Hunting
-
ఇన్‌స్టాలో లైక్‌ల కోసం వన్యప్రాణుల వేట
వేంపల్లె: ఇన్‌స్ట్రాగామ్‌లో లైక్‌ల కోసం ఓ యువకుడు పెంపుడు కుక్కలతో వేటకు వెళ్లి అడవిలో జంతువులను చంపి, ఆ వీడియోలను అప్లోడ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని గమనించిన తెలంగాణ జంతు ప్రేమికులు ఆ యువకుడికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. కట్‌చేస్తే వేంపల్లి ఫారెస్ట్ అధికారులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం వడ్డేపల్లెలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలం, వడ్డేపల్లికి చెందిన బత్తల చిరంజీవి పెంపుడు కుక్కలతో సమీపంలోని కొండల్లోకి వెళ్లి, అడవి జంతువులను వేటాడి, వాటిని చంపి, లైకుల కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అతను చేసే వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిని తెలంగాణ జంతు ప్రేమికులు గమనించి, వెంటనే కడప జిల్లా డీఎఫ్‌వో సందీప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వేంపల్లె ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చి అతడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వేంపల్లె ఫారెస్టు అధికారి బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో వెళ్లి బత్తల చిరంజీవిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు. -
పుతిన్ కక్ష సాధింపు..! ప్రత్యర్థి భార్యపై వారెంట్
మాస్కో: అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వేట ఆగలేదు. ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు కొనసాగుతోంది.గతంలో జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని భార్య యులియా నవల్నయాపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయింది. తీవ్రవాదసంస్థలో చేరినందుకుగాను వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.యులియాను రెండు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అనుమతిచ్చినట్లు మాస్కోలోని బాస్మన్నే కోర్టు వెల్లడించింది. తనపై వారెంట్ జారీ అవడం పట్ల యులియా తీవ్రంగా స్పందించారు. పుతిన్ ఒక హంతకుడు, వార్ క్రిమినల్, జైలులో ఉండాల్సిన వాడని మండిపడ్డారు. యులియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు ఆమె సిబ్బంది ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించారు.యులియా భర్త, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతిపై అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. నవాల్ని మృతి చెందిన తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకువెళతానని భార్య యులియా ప్రతిజ్ఞ చేశారు. -
సముద్రంలో తిరగబడిన బోటు
వేటపాలెం: బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, పొట్టిసుబ్బయ్యపాలెం మత్స్యకారులకు సంబంధించిన బోటు సముద్రంలో సోమవారం రాత్రి బోల్తాకొట్టింది. అందులో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన కొండూరు రాములు, పెద్ద కుమారుడు కొండూరు గోవిందు, చిన్నకుమారుడు చిట్టిబాబు, కఠారివారిపాలేనికి చెందిన కఠారి శ్రీను నలుగురు కలిసి సోమవారం సాయంకాలం బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో వేట సాగించేటప్పుడు అలల తాకిడికి బోటులోకి సముద్రం నీరు పెద్ద మొత్తంలో చేరుకొని తిరగబడింది. అందులో ఉన్న నలుగురు సముద్రం నీటిలో పడిపోయారు. వీరి పై వేట సాగించే వల పడింది. నలుగురు సముద్రం నీటిలోపలకు వెళ్లి వలను తప్పించుకొని ఈతకొట్టుకొంటూ తిరగబడిన బోటు పై భాగానికి ఎక్కి కూర్చున్నారు. వీరి వద్ద ఉన్న సెల్ఫోన్లు నీటిలో పడిపోవడంతో సమాచారం ఇవ్వడానికి వీలు పడలేదు. ఆరు గంటల పాటు తిరగబడిన బోటు పైనే కూర్చున్నారు. చిన్నగంజాం మండలం, చిన్నంగారివారిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం తెల్లవారుజామున వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన బోటు పై భాగంలో కూర్చొని ఉన్న నలుగురిని గమనించారు. వెంటనే వారిని తమ బోటులో ఎక్కించుకొని తెల్లవారుజామున 5 గంటలకు పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రం నీటిలోనే ఉండిపోయామని మత్స్యకారులు తెలిపారు. వల, బోటు, ఇంజన్లు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రూ.6.50 లక్షలు నష్ట పోయామని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్‌కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్‌కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
వజ్రాల వేటకు వచ్చి వ్యక్తి మృతి
నందిగామ(చందర్లపాడు): పొరుగు రాష్ట్రం నుంచి వజ్రాల వేట కోసం వచ్చి ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో చోటుచేసుకుంది. చందర్లపాడు ఎస్ఐ రామకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్‌కు చెందిన ఇస్రం రాంబాబు (40) ఆటో డ్రైవర్‌గా పని చేస్తాడు. చందర్లపాడు మండలం గుడిమెట్ల అటవీ ప్రాంతంలో కొంతకాలంగా వజ్రాల వేట పేట కొనసాగుతున్న సంగతి పాఠకులకు విదితమే. ఈ క్రమంలో రాంబాబు కూడా వజ్రాలు అన్వేషించేందుకు గత మూడు రోజుల క్రితం గుడిమెట్ల వచ్చాడు. బుధవారం వజ్రాల వేటకు వచ్చిన కొందరు రాంబాబు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో చందర్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడంతోపాటు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.వజ్రాల వేటకు వచ్చిన వ్యక్తి హత్యకు గురయ్యాడా? లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల మృతి చెందాడా అనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సౌర పడవలతో చేపలవేట
సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది. మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్‌కు ఉండే సిగ్నల్స్‌పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్‌తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్‌తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్‌తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్‌కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
వేట మొదలెట్టిన టైగర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడంటే
-
ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట
పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం వేట ముమ్మరం చేసింది. డ్రోన్లు, జాగిలాలతోపాటు హెలికాప్టర్‌తో గాలింపు కొనసాగిస్తోంది. బాటా–డోరియా అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. గాలింపు చర్యలను సైనిక, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది. గురువారం ముష్కరుల దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన ఐదుగురు చనిపోవడంతోపాటు మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల మృతదేహాలకు ఉన్నతాధికారులు శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను పటిష్టం చేశారు. ముష్కరుల దుశ్చర్యను ఖండిస్తూ బీజేపీ, వీహెచ్‌పీ, రాష్ట్రీయ బజరంగ్ దళ్, శివసన, డోగ్రా ఫ్రంట్, జమ్మూ స్టేట్హుడ్ ఆర్గజనైజేషన్ జమ్మూలో భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. -
వేటకు వేళాయె..రా!
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: విస్తారమైన సముద్ర తీరం.. అపారమైన మత్స్యసంపద.. వేటలో సిద్ధహస్తులైన మత్స్యకారులకు కోనసీమ సముద్ర తీరం మత్స్య సంపదకు అక్షయపాత్రే. అందుకే స్థానిక మత్స్యకారులతోపాటు వేటలో నిష్ణాతులైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన అనేకమంది మత్స్యకారులు కుటుంబాలతో ఇక్కడకు వలస వచ్చి వేటను సాగిస్తుంటారు. ఏటా ఎనిమిది నెలల పాటు ఇక్కడి తీరంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పలు మత్స్యకార గ్రామాలున్నాయి. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద సముద్రతీరం గట్టు మీద పదుల సంఖ్యలో గుడిసెలతో చిన్నచిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఇవి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన గ్రామాలు కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిసర ప్రాంతాల నుంచి వేట కోసం ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారుల ఆవాసాలు. ఒక విధంగా ఇవి ‘వలస’ గ్రామాల కింద లెక్క. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం. వినాయక చవితి తరువాత మత్స్యకారులు నక్కపల్లి నుంచి నేరుగా బోట్ల మీద తాము నివాసముండే ప్రాంతాలకు కుటుంబాలతో సహా వస్తారు. అప్పటి నుంచి మేలో సముద్ర వేట నిషేధం విధించే వరకు ఎనిమిది నెలలపాటు ఇక్కడే నివాసముంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సముద్ర వేటకు వెళ్లడం.. శనివారం వేటకు సెలవు పెట్టి స్థానికంగా మార్కెట్ పనులు చూసుకోవడం వీరి దినచర్య. గడిచిన 25 ఏళ్లుగా మత్స్యకారులు ఇక్కడకు వలస వస్తుండడం గమనార్హం. కోనసీమకు ఎందుకు వలస అంటే.. గోదావరి నదీపాయలతోపాటు ప్రధాన మురుగునీటి కాలువలు మొగల ద్వారా సముద్రంలో కలుస్తాయి. సముద్ర ఉప్పునీటిలో మొగల ద్వారా చప్పనీరు వివిధ మార్గాల ద్వారా పెద్దఎత్తున చేరడంవల్ల ఈ తీరంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుంది. నక్కపల్లి తీరం కన్నా కోనసీమ తీరంలోనే మత్స్య సంపద అధికంగా దొరుకుతుందని వీరు చెబుతుంటారు. పండుగప్ప, చందువా, కొయ్యింగ, బొమ్మిడి చుక్క, గులిగింత, మడ పీత, చుక్కపీత, టైగర్ రొయ్యలు, జెల్లలు, ఇసుక దొందులు, టేకు చేపలతోపాటు అత్యంత ఖరీదైన ‘కచ్చిడి చేప’లు కూడా దొరుకుతాయి. కచ్చిడి చేప ఖరీదు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటోంది. స్థానిక మత్స్యకారుల ఎదురు పెట్టుబడి వలస మత్స్యకారులకు స్థానిక మత్స్యకార వ్యాపారులు ఎదురు పెట్టుబడి పెడతారు. సీజన్‌లోని ఎనిమిది నెలలకు గాను బోటుకు వచ్చి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తారు. వలస మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం ఈ వ్యాపారులు తిరిగి తీసుకుంటారు. తెల్లవారుజాము నుంచే వేట.. నిజానికి.. ఈ మత్స్యకారులు తెల్లవారుజామునే బృందాలుగా బోటు మీద వేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట, రెండు మధ్య వేట నుంచి తిరిగి వస్తారు. మత్స్య సంపదకు తీరాన్ని ఆనుకునే వేలం నిర్వహిస్తారు. గులిగింత, ఎర్ర గులిగింత, కచిడి, కూనాలు, పండుగప్ప, చందువాలు ఇటు చెన్నై, అటు కోల్‌కతా, హైదరాబాద్ మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిపోయిన చేపలను మత్స్యకార మహిళలు ఎండబెట్టి ఎండుచేపలుగా తయారుచేస్తారు. వేటకు వెళ్లే బోటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విలువ చేసే మత్స్య సంపద వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా.. మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యంవల్ల కొన్నేళ్లుగా వేట గిట్టుబాటు కావడంలేదు. ఇక్కడ మాకు వేటకు వెళ్లడానికి పడవలు గట్టుపై పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మత్స్య సంపద మా ప్రాంతంలో కన్నా ఇక్కడ ఎక్కువ. – దోని చిన్నా, వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మత్స్య సంపద ఎక్కువ ఈ జిల్లాలో గోదావరి పాయలు ఎక్కువ. చప్పనీరు, ఉప్పునీరు కలిసే చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. మా ప్రాంతం కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం వస్తోంది. 8 నెలలు ఇక్కడే ఉంటాం. – సోడిపల్లి అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మేం పెట్టుబడి పెడతాం నాకు సొంతంగా రెండు బోట్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నుండి వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తున్న మత్స్యకారులకు మేం పెట్టుబడి పెడతాం. వేటలో వచ్చే ఆదాయంలో 10% మాకు ఇవ్వాలి. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. – బొమ్మిడి రాంబాబు, వ్యాపారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
గుడ్‌న్యూస్: క్విక్ హీల్ న్యూ వెర్షన్ 23 లాంచ్
పుణె: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందించే ‘క్విక్ హీల్’ మాల్వేర్ను గుర్తించే ‘వెర్షన్ 23’ని విడుదల చేసింది. వ్యవస్థలపై సైబర్ దాడులను గుర్తించడమే కాకుండా, ముప్పు తీవ్రతను అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. లోతైన విశ్లేషణ టూల్స్‌తో దాడులను నిరోధిస్తుందని వెల్లడించింది. దీనివల్ల సైబర్ దాడుల ముప్పును గుర్తించే సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ర్యామ్‌సమ్‌వేర్ నుంచి రక్షణ, ఎప్పటికప్పుడు ఇంజన్ స్కానింగ్, యాంటీ ట్రాకర్, బ్రీచ్ అలర్ట్ తదితర ఫీచర్లతో ఈ నూతన టెక్నాలజీ పనిచేస్తుందని తెలిపింది. ‘‘కరోనా సంక్షోభం తర్వాత సైబర్ దాడులు అసాధారణ స్థాయిలో పెరిగాయి. ఈ దాడులు ఎంతో అత్యాధునికంగా ఉంటున్నాయి. కనుక వీటిని సాధారణ యాంటీ వైరస్లు గుర్తించలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెర్షన్ 23ని రూపొందించాం’’అని క్విక్ హీల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజయ్ కట్కర్ తెలిపారు. -
పులినే ఒక ఆట ఆడుకున్న కోతి.. వీడియో వైరల్
పెద్ద పులి కనిపిస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. కానీ, ఓ కోతి మాత్రం నువ్ పులి అయితే.. నాకేంటి ఇది నా అడ్డా చూసుకుందాం రా.. అన్న విధంగా ప్రవర్తించింది. తన కోతి చేష్టలతో పులినే ఒక ఆట ఆడుకుంది. వానరాన్ని వేటాడేందుకు పులి ప్రయత్నించి చెట్టుపై నుంచి పడిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. చెట్టుపై ఉన్న ఓ కోతిని వేటాండెందుకు పులి ప్రయత్నించింది. చిటారు కొమ్మన ఉన్న వానరాన్ని పట్టుకునేందుకు పులి సైతం చెట్టుపైకి ఎక్కింది. కొమ్మలపై అటూ ఇటూ అలవోకగా దూకటం కోతులకు పుట్టుకతో వచ్చే విద్య. అదే నైపుణ్యంతో పులిని ఆటాడుకుంది కోతి. చేతికి అందినట్లు అంది మరో కొమ్మపైకి దూకుతూ పులికి ముచ్చెమటలు పట్టించింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 74 వేల మంది వీక్షించారు. 8,300 లైకులు వచ్చాయి. हालात का ‘शिकार’ pic.twitter.com/myHtQ3qw5s — Awanish Sharan (@AwanishSharan) March 3, 2022 ఇదీ చదవండి: జీవితాంతం చదువుకుంటూ వృద్ధుడిగా మారిపోతా.. పిల్లాడి మాటలకు నెటిజన్లు ఫిదా -
అప్పట్లో .. చీతాలు వేటకుక్కల్లా..
