మహాగణపతికి కండువా | kanduva function at khairathabad ganesha | Sakshi
Sakshi News home page

మహాగణపతికి కండువా

Published Sun, Sep 4 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

మహాగణపతికి సమర్పించే కండువా, జంద్యం, పట్టు వస్త్రాలను చూపుతున్న ఖైరతాబాద్‌ పద్మశాలి సంఘం సభ్యులు

మహాగణపతికి సమర్పించే కండువా, జంద్యం, పట్టు వస్త్రాలను చూపుతున్న ఖైరతాబాద్‌ పద్మశాలి సంఘం సభ్యులు

75 అడుగుల చేనేత కండువా, 75 అడుగుల జంద్యం మహాగణపతికి సమర్పించనున్నారు.

ఖైరతాబాద్‌: ప్రతియేటా ఖైరతాబాద్‌ మహాగణపతికి ఆనవాయితీగా ఖైరతాబాద్‌ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అందజేసే 75 అడుగుల చేనేత కండువా, 75 అడుగుల జంద్యం సోమవారం వినాయక చవితి సందర్భంగా శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి సమర్పించనున్నట్లు సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మహాగణపతికి సమర్పించే కండువా, జంద్యాన్ని ప్రదర్శించారు.

సోమవారం ఉదయం 7 గంటలకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు మహాగణపతికి భారీ కండువాను, ఐపీఎస్‌ అధికారి  శ్రీనివాస్‌ బారీ గాయత్రి జంద్యం, ఐఏఎస్‌ సురేంద్ర కుమార్‌ శక్తిపీఠాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కొండయ్య, ఉపాధ్యక్షుడు పి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామి తదితరులు పాల్గొన్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement