Khairathabad Ganesh
-
#VinayakaChavithi : రేపటి నుండి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం (ఫొటోలు)
-
కన్నుల పండుగగా ముగిసిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
-
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పోలీస్ డ్యాన్స్ అదుర్స్
-
క్రేన్ నెంబర్-4 వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్
-
భక్తుల పూజలందుకుంటున్న బడా గణేష్
-
శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ మహా గణపతి
-
ట్యాంక్‌బండ్ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
-
నేడే ‘గణ’ వేడుక
సాక్షి, హైదరాబాద్: సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొజ్జగణపయ్యకు భక్తజనం ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. చదవండి: గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగే ఉత్సవాలు వైవిధ్యభరితమైన హైదరాబాద్ మహానగర చరిత్రకు ఒక సమున్నతమైన ఆధ్యాత్మిక ఆవిష్కరణ. చిన్న చిన్న గల్లీలు, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు అడుగడుగునా కొలువుదీరిన విభిన్న మూర్తుల గణనాథుడి ఉత్సవంతో నగరం సరికొత్త కాంతులను సంతరించుకుంటుంది. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందో త్సాహాలతో కొలిచి మొక్కారు. ‘ కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వ యంతో సకల ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి మొదలయ్యే నిమజ్జన శోభాయాత్ర సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంది. ►వివిధప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు శోభాయాత్ర మార్గాలు: 320 కి.మీ. ►ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేసేందుకు యాక్షన్ టీమ్స్ : 162 ►గణేశ్ యాక్షన్ టీమ్స్ సిబ్బంది : 8,116 ►నిమజ్జనం జరిగే ప్రాంతాలు : 33 చెరువులు, 25 కొలనులు. ►విగ్రహాల నిమజ్జనానికి అందుబాటులో ఉన్న క్రేన్లు: 316 ►ట్యాంక్‌బండ్ పరిసరాల్లో క్రేన్లు: 40 ►అంచనా వ్యర్థాలు: 3,910 మెట్రిక్ టన్నులు ►చెత్తను తరలించేందుకు పెద్ద వాహనాలు: 44, మినీ టిప్పర్లు: 39, జేసీబీలు:21 ►ఫైర్ వాహనాలు : 38 ►బారికేడింగ్స్ : 12 కి.మీ. ►వాటర్‌ప్రూఫ్ టెంట్లు : 15 ►తాగునీటి పంపిణీ శిబిరాలు: 101 ►అందుబాటులో వాటర్ప్యాకెట్లు: 30 లక్షలు ►హుస్సేన్‌సాగర్ వద్ద ట్రాన్స్ఫార్మర్లు: 48 ►అన్ని నిమజ్జనప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు: 101 ►తాత్కాలిక వీధి దీపాలు: 41,284 ►ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఎల్ఈడీ లైట్లు: 2600 ►హుస్సేన్‌సాగర్ వద్ద బోట్లు : 9 ►ట్యాంక్‌బండ్ వద్ద స్విమ్మర్లు: 32 ►పంపిణీకి అందుబాటులో మాస్కులు: 5 లక్షలు ►శోభాయాత్ర మార్గంలో, చెరువుల వద్ద శానిటైజర్లు ►విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది: 19000 ►ట్యాంక్‌బండ్‌పై అంబులెన్సులు: 2 పోలీస్ కంట్రోల్‌రూమ్స్: 2 ►ఆయా ప్రాంతాల్లో వాచ్ టవర్లు ►ఎన్టీఆర్ మార్గ్‌లో వాటర్‌బోర్డు, టీఎస్ఎస్ పీడీసీఎల్, జీహెచ్ఎంసీల కంట్రోల్‌రూమ్స్. ►సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తికనుగుణంగా చెరు వులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ►హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక వ్యాక్సినేషన్ శిబిరం శనివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహ నిమజ్జనం హెలికాప్టర్ నుంచి పర్యవేక్షణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహ మూద్‌అలీలతోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌లు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, నిమజ్జనాలను హెలికాప్టర్లో ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలిస్తారు. వాటర్ బోర్డు మంచి నీటిసరఫరా గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసింది. 119 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసి, 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో జలమండలి వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు.అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్(క్యూఏటీ)లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తాయన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో ►నిమజ్జనానికి తరలి వచ్చే భక్తుల కోసం ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల (సోమవారం తెల్లవారు జాము)వరకు అన్ని రూట్లలో మెట్రో రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ►నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌కు చేరుకునేం దుకు వీలుగా ఆర్టీసీ 565 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, ఉప్పల్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు వరకు, మెహదీపట్నం, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్ వరకు ఈ బస్సులు నడుస్తాయి. ►ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమ వారం ఉదయం 4 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా 8 ఎంఎం టీఎస్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణమ ధ్య రైల్వే చర్యలు చేపట్టింది. లింగంపల్లి– సికింద్రాబాద్, నాంపల్లి– లింగపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్, నాంపల్లి– ఫలక్‌నుమా రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. -
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
-
ఖైరతాబాద్ వినాయక దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
ఖైరతాబాద్ గణేష్ తయారీ విశేషాలు
-
ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గణేష్ విగ్రహ చిత్రపట ఆవిష్కరణకు తనను పిలవలేదని వైస్ ప్రెసిడెంట్ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అతను ఈ కార్యక్రమం జరిపేది లేదంటూ మైక్ విరగొట్టారు. ఖైరతాబాద్ గణపతి నమూనా చిత్రాన్ని విడుదల చేసిన కమిటీ సభ్యులు ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల ఖైరతాబాద్ గణపతి చిత్రపటం విడుదల చేశారు. ఆ పటంలో శ్రీపంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. కాగా ఈ ఏడాది 40 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడు ప్రతిష్ఠించనున్నారు. వినాయకుడికి కుడివైపు కృష్ణకాళీ, ఎడమవైపు కాలనాగేశ్వరి ఉన్నారు. -
ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో గణేషుని మండపంలోకి భక్తులను అనుమతించొద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలను అమలు చేస్తున్న కమిటీ సభ్యులు.. భక్తులను ఎవరనీ మండపంలోకి అనుమతించచోమని, రోడ్డుమీద నుంచి దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే బయటి నుంచే రోప్‌ల వెలుపల భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కమిటీ సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. గణేష్‌కు అడ్డంగా పరదా కట్టొద్దంటూ నిరసన చేపట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాలకే నిమజ్జన భాగ్యం?
సాక్షి, సిటీబ్యూరో: జై గణేశ్ నినాదాలు ఈ సంవత్సరం ఇళ్లకే పరిమితం కానున్నాయి. కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఆడంబరాలు, అన్నదానాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సామూహిక ప్రార్థనలకు అవకాశంఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి గణేశ్ ఉత్సవసమితులు కూడా సరే చెప్పాయి. అయితే వీటి నుంచి ఖైరతాబాద్, బాలాపూర్ తదితర వినాయకులకుమినహాయింపు లభించే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఆయా భక్త మండళ్లు విగ్రహాలు నెలకొల్పినా సామూహిక పూజలు, ఇతర కార్యక్రమాలునిర్వహించకుండా చూడనున్నారు. సోమవారం రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర అధికారులు, ఉత్సవ సమితిలతోనిర్వహించిన సమావేశంలో పరిస్థితి సమీక్షించి, ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాల్లోని వినాయక దేవాలయాల్లో తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం తరపునే పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ యేడు కూడా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో మట్టివిగ్రహాలను ఉచితంగా పంచుతామని ప్రకటించారు. ఆన్లైన్లోనే..మహాగణపతి దర్శనం తొమ్మిది అడుగుల ఎత్తులో మట్టిరూపంలో రూపుదిద్దుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి ఈ మారు ఆన్లైన్లోనే దర్శనమివ్వనున్నాడు. కోవిడ్ నిబంధనలకులోబడి శిల్పి నగేష్ ఆధ్వర్యంలో 22 మంది కోల్‌కతా నుంచి వచ్చిన కార్మికులు గంగానది మట్టితో వినాయక విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఉత్సవ కమిటీకి మాత్రమే పూజలు చేసే అవకాశం కల్పించి, మిగిలిన భక్తులందరికి ఆన్లైన్లో దర్శనం ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉంటే నిమజ్జన శోభాయాత్రను కూడా బాహాటంగా అనుమతించే విషయంలో ఒకింత సందిగ్ధత నెలకొంది. ఒక వేళ అన్ని విగ్రహాలను శోభాయాత్రకు అనుమతించకపోతే బాలాపూర్, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాల వరకైనా అనుమతించాలని నిర్వహణ కమిటీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
తుది మెరుగుల్లో ధన్వంతరి గణపతి
ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లో ప్రతియేటా ఏర్పాటు చేసే గణనాథుడిని ఈసారి కోవిడ్ నేపథ్యంలో తొమ్మిది అడుగులకే పరిమితం చేసిన విషయం విదితమే. వ్యాధులను నయం చేసే ధన్వంతరి అవతారంలో ఈసారి గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణను ఎదుర్కోవడంలో సాయం చేస్తాడనే విశ్వాసంతో ఈ ఏడాది స్వామివారిని ధన్వంతరి గణపతిగా రూపొందిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గణేశ్ విగ్రహాన్ని ఈసారి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా మట్టితో తయారు చేస్తున్నారు. వినాయకుడి తయారీ తుది దశకు చేరుకున్నట్లు వారు తెలిపారు. వినాయకుడికి ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవి విగ్రహాలను కూడా మట్టితోనే తయారు చేస్తున్నామన్నారు. -
నేడు ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ పనులు ప్రారంభం
ఖైరతాబాద్: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభిస్తున్నట్లు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్ మహాగణపతిని కేవలం 6 అడుగుల ఎత్తులో మట్టితో తయారుచేస్తున్నామని ‘‘ ధన్వంత్రి నారాయణ మహాగణపతి’’ ఆకారంలో వినాయకుడి తయారు చేస్తున్నట్లు తెలిపారు. -
రద్దు అని ప్రకటించిన రెండ్రోజులకే కర్రపూజ
ఖైరతాబాద్: ఒక అడుగు నుంచి మొదలుకొని గత 66 ఏళ్లుగా అందరినీ ఆకట్టుకుంటూ.. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులచే విశేష పూజలందుకుంటూ ఖైరతాబాద్ మహాగణపతి ప్రసిద్ధి చెందాడు. అంతటి ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులకు ఏటా తొలి ఏకాదశి రోజు కర్ర పూజతో శ్రీకారం చుడతారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు నిర్వహించాలా..? వద్దా..? అన్న సంశయం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రస్తుతానికి మహాగణపతి తయారీ పనులను ప్రారంభించవద్దని సూచించారు. అయితే అప్పటికే 18న కర్రపూజ నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో పోలీసు అధికారుల సూచనల మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్, కన్వీనర్, కార్యదర్శులు కర్రపూజను రద్దు చేస్తున్నామని మరో ప్రకటన చేశారు. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైనందున ఈ సంవత్సరం ఒక్క అడుగుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అంతేగాకుండా మట్టితో మహాగణపతి తయారు చేసి ఆదర్శంగా నిలుస్తామని వారు మీడియాకు తెలిపారు. కాగా అదే రోజు రాత్రి మహాగణపతి ఎత్తు ఒక్క అడుగు కాదు 11 అడుగులతో ప్రతిష్టిస్తామని వారు మరో ప్రకటన చేశారు. కమిటీ ఎవరితో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడంపై ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు మహేష్‌యాదవ్‌తో పాటు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం లేకుండానే కర్రపూజ ఈ నెల 18వ తేదీ తొలి ఏకాదశి రోజున నిర్వహించాల్సిన కర్రపూజను కరోనా నేపథ్యంలో నిర్వహించడం లేదని ప్రకటించిన రెండు రోజులకే ఉత్సవ కమిటీకి కనీస సమాచారం లేకుండా కర్రపూజను నిర్వహించడం పట్ల స్థానికులు, కమిటీ సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే అంశంపై ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించకుండా పూటకో ప్రకటన చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
18న ఖైరతాబాద్ మహాగణపతి కర్రపూజ
ఖైరతాబాద్: ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు కర్ర పూజ నిర్వహించి ప్రారంభించే పనులను ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వినాయకుడి తయారీ, ఎత్తు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. -
మహానగరమా మళ్లొస్తా
సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరం భక్తజనసంద్రమైంది. భక్తుల కేరింతలతో హోరెత్తింది. ‘జైబోలో గణేశ్ మహరాజ్ కీ’ నినాదాలతో మార్మోగింది. వినాయక నిమజ్జన వేడుకలు గురువారం నగరంలో కనుల పండువగా జరిగాయి. మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం ముగిసిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చాయి. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు. నగరంలోని అన్ని రహదారులు ట్యాంక్‌బండ్ వైపునకు దారితీశాయి. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్మార్గ్, నెక్లెస్‌రోడ్, ఖైరతాబాద్ జనంతో కిక్కిరిసిపోయాయి. భజనలు, కీర్తనలు, కోలాటాలతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అటు ట్యాంక్‌బండ్ వైపు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఏర్పాటు చేసిన 40 క్రేన్ల ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేశారు. వైవిధ్యభరితమైన విగ్రహాలతో ట్యాంక్‌బండ్ శోభాయమానంగా కనిపించింది. బాలాపూర్ లడ్డూ వేలం ఆలస్యంగా మొదలు కావడంతో పాతబస్తీ నుంచి వచ్చే ప్రధాన యాత్ర కూడా ఆలస్యమైంది. మొత్తంగా ఒకట్రెండు విషాద ఘటనలు మినహా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. వెల్లివిరిసిన సంస్కృతి ఖైరతాబాద్ ద్వాదశాదిత్య గణపతి నిమజ్జన వేడుకలు ఉదయం 7:13 గంటలకు ఖైరతాబాద్ నుంచి మొదలై మధ్యాహ్నం 1:45 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని 6వ నంబర్ వద్ద పూర్తయ్యాయి. ఖైరతాబాద్, సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తాల మీదుగా సాగిన శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. 61 అడుగుల మహాగణపతి విగ్రహంతో సెల్ఫీ తీసుకొనేందుకు జనం పోటీ పడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒగ్గుడోలు, బోనాల ప్రదర్శనలు, కళాకారుల ఆటాపాటలతో తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసింది. నిమజ్జనం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తోపులాట జరగింది. రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు కూలిపోయాయి. బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి రెండు గంటలు ఆలస్యం కావడంతో... ప్రతిఏటా మధ్యాహ్నం 2గంటలకే నిమజ్జనం పూర్తవుతుండగా, ఈసారి సాయంత్రం 6 తరువాత జరిగింది. దీంతో మిగతా విగ్రహాల తరలింపు కూడా ఆలస్యమైంది. అబిడ్స్, సుల్తాన్‌బజార్, కోఠి, చోటా బజార్, జియాగూడ, చెప్పల్‌బజార్, లంగర్‌హౌస్, అత్తాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, అంబర్పేట్ తదితర ప్రాంతాల నుంచి విగ్రహాలు తరలి వచ్చాయి. వెరైటీ గణపతులు... వెరైటీ విగ్రహాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూషికవాహనుడై, పద్మనాభుడై, యాదాద్రి ఆలయ ఆకృతి అలంకృతుడై, తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు పలు విగ్రహాలను కాషాయ జెండాలు, త్రివర్ణ పతాకాలతో అలంకరించారు. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ వంటి సోషల్ మీడియాను ప్రతిబింబించే విధంగా చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి తీసుకొచ్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ప్రాంతాల్లో యువత సందడి ఎక్కువగా కనిపించింది. మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికుల రాకపోకలతో కిక్కిరిసిపోయింది. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో చిరువ్యాపారుల అమ్మకాలు జోరుగా సాగాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర...‘మహా’ శోభాయాత్ర సాగిందిలా.. ఖైరతాబాద్: దాదాపు 11 రోజుల పాటు ఖైరతాబాద్‌లో విశేష పూజలందుకున్నశ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జన ఊరేగింపు గురువారం ఉదయం 7.13 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.45 గంటలకు ముగిసింది. భారీకాయుడుహుస్సేన్ సాగర్‌లో ప్రశాంతంగా నిమజ్జనమయ్యాడు. అశేష భక్తజనం వెంట తరలి రాగా 61 అడుగుల ఎత్తులో మహాగణపతి ఊరేగుతూ సాగర తీరానికి తరలివెళ్తున్న దృశ్యాలను భక్తులు సెల్ ఫోన్లలో బంధింస్తూ ఆనందం పొందారు. ♦ బుధవారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత భక్తుల దర్శనాలు నిలిపివేశారు ♦ 11 గంటలకు చిన్న క్రేన్ మహాగణపతి ప్రాంగణానికి రాక ♦ 12.30కు విష్ణుమూర్తి విగ్రహాన్ని నిమజ్జనానికి మరో వాహనంపై పెట్టి తరలించారు ♦ 12.30కు ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్‌రాజ్, శిల్పి రాజేంద్రన్ కలశ పూజ ♦ గురువారం 3.30 నిమిషాలకు మహాగణపతిని పైకి తేల్చి 3.40 గంటలకు ఎస్టీసీ ట్రాలర్ వాహనంపై చేరిక ♦ ఉదయం 7.13 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం ♦ 8.30 గంటలకు సెన్షేన్ థియేటర్ ♦ 8.55కు రాజ్‌దూత్ చౌరస్తా ♦ 9.08కు టెలిఫోన్ భవన్ ♦ 9.30 గంక్కు ఎక్బాల్ మినార్ చౌరస్తా ♦ 10.43కు తెలుగుతల్లి చౌరస్తా ♦ మధ్యాహ్నం 12.24కు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.6 వద్దకు మహాగణపతి ♦ 12.45లకు మహాగణపతికి చివరి పూజలు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. ♦ 12.52కు వెల్డింగ్ తొలగింపు పనులు ♦ 1.15కు మోడ్రన్ క్రేన్ అపరేటర్ దేవేందర్‌సింగ్ పూజలు ♦ 1.21కి మహాగణపతి విగ్రహాన్ని పైకి లేపి నలువైపులా తిప్పి భక్తులకు కనువిందు చేశారు ♦ 1.45 గంటలకు మహాగణపతినినిమజ్జనం మహాగణపతిని సంపూర్ణ నిమజ్జనం గావిస్తామని చెప్పినా చివరి ఘట్టంలో నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా కొంచెం పక్కన నిమజ్జనం చేయడంతో విగ్రహం 80 శాతం మాత్రమే నీటమునింది. -
మహా గణపతికి జర్మన్ క్రేన్
ఖైరతాబాద్: శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు జర్మన్ టెక్నాలజీ.. తడానో కంపెనీకి చెందిన ఆధనిక క్రేన్‌ను వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్ ఇదొక్కటే కావడం విశేషం. ఈ క్రేన్ 400 టన్నుల బరువును 60 మీటర్లు పైకి ఎత్తుతుంది. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు ఒక్కో టైరు టన్ను బరువు గల 12 టైర్లు ఉన్నాయి. క్రేన్ సామర్థ్యం 72 టన్నులు కాగా 50 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ సాయంతో నిమజ్జన మహత్కార్యాన్ని పూర్తి చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం రెండోసారి కలగినందుకు సంతోషంగా ఉందని క్రేన్ ఆపరేటర్, పంజాబ్‌కు చెందిన దేవేందర్ సింగ్ పేర్కొన్నారు. తనకు క్రేన్ ఆపరేటింగ్‌లో 11 సంవత్సరాల అనుభవం ఉందని, ఆధునిక టెక్నాలజీ హైడ్రాలిక్ క్రేన్‌ను రెండేళ్లుగా ఆపరేట్ చేస్తున్నానని తెలిపారు. -
గణేష్ నిమజ్జనాన్ని సులభంగా ఇలా వీక్షించండి
వినాయక నవ రాత్రుల ముగింపు ఘట్టం దగ్గరకు వచ్చింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్‌లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. నగరం నలమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం వీక్షించడానికి సిద్ధపడుతున్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జరగబోయే శోభాయాత్రను తిలకించడానికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఈసారి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, బారికేడ్లను దాటడంలో ఇబ్బందులు పడకుండా ఉత్తమమైన మెట్రో మార్గాన్ని ఎంచుకోండి. -
మహాగణపతిం.. సప్తవర్ణ శోభితం
ఖైరతాబాద్: ఈ సంవత్సరం ద్వాదశాదిత్య మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చేందుకు గణనాథుడు సిద్ధమవుతున్నాడు. వినాయచకవితి సమీపిస్తుండటంతో (వచ్చే నెల 2న) పెయింటింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. 61 అడుగుల ఎత్తులో మహాద్భుత రూపంలో భక్తులకు దర్శనమిచ్చే విధంగా రూపొందించిన మహాగణపతి కాకినాడ, గొల్లపాలెంకు చెందిన గేసాల వీర భీమేశ్వర్రావు ఆధ్వర్యంలో సత్యార్ట్స్ పేరుతో ఐదుగురు ఆర్టిస్టులు, 15 మంది పెయింటర్లు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మహాగణపతికి వాటర్ కలర్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఏడు రంగులతో తుది మెరుగులు ♦ శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తయారుచేసిన అద్భుత రూపానికి సప్తవర్ణాలతో రంగులు అద్దుతున్నారు. ♦ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్పై మొదటగా 60 లీటర్ల ప్రైమర్, ♦ ఆభరణాలకు గోల్డ్ కోటింగ్ (గోల్డ్ కలర్ ) 60 లీటర్లు ♦ మహాగణపతి శరీరానికి (స్కిన్ కలర్) 60 లీటర్లు, ♦ పంచె ఇతరత్రా (పసుపు రంగు) 35 లీటర్లు ♦ బ్యాక్ గ్రౌండ్ ఇతరత్రాలకు (నెవీ బ్లూ) 30 లీటర్లు ♦ మహాగణపతి పక్కన ఉన్న అమ్మవారి చీరలు ఇతరత్రాలకు (ఎరుపు రంగు) 20లీటర్లు, అమ్మవారి దుస్తులకు (ఆకుపచ్చ రంగు) 25 లీటర్లు ♦ పాములు (బ్రౌన్ కలర్) 60 లీటర్లు, ♦ కిరీటాలు, ఆభరణాలకు 6 వర్ణాలతో 50 లీటర్లు ♦ తెలుపు రంగు 60లీటర్లు, చివరగా క్లియర్ వార్నిష్ 40 లీటర్లు మొత్తంగా 500 లీటర్ల రంగులను మహాగణతికి వినియోగిస్తున్నారు. వరుసగా 10వ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి తుది మెరుగులు దిద్దేందుకు రావడం సంతోషంగా ఉందని పేయింటర్ భీమేశ్వర్రావు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో పేయింటింగ్ పనులు పూర్తవుతాయన్నారు. -
ఖైరతాబాద్ మహా గణపతికి కర్రపూజ
ఖైరతాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతిని భక్తులు మెచ్చేలా, నచ్చేలా అత్యంత అద్భుతంగా 55 నుంచి 60 అడుగుల ఎత్తులో తీర్చి దిద్దనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. మంగళవారం సర్వేకాదశి సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులకు కర్రపూజ నిర్వహించారు. భాగ్యనగర్ గణేష్ ఉ త్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, గణపతి దీ క్షా కమిటీ హన్మంతరావులతో పాటు పూజారులు మహదేవశర్మ, రంగరాజాచార్యులు ప్రత్యేక పూజ లు నిర్వహించి కర్రను పాతారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, సందీప్‌రాజ్, మహేష్‌యాదవ్, చందు తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. త్వరలో మహాగణపతి నమూనా విడుదల 65వ సంవత్సరం సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి నిర్వాహకులు అత్యంత అద్భుతంగా భక్తులకు ఈ ఏడాది కూడా అద్భుత రూపంలో దర్శనమిచ్చే విధంగా నమూనాను దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచనల మేరకు వారం పదిరోజుల్లో నామకరణంతో పాటు నమూనా విడుదల చేస్తామని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. వచ్చే సంవత్సరం అధిక మాసం కారణంగా ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 2న ఉండటంతో కర్ర పూజను ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిల్పుల సంప్రదాయం ప్రకారం మంగళవారం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని శిల్పి తెలిపారు. -
5.51 గంటల్లో ఖైరతాబాద్ మహా గణేశ్‌కు బైబై..
ఖెరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతికి అశేష భక్తజనం తుది వీడ్కోలు పలికింది. ఆదివారం ఉదయం వేలాది మంది భక్తులు వెంట రాగా ఉదయం 7.05 గంటలకు మండపం నుంచి బయలుదేరిన శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి హుస్సేన్‌సాగర్ ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్ 6 వద్ద మధ్యాహ్నం 12.56 గంటలకు గంగ ఒడికి చేరాడు. 5.51 గంటల పాటు సాగిన శోభాయత్రకు సందర్శకులు, ప్రముఖులు రాకతో సాగర్ ప్రాంగణం కిక్కిరిసింది. యాత్రలో ముందు వినాయకుడి విగ్రహం, వెనుక శ్రీనివాస కల్యాణం సాగాయి. దారిపొడవునా నృత్యాలు, భజనల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పోలీసుల ప్రత్యేక చొరవతో నిమజ్జనం గతేడాదితో పొలిస్తే గంట ముందుగానే ప్రశాంతంగా ముగిసింది. రెండున్నర గంటలపాటు బ్రేక్.. ఉదయం 10.20కు సాగర్‌లోని క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకున్న వినాయకుడిని 40 నిమిషాల పాటు అక్కడే నిలిపారు. అదే సమయంలో అన్ని క్రేన్ల వద్ద ఉన్న పోలీసు సిబ్బంది బడా గణేశ్డిని నిమజ్జనం చేసే క్రేన్ నంబర్ 6 వద్దకు రమ్మని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మిగతా క్రేన్ల వద్ద నిమజ్జనాలను నిలిపివేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో చంటిపిల్లలు ఇబ్బందులు పడ్డారు. మహాగణపతి నిమజ్జన యాత్ర ఇలా.. ⇔ శనివారం రాత్రి 11 గంటలకు భక్తుల దర్శనం నిలిపివేత ⇔ అర్ధరాత్రి 12 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు ప్రారంభం ⇔ 12.50కు ప్రాంగణంలోకి చేరుకున్న క్రేన్ ⇔ 12.55కు ఉత్సవ కమిటీ కలశ పూజ ⇔ 1.46–2.05 గంటల మధ్య మహాగణపతి ప్రాంగణంలోని శ్రీనివాస కల్యాణం మండపాన్ని క్రేన్ సాయంతో వాహనంపై ఉంచారు. ⇔ 3.20కు భారీ విగ్రహాన్ని తాళ్ల సాయంతో పైకెత్తారు ⇔ 3.30కు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ చివరి పూజ ⇔ 3.40కి ట్రాలర్‌పై మహాగణపతి విగ్రహ ⇔ ఆదివారం ఉదయం 7.05కు ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభం ⇔ 8.15కు సెన్సేషన్ థియేటర్ వద్దకు ⇔ 8.35కు రాజ్‌దూత్ చౌరస్తా.. ⇔ 8.48కు టెలిఫోన్ భవన్, 9.05కు ఎక్బాల్ మినార్ చౌరస్తా ⇔ 9.24 సచివాలయం ఓల్డ్‌గేట్ ⇔ 10 గంటలకు తెలుగుతల్లి చౌరస్తాకు మహాగణపతి చేరుకోగానే భారీగా తరలివచ్చిన భక్తులు ⇔ 10.15కు లుంబినీ పార్కు వద్దకు యాత్ర ⇔ 10.20– 11.10 వరకు మహాగణపతి క్రేన్ నెం–4వద్దే దాదాపు 40 నిమిషాలు నిలిపివేశారు. ఈ సమయంలో భక్తుల తాకిడి పెరిగింది. ⇔ 11.25కి ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెం–6 వద్దకు చేరుకున్న విగ్రహం ⇔ 11.42కు మహాగణపతికి తుది పూజలు ప్రారంభం. తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, సీపీ అంజనీకుమార్, మాజీ చింతల రామచంద్రారెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ⇔ 12.35కు కలశ పూజ, భక్తులకు మంత్ర జలం.. ⇔ 12.56కు మహాగణపతి సాగర్ నిమజ్జనం. ట్రాలర్‌కు అందంగా అలంకరణ మహాగణపతి నిమజ్జనానికి తరలించే ఎస్టీసీ ట్రాలర్ వాహనాన్ని ఆదివారం తెల్లవారు జామున కొబ్బరాకులు, అరటి చెట్లు, మామిడి తోరణాలు, బంతిపూలతో అందంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఏకరూప దుస్తుల్లో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. హైడ్రాలిక్ క్రేన్ సాయంతో నిమజ్జనం ఖైరతాబాద్: శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆధునిక జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన మోడ్రన్ క్రేన్‌ను వినియోగించారు. గతేడాది రవి క్రేన్స్‌కు చెందిన క్రేన్‌తో నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జన సమయంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది రవి క్రేన్స్ రాకపోవడంతో హైడ్రాలిక్ ఆధునిక రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్‌తో నిమజ్జనం చేశారు. హైడ్రాలిక్ మోడ్రన్ క్రేన్.. తడానో కంపెనీ తయారు చేసిన మోడ్రన్ క్రేన్ హైడ్రాలిక్ రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది 400 టన్నుల బరువును అవలీలగా పైకెత్తుతుంది. దీని జాక్ 60 మీటర్ల పైకి లేస్తుంది. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైర్ టన్ను బరువుంది. 45 టన్నులున్న మహాగణపతిని సునాయాసంగా సాగర్‌లో నిమజ్జనం చేశారు. సంతోషంగా ఉంది.. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలిసారి ఈ క్రతువులో పాలుపంచుకున్నా. క్రేన్ ఆపరేటింగ్‌లో పదేళ్ల అనుభవం ఉంది. ఈ హైడ్రాలిక్ క్రేన్‌ను రెండేళ్ల నుంచి ఆపరేట్ చేస్తున్నా. – దేవేందర్ సింగ్, పంజాబ్ -
వెళ్ళిరావయ్య బొజ్జగణపయ్య
-
రారండోయ్ వేడుక చూద్దాం!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాయి. పోలీసులు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు. లక్షలాది మంది భక్తజనం వేడుకలకు తరలిరానున్న దృష్ట్యా అడుగడుగునా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ చుట్టూ సుమారు 30 వేల మంది పోలీసు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, వైద్య, ఆరోగ్యశాఖలు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గంలో నిమజ్జన వేడుకలు ముగిసి, భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లేవరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు నడిచే 121 ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు, అదనపు సర్వీసులను దక్షిణమధ్య రైల్వే నడపనుంది. రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం జలమండలి 30 లక్షల మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయనుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌మార్గ్‌లో, నగరంలోని ఇతర ప్రాంతాల్లో 27 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అలాగే 108 అంబులెన్సులను 15 సిద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి పరిస్థితినయినా అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. మరోవైపు గతేడాది నిర్వహించినట్లుగానే ఈసారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన యాత్ర ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట లోగా ముగియనుంది. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని 35 చెరువుల్లో నిమజ్జనం ఏర్పాట్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 117 స్థిరమైన క్రేన్లు, మరో 96 మొబైల్ క్రేన్లను ఆయా ప్రాంతాల్లో ఉంచారు. పక్కాగా పారిశుధ్య నిర్వహణ నిమజ్జనం సందర్భంగా పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక యాక్షన్ టీంలను రంగంలోకి దింపింది. రూ.16.86 కోట్ల వ్యయంతో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. శోభాయాత్ర జరిగే 370 కిలోమీటర్ల మార్గంలో ప్రతి 3 కిలోమీటర్లకు ఓ యాక్షన్ టీమ్ ఉంటుంది. ఈ బృందంలో ఓ శానిటరీ సూపర్వైజర్ లేదా శానిటరీ జవాన్, ముగ్గురు ఎస్ఎఫ్ఏలు, 21 మంది పారిశుధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తారు. మొత్తం 178 గణేశ్ యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపారు. పారిశుధ్య కార్యక్రమాలకు మొత్తం 481 మంది సూపర్వైజర్లు, 719 ఎస్ఎఫ్ఏలు, 8,597 కార్మికులు పనిచేస్తారు. ట్యాంక్‌బండ్‌తో పాటు, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మీరాలంట్యాంక్ తదితర అన్ని నిమజ్జన ప్రాంతాల వద్దా 27 ప్రత్యేక వైద్య శిబిరాలను, 92 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ⇔ జీహెచ్ఎంసీ నిర్మించిన 20 గణేశ్ నిమజ్జన కొలనుల్లో శుభ్రమైన నీటిని నింపి సిద్ధంగా ఉంచారు. ⇔ విద్యుత్ విభాగం రూ.94. 21 లక్షల వ్యయంతో 34,926 తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, సరూర్‌నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం నగరంలోని అన్ని నిమజ్జన ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 75 జనరేటర్లను అందుబాటులో ఉంచారు. ⇔ రోడ్లు భవనాల శాఖ ద్వారా 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ చేశారు. ⇔ శోభాయాత్ర మార్గంలో 15 కేంద్రాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లను వేశారు. 38 ఫైర్ ఇంజన్లను మోహరించారు. ⇔ సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద ప్రత్యేకంగా 3 బోట్లను అందుబాటులో ఉంచారు. ⇔ ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ చెరువుల వద్ద కేంద్ర విపత్తు నివారణ దళాలు మోహరించాయి. ⇔ పర్యాటక శాఖ హుసేన్ సాగర్ చెరువులో 7 బోట్లను సిద్ధం చేసింది. మరో 4 హైస్పీడ్ బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. 10 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రి 10.30 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 550 ప్రత్యేక బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకునేందుకు 550 బస్సులను అదనంగా తిప్పనున్నారు. సికింద్రాబాద్, ఉప్పల్, కాచిగూడ, కూకట్పల్లి, లింగంపల్లి, బాలానగర్, జీడిమెట్ల, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి ఇందిరాపార్కు, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. నిఘా నీడలో నిమజ్జనం గణేశ్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు కమిషనరేట్లలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లు డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. ముఖ్యంగా దాదాపు మూడువేలకు పైగా సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఉన్నతాధికారులు నిమజ్జనయాత్రను పరిశీలించనున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర దృశ్యాలను 450 సీసీటీవీ కెమెరాలు బంధించనున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన 38 క్రేన్లకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డులో 90 సీసీటీవీ కెమెరాలు భక్తులు, గణనాథుల కదలికలను బంధించనున్నాయి. అలాగే నగరంలో గూగుల్ ద్వారా ట్రాఫిక్ అలర్ట్‌ను అందించనున్నారు. అలాగే ఏ సమయానికి ఏ విగ్రహం నిమజ్జనం చేస్తున్నారో కూడా పొందుపరచడంతో సమయనుగుణంగా నిమజ్జనం జరిగేలా పోలీసులు చూస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. 