Chandrapur district
-
మహారాష్ట్ర చంద్రపూర్‌లో పులులు పంజా
-
ఇంట్లోకొచ్చి బాలుడిని లాక్కెళ్లిన పులి.. రెండ్రోజుల్లో రెండో ఘటన
ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో పులులు పంజా విసురుతున్నాయి. వరుసగా రెండ్రోజుల్లో ఓ యువకుడితో పాటు బాలుడు పులి బారినపడి మరణించారు. సిందేవాహిని గ్రామంలో పులి ఇంట్లోకి వచ్చి మరి బాలుడిని లాక్కెళ్లి చంపేసింది. ఇంటిలోంచి బాలుడిని లక్కెళ్లిన క్రమంలో గ్రామస్థులు కోపోద్రిక్తులయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీలైనంత త్వరగా పులలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. అంతకు ముందు రోజు ఓ యువకుడిని పొట్టనపెట్టుకుంది పులి. తల్లిదండ్రులు జాతరకు వెళ్లిన క్రమంలో పంటపొలానికి వెళ్లిన యువకుడిపై పులి దాడి చేసి చంపేసింది. శివాని అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తరుచుగా పులులు పంజా విసురుతున్నాయని.. ఆ ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పులుల బారినుంచి తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదీ చదవండి: మాస్కో- గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ
ముంబై: ప్రజాప్రతినిధులకు సమస్యలపై విజ్ఞప్తి చేయడం చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం తన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు తనకు ప్రేయసి (గర్ల్‌ఫ్రెండ్)ను ఏర్పాటు చేయాలని లేఖ రాశాడు. ఆ లేఖ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘నేను మంచోడిని.. నన్నెవరు పట్టించుకోవడం లేదు.. మీ నియోజకవర్గ అమ్మాయిలను ప్రేమించేలా ప్రోత్సహించండి’ ఆ యువకుడు లేఖ రాశాడు. అయితే ఆ లేఖ ఎవరూ రాశారో కనుక్కుంటే విస్తుగొల్పే నిజం తెలిసింది. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని రాజూరా ఎమ్మెల్యే సుభాశ్ ధొతేకు ఇటీవల ఓ లేఖ వచ్చింది. మరాఠీలో రాసిన ఆ లేఖ భూషణ్ జాంబవంత్ రాఠోడ్ పేరిట వచ్చింది. ఆ లేఖ తెరచి చూడగా.. ‘మన ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. గద్‌చందూర్ నుంచి రాజురా మధ్య నిత్యం ప్రయాణిస్తుంటా. భవిష్యత్‌లో నాకు ప్రేయసి దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు. తాగుబోతులకు తప్ప ఎలాంటి చెడు అలవాట్లు లేని నాలాంటివారికి ప్రేయసి దొరకడం లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న అమ్మాయిలను ప్రోత్సహించండి’ అంటూ ఆ లేఖలో ఎమ్మెల్యేకు సూచిస్తూ పంపాడు. ఆ లేఖను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఆరా తీశారు. చదవండి: లవ్ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్బుక్ భూషణ్ జాంబవంత్ రాఠోడ్ పేరుగల వారిని ఆరా తీయగా అలాంటి పేరుతో ఉన్నవారెవరూ లేరు. వైరల్‌గా మారడానికి ఇలా లేఖ రాశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ లేఖపై సోషల్ మీడియా ఫన్నీగా స్పందిస్తోంది. నీదే కాదు బ్రదర్ నా పరిస్థితి అంతే అంటూ సింగిల్ కింగ్‌లు పేర్కొంటున్నారు. ఫన్నీ మీమ్స్, కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి లేఖ రావడం ఇదే మొదటిసారిని ఎమ్మెల్యే పేర్కొన్నాడు. ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే అతడికి కౌన్సిలింగ్ ఇస్తామని ఎమ్మెల్యే సుభాష్ చెప్పాడు. -
‘మా దేవుడు నువ్వేనయ్యా’.. మంత్రికి హారతి, పూజలు!
బతికుండగా.. అందులో ఓ మంత్రిగారికి హారతి అందిస్తూ పూజలు చేస్తున్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి చంద్రాపూర్‌లో ఓ బార్ ఓనర్. ఫొటోలో హారతి అందుకుంటోంది మహారాష్ట్ర గార్డియన్ మినిస్టర్ విజయ్ వాడెట్టివర్. జిల్లా వ్యాప్తంగా మద్య నిషేధం ఎత్తేయడంతో కృతజ్ఞతగా అలా పూజలు చేస్తున్నాడట. ముంబై: మహరాష్ట్రలో చంద్రాపూర్‌తో పాటు వార్ధా, గడ్చిరోలి జిల్లాలో 2015, ఏప్రిల్ నెల అప్పటి ఫడ్నవిస్ సర్కార్ లిక్కర్ బ్యాన్ విధించి.. లైసెన్స్‌లు కూడా వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి ఈ మూడు జిల్లాల్లో మద్య నిషేధం అమలు అవుతోంది. ఇక ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని 2018లో రిటైర్డ్ అధికారి రామనాథ్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది మహారాష్ట్ర సర్కార్. అయితే.. మద్యం అమ్మకాల నిషేధం వల్ల క్రైమ్ రేట్ తగ్గకపోగా.. నకిలీ మద్యం అమ్మకాలు పెరిగాయని ఈ ఏడాది మే నెలలో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు శివసేన సర్కార్ పోయిన వారం ప్రకటించింది. ఇక కమిటీకి మద్య నిషేధం ఎత్తేయాలని సూచించిన వాళ్లలో చంద్రాపూర్ జిల్లా గార్డియన్ మంత్రి (మొత్తం 36 మంది గార్డియన్ మంత్రుల హోదాలో జిల్లాలకు పర్యవేక్షకులుగా ఉన్నారు) విజయ్ వాడెట్టివర్ కూడా ఉన్నారు. అందుకే అలా హారతి ఇస్తున్నాడట ఆ బార్ ఓనర్. ‘మాకు ఆయన దేవుడే. మా బతుకు తెరువును మళ్లీ మాకు ఇప్పించాడు. అందుకే ఈ పూజలు’ అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే ఈ ఐదేళ్లలో మద్య నిషేదంతో చంద్రాపూర్ నుంచి సుమారు 1,600 కోట్ల రూపాయల్ని మహా సర్కార్ నష్టపోయింది. Maharashtra: Owner of a bar & restaurant in Chandrapur, performs 'aarti' of a photo of district's Guardian Minister Vijay Wadettiwar, as the six-yr-old liquor ban here was lifted by state govt last week He says, "For us he is God. Whoever helps us earn a livelihood, is our God." pic.twitter.com/YikN32AEWb — ANI (@ANI) July 10, 2021 -
ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి
చంద్రాపూర్: మహారాష్ట్రలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి కోర్పన-వాణి రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్, ట్రక్లు బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న పదకొండు మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్లతో పాటు వ్యాన్ డ్రైవర్ ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ చిలుక నన్ను బండబూతులు తిడుతోంది..
అనగనగా ఒక రామచిలుక. దాని పేరు హరియాల్. ప్రతిరోజు యజమాని నేర్పే మాటలను అందంగా వల్లెవేస్తూ ఉంటుంది. ఇంటికి ఎవరొచ్చినా పలకరిస్తుంది. కానీ ఒక బామ్మ కనపడితేమాత్రం తిట్ల దండకం అందుకుంటుంది. మామూలుగా కాదు.. చెవులు తూట్లు పడేందతటి బూతులు తిడుతుంది. అలా నెలలపాటు చిలుక తిట్లను భరించి.. సహనం కోల్పోయిన ఆ వృద్ధురాలు.. మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? చిలుక ఆమెను ఎందుకలా తిడుతోంది? మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. 85 ఏళ్ల జనాబాయి సకార్కర్ అనే వృద్ధురాలు చంద్రపూర్ జిల్లా రాజూరాలో నివసిస్తోంది. ఆమె ఇంటికి కొద్ది దూరంలోని మరో ఇంట్లో సవతి కొడుకు సురేశ్ ఉంటున్నాడు. సురేశ్ ఆ మధ్య ఓ చిలకను కొన్నాడు. అప్పటికే నాలుగైదు పదాలు పలకగల ఆ చిలుకకు బూతులు నేర్పాడు. జనాబాయి ఫొటోను చూపిస్తూ ఆమె కనిపించినప్పుడు బూతులు మాట్లాడేలా చిలుకకు శిక్షణ ఇచ్చాడు. అలా జనాబాయి కనిపించినప్పుడల్లా తిట్లతో ఆమెను అవమానించేది హరియాల్ చిలుక. ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో విబేధాలు తలెత్తడంతో జనాబాయికి, ఆమె సవతి కొడుకు సురేశ్ తో సయోధ్య చెడింది. అప్పటినుంచి ఆమెపై కక్ష గట్టిన సురేశ్ చిలుక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జానాబాయి, సురేశ్‌లతోపాటు హరియాల్ (చిలుక)ను కూడా స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ సీన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదులో పేర్కొన్నట్లు జనాబాయిని చూడగానే చిలుక తిట్టడం మొదలుపెట్టాలి. కానీ అప్పుడలా జరగలేదు. పోలీసులను గుర్తుపట్టిందో ఏమోగానీ స్టేషన్లో నోరుమెదపకుండా కూర్చుంది హరియాల్. దీంతో ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ కావాలా? అని తలపట్టుకున్నారు పోలీసులు! సుదీర్ఘ ఆలోచన తర్వాత జనాబాయి మానసిక ఆందోళనలో న్యాయం ఉన్నదని గుర్తించి.. సదరు చిలుకను అటవీశాఖకు అప్పగించారు. సురేశ్, జనాబాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపేశారు. -
చంద్రాపూర్ జిల్లాలో మద్య నిషేధం
రాష్ట్రమంత్రివర్గ నిర్ణయం ఫలించిన జిల్లావాసుల ఐదేళ్ల పోరాటం సాక్షి, ముంబై: చంద్రాపూర్ జిల్లా వాసుల ఐదేళ్ల పోరాటం ఫలించింది. ప్రజల కోరికను మన్నించిన ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లాలో మద్యం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. విదర్భ ప్రాంతంలోని గనుల జిల్లాగా పేరొందిన చంద్రాపూర్‌లో మద్యం అమ్మకం, కొనుగోలు, ఉత్పత్తి, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మంగళవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మహారాష్ట్రలో మద్యం నిషేధాన్ని అమలు చేయనున్న మూడో జిల్లా చంద్రాపూర్ కానుంది. తూర్పు మహారాష్ట్రలో చంద్రాపూర్‌కు పొరుగునున్న వార్ధా, గడ్చిరోలీ జిల్లాల్లో కూడా మద్య నిషేధం అమలులో ఉంది. ప్రభుత్వ ప్రకటనతో జిల్లా వాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు అభినందించుకున్నారు. ముఖ్యంగా మహిళలు నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దులో ఈ మూడు జిల్లాలు ఉన్నందున అక్రమ మద్యం వ్యాపారం కొనసాగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఒక అధికారి అభిప్రాయపడ్డారు. మద్యం వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక న్యాయ విభాగం ఒక కార్యక్రమాన్ని చేపడుతుందని ఆయన చెప్పారు. ఈ మూడు జిల్లాల్లో మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్ శాఖలకు సరిపోను సిబ్బందిని సమకూరుస్తామని అన్నారు. ప్రస్తుతం చంద్రాపూర్ జిల్లాలో జారీ చేసిన మద్యం పర్మిట్లన్నింటినీ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తామని చెప్పారు. ఐదేళ్ల పోరాటం చంద్రాపూర్‌లో మద్యం నిషేధం అమలు చేయాలని 2010 నుంచి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సు మేరకు నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటు వార్ధా జిల్లాలో కూడా సంపూర్ణ మద్యం నిషేధం అమలవుతోంది. అటు గడ్చిరోలీ జిల్లాలో 1992 నుంచే మద్య నిషేధం అమలులో ఉంది. చంద్రాపూర్‌లో మద్య నిషేధం విధించడాన్ని జిల్లా ఇన్చార్జి, ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ స్వాగతించారు. తన రాజకీయ జీవితంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయమని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే తన జిల్లా ప్రజల వాణిని వినిపించానని చెప్పారు. 2010లో అసెంబ్లీలో ప్రైవేటు సభ్యుని తీర్మానాన్ని ప్రవేశపెట్టానని తెలిపారు. జిల్లాలో ఒక్కో కుటుంబం ఏడాదికి సగటున రూ.10వేలు మద్యంపై ఖర్చు చేస్తోందని చెప్పారు. జిల్లాలో సుమారు వెయ్యి నుంచి 1,200 కోట్ల రూపాయలు మద్యంపై వృథా అవుతున్నట్లు ఒక అంచనా అని అన్నారు. జిల్లాలో 847 గ్రామ పంచాయతీలుండగా, మద్య నిషేధం విధించాలని 588 పంచాయతీలు తీర్మానం చేశాయి. 2010లో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా జిల్లాకు చెందిన ఉద్యోగినులు చీమూరు నుంచి నాగపూర్ వరకు 130 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి మద్యం నిషేధం విధించాలని డిమాండ్ చేశా రు. 22 లక్షల మంది ఉన్న జిల్లాలో రూ.600 కోట్ల మద్యం వినియోగమవుతోంది. రాష్ట్రమంతటా అమలు చేయాలి: భంగ్ మద్య నిషేధాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని సామాజిక కార్యకర్త అభయ్ భంగ్ డిమాండ్ చేశారు. గుజరాత్లో సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉందని, అయినా అక్కడ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగడం లేదని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో మద్యంపై ఏటా రూ.10వేల కోట్ల ఆదాయం వస్తోంది. -
మహారాష్ట్రలో తెలంగాణ సర్వే..!
సాక్షి ముంబైః మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని 14 గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామాలవాసులకు ఎన్నో ఏళ్లుగా ఇరు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ గ్రామాల సరిహద్దులపై మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగింది. దీనిపై 1997లో సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. ఈ మేరకు జీవితి తాలుకాలోని పరమడోలి, తాండా, ముకాదమగూడా, కోడా, లెండిజాలా, మహారాజగూడ, శంకర్‌లోధి, అంతాపూర్, ఇందిరానగర్, పద్మావతి, యెసాపూర్, పలస్‌గూడ, భోలాపటార్, లెండిగూడ మొదలగు గ్రామాలు మహారాష్ట్రకు చెందుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడి గ్రామాల ప్రజలు అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి గ్రామాల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తారురోడ్లు వేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన తారు రోడ్లు కానరాకుండాపోగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన తారు రోడ్డు మాత్రం ఇప్పటికీ వినియోగంలో ఉంది. దీంతోపాటు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల ప్రజలను నిర్లక్ష్యం చేయడంతో కొత్తగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఈ గ్రామాల్లో కూడా నిర్వహించింది. దీనిపై మహారాష్ట్ర అధికారికంగా స్పందించలేదు.