
పెంచికల్‌పేట్/దహెగాం (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం కమ్మర్‌గాం గ్రామ సమీపంలో మేతకు వెళ్లిన పశువులపై మంగళవారం పులి దాడి చేసింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన తలండి పోశయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. పేదం సురేష్‌కు చెందిన గేదెకు తీవ్ర గాయాలు అయ్యాయి. దహెగాం మండలం దిగిడ గ్రామంలోనూ పశువులపై పులి దాడి చేసింది. రైతు కుర్సింగ వెంకటేష్‌కు చెందిన ఆవు మేతకు వెళ్లి వస్తుండగా సాయంత్రం సమయంలో దాడి చేసి హతమార్చింది.

ధాన్యం రాశులతో నిండిన ఈ ఆవరణ జనగామ వ్యవసాయ మార్కెట్‌లోని కాటన్ యార్డు. యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో పది ఎకరాల్లో ఉన్న కాటన్ యార్డు కాస్త వందలాది ధాన్యం కుప్పలతో ఇలా నిండిపోయింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జనగామ

ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో భారీ వర్షానికి మిర్చి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న తో పాటు కోయడానికి సిద్ధంగా ఉన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా వర్షం మొదలుకావడంతో పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడినా ఫలితం లేకుండా పోయింది.

కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. వ్యాక్సినేషన్ సెంటర్లకు జనం పోటెత్తుతున్నారు. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రిలో మంగళవారం వ్యాక్సిన్ కోసం జనం ఇలా ఎగబడ్డారు. మూసిన గేటులోంచి చొచ్చుకుపోయేందుకు సైతం ప్రయత్నించారు.

వ్యాక్సిన్, కరోనా పరీక్షల కోసం ఓవైపు అల్లాడుతుండగా.. మరోవైపు వీధుల్లో జనం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మంగళవారం రామంతపూర్ వివేక్‌నగర్‌లో కూరగాయాల సంతలో ఇలా జనం కిక్కిరిసి కనిపించారు.

ఇంటర్ పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఊళ్లకు పయనమయ్యారు. ఇన్ని రోజులు వివిధ హాస్టళ్లు, రెసిడెన్షియల్స్‌లో ప్రిపరేషన్‌లో ఉన్న విద్యార్థులు ఇక సొంతూరే సేఫ్ అని బయలు దేరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు వీలైనంత త్వరగా తమ తమ ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా అటు రైల్వే స్టేషన్, ఇటు బస్ స్టేషన్ రెండూ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్న విద్యార్థులు, పీఎన్‌బీఎస్‌లో క్లోక్ రూం వద్ద ఉంచిన విద్యార్థుల లగేజీ బ్యాగులను చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన టెంట్‌లో గురుద్వారా అందజేసిన ఉచిత ఆక్సిజన్‌తో కరోనా బాధితురాలు

కరోనా రోగులకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్‌తో వెళ్తున్న ట్యాంకర్‌కు ఢిల్లీ పోలీసుల ఎస్కార్ట్

రాజస్థాన్‌లోని జైపూర్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకుని క్వారంటైన్‌కు తరలిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment