సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్య మృగాల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిపై పులి దాడి చేయగా.. తాజాగా చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు.
వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డెడ్రా సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఇక, చిరుత దాడి నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఓ మహిళపై పులి దాడి చేయడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అనంతరం, ఆదిలాబాద్ జిల్లాలోనే మరో ఇద్దరికిపై పులి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వన్య ప్రాణుల వరుస దాడుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment