ఇంట్లోకొచ్చి బాలుడిని లాక్కెళ్లిన పులి.. రెండ్రోజుల్లో రెండో ఘటన | A Tiger Killed A Boy In Chandrapur Maharashtra Tiger Attacks | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఉన్న బాలుడిని లాక్కెళ్లి చంపేసిన పులి.. రెండ్రోజుల్లో రెండో ఘటన

Published Tue, Jan 10 2023 10:34 AM | Last Updated on Tue, Jan 10 2023 10:58 AM

A Tiger Killed A Boy In Chandrapur Maharashtra Tiger Attacks - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో పులులు పంజా విసురుతున్నాయి. వరుసగా రెండ్రోజుల్లో ఓ యువకుడితో పాటు బాలుడు పులి బారినపడి మరణించారు. సిందేవాహిని గ్రామంలో పులి ఇంట్లోకి వచ్చి మరి బాలుడిని లాక్కెళ్లి చంపేసింది. ఇంటిలోంచి బాలుడిని లక్కెళ్లిన క్రమంలో గ్రామస్థులు కోపోద్రిక్తులయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీలైనంత త్వరగా పులలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్‌ చేశారు. 

అంతకు ముందు రోజు ఓ యువకుడిని పొట్టనపెట్టుకుంది పులి. తల్లిదండ్రులు జాతరకు వెళ్లిన క్రమంలో పంటపొలానికి వెళ్లిన యువకుడిపై పులి దాడి చేసి చంపేసింది. శివాని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తరుచుగా పులులు పంజా విసురుతున్నాయని.. ఆ ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పులుల బారినుంచి తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: మాస్కో- గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement