మహాగణపతికి కండువా
ఖైరతాబాద్: ప్రతియేటా ఖైరతాబాద్ మహాగణపతికి ఆనవాయితీగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అందజేసే 75 అడుగుల చేనేత కండువా, 75 అడుగుల జంద్యం సోమవారం వినాయక చవితి సందర్భంగా శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి సమర్పించనున్నట్లు సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మహాగణపతికి సమర్పించే కండువా, జంద్యాన్ని ప్రదర్శించారు.
సోమవారం ఉదయం 7 గంటలకు హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు మహాగణపతికి భారీ కండువాను, ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ బారీ గాయత్రి జంద్యం, ఐఏఎస్ సురేంద్ర కుమార్ శక్తిపీఠాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కొండయ్య, ఉపాధ్యక్షుడు పి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామి తదితరులు పాల్గొన్నారు.