనే జూనియర్ అసిస్టెంట్‌ను తమ వెంట తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. ఎవరా అగంతకులు.... నిజానికి ఆమె కోసం వచ్చిన వాళ్లు పోలీసులైనా, ఏసీబీ అధికారులైనా తాము ఎవరో, ఎందుకొచ్చారో స్పష్టంగా వివరిస్తారు. పై అధికారులకు సమాచారం అందజేస్తారు. కానీ అలాంటిదేమీ లేకుండా సరాసరి ఒక మహిళా ఉద్యోగి వద్దకు వచ్చి ఆమెను తీసుకెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ వ్యక్తులే ఆ పని చేశారని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఆర్టీఏ కార్యాలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల కూడా వచ్చిన వారిని నిర్ధారించడం కష్టంగా మారింది. మరోవైపు తమ వెంట రావలసిందిగా వాళ్లు ఆదేశించడంతో పై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆమె బయటకు వారితో బయటకు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అది వారి వ్యక్తిగతమైన విషయమై ఉండవచ్చునని కొందరు భావిస్తుండగా, ఆమె మాత్రం వచ్చిన వారు ఎవరో తనకు తెలియదని, తనను డబ్బులు డిమాండ్ చేశారని అనంతరం తిరిగి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్న రేణుక తన పై అధికారులకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరా... ప్రధాన కార్యాలయం అయిన ఖైరతాబాద్‌లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం, ఆర్టీఏ కార్యాలయంలో ఎలాంటి భద్రత లేకపోవడం, బయటి వ్యక్తులపైన నిఘా వ్యవస్థ కానీ, సీసీ కెమెరాలు కానీ లేకపోవడం ఒకవైపు అయితే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ సంఘటన చర్యనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి.వచ్చిన వాళ్లు ఏసీబీకి చెందిన అధికారులా లేక ప్రైవేట్ వ్యక్తులా, పోలీసులా అనే అంశాన్ని ఆరా తీశారు. ఇలా ఉండగా, అగంతకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ తెలిపారు. -
ఖైరతాబాద్ ఆర్టీఏలో వెంకటేష్
సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ సినీనటుడు వెంకటేష్ బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. తన వాహనం హైపొతికేషన్ రద్దు కోసం ఆయన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు, రాష్ట్ర రవాణా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శామ్యూల్ పాల్ నిబంధనల మేరకు వాహనం హైపొతికేషన్ రద్దు ధృవీకరణ చేసి ఇచ్చారు. -
నగరంలోని ఆ నాలుగు రోడ్లలో నరకం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్‌లో హోంగార్డుల ఆందోళనతో సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వాహనదారులు సుమారు మూడు గంటలుగా నరకం అనుభవిస్తున్నారు. ట్యాంక్ బండ్ మొదలు ఖైరతాబాద్-నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్-పంజాగుట్ట, సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్లలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల సమయం నుంచి ట్రాఫిక్ జామ్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ సర్కిల్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన గుర్రం గౌడ్ అనే హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించిన 400 మంది హోంగార్డులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలంటూ హోర్డింగ్ ఎక్కి ఆందోళనకు దిగాడు. లేకపోతే పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గౌడ్ ఆందోళనకు మద్దతుగా మరో 250 మంది హోంగార్డులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలంటూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లు ఉద్యోగం చేయించుకొని, అనంతరం సర్వీస్ నుంచి తొలగించాని ఆవేదన వ్యక్తం చేశారు. 400 మంది హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాంటూ డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఖైరతాబాద్‌లో ఆటో దగ్ధం
హైదరాబాద్: ఖైరతాబాద్ కూడలిలో ఓ ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న బకెట్లతో నీళ్లను తెచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: ఖైరతాబాద్ లో జరుగుతున్న రహదారి మరమ్మత్తుల కారణంగా శనివారం మధ్యహ్నం భారీగా ట్రాఫిక్ జాం అయింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ఖైరతాబాద్ లో ట్రాఫిక్ జాం కారణంగా లక్డీకపూల్, నెక్లెస్ రోడ్, మెహిదీపట్నంలలో వాహనాలు నత్తనడకన ప్రయాణిస్తున్నాయి. -
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు
-
మహాగణపతితో వెంకయ్య..
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతికి ఆదివారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో ఇంత పెద్ద ఎత్తున ఉన్నగణపతిని దశాబ్దాలుగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. -
ఆ లడ్డూ..ఎందుకు పెట్టనట్టు!
ఖైరతాబాద్: ఖైరతాబాద్ గణపతి మహా ప్రసాదం ఈ ఏడాది భక్తులకు ‘చేరువ’యింది. ఏటా 50 అడుగుల ఎత్తులో లంబోదరుడి చేతిలో దర్శనమిచ్చే ప్రసాదం ఈ ఏడాది పాదాల చెంతనే ఉంచారు. 500 కిలోల లడ్డూను చేతితో తాకుతూ నమస్కరిస్తూ ముందుకు సాగుతున్న భక్తుల మదిలో ఓ వైపు ఆనందం ఉన్నా.. గణపతి చేతిలో లడ్డూను ఎందుకు పెట్టలేదనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు ఈ ఏడాది మహా గణపతికి 500 కేజీల లడ్డూను ప్రసాదంగా సమర్పించేందుకు సోమవారం ఉదయం తీసుకువచ్చారు. పూజ ల అనంతరం లడ్డూను గణపతి చేతిలో అమర్చేందుకు క్రేన్‌ను సిద్ధం చేశారు. క్రేన్‌కు లడ్డూను అమర్చారు. క్రేన్ ఆపరేటర్‌కు సిగ్నల్ అందడంతో లడ్డూను పైకి లేపి వినాయకుడి చేతిలో పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. అంత వరకూ గాలిలో ఉన్న మహా ప్రసాదాన్ని చూస్తున్న భక్తులకు అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. ఏమైందో లడ్డూ ప్రసాదం గణపతి చేతిలోకి బదులు పాదాల చెంతకు చేరింది. ఎందుకిలా జరిగింది..? అని కమిటీ ప్రతినిధుల్ని అడిగితే మౌనమే సమాధానమైంది. ఎల్ఈడీ ఛత్రం లేదు.. ఏటా వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేందుకు వీలుగా లడ్డూపై ఎల్ఈడీ ఛత్రాన్ని అమర్చేవారు. కానీ ఈసారి మహా గణపతి పాదాల చెంత ఉంచిన 500 కిలోల లడ్డూకు కేవలం పాలిథిన్ కవర్ మాత్రమే కప్పి వదిలేశారు. ప్రహసనం.. ప్రసాద వితరణ ఖైరతాబాద్ గణపతి లడ్డూ ప్రసాదమంటే భక్తులకు మహా క్రేజ్. మూడేళ్లుగా ప్రసాదం పంపిణీ ప్రహసనంగా మారుతోంది. ఈ ప్రసాదానికి సాయుధ పోలీసుల కాపాలా ఉంచాల్సి వస్తోంది. ప్రసాదం పంచే రోజు భక్తుల రద్దీని అదుపుచేయలేని పరిస్థితులూ ఉన్నాయి. దీంతో ప్రసాద వితరణ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఏడాది ప్రసాదం సైజు తగ్గిపోవడానికి, చేతిలో ఏర్పాటు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమని చెబుతున్నారు. పంపిణీపై లేని క్లారిటీ.. మహా నైవేద్యానికి తొలి ఐదు రోజులు పూజ తప్పనిసరి అని, తరువాతే ప్రసాద పంపిణీ అని ఉత్సవ కమిటీ చెబుతోంది. పంపిణీ ఎప్పుడు ఎక్కడ అనే విషయాలపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఉత్సవ కమిటీ ప్రకటన కోసం ప్రసాదాన్ని ఆశిస్తున్న భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొసమెరుపు.. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఖైరతాబాద్‌కు చెందిన శ్రీధర్ అనే భక్తుడు 15 కేజీల లడ్డూను మహా గణపతికి సమర్పించారు. ఈ నైవేద్యాన్ని ఖాళీగా ఉన్న లంబోదరుడి చేతిలో ఉంచారు.