సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గణేష్ విగ్రహ చిత్రపట ఆవిష్కరణకు తనను పిలవలేదని వైస్ ప్రెసిడెంట్ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అతను ఈ కార్యక్రమం జరిపేది లేదంటూ మైక్ విరగొట్టారు.
ఖైరతాబాద్ గణపతి నమూనా చిత్రాన్ని విడుదల చేసిన కమిటీ సభ్యులు
ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల
ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల చేశారు. ఆ పటంలో శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. కాగా ఈ ఏడాది 40 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడు ప్రతిష్ఠించనున్నారు. వినాయకుడికి కుడివైపు కృష్ణకాళీ, ఎడమవైపు కాలనాగేశ్వరి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment