ట్రంప్‌ ఓ పిచ్చోడు: హీరోయిన్‌ | Donald Trump an imbecile says sonam kapoor | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఓ పిచ్చోడు: సోనమ్‌ కపూర్‌

Published Sat, Mar 10 2018 12:35 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Donald Trump an 'imbecile' says sonam kapoor - Sakshi

న్యూ ఢిల్లీ : ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాల్లో నిలవడం హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌కు కొత్తేంకాదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ‘పిచ్చివాడు’ అని వార్తల్లో నిలిచింది. ఇంతకు సోనమ్‌... ట్రంప్‌ను ఇలా అనడానికి కారణం అమెరికాకు చెందిన ప్రముఖ హాస్యనటి, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాత ఎలెన్‌ డిజెనెరస్ చేసిన ట్విట్‌‌. ఎలెన్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో ఒక ఫోటోను పోస్టు చేసింది. అందులో ‘మన అధ్యక్షుడు ఏనుగులు, మిగతా జంతువుల వేటకు అనుమతిచ్చాడు. ఇది భయానకమైన విషయం, మనందరం కలసికట్టుగా దీన్ని వ్యతిరేకిద్దాం’ అని ఉంది. అంతేకాక ‘ఏనుగుల పట్ల దయగా ఉండండి’ అనే సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిందిగా  ఆమె తన అభిమానులందరిని కోరింది.

అందుకు సోనమ్‌ స్పందిస్తూ ‘వేటాడటం భారతదేశంలో చట్టవిరుద్ధమైనది, ఈ విషయంలో ప్రపంచం మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. వేటను అనుమతించిన ట్రంప్‌ ఒక పిచ్చివాడు’ అని ట్విట్‌ చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ ట్రంప్‌ మెరిల్ స్ట్రీప్‌ని ‘ఓవర్ రేటెడ్ నటి’ అన్నందుకు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించింది. ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ‘మన నాయకులకు కనీసం తెలివి అనే రూపం అయినా ఉంటుంది, కానీ ఇతడు మాత్రం జోకర్‌’ అంటూ ట్విట్‌ చేసింది.

ప్రస్తుతం సోనమ్‌ కపూర్‌ ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సోనమ్‌తో పాటు కరీనా కపూర్‌ ఖాన్‌, స్వర భాస్కర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement