start
-
ప్రైవేట్‌కు దీటుగా ‘సింగరేణి’ విద్య
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఉన్నత విద్యాప్రమాణాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం సంస్థ పరిధిలో ఉన్న 9 పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యనందించేందుకు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం (2025–26) నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. తొలుత రామగుండం–2 ఏరియాలోని సెక్టార్–2 పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, మైదానం, కంప్యూటర్ ల్యాబ్ తదితర ఏర్పాట్లపై ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు (డైరెక్టర్) పర్యవేక్షించి అనుమతుల కోసం సన్నాహాలు మొదలుపెట్టారు.‘కారుణ్య’ ఉద్యోగుల పిల్లలపై నజర్గత ఏడేళ్లలో సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా సుమారు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో కొందరికి వివాహం జరగగా, పలువురు అవివాహితులు కూడా ఉన్నారు. అయితే వివాహమైన వారు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించకుండా.. వారికి మెరుగైన భవిష్యత్ ఇచ్చేందుకు కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా సింగరేణి విద్యావ్యవస్థను బలోపేతం చేయనున్నారు. సింగరేణిలో పాఠశాలల ఏర్పాటు సమయం (1975)లో అడ్మిషన్ కావాలంటే ఉన్నతాధికారి సిఫారసు కావాల్సి వచ్చేది. కానీ నేడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలలో కేవలం వెయ్యి మంది మాత్రమే చదువుతున్నట్లు అంచనా. ఈ తరుణంలో సింగరేణి పాఠశాలలను మళ్లీ అగ్రస్థానంలో నిలిపేలా సీఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక దృష్టి సారించారు.తరగతులపై అనునిత్యం పర్యవేక్షణగతంలో సింగరేణి పాఠశాలలో 10వ తరగతి ఫలితాలపైనే దృష్టి ఉండేది. కానీ ప్రస్తుతం అనునిత్యం అన్ని తరగతుల నిర్వహణ, పరీక్షలకు ప్రశ్నపత్రాల తయారీ, ఫలితాలపై అధ్యయనం చేస్తున్నారు. అంతేకాక డైరెక్టర్ స్థాయి అధికారులు వారంలో ఒక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచి ఉన్నత స్థానాలకు చేరుకునేలా సన్నద్ధం చేసేందుకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు.అన్ని రంగాల్లో రాణించేలా కృషిసింగరేణిలో విద్యావ్యవస్థ ప్రక్షాళనతో పాటు నూతన కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తాం. ప్రతి ఆరు నెలలకోసారి జాబ్‌మేళాలు నిర్వహిస్తాం. సింగరేణి విద్యాసంస్థలో చేరితే కళాశాల చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలనేది మా భావన. అలాగే, ఇంగ్లిష్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నాం. – గుండా శ్రీనివాస్, ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీకార్మికుల పిల్లల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంసింగరేణి కార్మికుల పిల్లలను రూ.లక్షలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. అలాకాకుండా వారికి మంచి భవిష్యత్‌ను అందించేలా సింగరేణి పాఠశాలల్లోనే బోధన అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పాఠశాల విద్యతో పాటు పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టి నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉజ్వల భవిష్యత్ అందిస్తాం.– ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీప్రతివారంలో ఒక పరిశ్రమకు..విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల కోసం ఆసక్తి పెంచేలా వారంలో ఒకరోజు పరిశ్రమకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆయా పరిశ్రమల్లో ఏం తయారుచేస్తారు, ముడిసరుకు లభ్యత, తయారైన ఉత్పత్తుల మార్కెటింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ఆలోచనాశక్తిని పెంపొందించాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. అంతేకాకుండా ఆటపాటలు, మార్షల్ ఆర్ట్స్‌పై నిత్యం రోజూ ఒక గంటపాటు తరగతులు నిర్వహిస్తున్నారు. -
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ దివిలో విరిసిన పారిజాతమోఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమోనా మదిలో నీవై నిండిపోయెనే...ఈ పాట ఉన్న సినిమా పేరు చాలామందికి తెలియకపోవచ్చు. సినిమా విడుదలయ్యి 50 సంవత్సరాలయ్యిందని కూడా తెలియకపోవచ్చు. హీరో ఎవరో. హీరోయిన్ ఎవరో. కాని పాట నిలిచింది. రాసిన దాశరథి నిలిచారు. పాడిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా. ‘నిదుర మబ్బును మెరుపు తీగవై కలను రేపినది నీవే’ అని ఇదే పాటలో రాశారు దాశరథి. సినిమా సంగీత ఆకాశంలో కొన్ని నిదుర మబ్బులను తన రాకతో దాశరథి చెదరగొట్టారు. కొన్ని దివ్య పద ద్వారాలను తెరిచారు.దివి నుంచి భువికి దిగి వచ్చె దిగి వచ్చెపారిజాతమే నీవై నీవైఇది ‘తేనె మనసులు’ కోసం దాశరథి రాశాక కె.వి.మహదేవన్ ట్యూన్ చేసిన పాట. కాని ‘ఇద్దరు మిత్రులు’ కోసం సాలూరి రాజేశ్వరరావు హార్మోనియం పెట్టెను ముందరేసుకుని ‘మీరు ట్యూన్‌కి రాస్తారా, రాస్తే నన్ను ట్యూన్ చేయమంటారా?’ అని అడిగారు దాశరథిని. బహుశా దాశరథి ఆ క్షణంలో నవ్వుకుని ఉంటారు. నిజాము మీద యుద్ధగళం విప్పి వరంగల్ జైలులో బందీ అయినపుడు ఒక రాత్రి ఆయనను ఉన్నట్టుండి ఇతర రాజకీయ ఖైదీలతో కలిపి నిజామాబాద్ జైలుకు బయలుదేరదీశారు పోలీసులు.అది డిసెంబర్ నెల. రాత్రి. భయంకరమైన చలి. ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియని అయోమయం. దాశరథి ఆ చలిలో, బిక్కచచ్చిన తోటి రాజకీయ ఖైదీలను ఉత్తేజపరుస్తూ కవిత్వం అందుకున్నారు. ఆశువుగా. తెగిపడే కంఠంతో. ఒక్కో కవితా కాగడ. వెచ్చదనం రాజేస్తున్న నెగడు.అలాంటి దాశరథికి– పళ్లు తోముకోవడానికి బొగ్గుముక్క ఇస్తే జైలు గోడలను కవిత్వంతో నింపిన దాశరథికి– ట్యూన్ ఇస్తే ఎంత. నేరుగా రాయమంటే ఎంత. ‘ఎలాగైనా పర్వాలేదండీ’ అన్నారు దాశరథి. సాలూరు ట్యూన్ ఇచ్చారు. ‘నేను తాంబూలం వేసుకు వస్తాను. ఆలోచిస్తూ ఉండండి’ అని బయటకు వెళ్లి వచ్చిన ఆయన ఎర్రబడ్డ నోటిని ఆశ్చర్యంతో తెరిచారు. పల్లవి రెడీ!ఖుషీ ఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూహుషారు గొలిపేవెందుకే నిషా కనులదానాఈ ఖుషీ ఆ నిషా అప్పటి వరకూ తెలుగు పాట ఎరగదు. ఇది దాశరథి ఇచ్చిన హైదరాబాద్ టచ్. దక్కనీ మిఠాస్. పాట హిట్ అయ్యింది. దాశరథి నుంచి ‘గాలిబ్ గీతాల’ సంపుటిని అంకితం తీసుకున్నందుకు అక్కినేని ‘ఇద్దరు మిత్రులు’ ద్వారా ఇచ్చిన అవకాశం కవికి విజయావకాశంగా మారింది. తెలుగు పాట దాశరథిని చూసి ఇలా అంది –నా కంటి పాపలో నిలిచిపోరానీ వెంట లోకాల గెలవనీరాఇద్దరు హైదరాబాద్ కవులు ఒక సంవత్సరం తేడాలో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. మొదట అక్కినేని ద్వారా దాశరథి (1961). తర్వాత ఎన్టీఆర్ ద్వారా సి. నారాయణ రెడ్డి (1962). దాశరథిది మొదటి నుంచి పోరుగీతం. ఆయన స్వయంగా నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు. అజ్ఞాతంలో ఉన్నారు. జైలులో బాధలు పడ్డారు. ఆల్ ఇండియా రేడియోలో 1956 నుంచి ’71 వరకూ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ సినిమా కవిగా అవకాశాలు ఉపయోగించుకున్నారు.1977 నుంచి ’83 వరకు అంటే ఎన్టీఆర్ వచ్చి రద్దు చేసే దాకా దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరు ఆస్థానకవి. ఆ పదవిలో ఉండగా సినిమా గీతాలు ఆయన పెద్దగా రాయలేదు. దానికి తోడు 1987లో 62 ఏళ్ల వయసులో ఎదురైన అకాల మరణం దాశరథికి సుదీర్ఘ సినిమా కెరీర్ లేకుండా చేసింది. ఆయన సుమారు 620 పాటలు రాసి ఉండవచ్చు. రాసింది తక్కువైనా హిట్ అయినవి ఎక్కువ. చెట్టు పిట్ట కూడా పాడుకున్న పాట ఆయనది.గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుందిసెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముందిఅన్నపూర్ణ, ఆదుర్తి ఇలా ఒకటి రెండు అనుబంధాలు తప్ప దాశరథి ప్రత్యేకంగా ఏదో ఒక గ్రూప్‌తో లేదా సంస్థతో కలిసి ఉన్నట్టు లేదు. సినిమా రంగంలో ప్రతిభతో పాటు పి.ఆర్ కూడా ముఖ్యం. తిరగబడే కవికి అలాంటి స్వభావం తక్కువ. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత ఉడుకునెత్తురు కవికి సినిమాలో ఆవేశ కావేశాల పాటలు ఏమాత్రం దక్కలేదు. చాలా మటుకు ప్రేమగీతాలు, ఎన్నటికీ మాయని యుగళగీతాలు.ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదిఎన్నటికీ మాయని మమత నాది నీదిదాశరథి కుటుంబ అనుబంధాలను రాశారు. ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ ఆయనదే. ‘బాబూ వినరా... అన్నాదమ్ముల కథ ఒకటి’... ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’.... అలాగే కవ్వింతలూ రాశారు... ‘అది ఒక ఇదిలే అతనికి తగులే’... భార్య అలక భర్త వేడుకోలు... ‘ఓ చెలి కోపమా... అంతలో తాపమా’... ఊరడింపు ‘గోరొంక గూటికే చేరావు చిలక... భయమెందుకే నీకు బంగారు మొలక’... దరఖాస్తు... ‘విన్నవించుకోనా... చిన్న కోరిక’... ‘కాజల్’ సినిమా కోసం సాహిర్ రాసిన ‘ఛూలేనేదో నాజూక్ హోటోంకో’ విఖ్యాత గీతాన్ని దాశరథి ఎంత కోమలంగా తెలుగు చేశారో చూడండి. ‘తాగాలి’ కాదు ‘తాకాలి’ అన్నారు.నీ లేత గులాబి పెదవులతోకమ్మని మధువును తాకాలిదాశరథికి కృష్ణ అనుబంధం ఉంది. దైవబంధం ఉంది. ఆయన పాటలు ఆలయాల్లో నేటికీ సుప్రభాత గీతాలు. ‘పాడెద నీ నా నామమే గోపాల’... ‘రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య’, ‘కన్నయ్యా... నల్లని కన్నయ్య’... ‘మనసే కోవెలగా... మమతలు మల్లెలుగా... నిన్నే కొలిచెదరా... కృష్ణా’... ‘నేనె రాధనోయి గోపాలా’... ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో’... ‘మము పాలింపగ నడిచి వచ్చితివా’... వాణి జయరామ్‌కు దాశరథి వల్ల దక్కిన పూలసజ్జ వంటి గీతం చూడండి.పూజలు చేయ పూలు తెచ్చానునీ గుడి ముందే నిలిచానుతీయరా తలుపులను రామా...దాశరథికి వీణ ఇష్టం. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు. సినిమా గీతాల్లో కూడా ఆయన ఈ వీణానాదాన్ని పలికించారు. ‘మదిలో వీణలు మ్రోగె’... ‘నీవు రావు నిదుర రాదు’.. ‘వేణుగాన లోలునిగన వేయి కనులు చాలవులే’.... ఇక ఈ పాట?మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనాఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే....నేటి నుంచి దాశరథి శతజయంతి సంవత్సర వేడుకలు మొదలుకానున్నాయి. సినిమా రంగం, సినీ సంగీత రంగం, సినీ గేయకర్తలు, అభిమానులు సమావేశాలు, సంగీత విభావరులు నిర్వహించుకుని దాశరథి పాటలను మళ్లీ తలుచుకుని పాడుకోవాల్సిన సందర్భం ఇది. అయితే మన సినిమా రంగానికి పెద్దగా ఇటువంటి వాటికి సమయం ఉండదు. కాని ప్రజల వద్ద శ్రోతల వద్ద ఉంటుంది. సత్కవిని తమ నాల్కల యందు నుంచి కడిగేసే మూర్ఖులు ఎంతమాత్రం కారు వారు. పాడుకుంటూ ఉంటారు. పాడుతూనే ఉంటారు. వారికి తనివి తీరదు.తనివి తీరలేదే నా మనసు నిండలేదేఏనాటి బంధమీ అనురాగం – కె -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
అమర్నాథ్ యాత్రకు వచ్చే మహాశివుని భక్తుల కోసం జమ్మూ సిద్ధమయ్యింది. జూన్ 26 నుంచి తత్కాల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు టోకెన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నేటి(బుధవారం) నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. గురువారం నుంచి టోకెన్ తీసుకునే యాత్రికులకు తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.ఏడీసీ శిశిర్ గుప్తా రిజిస్ట్రేషన్ కేంద్రాలను సందర్శించి యాత్రకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎండ నుంచి రక్షణకు కేంద్రాల వద్ద షెడ్లు, టెంట్లు వేస్తున్నమని, తాగునీరు, ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుప్తా తెలిపారు. సరస్వతి ధామ్, జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో భక్తులు తమ ప్రయాణపు టోకెన్లు అందుకోవచ్చు. అనంతరం కేంద్రంలో యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం వారు గాంధీనగర్ ప్రభుత్వ ఆస్పత్రి, సర్వల్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాల్సి ఉంటుంది.యాత్రికుల కోసం బేస్ క్యాంప్ అయిన బాల్తాల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. జూన్ 29 నుంచి వార్షిక అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. జూన్ 28, శుక్రవారం నాడు జమ్ము నగరంలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి యాత్రికుల బృందం కశ్మీర్ వ్యాలీకి బయలుదేరనుంది. -
48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం?
మరో రెండు రోజుల్లో అంటే రాబోయే 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది. న్యూ నోస్ట్రాడమస్‌గా పేరొందిన భారతీయ జ్యోతిష్య నిపుణులు కుశాల్ కుమార్ ఈ అంచనా వేశారు. జూన్ 18న మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతోందని కుశాల్ తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు, ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడం, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఇవన్నీ మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి సంకేతాలు.జూన్ 18న సంభవించే అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణ ఫలితంగా మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని కుశాల్ తెలిపారు. మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత కుశాల్ ఈ అంచనా అందించారు. జూన్ 9న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి దీనికి ముందస్తు సూచనగా ఆయన పేర్కొన్నారు. కాగా ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో మన సైనికులు నిమగ్నమై ఉన్నారు. జూన్ 10, 12 తేదీల్లో కూడా ఉగ్రదాడులు జరిగాయి.కుశాల్ కుమార్ అంచనా ప్రకారం రాబోయే 48 గంటలు క్లిష్టమైనవి. ఈ సమయంలో యుద్ధం చెలరేగే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం పెను విధ్వంసాన్ని నృష్టించనుంది. ఆకాశం నుంచి ఉపగ్రహాలు కిందికి దూసుకువస్తాయని, అడవులు బూడిదగా మారుతాయని ఆయన తెలిపారు. అన్ని దేశాలు ఒకదానితో మరొకటి పోరాటానికి దిగుతాయని, ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్నంతటినీ సర్వనాశనం చేస్తుందని కుశాల్ వివరించారు. -
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!
ఇక్కడ రెండు మూడు రోజులుగా వార్ రూమ్ అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్సులు నడుస్తున్నాయి... అప్పుడు అర్థం అయ్యిందేమంటే.. జనతా గ్యారేజ్ సినిమాలాగా, 'ఇచ్చట అన్ని రకముల సమస్యలకు పరిష్కారం చూపబడును' అని. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆటా వారు ఏ లెవెల్లో రెడీ అవుతున్నారో. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దుద్దిళ్ల, భద్రాద్రి పండితులు, సినిమా వారు మెహ్రీన్, థమన్, అనూప్ రూబెన్స్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ వంటి ఎందరో విచ్చేశారు. మరి కొందరు బయలుదేరి, విహంగ వీక్షణ చేస్తున్నారు. వేరే ఊర్ల నుంచి ఆటా నాయకులు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, అజయ్, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఏతెంచారు. మిగతా వాళ్లు ఆన్ ది వే. అలానే, దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి, హోటళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో ఉంటున్నారు. కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, అట్లాంటా మేయర్, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇక్కడి దేశీయ నాయకులు ఇలా చాలా మంది వేంచేయబోతున్నారు. వేరే వేరే నాన్ ప్రాఫిట్, సంస్థలు, మీడియా సంస్థల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటాలో ఈ శుక్రవారం, జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ శుక్రవారం సాయంత్రం బ్యాంకెట్‌లో వివిధ రంగాలలో నిష్ణాతులకు ఆటా సాఫల్య అవార్డులు ప్రధానం చేస్తారు. ఇక శని, ఆదివారాలలో ఝుమ్మంది నాదం అంటూ పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు, ఆత్మ విశ్వాసం కోసం పెజంట్, ధ్యానం గురు దాజి ఉపన్యాసం, భద్రాద్రి కళ్యాణం, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ పోటీలు, దడదడలాడించే అనూప్ రూబెన్స్, థమన్, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్‌లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఉమెన్స్ ఫోరమ్, అమెరికా, భారత దేశాల పొలిటికల్ ఫోరంలు, అల్యూమిని మీటింగులు, బిజినెస్ ఫోరంలు, సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైం అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యువత గురించి సరే సరి.. వారికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే..మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటా వారు. మరి ఇన్ని వినోదాలు, విశేషాలు ఒకే చోట ఉంటే, ఆలస్యం ఎందుకూ..? టిక్కెట్ల గడువు కూడా ముగియనుంది. వివిధ కాన్ఫరెన్స్ వివరాల కోసం www.ataconference.orgని, టిక్కెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registrationని సందర్శించండి. ఆటా కమ్యూనిటీ రీచ్ సందర్భంగా అట్లాంటాతో పాటు వేర్వేరు నగరాలలో సమావేశాలు నిర్వహించారు, ఎంతోమంది రావడానికి ఉత్సాహం చూపించారు. అలానే, టాలీవుడ్ తారలతో కమ్యూనిటీ వార్‌కు 300 మందికి పైగా విచ్చేయడం హర్షణీయం. విశిష్ట అతిథులతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే మొదలయ్యాయి. కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంత కృషికి తగ్గ అజరామర ఫలితాలు త్వరలో చూడనున్నాం. కన్వీనర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా పనులు పూర్తి అయ్యాయి., ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ముఖ్యంగా యువత ఆటాకి ఎంతో ముఖ్యమనీ, వారికి చాలా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ ఈ కార్యక్రమానికిచ్చేసి జయప్రదం చేయాలని అన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని జార్జియా గవర్నర్ సందేశం అందరికీ వినిపించి.. జరగబోయే స్పిరిట్యుయల్, కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత వివరించారు. ఎంతో మంది ఈ కార్యన్ని జయప్రదం చేసేందుకు ఆహర్నిశలూ కష్టపడుతున్నారనిన్నారు. అలాగే చాలా వెండర్ స్టాల్ల్స్, ఎన్నో ఫోరమ్స్ వంటి ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ చెప్పారు. అందువల్ల ఈ మహా పండుగకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. (చదవండి: నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!) -
ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు!
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సీతాపూర్‌లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌కు చేరుకోవడం ప్రారంభించారు. నగరంలోని మెథడిస్ట్ చర్చి స్కూల్లో జిల్లా యంత్రాంగం గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. బహ్రైచ్ లోక్‌సభ స్థానంలో మొత్తం 880 పోలింగ్ కేంద్రాలు, 1885 బూత్‌లను ఏర్పాటు చేశారు. నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరహర లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ మూడు స్థానాల్లో మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీనితో పాటు దాద్రాల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఓటింగ్ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికలో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్‌కు ముందు అన్ని బూత్‌లలో మాక్‌పోల్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రారంభమైంది.యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎయిర్ అంబులెన్స్, హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంచామని సీఈవో రిన్వా తెలిపారు. ఈ హెలికాప్టర్ లొకేషన్ కాన్పూర్‌లో, ఎయిర్ అంబులెన్స్ లొకేషన్ లక్నోలో ఉంటుందన్నారు. -
ఈసారి అమర్నాథ్ యాత్ర 45 రోజులే..
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. ప్రబుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. పలు భద్రాతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళుతుంటారు. -
స్కూలు వ్యానులో తిరుగుతూ.. అత్యధిక ఆదాయం సంపాదిస్తూ..
డబ్బు సంపాదించడం అంత తేలికైన పనేమీ కాదు. ఎంతో కష్టపడితేనే తగిన ఆదాయం వచ్చి, జీవితం సజావుగా సాగుతుంది. అయితే దీనికి భిన్నమైన సిద్దాంతాన్ని అనుసరిస్తున్న ఒక మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మహిళ పేరు అలిస్ఎవర్డీన్(32). అమెరికాలోని ఆస్టిన్‌లో ఉంటోంది. అలిస్ గతంలో ఒక కంపెనీలో పనిచేసేది. అక్కడ ఆమె వారానికి 50 నుండి 60 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి విసిగిపోయిన ఆమె ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకుంది. తరువాత ఆమె ఒక స్కూల్ వ్యాన్ కొనుగోలు చేసి, దానిని తన ఇంటిలా మలచుకుంది. ప్రస్తుతం ఆమె ఆ స్కూలు వ్యానులో దేశమంతా తిరుగుతోంది. తనకు నచ్చినట్టు జీవితాన్ని గడుపుతున్న ఆలిస్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ ద్వారా కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తోంది. ఆలిస్ ఫ్రీలాన్సర్ కంటెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే పనిచేస్తుంది. గతంలో ఆఫీసుకు వెళ్లి సంపాదించిన దానికంటే ఇప్పుడు రెట్టింపు సంపాదిస్తున్నానని అలిస్ తెలిపింది. ఆలిస్ వాయిస్ ఓవర్ వర్క్‌తో పాటు యూజర్ జనరేటెడ్ కంటెంట్ (యూజీసీ)కి సంబంధించిన వీడియోలను కూడా రూపొందిస్తుంటుంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్ట్‌లలోనూ పనిచేస్తుంది. ఫలితంగా ఆమెకు అత్యధిక ఆదాయం వస్తోంది. టెక్సాస్‌లో నివసించడం చాలా ఖరీదైనదని, పాఠశాల బస్సులో నివసించడం ఎంతో చౌక అని అలిస్ తెలిపింది. పార్కింగ్, ఆహారం కోసం మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుందని ఆమె పేర్కొంది. పార్కింగ్‌కు నెలకు ఆరు వేలు, పెట్రోలుకు రూ.80 వేలు, ఆహార ఖర్చులకు 20 నుంచి 40 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆమె తెలిపింది. ఈ మొత్తం టెక్సాస్‌లో నివసించడం కంటే చౌకైనదని ఆమె వివరించింది. -
అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ ఏడువేల మందికి పైగా అతిథులను రామ మందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులున్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు.. మొదటి రోజు (జనవరి 16) నేటి నుంచి రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండవ రోజు (జనవరి 17) రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు. మూడవ రోజు(జనవరి 18) గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. నాల్గవ రోజు(జనవరి 19) పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత ‘నవగ్రహ’ స్థాపన చేయనున్నారు. ఐదవ రోజు(జనవరి 20) రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో సంప్రోక్షణ చేసి, ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు. ఆరవ రోజు(21 జనవరి 21) రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఏడవ రోజు(జనవరి 22) ప్రధాన ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు. ఇది కూడా చదవండి: శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది? -
14 నుంచి రాహుల్ గాంధీ ‘న్యాయ్ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ప్రారంభిస్తారని ఏఐసీసీ జాతీ య అధికార ప్రతినిధి షమా అహ్మద్ తెలిపారు. గురువారం ఆమె గాం«దీభవన్‌లో మాట్లాడుతూ మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర ఉంటుందని, మొత్తం 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వివరించారు. దేశంలో యువత ఉద్యోగాలు, ఉపాధిలేక అల్లాడుతోందని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ సర్కార్ మోసం చేసిందని, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరి గిపోయాయని విమర్శించారు. దీంతో సామా న్య ప్రజల జీవనం కష్టంగా మారిందని అన్నా రు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై ఈడీ, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారన్నా రు. మరోవైపు కిసాన్, దళిత, ఆదివాసీలు, మ ణిపూర్‌లో చర్చిలు, ముస్లిం మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. -
హైదరాబాద్‌లో వైజాగ్
యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు హీరో వరుణ్ తేజ్. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. వైర ఎంటర్టైన్ మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్‌కి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. 24 ఏళ్ల వ్యవధిలో (1958 –1982) జరిగే ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. 1950, 1980 నాటి వాతావరణాన్ని తలపించేలా భారీ సెట్స్‌ను రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్ సిటీని క్రియేట్ చేసేందుకు ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు నలుగురు ఫైట్ మాస్టర్స్ వర్క్ చేస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్. -
గోవా టు హైదారాబాద్
హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీ.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అలాగే ‘దేవర’ నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబరులో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
మైసూర్లో నా సామిరంగ
హీరో నాగార్జున కొన్ని రోజులు మైసూర్‌కు మకాం మార్చారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మైసూర్లో ప్రారంభమైందని సమాచారం. నాగార్జున, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆషికా రంగనాథన్ , మిర్నా మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. -
దేవరకద్ర మార్గంలో ఎలక్ట్రిక్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పాత లైన్ల విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వే శాఖ ఇప్పుడు కొత్త లైన్లను వేగంగా విద్యుదీకరిస్తోంది. మహబూబ్‌నగర్–కర్నాటకలోని మునీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ సరిహద్దు పరిధిలో దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య ఇటీవలే లైన్ అందుబాటులోకి వచ్చింది. 64 కి.మీ. ఈ నిడివిలో ప్రయాణికుల రైళ్లను ఇటీవలే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల మధ్య మార్గాన్ని కూడా విద్యుదీకరించారు. పనులు పూర్తి కావటంతో డీజిల్ లోకోమోటివ్ల బదులు ఎలక్ట్రిక్ లోకో మోటివ్‌లతో రైళ్లను తిప్పనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఉపయోగాలెన్నో.. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగుళూరు, రాయచూరు తదితర ప్రాంతాలకు గద్వాల మీదు గా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రాయచూరుకు గద్వాల మీదుగా కాకుండా కృష్ణా మీదుగా వెళ్లేది దగ్గరి దారి. ఇన్నాళ్లూ విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో రైళ్లను నడపటం సాధ్యం కాలేదు. ఇప్పుడు దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ అందుబాటులోకి రావటంతో ఇక రాయచూరు సహా కొన్ని ఇతర రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల గద్వాల మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఇంజన్లతో పోలిస్తే డీజిల్ లోకోమోటివ్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఆ ఇంధన భారం కూడా తగ్గనుంది. వేగంలో పెద్దగా తేడా రాకున్నా, ఇంజన్ పికప్ బాగా మెరుగుపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. సరుకు రవాణా రైళ్లకు ఒకటికి మించి ఇంజన్లను వాడుతుంటారు. మూడు డీజిల్ ఇంజన్ల బదులు రెండు ఎలక్ట్రిక్ ఇంజన్లు ఎక్కువ వ్యాగన్లు ఉన్న రైలును సులభంగా లాగుతాయి. కొన్ని రకాల సరుకును తరలించే సందర్భంలో.. రెండు డీజిల్ ఇంజిన్ల బదులు ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ సరిపోతుంది. ఇక విద్యుదీకరించాల్సింది ఆ రెండు మార్గాలే ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ (పనులు జరుగుతున్నాయి), ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మెదక్–అక్కన్నపేట మార్గాలను మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా, సిద్దిపేట వరకు లైన్ అందుబాటులోకి రావటంతో ఇటీవలే ప్రయాణికుల రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనోహరాబాద్–సిద్దిపేట మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కావటంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పనులు ప్రారంభమైన ఏడాదిలో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. -
చదువు ఎలా మొదలయ్యింది? ఎందుకు అవసరమయ్యింది?
నేటి యుగంలో ప్రతి ఒక్కరికీ విద్య అనేది చాలా ముఖ్యం. మనిషి ఆకలితో ఉండగలడు కానీ చదువు లేకుండా ఉండలేడని కొందరు అంటారు. నేటి రోజ్లులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది విద్యే అవుతుంది. ఇప్పుడు మనం అసలు ప్రశ్నలోకి వస్తే ఈ పఠన కళ మనుషులలో ఎలా అభివృద్ధి చెందింది? మనిషిని విద్యలో ముందుకు నడిపించిన విషయం ఏమిటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చదువుకు సంబంధించిన చరిత్ర శతాబ్దాల క్రితం నాటిది. అయితే విద్య విషయంలో సైన్స్ భిన్నమైన వాదనలను వినిపిస్తుంది. బీబీసీ నివేదిక ప్రకారం రీసెర్చ్ స్కాలర్ మరియాన్ వోల్ఫ్ మాట్లాడుతూ, అధ్యయనం అనేది ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన కళ. ఎన్ని మద్యం పాత్రలు లేదా గొర్రెలు ఉన్నాయో లెక్కించడం కోసం ఇది మొదలయ్యిందని ఆమె తెలిపారు. వర్ణమాల ఏర్పరిచిన తరువాత దాని సాయంతో మనుషులు ఏదైనా చదవడం ద్వారా సమాచారాన్ని గుర్తుంచుకోవడం, అవగాహన కల్పించుకోవడం మొదలైనవి చేసేవారు. చదువులో ఎవరైనా రాణించినప్పుడు వారిని చురుకైనవారని అంటారు. చదువులో వెనుకబడినవారిని మందబుద్ధి గలవారని అభివర్ణిస్తారు. నిజానికి విద్యకు, మనసుకు చాలా దగ్గరి సంబంధం ఉంది. చదవడం లేదా నేర్చుకోవడం అనేది మనసు ద్వారానే జరుగుతుంది. మెదడులో పది బిలియన్లకు మించిన న్యూరాన్లు ఉన్నాయి. వాటి ద్వారా మెదడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంది. విషయాలను అధ్యయనం చేయడంలో, గుర్తుంచుకోవడంలో ఈ న్యూరాన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇది కూడా చదవండి: ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ ఎలా జరుగుతుంది? -
‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు?
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా నేడు (గురువారం) ఐటీఓ కూడలిలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రచారం సాగనుంది. 28న బరాఖంబలో, అక్టోబర్ 30న చంద్‌గిరామ్ అఖారా కూడలి, నవంబర్ 2న మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రచారం సాగనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని ఈసారి ఐటీఓ కూడలి నుంచి ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 3వ తేదీన 2000 ఎకో క్లబ్‌ల ద్వారా చిన్నారులకు కూడా అవగాహన కల్పించనున్నామన్నారు. 2020వ సంవత్సరంలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ ప్రచారం ప్రారంభించారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు 2019 సంవత్సరంలో దీనిపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. కూడలి సిగ్నల్ వద్ద రెడ్ లైట్ కనిపించినప్పుడు వాహనాల ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేయని పక్షంలో తొమ్మిది శాతం అధికంగా కాలుష్యం వ్యాపిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో వాహనదారులు 10 నుండి 12 రెడ్ లైట్ల గుండా వెళుతుంటారు. ఈ కూడళ్లలో వాహనం ఇంజన్ రన్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా 25 నుంచి 30 నిమిషాల పాటు అనవసరంగా పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చయి, పొగ రూపంలో కాలుష్యం వ్యాపిస్తుంది. అందుకే కూడలిలో రెడ్ లైట్ పడినప్పుడు వాహనం ఇంజిన్ అపాలని ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తున్నారు. కాగా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారుతోంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి! -
కొత్త సినిమా షురూ
కల్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మురళీ మోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, విజయశాంతి క్లాప్ కొట్టారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్‌ని దర్శకునికి అందించారు. ‘‘భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూ΄పొందుతున్న చిత్రమిది. కల్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, పూర్తి వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: సి. రామ్ ప్రసాద్. -
బెంగళూరు ఎకానమీ చైర్‌కార్ చార్జి రూ.1,600
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ–యశ్వంతపూర్ (బెంగళూరు) వందేభారత్ రైలు (నం.20703) టికెట్ చార్జీలను దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. కాచిగూడ నుంచి యశ్వంతపూర్ స్టేషన్‌కు ఎకానమీ చైర్ కార్లో క్యాటరింగ్ రుసుముతో కలుపుకొని రూ.1,600గా నిర్ణయించారు. క్యాటరింగ్ చార్జి లేకుండా సాధారణ ప్రయాణానికి రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లో ప్రయాణానికి క్యాటరింగ్ చార్జీతో కలుపుకొని రూ. 2,915గా, కేటరింగ్ చార్జీ లేకుండా 2,515గా నిర్ధారించారు. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ (నం.20704)కు ఈ ధరల్లో స్వల్ప తేడా ఉంది. ఎకానమీ చైర్ కార్లో కేటరింగ్ చార్జీలతో కలిపి రూ.1,540, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లో కేటరింగ్ చార్జీతో కలిపి రూ.2,865, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.2,515గా నిర్ణయించారు. రైల్లో అల్పాహారం, లంచ్: ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో ప్రారంభమయ్యే వందేభారత్ రైలు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. కేటరింగ్ చార్జీతో కలిపి టికెట్ బుక్ చేసుకున్నవారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్‌ను రైల్లో అందిస్తారు. కేటరింగ్ రుసుము చెల్లించని వారికి అవి అందవు. ఇంటి నుంచి తెచ్చుకునే భోజనాన్ని రైల్లోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వందేభారత్ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆదివారం సాధారణ ప్రయాణికులను అనుమతించరు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. -
విశాఖలో పాలన చేయొద్దని ఏ వ్యవస్థ చెప్పలేదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, విజయవాడ: దసరా నుంచి విశాఖలో సీఎం పరిపాలన మొదలవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. నేటి కేబినెట్ మీటింగ్‌లోనూ మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయం ఉద్ఘాటించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. సీఎం ఎక్కడ నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక అధికారులతో ఓ కమిటీ వేయాలని కూడా సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. సీఎంని విశాఖలో పాలన చేయొద్దని ఏ వ్యవస్థ చెప్పలేదని అన్నారు. చంద్రబాబు అవినీతి చేసి జైలుకి వెళ్లారని చెప్పారు. చంద్రబాబు అరెస్టుని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయనపై ప్రజలకు ఎలాంటి సానుభూతి లేదని చెప్పారు. కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను తీసుకువచ్చిన చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు. ఆధారాలు లేకుంటే న్యాయస్థానం రిమాండ్ ఎందుకు ఇస్తుందని అన్నారు. ఇదీ చదవండి: రాజ్యసభలో చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు -
పాటలు.. నా సామి రంగ
కొత్త సినిమా కోసం మ్యూజిక్ ఆన్ చేశారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం ‘నా సామిరంగ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, విజయ్ బిన్ని ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ‘నా సామిరంగ’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ స్తర్త్స్
-
ఐటీ దిగ్గజం 'ఇన్ఫోసిస్' కంపెనీ ఇలా మొదలైంది..!
ఈ రోజు సుధామూర్తి గురించి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా మాత్రమే కాకుండా.. సమాజసేవలో తమవంతు కృషి చేస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే నేడు లక్షల కోట్ల ఐటీ కంపెనీగా అవతరించిన సంస్థ ఒక చిన్న గదితో ప్రారంభమైనట్లు, కేవలం రూ. 10,000 పెట్టుబడితో ముందుకు కదిలినట్లు బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగిన నారాయణ మూర్తి విజయం వెనుక సుధామూర్తి ఉందని అందరికి తెలుసు. కంపెనీ ప్రారంభించాలని కలలు కన్న రోజుల్లోనే ఆమె వద్ద రూ. 10,000 అప్పుగా తీసుకుని స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడే భారత్ ఐటీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో భవిష్యత్తుని చూసి కంపెనీ ప్రారంభించారు. నేడు లక్షల కోట్ల విలువైన కంపెనీ ఆ రోజు చిన్న గదిలో ప్రారంభమైనట్లు చెబుతారు. అదే ఈ రోజు వేలమందికి ఉద్యోగాలు కల్పించి ముందడుగు వేస్తోంది. 1981లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ఈ రోజు ప్రపంచంలో పేరుగాంచిన పెద్ద ఐటీ కంపెనీగా రూ. 5 లక్షల కోట్లకంటే ఎక్కువ విలువైనదిగా నిలబడింది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! ఇంజినీర్ అంటే ఒకప్పుడు కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు.. అయితే స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదని టెల్కో కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ ఉద్యోగంలో చేరి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. నేడు టాటా కంపెనీలో మహిళలు కూడా పనిచేస్తున్నారంటే అది సుధామూర్తి చలవే. -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్‌నగర్‌లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రాజెక్టు–1లో విద్యుత్ ఉత్పత్తి షురూ
జ్యోతినగర్: రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు మొదలుపెట్టిన తెలంగాణ స్టేజీ–1లోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఆదివారం రాత్రి 7.40 గంటలకు ఉత్పత్తి ప్రారంభించింది. 801.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. 800 మెగావాట్ల యూనిట్ కంట్రోల్ రూంలో సీజీఎం కేదార్ రంజన్పాండుతో పాటు ఉన్నతాధికారులు, అధికారులు స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు స్టేజ్–1లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం చేపట్టారు. మొదటి యూనిట్ (800 మెగావాట్ల) నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల మొదటి యూనిట్లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచి్చన క్రమంలో ఈనెల 28లోపు కమర్షియల్ డిక్లరేషన్ చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి రెండో యూనిట్లో..? ఎన్టీపీసీ తెలంగాణ స్టేజీ–1లో నిర్మితమైన 800 మెగావాట్ల రెండో యూనిట్ స్టీమ్ బ్లోయింగ్ మే 20న పూర్తి చేసుకుంది. టర్భైన్ జనరేటర్తోపాటు వివిధ పనులు పూర్తి చేశారు. రెండో యూనిట్ సైతం ఆగస్టులో విద్యుత్ ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు యూనిట్లలో విడుదలయ్యే మొత్తం 1600 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. -
మహేష్ బాబు బర్త్ డే సప్రైజ్ ఫిక్స్.. ఇక ఫాన్స్ కి పూనకాలు లోడింగ్..!
-
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
భారత్ లో టెస్లా కార్ల తయారీ కేంద్రం....
-
చిరు, బాలయ్య మల్టీస్టారర్..?
-
తెలంగాణలో ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల రెండోవారం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చి 15 నుంచి 26వ తేదీ వరకు జరిగాయి. ఆరు నెలలకోసారి అసెంబ్లీ భేటీ కావాల్సి ఉన్న దృష్ట్యా ఈ నెల 26 లోపు సమావేశాలు కచ్చితంగా నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతాయి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా అవి సాధ్యపడలేదు. ఈ నెల 15న సమావేశాలు ప్రారంభించి పరిస్థితులను బట్టి 8–10 రోజులపాటు కొనసాగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి షెడ్యూల్ ఖరారు కానుంది. ఎప్పటి నుంచి ప్రారంభించి, ఎన్నిరోజులు సమావేశాలు జరపాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తమ్మీద ఈ నెల 15–20వ తేదీలోపు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. -
తెలంగాణలో మోగిన బడి గంట..
-
Tokyo Paralympics 2021: ‘మాకూ రెక్కలున్నాయి...’
టోక్యోలో నెల రోజుల వ్యవధిలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమం అదరగొట్టింది... ప్రధాన ఒలింపిక్స్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో పారాలింపిక్స్ వేడుకలను కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పైకి ఎగసేందుకు ప్రయత్నించే దివ్యాంగ క్రీడాకారుల ఆశలను ప్రతిబింబించేలా ‘మాకూ రెక్కలున్నాయి’ అనే నేపథ్యంతో సాగిన ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులందరి మనసులూ దోచుకుంది. టోక్యో: కరోనా సమస్యలను దాటి ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన జపాన్ ఇప్పుడు పారాలింపిక్స్‌ను అంతే స్థాయిలో అద్భుతంగా జరిపేందుకు సిద్ధమైంది. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు అందుకు నిదర్శనం. మొదటినుంచి చివరి వరకు స్టేడియాన్ని రంగులమయంగా మారుస్తూ జరిపిన ప్రదర్శనలు జపాన్ కళలు, సంస్కృతిని చూపించడంతో పాటు పారాలింపిక్స్ అథ్లెట్ల పట్టుదలను దృశ్య రూపంలో ఆవిష్కరించాయి. బుధవారంనుంచి ప్రధాన పోటీలు ప్రారంభం కానుండగా... సెప్టెంబర్ 5 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. ముగ్గురు జ్యోతిని వెలిగించగా... స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా పోటీల్లో పాల్గొంటున్న అథ్లెట్లలో మెగా ఈవెంట్ భావోద్వేగం కనిపించింది. గత ఏడాది కాలంగా కోవిడ్ విఘ్నాలను అధిగమించి 4,403 మంది ఆటగాళ్లు ఎదురు చూసి క్షణం రానే వచ్చింది. ముందుగా జపాన్ జాతీయ పతాకం మైదానంలోకి తీసుకు రావడంతో కార్యక్రమం మొదలైంది. దీనిని తెచ్చిన వారిలో ఆటగాళ్లతో పాటు టోక్యో అగ్నిమాపక విభాగానికి చెందిన కార్మికుడికి కూడా అవకాశం కల్పించడం విశేషం. ‘ఆప్టిక్ నెర్వ్ హైపోప్లాసియా’తో బాధపడుతూ పూర్తి అంధురాలిగా మారిన సటో హిరారి జపాన్ జాతీయ గీతం ఆలపించినప్పుడు స్టేడియంలోనివారంతా జేజేలు పలికారు. ఆ తర్వాత ‘పారా ఎయిర్పోర్ట్’ పేరుతో సాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో శారీరక లోపాలు ఉన్నవారిని ఎందరినో ఈ రూపకంలో భాగం చేశారు. అనంతరం నృత్య, విభిన్న సంగీత ప్రదర్శనలు జరిగాయి. అయితే అన్నింటికి మించి హైలైట్‌గా నిలిచిన అంశం ‘వన్ వింగ్డ్ ప్లేన్’. చక్రాల కుర్చీలో కూర్చున్న అమ్మాయి ఒకటే రెక్క ఉన్న విమానంలో ఎగురుకుంటూ వచ్చి తాను అందరిలాగే ఎగరాలనే కోరికను కనబర్చే అంశానికి చప్పట్లు మార్మోగాయి. మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 162 జట్లకు చెందిన బృందాలు పాల్గొనగా రెఫ్యూజీ పారాలింపిక్ టీమ్ అందరికంటే ముందుగా నడిచింది. తాలిబన్ల కారణంగా తమ దేశంలో ఎదురైన అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అఫ్గానిస్తాన్ జట్టు చివరి నిమిషంలో పోటీలనుంచి తప్పుకుంది. అయితే వారికి సంఘీభావంగా ఒలింపిక్ కమిటీ తమ వాలంటీర్ ద్వారా మార్చ్‌పాస్ట్‌లో అఫ్గాన్ జాతీయ జెండాను కూడా ప్రదర్శించింది. ముగ్గురు జపాన్ పారా అథ్లెట్లు యు కమిజి, షున్‌షుకె ఉచిదా, కరిన్ మరిసకి సంయుక్తంగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడంతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. అఫ్గాన్ జెండాతో... ఫ్లాగ్ బేరర్‌గా టెక్ చంద్... భారత జట్టు మార్చ్‌పాస్ట్‌కు సంబంధించి అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఫ్లాగ్ బేరర్‌గా ప్రకటించిన రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు చివరి నిమిషంలో తప్పుకున్నాడు. టోక్యోకు మరియప్పన్‌తో కలిసి ప్రయాణించిన విదేశీ ఆటగాడు ఒకడు కరోనా పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. ముందు జాగ్రత్తగా తంగవేలును పక్కన పెట్టాలని నిర్వాహకులు భారత జట్టుకు సమాచారం అందించారు. దాంతో షాట్‌పుట్‌లో పోటీ పడుతున్న టెక్ చంద్ ఫ్లాగ్ బేరర్‌గా ముందుకు సాగాడు. మొత్తంగా భారత బృందంనుంచి 9 మంది మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. పారాలింపిక్స్‌లో నేడు (భారత్) మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్: సోనల్ బెన్ పటేల్ – క్లాస్ 3 (ఉ.గం.7.30), భావినా బెన్ పటేల్ – క్లాస్ 4 (ఉ.గం.8.50) -
ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైన హబుల్ టెలిస్కోప్..!
విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్‌తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్ తన సేవలను అందిస్తోనే ఉంది. గత నెలలో కంప్యూటర్లో తలెత్తిన చిన్న లోపం కారణంగా హబుల్ టెలిస్కోప్ పరిశోధనలకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు నాసా ఇంజనీర్లు టెలిస్కోప్‌లో తలెత్తిన లోపాన్ని పరిష్కరించారు. గత నెలలో ఏర్పడిన కంప్యూటర్ లోపం కారణంగా అబ్జర్వేటరీతో అన్ని ఖగోళ పరిశోధనలు ఆగిపోయాయి. కాగా టెలిస్కోప్‌లో 1980 శకం కంప్యూటర్ల వలన లోపం తల్తెతడంతో టెలిస్కోప్ పరిశోధనలు ఆగిపోయాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. నాసా ఇంజనీర్లు గురువారం హబుల్ టెలిస్కోప్‌లో బ్యాకప్ పరికరాలకు విజయవంతంగా మార్చారు. దీంతో హబుల్ టెలిస్కోప్ పరిశోధనలు తిరిగి ప్రారంభంకానున్నట్లు శుక్రవారం నాసా ఒక ప్రకటనలో తెలిపింది. టెలిస్కోప్‌లో తలెత్తిన లోపానికి పరిష్కారం చూపిన ఇంజనీర్లకు నాసా సైన్స్ మిషన్ చీఫ్ థామస్ జుర్బుచెన్ అభినందనలు తెలిపారు. 1990 లో ప్రారంభించిన హబుల్ విశ్వం గురించి ఇప్పటికీ వరకు 1.5 మిలియన్లకు పరిశోధనలను చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రారంభించాలని నాసా యోచిస్తోంది. -
హైదరాబాద్ లో ఎంఎంటీస్ రైళ్ల పునరుద్ధరణ
-
హైదరాబాద్ లో వచ్చే వారం నుంచి ఎంఎంటీస్ రైళ్లు ప్రారంభం
-
విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: దీపావళి పండగ వేళ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి మరో కొత్త సర్వీస్‌ను స్పైస్ జెట్ ప్రారంభించింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య స్పైస్ జెట్ సర్వీసు ను విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. స్పైస్‌జెట్ విమాన సంస్థ విశాఖ నుంచి గన్నవరానికి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు పాటు సర్వీసులు నడపనుంది. వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.50 గంటలకు బయలుదేరి 10.50కు వైజాగ్ చేరుకుంటుంది. నేటి నుంచి చెన్నై, సింగపూర్‌లకు కూడా నూతన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల సమయంలో అనివార్య కారణాల వల్ల రద్దయిన విమాన సర్వీసుల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. -
ఖైరతాబాద్ మహా గణపతికి కర్రపూజ
ఖైరతాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతిని భక్తులు మెచ్చేలా, నచ్చేలా అత్యంత అద్భుతంగా 55 నుంచి 60 అడుగుల ఎత్తులో తీర్చి దిద్దనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్, శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. మంగళవారం సర్వేకాదశి సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులకు కర్రపూజ నిర్వహించారు. భాగ్యనగర్ గణేష్ ఉ త్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, గణపతి దీ క్షా కమిటీ హన్మంతరావులతో పాటు పూజారులు మహదేవశర్మ, రంగరాజాచార్యులు ప్రత్యేక పూజ లు నిర్వహించి కర్రను పాతారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, సందీప్‌రాజ్, మహేష్‌యాదవ్, చందు తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. త్వరలో మహాగణపతి నమూనా విడుదల 65వ సంవత్సరం సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి నిర్వాహకులు అత్యంత అద్భుతంగా భక్తులకు ఈ ఏడాది కూడా అద్భుత రూపంలో దర్శనమిచ్చే విధంగా నమూనాను దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచనల మేరకు వారం పదిరోజుల్లో నామకరణంతో పాటు నమూనా విడుదల చేస్తామని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. వచ్చే సంవత్సరం అధిక మాసం కారణంగా ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 2న ఉండటంతో కర్ర పూజను ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిల్పుల సంప్రదాయం ప్రకారం మంగళవారం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని శిల్పి తెలిపారు. -
నగరానికే అన్న క్యాంటీన్లు
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్లను ఎట్టకేలకు ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో 25 క్యాంటీన్లు మంజూరు కాగా.. తొలివిడతలో 13 క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేయలేదు. అర్బన్ ప్రాంతాల్లోనే క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం.. గ్రామీణ జిల్లాలో పలు అవసరాల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి రోజు వేలాది మంది వచ్చే నర్సీపట్నం, యలమంచలి, పాయకరావుపేట వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. జీవీఎంసీ పరిధిలో చిట్టివలస వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. క్యాంటీన్లోనే మంత్రి గంటా, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు భోజనం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఈ అన్న క్యాంటీన్లను అట్టహాసంగా ప్రారంభించారు. తొలిరోజు ఉచితం.. తొలిరోజు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన వారందరికీ ఉచితంగానే అల్పాహారం, భోజనం పెట్టారు. తొలిరోజు దాదాపు క్యాంటీన్లంటినీ 2 గంటలకే క్లోజ్ చేశారు. దీంతో 2 గంటల తర్వాత వచ్చిన వారు భోజనం లభించకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. నగర పరిధిలో విమ్స్, ఎంవీపీ, ఆర్ఈ హెచ్, నమ్మిదొడ్డి, చినగంట్యాడ, శ్రీహరిపురం, ములగాడ, మర్రిపాలెం, చిట్టివలస, అనకాపల్లి ఆస్పత్రి, టర్నర్ చౌల్ట్రీ, ఫ్రూట్ మార్కెట్, వాంబే కాలనీ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. మూడుపూటల నాణ్యమైన ఆహారం.. రూ.15కే మూడుపూటలా నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. చిట్టివలస వద్ద క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం సదుపాయం కల్పించేందుకు రోజుకు రూ.63వరకూ ఖర్చవుతుందని, ఈ మొత్తం లో ప్రభుత్వం రూ.58 రాయితీగా భరిస్తూ కేవలం రూ.15కే సామాన్యులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తోందన్నారు. జిల్లాలో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించామని చెప్పా రు. ప్రాథమికంగా ప్రతి క్యాంటీన్లో పూటకు 350 మందికి భోజన సదుపాయాలు కల్పించామని, డిమాండ్‌ను బట్టి వెయ్యి మంది వరకూ కల్పిం చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు ఈ క్యాంటీన్లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉదయం 7.30 నుం చి 10 గంటల వరకూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ, రాత్రి 7.30నుంచి 9 గంటలవరకూ ఈ క్యాంటీన్లు పనిచేస్తాయన్నారు. ఫేషియల్ రికగ్నేషన్‌ద్వారా ప్రతివ్యక్తికి ఒక టోకెన్ మాత్రమే విక్రయిస్తారని తెలిపా రు. ప్రతి క్యాంటీన్లో ఆర్వో ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. -
డబుల్ ఇళ్లకు మరిన్ని సదుపాయాలు
జియాగూడ: జియాగూడలో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో మరిన్ని సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... జియాగూడలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు సకాలంలో లబ్ధిదారులకు అందజేయం జరుగుతుంందన్నారు. కాలనీవాసుల కోరిక మేరకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. స్థానిక కార్పొరేటర్ మిత్రకృష్ణ ఇక్కడి పరిస్థితులను, కావాల్సిన సదుపాయాల గురించి మంత్రికి వివరించారు. ముఖ్యంగా క్వార్టర్స్‌లోని కిచెన్ రూంలలో టైల్స్ వేయాలని, గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దాలని, ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలను హయ్యర్ స్టాండర్ట్ వరకు తీర్చిదిద్దాలని మంత్రిని కోరారు. అలాగే క్వార్టర్స్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో హెల్త్ సెంటర్‌ను నిర్మించకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని కోరారు. కాలనీ చుట్టూరా ప్రహారీ నిర్మించాలని సూచించారు. క్వార్టర్స్‌లో పలు చోట్ల ఖాళీ స్థలం ఉన్నందున అదనంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనులను చేపట్టినట్లయితే నిరుపేదలకు మరికొందరికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, కాలనీ సంఘం అధ్యక్షులు ఈ. శ్రీనివాస్, వార్డు కమిటీ, ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
అల్గునూర్(మానకొండూర్) : మొదటిసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థుల కోసం తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి, వాగేశ్వరి, శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించిన అగ్రికల్చర్ పరీక్షకు 3,502 మందికి 3296 మంది హాజరయ్యారు. ఉదయం వాగేశ్వరి కళాశాలలోని అయాన్ డిజిటల్ సెంటర్లో 750 మందికి 710 మంది, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో 352 మందికి 328 మంది, జ్యోతిష్మతి కళాశాలలో 150 మందికి 135 మంది, శ్రీచైతన్య ఇంజినీరింగ్–1లో 350 మందికి 331 మంది, శ్రీచైతన్య–2లో 149 మందికి 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం వాగేశ్వరి అయాన్ డిజిటల్ సెంటర్లో 750 మందికి 712 మంది, ఇంజినీరింగ్ కళాశాలలో 350 మందికి 333, జ్యోతిష్మతిలో 150 మందికి 138, శ్రీచైతన్య–1లో 349 మందికి 325, శ్రీచైతన్య–2లో 150 మందికి 137 మంది హాజరయ్యారని పరీక్షల నిర్వాహకులు తెలిపారు. కాగా ఉదయం వాగేశ్వరి కేంద్రానికి వేములవాడకు చెందిన తిప్పారపు వెన్నెల 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో నిమిషం నిబంధన కింద అధికారులు ఆమెను అనుమతించలేదు. బయోమెట్రిక్‌తో హాజరు నమోదు విద్యార్థులందరికీ బయోమెట్రిక్‌తో హాజరు నమోదు చేశారు. నూతన విధానంలో నిర్వహిస్తున్న పరీక్షతో విద్యార్థులు మొదట కొంత ఆందోళన చెందినా..ఆ తర్వాత అంతా సర్దుకుంది. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను రెండు గంటల ముందే అనుమతించడంతో పరీక్షలు ప్రశాంతంగా రాశారు. హాల్‌టికెట్లపై గెజిటెడ్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల ఇన్‌చార్జిలే సంతకాలు చేయించి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్రాలను తనిఖీ చేసిన ఏసీపీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గతంలో అల్గునూర్ చౌరస్తాలో ట్రాఫిక్ కారణంగా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పోయారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు ఇన్చార్జిగా మానకొండూర్ సీఐ కోటేశ్వర్‌ను నియమించగా, ఎస్సైలు నరేశ్‌రెడ్డి, పల్లె నర్సింగ్ పర్యవేక్షించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాగేశ్వరి కళాశాల సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్‌రెడ్డి టెంట్లు కూడా ఏర్పాటు చేయించి తాగునీటి వసతి కల్పించారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్థులు -
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
నల్లగొండ : జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాని చోట రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్లను, జేసీలను రాష్ట్రభారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశిం చారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిం చారు. నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేటలకు 6లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో దిగుబడి ఎక్కువగా వచ్చిందన్నారు. పండిన పంట మార్కెట్‌కు పెద్ద ఎత్తున వస్తున్నందున రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. 17శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ప్రభుత్వం కొనుగోలు సంస్థలు కొనకపోవడంతో ప్రైవేట్ వారిని ఆశ్రయించే పరిస్థితి ఉందన్నారు. రెండు రోజులుగా సూర్యాపేటలో మద్దతు ధర లభించడం లేదని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితులను మంత్రి గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందు కు జిల్లా యంత్రాంగానికి పూర్తిస్వేచ్ఛను ఇచ్చామని, అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలు ఎదురైతే జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టాస్క్ ఫోర్స్‌ను సంప్రదించాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంటనే పంపించాలన్నారు. తూకం వేసిన ధాన్యం రెండు రోజుల తరువాత మిల్లులకు పంపిస్తే వ్యత్యాసం వచ్చి రైతులకు ధర తగ్గించే సమస్య ఎదురవుతుందన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలో 1లక్ష 85వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 130 కోట్ల మేర రైతులకు ధాన్యం చెల్లింపులు చేశామన్నారు. జిల్లాకు 25లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి అంజయ్య, పౌర సరఫరాల శాఖ అధికారి ఉదయ్‌కుమార్ జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసవర్మ, జిల్లా వ్యవసాయశాధికారి నర్సింహరావు, మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు అలీం తదితరులున్నారు. -
మరో పేమెంట్స్ బ్యాంకు వచ్చేసింది
సాక్షి,ముంబై: దేశీయంగా మరో పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆదిత్య బిర్లా సొంతమైన ఐడియా సెల్యూలర్ కు చెందిన ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు షురూ అయ్యాయి. గురువారం నుంచి దేశవ్యాప్తంగా తమ చెలింపుల బ్యాంకు ఆపరేషన్స్ మొదలయ్యాయయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ సేవలను అందిస్తున్న ఇతర కంపెనీలు ఎయిర్టెల్, పేటీఎం, ఇండియా పోస్ట్ సరసన చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 1949 లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 22 (1) ప్రకారం తమకు లైసెన్స్ జారీ అయిందని ప్రకటించింది. సుధాకర్ రామసుబ్రమణియన్ దీనికి సీఈవోగా వ్యవహరించనున్నారు. అయితే ఈ బ్యాంకు అందించే వడ్డీ రేటు,ఇ తర సేవల గురించి సమాచారం ఇంకా వెల్లడికాలేదు. కాగా చెల్లింపుల బ్యాంకు లైసెన్స్ కోసం .ఆదిత్య బిర్లా నువో భాగస్వామ్యంతో కంపెనీ 2015 లో దరఖాస్తు చేసుకుంది పేమెంట్ బ్యాంకు సేవల అనుమతికి దరఖాస్తు చేసుకున్న11 మందితో ఐడియా కూడా ఒకటి. ఇప్పటికే ఎయిర్టెల్, పేటీఎం పేమెంట్‌బ్యాంకు సేవల్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు త్వరలో రిలయన్స్ జీయో తన చెల్లింపులు బ్యాంకును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. -
మిస్టర్ ‘సి’ న్యూ బిగినింగ్ అంటున్న ఉపాసన
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ సైరా సెట్స్ పైకి వచ్చేసింది. చరణ్ ప్రొడక్షన్ లో రెండవ ప్రాజెక్టు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని , చిరంజీవి కుమారుడు, టాలీవుడ్ హీరో రామ్ చరణ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని ప్రకటించారు. మిస్టర్ ‘సి’ కి, కొణిదెల కుటుంబానికి మావయ్య చిరంజీవి151వ చిత్రం ద్వారా కొత్త ఆరంభం. పవర్ఫుల్ సైరా నరసింహారెడ్డి పాత్ర, చిత్రం బృందం ఉత్సాహం తప్పకుండా ఆశ్చర్యంలో ముంచెత్తుతుందంటూ ట్వీట్ చేశారు. అటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దీనికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో షేర్ చేశారు. సైరా ప్రాజెక్టులో భాగస్వామి కావడం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. బెస్ట్ విషెస్ టూ సూరి అంటూ దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పీరియాడికల్ మూవీ జర్నీలో పార్ట్ కావడం, మెగా స్టార్ రామ్ చరణతో మరోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రత్నవేలు ట్వీట్ చేశారు. కాగా చిరు కెరియర్లో అత్యంత ప్రతిష్మాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ భారీ సెట్ వేయగా ఇందులో చిరుతో పాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్టులపై సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కొణిదెల ప్రొడక్షన్లో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు సినిమా టీంని నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. #newbeginning fr the #konidelafamily MrC ❤️starts project #2 as producer 🎥👌🏻😊. With Mamaya #MegaStarChiranjeevi 151 movie. The power of the character #SyeRaaNarasimhaReddy & the enthusiasm of the team will def mesmerise u. 🎞 #RamCharan — Upasana Kamineni (@upasanakonidela) December 6, 2017 Honoured to be a part of this Epic Journey Sayeraa..once again with Megastar n Ram Charan !! @KonidelaPro Best wishes to Suri n team pic.twitter.com/eOYn6L1nlh — Rathnavelu ISC (@RathnaveluDop) December 5, 2017 -
‘ఆటా నాదే..వేటా నాదే’ అంటున్న అగ్రహీరో
సాక్షి, హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, క్రియేటివ్ డైరెక్టర్ తేజ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి 'ఆటనాదే వేటనాదే' అనే టైటిల్ పెట్టాలని భావిస్తోందట చిత్ర యూనిట్. సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పరచూరి గోపాల కృష్ణ, రాజా రవీంద్ర, అనీల్ సుంకర తదితరులు హాజరయ్యారు. తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ఎట్టకేలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అధికారికంగా పూజ వేడుకలతో ప్రారంభమైంది.‘ నేనే రాజు నేనే మంత్రి` హిట్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన తేజ ఈ సారి ఏకంగా వెంకటేష్‌తో మరో హిట్ కొట్టేందుకు రడీ అవుతున్నాడు. అలాగే 'గురు' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని వెంకీ చేస్తున్న సినిమా ఇది. టైటిల్ బట్టి చూస్తోంటే..థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని భావిస్తున్నారు. డిసెంబరు 16 లేదా 18 వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ నెల 13 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు వార్తలొచ్చినా .. ముందుగానే ప్రారంభించారు. తాజా నివేదికల ప్రకారం ఈ మూవీకి 'ఆటా నాదే వేటానాదే' అని పేరు పెట్టినట్టు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి అభినందన్ సినిమాటోగ్రాఫర్. మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
చైనాలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభం
బీజింగ్: ప్రజా రవాణా వ్యవస్థలో చైనా మరో ముందడుగు వేసింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి పర్యావరణహితమైన ట్రామ్‌ను శుక్రవారం ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలి పర్యావరణహితౖ హైడ్రోజన్ ట్రామ్‌గా ఇది రికార్డుల్లోకెక్కనుంది. ఈ ట్రామ్ద్వారా తొలిసారిగా నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని తంగ్షన్‌లో కమర్షియల్ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ఈ ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న ఈ ట్రామ్ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. -
ఊరూవాడా ‘వైఎస్సార్ కుటుంబం’
ప్రజల నుంచి విశేషస్పందన వైఎస్సార్ కుటుంబంలో సభ్యుడిగా చేరాలని కోరిన నాయకులు అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభించిన ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే మరోవైపు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేయనున్న నవరత్నాల్లాంటి పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు సుభిక్షంగా ఉండేవన్నారు. ఆ మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలతో దాదాపు ప్రతి ఇల్లూ లబ్ధి పొందిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మళ్లీ సువర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీసీని దీవించాలంటూ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సభ్యుడిగా చేరాలని కోరారు. రాయదుర్గం మండలం రాయంపల్లి, కెంచానపల్లి, టి.వీరాపురం, కనేకల్లు, గోపులాపురం, బొమ్మనహాల్ మండలం హరేసముద్రం, డి.హీరేహాల్లో కార్యక్రమం జరిగింది. రాయంపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎంపీ సిద్ధప్ప, బీటీపీ గోవిందు తదితరులు పాల్గొన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచారు. నవరత్నాలు గురించి తెలియజేశారు. కళ్యాణదుర్గం మండలం సీబావిలో మండల కన్వీనర్ వెంకటేశులు, పట్టణ కన్వీనర్ గోపారం శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అలాగే బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండలో మండల కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే శింగనమల నియోజకవర్గం శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పుట్లూరు మండలాల్లో ప్రారంభమైంది. ఆయా మండలాల కన్వీనర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మడకశిర నియోజకవర్గంలో అమరాపురం, రొళ్ల, గుడిబండ మండలాల్లో జరిగింది. పెనుకొండ నియోజకర్గం గోరంట్ల మండలంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ, కూడేరు మండలాల్లో జరిగింది. గుంతకల్లు పట్టణం పాతగుంతకల్లులో నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలను ఆప్యాయంగా పలుకరించారు. నవరత్నాల ప్రాముఖ్యతను వివరించారు. వైఎస్సార్ సీపీ కుటుంబంలో ప్రతి ఒక్కరు చేరేలా చూడాలన్నారు. -
ఇండిగో మాన్సూన్ ఆఫర్. రూ 745
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రయిట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా మాన్సూన్ ఆఫర్‌ను ప్రకటించింది. వన్ వే విమానాల్లో దాదాపు రూ. 745 కేటికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ పథకం పరిమిత కాలం అమల్లోఉండనుంది. జూలై 4 లోపు ప్రస్తుత డిస్కౌంట్ ధరల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చే. వీటి ద్వారా జూలై 14, 2017 నుంచి మార్చి 24 , 2018ల మధ్య వచ్చే ప్రయాణించవచ్చని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇండిగో వెబ్ సైట్ సమాచారం ప్రకారం అన్ని కలుపుకొని విమాన టికెట్లు జమ్మూ - శ్రీనగర్ మార్గంలో రూ. 745 అగర్తల-గైహతి రూ. 778, చెన్నై- బెంగళూరు రూ.898, అహ్మదాబాద్-ముంబై రూ. 1,048, బెంగళూరు-చెన్నై రూ. 1,059, బెంగళూరు-కొచీ రూ.1,199 బాగ్దోగ్రా-కోలకతా రూ. 1,199ప్రారంభధరలుగా ఉన్నాయి. అహ్మదాబాద్, అమృత్సర్ బాగ్దోగ్రా, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గోవా, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కొచీ, కోలకతా, మధురై, మంగళూరు, ముంబై నుండి కాని స్టాప్ విమానాలు న చెల్లదు పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, శ్రీనగర్, తిరువనంతపురం, వారణాసి, విశాఖపట్నం నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఏకలవ్య-2వ ఆర్చరీ టోర్నమెంట్ ప్రారంభం
పలు రాష్ట్రాల నుంచి హాజరైన విలువిద్య క్రీడాకారులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : ఏకలవ్య-2వ జాతీయ స్థాయి ట్రైబల్ ఆర్చరీ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్‌లో శనివారం అట్టహాసంగా మొదలైంది. దీనిని ఆన్సోర్ డైరెక్టర్ వీపీ మహావార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విలువిద్యను అభివృద్ధి చేసి గిరిజనుల ప్రతిభను వెలికి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. దీనిని నిర్వహిస్తున్న చెరుకూరి సత్యనారాయణ వోల్గా ఆర్చరీ అకాడమీ మరింత మంది విలువిద్య క్రీడాకారులను తయారు చేసి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. 202 క్రీడాకారిణిలు హాజరు దీనికి వివిధ రాష్ట్రాల నుంచి 202 విలువిద్య క్రీడాకారిణిలు హాజరయ్యారు. రికర్వో విభాగంలో 60 మీటర్లు, 70 మీటర్లు, ఇండియన్ రౌండ్ విభాగంలో 30 మీటర్లు, 50 మీటర్లలో సీనియర్, సబ్ జూనియర్, బాలురు, బాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. ఆదివారం జరుగు ఒలింపిక్ రౌండ్(నాక్ అవుట్)లో విజేతలను ప్రకటిస్తారు. ఒలింపిక్ చాంపియన్‌షిప్ లక్ష్యం 1988 నుంచి శిక్షణ పొందుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నాను. 1994లో పూనే నేషనల్ గేమ్స్‌లో ఆరు బంగారు పతకాలు సాధించాను. మూడు ఒలింపిక్స్‌కు కోచ్‌గా పని చేశాను. ఒలింపిక్‌లో చాంపియన్‌షిఫ్ లక్ష్యమే ధ్యేయంగా విద్యార్థులను తయారుచేస్తున్నాను. - పూర్ణిమ మహాతో, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జార్ఘండ్ ఏషియన్ గేమ్స్ లక్ష్యం 2007లో జంబల్పూర్లో సబ్ జూనియర్స్ తొలి జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఏషియన్ గ్రాండ్ ఫిక్స్‌లో ఒకటి, సౌత్ఈస్ట్ ఏషియన్ చాంపియన్ షిఫ్ సాధించాను. ఏడు గోల్డ్ మెడల్స్‌తో కలిపి మొత్తం 30 పైగా మెడల్స్ సాధించాను. ఏషియన్ గేమ్స్‌లో ప్రథమస్థానం సాధించడమే నా లక్ష్యం. - వై.అనూషరెడ్డి, నేషనల్ ప్లేయర్, విజయవాడ మంచి ప్రోత్సాహం అందుతోంది విలువిద్య అంటే చాలా మక్కువ. ఆ ఆసక్తితోనే విజయవాడలోని చెరుకూరి సత్యనారాయణ ఆర్చరీ అకాడమీలో చేరా. ఇప్పటి వరకు 25 నేషనల్స్ పోటీలకు వెళ్లాను. ఏడు మెడల్స్ సాధించాను. నాకు అకాడమీ మంచి ప్రోత్సాహం ఇస్తోంది. - టి.రవిచంద్ర, నేషనల్ ప్లేయర్, విజయవాడ మంచి జీవన విధానం ఏర్పడుతుంది విలువిద్య ద్వారా మంచి జీవన విధానం ఏర్పడుతుంది. ఇంటర్నేషనల్‌లో తొమ్మిది, నేషనల్స్‌లో తొమ్మిదింటిలో పాల్గొన్నాను. ఇప్పటి వరకు 30 పతకాలు సాధించాను. 2005 శిక్షణ పొంది 2007 నుంచి పలు పోటీలకు హాజరయ్యాను. - సంజయ్బోరో, నేషనల్ ప్లేయర్, అస్సాం ఒలింపిక్ మెడలే లక్ష్యం నా కుమార్డు లెనిన్ విలువిద్యలో ఎన్నో మోడల్స్ సాధించాడు. దీనికి 2010లో హైదరాబాద్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి చేతులమీదుగా సన్మానం అందుకుని వస్తుంటే విజయవాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కుమారుడు చనిపోయాడు. అదే సమయంలో నేను అంధుడినయ్యా. అయితే నా కుమారుడి కోరిక మేరకు ఒలింపిక్ పతకం తీసుకురావాలే లక్ష్యంతో ఉన్నా. వయస్సు పెద్దది. నాకు ఎవరూ లేరు. దీంతో సరోగమి గర్బం ద్వారా ఒక కూతురిని కన్నాం. పాప పేరు శివాని. ఐదేళ్ల వయస్సు. ఇప్పటికి మూడు మెడల్స్ సాధించింది. అమెరికాకు చెందిన డిస్నీ సంస్థ వారు శివానీ విలువిద్యపై డాక్యుమెంటరీ తీశారు. నా అకాడమీ, శివానీ ద్వారా దేశానికి ఒలింపిక్ పతకం తేవడమే నా ప్రధాన లక్ష్యం. - చెరుకూరి సత్యనారాయణ, అకాడమీ అధ్యక్షులు, విజయవాడ -
సీడీఎస్ఎల్ ఐపీవో 19న
ముంబై: డిపాజిటరీ సర్వీసులు అందిస్తున్న సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జూన్ 19న ప్రారంభంకానుంది. రూ. 500 కోట్ల సమీకరణకు రూ. 145–149 ప్రైస్‌బ్యాండ్‌తో సీడీఎస్ఎల్ ఈ ఆఫర్ జారీకానుంది. సీడీఎస్‌ఎల్‌లో ప్రస్తుతం వాటాలు కలిగిన బొంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్ఈ), ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కలకత్తా స్టాక్ ఎక్సే్ఛంజ్లతో పాటు మరికొన్ని షేర్‌హోల్డింగ్ సంస్థలు సీడీఎస్ఎల్ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించనున్నాయి. సీడీఎస్‌ఎల్‌లో ప్రస్తుతం 50.05 శాతం వాటా కలిగిన బీఎస్ఈ 26.05 శాతం (2.72 కోట్ల షేర్లు) ఆఫ్‌లోడ్ చేయనుంది. సెబి తాజా నిబంధనల ప్రకారం ఏ స్టాక్ ఎక్సే్ఛంజీ... డిపాజిటరీలో 24 శాతంకంటే మించి వాటా కలిగివుండరాదు. ఈ నిబంధనలకు అనుగుణంగా బీఎస్ఈ అధిక వాటాను విక్రయించనున్నది. తాజా ఆఫర్ పూర్తయిన తర్వాత సీడీఎస్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయ్యే తొలి డిపాజిటరీ అవుతుంది. ఇది బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టవుతుంది. 2016–17లో సీడీఎస్ఎల్ మొత్తం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 187 కోట్లకు చేరగా, నికరలాభం 22 శాతం వృద్ధితో రూ. 86 కోట్లకు పెరిగింది. త్వరలో కమోడిటీ రిపాజిటరీ... కొద్ది నెలల్లో తాము కమోడిటీ రిపాజిటరీని ఏర్పాటుచేస్తామని, ఇది తమ కంపెనీ వృద్ధికి దోహదపడుతుందని సీడీఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీఎస్ రెడ్డి సోమివారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఇప్పటికే తాము సూత్రప్రాయ అనుమతి పొందామని, రానున్న 2–3 నెలల్లో ఇది ఏర్పాటు కావొచ్చన్నారు. ఇన్వెస్టర్లు వారి సెక్యూరిటీలను డీమ్యాట్ రూపంలో అట్టిపెట్టుకునేందుకు ఎలక్ట్రానిక్ అకౌంట్లను సీడీఎస్ఎల్ అనుమతిస్తుంది. ఈ సంస్థ వద్ద ప్రస్తుతం 1.25 కోట్ల ఖాతాలుండగా, దీనికి పోటీ సంస్థ ఎన్ఎస్డీఎల్ వద్ద 1.58 కోట్ల ఖాతాలున్నాయి. -
ఇక డిజిటల్ డోర్ నంబర్లు
పోతవరం (నల్లజర్ల) : జిల్లాలో అన్ని గ్రామ, నగరపాలక, పురపాలక సంఘాల్లో ఇళ్లకు త్వరలో డిజిటల్ డోర్ నంబర్లు ఏర్పాటు చేయనున్నారు. గణిత భాషలో వేసే నంబర్లు తెలుసుకోవడం ప్రభుత్వ సిబ్బందికి కష్టంగా ఉండేది. అలా కాకుండా ఒకే చట్రంలో రాష్ట్రం, పట్టణం, వార్డు, వీధి, ఇంటి నంబర్‌తో డిజిటల్ ఇంటి నంబర్ కేటాయించనున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలను భౌగోళిక సమాచార (జీఐఎస్) వ్యవస్థతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్లజర్ల మండలంలోని స్మార్ట్ విలేజ్ పోతవరంలో ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. శాస్త్రీయ విధానంలో ఇళ్ల నంబర్ల కేటాయింపు అన్ని గ్రామాల్లో ఇళ్లు, వీధుల హద్దులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఫుట్‌పాత్‌లు, పార్క్‌లు, రహదారులు, చప్తాలు, ల్యాండ్ మార్క్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పబ్లిక్ ట్యాప్‌లు, చెత్తకుండీల ప్రదేశాలు, పక్కా కాలువలు తదితర 59 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించి భౌగోళిక సమాచార వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. సర్వేలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఇళ్ల నంబర్లను మార్పు చేసి శాస్త్రీయవిధానంలో కేటాయిస్తారు. ఇంటి నంబర్లలో ముందుగా రాష్ట్రం, గ్రామం, వీధి, వార్డు ఇంటి నంబర్‌తో డిజిటల్ ఇంటి నంబరు కేటాయించగా జియోట్యాగింగ్ చేస్తారు. నంబర్ ప్లేటు ఎదుట స్వచ్ఛభారత్ సింబల్‌తో పరిశుభ్రత, ఆరోగ్యం సూచిస్తూ స్వచ్ఛత వైపు అని సూచిస్తూ వెనుక వైపు డిజిటల్ మైక్రో ఐడీ నంబర్ ఉంటుంది. దీనిని ఇంటి యజమాని పంచాయతీ అసెస్మెంట్ నంబర్‌తో అనుసంధానించి ఇంటి గుమ్మంపై స్క్రూలతో బిగిస్తారు. అదే నంబర్ స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం పోతవరంలో ఈ విధానం అమలుకు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరణ సమయంలో సిబ్బంది ఆ డిజిటల్ బోర్డుపై స్కానర్ వంటి ప్రత్యేక పరికరంతో స్కాన్ చేస్తారు. వెంటనే సంబంధిత గృహ యజమానికి, పంచాయతీ అధికారులకు ఆ ఇంటి నుంచి చెత్త సేకరించినట్టు ఫోన్ ద్వారా సమాచారం (మెసేజ్) వస్తుంది. ఇదే సమాచారం సంబంధిత సర్పంచ్, కార్యదర్శి, సీఎం డ్యాష్ బోర్డుకు సైతం చేరుతుంది. సిబ్బంది ఎక్కడ ఏ౾ చేస్తున్నారనే విషయం సులభంగా తెలుస్తుందని గ్రామ సర్పంచ్ పసుమర్తి రతీష్ వెల్లడించారు. ఇంటి యజమానుకులకు ఇచ్చిన మైక్రో డిజిటల్ నంబర్‌తో గ్రామంలో పంచాయతీ ద్వారా తాగునీరు అందకపోయినా, వీధిలైటు వెలగకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధానం ద్వారా మరిన్ని కార్యక్రమాలు అమల్లోకి తేనున్నట్టు గ్రామ కార్యదర్శి రంగనాయకమ్మ తెలిపారు. -
భీమవరంలో వాలీబాల్ శిక్షణ శిబిరం
భీమవరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి, సరికొత్త ఆలోచనలకు దోహదపడతాయని భీమవరం డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు అన్నారు. కళాశాల క్రీడా మైదానంలో బుధవారం సమ్మర్ రెసిడెన్షియల్ వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్, వసు«ధ ఫౌండేష న్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వసుధా ఫౌండేష న్ కార్యదర్శి మంతెన వెంకటరామరాజు మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఇలాంటి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు, వాలీబాల్ అసోసియేష న్ జిల్లా కార్యదర్శి జి.నారాయణరాజు, వసుధాఫౌండేష న్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, శివరామరాజు, ఎంసీహెచ్ ఆర్కే రాజు, సుదర్శన వర్మ, శ్రీనివాసరాజు, జీవీ పవ న్ కుమార్రాజు పాల్గొన్నారు. -
‘చీకటి’ పరీక్షలు!
–అసౌకర్యాల నడుమ ఇంటర్ పరీక్షలు ప్రారంభం - మొదటిరోజు 1,333 మంది గైర్హాజర్ అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం అసౌకర్యాల నడుమ ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో గాలి, వెలుతురు, ఫర్నీచర్ కచ్చితంగా ఉండాలని ఉన్నతాధికారులు పదేపదే ఆదేశించినా.. ఫలితం లేకపోయింది. కొన్ని కేంద్రాల్లో కరెంట్ లేక విద్యార్థులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. గతంతో పోల్చితే ఈసారి దాదాపు అన్ని సెంటర్లలో ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల మాత్రం విరిగిన బల్లలు దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల వాటిని శుభ్రం చేయలేదు. దుమ్మూ ధూళితో నిండిపోయాయి. విధిలేక విద్యార్థులు వాటిపైనే కూర్చుని పరీక్ష రాశారు. మొత్తమ్మీద తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగానే జరిగాయి. జనరల్ విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 36,758 మంది విద్యార్థులకు గాను 35,425 మంది హాజరయ్యారు. 1,333 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 33,885 మందికి గాను 32,761 మంది హాజరవగా.. 1,124 మంది రాలేదు. ఒకేషనల్ విద్యార్థులు 2,873 మందికి గాను 2,664 మంది హాజరయ్యారు. 209 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ బాలికల కళాశాల, ఎస్ఎస్బీఎన్ కళాశాల పరీక్షా కేంద్రాలను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తనిఖీ చేశారు. అలాగే జిల్లా వృత్తి విద్యాధికారి (డీవీఈఓ) చంద్రశేఖర్‌రావు అనంతపురం, ధర్మవరంలోని కేంద్రాలను, ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ) వెంకటేశులు అనంతపురం, డీఈసీ సభ్యులు హిందూపురంలోని కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు మడకశిర, గుడిబండ, అమడగూరు, గుంతకల్లు, గుత్తి, పామిడి, గోరంట్ల, కొత్తచెరువు, ధర్మవరం, కుందుర్పి, కళ్యాణదుర్గం, ఆత్మకూరు కేంద్రాలను తనిఖీ చేశాయి. హై పవర్ కమిటీ సభ్యులు ఆమడగూరు, కదిరి, తనకల్లు కేంద్రాలకు వెళ్లారు. -
పాలకొల్లులో దక్షిణ భారత ఆర్ట్ ఎగ్జిబిషన్
పాలకొల్లు సెంట్రల్ : స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలు నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దక్షిణ భారత చిత్రకారులచే చిత్రకళా ప్రదర్శన క్యాంపు ఏర్పాటు చేశారు. శనివారం ప్రారంభించిన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు క్లబ్ అధ్యక్షులు అధికారి కృష్ణ తెలిపారు. వడ్డాది పాపయ్య, బాపుల పేరున వపా బాపు ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు డి. రామకృష్ణారావు నిర్వహణలో ఈ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ చిత్రకళాకారులు ఇంత దూరం వచ్చి పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మద్రాసుకు చెందిన లెటరింగ్ ఆర్టిస్ట్ అంకయ్యను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ సెక్రటరీ బోడా చక్రవర్తి, ట్రెజరర్ పాటపళ్ల ప్రసాద్, ఎన్వీఎస్ఎస్ పాపారావునాయుడు, కొమ్ముల మురళి, వపాబాపు ఆర్ట్ అకాడమీ సెక్రటరీ కొత్తపల్లి శ్రీను, గొన్నాబత్తుల సత్యనారాయణ, ముగడ నాగేశ్వరరావు, రావూరి అప్పారావు పాల్గొన్నారు. -
కైట్ ఫెస్ట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం
-
అనంత ప్రీమియర్ లీగ్ ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం ప్రీమియర్ లీగ్–2016 క్రికెట్ పోటీలను ఆర్డీటీ చీఫ్ కోచ్ షాబుద్దీన్, జిల్లా క్రికెట్ సంఘం ఉపా««ధ్యక్షులు చంద్రమోహన్‌రెడ్డి, మల్లికార్జున ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ప్రసన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీగ్ మ్యాచుల ద్వారా క్రీడాకారులు అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఆర్డీటీ సహకారం ఎనలేనిదన్నారు. అనంతరం బీఆర్ ప్రసన్న మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా లీగ్ క్రికెట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అండర్–14 జట్టు గత మూడేళ్లుగా రాష్ట్ర చాంపియన్‌గా నిలుస్తోందన్నారు. అండ్–16 లో జిల్లా జట్టు సెమీస్‌కు అర్హత సా«ధించిందన్నారు. అండర్–19 లోనూ అనంత జట్టు రాష్ట్ర చాంపియన్‌గా నిలుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. వచ్చే ఆదివారం నుంచి సబ్ సెంటర్లలో లీగ్ పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి సర్దార్, కోచ్‌లు మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనంత క్రీడా గ్రామంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు విజయం సాధించింది. స్కోర్ వివరాలు..అనంతపురం: 50 ఓవర్లలో154 పరుగులు (ఆలౌట్), అకాడమీ జట్టు: 44 ఓవర్లలో విజయం (3 వికెట్లు). -
క్రీడానందం.. ‘ఖోఖో’ల్లలు
భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం 36వ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్ బాలురు, బాలికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఈ పోటీలను ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. జిల్లాస్థాయి ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 312 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుత వివిధ జిల్లాల క్రీడాకారుల మార్చ్ఫాస్ట్ ఉత్సాహంగా సాగింది. తొలిరోజు విజేతల వివరాలను జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఇ.సాంబ శివరావు, ఎంఈవో గారపాటి ప్రకాశరావు, కోశాధికారి ప్రసాదరెడ్డి తెలిపారు. బాలికల విభాగంలో విజేతలు వీరే.. పశ్చిమగోదావరి–నెల్లూరు, ప్రకాశం–తూర్పుగోదావరి మ«ద్యృ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. శ్రీకాకుళంపై అనంతపురం, కృష్ణాజిల్లా జట్టుపై విజయనగరం, చిత్తూరుపై విశాఖపట్నృ విజయం సాధించాయి. బాలుర విభాగం : తూర్పుగోదావరిపై చిత్తూరు, అనంతపురంపై పశ్చిమ గోదావరి, గుంటూరుౖపై విశాఖపట్నం, కర్నూలుపై ప్రకాశం, కృష్ణాపై విజయనగరం విజయం సాధించాయి. -
కేటీపీఎస్ 7వ దశ టీజీ కాంక్రీట్ పనులు ప్రారంభం
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను గురువారం జెన్కో డైరెక్టర్ («ప్రాజెక్ట్స్) సి.రాధాకృష్ణ పరిశీలించారు. పవర్ మెక్ సంస్థ నిర్మిస్తున్న టర్బైన్, జనరేటర్ డెక్ క్యాస్టింగ్ కాంక్రీట్ పనులను ప్రారంభించారు. తెల్లవారుజామున ఐదు గంటలకే పని ప్రదేశానికి చేరుకుని పూజాకార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం, 1100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను ప్రారంభించారు. అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ .. కర్మాగారంలో కీలకమైన టర్బైన్, జనరేటర్ కాంక్రీట్ పనులను 24 గంటల్లో పూర్తిచేస్తామన్నారు. ఆ తరువాత ఎలక్ట్రికల్ పనులు చేపడతామన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రణాళికాబద్ధగా పనులు సాగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జెన్కో సీఈ (సివిల్) అజయ్, కేటీపీఎస్ ఓ అండ్ ఎం సీఈ వి.మంగేష్‌కుమార్; 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, ఎస్ఈలు యుగపతి, బాలరాజు, ఉపేందర్, శ్రీనివాస్, డీఈ చంద్రశేఖర్, సేఫ్టీ ఆఫీసర్ శాంతయ్య, పవర్ మెక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం, డీజీఎం ఆనంద్, సీనియర్ మేనేజర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
పూలజాతర షురూ..!
-
ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు
ఏలూరు రూరల్ : మల్కాపురం ఆశ్రం మెడికల్ కళాశాలలో ఆదివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వైద్య కళాశాల విద్యార్థులు తరలివచ్చారు. పోటీల్లో ప్రతిభచూపిన క్రీడాకారిణులను యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేసినట్టు ఆశ్రం కళాశాల పీడీ శ్రీనివాసరాజు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పురుషుల జట్టును సోమవారం ఎంపిక చేయనున్నట్టు ప్రకటించారు. -
అసలైన ఏలియన్స్ అన్వేషణ మొదలైంది!
బీజింగ్: ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ తన పని ప్రారంభించింది. నైరుతి చైనా గిజూ ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఈ టెలిస్కోప్ ఆదివారం మధ్యాహ్నం నుంచి పనిని ప్రారంభించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. విశ్వంలో జీవం కోసం మానవులు సాగిస్తున్న అన్వేషణను ఈ రేడియో టెలిస్కోప్ మరింత ప్రభావవంతంగా చేపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ద ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్(ఎఫ్ఏఎస్టీ) పేరుతో నిర్మితమైన దీని కోసం చైనా 1.2 బిలియన్ యువాన్లను ఖర్చుచేసింది. ఇప్పటివరకూ ప్రపంచంలో పెద్ద టెలిస్కోప్‌గా పేరున్న ప్యూర్టోరికో లోని అరెసిబో టెలిస్కోప్‌ను ఎఫ్ఏఎస్టీ ద్వితీయ స్థానంలోకి నెట్టేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉంటుందంటే ఎఫ్ఏఎస్టీ ఎంత భారీ టెలీస్కోపో అర్థం చేసుకోవచ్చు. చైనా తన అభివృద్ధిని చాటుకునేలా సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అంతరిక్ష రంగంలోనూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2020 నాటికి శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకునే దిశగా చైనా అడుగులేస్తోంది. ఎఫ్ఏఎస్టీ నిర్మాణాన్ని 2011లో చైనా ప్రారంభించింది. టెలిస్కొప్ వ్యవహారాలను సక్రమంగా నిర్వహించేందుకు గాను ఆ ప్రాంతంలో 5 కిమీ పరిధిలో ఉన్న సుమారు 10 వేల మందిని స్థానిక ప్రభుత్వం ఖాళీ చేయించింది. -
పంప్‌హౌజ్ పనులు షురూ
కాళేశ్వరం: కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా మహదేవపూర్ మండలం కన్నేపల్లి ప్రధాన పంప్‌హౌస్ పనులు మొదలయ్యాయి. మే రెండో తేదీన సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. సోమవారం మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అధికారికంగా పనులు ప్రారంభించారు. మూడు రోజులుగా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేశారు. నిర్మాణం జరిగే ప్రదేశంలో పొక్లెయిన్లతో పూడిక తీస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గురువారం వరకు నిర్మాణానికి అవసరమైన భూసేకరణను హడావుడిగా పూర్తిచేసినట్లు తెలిసింది. మొదట 48ఎకరాలు, తరువాత 188 ఎకరాలు భూసేకరణ చేసినట్లు తెలుస్తోంది. కొందరు నిర్వాసితులకు ఎకరానికి రూ. 3లక్షల2వేలు ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో పంప్‌హౌస్ పనులు ముమ్మరం కానున్నాయి. పరిహారం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో భూసేకరణకు నిర్వాసితులు అడ్డు చెబుతుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. మంత్రి హరీశ్‌రావు వచ్చి పరిహారంపై హామీ ఇస్తేనే భూములు ఇస్తామని పట్టుబట్టారు. -
పెసర్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
తిరుమలగిరి తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పెసర్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పాశం విజయయాదవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యత గల పెసర్లను తీసుకొచ్చి రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.4800 మద్దతు ధర, రూ.425 బోనస్ ధర చెల్లిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం సునీత, మార్కెటింగ్ ఏడీఎం అలీమ్, తహసీల్దార్ జగన్నాథరావు, దేవేందర్, వీరస్వామి, కార్యదర్శి నవీన్‌రెడ్డి, సర్పంచ్ హరిశ్చంద్రనాయక్, అబ్బాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ప్రారంభమైన పెసళ్ల కొనుగోళ్లు
వరంగల్‌సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఎట్టకేలకు శుక్రవారం మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వై.రంజిత్‌రెడ్డి పర్యవేక్షణలో పెసళ్ల కొనుగోళ్లను చేపట్టారు. గురువారం నుంచే పెసళ్లను కొనుగోలు చేయాల్సి ఉండగా, కారణంగా లేకుండా కొనుగోళ్లను వాయిదా వేశారు. దీంతో సాక్షి దినపత్రిక ‘పెసరఽ రైతులకు నిరాశ’ అనే కథనాన్ని శుక్రవారం ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు ఎట్టకేలకు శుక్రవారం కొనుగోళ్లను చేపట్టారు. కాగా గురువారం పెసళ్లను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4,900తో కొనుగోలు చేయగా, శుక్రవారం మార్క్‌ఫెడ్, నాఫెడ్ అధికారులు సంయుక్తంగా క్వింటాల్‌కు రూ.5,326తో కొనుగోలు చేశారు. ఒక్కరోజు తేడాలో క్వింటాల్‌కు రూ.400కు పైగా అదనపు డబ్బులు సమకూరడంతో పెసరు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు 365 పెసరు బస్తాలు అమ్మకానికి రాగా, దాదాపు 330 బస్తాల పెసళ్లను అధికారులే కొనుగోలు చేశారు. మొదటి రోజు కొనుగోళ్లలో రవీందర్‌రెడ్డి, ఉసెన్తో పాటు గ్రేడ్-2 కార్యదర్శి జగన్మోహన్, సూపర్వైజర్లు లక్ష్మీనారాయణ, వేణు పాల్గొన్నారు. -
బాలాపూర్‌లో గణేశుడి శోభాయాత్ర ప్రారంభం
-
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం
-
ప్రక్షాళన మొదలు..
భద్రాద్రి ఆలయంలో 45 మంది సిబ్బందికి స్థాన చలనం, ఔట్ సోర్సింగ్ వారిపై తొలివేటు ఈఓ అత్యవసర సమావేశం, నగల మాయంపై చర్యలకు వెనుకంజ అధికారుల తీరుపై ఉద్యోగవర్గాల్లో వ్యతిరేకత భద్రాచలం: శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో విధుల పట్ల అలసత్వం వహిస్తున్న సిబ్బందిని గాడిలో పెట్టేందుకు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే 45 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్థానభ్రంశం కల్పిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. సరైన నియంత్రణ లేకపోవటంతో కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఒకింత కఠినంగానే వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. జరిమానా విధించి.. మెమో జారీ చేసి.. భక్తుల కానుకులను నమోదు చేసే పుస్తకాన్ని భద్రపర్చలేదనే కారణంతో జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణకు రూ.5 వేలు జరిమానా విధించారు. ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు పర్యవేక్షణ లేమిని ఎత్తిచూపుతూ అతడికి మెమో జారీ చేశారు. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఆలయ విధులను పక్కనపెట్టి సొంతకార్యాలకే పెద్ద పీట వేస్తున్నారనే కోణంలో ఈఓ ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఆలయంలో పనిచేస్తున్న వారిని, ఆలయ పరిసరాలు, కార్యాలయం వంటి చోట్లకు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వారిని ఆలయ ప్రాంగణానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈఓ నిర్ణయంపై ఆలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆలయ అర్చకుల్లో కొందరితో బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా అర్చకులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించినట్లుగా తెలిసింది. ఈఓ చర్యలపై కొందరు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పుస్తకం కనిపించలేదనే కారణంగా జరిమానా విధించటంతో పాటు, జూనియర్ అసిస్టెంట్‌ను వేరే చోటుకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. నగలు మాయమైనా చర్యల్లేవా..? ఇప్పుడేమో కఠినంగా వ్యవహరిస్తారా..? సీతమ్మ వారి పుస్తెల తాడు, లక్ష్మణుడి లాకెట్ కనిపించకుండా పోయి..వారం రోజుల తర్వాత దొరికిన విషయం విదితమే. ఆలయంలో కీలకంగా వ్యవహరించే ఓ అర్చకుడు వాటిని మాయం చేశాడనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. ఈ ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని ఆలయ ఉద్యోగ, అర్చకుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి ఈ విషయంలో అర్చకుల పక్షాన కొమ్ము కాస్తున్నారనే ప్రచారం ఉన్నప్పటకీ, తప్పు చేసినవారెవరైనా సమానమే కదా అని ఇక్కడి ఉద్యోగుల వాదన. -
టైలరింగ్ శిక్షణ ప్రారంభం
ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ శనివారం ప్రారంభించారు. ౖయెటింక్లయిన్‌కాలనీ సేవాభవనంలో జరిగిన కార్యక్రమంలో ఆర్జీ–2 సేవా అధ్యక్షురాలు శకుంతలవిజయపాల్రెడ్డి టైలరింగ్ శిక్షణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం ఉపాధి కోర్సుల్లో మహిళలు ముందంజలో ఉండాలని కోరారు. సింగరేణి సంస్థ ఉచితంగా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సేవా కార్యదర్శి సుజన, డీజీఎం పర్సనల్ ఎన్వీ.రావు, డీవైపీఎం రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
రాజమండ్రిలో టీటీ టోర్నీ ప్రారంభం
-
నిండుకుండలా ఎల్లంపల్లి
రామగుండం : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో నీటి నిల్వ బుధవారం సాయంత్రానికి 19.369 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 521 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 521 క్యూసెక్కులుగా ఉంది. అందులో ఎన్టీపీసీకి 363, హైదరాబాద్ మెట్రోకు 158 క్యూసెక్కులు సరఫరా అవుతున్నాయని ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. మరో 48 గంటల్లో ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరే అవకాశముంది. -
ఆరోగ్యమాత ఉత్సవాలు ప్రారంభం
కడప కల్చరల్ : కడప నగరం రైల్వేస్టేషన్ వద్దగల వేలాంగిణి ఆరోగ్యమాత నవదిన ఉత్సవాలను సోమవారం మేత్రాసన కడప డయాసిస్ పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ గల్లెల ప్రసాద్ ప్రారంభించారు. ఈ క్షేత్రం ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల ప్రారంభ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభువైన ఏసుక్రీస్తును మానవ లోకానికి అందించిన ఆరోగ్యమాత పవిత్రమైన జననిగా పూజలందుకోవడం గర్వకారణమన్నారు. ప్రభువు ద్వారా ఆమె ప్రపంచానికి ప్రేమ, శాంతి, సమాధానాలను అందించేందుకు ఎంతగానో తోడ్పడుతోందన్నారు. అనంతరం ఆయన సమిష్టి దివ్య బలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వాసులు పాత గుడిచుట్టూ ఆరోగ్యమాత స్వరూపంతో ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమానికి మేత్రాసన వికర్ జనరల్ మోన్సిగ్నోర్ ఈరి లూర్దుమరియన్న, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ కన్నా జయన్న సహాయ అర్చకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంపీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ ఎల్.ఆరోగ్యరాజు, సెయింట్ మెరీస్ క్యాథడ్రల్ ఫాదర్ సగిలి ›ప్రకాశ్, నందిపల్లె విచారణ గురువులు ఫాదర్ బడుగు శ్యాంసన్, కడప మేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ సగినాల పాల్ ప్రకాశ్, ఆరోగ్యమాత క్షేత్రం సహాయ గురువులు లూర్దురాజు, ఫాదర్ సుమన్, ఆరోగ్యమాత సభ సిస్టర్లు, తిరునాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
విన్నపాలు షురూ..
రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు డిమాండ్ సత్తుపల్లిని రెవెన్యూ డివిజన్ చేయాలి.. రెండు రోజుల్లో.. 95 వినతులు సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాల ఏర్పాటు.. ఉన్న వాటిని విడదీÄñæ¬ద్దని.. పక్క జిల్లాలో కలపొద్దని.. ప్రస్తుతం ఉన్న వాటిలోనే సర్దుబాటు చేయాలని’ వినతులు వెల్లువెత్తాయి.. జిల్లా పునర్విభజనకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌కు రెండు రోజుల్లోనే(బుధవారం రాత్రి పది గంటల వరకు) 94 వినతులొచ్చాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని నెల రోజుల గడువిచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఈనెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. నోటిఫికేషన్ ప్రకారం ఖమ్మం జిల్లాకు 22 మండలాలు, కొత్తగూడెం జిల్లాకు 18 మండలాలు రానున్నాయి. ప్రస్తుతం పునర్విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే ఠీఠీఠీ.n్ఛఠీఛీజీట్టటజీఛ్టిటజౌటఝ్చ్టజీౌn.్ట్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో వినతులు ఇవ్వాలని సూచించింది. దీంతో రెండు జిల్లాలకు సంబంధించి మంగళ, బుధవారం 95 వినతులు వచ్చాయి. వీటిలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి 52, రెవెన్యూ డివిజన్లపై 12, మండలాల ఏర్పాటుపై 31 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 35 దరఖాస్తులు రాగా.. వీటిలో జిల్లాకు.. 15, రెవెన్యూ డివిజన్‌కు.. 9, మండలాలకు సంబంధించి వినతులు 11 వచ్చాయి. కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 59 దరఖాస్తులు రాగా.. జిల్లాకు.. 37 దరఖాస్తులు, రెవెన్యూ డివిజన్‌కు.. 3, మండలాలకు సంబంధించి 19 వినతులు వచ్చాయి. కొత్తగూడెం జిల్లాపైనే ఎక్కువగా.. కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వినతులు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి 95 దరఖాస్తులు రాగా.. కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 60 ఉన్నాయి. వీటిలో గార్ల, బయ్యారం మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపాలనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారంను మహబూబాబాద్ జిల్లాలో కలిపితే ఇబ్బందులు ఎదురవుతాయని వినతుల్లో పేర్కొన్నారు. అలాగే.. జిల్లా విభజనకు సంబంధించి చేసిన ప్రతిపాదనల్లో కొత్తగూడెం జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేయాలని నివేదికల్లో పేర్కొన్నారు. ఆళ్లపల్లి, కరకగూడెం, కొత్తగూడెం రూరల్, పాల్వంచ రూరల్ మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిలో ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఈ మండలాల ఏర్పాటు ఊసే లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. అలాగే భద్రాచలం జిల్లా ఏర్పాటు చేయాలని, ఇల్లెందును డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వినతులు వచ్చాయి. ఖమ్మం జిల్లాకు 35 దరఖాస్తులు.. ఖమ్మం జిల్లాకు సంబంధించి 35 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కాకుండా.. ఖమ్మం జిల్లాలో కలపాలని కొందరు వినతులు చేశారు. అలాగే సత్తుపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉందని, దానిని రెవెన్యూ డివిజన్ చేయాలని వినతుల్లో పేర్కొన్నారు. జిల్లా విభజనపై 15, రెవెన్యూ డివిజన్‌పై 9, మండలాల ఏర్పాటుపై 11 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం రూరల్‌లో కూడా మరో మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతులు వెబ్‌సైట్‌కు వచ్చాయి. గార్ల, బయ్యారంపై.. గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపడంపై జిల్లా ప్రజలు విముఖంగా ఉన్నట్లు వినతులను చూస్తే తెలుస్తోంది. ఇల్లెందు నియోజకవర్గంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు ఇతర ప్రాంతాల వారు కూడా గార్ల, బయ్యారంను ఇటు ఖమ్మంలో కానీ, అటు కొత్తగూడెం జిల్లాలో కానీ ఉంచాలని వెబ్సైట్లో పేర్కొంటుండటం విశేషం. ఈ రెండు మండలాలను ఇక్కడే ఉంచుతారో.. లేదంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా మహబూబాబాద్ జిల్లాలోనే ఉంచుతారో నెల రోజుల తర్వాతే తేలనుంది. కాగా.. పలు పార్టీలకు చెందిన నేతలు ఎక్కువగా వినతులు వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేసిన వారిలో ఉన్నారు. -
ప్రారంభమైన హ్యాండ్‌బాల్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న అంతర్‌జిల్లాల సబ్‌జూనియర్స్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రా రంభమయ్యాయి. హన్మకొండలోని జవహర్లాల్ ఇండోర్ స్టేడియంలో అసోసియేషన్ రాష్ట్ర కా ర్యదర్శి శ్యామల పవన్‌కుమార్ అధ్యక్షతన జరి గింది. ఈ సభకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఇందిర హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సభకు హాజరైన అతిథులను శాలువా, మెమోంటో తో సత్కరించారు. కార్యక్రమంలో సీని యర్ కాంగ్రెస్ నాయకుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,వావిలాల సారంగపాణి, రాజలింగం, తోట శ్యాంప్రసాద్, చాగంటి శ్రీనివాస్, మేడిశెట్టి సుధాకర్, గమ్మళ్ళ సురేందర్, సురేష్, ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
‘పచ్చతోరణం’ చిత్రీకరణ ప్రారంభం
ఆదిలాబాద్ రూరల్ : మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్ ఆలయంలో శుక్రవారం మిట్టు రవి దర్శకత్వంలో రూపొందిస్తున్న పచ్చతోరణం లఘుచిత్ర చిత్రీకరణను రాష్ట్ర మంత్రి జోగురామన్న ప్రారంభించారు. అంతకు ముందు ఆలయంలో ఆలయ పూజరి కిషన్‌మహరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహార కార్యక్రమంలో ప్రతీఒక్కరు భాగస్వాములై విజయవంతం చేస్తున్నారన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికి నల్లా కనెక్షన్ అందిస్తామని తెలిపారు. వీరి వెంట జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, సర్పంచ్ ఉష్కం రఘుపతి, మండల అధ్యక్షుడు ఆరే రాజన్న, ప్రధానకార్యదర్శి భరత్, బండారి దేవన్న, తదితరులు ఉన్నారు. -
3న సామూహిక నిరహార దీక్షలు ప్రారంభం
సూర్యాపేట : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద వేలాది ఉపాధ్యాయులతో సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లు పదవీ బాధ్యతలు నిర్వహించే ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్ ఇస్తూ 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగ సేవలు అందించే ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వెంటనే సీఎం స్పందించి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పదో పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, పండిట్, పీఈటి పోస్టుల అప్‌గ్రేడేషన్ చేయాలని, స్పెషల్ టీచర్స్‌కు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి యామా రమేష్, ఎ.బ్రహ్మచారి, తిరుమలేష్, జితేందర్‌రెఇ్డ, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపు ప్రారంభం
మూడెకరాల చెరువు ముంపు ప్రాంత రక్షణకు చర్యలు యుద్ధప్రతిపాదికన నడుస్తున్న పనులు జగిత్యాల రూరల్ : జగిత్యాల మండలం మోతె ఊర చెరువు ప్రవాహం వచ్చే వాగు ఆక్రమణకు గురికాగా మిషన్ కాకతీయ ద్వారా మంజూరైన నిధులతో గోవిందుపల్లి వరకు ఆక్రమణలు తొలగించారు. ప్రస్తుతం సబ్‌కలెక్టర్ ఆదేశాలతో గోవిందుపల్లి నుంచి నర్సింగాపూర్ వరకు పనులు ప్రారంభించారు. వాగుకు సంబంధించిన మూడెకరాల భూమి కబ్జా నుంచి వెలికి తీస్తుండడంతో సుమారు ప్రభుత్వానికి రూ.3 కోట్ల విలువైన భూమి స్వాధీనం కానుంది. మోతె ఊర చెరువుకు మిషన్ కాకతీయ పనుల్లో రూ.36.58 లక్షలు మంజూరయ్యాయి. కానీ మోతె ఊర చెరువుకు వచ్చే వాగును జగిత్యాల పట్టణ సమీపంలో ఉండడంతో కొంతమంది రియల్ ఎస్టేట్æవ్యాపారులు వాగు భూమిని ఆక్రమించుకుని ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించారు. దీంతో ప్రధానంగా చెరువు ప్రవాహం వచ్చే వాగు కబ్జా చేయడంతో మోతె, లక్ష్మీపూర్, జాబితాపూర్, తిప్పన్నపేట, తిమ్మాపూర్, పొలాస గ్రామాల రైతులు సబ్‌కలెక్టర్ శశాంకకు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో సబ్‌కలెక్టర్ గతంలో మంజూరైన నిధులతో చిన్ననీటి పారుదలశాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయించారు. గోవిందుపల్లి వరకు సుమారు మూడున్నర ఎకరాల ఆక్రమణలను తొలగించి వాగును చదును చేశారు. మిగతా గోవిందుపల్లి నుంచి నర్సింగాపూర్ వరకు మిగతా పనులను సబ్‌కలెక్టర్ ఆదేశాలతో తిరిగి ఆదివారం ప్రారంభించారు. దీంతో సుమారు మరో మూడెకరాల ఆక్రమణ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాగును చదును చేస్తున్నారు. దీంతో సుమారు ఇప్పటి వరకు రూ.5 కోట్ల విలువైన భూములను వెలికితీశారు. ఈ పూర్తి స్థాయి ఆక్రమణలను తొలగించి వాగును చదును చేస్తే వాగు నుంచి వచ్చే ప్రవాహంతో మోతె చెరువు, జాబితాపూర్‌లోని రెండు చెరువులు, లక్ష్మీపూర్‌లోని ఊర చెరువు, తిమ్మాపూర్‌లోని ఊర చెరువుకు, తిప్పన్నపేటలోని ముప్పాల చెరువు, పొలాసలోని ఊర చెరువులు పూర్తిస్తాయిలో నిండి రైతులకు వ్యవసాయ సాగుకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఆక్రమణల తొలగింపు ఊపందుకోవడంతో పలుగ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
అంత్యపుష్కరాలు ఆరంభం
రామన్నగూడెంలో ఉత్సవ మూర్తులకు గంగస్నానం మంగపేటలో గోదావరి మాతకు హారతి ఏర్పాట్లను పట్టించుకోని అధికారులు మంగపేటలో సౌకర్యాలు లేక వెనుదిరిగిన భక్తులు ఏటూరునాగారం/మంగపేట : ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, మంగపేట మండల కేంద్రంలో అంత్యపుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రామన్నగూడెంలో ఉదయం 6.15 గంటలకు శ్రీసీతారామ చంద్రస్వామి, ఉమారామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకొచ్చి జలాభిషేకం చేశారు. అనంతరం భక్తుల స్నానాలకు అనుమతి ఇచ్చారు. మహిళలు స్నానాలు ఆచరించి వాయినాలు ఇచ్చుకుని, నదిలో దీపాలు వదిలారు. చిల్లర డబ్బులు, పసుపు, కుంకుమ నదిలో వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు పెట్టారు. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడకుండా గ్రామస్తులే మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు నిర్మించారు. గోదావరి వరకు దారి ఏర్పాటు చేసి, తాగునీటి వసతి కల్పించారు. మంగపేటలోని పుష్కరఘాట్ వద్దకు సుమారు 300 మంది భక్తులు వచ్చినప్పటికీ సౌకర్యాలు లేక అందులో 100 మంది మాత్రమే స్నానం చేశారు. మిగితావారు తిరిగి వెళ్లిపోయారు. పుష్కర స్నానం ఆచరించన వారు పిండప్రదానాలు చేశారు. సాయంత్రం అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరి మాతకు హారతి ఇచ్చారు. ఎంపీడీఓ సురేష్ దంపతులతో పాటు అర్చక సమాఖ్య అధ్యక్షుడు కొయ్యడ నర్సింహమూర్తి, పూజారులు శివరామకృష్ణ, రామసుబ్బారావు, ఎం.వి.వి.సిద్ధాంతి శర్మ, ఎం.వి.ఎల్. కాంతయ్య పాల్గొన్నారు. ఏటూరునాగారం సీఐ రఘుచందర్, మంగపేట ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శివాలయంలో పూజలు.. రామన్నగూడెం ఒడ్డున ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి పంచామృతాభిషేకాలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎగ్గడి కోటేశ్వర్రావు, కోశాధికారి వెనిగళ్ల శివాజీ, ప్రధాన కార్యదర్శి అల్లి శ్రీను, సర్పంచ్ బొల్లె జ్యోతి శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు పద్మ కృష్ణ, ఆలయ పూజారులు పుల్లయ్యచారి, నర్సింహాచారి, ఆడెపు శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బరితెగించిన తెలుగు తమ్ముళ్లు.
-
GST బిల్లుతో మార్కెట్లో జోష్
-
కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం
మంగంపేట (మల్దకల్) : మండలంలోని మంగంపేట స్టేజీ సమీపంలో గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా 108 ప్యాకేజీ కింద చేపట్టిన కాల్వ ఏర్పాటులో భాగంగా ఈ కల్వర్టు నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో కల్వర్టు నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. అదే విధంగా అమరవాయి, నీలిపల్లి, పాలవాయి, కొండపల్లి, రేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు ప్రధాన కాలువ ఇదే కావడంతో నిర్మాణం పనులు పూర్తయితే కాని కాల్వ ద్వారా నీరు వెళ్లే పరిస్థితి లేదని, వెంటనే కల్వర్టు నిర్మాణం పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందే విధంగా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
నేడు రాంగ్ వే షుటింగ్ ప్రారంభం
ఆదిలాబాద్ రిమ్స్ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను దష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘రాంగ్‌వే’ టైటిల్‌తో షార్ట్ ఫిల్మ్ రూపొందించనున్నట్లు ఆల్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయిం సర్కార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలో గురువారం షుటింగ్ ప్రారంభిస్తామని, చుట్టు పక్కల ప్రాంతాల్లో మూడు రోజుల పాటు షుటింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలోని నూతన నటీనటులతో ఈ ఫిల్మ్‌లో అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జీ9 ఫిల్మ్స్ ఆదిలాబాద్ ప్రొడక్షన్ 30 నిమిషాల నిడివిగల ఫిల్మ్ తీసుకున్నామన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మతి చెందిన చిన్నారి రమ్య లాంటి కుటుంబానికి జరిగిన ఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో ఉంటాయన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన సుధీర్‌కుమార్ హీరోగా నటిస్తున్నారని, మిగతా ఆర్టిస్ట్‌లంతా జిల్లాకు చెందిన వారే ఉంటారని తెలిపారు. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాంబాబు ఈ ఫిల్మ్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ రాంబాబు, అసోసియేషన్ నాయకులు లక్ష్మణ్, రెహమాన్, మనోజ్ పాల్గొన్నారు. -
భక్తిపారవశ్యంతో సాయిదీక్షలు
కరీంనగర్‌కల్చరల్ : గురుపౌర్ణమిని పురస్కరించుకుని నగరంలో శ్రీషిర్డీసాయిమాలధారణ దీక్షలను సాయిభక్తులు స్వీకరించారు. శ్రీషిర్డీసాయి భక్తజన మండలి ఆధ్వర్యంలో సాయినాథ్ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 19న గురుపౌర్ణమి సందర్భంగా శ్రీవిజయగణపతి సాయిబాబా ఆలయంలో 24 గంటల పాటు భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీషిర్డీసాయి భక్తజన మండలి అధ్యక్షుడు నలుమాచు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ తెలిపారు.