తీవ్ర గాయాలతో చుక్కలదుప్పి మృతి | Deer killed with deep injuries | Sakshi
Sakshi News home page

తీవ్ర గాయాలతో చుక్కలదుప్పి మృతి

Published Sat, Apr 8 2017 3:19 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

తీవ్ర గాయాలతో చుక్కలదుప్పి మృతి

తీవ్ర గాయాలతో చుక్కలదుప్పి మృతి

వేటగాళ్ల పనేనన్న అనుమానం?

హవేలి ఘణాపూర్‌ (మెదక్‌): తీవ్రగాయాలతో చుక్కలదుప్పి మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. హవేలి ఘనాపూర్‌ మండలం గాజిరెడ్డిపల్లి  అటవీ ప్రాంతంలో చుక్కలదుప్పి శుక్రవారం తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతుండగా అధికారులు గుర్తించి మెదక్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. 

ఈ దుప్పి కుక్కలదాడిలో గాయాలపాలై మృతి చెందినట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి దేవీలాల్‌ తెలిపారు. మృతి చెందిన దుప్పిని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ చుక్కలదుప్పి కుక్కలదాడిలో గాయపడిందా.. లేక ఎవరైనా వేటగాళ్ల వేటలో గాయపడిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement