ఐకమత్యమే మహాబలం.. మన చిన్నప్పటి నుంచి వింటున్న మాటే ఇది. ఆరణలోనూ ఇది సాధ్యమేనంటూ నిరూపించే ఘటనలనూ చూస్తూ వస్తున్నాం కూడా. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఓ ఘటన.. సీసీటీవీఫుటేజీ బయటకు రావడంతో వైరల్ అవుతోంది.
ఆవుల మంద నుంచి ఒంటరిగా ఉన్న ఓ ఆవుపై నక్కినక్కి వచ్చి దాడికి దిగింది ఓ పెద్దపులి. దీంతో అది చావుకేకలు వేయగా.. అది చూసిన మిగతా ఆవులు బెదిరి చెల్లాచెదురు కాలేదు. క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ముందుకు ఉరికాయి. వాటి ధైర్యానికి ఆ పులి బెదిరింది. ఆవును వదిలేసి అక్కడి నుంచి పొదల్లోకి లంఘించుకుంది.
అయితే పులి అక్కడక్కడే ఉండడంతో.. గాయపడిన ఆ ఆవును చుట్టుముట్టి మళ్లీ దాడికి దిగకుండా తెల్లవారే దాకా కాపలాగా ఉన్నాయి మిగతా ఆవులు. ఆదివారం అర్ధరాత్రి భోపాల్ కేర్వా శివారుల్లోని ఓ డెయిరీ ఫామ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. గాయపడిన ఆ ఆవు పరిస్థితి పాపం విషమంగా ఉన్నట్లు సమాచారం.
संगठन में शक्ति है…
— Upmita Vajpai (@upmita) June 20, 2023
भोपाल के मदरबुल फार्म में बाघ ने एक गाय पर हमला किया तो उस गाय को बचाने दौड़ पड़ा गायों का झुंड।
देखिए वीडियो…#Bhopal #cows pic.twitter.com/678Gy4YyN2
ఇదీ చూడండి: ఆ ఊర్లో మహిళలంతా దుస్తుల్లేకుండా ఐదురోజులపాటు..
Comments
Please login to add a commentAdd a comment