మన దేశంలో 70 ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. వాటిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తెచ్చి కునో నేషనల్ పార్క్‌లో వదిలింది. దీనితో దేశవ్యాప్తంగా ఈ చీతాలు ఏమిటి, వాటి బలం, వేగం ఏమిటన్నదానిపై పెద్ద చర్చే జరుగుతోంది. కానీ అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు మన దేశంలో చీతాలను పెంపుడు వేటకుక్కల్లా వినియోగించేవారు. ఇళ్ల వద్ద మేకలు, గొర్రెల్లా కట్టేసుకునేవారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కాస్వాన్ దీనికి సంబంధించి 1939 నాటి ‘వైల్డర్నెస్ ఫిల్మస్ ఇండియా లిమిటెడ్’ తీసిన వీడియోలు, ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. మిగతావి అంతరించక ముందే స్పందించాలి చీతాలను వేటకుక్కల్లా వాడుకోవడంతోపాటు.. అడవుల్లోని చీతాలను సరదాకు వేటాడేవారని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ వివరించారు. పెంపుడు చీతాల సాయంతో ‘హంటింగ్ పార్టీ’లను నిర్వహించేవారని.. ఇలాంటివన్నీ కలిసి చీతాలు అంతరించిపోవడానికి కారణమైందని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని రకాల జంతువులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయని.. వాటి సంరక్షణపై దృష్టిపెట్టకుంటే చీతాల తరహాలో వాటిని కూడా ఫొటోల్లోనే చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పెంపుడు కుక్కల్లా పెంచుకుని.. అప్పట్లో అడవుల్లోంచి చీతాలను పట్టుకుని వచ్చి పెంపుడు కుక్కల్లా పెంచుకునేవారు. వాటిని ఇంటి ముందు కట్టేసేవారు. జింకలు, దుప్పులను వేటాడటానికి చీతాలను వినియోగించేవారు. ఆ చీతాల కళ్లకు గంతలు కట్టి ఎడ్ల బండ్లపై జింకలు, దుప్పులు ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అక్కడ కళ్లగంతలు విప్పి వదిలేసేవారు. చీతాలు వేగంగా పరుగెత్తి జింకలు, దుప్పులను వేటాడేవి. అప్పుడు వాటి యజమానులు వెళ్లి.. ఆ జింకలు, దుప్పులను చంపి మాంసం తెచ్చుకునేవారు. ఈ సమయంలో ఆ జంతువుల రక్తాన్ని, కొంత మాంసాన్ని చీతాలకు పెట్టేవారు. ఈ దృశ్యాలన్నీ కూడా వైల్డర్నెస్ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. ►సాధారణంగా చీతాలు ప్రశాంతంగా ఉంటాయి. అనవసరంగా దాడి చేయవు. అందుకే మనుషులు వాటిని సులువుగా పెంచుకోగలిగారని నిపుణులు చెబుతున్నారు. ►బ్రిటన్‌కు చెందిన మరియన్ నార్త్ అనే బయాలజిస్ట్, ఆర్టిస్ట్ 1878లో విడుదల చేసిన పుస్తకంలోని ఒక పెయింటింగ్‌ను కూడా పర్వీన్ పోస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఇళ్ల ముందు పెంపుడు కుక్కల్లా చీతాలను కట్టేసిన చిత్రం అది. ►1921–22 సమయంలో బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాజస్థాన్‌లో జింకలను వేటడానికి పెంపుడు చీతాలతో వెళ్తున్నప్పటి ఫొటోను, 1947లో ఛత్తీస్‌గఢ్‌లో కింగ్ ఆఫ్ కొరియా మూడు చీతాలను వేటాడి చంపిన ఫొటోను పర్వీన్ షేర్ చేశారు. ►ఒక్క చీతాలు అనే కాదు.. పులులు, సింహాలు, చిరుతç³#లులు, అడవి ఏనుగులు వంటి జంతువులను కూడా నాటి రాజులు, బ్రిటిషర్లు సరదా కోసం, గొప్పగా చూపుకోవడం కోసం వేటాడేవారు. ►952లో భారత ప్రభుత్వం మన దేశంలో ఆసియన్ చీతాలు అంతరించిపోయినట్టు అధికారికంగా ప్రకటించింది. ►అసలు మన దేశంలో తొలుత వన్యప్రాణి సంరక్షణ చట్టం లేదు. 1972లో తొలిసారిగా ‘వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరిట చట్టాన్ని తెచ్చారు. వేగం ఎక్కువ.. దూరం తక్కువ చీతాలు గంటలకు వంద కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. కేవలం మూడు సెకన్లలోనే అంత వేగాన్ని అందుకుంటాయి కూడా. కాకపోతే 30, 40 సెకన్లకు మించి ఆ వేగాన్ని కొనసాగించలేవు. అందుకే వేచి చూసి వేటకు దిగుతాయి. 30, 40 సెకన్లలో జంతువును చంపలేకపోతే వదిలేస్తాయి. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి. సీనియర్ జర్నలిస్టు సంజయ్ తాను రాసిన పుస్తకంలో చీతాలకు సంబంధించి ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కేవలం సెకన్లలోనే సూపర్ స్పీడ్ అందుకునేలా, వేగంగా మలుపు తిరిగేలా చీతాల శరీర నిర్మాణం ఉంటుంది. చీతాల కళ్ల నుంచి నోటి వరకు ఉండే నల్లని చార సౌర కాంతి రిఫ్లెక్షన్ నుంచి కాపాడుతుందని.. దీనితో వాటి కళ్లు దూరంలో ఉన్న జంతువులను సైతం స్పష్టంగా చూడగలవని నిపుణులు చెబుతుంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. పులులు, సింహాలు, చిరుతల తరహాలో చీతాలు గర్జించవు. పిల్లుల్లా ధ్వనులు చేస్తాయి. ఎప్పుడైనా ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే గుర్రుమని శబ్దం చేస్తాయి. చీతాల సగటు జీవితకాలం పన్నెండేళ్లు. జూలలో మాత్రం 20 ఏళ్ల వరకు బతికే అవకాశం ఉంది. అయితే చీతాల పిల్లల్లో మరణాల శాతం ఎక్కువ. పదింటిలో ఒకటే బతికి పెద్దది అవుతుంది. అందుకే వాటి జాతి వేగంగా పెరిగే అవకాశాలు తక్కువ. -
కొండచిలువతో పోట్లాడుతున్న కంగారు: వీడియో వైరల్
ప్రకృతి నియమం ప్రకారం ప్రతి జీవి ఏదో ఒకదానికి ఆహారమవుతుంది. ఆ తరుణంలో కొన్ని జంతువులు క్రూరంగా వేటాడటాన్ని చూస్తే చాలం భయానకంగా ఉంటుంది. ఆ క్రూర జంతువులు నుంచి ఈ జంతువు తప్పించుకుంటే బావుండును అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి జుగుప్సకరమైన సంఘటన ఈ వైరల్ వీడియోలో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక కంగారును కొండచిలువ గట్టిగా చుట్టి చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇంతలో మరో కంగారు జంప్ చేసుకుని వచ్చి మరీ తన స్నేహితుడిని విడిపించేందకు శతవిధాల యత్నిస్తుంటుంది. కానీ మరోవైపు కొండ చిలువ ఏదో విధంగా చంపి తినేందుకు చూస్తుంటుంది. కానీ కంగారు మాత్రం తనకు చేతనైనంత మేర ఆ కొండచిలువను రకరకాలుగా కొరుకుతూ తన స్నేహితుడుని విడిపించేందుకు ప్రయత్నించడం చూస్తేంటే ఒక విధమైన భావన కలుగుతుంది. కొండచిలువకు చిక్కిన ఆ కంగారు బతికితే బావుండును అనిపిస్తుంది. View this post on Instagram A post shared by Wildlifeanimall (@wildlifeanimall) -
పులి తీయించుకున్న ఫస్ట్ ఫొటో.. స్పెషల్ ఏంటో తెలుసా?
అడవుల్లో వేటాడుతున్న పులి చిత్రాలు మనం చాలా చూసి ఉంటాం.. ఇది కూడా అలాంటిదే అనుకోవద్దు. దీనికో ప్రత్యేకత ఉంది. ఇది మన దేశంలోని అడవుల్లో పులి వేటాడుతుండగా తీసిన తొలి చిత్రం. ఈ ఫొటోను అప్పటి ఐఎఫ్ఎస్ అధికారి ఫ్రెడ్రిక్ వాల్టర్ చాంపియన్ తీశారు. 1925లో ఆయన తీసిన ఈ ఫొటో ‘ది ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రిక మొదటి పేజీలో ప్రచురితమైంది. ఈ విషయాన్ని నార్వేకు చెందిన మాజీ రాయబారి ఎరిక్ సొహైమ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఫ్రెడ్రిక్ 1947 వరకూ బ్రిటిష్ సైన్యంలో ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారిగా పనిచేశారు. వన్యప్రాణులను వేటాడకుండా.. తన తోటి అధికారులకు భిన్నంగా వాటిని తన కెమెరాలో బంధించడంపై ఆసక్తి చూపేవారు. పులులను సహజసిద్ధమైన అటవీ వాతావరణంలో ఉండగా ఫొటో తీయాలన్నది ఫ్రెడ్రిక్ కల.. ఎనిమిదేళ్ల ప్రయాస అనంతరం ఆయన ట్రిప్–వైర్ ఫొటోగ్రఫీ ద్వారా తాను అనుకున్నది సాధించారు. ట్రిప్ వైర్ ఫొటోగ్రఫీ అంటే.. కెమెరాకు తగిలించిన వైరును జంతువులు తిరుగాడే ప్రాంతాల్లో ఉంచుతారు. వాటి కాలు తగలగానే.. వైర్ లాగినట్లు అయి.. ఫొటో క్లిక్‌మంటుంది. అదే టెక్నిక్ తర్వాతి కాలంలో మరింత అభివృద్ధి చెంది.. కెమెరా ట్రాప్ ఫొటోగ్రఫీగా మారింది. ప్రస్తుతం పులుల గణనకు, పరిశీలనకు దీన్నే ప్రామాణికంగా వాడుతున్నారు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
లైవ్‌లో పులి వేట: నోట మాట రాక కెవ్వు కేక!
ఇంతవరకు మనం పులి జంతువులను వేటాడటం వంటి సన్నివేశాలు డిస్కవరి ఛానెల్స్‌లోనే చూసి ఉంటాం. నిజానికి ఎవ్వరూ నేరుగా చూసేంత ధైర్యం చేయం. కానీ రాజస్థాన్‌లో సరదాగా నేషనల్ పార్క్‌కి వెళ్లిన పర్యటకుల మాత్రం పులి దాడి ఎలా ఉంటుందో చూసి దెబ్బకు బిత్తరపోయి చూస్తుండిపోయారు. (చదవండి: పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్లో ‘హలో వరల్డ్’ ట్వీట్! ఎలాగంటే..) అసలు విషయంలోకెళ్లితే....రాజస్తాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కులో పర్యాటకులు సఫారి వాహనాల్లో పర్యటించారు. అయితే అనుకోకుండా ఇంతలో అక్కడకి ఒక వీది కుక్క ఆ వాహనాల గుండా సంచరించింది. ఇంతలో మొదటి సఫారి వాహనం నుంచి రెండో సఫారి వాహనం వద్దకు వస్తున్న కుక్కపై ఉన్నట్టుండి ఒక పులి ఒక్క ఊదుటున దాడి చేసి పొదల మాటుకి తీసుకుపోయింది. దీంతో అక్కడ ఉన్న పర్యాటకులంతా భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అనీష్ అంధేరియా ట్విట్టర్ పోస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో "పులి కుక్కపై దాడి చేసి చంపడం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కుక్కల ద్వారా డిస్టెంపర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పులులకు సంక్రమించే అవకాశం ఉంది. దీంతో పులుల జనాభా తగ్గుతుంది. వన్యప్రాణుల మనుగడకు ఈ కుక్కలు ముప్పుగా మారాయి అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) Tiger kills dog inside R'bhore. In doing so it is exposing itself to deadly diseases such as canine distemper that can decimate a tiger population in no time. Dogs have emerged as a big threat to wildlife. Their presence inside sanctuaries needs to be controlled @ParveenKaswan pic.twitter.com/t7qDR1MvNl — Anish Andheria (@anishandheria) December 27, 2021 -
మధ్యప్రదేశ్‌లో రణదీప్ పులి వేట: వైరల్ వీడియో
ఇంతవరకు మనం చాలా వైరల్ వీడియోలు చూశాం. టూరిస్ట్‌లపై దాడిచేసిన పులలకు సంబంధించిన వీడియోలు. టూరిస్ట్ బండి గుంతలో పడిపోతే తీసిన వీడియోలను చూశాం. కానీ వీటన్నింటికి భిన్నంగా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వయంగా వీడియో తీసిన పులి వేటాడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!) అసలు విషయంలోకెళ్లితే...బాలివుడ్ నటుడు రణదీప్ కపూర్ మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో పులి ఆవుని వేటాడుతున్న వీడియోని చిత్రీకరించాడు. డిస్కవరీ ఛానెల్స్‌లో పులి వేటాడుతున్న దృశ్యాలు చూసినప్పుడే శరీరం గగ్గురపాటుకి గురవుతుంది. అలాంటిది ప్రత్యక్ష్యగా రణదీప్ చూడటమే కాక వీడియో తీశాడు. అంతేకాదు ఆ వీడియోకి "ఇది నా పులి వేట" అనే క్యాప్షన్ జోడించి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఐఎఫఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ పులి ఆవుని పట్టుకోవడంతో విజయవంతమైందా అంటూ ట్వీట్ చేశారు. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: భారత్‌లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...) My first tiger hunt .. #SatpuraTigerReserve pic.twitter.com/J9iWp9vRlC — Randeep Hooda (@RandeepHooda) December 19, 2021 -
African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!!
ఓటింగ్, మెజారిటీ, ప్రజాస్వామ్యం.. ఇవన్నీ మనషులకు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఈ పద్ధతిని ఆఫ్రిక అడవుల్లోని శునకాలూ పాటిస్తుంటాయి. మద్దతు, ఏకాభిప్రాయం గురించి మాట్లాడుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ అది నిజం. తుమ్ములతో ఏకాభిప్రాయానికి వచ్చి, శునకస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాయి. తుమ్ములే వీటి భాష. వేటకు వెళ్లే ముందు అవన్నీ సమావేశమవుతాయి. అందులో పది కుక్కలు తుమ్మితే చాలు, అన్నీ మూకుమ్మడిగా వేట ప్రారంభిస్తాయి. అయితే అన్ని కుక్కల తుమ్ములకు ఒకే ప్రాధాన్యం ఉండదు. నాయకత్వం వహించే కుక్కలు తక్కువ సార్లు తుమ్మినా వేట ప్రారంభించాల్సిందే. సమావేశంలో కనీస హాజరు(కోరం) ఉండేలా చూసుకుంటాయట. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైన విషయాలు అవి. చదవండి: World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే! -
కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం వేట
-
బడా స్మగ్లర్ కోసం వేట.. ‘ఆపరేషన్ మాణిక్యం’ ప్రారంభం
తమిళనాడుకు చెందిన ఇతను ఎలా ఉంటాడో తెలియదు.. కనీసం ఇప్పటి వరకు సరైన ఆనవాళ్లు కూడా లేవు. అయితే పోలీసులు వారం కిందట మాణిక్యం ఇద్దరు కొడుకులతో పాటు జిల్లాలో అతని ముఖ్య అనుచరుడు, టీడీపీ నేతల దన్ను దండిగా ఉన్న నాయుడును వల వేసి పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు టార్గెట్ మాణిక్యం ఆపరేషన్‌ను పోలీసులు వేగవంతం చేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రెండుమూడేళ్ల కిందట అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైన పోలీసులు ఇప్పుడు రూటుమార్చారు. దుంగలతోపాటు ఎర్రచందనం దొంగలను కూడా పట్టుకుని స్మగ్లర్ల గుండెల్లో నిద్రపోతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టి స్మగ్లర్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్ తమిళనాడుకు చెందిన మాణిక్యం ఇద్దరు కుమారులతో పాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన దేవానంద నాయుడును అరెస్టు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లికి చెందిన నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సన్నిహితుడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. దాదాపు పదేళ్ల కిందట ఎర్రచందనం అక్రమ రవాణాలోకి అడుగుపెట్టిన నాయుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరేగిపోయాడు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలతో అంచెలంచెలుగా ఎదిగి.. స్మగ్లింగ్‌లో ఆరితేరాడు. ప్రధాన స్మగ్లర్ మాణిక్యంకు ముఖ్యమైన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ముఠాలో ఆ నలుగురే కీలకం శేషాచలం అటవీ ప్రాంతంలోని విలువైన ఎర్ర బంగారం కోసం స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తిష్ట వేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన మాణిక్యం అక్కడి నుంచి రూటు మార్చి శేషాచలంలోని ఎర్రచందనంపై కన్నేశాడు. ఇందుకు అవసరమైన బ్యాచ్‌ని సిద్ధం చేసుకున్నాడు. ఆ బ్యాచ్‌లో రాజకీయ పలుకుబడి, ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్న వారిని ఎంచుకున్నాడు. వీరిలో ప్రముఖమైన వ్యక్తి ఐతేపల్లి వాసి దేవానంద నాయుడు. ఇతనితో పాటు తన ఇద్దరు కుమారులు ఎం.మనోజ్‌కుమార్, ఎం.అశోక్‌కుమార్‌ను ఆ ముఠాలో చేరి్పంచాడు. మొత్తంగా ఈ నలుగురు ముఠా సభ్యులను లీడ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. శేషాచలంలో నాణ్యమైన ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి.. అనేది నాయుడు స్కెచ్ గీస్తాడు. ఇక మాణిక్యం కొడుకులు ముఠాతో కలిసి ఆ ఎర్రచందనం చెట్లను నరకడం, తర్వాత వాటిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత వాటిని తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తారు. చెట్లు నరికేందుకు అడవిలో ఉన్న కూలీలకు నిత్యావసర సరుకుల సరఫరా పని కూడా చేస్తారు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా ఓ పథకం ప్రకారం ఆ నలుగురూ చేస్తూ వస్తున్నారు. ముగ్గురు చిక్కారు కరోనా లాక్డౌన్ సమయంలో అడవిలోకి చొరబడిన స్మగ్లర్లు భారీగా ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను సిద్ధం చేశారు. వాటిని తరలించే వరకు అడవిలోని పలు ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. వారం రోజుల కిందట వాటిని బయటకు తీసి చెన్నైకి తరలిస్తుండగా జిల్లా పోలీసులు కాపుకాచి తమిళనాడులోని వేలూరు సమీపంలో పట్టుకున్నారు. కంటైనర్‌తో పాటు ఐతేపల్లికి చెందిన నాయుడు, మాణిక్యం ఇద్దరు కుమారులు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఇక కంటైనర్‌లో ఉన్న ఎర్రచందనం దుంగలన్నీ నాణ్యమైనవే అని పోలీసులు తేల్చారు. పోలీసులు స్వా«దీనం చేసు కున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు పట్టుబడిన వారి నుంచి సమాచారం తీసుకున్న పోలీసులు మాణిక్యం వేటలో ఉన్నట్టు సమాచారం. -
ఉసురుతీసిన ఉడుముల వేట
డోర్నకల్: ఉడుములు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారానికి చెందిన జక్కుల వెంకన్న సోమవారం ఉదయం ఉడుములు పట్టేందుకు ఖమ్మం రూరల్ మండలం పొడిశెట్టిగూడెం గ్రామ పరిధిలోని గుట్టపైకి వెళ్లాడు. ద్విచక్ర వాహనం, రెండు పెంపుడు కుక్కలతో వెళ్లిన ఆయన.. మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పొడిశెట్టిగూడెం సమీపంలోని గుట్ట సమీపంలో ద్విచక్రవాహనం నిలిపి ఉండటం, సమీపంలో కుక్కలు కనిపించడంతో గుట్టపైకి వెళ్లి వెతకగా.. రెండు బండరాళ్ల మధ్య వెంకన్న మృతదేహం కనిపించింది. ప్రొక్లయినర్‌తో భారీ బండరాయిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం..) -
జొన్న గిరి లో వజ్రాల వేట
-
భార్యకు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఓ ప్రాణం
కేప్‌టౌన్ : ఎదుటి వ్యక్తి మీదున్న ప్రేమను తెలియజేయటానికి కానుకలు ఇవ్వటం పరిపాటి. వాలెంటైన్స్ డే రోజున ఇష్టమైన వారికోసం ఏమివ్వాలా అని ఆలోచించి.. వారికిష్టమైనదేదో తెలుసుకుని దాన్ని బహుమతిగా ఇస్తుంటారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ భర్త కూడా అలానే చేశాడు. ఓ జంతువు ప్రాణాన్ని ఆమెకు కానుకగా ఇచ్చాడు. దాన్ని వేటాడి చంపే అవకాశాన్ని కలిగించాడు. వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆఫ్రికా, లిమ్పోపో ప్రావిన్స్‌కు చెందిన మెరెలిజె వాన్ డెర్ మెర్వే(32)కు జంతువులను వేటాడ్డం అంటే మహా సరదా. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటినుంచి వేటాడుతోంది. ఓ బలిష్టమైన నల్ల జిరాఫీని చంపాలని 2016నుంచి అనుకుంటోంది. 2017లో అవకాశం చేతి వరకు వచ్చి జారిపోయింది. అప్పటినుంచి వెయ్యి కళ్లతో జిరాఫీకోసం వెతకసాగింది. రెండు వారాల క్రితం ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి జిరాఫీ ఆచూకీ చెప్పాడు. ( వైరల్: మీరు ఊహించని టైటానిక్ మరో క్లైమాక్స్) వేటాడిన జిరాఫీతో మెరెలిజె వాన్ డెర్ మెర్వే దీంతో తన కోరిక గురించి భర్త గెర్హర్డెన్ట్ నెల్కు వివరించింది. వాలెంటైన్స్ డే రోజు భార్యను సన్ సిటీలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళదామనుకున్న అతడు.. తన ప్లాన్‌ను రద్దు చేసుకున్నాడు. అందుకు బదులు జిరాఫీని చంపటానికి భార్యకు అవసరమైన డబ్బులు ఇచ్చాడు. మెరెలిజె వాన్ డెర్ మెర్వే జిరాఫీ ఉంటున్న అడవిలోకి వెళ్లి దాన్ని వేటాడి చంపింది. దాని గుండెను బయటకు తీసిన తర్వాత చేతుల్తో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. -
తొలకరి వర్షాలతో గ్రామాల్లో వజ్రాల వేట..
కర్నూలు, తుగ్గలి: అదృష్టం వజ్రమైతే కష్టాలు తీరిపోవడమే కాకుండా క్షణాల్లో లక్షాధికారి కావచ్చు. చేయాల్సిందల్లా నేలకేసి తీక్షణంగా చూస్తూ వెళ్లాలి అంతే. మెరుగు రాయి కంటపడితే చేతిలోకి తీసుకుని పరీక్షగా చూడాలి. పది మందికి చూపించాలి. వజ్రమని రూఢీ అయితే వ్యాపారే సంప్రదిస్తారు. వజ్రం జాతి, రంగు చూసి కారెట్ల రూపంలో లెక్కించి కొనుగోలు చేస్తారు. రహస్యంగా, టెండర్ పద్ధతినవ్యాపారులు వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. (రైతుకు చిక్కిన రూ.కోటి వజ్రం..) తొలకరి వర్షాలకు జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, జీ.ఎర్రగుడి,బొల్లవాని పల్లి, చెన్నంపల్లి, పీ.కొత్తూరు, చిన్న జొన్నగిరి, రాంపురం, ఉప్పర్లపల్లి తదితర గ్రామాల్లో వజ్రాల వేట మొదలైంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉదయాన్నే పొలాల్లో వాలిపోతున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉదయం, సాయంత్రం ఎర్ర నేలల్లో తిరుగుతూ వజ్రాన్వేషణ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.2లక్షల విలువైన రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు లభ్యమవుతుంటాయి. వజ్రాన్వేషణ కోసం ఏటా ఇతర జిల్లాల నుంచి జనం వచ్చేవారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది జనం తాకిడి బాగా తగ్గింది. -
అడవిలో వేట..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో వన్యప్రాణుల వేట నిత్య కృత్యంగా మారుతోంది. చట్టాలు ఎన్ని వచ్చినా అడవి జంతువులు, పక్షులకు రక్షణ లేకుండా పోయింది. దట్టమైన అడవుల్లో ఉచ్చులు పెట్టి వేటగాళ్లు హతమారుస్తున్నారు.. ఎండలు మండుతున్నందున వన్య ప్రాణులు నీటికోసం అల్లాడుతూ కిలో మీటర్ల కొద్ది దురం వెళ్లి నీటి దప్పికను తీర్చుకుంటున్నాయి. ఇదే అదనుగా చేసుకుని వేటగాళ్లు వాటిని వెంటాడి మట్టుబెడుతున్నారు. జిల్లాలోని ఖానాపురం మండలం బండమీది మామిడి తండాలో బుధవారం రెండు కొండ గొర్రెల తలలు లభించాయి. ఈ నెల 28న శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్ట్ దగ్గర విషపు గుళికలు చల్లి వలస పక్షులను చంపారు. వరుస ఘటనలు జరగడంతో ఫారెస్ట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రెండు కొండ గొర్రెల తలలు లభ్యం ఖానాపురం మండలం బండమీది మామిడితండాలో రెండు కొండ గొర్రెల తలలు గడ్డి వాములో లభించాయి. బుధవారం సమాచారం అటవీశాఖ అధికారులకు తెలియగానే వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రెండు తలలను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంటి సమీపంలో ఉన్న గడ్డి వాములో ఉండడంతో ఆ ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తులు, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో విచారణకొనసాగిస్తున్నారు. వేటగాళ్లు ముఠాగా ఏర్పడి వీటిని చంపినట్లు సమాచారం. వలస పక్షులకు విషపు గుళికలు జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారు చలివాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతానికి ప్రతీ సంవత్సరం వేల పక్షులు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడం, నాచు, చేపలు ఆహారంగా దొరకడంతో పక్షులు ఆవాస ప్రాంతంగా మార్చుకున్నాయి. విసిలింగ్ డక్స్ , టఫ్టడ్ డక్స్ ,కూమ్బ్ డక్స్ , కామన్ పింటైల్ లాంటి అనేకరకాల పక్షులు సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఇదే అదనుగా భావించి పిట్టలు పట్టేవాళ్లు, వేటగాళ్లు వాటిని వెంటాడి వేటాడి చంపుతున్నారు. విషపు గులికలు చెరువులోని తామెర ఆకులపై చల్లుతున్నారు. మృతిచెందిన పక్షులను వేటగాళ్లు సేకరించి ఒక్కో పక్షిని రూ 100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మంసం ప్రియులు ఇతర ప్రాంతాల పక్షులు కావడంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇది వ్యాపారంగా మారిపోయిందని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. ఇటీవల వరుసగా పక్షులు చనిపోతుండడంతో అటవీ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. పక్షుల కళేబరాలను సేకరించి ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది. విచారణ చేస్తున్నాం ఖానాపురం మండలంలో రెండు కొండ గొర్రెలను చంపిన ఘటనపై విచారణ కొనసాగిస్తున్నాం. ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. చలివాగు ప్రాజెక్ట్ వద్ద వలస పక్షులను విషపు గుళికల ద్వారా చంపేస్తున్నారని తెలిసింది. దానిపై కూడా విచారణ చేస్తున్నాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 9 ప్రకారం వన్యప్రాణులను, పక్షులను వేటాడి చంపితే వెంటాడి చంపిన నేరం. జరిమానాతో పాటు జైలు శిక్షను విధిస్తారు. –పురుషోత్తం, జిల్లా అటవీ శాఖ అధికారి