Viral Video: Tigress Hunts Dog At Ranthambore National Park - Sakshi
Sakshi News home page

Viral Video: లైవ్‌లో పులి వేట: నోట మాట రాక కెవ్వు కేక!

Published Tue, Dec 28 2021 6:11 PM | Last Updated on Tue, Dec 28 2021 7:36 PM

Viral VideoTigress Hunts Dog At Ranthambore National Park - Sakshi

ఇంతవరకు మనం పులి జంతువులను వేటాడటం వంటి సన్నివేశాలు డిస్కవరి ఛానెల్స్‌లోనే చూసి ఉంటాం. నిజానికి ఎవ్వరూ నేరుగా చూసేంత ధైర్యం చేయం. కానీ రాజస్థాన్‌లో సరదాగా నేషనల్‌ పార్క్‌కి వెళ్లిన పర్యటకుల మాత్రం పులి దాడి ఎలా ఉంటుందో చూసి దెబ్బకు బిత్తరపోయి చూస్తుండిపోయారు.

(చదవండి: పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్‌లో ‘హలో వరల్డ్‌’ ట్వీట్‌! ఎలాగంటే..)

అసలు విషయంలోకెళ్లితే....రాజస్తాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కులో పర్యాటకులు సఫారి వాహనాల్లో పర్యటించారు. అయితే అనుకోకుండా ఇంతలో అక్కడకి ఒక వీది కుక్క ఆ వాహనాల గుండా సంచరించింది. ఇంతలో మొదటి సఫారి వాహనం నుంచి రెండో సఫారి వాహనం వద్దకు వస్తున్న కుక్కపై ఉన్నట్టుండి ఒక పులి ఒక్క ఊదుటున దాడి చేసి పొదల మాటుకి తీసుకుపోయింది. దీంతో అక్కడ ఉన్న పర్యాటకులంతా భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు.

ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అనీష్ అంధేరియా ట్విట్టర్‌ పోస్ట్‌ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో "పులి కుక్కపై దాడి చేసి చంపడం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కుక్కల ద్వారా డిస్టెంపర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పులులకు సంక్రమించే అవకాశం ఉంది. దీంతో పులుల జనాభా తగ్గుతుంది. వన్యప్రాణుల మనుగడకు ఈ కుక్కలు ముప్పుగా మారాయి అని ట్వీట్‌ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement