హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో గ్రామసింహాల బెడదపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం ఉదయం ఎల్బీనగర్ పరిధిలోని సిరినగర్‌లో వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధంగా కుక్కలను బంధించే కార్యక్రమం చేపడతామని చెప్పారు.
నగరంలో ఏడాదికి వెయ్యికిపైగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. కుక్కకాటు బాధితులతో నిత్యం ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రులు రద్దీగా ఉంటున్నాయి. బస్తీల్లో రాత్రి పూట సంచరించేందుకు జనం జంకుతున్నారు. వీటన్నిటితో ‘సాక్షి’ మినీ మొదటిపేజీలో గురువారం కథనం ప్రచురితమైంది.