కర్రపూజలో పాల్గొన్న ఉత్సవ కమిటీ సభ్యులు
ఖైరతాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతిని భక్తులు మెచ్చేలా, నచ్చేలా అత్యంత అద్భుతంగా 55 నుంచి 60 అడుగుల ఎత్తులో తీర్చి దిద్దనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. మంగళవారం సర్వేకాదశి సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులకు కర్రపూజ నిర్వహించారు. భాగ్యనగర్ గణేష్ ఉ త్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, గణపతి దీ క్షా కమిటీ హన్మంతరావులతో పాటు పూజారులు మహదేవశర్మ, రంగరాజాచార్యులు ప్రత్యేక పూజ లు నిర్వహించి కర్రను పాతారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, సందీప్‌రాజ్, మహేష్‌యాదవ్, చందు తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.
త్వరలో మహాగణపతి నమూనా విడుదల
65వ సంవత్సరం సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి నిర్వాహకులు అత్యంత అద్భుతంగా భక్తులకు ఈ ఏడాది కూడా అద్భుత రూపంలో దర్శనమిచ్చే విధంగా నమూనాను దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచనల మేరకు వారం పదిరోజుల్లో నామకరణంతో పాటు నమూనా విడుదల చేస్తామని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. వచ్చే సంవత్సరం అధిక మాసం కారణంగా ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 2న ఉండటంతో కర్ర పూజను ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిల్పుల సంప్రదాయం ప్రకారం మంగళవారం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని శిల్పి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment