Tiger attack
-
TG: చిరుత దాడితో మహిళకు గాయాలు.. టెన్షన్లో ప్రజలు
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్య మృగాల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిపై పులి దాడి చేయగా.. తాజాగా చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు.వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డెడ్రా సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఇక, చిరుత దాడి నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఓ మహిళపై పులి దాడి చేయడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అనంతరం, ఆదిలాబాద్ జిల్లాలోనే మరో ఇద్దరికిపై పులి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వన్య ప్రాణుల వరుస దాడుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. -
పులికి మరో ప్రాణం బలి
ముంబై: ఇటీవలి కాలంలో గ్రామాల్లో పులుల సంచారం ఎక్కువైంది. పంట పొలాల్లోకి వస్తున్న పులులు.. ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో పులి దాడిలో ఓ గర్భిణి మరణించింది. దీంతో, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతంలో శనివారం ఉదయం పులి దాడి ఘటన వెలుగు చూసింది. పులి దాడిలో ఓ గర్భిణి మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (21) పులి దాడిలో మరణించిన విషయం తెలిసిందే. నజ్రుల్ నగర్ విలేజ్ నంబర్ 13–11 మధ్య తన సొంత పత్తి చేలో పత్తి తీస్తుండగా.. ఉదయం 7 గంటల సమయంలో అడవి నుంచి వచ్చిన పులి ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. లక్ష్మిపై పులి దాడి చేయటాన్ని గుర్తించిన తోటి కూలీలు.. గట్టిగా కేకలు వేసి సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో కొందరు వ్యక్తులు కర్రలతో వచ్చి పులిని బెదిరించటంతో లక్ష్మిని వదిలి అది అడవిలోకి పారిపోయింది.మరో ఘటనలో సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది. పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి అలజడి
-
పులి పంజాకు మహిళ బలి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ కాగజ్‌నగర్ రూరల్: పులి పంజాకు ఓ యువతి బలైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (21) శుక్రవారం నజ్రుల్ నగర్ విలేజ్ నంబర్ 13–11 మధ్య తన సొంత పత్తి చేలో పత్తి తీస్తుండగా.. ఉదయం 7 గంటల సమయంలో అడవి నుంచి వచ్చిన పులి ఆమెపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందింది. లక్ష్మిపై పులి దాడి చేయటాన్ని గుర్తించిన తోటి కూలీలు.. గట్టిగా కేకలు వేసి సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో కొందరు వ్యక్తులు కర్రలతో వచ్చి పులిని బెదిరించటంతో లక్ష్మిని వదిలి అది అడవిలోకి పారిపోయింది. లక్ష్మికి గన్నారం గ్రామానికి చెందిన వాసుదేవ్‌తో ఏడాది క్రితమే వివాహం అయ్యింది. లక్ష్మి మృతితో ఆగ్రహించిన ఆమె బంధువులు కాగజ్‌నగర్ అటవీశాఖ కార్యాలయం ముందు నాలుగు గంటలపాటు ఆందోళనకు దిగారు. లక్ష్మి కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కలి ్పస్తామని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ హామీ ఇవ్వటంతోఆందోళన విరమించారు. లక్ష్మిపై దాడిచేయటానికి ముందే విలేజ్ నం.9 ప్రాంతంలో బిజన్ బర్మెన్కు చెందిన ఆవును పులి హతమార్చింది. గ్రామాలకు సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నాలుగేళ్లలో నలుగురు మృతి మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్న పెద్ద పులులు మనుషులపై దాడులుచేస్తూ చంపేస్తున్నాయి. గత నాలుగేళ్లలో పులుల దాడిలో నలుగురు మరణించారు. మృతులంతా కూలీలు, రైతులే కావటం గమనార్హం. అదికూడా పత్తి చేలు కోతకొచి్చన సమయంలోనే పులులు దాడులు చేస్తున్నాయి. 2020 నవంబర్ 11న ఓ మగపులి దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై దాడిచేసి చంపేసింది. ఈ ఘటన జరిగిన 18 రోజులకే అదే నెల 29న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18) పత్తి చేలో పత్తి తీస్తుండగా పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఇద్దరిని చంపిన పులిని బంధించే ప్రయత్నం చేసినా చిక్కలేదు. మరో పులి 2022 నవంబర్ 15న వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. తాజాగా మోర్లె లక్ష్మి (21)పైనా నవంబర్ నెలలోనే దాడి జరిగింది. లక్ష్మిపై దాడిచేసిన పులి ఇటీవలే మహారాష్ట్ర అడవుల నుంచి ఇక్కడికి వచి్చనట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.పత్తి కూలీలపైనే అధిక దాడులు పత్తి చేలకు ఉదయం పూటే కూలీలు వెళ్తుంటారు. కూలీలుఒకే చోట గుంపుగా కాకుండా ఎక్కువగా పత్తి ఉన్న చోట్లకు వేరుపడి పత్తి తీస్తుంటారు. ఏపుగా పెరిగిన మొక్కల మధ్య కూలీలు వంగి పని చేస్తారు కాబట్టి.. పులి సమీపానికి వచ్చేవరకు గుర్తించలేకపోతున్నారు. గతంలో జరిగిన దాడులన్నీ వెనకవైపు నుంచి జరిగినవే. పులి వెనుకనుంచి వచ్చి పంజాతో బలంగా కొట్టడంతో ఎవరూ ప్రాణాలతో బయటపడడం లేదు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు గతంలో కూలీలకు తల వెనకభాగంలోనూ మనిషి తల మాదిరి ఉండే మాస్కులు ఇచ్చారు. డప్పు చప్పుళ్లతో శబ్దాలు చేసేవారు. ‘వామ్మో.. పులి చంపిందే’ పత్తి తీయడానికి 12 మందిమి వెళ్లాం. ఉదయం 7గంటల సమయంలో పత్తి తీస్తుండగానే చప్పుడు లేకుండా పులి ఒక్కసారిగా లక్ష్మిపై దాడి చేసింది. లక్ష్మి ఒక్కసారిగా ‘వామ్మో.. పులి చంపిందే’అంటూ అరిచింది. మేము అటువైపు చూస్తుండగానే పంజా విసిరి లక్ష్మి మెడను కొరికింది. రక్తాన్ని పేల్చివేసింది. మేం పక్కనే ఉన్న విలేజ్ నం.11కు వెళ్లి విషయం చెప్పటంతో కొందరు కర్రలు తీసుకుని వచ్చి పులిని తరిమేశారు. – వడాయి లక్ష్మి, ప్రత్యక్ష సాక్షి, గన్నారంగందరగోళంతోనే చేన్ల వైపు...సాధారణంగా పులులు మనుషులపై దాడులు చేయవు. కొన్ని పరిస్థితుల్లోనే దాడి చేస్తాయి. మహిళపై దాడి చేసింది కొత్త పులి. రెండు రోజులుగా ఇక్కడే తిరుగుతోంది. దీనిపై స్థానికులను అప్రమత్తం చేశాం. కానీ కొందరు పులిని ఫొటోలు, వీడియోలు తీశారు. గందరగోళంలోనే చేన్ల వైపు వెళ్లి దాడి చేసి ఉండొచ్చని అనుకుంటున్నాం. బాధిత కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం, ఉద్యోగం కల్పస్తాం. –శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వు -
పులి మీ ఎదురుగా ఉంటే.. ఇలా తప్పించుకోండి!
పులి మనకు ఎదురొచ్చినా.. మనం పులికి ఎదురెళ్లినా.. ‘పోయేది’ మనమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఒకవేళ మన టైం బాగోక పులిని మనం చూసినా లేదా అది మనల్ని చూసినా ఏం చేయాలిమీరు పులిని చూశారు.. అది మిమ్మల్ని చూడలేదు. అలాంటప్పుడు ఎక్కడున్నారో అక్కడే కదలకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. శ్వాస వేగంగా తీసుకోకూడదు. చెప్పడం ఈజీగానీ.. పులిని చూశాక.. ఎవరైనా గాబరా పడటం సహజం, అయితే.. ఇక్కడ మీరు ఎంత కామ్‌గా ఉంటారన్న దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. అది వెళ్లేంతవరకూ ఆగండి. వెళ్లాక.. అది వెళ్లిన దిశకు వ్యతిరేక దిశలో వెంటనే వెళ్లిపోండి. ఇక్కడ తప్పించుకుపోవడం ఒక్కటే మీ లక్ష్యంగా ఉండాలి. అంతే తప్ప.. ఏదైనా కొత్తగా చేసి హీరోయిజం చూపిద్దాం అనుకుంటే.. అడవిలో అదే హీరో అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోండి. ఈసారి పులే మిమ్మల్ని చూసింది. మొట్టమొదట చేయకూడని పని పరుగెత్తడం. మీరు ఉసేన్ బోల్ట్ కాదు.. అదైతే కన్ఫర్మ్. పైగా వెంటాడుతూ.. వేటాడటంలో పులులు స్పెషలిస్టులు. అందుకే అలా చేయొద్దు.. ఒకవేళ మీరు కూర్చునే పొజిషన్లో ఉంటే.. ముందుగా లేచి నిల్చొండి. ఎందుకంటే.. పులులు సాధారణంగా జింకల్లాంటి వాటిపై వెనుక నుంచి దాడి చేస్తాయి.. ముఖ్యంగా అవి కూర్చునే పొజిషన్లో ఉన్నప్పుడు వేటాడతాయి. పైగా.. అవి తాము వేటాడే జంతువులకు, మనుషులకు మధ్య తేడాను గుర్తించలేవు. అందుకే లేచి నిల్చోవడం ద్వారా మీరు పులి వేటాడే జంతువు కాదన్న విషయాన్ని తెలియజేయాలి. గతంలో కూడా మన దేశంలో అడవుల్లో వంగి.. కట్టెలు ఏరుకుంటున్న వారు లేదా వంగి పనిచేసుకుంటున్న మనుషులపై వెనుక నుంచే అత్యధిక శాతం పులి దాడులు జరిగాయి. లేచి నిల్చున్నారు సరే.. తర్వాతేం చేయాలి? పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలి.. దాన్ని అడిగి కాదు.. దాన్ని గమనించడం ద్వారా.. సాధారణంగా పులికి మీ మీద దాడి చేసే ఉద్దేశం ఉంటే.. అది ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది.. మీ మీదే దృష్టి పెడుతుంది.. కాళ్లను వంచుతుంది.. దాని చెవులు ఇలా వెనక్కి వెళ్లినట్లుగా అవుతాయి. ఆగ్రహంగా గాండ్రించి.. ముందుకు దూకుతుంది. ఆగండాగండి.. ఇక్కడో విషయం చెప్పాలి. కుక్కల చెవులు కూడా వెనక్కి వెళ్తాయి మనపట్ల స్నేహభావంతో.. ఇక్కడ కూడా చెవులు వెనక్కి వెళ్లాయి కదా.. ఫ్రెండే అని అనుకోకండి.. బాలయ్య బాబు ఏదో సినిమాలో చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ అని తెలుసుకోండి. పులి చెవులు వెనక్కి వెళ్లాయంటే.. అది వార్నింగ్ కిందే లెక్క.. నువ్వక్కడ ఉండటం దానికి ఇష్టం లేదన్నమాట.ఉన్నచోట ఉన్నట్లే ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ.. వెళ్లండి. వీపు చూపొద్దు. చూపితే వెంటనే దాడి తప్పదు. గతంలో మధ్యప్రదేశ్‌లోని భాందవ్గఢ్ నేషనల్ పార్కులో మూడు పులులు రావడంతో ఓ ఏనుగు భయపడి.. మావటిని కిందన పడేసి వెళ్లిపోయింది. దాంతో ఆ మావటి వెనక్కి తిరిగి పరిగెట్టకుండా.. ఇలాగే ఒక్కో అడుగూ నెమ్మదిగా వెనక్కి వేసుకుంటూ.. రెండు గంటల తర్వాత ఆ ప్రాంతం నుంచి బయటపడ్డాడట. ఒకవేళ దగ్గర్లో చెట్టు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది. మీకు చెట్లెక్కడం బాగా వస్తే.. వెంటనే ఎక్కేయండి. కనీసం 15 అడుగుల ఎత్తు ఎక్కేదాకా ఆగొద్దు. చాన్స్ ఉంటే ఇంకా పైకి ఎక్కండి. మీకు వేగంగా చెట్లు ఎక్కగలిగే సామర్థ్యం ఉంటేనే ట్రై చేయండి. లేకపోతే వద్దు. పులులు 15 అడుగుల ఎత్తు దాకా ఎగరగలవు. పులులు చెట్లెక్కడంలో స్పెషలిస్టులు కావు. ఒకవేళ దగ్గర్లో చెరువు ఉంది.. పులి కొంచెం దూరంగా ఉంది.. అయినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలో దూకొద్దు.. మీకు ఒలింపిక్స్‌లో గోల్డ్ వచ్చి ఉంటే మాత్రం దూకండి. ఎందుకంటే.. పులులు మనకన్నా బాగా ఈదగలవు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. బాగా సౌండ్ చేయగల మెటల్ వస్తువులు ఉంటే.. హోరెత్తించేయండి. చేతిలో ఏం లేదు.. పులి దాడి చేయడానికి వస్తుంటే.. అప్పుడు చాలా గట్టిగా అరవండి. ఎంతలా అంటే.. దాని చెవులకు చిల్లులు పడేలా.. ఇలాంటి టైంలో అది కన్ఫ్యూజ్ అవుతుంది. అన్ని ఆప్షన్లు అయిపోయాయి.. ఇక చేసేదేమీ లేదంటే మాత్రం పోరాడాల్సిందే. దగ్గర్లో ఏది దొరికితే.. అది పట్టుకోండి. రాయి, కర్ర ఏదైనా సరే. పులి శరీరంలో కళ్లు, ముక్కు బలహీన ప్రదేశాలు. అక్కడే బలంగా దాడి చేయాలి. పులి బలం దాని పంజా, కోరలు.. వాటి నుంచే తప్పించుకోవాలి. అది దాడి చేయడానికి వచ్చినప్పుడు పులికి ఎంత దగ్గరగా అయితే.. అంత దగ్గరగా ఉండి పోరాడాలి. దాని పీకను పట్టుకొని.. గట్టిగా హత్తుకోవాలి. ధృతరాష్ట్ర కౌగిలిలాగ.. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకూడదు.చదవండి: ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథగట్టిగా అదిమి పట్టుకుంటే.. అది ఆశ్చర్యపోతుంది. పులులు సాధారణంగా దాన్ని ఇష్టపడవు. అవి ప్రేమలో ఉన్నప్పుడు లేదా వేరే పులులతో పోరాడుతున్నప్పుడు కూడా బాగా దగ్గరగా అలముకున్నట్లు ఉండవు. మెడ జాగ్రత్త. పులికి దొరికితే అంతే. పోరాడుతున్నంత సేపు.. గట్టిగా అరుస్తూనే ఉండాలి. పులులు సాధారణంగా పోరాటాలను ఇష్టపడవు. కానీ అది పోరాటానికి దిగిందంటే మాత్రం చంపడానికే దిగుతుంది. అది తప్పించుకోవాలని అనుకుంటేనో.. లేదా మనం చేసిన ఏ పనితోనైనా అది ఆశ్చర్యపోతేనో తప్ప.. చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. పైన చెప్పినవన్నీ చేస్తున్న సమయంలో దేవుడిని ప్రార్థించడం మాత్రం మరువద్దు. ఈ టిప్స్ ఫెయిలయినా.. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడవచ్చు. అల్ ది బెస్ట్ మరి.. ఓ పులి రేపు రా.. -
పంజా విసురుతున్న పులి
సాక్షి, అమరావతి: దేశంలో వివిధ రాష్ట్రాల్లో 2019–23 మధ్య పులుల దాడి కారణంగా 315 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో పులుల దాడి కారణంగా 110 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. మహారాష్ట్రలోనే పులుల దాడిలో 200 మంది మరణించగా ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లో 34 మంది మృత్యువాత పడ్డారు. మానవ–వన్యప్రాణుల మధ్య సంఘర్షణ కారణంగా జరుగుతున్న ఈ దాడుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ సంఘర్షణను తగ్గించే చర్యల్లో భాగంగా దేశంలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద ప్రాజెక్టు టైగర్ పేరుతో వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధికి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. మానవ వన్యప్రాణుల సంఘర్షణల హాట్ స్పాట్లను గుర్తించడంతో పాటు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు పేర్కొంది. ఎక్స్గ్రేషియాలను 24 గంటల్లోనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది.పంట పొలాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించకుండా నిరోధించేందుకు ముళ్ల కంచె, బయో ఫెన్సింగ్, ఇతర అడ్డంకులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు తెలిపింది. వన్యప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్లు తెలిపింది. తీవ్ర గాయాలపాలైతే రెండు లక్షల రూపాయలు, చిన్న గాయాల చికిత్సలకు 25 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. -
హైవేపై పులిని ఢీ కొట్టిన కారు
-
మళ్లీ పులి భయం
పులి భయం మళ్లీ మొదలైంది. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నందిగూడ అటవీ ప్రాంత శివారులో రెండురోజుల కిందట పశువును చంపేసి.. పశువుల కాపరి గులాబ్‌పై దాడి చేసిన ఘటన దరిమిలా ఆ ప్రాంత సమీప ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ఘటనలో గులాబ్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడగా, చేతికి గాయాలయ్యాయి. ప్రతీ ఏడాది పత్తి తీసే ఇదే సీజన్లోనే పులుల సంచారం పెరుగుతోంది. దీంతో పత్తి చేన్లకు వెళ్లాలన్నా, జీవాలను మేతకు తీసుకెళ్లాలన్నా కాపర్లు జంకుతున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల మూడేళ్లుగా మనుషులపై దాడులు గత మూడేళ్లుగా నవంబర్ నుంచి జనవరి మధ్యే పులుల దాడులు అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా 2020 నవంబర్ 11న ఏ2 అనే పులి కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్(21) పత్తి చేనుకు వెళ్తుండగా దాడి చేసి చంపేసింది. అదే నెల 29న పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(18)ను పొట్టన పెట్టుకుంది. కేవలం మూడు వారాల వ్యవ«ధిలోనే ఇద్దరి మృతితో స్థానికుల నుంచి నిరసనలు వచ్చాయి. దాంతో అటవీ శాఖ సీరియస్‌గా తీసుకుని ఆ పులిని బంధించే ప్రయత్నం చేసినా.. సాధ్యపడలేదు. ఆ తర్వాత పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ గతేడాది నవంబర్లోనే కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము(69)ను పత్తి చేనులో ఉండగా దాడి చేసి చంపేసింది. తాజాగా పశువుల కాపరిపై దాడి జరిగింది. బఫర్ జోన్లోనే సంచారం ఉమ్మడి ఆదిలాబాద్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్‌గా ఉంది. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్‌గంగా, ప్రాణహిత తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్ రిజర్వ్ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. ఎనిమిదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడపులి కాగజ్‌నగర్‌లోనే స్థిర నివాసం ఉండటంతో సంతతి పెరిగింది. ఇలా అనేక పులులు ఒక్కొక్కటిగా తెలంగాణ భూభాగంలో ఆవాసం, తోడు వెతుక్కుంటూ అడుగుపెడుతున్నాయి. టైగర్ రిజర్వు పరిధి కోర్ ఏరియా మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కవ్వాల్‌లో మాత్రం ఇప్పటికీ ఒక్క పులి కూడా స్థిరంగా ఉండలేదు. కేవలం బఫర్ ప్రాంతాల్లోనే పులులు సంచరించడంతో సమస్య మొదలవుతోంది. ఆ ప్రాంతాల్లోనే పత్తి చేన్లు, మానవ సంచారం ఉండడంతో ఎదురుపడిన సందర్భంలో దాడి చేస్తున్నాయి. నిత్యం ఆదిలాబాద్ డివిజన్లో తాంసి, భీంపూర్, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో దహెగాం, పెంచికల్‌పేట, బెజ్జూరు, బెల్లంపల్లి, చెన్నూరు డివిజన్ల వరకు పులులు తిరుగుతుంటాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు పిప్పల్‌కోట్, కాగజ్‌నగర్ డివిజన్ అడవుల్లో అనేకసార్లు స్థానికులకు పులులు ఎదురుపడ్డాయి. అడవిలో వన్యప్రాణుల కంటే సులువుగా దొరికే మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెల పైనే దాడి చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అలా పశువులు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అటవీ శాఖ చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు మనుషులపై దాడి చేయడమే ఆందోళన కలిగిస్తోంది. జత కట్టే సమయంలో? పులులు జత కట్టే సమయం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యే కావడం, తోడు, ఆవాసం కోసం తోటి పులుల మధ్య ఆధిపత్య పోరు, వాగులు, నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న చోట సంచరిస్తూ అనుకోకుండా మనుషులు ఎదురుపడితే దాడులకు ప్ర«ధాన కారణమవుతున్నాయని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
కలిసి కట్టుగా.. పులిని తరిమికొట్టిన ఆవుల మంద
ఐకమత్యమే మహాబలం.. మన చిన్నప్పటి నుంచి వింటున్న మాటే ఇది. ఆరణలోనూ ఇది సాధ్యమేనంటూ నిరూపించే ఘటనలనూ చూస్తూ వస్తున్నాం కూడా. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఓ ఘటన.. సీసీటీవీఫుటేజీ బయటకు రావడంతో వైరల్ అవుతోంది. ఆవుల మంద నుంచి ఒంటరిగా ఉన్న ఓ ఆవుపై నక్కినక్కి వచ్చి దాడికి దిగింది ఓ పెద్దపులి. దీంతో అది చావుకేకలు వేయగా.. అది చూసిన మిగతా ఆవులు బెదిరి చెల్లాచెదురు కాలేదు. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు ఉరికాయి. వాటి ధైర్యానికి ఆ పులి బెదిరింది. ఆవును వదిలేసి అక్కడి నుంచి పొదల్లోకి లంఘించుకుంది. అయితే పులి అక్కడక్కడే ఉండడంతో.. గాయపడిన ఆ ఆవును చుట్టుముట్టి మళ్లీ దాడికి దిగకుండా తెల్లవారే దాకా కాపలాగా ఉన్నాయి మిగతా ఆవులు. ఆదివారం అర్ధరాత్రి భోపాల్ కేర్వా శివారుల్లోని ఓ డెయిరీ ఫామ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. గాయపడిన ఆ ఆవు పరిస్థితి పాపం విషమంగా ఉన్నట్లు సమాచారం. संगठन में शक्ति है… भोपाल के मदरबुल फार्म में बाघ ने एक गाय पर हमला किया तो उस गाय को बचाने दौड़ पड़ा गायों का झुंड। देखिए वीडियो…#Bhopal #cows pic.twitter.com/678Gy4YyN2 — Upmita Vajpai (@upmita) June 20, 2023 ఇదీ చూడండి: ఆ ఊర్లో మహిళలంతా దుస్తుల్లేకుండా ఐదురోజులపాటు.. -
బాబోయ్.. టూరిస్ట్‌లపై పులి ఎటాక్! వీడియో వైరల్
-
పులికే ప్రాణ గండమా? ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది
పాపం పులి సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవిలో వేట పూర్తిగా ఆగితేనే జాతీయ జంతువు పులికి భద్రత లభిస్తుంది. ఈ ఏడాది కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో రెండు పు లుల మరణాలు వెలుగులోకి రావడం ముప్పును తె లియజేస్తోంది. నెన్నెల మండలం కుశ్నపల్లి రేంజ్లో పులి అవశేషాలు బయటపడడం తెలిసిందే. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర పరిధి జివితి తాలూకాలో కు మురంభీం జిల్లాలో సంచరించిన ఓ పులిని హతమార్చి చర్మం విక్రయిస్తుండగా అక్కడి అటవీ అధికారులు పట్టుకున్నారు. టైగర్ మిస్సింగ్.? వరుస ఘటనలతో కవ్వాల్ టైగర్‌జోన్‌లో పులుల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పులులు చనిపోయిన నెలల తర్వాత వాటి అవశేషా లు విక్రయిస్తున్న క్రమంలోనే ఈ ఉదంతాలు బయటకు వస్తున్నాయి. పులి ట్రాకింగ్ వ్యవస్థ స్పష్టత లేక ఏ పులి ఎక్కడ సంచరిస్తుందో తెలియక కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి జాడ లేకుండా పోయిన పులులు ఉన్నాయి. చాలావరకు మహారాష్ట్ర వెళ్లిపోయాయని చెబుతున్నప్పటికీ వాస్తవానికి అవి ఎక్కడున్నాయో స్పష్టత లేదు. కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీస్తున్నారు అడవిలో వన్యప్రాణుల వేట కోసం అమర్చుతున్న విద్యుత్ తీగలతోనూ పులులకు ముప్పు వాటిల్లుతోంది. గతంలో అటవీ ప్రాంతాల వరకు విద్యుత్ సదుపాయం ఉండకపోవడంతో ఉరిలు మాత్రమే వేసేవాళ్లు. అడవి పందులు, దుప్పులు, ఏదులు, మెకం వంటి జంతువులను వేటాడేందుకు ఏకంగా 32కేవీ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ లైన్ల నుంచి దొంగచాటుగా అడవి లోనికి ప్రసారం చేస్తూ వాటి ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పటికీ అటవీ సమీప ప్రాంతాల్లో యథేచ్ఛగా వేట కొనసాగుతోంది. జాతీయ జంతువుకు గండం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, అంధేరి పులుల సంరక్షణ కేంద్రాల్లో వాటి సంతతి పెరిగి కవ్వాల్‌లోకి అడుగు పెడుతున్నాయి. ఆహారం, ఆవాసం, తోడు కోసం ఇటు వైపు వస్తున్నాయి. ఇలా వచ్చిపోయే వలస పులులతోపాటు కవ్వాల్ పరిధిలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న వాటికి ముప్పు పొంచి ఉంది. అటవీ సమీప ప్రాంతాల ప్రజలకు జాతీయ జంతువుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోపాటు పులులు వస్తే పాటించాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు వివరించడం లేదు. భద్రత పేరుతో గోప్యత ఒక్కోసారి పులి వచ్చిందని చెప్పినా అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనూ సమస్యలు వస్తున్నాయి. గతంలో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల పరిధిలో పులి సంచరిస్తోందని అక్కడి అధికారులకు చెబితే ఈ ప్రాంతంలో పులి లేదని కొట్టిపారేశారు. రెండ్రోజులకే అక్కడ ఓ రైతుపై దాడి చేసి ప్రాణాలు తీసింది. పులి భద్రత పేరుతో గోప్యత పాటించి అసలుకే మోసం తెస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక రాత్రి వేళ కరెంటు సరఫరా, తనిఖీలు, గస్తీ, యానిమల్ ట్రాకర్స్ ఉన్నప్పటికీ పులికి ప్రాణగండం తప్పడం లేదు. వేసవిలోనూ వేటగాళ్ల ముప్పు వేసవిలో వన్యప్రాణులు అడవిలో నుంచి వేడిని తట్టుకునేందుకు, నీరు, ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో వేటగాళ్లు షికారీ చేస్తూ అటవీ జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. వానాకా లంలో పత్తి పంటను కాపాడుకునేందుకు అడవి పందుల నియంత్రణకు విద్యుత్ తీగలతో కంచెలు వేస్తుంటారు. ఆ సమయంలో ఏ జంతువు తగిలినా ప్రాణాలు కోల్పోతాయి. వేసవిలో నీటికుంటలు, ఒర్రెలు, లోయలు, వెదురు చెట్ల చల్లదనం కోసం వచ్చే క్రమంలో వేటగాళ్లు ఉచ్చులు వేసి ప్రాణాలు తీస్తున్నారు. దీనిపై పకడ్బందీగా ప్రణాళిక వేసి అమలు చేస్తే గానీ అటవీ జంతువులకు రక్షణ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
వైరల్ వీడియో: రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా!
-
రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా!
వన్యమృగాలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఎన్నో వీడియోల్లో చూసే ఉంటాం. అయితే, జంతువులకు ఎంత ట్రైయినింగ్ ఇచ్చినప్పటికీ పలు సందర్భాల్లో అవి దాడి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే సర్కస్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో రింగ్ మాస్టర్ గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ చోట సర్కస్ జరుగుతోంది. ఇందులో భాగంగా రింగ్ మాస్టర్.. రెండు పులులను స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. పులులతో సర్కస్ ఫీట్ చేస్తుండగా.. ఓ పులి రింగ్ మాస్టర్‌పై దాడి చేసింది. రింగ్ మాస్టర్ కాలిపై దాడి చేసి.. నేలపై లాగుతూ కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఇంతలో పక్కనే ఉన్న మరో వ్యక్తి పులిని నిలువరించే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న టేబుల్ సహాయంతో రింగ్మాస్టర్ను పులి దాడి నుంచి విడిపించాడు. కాగా, పులి దాడిలో రింగ్ మాస్టర్ గాయపడ్డాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Earth Reels (@earth.reel) -
మహారాష్ట్ర చంద్రపూర్‌లో పులులు పంజా
-
ఇంట్లోకొచ్చి బాలుడిని లాక్కెళ్లిన పులి.. రెండ్రోజుల్లో రెండో ఘటన
ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో పులులు పంజా విసురుతున్నాయి. వరుసగా రెండ్రోజుల్లో ఓ యువకుడితో పాటు బాలుడు పులి బారినపడి మరణించారు. సిందేవాహిని గ్రామంలో పులి ఇంట్లోకి వచ్చి మరి బాలుడిని లాక్కెళ్లి చంపేసింది. ఇంటిలోంచి బాలుడిని లక్కెళ్లిన క్రమంలో గ్రామస్థులు కోపోద్రిక్తులయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీలైనంత త్వరగా పులలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. అంతకు ముందు రోజు ఓ యువకుడిని పొట్టనపెట్టుకుంది పులి. తల్లిదండ్రులు జాతరకు వెళ్లిన క్రమంలో పంటపొలానికి వెళ్లిన యువకుడిపై పులి దాడి చేసి చంపేసింది. శివాని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తరుచుగా పులులు పంజా విసురుతున్నాయని.. ఆ ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పులుల బారినుంచి తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదీ చదవండి: మాస్కో- గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
దాడి చేసి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లి
వాంకిడి (ఆసిఫాబాద్): చేనులో ఒంటరిగా పత్తి ఏరుతున్న రైతుపై పెద్దపులి పంజా విసిరింది. ఒక్కసారిగా దాడి చేసి సుమారు కిలోమీటరు దూరం వరకు లాక్కెళ్లి వదిలేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కుమురంభీం జిల్లా వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అటవీ ప్రాంతంలోని తన చేనులో పత్తి ఏరేందుకు పెద్ద కుమారుడు సిడాం అయ్యుతో కలిసి మంగళవారం వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుమారుడు భోజనానికి వెళ్లగా.. భీము ఒక్కడే పత్తి ఏరుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పులి అతడిపై దాడి చేసింది. అరుపులు విని పక్క చేనులోనే పనిచేస్తున్న కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా.. రక్తం మరకలు, మనిషిని ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వారు వెంటనే కొంత దూరంలో పోడు భూముల సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి సమాచారం అందించారు. 20 మంది వరకు సిబ్బంది చేనుకు చేరుకొని రక్తం మరకలు, పులి ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లను అనుసరిస్తూ వెతికారు. కిలోమీటరు దూరంలోని ఓ లోయలో భీము మృతదేహం లభ్యమైంది. అంతకుముందు భీము చేను సమీపంలో పశువులు మేపుతున్న ఆత్రం అన్నిగా అనే కాపరిపై పులి దాడికి యత్నించింది. అప్పుడు తన కూతురు గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుంచి పరుగులు తీయడంతో పులి వెళ్లిపోయినట్లు అన్నిగా తెలిపాడు. జిల్లా అటవీశాఖ అధికారి దినేశ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేలు అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు ఎవరూ పొలం పనులకు వెళ్లొద్దని సూచించారు. పశువులపై పులుల దాడి.. దహెగాం/తలమడుగు: కుమురంభీం జిల్లాలోని దహెగాం మండలం కర్జి అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి సోమవారం రాత్రి దాడి చేసింది. లంగారి వెంకటేష్‌కు చెందిన కోడె సోమవారం మేతకు వెళ్లి తిరిగి రాకపోవడంతో మంగళవారం అడవిలో వెతకగా కళేబరం లభించింది. పులి దాడి చేసి హతమార్చినట్లు బీట్ అధికారి సుధాకర్ నిర్ధారించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన బాబన్న లేగదూడపై మంగళవారం పులి దాడి చేసి గాయపర్చింది. తాంసి కే గ్రామ శివారు పొలంలో పులి వెనుక నుంచి దాడి చేయగా లేగదూడ తప్పించుకొని గ్రామానికి చేరింది. అటవీశాఖ అధికారులు పులి దాడిగా నిర్ధారించారు. -
మనుషుల రక్తానికి రుచి మరిగింది.. 9 మందిని చంపి చివరకు ఇలా..
మనుషుల రక్తానికి రుచిమరిగిన ఓ పులి ఏకంగా తొమ్మిది మందిని దారుణంగా చంపింది. గ్రామస్తులపై ఎగబడి పంజా విసురుతూ ప్రతాపం చూపించింది. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చంపారన్ జిల్లాలోని బగాహ అనే గ్రామంపై పులి దాడి చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలా ఇప్పటివరకు 9 మందిని కిరాతకంగా దాడి చేసి చంపింది. EXCLUSIVE: Man-eating tiger killed in Bihar's West Champaran. The tiger was killed after 5 hours of hard work. Till now, the tiger had killed 9 people 🙂#bihar #tiger , pic.twitter.com/oBL3aj8dFR — विनीत ठाकुर (@yep_vineet) October 8, 2022 దీంతో, స్థానికుల ఫిర్యాదు మేరకు కొన్నివారాల నుంచి పులిని బంధించేందుకు ఏనుగులతో గాలించినా జాడ కనిపించలేదని అటవీ సిబ్బంది తెలిపారు. ఇక, మూడు రోజుల వ్యవధిలోనే నలుగురిని చంపినట్లు చెప్పారు. దీంతో, బీహార్ ప్రభుత్వం అనుమతి తీసుకొని షార్ప్ షూటర్లతో పులిని చంపినట్లు అటవీ సిబ్బంది వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. A man-eating tiger, which mauled 11 people to death in Bihar in past one month, was shot dead in Valmiki Tiger Reserve (VTR) on Saturday morning.#ValmikiTigerReserve #VTR #Tiger #ManEater #ManEatingTiger #TigerKing #Viral #ViralVideos #viral2022 #India pic.twitter.com/KNH28h3skU — Anjali Choudhury (@AnjaliC16408461) October 8, 2022 बिहार में मारा गया आदमखोर बाघ, 7 घंटे के ऑपरेशन के बाद हुआ टाइगर के आतंक का अंत ।#Bihar #Bagaha #Tiger #ValmikiTigerReserve pic.twitter.com/qdi2l4F90O — Mayank makkar (@Mayankmakkar6) October 8, 2022 -
పులినే ఒక ఆట ఆడుకున్న కోతి.. వీడియో వైరల్
పెద్ద పులి కనిపిస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. కానీ, ఓ కోతి మాత్రం నువ్ పులి అయితే.. నాకేంటి ఇది నా అడ్డా చూసుకుందాం రా.. అన్న విధంగా ప్రవర్తించింది. తన కోతి చేష్టలతో పులినే ఒక ఆట ఆడుకుంది. వానరాన్ని వేటాడేందుకు పులి ప్రయత్నించి చెట్టుపై నుంచి పడిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. చెట్టుపై ఉన్న ఓ కోతిని వేటాండెందుకు పులి ప్రయత్నించింది. చిటారు కొమ్మన ఉన్న వానరాన్ని పట్టుకునేందుకు పులి సైతం చెట్టుపైకి ఎక్కింది. కొమ్మలపై అటూ ఇటూ అలవోకగా దూకటం కోతులకు పుట్టుకతో వచ్చే విద్య. అదే నైపుణ్యంతో పులిని ఆటాడుకుంది కోతి. చేతికి అందినట్లు అంది మరో కొమ్మపైకి దూకుతూ పులికి ముచ్చెమటలు పట్టించింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 74 వేల మంది వీక్షించారు. 8,300 లైకులు వచ్చాయి. हालात का ‘शिकार’ pic.twitter.com/myHtQ3qw5s — Awanish Sharan (@AwanishSharan) March 3, 2022 ఇదీ చదవండి: జీవితాంతం చదువుకుంటూ వృద్ధుడిగా మారిపోతా.. పిల్లాడి మాటలకు నెటిజన్లు ఫిదా -
మళ్లీ పులి దాడి
ప్రత్తిపాడు రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో బుధవారం రాత్రి పులి ఆవుపై దాడి చేసి హతమార్చింది. గ్రామంలోని రామిశెట్టి వెంకటేశ్వరరావుకు చెందిన ఆవుపై సరుగుడు తోటలో పులి దాడి చేసి తినేసింది. పులి జాడ కోసం గత మూడు రోజులుగా అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పాండవులపాలెం చెల్లయ్యమ్మ చెరువులో పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు విస్తృతంగా గాలించినా ఫలితం లేకపోయింది. కాగా, బుధవారం రాత్రి మళ్లీ దాడి చేయడంతో డీఎఫ్‌వో ఐకేవీ రాజు, వైల్డ్ లైఫ్ డీఎఫ్‌వో సెల్వం, సబ్ డీఎఫ్‌వో సౌజన్య, రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వైల్డ్ లైఫ్ రేంజర్ వరప్రసాద్, డీఆర్వో రామకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ నాయక్ సారథ్యంలో అటవీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఇదిలా ఉండగా పులిని దారి మళ్లించడంలో అపార అనుభవం ఉన్న అధికారుల బృందం శ్రీశైలం ఫారెస్ట్ నుంచి ప్రత్తిపాడుకు వస్తున్నట్లు స్థానిక అధికారులు చెప్పారు. -
ఔను.. అక్కడ సంచరిస్తోంది పెద్ద పులే!
ప్రత్తిపాడు రూరల్, పిఠాపురం: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు, ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం, కొడవలి గ్రామాల శివారు ప్రాంతాల్లో గేదెలను పెద్ద పులి చంపి తింటున్నట్లు అధికారులు నిర్థారించారు. పోతులూరు, కొడవలి గ్రామాల సరిహద్దుల్లో పోలవరం పంప్‌హౌస్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన యానిమల్ ట్రాకింగ్ కెమెరాల్లో పెద్ద పులి కనిపించింది. దీంతో సమీప గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఐదు గ్రామాల సరిహద్దుల్లోను 120 మందితో గస్తీ ఏర్పాటు చేశారు. అడవి దున్నలను పోలి ఉన్న గేదెలపై పులి దాడి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పశువులను ఇళ్ల వద్దే కట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు అధికారులు సూచించారు. రాత్రి సమయాల్లో పొలాల్లోకి ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు. అటవీశాఖ సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్‌వో ఐకేవీ రాజు, వైల్డ్ లైఫ్ డీఎఫ్‌వో సెల్వం, ఐఎఫ్‌వో ట్రైనీ భరణి, సౌజన్య తదితరులు ఘటనాస్థలాన్ని శనివారం పరిశీలించారు. ప్రస్తుతం ప్రత్తిపాడు శివారు జువ్వల వారి మెట్ట ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. బోన్లు ఏర్పాటు చేస్తే ఇతర జంతువులు పడే అవకాశం ఉండటంతో ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. -
లైవ్‌లో పులి వేట: నోట మాట రాక కెవ్వు కేక!
ఇంతవరకు మనం పులి జంతువులను వేటాడటం వంటి సన్నివేశాలు డిస్కవరి ఛానెల్స్‌లోనే చూసి ఉంటాం. నిజానికి ఎవ్వరూ నేరుగా చూసేంత ధైర్యం చేయం. కానీ రాజస్థాన్‌లో సరదాగా నేషనల్ పార్క్‌కి వెళ్లిన పర్యటకుల మాత్రం పులి దాడి ఎలా ఉంటుందో చూసి దెబ్బకు బిత్తరపోయి చూస్తుండిపోయారు. (చదవండి: పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్లో ‘హలో వరల్డ్’ ట్వీట్! ఎలాగంటే..) అసలు విషయంలోకెళ్లితే....రాజస్తాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కులో పర్యాటకులు సఫారి వాహనాల్లో పర్యటించారు. అయితే అనుకోకుండా ఇంతలో అక్కడకి ఒక వీది కుక్క ఆ వాహనాల గుండా సంచరించింది. ఇంతలో మొదటి సఫారి వాహనం నుంచి రెండో సఫారి వాహనం వద్దకు వస్తున్న కుక్కపై ఉన్నట్టుండి ఒక పులి ఒక్క ఊదుటున దాడి చేసి పొదల మాటుకి తీసుకుపోయింది. దీంతో అక్కడ ఉన్న పర్యాటకులంతా భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అనీష్ అంధేరియా ట్విట్టర్ పోస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో "పులి కుక్కపై దాడి చేసి చంపడం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కుక్కల ద్వారా డిస్టెంపర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పులులకు సంక్రమించే అవకాశం ఉంది. దీంతో పులుల జనాభా తగ్గుతుంది. వన్యప్రాణుల మనుగడకు ఈ కుక్కలు ముప్పుగా మారాయి అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) Tiger kills dog inside R'bhore. In doing so it is exposing itself to deadly diseases such as canine distemper that can decimate a tiger population in no time. Dogs have emerged as a big threat to wildlife. Their presence inside sanctuaries needs to be controlled @ParveenKaswan pic.twitter.com/t7qDR1MvNl — Anish Andheria (@anishandheria) December 27, 2021 -
అయ్యో! పులి ఎంతపని చేసింది..
పెంచికల్పేట్/దహెగాం (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కమ్మర్గాం గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన పశువులపై మంగళవారం పులి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన తలండి పోశయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. పేదం సురేష్‌కు చెందిన గేదెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దహెగాం మండలం దిగిడ గ్రామంలోనూ పశువులపై పులి దాడి చేసింది. రైతు కుర్సింగ వెంకటేష్‌కు చెందిన ఆవు మేతకు వెళ్లి వస్తుండగా సాయంత్రం సమయంలో దాడి చేసి హతమార్చింది. -
శంషాబాద్‌లో తిష్టవేసిన చిరుత
శంషాబాద్, పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఎయిరో డ్రమ్స్ టవర్ సమీపంలో చిరుత కనిపించిందని విమానాశ్రయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ రక్షణ సిబ్బంది పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విమానాశ్రయంలోని అమెజాన్ గోదాం, మామిడిపల్లి రహదారి వైపు వెళ్లే ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతాలను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అటవీశాఖ అధికారు లు, పోలీసులు గాలించారు. ఎయిరో డ్రమ్ టవర్ ప్రాంతంలో చిరుత సంచరించిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో కనిపిస్తున్న జంతువును చిరు తగా నిర్ధారించలేమని శంషాబాద్ ఎఫ్ఆర్వో శ్యామ్‌కుమార్ స్పష్టం చేశారు. అది అడవి పిల్లిలా కనిపిస్తోందన్నారు. చిరుత పాదముద్రలు కూడా ఎక్కడా లభించలేదని తెలిపారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చిందనే విషయంలోనూ సందేహాలు వ్యక్తమవుతుండగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లిలో కనిపించిన చిరుత రెండ్రోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయ పరిసరాల్లో కనిపించిన చిరుతపులి తాజాగా జల్పల్లి పరిసరాల్లో కనిపించింది. సోమవారం అర్ధరాత్రి జల్పల్లి కార్గో రోడ్డుతో పాటు మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో చిరుత సంచరిస్తుండగా పోలీసులతో పాటు స్థానికులు గమనించారు. శంషాబాద్ నుంచి జల్పల్లి గరిగుట్ట అడవి ద్వారా చిరుత రోడ్డుపైకి వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రిపూట ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి సూచించారు. -
చిరుత సంచారం.. ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో పులి సంచారం వార్తలు కలకలం రేపుతున్నాయి. పులుల సంఖ్య పెరగడంతో ఆ వన్యమృగాలు జనసంద్రంలోకి వస్తున్నాయి. గతంలో రాజేంద్రనగర్, శంషాబాద్ పరిసరాల్లో అలజడి రేపిన చిరుత మళ్లీ ఆదివారం రాత్రి సంచరించిందనే వార్త ఉలిక్కిపడేలా చేసింది. శంషాబాద్ బహదూర్‌గూడలో చిరుత సంచరించినట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో అర్ధరాత్రి పులి పది నిమిషాల పాటు సంచరించిందని గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి గొల్లపల్లి రోడ్డులో ఎయిర్పోర్ట్ గోడ దూకి చిరుత వెళ్లింది. పులి సంచరించిందనే వార్తతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. గతంలో శంషాబాద్, రాజేంద్రనగర్ పరిసరాల్లో పులి కలకలం రేపిన విషయం తెలిసిందే. రహదారిపై దర్జాగా కూర్చుని అనంతరం జనాల రద్దీతో భయాందోళన చెంది వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. అప్పుడప్పుడు కనిపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఎయిర్ పోర్ట్ సమీపంలో కనిపించడం అధికారులు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. -
రోడ్డు పక్కన చిరుత మృతదేహం
సాక్షి, మంచిర్యాల : అటవీ సమీప పల్లెల్ని పులి భయం వీడట్లేదు. పులి సంచారం అధికంగా ఉన్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలంలోని పది గ్రామాలు ఇంకా భయం గుప్పిటే ఉన్నాయి. గత నెలలో ఇద్దరు గిరిజనులను పొట్టనబెట్టుకున్న పులులను బంధించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సోమవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, అధికారులు, ప్రజాప్రతినిధులు పులుల దాడిలో మరణించిన విఘ్నేశ్, నిర్మల కుటుంబాలను పరామర్శించేందుకు కొండపలి్లకి వచ్చారు. అదే సమయంలో యువతిపై దాడిచేసి చంపిన గ్రామమైన కొండపల్లి శివారు శివయ్యకుంటలో మళ్లీ పులి కనిపించడంతో.. పత్తిచేల నుంచి మహిళలు భయంతో పరుగులు తీశారు. పులి భయంతో కూలీలు రాకపోవడంతో చేలలోనే పత్తి ఉండిపోతోందని రైతులు వాపోతున్నారు. చదవండి: ఆవును చంపిన పులి..? బోన్ల చుట్టూ తిరుగుతూ.. పులులను బంధించేందుకు ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ, కొండపల్లి అడవుల్లో 8చోట్ల బోన్లు ఏర్పాటుచేశారు. పందులను ఎరగా ఉంచారు. పులుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలతోపాటు అటవీ సిబ్బంది, ఎన్జీవో సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి శివారులో పలుమార్లు బోను వరకు వచ్చిన పులి అక్కడే తిరిగినట్టు అధికారులు గుర్తించారు. చదవండి: జస్ట్ మిస్.. పులికి బలయ్యేవారు..! వలస పులుల గాండ్రింపు రాష్ట్రంలో కొత్త పులుల రాకతో అడవుల్లో గాండ్రింపులు పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యానికి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా– అందేరి టైగర్ రిజర్వ్ నుంచి వలస వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వు నుంచి పులులు సరిహద్దు దాటి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అడుగుపెడుతున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మగపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. గుండాల, ఇల్లెందు, ఆళ్లపల్లి, మణుగూరు, కరకగూడెం, అశ్వరాపురం అడవుల్లో పులి జాడలు బయటపడ్డాయి. మూడ్రోజుల క్రితం ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల సరిహద్దు నర్సంపేట అడవుల్లో ఆవును చంపిన పులిని గుర్తించే పనిలో అధికారులున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్లోని కోటపల్లి రేంజీలోకి మరో రెండు పులులు వచ్చాయి. ఇందులో ఒకటి గత వేసవిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు వలస వచ్చింది కాగా.. మరొకటి కొత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే చెన్నూరు ప్రాంతంలో రెండు పులులున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోనే పది పులుల వరకు సంచరిస్తున్నాయి. కొత్త పులుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారి పులులు గ్రామశివార్లు, పొలాల్లోకి వస్తున్నాయని అధికారులు అంటున్నారు. అలాగే, మగపులులు తోడు కోసం వెతుక్కుంటూ అడవి దాటి బయటకొస్తున్నాయని చెబుతున్నారు. బాధితులకు అండగా ఉంటాం పెంచికల్పేట్(సిర్పూర్): ఇటీవల పులి దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల, దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్ గత నెలలో పులిదాడిలో మృతిచెందిన విషయం తెల్సిందే. సోమవారం మృతుల కుటుంబ సభ్యులను మంత్రి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. అటవీశాఖ తరఫున పరిహారంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి బాధిత కుటుంబాలకు మరో రూ.5 లక్షల పరిహారం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. రోడ్డుపక్కన చిరుత మృతదేహం సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే దారిలో 44వ జాతీయ రహదారిపై గుడిహత్నూర్ మండలం చింతగూడ వెళ్లే దారిలో సోమవారం సాయంత్రం వాహనదారులు రోడ్డుపక్కన చిరుతపులి పడిపోయి ఉండటాన్ని గమనించారు. కదలిక లేకపోవడంతో కొంతమంది దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. వెం టనే గుడిహత్నూర్ పోలీసులకు సమాచారం అం దించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత రోడ్డుపైకి వచ్చినప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
ఆవును చంపిన పులి..?
ములుగు: ములుగు జిల్లా సరిహద్దు అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు 20 రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి కొద్ది దూరంలో దేవునిగుట్ట ప్రాంతంలోని పొదల్లో ఆవు కళేబరం కనిపించడంతో స్థానికుల అనుమానాలకు బలం చేకూరుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన రైతు తమ ఆవును రోజూ మేతకోసం అడవికి పంపేవాడు. కాగా, గత నెల 25వ తేదీన అడవిలోకి మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం వరంగల్ రూరల్ జిల్లా పరిధి అడ్డబోలు లొద్దిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో అడవిలోకి వెళ్లిన పశువుల కాపరులు పరిశీలించగా పొదల్లో ఆవు కళేబరం కనిపించింది. దీని గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ములుగు అటవీ శాఖ సెక్షన్ అధికారి రమేశ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పరిసరాల్లో చౌడు నేల ఉండడంతో పులి జాడను నిర్ధారించలేక పోయామని ఆయన తెలిపారు. ఆవు కళేబరం దొరికిన స్థలం నర్సంపేట సరిహద్దులో ఉండడంతో అక్కడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, ఆదివారం ఉమ్మడిగా నమూనాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. -
పులి చంపేసింది!
సాక్షి, మంచిర్యాల/పెంచికల్పేట్/బెజ్జూర్: రాష్ట్రంలోని అటవీ గ్రామాల్లో పులుల అలజడి కొనసాగుతోంది. కొన్ని రోజుల కిందటే పెద్ద పులి దాడిలో ఒకరు మరణించిన ఘటన మరువక ముందే మరో గిరిజన యువతిని పులి బలి తీసుకుంది. కుమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి శివారులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండపెల్లికి చెందిన పసుల నిర్మల (18) తల్లి లస్మక్క మరికొందరు కూలీలతో కలసి అన్నం సత్తయ్య చేనులో పత్తి తీసేందుకు వెళ్లింది. కూలీలంతా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తినేందుకు వెళ్తుండగా నిర్మలపై వెనక నుంచి ఒక్కసారిగా పులి దాడి చేసింది. మొదట నడుముపై పంజాతో తీవ్రంగా గాయపర్చింది. ఆ తర్వాత గొంతుపై కరచుకుని లాక్కెళ్లింది. అక్కడే ఉన్న అన్నం చక్రవర్తి అనే యువకుడు కర్రతో పులిని బెదిరించగా మరోసారి దాడి చేసేందుకు యత్నించి పారిపోయింది. చూస్తుండగానే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా అటవీ అధికారి శాంతారామ్, ఎఫ్‌డీవో వినయ్‌కుమార్, రేంజ్ అధికారులు ఘటనాస్థలాన్ని చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దాడి చేసిన పులి గురించి వివరాలు సేకరించారు. జెడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ ఐదు టీంలతో రెండు చోట్ల బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధిస్తామన్నారు. సమీప అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. వణుకుతున్న అటవీ గ్రామాలు.. ఈనెల 11న దహెగాం మండలం దిగిడలో విఘ్నేశ్ అనే యువకుడిపై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే.. ఇది జరిగిన 18 రోజుల్లోనే జిల్లాలో మరొకరు పులికి బలి కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడ్రోజుల క్రితం పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ శివారులో పెద్దవాగులో పులి సంచరిస్తుండగా యువకులకు కనిపించింది. అంతకు ముందు బెజ్జూరు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి అటవీ ప్రాం తాల్లోనూ ఓ పులి కొందరి కంటపడింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు ఎలా వెళ్లాలని స్థానికులు వణికిపోతున్నారు. దహెగాం అడవుల్లో పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినా చిక్కడం లేదు. కాగజ్‌నగర్ డివిజన్లో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆరు పులుల వరకు సంచరిస్తున్నాయి. తడోబా అందేరి టైగర్ రిజర్వులో పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాడులు చేసిన ఘటనలు అనేకం.. ఈ క్రమంలో అటువంటి ఘటనలే ఇక్కడా పునరావృతం అవుతుండటంతో అక్కడి జనం భయాందోళన చెందుతున్నారు. అంబులెన్స్‌కు అడ్డుగా.. ఇటు నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా బెజ్జూర్–పెంచికల్పేట్ సరిహద్దులోని గొల్లదేవర వద్ద దాదాపు 9 నిమిషాల పాటు పులి అంబులెన్స్‌కు అడ్డొచ్చినట్టు అంబులెన్స్ డ్రైవర్ గణేశ్ ‘సాక్షి’కి తెలిపారు. దీంతో వాహన లైట్లు బంద్ చేసి అక్కడే వేచిచూశానన్నారు. బెజ్జూర్–సులుగుపల్లి, చిన్నసిద్దాపూర్, పెద్ద సిద్దాపూర్ గ్రామాల వైపు అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినట్లు వెల్లడించాడు. దాడిచేసింది కొత్త పులే.. దిగిడలో దాడి చేసిన పులి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజా ఘటనలో దాడి చేసింది మరో పులిగా గుర్తించాం. దీనిని మ్యాన్ఈటర్ అనలేం.. పత్తి చేన్లు అటవీప్రాంతంలో పులి ఆవాసం వరకు విస్తరించాయి. దీంతో పులి ఆవాసానికి ప్రతికూలంగా మారాయి. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తాం.. పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నాం. – శాంతారామ్, జిల్లా అటవీ అధికారి ‘అవ్వా సచ్చిన్నే’ అనే అరుపు విని.. అందరం మధ్యాహ్నం పని ముగించుకుని పత్తి చేనులో అన్నం తినేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా ‘అవ్వా సచ్చిన్నే’ అంటూ అరుపు వినబడింది. ఉలిక్కిపడి చూడడంతో పులి యువతిని నోట కరుచుకొనిపోతోంది. వెంటనే ఓ కర్ర తీసుకుని పులిపైకి విసిరాను. అక్కడున్నవాళ్లమంతా అరవడంతో దూరంగా వెళ్లింది. వెళ్లి చూసేసరికి అప్పటికే యువతి మృతి చెందింది. నేను, రాజన్ కలిసి ఆమెను తీసుకొస్తుండగా మాపైకి కూడా గాండ్రిస్తూ మీదకు ఉరకబోయింది. అందరం గట్టిగా అరవడంతో అడవిలోకి పారిపోయింది. –అన్నం చక్రవర్తి, ప్రత్యక్ష సాక్షి -
అదిలాబాద్: పెద్ద పులి వేటకు సిద్ధం
-
అందరూ చూస్తుండగా జూ ఉద్యోగిని చంపిన పులి
జ్యూరిచ్: జూ ఉద్యోగినిపై పులి దాడి చేసి చంపేసిన ఘటన శనివారం స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది. జ్యూరిచ్ జూలో సైబీరియన్ జాతి పులి ఉంది. దాని ఎన్‌క్లోజర్‌లోకి ఓ మహిళా ఉద్యోగి ప్రవేశించింది. దీంతో అక్కడే ఉన్న పులి వెంటనే ఆమె మీద పడి దాడి చేసింది. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పెద్ద ఎత్తున అరుపులు, కేకలు పెట్టడంతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దీంతో అప్రమత్తమైన ఇతర జూ అధికారులు వెంటనే ఎన్‌క్లోజర్ దగ్గరకు ప్రవేశించి పులి దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సహచర ఉద్యోగిని పులి చేతిలో ప్రాణాలు విడిచింది. దీంతో ఆదివారం నాడు జూను తాత్కాలికంగా మూసివేశారు. (గాయపడిన పులి జాడేది..?) ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా.. పులి మెలకువగా ఉన్న సమయంలో ఆమె ఎన్‌క్లోజర్‌లోకి ఎందుకు వెళ్లింది? అన్న విషయంపైనా ఆరా తీస్తున్నారు. కాగా 2015లో డెన్మార్క్‌లోని జంతుప్రదర్శనశాలలో జన్మించిన ఈ పులి పేరు ఐరినా. దీన్ని గతేడాది జ్యూరిచ్ జూకు తీసుకువచ్చారు. ఇక జూలోని జంతువులు మనుషులపై దాడికి దిగడం కొత్తేమీ కాదు. 2019లోనూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న మొసలి అక్కడి ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన ఉద్యోగి చేయి నోట కరిచింది. దాన్ని వదిలించడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మొసలిని కాల్చివేశారు. (మహిళపై సింహాల దాడి) -
పులి ఆకలి ఖరీదు రూ.21 లక్షలు!
సాక్షి, మంచిర్యాల: పులి ఆకలి ఖర్చు.. అక్షరాలా లక్షల రూపాయలు. మేత కోసం అడవికి వెళ్లిన రైతుల పశువులను హతమారుస్తూ పులి తన ఆకలి తీర్చుకుంటోంది. దీంతో సదరు రైతులకు పరిహారం రూపంలో అటవీశాఖ డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా ప్రతి నెలా పులి ఆకలి ఖర్చు పెరిగిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా పరిధిలో విస్తరించిన కవ్వాల్ టైగర్ జోన్లో ఇటీవల పశులవులపై పులుల దాడులు పెరిగాయి. గతంలో కంటే పులుల సంఖ్య పెరగడంతో దాడుల సంఖ్యా పెరిగి నష్టపరిహారం పెరుగు తూ వస్తోంది. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే గతేడాది ఒక్క కాగజ్‌నగర్ డివిజన్‌లోనే 77 పశువులు పులికి ఆహారమయ్యాయి. ఇందుకు రూ. 9.62 లక్షలు పరిహారంగా పశువుల యజమానులకు చెల్లించారు. తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు మరో 5 పశువులపై దాడిచేయగా.. రూ.38 వేలు చెల్లించారు. చెన్నూరు డివిజన్లో 50కిపైగా పశువులు పులి దాడిలో చనిపోగా రూ.6 లక్షలు, బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 32 పశువులకు గాను రూ.5 లక్షల వరకు చెల్లించారు. వన్యప్రాణుల సమతుల్యత దెబ్బతిని.. మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేం ద్రంలో పులుల సంతతి పెరిగి.. అవి ప్రాణహిత నది దాటి కవ్వాల్ టైగర్ జోన్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం కవ్వాల్ టైగర్ జోన్లో 6 పులులు సంచరిస్తున్నట్లు అంచనా. ఈ జోన్లో పులుల సంఖ్యకు అనుగుణంగా శాకాహార జంతువులు లేవు. దీంతో పశువులపై పులుల దాడులు పెరి గాయి. దీంతో అటవీ అధికారులు గడ్డిక్షేత్రాలు పెంచి శాకాహార జంతువుల సంతతిని వృద్ధి చే స్తున్నారు. ఫలితంగా కొన్నాళ్లకు శాకాహార జం తువులు పెరిగే అవకాశాలున్నా.. ఇప్పటికిప్పు డు పులుల సంఖ్యకు అనుగుణంగా వన్యప్రాణులు తక్కువగానే ఉన్నాయి. గతంలో విచ్చలవిడిగా వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవా ణాతో శాకాహార జంతువుల సమతుల్యత దెబ్బ తింది. అదీగాక పంది, జింక, దుప్పి, నీల్గాయి లాంటివి వేటాడటం కంటే మేతకు వెళ్లిన పశువులను వేటాడటం పులికి సులభంగా మారింది. ఏటేటా పెరుగుతున్న పరిహారం పులుల సంచారం అధికంగా ఉన్న కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్ ఫారెస్టు డివిజన్లతో పా టు పెంచికల్‌పేట, బెజ్జూరు, చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో పరిహారం చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల బెల్లంపల్లి, మంచిర్యాల డివిజన్లలోనూ పులుల సంచారం పెరగటంతో పశువులపై దాడులు మొదలయ్యా యి. అటవీ సమీప గ్రామాల శివార్లలో మేతకు వెళ్లిన పశువులపై పులులు పంజా విసురుతున్నాయి. గేదెలు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు ఎక్కువగా పులికి ఆహారమవుతున్నాయి. గత ఫిబ్రవరిలో మంచిర్యాల జిల్లా నీల్వాయి రేంజ్ పరిధి బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో పులి ఏకంగా పశువుల కాపరిపైనే దాడి చేయగా, అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పశువును బట్టి పరిహారం పులి దాడిలో మరణించిన పశువులకు అటవీ అధికారులు పశువును బట్టి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. గేదె, ఆవు, ఎద్దు, గొర్రె, మేకకు ఓ రేటు ప్రకారం ఇస్తున్నారు. పాలిచ్చేవి, పశువుల వయసు తదితర అంశాలను బట్టి విలువ కడుతున్నారు. ఇందుకు స్థానిక పశువైద్యులతో పులి దాడిలోనే చనిపోయిందనే ధ్రువీకరణతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అటవీ అధికారులు విచారణ చేపట్టి నష్టపరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తే చెక్కురూపంలో పశువు యజమానికి డబ్బులు అందుతున్నాయి. దాదాపు రెండు వారాల్లోపే నష్టపరిహారం చెల్లించడంతో పశువుల యజమానులకు ఊరట కలుగుతోంది. పరిహారం చెల్లింపుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. పశువులు పులుల బారిన పడకుండా దాని సంచారం ఉన్నచోటకు వెళ్లొద్దని అటవీ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. -
వైరల్ : ఇది నిజంగా ఊహించని దాడి
పిలిభిత్ : ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒక పులి ముగ్గురు రైతులపై దాడి చేసి బీభత్సం సృష్టించింది. జిల్లాకు చెందిన రామ్ బహదూర్, ఉజగర్ సింగ్, లాల్తా ప్రసాద్‌లు వ్యవసాయక్షేత్రంలో ధాన్యాన్ని తీసుకువెళ్లేందుకు ట్రాక్టర్ పై వెళ్లారు. అయితే వారు వెళ్తున్న దారిలో హఠాత్తుగా చెట్ల పొదల్లో నుంచి ఒక పులి ట్రాక్టర్ మీదకు దూకింది. ట్రాక్టర్లో ఉన్న ముగ్గరిపై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన ముగ్గురు తమ కర్రలతో పులిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పులి కర్రను నోటితో బలంగా లాగడంతో రామ్ బహుదూర్ ట్రాక్టర్ నుంచి కిందపడిపోయాడు. (ఆ డెలివరీ బాయ్‌కు జీవితాంతం గుర్తుండిపోతుంది) దీంతో పులిపై అదే పనిగా కర్రలతో దాడి చేయడంతో ట్రాక్టర్ మీద నుంచి కిందకు దూకిన పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే చిరుతపులి దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదంతా దూరం నుంచి గమనించిన కొందరు తమ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రైతుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిర ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీని తెలుసుకునే పనిలో పడ్డారని ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్ శ్రీవాత్సవ తెలిపారు. (నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం) -
అదిగో పులి.. నిజమే!
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో పులులు సంచరిస్తున్నాయి. ఆదిలాబాద్ శివారు మండలాల్లో గత కొద్ది రోజులుగా పులుల సంచారంపై అలజడి నెలకొన్నా పక్కా ఆధారాలు లభించలేదు. కాని మంగళవారం రాత్రి పులి జైనథ్ మండలం నిరాల వద్ద అంతర్రాష్ట్ర రహదారి దాటుతుండగా రోడ్డుపై కారులో వెళ్తున్న వ్యక్తి సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీయడంతో ఇప్పుడు పులులు తిరుగుతున్నాయనేది నిజమైంది. అయితే తాంసి, భీంపూర్ మండలాల్లో సంచరించిన పులుల్లో ఇది ఒకటా..! లేదా మరోటా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా పులుల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కారులోంచి ఫొటో క్లిక్.. సురక్షిత వన ప్రాంతం కోసం వెతుకులాడుతున్న పులులు మధ్యలో ఆదిలాబాద్ శివారు మండలాల్లోని జనవాసాల్లోంచి వెళ్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయటకు వస్తున్న పులులు పెన్‌గంగ నది దాటి వచ్చి ఆవాసం ఏర్పర్చుకునేందుకు అడుగులు వేస్తూ చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలు, పంట పొలాలు, రోడ్లు దాటుతూ వెళ్తున్నాయి. బేల మండలం అవాల్‌పూర్‌కు చెందిన కె.అనిల్ అవాల్పూర్ నుంచి ఆదిలాబాద్‌కు మంగళవారం రాత్రి కారులో వస్తుండగా నిరాల వద్ద రాత్రి 10.40 గంటలకు పులి రోడ్డు దాటుతున్నప్పుడు తన సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలోని లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నీళ్లు తాగి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవమో కాదోనన్నది తెలియరాలేదు. తాంసి, భీంపూర్ మండలాల్లో ఆవులు, ఎద్దులపై దాడి జరిగిన సంఘటనలను బట్టి రెండు పులులు సంచరిస్తున్నాయనే వదంతులు వినిపించాయి. తాజాగా జైనథ్ మండలం నిరాలలో రోడ్డు దాటుతూ ఒక పులి కనిపించింది. ఆ మండలంలోని దేవుజీగూడ గ్రామంలో ఎద్దులపై పులి పంజా విసిరింది. అక్కడ దాని అడుగులు కనిపించాయి. ఈ నేపథ్యంలో తాంసి, భీంపూర్‌లో సంచరించిన పులుల్లో ఇదొకటా.. లేనిపక్షంలో ఇది మరొక పులినా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేవుజీగూడలో పులి అడుగు, పులి దాడిలో గాయపడ్డ ఆవు ఆవాస బాట.. పెన్‌గంగకు అవతలి వైపు మహారాష్ట్ర భాగంలోని తిప్పేశ్వర్ పులుల అభయారణ్యంలో పులుల పునరుత్పత్తి పెరిగింది. ప్రధానంగా అక్కడ టైగర్ రిజర్వు ప్రాంతంలో 3 గ్రామాలు ఉండగా, ఆ ప్రజలను అక్కడి నుంచి తొలగించి పునరావాసం కల్పించినట్లు ఇక్కడి అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. పులులకు నీళ్లు, వేట కోసం వన్యప్రాణుల లభ్యత ఉండటం, ప్రశాంత వాతావరణం నేపథ్యంలో ఆడ, మగ పులుల కలయికతో పునరుత్పత్తి పెరిగినట్లు చెబుతున్నారు. అలాగే శాఖహారులైన వన్యప్రాణుల కోసం గడ్డి విత్తనాలు పెంచడం, తద్వారా ఆ వన్యప్రాణులు గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ వన్యప్రాణులు పులులకు ఆహారంగా మారుతాయి. ఇటువంటి అనువైన పరిస్థితుల్లోనే అక్కడ పులుల సంఖ్య పెరగడానికి దోహదపడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే తిప్పేశ్వర్ అభయారణ్యం విస్తీర్ణంలో చిన్నది కావడం, ఇటు పులుల సంఖ్య పెరిగిన దృష్ట్యా నిర్దిష్ట ఆవాసం కోసం పులులు తిప్పేశ్వర్ను వీడి మరోప్రాంతం కోసం కదులుతున్నాయి. అవి విస్తీర్ణంలో చాలా పెద్దదైన కవ్వాల్ చేరితే ఈ ప్రాంతంలో వాతావరణ సమతుల్యత ఏర్పడేందుకు దోహద పడతాయని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు కవ్వాల్‌లో పులుల సంచారం ఉన్నా స్థిర నివాసం ఏర్పర్చుకోలేదని, ఈ నేపథ్యంలో ఈ పులులు కవ్వాల్ వైపు వెళ్తే మాత్రం వాటికి నిర్దిష్ట ఆవాసానికి సరిపడ వాతావరణం ఉందంటున్నారు. రాత్రి వేళల్లోనే సంచారం పులులు రాత్రి వేళల్లోనే సంచరిస్తాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రతీరోజు సుమారు 20 కిలో మీటర్ల వరకు కదులుతాయని పేర్కొంటున్నారు. పగటి వేళా విశ్రమిస్తుంది. ఒక ప్రత్యేక ప్రాంతంలో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రాంతంలో కనిపించిన పులి కొద్ది రోజులు ఆ సమీపంలో ఉండి వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే అటవీ శాఖాధికారులు పులుల విషయంలో గోప్యత పాటిస్తున్నారు. అదే సమయంలో వాటికి జనావాసాల సమూహాల్లో ప్రశాంతత వాతావరణం కల్పించడం ద్వారా అభయారణ్యానికి తరలిపోతాయని చెబుతున్నారు. పంట పొలాల చుట్టూ విద్యుత్ వైర్లు అమర్చకుండా చూస్తున్నారు. ప్రధానంగా గ్రామస్తులు భయంతో వాటిని హతమర్చేందుకు ఇలాంటి చర్యలకు దిగే ఆస్కారం ఉందని, ముందు జాగ్రత్తగా అటవీ శాఖాధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తాంసి, భీంపూర్ ప్రాంతాల్లో ఇప్పటికీ బేస్ క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు. -
పులి కదలికలపై నిరంతర నిఘా
సాక్షి, తాంసి(ఆదిలాబాద్) : భీంపూర్ మండలంలోని తాంసి(కె), గోల్లఘాట్ పరిసర ప్రాంతాలలో పశువులపై పులి తరుచూ దాడులు చేస్తూ హత మార్చుతుండడంతో అటవీశాఖ సిబ్బంది తాంసి(కె), గోల్లఘాట్ గ్రామాలలో పులి కదలికలపై నిరంతర నిఘా పెట్టింది. పులి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. సోమవారం అటవీశాఖ కన్జర్వేటర్ వినోద్ కుమార్ తాంసి(కె) గ్రామాన్ని సందర్శించి పులి సంచారం ఉన్న ప్రదేశాలను పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రజలు, పులుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ప్రజలకు, పులులకు ఎటువంటి నష్టం జరుగుకుండా సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంగళవారం ఎఫ్ఆర్వో అప్పయ్య ఆధ్వర్యంలో తాంసి(కె), గోల్లఘాట్ గ్రామాలలో 4 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. తాంసి(కె) గ్రామంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో ఆదిలాబాద్ రేంజ్ అటవీశాఖ అధికారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడవి చిత్రపటం ద్వారా బీట్ అధికారులకు అవగాహన కల్పించారు. పెన్ గంగ పరివాహక ప్రాంతంలో పులి కదలికలను అటవీశాఖ సిబ్బంది పరిశీలించడానికి పెన్‌గంగ నది ఒడ్డున 15 ఫీట్ల ఎత్తుపై ప్రత్యేకంగా మంచెను ఏర్పాటు చేశారు. పులి కదలికలను పరిశీలించడానికి అటవీశాఖ ప్రత్యేకంగా మానిటరింగ్ అధికారిని ఏర్పాటు చేసింది. తాంసి(కె) గ్రామంలో మంగళవారం డివిజనల్ అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, రేంజ్ ఆఫీసర్ అప్పయ్య సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో పులి కదలికల కోసం పరిశీలించారు. -
పశువుల కాపరిపై పులి పంజా
సాక్షి, కోటపల్లి(చెన్నూర్) : మండలంలోని అటవీ ప్రాంతంలో మళ్లీ పులి కదలికలు మొదలయ్యాయి. పులి ఈసారి ఒక అడుగు ముందుకేసి పశువుల కాపరిపై దాడి చేసి గాయపర్చిన ఘటన కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోటపల్లి మండలంలోని బమన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా వెంకటయ్య రోజు లాగానే శుక్రవారం నక్కలపల్లి బమన్‌పల్లి అటవీప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లాడు. పశువులపై ఒక్కసారిగా పులి దాడి చేయబోయే క్రమంలో ప్రతిఘటించడంతో కాపరి కాలుపై పంజా విసిరింది. దీంతో అతనికి కాలికి పెద్ద గాయమైంది. వెంటనే వెంకటయ్య పులిని దగ్గరలోని కట్టలతో బెదిరించినట్లు చేయడంతో పులి అక్కడినుంచి వెళ్లిపోయింది. గ్రామసమీపంలోకి వచ్చి అరుపులు పెట్టడంతో గ్రామస్తులు వచ్చి ప్రథమచికిత్స నిర్వహించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్ఆర్వో రవికుమార్, డిప్యూటీ రేంజర్ దయాకర్ బాధితుడిని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా పులి పాదముద్రలను గుర్తించి ప్లగ్మార్క్ చేసి దాడిచేసింది ఏ1 పులిగా గుర్తించారు. బాధితుడిని మెరుగైన వైద్యంకోసం చెన్నూర్ అస్పత్రికి తరలించారు. భయాందోళనలో స్థానికులు గత డిసెంబర్లో పంగిడిసోమారం అటవీప్రాంతంలో ఏడు ఆవులపై దాడి చేసి హతమార్చిన పులి మళ్లీ కాపరిపై దాడిచేయడంతో గ్రామస్తులు, భయాందోళనలు చెందుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం అడవిలో సంచరిస్తున్న పులి గ్రామాల సమీపంలోకి వస్తుండటంతో పులికి ప్రమాదం పొంచి ఉంది. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమరుస్తుండడంతో అటవీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వేటను సంపూర్ణంగా నిలిపివేయకుంటే పులికి ప్రమాదం ఉంది. -
పశువుల కాపరిపై పులి పంజా
కోటపల్లి (చెన్నూర్): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పశువుల కాపరిపై పులి దాడి చేసింది. బమన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా వెంకటయ్య రోజు లాగానే నక్కలపల్లి అటవీ ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లాడు. ఒక్కసారిగా పశువులపై పులి దాడి చేయబోయే క్రమంలో ప్రతిఘటించడంతో అతనిపై పంజా విసిరింది. దీంతో వెంకటయ్య గాయపడ్డాడు. అతి కష్టం మీద గ్రామ సమీపంలోకి వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యుడు ప్రథమ చికిత్స అందించాడు. మెరుగైన వైద్యం కోసం చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్ఆర్వో రవికుమార్, డిప్యూటీ రేంజర్ దయాకర్ బాధితుడిని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పులి పాదముద్రలను చూసారు. దాడి చేసింది పులి అని గుర్తించారు. -
ఇస్మార్ట్ : పులినే బురిడీ కొట్టించాడు..!
ముంబై : అడవిలో వెళ్తున్న ఇద్దరు స్నేహితులను ఓ ఎలుగు బంటి తరమడం.. దాంతో ఒకరు చెట్టునెక్కి ప్రాణాలు రక్షించుకోవడం. మరొకరు అలా చెట్టునెక్కలేక కిందపడిపోయి చనిపోయినట్టు నటించడం. దాంతో ఆ ఎలుగు అతను చనిపోయాడని పొరబడి అక్కడ నుంచి వెళ్లిపోవడం. ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలోని బంధార జిల్లాలో కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పులి చేతిలో చావు అంచుల దాక వెళ్లిన ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు. దాని తాలూకు వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఆ వీడియో ప్రకారం.. (చదవండి : కుక్కకు పులి వేషం వేసి వాటిని తరిమేశాడు..!) ఊర్లోకి చొరబడ్డ ఓ పులిని గ్రామస్తులంతా వెంటబడి తరుముతున్నారు. అది భయంతో పరుగులు పెడుతూ సమీపంలోని పంట పొలాల్లోకి చేరింది. అంతలోనే అనూహ్యంగా వెనక్కి మళ్లి ఓ వ్యక్తిపై దాడికి యత్నించింది. అతన్ని కింద పడేసి.. ఛాతీ భాగాన్ని నోటితో చీల్చాలని చూసింది. చచ్చాన్రా దేవుడోయ్..! అని భయంతో గుండెలు అదురుతున్నా ఆ వ్యక్తి మాత్రం ధైర్యం కోల్పోలేదు. అంతటి ప్రాణాపాయ స్థితిలోనూ బుద్ధికి పనిచెప్పాడు. ఊపిరి బిగపట్టి చచ్చినట్టు పడున్నాడు. అప్పటికే గ్రామస్తుల అరుపులతో బెదిరిపోయిన పులి.. నోటికి చిక్కిన ‘ఆహారం’ పోతే పోయిందిలే అనుకుంటూ అడవిలోకి పరుగులు పెట్టింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘చచ్చినట్టు నటించడంతో బతికిచచ్చాడు’అని కొందరు సరదా కామెంట్లూ చేస్తున్నారు. (చదవండి : గొల్లపల్లి అడవిలో పులి సంచారం) -
ఇస్మార్ట్ : పులినే బురిడీ కొట్టించాడు..!
-
పులి పంజాకు సింహం వెనకడుగు..
అడవిలో సింహం పులిపై దాడికి దిగడం సహజం. కానీ, పులి సింహంపై ఎదురు దాడికి దిగితే ఎలా ఉంటుంది? ఈ రెండూ తలపడితే ఏది గెలుస్తుంది. తెలుసుకోవాలని ఉందా... అయితే ఈ వార్త చదవండి. గడ్డి మైదానంలో పులి, సింహాలు ఇతర జంతువులతోపాటు సేదతీరుతున్నాయి. ఈ క్రమంలో ఓ సింహం ఒక్కసారిగి అక్కడున్న పులిపై దాడి చేసి దాని మెడపై కొరికింది. దీంతో పులి ఒక్క ఉదుటున లేచి సింహం ముఖం మీద దాడి చేసింది. దీంతో బెదిరిపోయిన సింహం ఏమీ చేయలేక అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయింది. ఈ వీడియోను అటవీశాఖ అధికారి సుశాంత్ నందా ఆదివారం ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ‘‘పులి బలమైనది.. సింహం కౄరమైనది. సింహం ఎప్పుడూ ఓటమిని అంగీకరించదు. చనిపోయే వరకు పోరాడుతుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. When it comes to paw & claw striking, a tiger acts like a boxer. This lion realised it in a hard way. Swipe of a tiger paw is powerful enough to smash a cow’s skull. Watch the poor lion in slow motion pic.twitter.com/WlgvsaI73k — Susanta Nanda IFS (@susantananda3) 29 December 2019 -
కవ్వాల్‌లో మరో పులి..!
సాక్షి, మంచిర్యాల: కవ్వాల్ అభయారణ్యంలోకి మరో పెద్దపులి వచ్చి చేరింది. మహారాష్ట్ర నుంచి దాదాపు పది రోజల క్రితం ఈ పులి కవ్వాల్ అటవీ ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల వరుసగా చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఈసారైనా పులి వేటగాళ్ల ఉచ్చు బారిన పడకుండా అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. తిప్పేశ్వర్ టూ కవ్వాల్ పులి జాడలు తగ్గుతున్న జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలోకి ఓ పెద్దపులి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గత పది రోజుల క్రితం ఈ పులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు కూడా అంతర్గత సంభాషణల్లో ధ్రువీకరిస్తున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యానికి చెందిన ఈ పెద్దపులి జిల్లాకు వచ్చినట్లు తెలిసింది. తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం, పెంబి ప్రాంతాల గుండా పది రోజుల క్రితం కవ్వాల్ అడవిలోకి ప్రవేశించినట్లు సమాచారం. కాగా, గతంలో మృత్యువాతకు గురైన రాయల్ బెంగాల్ టైగర్ కూడా తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి కవ్వాల్కు రావడం తెలిసిందే. కవ్వాల్ అభయారణ్యం నుంచి తిర్యాణి, ఆసిఫాబాద్‌ల గుండా ప్రయాణం చేసి శివ్వారం చేరుకున్న రాయల్ బెంగాల్ టైగర్ అక్కడ వేటగాళ్ల ఉచ్చుకు బలి కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ‘ఉచ్చు’లో పడొద్దు పెద్దపులుల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంటే, మరో వైపు వేటగాళ్ల ఉచ్చులకు అరుదైన పులులు సైతం జిల్లాలో హతమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు జంతుప్రేమికులతోపాటు ప్రభుత్వాన్ని కూడా ఆందోళనలో పడవేసింది. చిరుత పులితోపాటు రాయల్ బెంగాల్ టైగర్ మృత్యువాత పడడంతో స్థానిక అటవీశాఖ అధికారులపై బదిలీ వేటు కూడా పడింది. శివ్వారం ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు రాయల్ బెంగాల్ టైగర్ బలి కావడం, పులి చర్మం విక్రయం, మోసాలు తదితర ఉదంతాలు వెలుగు చూడడం తెలిసిందే. కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించిన నెల రోజుల లోపే ఆ పెద్దపులి మృత్యువాత పడడం కలకలం రేపింది. గత డిసెంబర్ 15న మొదటి సారి పెద్దపులి కనిపించగా, జనవరి 8న మృత్యువాత పడింది. ఈ సంఘటనకు సంబంధించి అప్పట్లో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. పులి వేట అంతం పేరిట చంద్రాపూర్‌కు చెందిన గ్యాంగ్ పులి చర్మం దందా సాగించిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. పులి చర్మం కోసం అంతర్రాష్ట్ర ముఠా రంగ ప్రవేశం చేయడం, ఎన్జీవో సంస్థ పేరుతో బేరసారాలు చేయడం, డీల్ కుదరకపోవడంతో అటవీ అధికారులకు సమాచారం అందించడం వంటి సంఘటనలపై పరిశోధనాత్మక కథాలు అందించింది. రెండేళ్లలో మూడు అరుదైన పులులు హతం కావడం, మిస్టరీగా మారడంతో సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. పెద్దపులులను రక్షించలేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, కేసును అటవీశాఖ నుంచి పోలీసు శాఖకు బదలాయించగా, దోషులను రామగుండం కమిషనరేట్ పోలీసులు స్వల్పకాలంలోనే అదుపులోకి తీసుకున్నారు. కాని అరుదైన రాయల్బెంగాల్టైగర్ మృత్యువాత పడడాన్ని జంతు ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో పెద్దపులి కవ్వాల్ అడవిలోకి రావడంతో.. ఈ పులినైనా అటవీశాఖ అధికారులు రక్షిస్తారా అనే చర్చ జిల్లాలో మొదలైంది. ఇప్పటికే కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విద్యుత్ షాక్‌తో వన్యప్రాణుల ప్రాణాలు తీస్తుండడంపై దృష్టి పెట్టిన అధికారులు, విద్యుత్ సరఫరా, నియంత్రణపై చర్యలు ప్రారంభించారు. ఏదేమైనా తాజాగా కవ్వాల్ ప్రాంతానికి వచ్చిన పెద్దపులి వేటగాళ్ల ఉచ్చులోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది. -
పెద్దపులిని రెచ్చగొట్టి మరీ...
తన మానాన తాను వెళ్తున్న మూగ జీవిని వెంటాడారు. రెచ్చగొట్టి మరీ దానిపై కర్రలతో దాడి చేశారు. మృగ చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో విషయం వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కోల్‌కతా: సందర్‌బన్స్ నదీలో ఓ పులి నదిని ఈదుకుంటూ కెందో ఐలాండ్ వైపుగా వెళ్తోంది. అదే సమయంలో అటుగా పడవలో వెళ్తున్న కొందరు మత్స్యకారులు దానిని గమనించారు. గట్టిగా అరుస్తూ దానికి దగ్గరగా వెళ్లారు. తిక్క చేష్టలతో దానిని రెచ్చగొట్టడంతో అదికాస్త పడవవైపుగా దూసుకొచ్చింది. దీంతో పడవలో ఉన్న ఓ వ్యక్తి వెదురు బొంగుతో దానిని గాయపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుందని, అయితే గాయపడినప్పటికీ అది ఈదుకుంటూ ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. పులిని గాయపరిచిన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసి,వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ నిలన్‌జన్ మల్లిక్ తెలిపారు. -
పెద్దపులిని రెచ్చగొట్టి మరీ...వీడియో వైరల్!
-
ఆమె బోనులో ఉండగానే పులి వచ్చేసింది!
లండన్: ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని ఓ జూపార్కులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఉద్యోగి సరిగ్గా బోనులో ఉన్న సమయంలోనే పులి అందులోకి ప్రవేశించి.. ఆమెపై దాడి చేసి చంపేసింది. కేంబ్రిడ్జ్‌షైర్‌లోని హమ్మర్టన్ జూపార్కులో సోమవారం ఉదయం 11. 45 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 33 ఏళ్ల మహిళా జూకీపర్ రోజా కింగ్ ప్రాణాలు కోల్పోయింది. రోజా కింగ్ బోనులో ఉండగానే అదే సమయంలో పులి కూడా రావడంతో ఆమె ప్రాణాలు కాపాడటానికి సహచర సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. పులికి మాంసం ముక్కలను విసిరి దాని దృష్టి మళ్లించేందుకు యత్నించారు. అయినా పులి ఏమాత్రం తగ్గకుండా రోజాకింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె కేకలతో జూపార్కు దద్దరిల్లింది. వెంటనే జూపార్కులో ఉన్న వందమంది సందర్శకులను వెంటనే బయటకు పంపేశారు. సహచర సిబ్బంది కళ్లముందే రోజాకింగ్‌పై పులి దాడి చేసి ఉంటుందని ప్రత్యక్ష సాక్షి పీట్ డేవిస్ తెలిపారు. ‘అప్పుడు వినిపించిన కేకలు ఆమెవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కేకలతో ఏదో భయంకర ఘటన సంభవించిందని అనుకున్నాం. పులి ఆమెపై దాడిచేసినట్టు కనిపించింది’ అని ఆ సమయంలో జూలో ఉన్న డేవిస్ చెప్పారు. పులి లేదని రోజాకింగ్ బోనులోకి ప్రవేశించిందని, ఆ వెంటనే తోటి సిబ్బంది కేకలు వేయడంతో ఆమె తేరుకుందని, అంతలోనే పులి ఆమెపై విరుచుకుపడిందని మరో సాక్షి తెలిపారు. రోజాకింగ్కు జంతువులంటే ఎంతో ప్రాణమని, ఆమె జంతువులను ఎంతో ప్రేమగా చూసుకునేదని స్నేహితులు, బంధువులు చెప్తున్నారు. ఇది అసాధారణ ఘటన అని జూ నిర్వాహకులు చెప్తుండగా.. ఈ సీరియస్ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు కేంబ్రిడ్జ్‌షైర్ కౌంటీ పోలీసులు తెలిపారు. -
పార్కులో రికార్డయిన షాకింగ్ వీడియో
-
పార్కులో రికార్డయిన షాకింగ్ వీడియో
బీజింగ్: వీకెండ్ ఎంజాయ్ చేద్దామని ఫ్యామిలీతో కలిసి పార్క్ కు వెళ్లిన మహిళ.. అనూహ్యంగా పులికి ఆహారమైంది. ఆ పాశవికదాడికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనా రాజధాని బీజింగ్ నగరంలోగల బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్క్ లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్కులో.. సందర్శకులు తమ సొంత కార్లలో సఫారీకి వెళ్లే వీలుంది. కారులో కుటుంబ సభ్యులతో వాదన పెట్టుకున్న యువతి.. అలిగి కారు దిగింది. మరో వైపు నుంచి మళ్లీ కారు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా ఓ పులి ఒక్కసారిగా దాడిచేసింది. బలమైన పంజాతో యువతిని లాక్కుపోయింది. కారులో ఉన్న వ్యక్తి, మరో మహిళ పులిని వెంబడించి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీన్ లోకి ఎంటర్ అయిన మరో పులి.. సాయం చేసేందుకు వచ్చిన రెండో మహిళపై దాడిచేసి చంపేసింది. పార్క్ సిబ్బంది పరుగున వచ్చి అదిలించడంతో పులులు పారిపోయాయి. కాగా, మొదట దాడికి గురైన యువతి గాయలతో బయటపడింది. పురుషుడికి గాయాలుకాలేదు. కారులో ఉన్న మరో చిన్నారి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. పులల దాడితో ఒక్కసారిగా పార్క్ ఆవరణమంతా వణికిపోయింది. అధికారులు పార్క్ ను తాత్కాలికంగా మూసేశారు. 2014లోనూ బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్క్ లో ఇలాంటి సంఘటన జరిగింది.