sonamKapoor
-
Sonam Kapoor: పింక్ లెహంగాలో సోనమ్ సోయగాలు.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. 'సావరియా' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది సోనమ్. రామ్ మాధవనీ దర్శకత్వంలో వచ్చిన 'నీర్జా' చిత్రంతో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో మోస్ట్ గ్లామరస్‌గా కనువిందు చేసే 'సోన'మ్ అందాలు ఓసారి చూసేద్దామా. సావరియా సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన సోనమ్ అనిల్ కపూర్ వారసురాలైన తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ ప్రేమ్ రతన్ ధన్‌పాయో చిత్రంలో రాజకుమారి మైథిలీ దేవిగా అలరించిన సోనమ్ సన, సోంజ్, జిరాఫీ వంటి ముద్దుపేర్లతో ఈ బాలీవుడ్ భామను పిలుస్తారు తొలి చిత్రం సావరియా, రాంజనా, ఖుబ్సూరత్, చిత్రాలకు 4 అవార్డులను సొంతం చేసుకుంది సావరియా, ఢిల్లీ-6, ఐ హేట్ లవ్ స్టోరీస్, థ్యాంక్ యూ, నీర్జా సినిమాలకు స్టార్‌డస్ట్ అవార్డ్స్ అందుకుంది నీర్జా చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు 8 అవార్డులను సొంతం చేసుకుందీ బ్యూటీ యో యో హనీ సింగ్ కంపోజ్ చేసిన ధీరే ధీరే సాంగ్‌లో హృతిక్ రోషన్‌తో పాటు కలిసి నటించింది నాలుగు ఫిలీంఫేర్ అవార్డులను కొల్లగొట్టిందీ సోనమ్ 2018లో వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజను పెళ్లి చేసుకుందీ కపూర్ వారసురాలు -
మీ ప్రేమే నా బలం: సోనమ్ కపూర్
అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ వివాహ వేడుక ఎంత వైభవంగా జరిగిందో అందరికి తెలిసిన విషయమే. మెహందీ, సంగీత్, వివాహం, రిసెప్షన్ ఇలా ప్రతి వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా నిర్వహించారు కుటుంబ సభ్యులు. తన వివాహ వేడుకను ఇంత ఘనంగా, వైభవంగా నిర్వహించిన తల్లిదండ్రులకు, ఆప్తులకు కృతజ్ఞతలు తెలిపారు సోనమ్. ఈ సందర్భంగా తన ఇన్స్టామ్గ్రామ్లో ఒక మెసేజ్‌ను పోస్టు చేశారు. ‘మా వివాహన్ని ఆశిర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెండురోజుల ఈ వేడుక మా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఇంత అద్భుతంగా మలచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. అలానే కుటుంబాన్ని ఉద్ధేశించి మరో పోస్టులో ‘మా కుటుంబమే మా బలం. కపూర్ కుటుంబ సభ్యులందరికి చాలా ధన్యవాదాలు. సునీత నువ్వు ఈ ప్రపంచంలోనే అందరికంటే మంచి అమ్మవి. నాన్న నువ్వు నన్ను, ఆనంద్‌ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్...మీ ప్రేమకు, మద్దతకు చాలా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ నెల 8న సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తుల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం చాలా వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుకకు అమితాబ్, బాలీవుడ్ ఖాన్‌త్రయంతో పాటు కత్రినా, రాణి ముఖర్జీ హజరయ్యారు. -
అంగరంగ వైభవంగా సోనమ్- ఆనంద్‌ల వివాహం
అనిల్ కపూర్ గారాల పట్టి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సోనమ్ ఆంటీ కవితా సింగ్‌కు చెందిన వారసత్వ బంగ్లాలో వీరి పెళ్లి వేడుకను నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం మంగళవారం ఉదయం 11- 12.30 గంటల ప్రాంతంలో సోనమ్- ఆనంద్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన సోనమ్.. వివాహ వేడుకలో అనురాధా వాకిల్ రూపొందించిన లెహంగా ధరించారు. ఎరుపు రంగు లెహంగాపై బంగారు వర్ణం తామరపువ్వులతో కూడిన డిజైన్‌తో సంప్రదాయ దుస్తుల్లో అచ్చం రాజకుమారిలా కనిపించారు సోనమ్. బంగారు వర్ణం షేర్వాణీ ధరించిన ఆనంద్ మెడలో రూబీ మాలతో సింప్లీ సూపర్బ్ అనిపించారు. ముంబైలోని బాంద్రాలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన సోనమ్- ఆనంద్‌ల పెళ్లి వేడుకకు బంధువులతో పాటు, బాలీవుడ్ తారాలోకం కూడా కదిలి వచ్చింది. సోనమ్ కజిన్స్ అర్జున్ కపూర్, అన్షులా, జాహ్నవీ కపూర్, ఖుషీ కపూర్లు పెళ్లిలో సందడి చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, రాణీ ముఖర్జీ, కరీనా- సైఫ్ అలీఖాన్ దంపతులు, కరీష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్వరా భాస్కర్ తదితరులు హాజరై సందడి చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లి కూతురుగా ముస్తాబైన సోనమ్...
కపూర్ల గారాల పట్టి సోనమ్ పెళ్లి కబురు తెలిసిన దగ్గరనుంచి అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. అసలు సోనమ్ కపూర్ అంటేనే కొత్త ఫ్యాషన్లకు ఐకాన్‌గా చెప్పుకుంటారు. అలాంటిది ఇక వివాహమంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. శనివారం నుంచే కపూర్ మాన్షన్‌లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన మెహంది, అనంతరం జరిగిన సంగీత్ వేడుకలు ఎంత అట్టహాసంగా జరిగాయో వీటికి సంబంధించిన ఫోటోలు చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ రోజు ఉదయం 11 - 12.30 గంటల ప్రాంతంలో జరిగిన వివాహ తంతుతో సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా ఒక్కటయ్యారు. గులాబీ బాల పెళ్లికి గులాబి రంగులో అలంకరించిన వివాహ వేదిక ఆహుతుల చూపులను కట్టిపడేసింది. సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో చక్కనమ్మ సోనమ్ దేవకన్యలకే అసూయ పుట్టించేలా ముస్తాబయింది. సోనమ్ అనురాధ వాకిల్ రూపొందించిన తామరపూవ్వులతో ఉన్నఎరుపు లెహాంగాలో దివినుంచి దిగివచ్చిన చందమామలా ఉన్నారు. వరుడు ఆనంద్ అహుజా ఒక గంట ముందే వేదిక వద్దకు వచ్చాడు. ఆనంద్ బంగారు వర్ణంలో ఉన్న షేర్వాని ధరించి మెడలో రూబీ మాలతో రాజకుమారుడికి ధీటుగా ఉన్నాడు. వీరి వివాహ వేడుక బంద్రాలో జరిగింది. వీరి వివాహానికి బాలీవుడ్ తారాలోకం తరలి వచ్చింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కుమారుడు, కూతురుతో వేడుకకు విచ్చేసారు. వీరితో పాటు కరీనా కపూర్, భర్త సైఫ్ అలీఖాన్, కుమారుడు తైమూర్ ఖాన్‌తో పాటు అక్క కరిష్మా కపూర్ కూడా వచ్చారు. సోనమ్ స్నేహితులు స్వర భాస్కర్, జాక్వేలిన్, నిర్మాత కరణ్ జోహర్, కజిన్స్ జాహ్నవి, ఖుషి కపూర్ హాజరయ్యారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. ఈ రోజు సాయంత్రం నూతన వధూవరుల కోసం రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. Breathtaking! We can't keep our eyes off @sonamakapoor in her bridal lehenga. #SonamKiShaadi #EverydayPhenomenal pic.twitter.com/7Y6HcdEWYP — Filmfare (@filmfare) May 8, 2018 -
సోనం పెళ్లి అప్పుడే..
సాక్షి, న్యూఢిల్లీ : సోనం కపూర్, ఆనంద్ అహుజా పెళ్లిపై వదంతులకు బ్రేక్ పడింది. వీరి వివాహం మే 8న జరుగుతుందని నిర్ధారిస్తూ కపూర్, అహుజా కుటుంబాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సోనం, ఆనంద్‌ల వివాహం ఈనెల 8న ముంబయిలో జరుగుతుందని, ఈ కార్యక్రమం సన్నిహితుల సమక్షంలో జరగాలని భావిస్తుండటంతో కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరతున్నామని ఇరు కుటుంబాలు ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా, సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ను కపూర్ కుటుంబం సంప్రదించినట్టు సమాచారం. సంగీత్‌లో సోనం కజిన్ జాన్వి తన తల్లి శ్రీదేవి పాటలకు నృత్యం చేయనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జాన్వీతో పాటు కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్లు సోనం, ఆనంద్‌ల సంగీత్‌లో సందడి చేయనున్నారు. తమ పెళ్లికి ఆహ్వాన పత్రికలను ముద్రించకుండా పర్యావరణ అనుకూల ఈ-ఇన్వైట్స్ను పంపాలని సోనం, ఆనంద్‌లు నిర్ణయించుకున్నారు. సోనం, ఆనంద్‌ల వివాహం కేవలం బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. -
ట్రంప్ ఓ పిచ్చోడు: హీరోయిన్
న్యూ ఢిల్లీ : ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాల్లో నిలవడం హీరోయిన్ సోనమ్ కపూర్‌కు కొత్తేంకాదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ‘పిచ్చివాడు’ అని వార్తల్లో నిలిచింది. ఇంతకు సోనమ్... ట్రంప్‌ను ఇలా అనడానికి కారణం అమెరికాకు చెందిన ప్రముఖ హాస్యనటి, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాత ఎలెన్ డిజెనెరస్ చేసిన ట్విట్. ఎలెన్ తన ట్విటర్ అకౌంట్లో ఒక ఫోటోను పోస్టు చేసింది. అందులో ‘మన అధ్యక్షుడు ఏనుగులు, మిగతా జంతువుల వేటకు అనుమతిచ్చాడు. ఇది భయానకమైన విషయం, మనందరం కలసికట్టుగా దీన్ని వ్యతిరేకిద్దాం’ అని ఉంది. అంతేకాక ‘ఏనుగుల పట్ల దయగా ఉండండి’ అనే సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిందిగా ఆమె తన అభిమానులందరిని కోరింది. అందుకు సోనమ్ స్పందిస్తూ ‘వేటాడటం భారతదేశంలో చట్టవిరుద్ధమైనది, ఈ విషయంలో ప్రపంచం మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. వేటను అనుమతించిన ట్రంప్ ఒక పిచ్చివాడు’ అని ట్విట్ చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ ట్రంప్ మెరిల్ స్ట్రీప్‌ని ‘ఓవర్ రేటెడ్ నటి’ అన్నందుకు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించింది. ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ‘మన నాయకులకు కనీసం తెలివి అనే రూపం అయినా ఉంటుంది, కానీ ఇతడు మాత్రం జోకర్’ అంటూ ట్విట్ చేసింది. ప్రస్తుతం సోనమ్ కపూర్ ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సోనమ్‌తో పాటు కరీనా కపూర్ ఖాన్, స్వర భాస్కర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్యాడ్ ఛాలెంజ్
బహిష్టు సంబంధిత పరిశుభ్రత మీద ఇవాళ దేశమంతా మాట్లాడుతోంది. మెన్స్ట్రువల్ హైజీన్‌కు సంబంధించి కలిగించాల్సిన అవగాహన పట్ల అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. స్కూలు స్థాయి నుంచి ఆడపిల్లలకు ఈ చైతన్యం అవసరం. ‘ప్యాడ్‌మేన్’ వంటి సినిమాలు, సెలబ్రిటీల ‘ప్యాడ్ ఛాలెంజ్’ వంటివి ఈ ప్రచారానికి తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్యాడ్’ వాడకంపై విస్తృత కథనం... మహిళలకు అనివార్యమైన ఆ మూడు నుంచి ఐదురోజుల ఇబ్బందికరమైన సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు, ఉపకరించే సాధనాలను వారు తమకు తామే రూపొందించుకున్నారు. సామాజికంగా వారికి ఎదురయ్యే అనేక సాంస్కృతిక అంశాలు, మూఢనమ్మకాల వంటి సవాళ్లు చుట్టుముట్టిన నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఎలాగోలా తమ తమ ఆర్థిక, విద్యాపరమైన స్థోమతను బట్టి తమ తమ సొంత మార్గాలు అనుసరించారు. చాలా సందర్భాల్లో వారు అనుసరించిన మార్గాలు అంత సులువైనవీ, సౌకర్యవంతమైనవి కావు. మరీ ముఖ్యంగా పేద వర్గాల్లో అవి చాలా ఇబ్బందికరమైనవి. అయినా తమ ఇబ్బందికరమైన ఆ రోజులను ఎలాగోలా నెట్టుకొచ్చారు. వారి ఇబ్బందులు గమనించిన తమిళనాడులోని అరుణాచలం మురుగనంతం లాంటి వాళ్లు దానికి గురించి మాట్లాడటానికి ప్రయత్నించినా సమాజం వారిని ప్రోత్సహించలేదు. భారత్‌లో ఇదీ పరిస్థితి... మన భారతీయ సమాజంలో అత్యధికులు పేద వర్గాలే. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్యాడ్స్‌ను కొనుగోలు చేయగలిగే ఆర్థిక స్తోమన ఉన్నవారు చాలా తక్కువ. 2016లోని ఒక అధ్యయన వివరాల ప్రకారం... దేశంలో 84% కౌమార బాలికలు, 92.2% తల్లులు ఇప్పటికీ నెలసరి సమయంలో గుడ్డను వాడుతున్నారు. ప్రభుత్వమే నిర్వహించిన ఒక సర్వే వివరాల ప్రకారం మన దేశంలో కేవలం 12% మంది మాత్రమే ప్యాడ్స్ వాడగలిగే స్థితిలో ఉన్నారు. దాంతో 37.8% మంది పెళ్లికాని యువతులు యోని దగ్గర దురద, దుర్వాసన వంటి సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణ గుడ్డను ఉపయోగించడంలో ఎదురయ్యే ఇబ్బందులు ►మళ్లీ ఉపయోగించే గుడ్డను వాడినప్పుడు, అది కాస్తంత అపరిశుభ్రంగా ఉన్నా మహిళలకు రీప్రోడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు – ఆర్టీఐ) రావచ్చు. ►సాధారణంగా యోనిలో దాని రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా జీవిస్తూ ఉంటుంది. గుడ్డ వంటి అపరిశుభ్రమైన పద్ధతుల వల్ల యోని సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడి తర్వాతి కాలంలో సంతానలేమి, సెక్స్ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ►మహిళల్లో మూత్రవిసర్జనకు ఉండే రంధ్రం నిడివి చాలా తక్కువగా ఉంటుంది. దాంతో హానికరమైన బ్యాక్టీరియా అక్కడ విస్తరిస్తే అది యూరినరీ ఇన్ఫెక్షన్స్కు దారి తీయడంతో పాటు బ్లాడర్ (మూత్రం నిల్వ ఉండే తిత్తి) వరకు పాకే ముప్పు ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు పదే పదే తిరగబెడుతుండటానికి కారణం కూడా రుతుస్రావం సమయాల్లో పాటించే అపరిశుభ్రమైన పద్ధతులే. వాడి పారేయగల ప్యాడ్స్ గురించి... ►మిగతా వాటితో పోలిస్తే వాడి పారేసేందుకు అనువైన ప్యాడ్స్ స్త్రీల పరిశుభ్రతకు అనువైనవి. వాటిని