1.సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్స్, ఇంజిన్‌బౌలి, నాగుల్చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, ఆశ్ర హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్‌కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్,దారుల్షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్ 2.ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ 3.వెస్ట్ జోన్: టోపిఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ 4.సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్కు, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడిగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్కు 5.నార్త్‌జోన్: కర్బాలా మైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘన్సీమండీ చౌరస్తా మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. ⇔ మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఎస్సార్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్సార్‌నగర్ కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బీ ఆఫీస్, బల్కంపేట, డీకే రోడ్ ఫుడ్ వరల్డ్, సత్యం థియేటర్ జంక్షన్, మాతా టెంపుల్, అమీర్‌పేట మీదుగా పంపిస్తారు. ఎన్టీఆర్ మార్గ్‌లో భారీ క్రేన్లు బంజారాహిల్స్: ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 12 క్రేన్లను అందుబాటులో ఉంచినట్టు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖి, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్–17డీఎంసీ సత్యనారాయణ తెలిపారు. శనివారం వారు ఆ ప్రాంతంలో ఏర్పాట్లును పరిశీలించి మాట్లాడారు. ఒక్కో క్రేన్ దగ్గర ఒక ఏఈ, మూడు క్రేన్లకు కలిపి ఒక డీఈ ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. ఇద్దరు ఏఎంహెచ్ఓలు, జోనల్ కమిషనర్, ఇద్దరు డీఎంసీలు 12 మంది అధికారులు విధుల్లో ఉంటారన్నారు. వీరుగాక ఒక్కో క్రేన్ వద్ద షిఫ్ట్‌కు 21 మంది చొప్పున ఎంటమాలజీ, శానిటేషన్ వర్కర్లు వ్యర్థాలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ ప్లాస్టిక్ కవర్లు అందజేశారు. చెత్తను తరలించడానికి 15 టిప్పర్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. ఇక్కడ జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. నాలుగు చోట్ల మొబైల్ టాయ్లెట్లు, రెండు షీ టాయ్లెట్లను అందుబాటులో ఉంచామన్నారు. కాగా, శుక్రవారం ఒక్క రోజే 140 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించినట్టు అధికారులు తెలిపారు. -
ఆ క్షణాలను చూసి తట్టుకునే ధైర్యం లేదు
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకుసర్వంసిద్ధమైంది. నిమజ్జన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభమై... మధ్యాహ్నానికి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్.6కు చేరుకునేలా అధికారులుఏర్పాట్లు చేస్తున్నారు. ♦ శుక్రవారం రాత్రి 11గంటలకు మహాగణపతి షెడ్డు తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ♦ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కు చెందిన ట్రాయిలర్ వాహనం శుక్రవారం ఉదయమే మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంది. ♦ మహాగణపతిని దర్శించుకునేందుకు శనివారం మధ్యాహ్నం వరకే భక్తులకు అనుమతిస్తారు. ఆ తర్వాత దూరం నుంచి మాత్రమే చూడాలి. ♦ శనివారం అర్ధరాత్రి 12గంటలకు కలశాన్ని కదిలించి.. మహాగణపతికి క్రేన్ సెట్టింగ్, వెల్డింగ్ పనులు ప్రారంభిస్తారు. ♦ ఆదివారం తెల్లవారుజాము 3–4 గంటల్లోపు వెల్డింగ్ పనులు పూర్తవుతాయి. ♦ ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఇదీ రూట్‌మ్యాప్ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, హోంసైన్స్ కళాశాల, ఎక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాతగేటు, తెలుగుతల్లి చౌరస్తా.. అక్కడి నుంచి ఎడమ వైపునకు మలుపు తిరిగి లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని 6వ నెంబర్ క్రేన్ దగ్గరికి ఉదయం 11గంటల వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12గంటల్లోపు నిమజ్జనం చేస్తారు. శివాలయానికి శివపార్వతులు... మహాగణపతికి కుడివైపున ఏర్పాటు చేసిన శ్రీనివాస కల్యాణం విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనానికి తరలిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఎడమవైపున ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాన్ని శ్రావ్య గ్రాఫిక్స్‌కు చెందినవారు వరంగల్ ఆలేరులోని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన శివ దేవాలయానికి తీసుకెళ్తున్నారు. ఆరేళ్లుగా ... మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ట్రాయిలర్ వాహనం సారథిగా ఎస్టీసీ కంపెనీలో 20ఏళ్లుగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి ఆరేళ్లుగా ఖైరతాబాద్ నిమజ్జనానిని రథసారథిగా వ్యవహరిస్తున్నాడు. శోభాయాత్ర ప్రారంభమైన నాలుగు గంటల్లో గణపతిని సాగర తీరానికి చేరుస్తానని ఆయన తెలిపాడు. ఆపరేటర్ జమీల్.. రవి క్రేన్స్ ఆధ్వర్యంలో ప్రతిఏటా మహాగణపతిని ట్రాయిలర్ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. తర్వాత తిరిగి అందులో నుంచి తీసి నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రేన్ ఆపరేటర్‌గా మహ్మద్ జమీల్ పనిచేస్తున్నాడు. మహాగణపతికి సేవ చేసే భాగ్యం లభించడం తనకెంతో సంతోషాన్నిస్తోందని ఆయన పేర్కొన్నాడు. హెవీ మొబైల్ క్రేన్... మహాగణపతి నిమజ్జనంలో భాగంగా గత 13ఏళ్లుగా రవిక్రేన్స్‌కు చెందిన హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్‌ను వినియోగిస్తున్నారు. జర్మనీకి చెందిన ఈ క్రేన్ బరువు 110 టన్నులు. 150 టన్నుల బరువును అవలీలగా పైకి లేపుతుంది. క్రేన్ జాక్ 50 మీటర్ల పైకి వెళ్తుంది. వెడల్పు 11 ఫీట్లు, పొడవు 60 ఫీట్లు ఉంటుంది. దీనికి 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైరు ఒక టన్ను బరువు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనికి 4 హైడ్రాలిక్ జాక్‌లు ఉంటాయి. 40 టన్నుల బరువున్న ఖైరతాబాద్ వినాయకుడిని క్రేన్ అవలీలగా వాహనంలోకి ఎక్కిస్తుందని ఎండీ కేవీ రావు తెలిపారు. ట్రాయిలర్ వాహనం... గత ఏడేళ్లుగా మహాగణపతి శోభాయాత్రకు వినియోగిస్తున్న ట్రాయిలర్ వాహనం (ఏపీ16 టీడీ 4059) సామర్థ్యం 100 టన్నులు. 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉండే ఈ వాహనానికి 26 టైర్లు ఉంటాయి. దాదాపు 40 టన్నుల బరువుండే మహాగణపతిని ఈ వాహనం నిమజ్జనానికి తరలిస్తుందని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జి శరత్‌కుమార్ తెలిపారు. దిశానిర్దేశం నాగరాజు... శోభాయాత్ర ముందు నడుస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు చెందిన నాగరాజు డ్రైవర్‌కు దిశానిర్దేశం చేస్తాడు. ఇతని సూచనల మేరకు వాహనం ముందుకు సాగుతుంది. గత 15ఏళ్లుగా నాగరాజు సేవలందిస్తున్నాడు. ఆ క్షణంలో శిల్పి ఉండరు... 35 ఏళ్లుగా ఖైరతాబాద్ మహాగణపతిని అద్భుతంగా తయారు చేస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నిమజ్జన యాత్రలో పాలుపంచుకోరు. తాను తీర్చిదిద్దన అద్భుత రూపం సాగరంలో కరిగిపోయే ఆ క్షణాలను చూసి తట్టుకునే ధైర్యం లేకే నిమజ్జనానికి ఉండనని చెప్పారు రాజేంద్రన్. -
సప్తముఖ కాళసర్పుడిగా మహాగణపతి
-
తొలి పూజలందుకున్న మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి వస్తుందంటే దేశవ్యాప్తంగా అందరి చూపూ ఖైరతాబాద్‌వైపే ఉంటుంది. ఈ ఏడాది ఏ రూపంలో దర్శనమిస్తాడా అని అందరిలోనూ చర్చ మొదలవుతుంది. అందుకు తగ్గట్టే బొజ్జ గణపయ్య వివిధ రూపాల్లో భక్తులకు దర్శమిస్తుంటాడు. ఖైరతాబాద్‌లోని మహాగణపతికి గురువారం ఉదయం 11.52 గంటలకు ప్రథమ పూజ నిర్వహించారు. సప్తముఖ కాళసర్ప మహాగణపతిగా వినాయకుడు దర్శమిచ్చారు. ఈసారి మహాగణపతి 57 అడుగుల ఎత్తులో కొలువుదీరాడు. మహాగణపతి కుడివైపు శ్రీనివాస కల్యాణ ఘట్టం ప్రతిమ ఏర్పాటు చేశారు. ఎడమవైపు శివపార్వతుల విగ్రహాలు పెట్టారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిరోజు కావడంతో ఖైరతాబాద్ వినాయకుడికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు వచ్చే మార్గాలు, దర్శనం చేసుకుని వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఖైరతాబాదు వినాయకుడిని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కార్పొరేటర్లు మన్నె కవిత, విజయా రెడ్డి, టీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇంచార్జ్ మన్నె గోవర్దన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామి, విజయా రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: నాయిని తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు నాయిని నర్సింహా రెడ్డి వినాయకుడి దర్శన అనంతరం మీడియాతో తెలిపారు. అన్నిపార్టీల వాళ్లు గెలవాలని కోరుకుంటారు.. ప్రజలకు మంచి చేసిన వాళ్లనే గెలిపించాలని కోరుకున్నానని వెల్లడించారు. అందులో భాగంగానే తాము గెలవాలని ఖైరతాబాద్ గణనాథుడిని విన్నవించుకున్నట్లు చెప్పారు. వినాయకుడి పూజ తర్వాతే ఏదైనా: తలసాని వినాయకుడి పూజ తర్వాతనే ఏదైనా కార్యక్రమం తలపెడతానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తే గానీ తృప్తి కలగదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండగలను సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారుని తెలిపారు. ఎంతో శోభాయమానంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో మన పోలీస్ దేశానికే ఆదర్శంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. -
ఆ రూపం.. అపురూపం..
సాక్షి, సిటీబ్యూరో: నవరాత్రి ఉత్సవాల కోసం ఖైరతాబాద్ గణనాథుడు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాడు. ఏటా అద్భుతమైన వైవిధ్యంతో, ఎన్నెన్నో ప్రత్యేతలతో, మరెన్నో విశేషాలతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి 64వ ఏట సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా కనువిందు చేయనున్నాడు. ప్రత్యేకతలెన్నో.. ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది ఏడు ముఖాలు, 14 చేతులు, ఏడు మూషికాలు, ఏడు సర్పాలు, ఏడు గజాలతో పాటు శ్రీనివాసుడు, లక్ష్మీ, శివపార్వతులు, బ్రహ్మ, సరస్వతి, గరుత్మంతుడు, నారద మహర్షి, హోమం చేస్తున్న రుషుల విగ్రహాలు ప్రధాన విగ్రహానికి కుడి, ఎడమ వైపులా ప్రతిష్ఠించారు. ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో ఈ అందమైన విగ్రహం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది విగ్రహం బరువు కూడా బాగా పెరిగింది. గత సంవత్సరం 60 అడుగుల విగ్రహాన్ని రూపొందించగా ఈ సారి 57 అడుగులకే పరిమితమయ్యారు. 28 అడుగుల వెడల్పుతో భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మహాగణపతి బరువు సుమారు 45 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఈ విగ్రహం రూపకల్పన కోసం 15 టన్నులకుపైగా ఇనుము, 30 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, 10.5 టన్నుల క్లే వినియోగించారు. 2450 కిలోల కొబ్బరి పీచు, 9450 వెల్డింగ్ రాడ్లను వినియోగించారు. విగ్రహాన్ని అందంగా అలంకరించేందుకు 500 లీటర్ల రంగులను వాడారు. 1750 కిలోల ఫినిషింగ్ పౌడర్‌ను వినియోగించారు. సుమారు 190 మందికిపైగా కళాకారులు, సిబ్బంది ఈ మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు. నేటి ఉదయంమొదటి పూజతోవేడుకలు ప్రారంభం.. ఖైరతాబాద్ గణనాథుడి ఉత్సవాలు గురువారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు పద్మశాలీ సంఘం ప్రతినిధులు పోచంపల్లి నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు, కండువా సమర్పించి పూజలు చేస్తారు. అనంతరం ఉదయం11.52 గంటలకు మొదటి పూజ ప్రారంభమవుతుంది. కాకినాడ శ్రీ పీఠం స్వామీజీ పరిపూర్ణానందస్వామి ఈ తొలిపూజలో పాల్గోనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం హాజరయ్యే గవర్నర్ నరసింహన్ దంపతులు ఈసారి వేడుకలు రావడం లేదు. గవర్నర్ మాతృమూర్తి కన్నుమూయడంతో ఆయన వేడుకలకు రాలేకపోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఈ సంవత్సరం కూడా తాపేశ్వరం లడ్డూ ఏర్పాటు చేయడం లేదు. స్థానికంగా తయారు చేసే 50 కిలోల లడ్డూను ప్రసాదంగా అలంకరిస్తున్నారు. 10 అడుగుల అంబికా అగరుబత్తులు ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి 11రోజుల పాటు వెలుగుతూ ఉండేందుకు అంబికా దర్బార్ బత్తి వారు సమర్పించే 10 అడుగుల అగరుబత్తులను ఈ సంవత్సరం కూడా అందజేస్తున్నట్లు అంబికా దర్బార్బత్తి టెక్నికల్ డైరెక్టర్ అంబికా రామాంజనేయులు, మార్కెటింగ్ మేనేజర్ మహేందర్ తెలిపారు. -
ఈసారీ 60 అడుగులే..
ఖైరతాబాద్: ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతిని 60 అడుగుల ఎత్తులోనే తయారు చేస్తామని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. సర్వేశాం ఏకాదశి సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ ప్రాంగణంలో మహాగణపతి తయారీ పనులకు కర్ర పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శుక్రవారం గణపతి నక్షత్రం కావడం విశేషమ ని విఠలశర్మ సిద్ధాంతి తెలిపారు. వ రుసగా 64వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ఖైరతాబాద్ మహాగణపతి పనులను ఏకాదశి రోజు భూమి, కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గురువారం ఆయన చెప్పారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 13న రానుందన్నారు. భక్తుల కోరిక మేరకే.. ఖైరతాబాద్ మహాగణపతిని భక్తుల కోరిక మేరకు 60 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా తయారు చేయాలని నిర్ణయించామని సుదర్శన్ తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో తయారుచేయడం వల్ల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు అవకాశం ఉండదని, వినాయక పూజల సందర్భంగా 300– 500 కేజీల బరువున్న పూల మాలలను వేయాల్సి వస్తుంది. అంత బరువు వేయడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల కోరిక మేరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, న్యాచురల్ రంగులను ఉపయోగించి మహాగణపతిని తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మట్టితో చేస్తామని చెప్పినా.. అలా చేయలేకపోతున్నామని ఆయన తెలిపారు. మహాగణపతి తయారీ పనుల్లో భాగంగా కర్రపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బల్వంతరావు, హన్మంతరావు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. -
ఖైరతాబాద్ @ 60
-
దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!
దేశ వ్యాప్తంగా మహా గణపతిగా పేరుగాంచిన ఖైరతాబాద్ గణపతి చేతిలో పెట్టే లడ్డూ ప్రసాదం తయారీ ఎంతో ప్రత్యేకమే కాదు.. పవిత్రం కూడా. ఈ లడ్డూ తయారీకి ఓ చిన్నారి కారణం కావడం విశేషం. ఈ మహా ప్రసాదాన్ని సమర్పించడం 2010 నుంచే ప్రారంభమైంది. అంతకు ముందు గణనాథుడి చేతిలో కృత్రిమంగా చేసిన ప్రసాదం ఉండేది. అయితే, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పి.వి.వి.ఎస్.మల్లికార్జురావు (మల్లిబాబు) 2009లో కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చారు. అప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది. ఇది మల్లిబాబులో బలంగా ముద్రపడింది. దీంతో దేవుడికి నిజమైన లడ్డూనే ప్రసాదంగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్, శిల్పి రాజేంద్రన్‌ను కలిసి తన ఆలోచనను వివరించారు. వారి అనుమతితో మరుసటి ఏడు 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించనున్నారు. ఈ ప్రసాదం తయారీని ఓ బృందం ఎంతో పవిత్రంగా చేపడతారు. అది ఎలాగంటే.. ప్రసాదం తయారీ ఇలా... యేటా మహా గణపతికి లడ్డూను ప్రసాదం తయారీకి చవితికి పది రోజుల ముందు నుంచే పనులు చేపడతారు. ముహూర్తం చేసుకుని తాపేశ్వరంలోని సురిచి ఫుడ్స్ ఆవరణలో ప్రత్యేక కుటీరాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రసాదం తయారీలో పాల్గొనే సిబ్బందితో పాటు యజమాని మల్లిబాబు కూడా వినాయక మాల ధరించి.. మిఠాయితో విఘ్న నాయకుడి విగ్రహాన్ని తయారు చేసి మండపంలో ప్రతిష్టిస్తారు. అనంతరం పప్పు దినుసులను శుభ్రం చేసి పనులు చేపడతారు. ఇలా ప్రతి సంవత్సరం చీఫ్ కుక్ మల్లి, బెంగాలీ కుక్ ఒప్పితో పాటు 11 మంది సిబ్బంది పాలు పంచుకుంటారు. వీరంతా చవితికి నాలుగు రోజుల ముందు పొయ్యి వెలిగించి తొలుత బూంది తయారు చేస్తారు. లడ్డూకు కావాల్సిన పంచదార, నెయ్యి, జీడిపప్పు, యాలకులు పచ్చ కర్పూరం సిద్ధం చేసి 9 కళాయిల్లో బూంది తీస్తుండగా.. మరో పక్క లడ్డూ చుట్టడం ప్రారంభిస్తారు. సహజ రంగులు, జీడిపప్పు పేస్టుతో లడ్డూపై వినాయకుడి ప్రతిమలను, ఇతర దేవతామూర్తులను రూపొందించి అలంకరిస్తారు. ఈ లడ్డూ సాధారణ వాతావరణంలో ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. ప్రాణమున్నంత వరకు సమర్పిస్తా.. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామంలో 1939లో మా నాన్న సత్తిరాజు కాజా తయారీ ప్రారంభించారు. దాన్ని వారసత్వంగా నేను సురుచి ఫుడ్స్ ద్వారా అందజేస్తున్నాను. నేను జీవించి ఉన్నంత కాలం మహా గణపతికి లడ్డూను సమర్పించుకుంటానని ఉత్సవ కమిటీకి మాటిచ్చాను. భగవంతుడికి, భక్తుడికి మధ్య ప్రాంతీయ బేధాలు ఉండవు. ఈ సంవత్సరం మహా లడ్డూను నవరాత్రుల తర్వాత భక్తులకు పంచాలని తీసుకున్న నిర్ణయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. - మల్లికార్జునరావు, సురుచి ఫుడ్స్ ఈ ఏడాది లడ్డూ కోసం వాడిన పదార్థాలు.. శెనగపప్పు 1450 కిలోలు నెయ్యి 1000 కిలోలు పంచదార 2250 కిలోలు బాదం పప్పు 90 కిలోలు యాలకులు 30 కిలోలు పచ్చ కర్పూరం 10 కిలోలు లడ్డూ తయారీ పనులు ఈ నెల 24న ప్రారంభించారు. ఈ లడ్డూ ఐదు టన్నుల బరువు, 6.5 అడుగుల వ్యాసం, 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని 28వ తేదీన ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించి 29న వినాయక చవితికి మహా గణపతికి ప్రసాదంగా సమర్పిస్తారు.