ఉపయోగించాల్సిన తీరుతెన్నులు బాలికలకూ, యువతులకూ మహిళా టీచర్లు విపులంగా వివరించాలి. ►ఉపయోగించిన ప్యాడ్స్‌ను తేలిగ్గా పారేసేలా కొంత మరుగుగా ఉన్న ప్రాంతాల్లో ‘డిస్పోజబుల్–బిన్స్’ ఏర్పాటు చేయాలి. అంటే స్కూళ్లలో, ఆఫీసుల్లో ఉండే టాయిలెట్స్‌లో, మహిళలు వేచి ఉండే ప్రాంతాలు, విశ్రాంతి స్థలాల్లోని మరుగు ప్రదేశాల్లో వాటిని ఉంచాలి. ఆ బిన్స్‌ను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ►వాడేసిన ప్యాడ్స్‌ను ‘సేఫ్‌గా డిస్పోజ్’ చేయాలి. అంటే లోతు గుంతలో వేసి కాల్చేయడం (పిట్ బర్నింగ్), బయటకు ఏమాత్రం పొగరానివ్వని విధంగా భస్మం చేయడం (ఇన్సినరేషన్) వంటి పద్ధతులు అవలంబించడం మేలు. ప్యాడ్ తయారైన మెటీరియల్ ఆధారంగా ఏది ఆరోగ్యకరమైన పద్ధతో ఆ పద్ధతిని ఎంచుకోవడం మేలు. ►అంతే తప్ప వాటిని ఒకచోట కుప్పగా వేసి, బహిరంగంగా తగలబెట్ట రాదు. ప్యాడ్స్‌లో సాధారణ రకాలు 1. పీల్చుకునే సాధనంగా ఉపయోగించే గుడ్డ : పాత చీరలూ, తువాళ్లు, పాత బెడ్షీట్లు వంటి వాటిని తమకు అనువైన రీతిలో కత్తిరించుకొని చాలా మంది వాడుతుంటారు. ఇవి దొరకడం చాలా తేలిక. దాంతో వీటిని తరచూ శుభ్రపరచుకొని ఉపయోగిస్తుంటారు. లభ్యత తేలికే అయిన శుభ్రపరచుకునేందుకు వారు కోరుకునే చాటు/మరుగు మన సమాజంలో అంత తేలిగ్గా దొరకదు. ఉతికేందుకు చోటూ, తగినంత నీరూ, సబ్బు, ఎండ తగిలేలా ఆరేసుకునేందుకు అనువైన ప్రదేశం దొరకడం చాలా కష్టం. పైగా ఇన్ని సౌకర్యాలు లేకపోతే వాటిని మళ్లీ ఉపయోగించడం వల్ల దురద, దుర్వాసన వంటి మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. చెమ్మ ఉంటే ఇన్ఫెక్షన్లకూ దారితీస్తుంది. అలాంటి అనారోగ్యకరమైన, అపరిశుభ్రమైన పరిస్థితులు మన దేశపు పల్లెప్రాంతాల్లోని పేదవర్గాల్లో చాలా ఎక్కువ. 2. స్థానికంగా తయరయ్యే మళ్లీ ఉపయోగించేందుకు వీలున్న న్యాప్కిన్లు : దాదాపు 6–12 సార్లు ఉపయోగించేందుకు వీలైన స్థానిక ప్యాడ్స్ కొన్ని చోట్ల లభ్యమవుతున్నాయి. ఇవి మాటిమాటికీ ఉపయోగపడేవి కావడంతో దాదాపు శిథిలమయ్యేవరకు ఉపయోగించే వీలుండటం వల్ల పర్యావరణానికీ హాని చేయవు. అయితే పైన పేర్కొన్నట్లే శుభ్రపరచడానికి (లాండ్రీయింగ్)కు వీటికి చోటు కావాలి. 3. ఉపయోగం తర్వాత పారేసేందుకు అనువైన వాణిజ్య ఉత్పాదనలు : ఇప్పుడివి మరీ మారుమూల ప్రాంతాలు మినహాయించి, ఒక మోస్తరు పెద్ద పల్లెల వరకూ విస్తారంగా లభిస్తున్నాయి. తగినంత పరిశోధన తర్వాత ఆరోగ్యకరమైన రీతిలో రూపుదిద్దుకున్న న్యాప్కిన్లు ఇవి. అయితే అందరూ కొనలేని కారణంగా, ఆర్థికంగా అందరికీ అందుబాటులో లేకపోవడం, ఒక్క ఉపయోగం తర్వాత వ్యర్థాలుగా మారడంతో శిథిలం కావడానికి కాస్తంత ఎక్కువ సమయం తీసుకోవడంతో ఇవి పర్యావరణానికి అంత అనువుగా లేవు. అందుకే వాడాక కొంత జాగ్రత్తగా వీటిని పారేయాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గించడానికి పాటించాల్సిన పరిశుభ్రత సూచనలు రుతుస్రావం సమయంలో పరిశుభ్రత (మెన్స్ట్రువల్ హైజీన్) పాటించకపోతే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. అవి రాకుండా ఉండాలంటే పాటించాల్సిన సూచనలివే... 01. తిరిగి ఉపయోగించగలిగేవైనా లేదా వాడాక పడేసేవైనా సురక్షితమైన రీతిలో ఉపయోగించాలి. ఈ ప్రయోజనం కోసం గుడ్డ కంటే ప్యాడ్ మేలు. 02. ప్యాడ్ తరచూ మార్చుకోవాలి : మన రక్తం దేహాన్ని వదలగానే మన శరీరంలో ఉండే కొన్ని క్రిములతో కలిసి కలుషితం అవుతుంది. అంటే పరిశుభ్రత పాటించకపోతే వ్యాధులను కలిగించేలా మారుతుంది. ప్యాడ్ రక్తంతో తడిసినప్పుడు యోనిలో ఉండే బ్యాక్టీరియా క్రిములు, యోని పరిసరాల్లో స్రవించిన చెమటలోని క్రిములతో నిండిపోతుంది. అదే చెమ్మ అలాగే ఎక్కువసేపు కొనసాగింతే ఆ క్రిములు మరింతగా వృద్ధి చెందేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. దాంతో ఆ క్రిములు అపరిమితంగా పెరిగి మూత్రసంబంధమైన, యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు, చర్మం ఎర్రబారడం, దురద వంటి సమస్యలు రావడానికి దారి తీయవచ్చు. అందుకే వీలైనంత త్వరత్వరగా ప్యాడ్స్ మార్చేయాలి. ఎంత వ్యవధిలో వాటిని మార్చాలన్నది వారి వారి సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. సగటున ప్రతి ఆరుగంటలకు ఒకసారి మార్చడం మంచిది. 03. రుతు సమయంలో స్రవించే రక్తం యోని ముఖద్వారం, దాని చుట్టూ ఆవరించే ఉండే లేబియా చర్మంలో కొన్ని చుక్కలు ఉండవచ్చు. దాని వల్ల దుర్వాసన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక తరచూ యోని ప్రాంతాన్ని కడుక్కుంటూ ఉండాలి. 04. యోని కడిగేందుకు సబ్బు లేదా ఇతర ఉత్పాదనలు వాడకండి. సబ్బు లేదా ఇతర ఉత్పాదనలు వాడినప్పుడు చెడు బ్యాక్టీరియాతో పాటు యోనికి మేలు చేసేందుకు ఉద్దేశించిన మంచి బ్యాక్టీరియా కూడా ప్రక్షాళన ప్రక్రియలో నశించిపోతాయి. అందుకే కాస్తంత గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేసుకోవడం మేలు. 05. యోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకునే సమయంలో ఎప్పుడూ మీ చేతిని కింది నుంచి పై వైపునకు కదిలిస్తూ శుభ్రం చేసుకోండి. దీనికి వ్యతిరేక దిశలో వద్దు. మీ ప్రైవేటు పార్ట్స్‌ను పై నుంచి కిందివైపునకు శుభ్రం చేసుకుంటే యోని దగ్గర ఉండే క్రిములు కింద మలవిసర్జన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి, అక్కడికి ఇన్ఫెక్షన్స్ను వ్యాపి చేసే అవకాశం ఉంటుంది. 06. ఉపయగించి తీసేశాక ఆ ప్యాడ్‌ను జాగ్రత్తగా వదిలించుకోవాలి (డిస్కార్డ్ ప్రాపర్లీ): ఉపయోగించిన న్యాప్కిన్ లేదా టాంపూన్ వల్ల దుర్వాసన లేదా ఇన్ఫెక్షన్ వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని వాడాక పారేసేముందర ఏదైనా శుభ్రమైన పేపర్లో చుట్టి (ర్యాప్ చేసి) దూరంగా పొడిప్రాంతాల్లో పడేయాలి. టాయిలెట్ రంధ్రంలో వేసి ఫ్లష్ చేయడం సరైన పద్ధతి కాదు. అది మీ టాయిలెట్లో అడ్డంకిగా మారి మరో సమస్యను సృష్టించవచ్చు. న్యాప్కిన్ను పారేశాక మీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోకండి. 07. ప్యాడ్‌తో వచ్చే ర్యాష్‌తో జాగ్రత్త : ఒక్కోసారి రక్తస్రావం ఎక్కువగా ఉన్నవారిలో ప్యాడ్ చాలాసేపు తడిగా ఉండి తొడలు, తొడలోపలి భాగాల్లో దురద రావడం, ఎర్రగా మారడం, ర్యాష్ రావడం జరగవచ్చు. అందుకే ప్యాడ్స్‌ను తరచూ మార్చడం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ అప్పటికే మీకు అక్కడ ర్యాష్ ఉంటే ప్యాడ్ వాడే సమయంలోనే మరింత జాగ్రత్తతో ఉండటం చాలా అవసరం. అలాగే డాక్టర్ సలహా మేరకు యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ను స్నానం తర్వాత, పడుకునే ముందర రాసుకోవాలి. ఇలాంటి సమస్య ఉంటే బిడియపడకుండా తప్పక డాక్టర్‌ను సంప్రదించండి. మీకు సహాయం చేయడం కోసమే డాక్టర్లు ఉంటారు. అంతేగానీ ‘ఇదేమిటీ’ అంటూ వారేమీ చెడుగా అనుకోరు. అన్యథా భావించరు. మీ సమస్య గురించి వేరే ఎక్కడా చర్చించరు. వారు అక్కడికక్కడే ఆ విషయాన్ని మరచిపోతారు. 08. ఒకసారికి ఒక్క ప్యాడ్ మాత్రమే: ఒకసారి ఒక్కటే ప్యాడ్‌ను వాడండి. అంతేగానీ హెవీ బ్లీడింగ్ అవుతోంది కదా అని రెండు ప్యాడ్స్ వాడకండి. రెండు వాడటం వల్ల కింది ప్యాడ్ రక్తాన్ని పూర్తిగా పీల్చుకునే అవకాశం ఉండదు. పై ప్యాడ్ రక్తంతో తడిసి, చెమ్మగా చాలాసేపు ఉండిపోతుంది. కిందిది పొడిగానే ఉంది కదా అని మీరు మార్చడానికి చాలాసేపు ఉంచుతారు. దాంతో పైనున్న తడిప్యాడ్లో ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెంది మీకు ఇన్ఫెక్షన్స్ కలిగిస్తాయి. ర్యాష్ కూడా రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రెండు ప్యాడ్స్ ఉండటం అంత సౌకర్యం కాకపోవచ్చు కూడా. 09. రుతు సమయంలో క్రమం తప్పకుండా స్నానం చేయండి : రుతుసమయాల్లో మహిళలు స్నానం చేయకూడదంటూ కొన్ని సంస్కృతుల్లో మహిళలకు ఆంక్షలు ఉంటాయి. కానీ రుతుసమయంలో మహిళలు తప్పనిసరిగా రోజూ స్నానం చేయాలి. స్నానం వల్ల వారి ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా శుభ్రం కావడమే కాదు వారిలో మెన్స్ట్రువల్ క్రాంప్స్ రాకుండా ఆ శుభ్రత దోహదపడుతుంది. అంతేకాదు ఎక్కడా ఏ అడ్డులేకుండా స్రావాలు ఫ్రీగా ప్రవహించేందుకూ స్నానం ఉపయోగపడుతుంది. స్నానం తర్వాత ఉండే ఆహ్లాద భావనతో మహిళలు చాలా హాయిగా ఫీలవుతారు. 10. మీ ప్యాడ్స్‌ను రెడీగా ఉంచుకోండి: రుతుస్రావం మొదలయ్యాక ప్యాడ్‌ను వెతుక్కోవడమో, ప్యాడ్ పారేయాల్సిన సమయంలో అవి లేవని గుర్తించి, షాప్‌కు వెళ్లడమో కాకుండా మొదట్నుంచే ప్యాడ్స్‌ను రెడీగా పెట్టుకోండి. మీరు స్కూల్‌కు లేదా కాలేజీకి వెళ్లే యువతి అయినా, లేదా బయటకు వెళ్లి పనిచేసే వర్కింగ్ ఉమన్ అయినా శానటరీ న్యాప్కిన్స్ లేదా ప్యాడ్స్‌ను ఎప్పుడూ నిల్వ ఉంచుకోండి. పరిశుభ్రమైన మీ బ్యాగ్‌లో ఒక పేపర్లో చుట్టి ప్యాడ్నూ, మృదువైన ఒక తువ్వాలను, లేదా కొన్ని పేపర్ న్యాప్కిన్స్నూ, చేతులు శుభ్రపరచుకునే హ్యాండ్ వాష్ (హ్యాడ్ శానిటైజర్)నూ, కాస్తంత పెద్దమొత్తంలోనే తినుబండారాలనూ (హెవీ శ్నాక్), ఒక వాటర్బాటిల్నూ, ఒక యాంటీసెప్టిక్ ట్యూబ్‌నూ దగ్గరుంచుకోండి. ఇవీ ప్రభుత్వ మార్గదర్శకాలు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వ శాఖ వారు రుతుస్రావ సమయంలోని పరిశుభ్రత విషయంలో 2015లో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. అలాగే స్వచ్ఛభారత్ కార్యక్రమంలోనూ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిలోని ముఖ్యంశాలు ఇవి. 1. అంగన్వాడీ సూపర్వైజర్లు, వర్కర్లకు రుతుస్రావ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత విషయమై శిక్షణ ఇచ్చి అది మహిళలందరికీ చేరేలా చూడాలి. 2. స్వయంసేవాసంఘాల (సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల) ద్వారా శానిటరీ నాప్కిన్స్ గ్రామీణ ప్రాంతాలకూ చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3. కౌమారవయసులోని బాలికల సాధికారత కోసం ఉద్దేశించిన ఎస్ఏబీఎల్ఏ కార్యక్రమం, సమీకృత బాలల అభివృద్ధి (ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్మెంట్) కార్యక్రమాలు, మహిళా ఆర్థిక్ వికాస్ మహామండల్ కింద పనిచేసే స్వయం సేవా సంఘాల ద్వారా రుతుస్రావ పరిశుభ్రత అవసరాలను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ పిల్లల వరకూ చేర్చాలి. 4. కొత్తగా యుక్తవయసుకు వచ్చిన బాలికల కోసం ‘అడాలసెంట్ రీసోర్స్ సెంటర్స్’ ద్వారా కౌన్సెలింగ్ కార్యకలాపాలను నిర్వహింపజేయాలి. 5. కొత్తగా యుక్తవయసుకు వచ్చిన బాలలకు ఏర్పడే అవసరాల గురించి, ఆ బాలలు అనుసరించాల్సిన పద్ధతులు, సంబంధిత అంశాల గురించి అన్ని స్కూళ్లలోనూ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలోనూ నోడల్ టీచర్లు విపులంగా వివరించాలి. 6. స్కూలుకు వెళ్లే వయసున్న బాలబాలికలకు తగిన అవగాహన కల్పించేలా ‘రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమ్’ కోసం ఉద్దేశించిన కార్యకర్తలు కృషిచేయాలి. 7. యుక్తవయసుకు వచ్చిన బాలికలకు రుతుసమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పద్ధతుల (మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్–ఎమ్హెచ్ఎమ్)తో పాటు ఆ వయసులో కిశోర బాలబాలికలకు ఏర్పడే సందేహాల నివృత్తి కోసం ‘రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమ్’ కింద సేవాకార్యకర్తలు పాటుపడాలి. 8. రుతుసమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పద్ధతుల (మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్–ఎమ్హెచ్ఎమ్) గురించి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు యువతుల్లో, మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. మురగనాథమ్ చేసిన కృషి తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథమ్ అనే వ్యక్తి తన అసాధారణ కృషితో మూడున్నర కోట్ల శానిటరీ న్యాప్కిన్ మెషిన్‌ను కేవలం రూ. 65 వేలకే తయారు చేశాడు. దాని సహాయంతో స్వయం సేవా సంఘాల ద్వారా 29 రాష్ట్రాలు ఉన్న మన దేశంలోని 23 రాష్ట్రాలలో ప్యాడ్స్‌ను చాలా చవకగా అమ్ముతున్నాడు. ఆయన సేవలకుగాను 2016లో ఆయనను కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన భూమికను ప్రముఖ బాలివుడ్ నటుడు అక్షయ్‌కుమార్ పోషించగా ‘ప్యాడ్‌మ్యాన్’ అనే చిత్రం దేశవ్యాప్తంగా ఈనెల 9 విడుదల కానుంది. సినిమా వంటి మాస్‌మీడియా ద్వారా ఈ సినిమా రుతుస్రావ పరిశుభ్రత, ప్యాడ్ అవసరాల గురించి అవగాహన కల్పించనుంది. ప్యాడ్ వాడకంపై ప్రచారం: ట్వింకిల్‌ఖన్నా, దీపికా పదుకోన్, కత్రినాకైఫ్ -
పెళ్లెప్పుడని వాళ్లని అడగరేం?
సాధారణంగా పెళ్లి కాని కథానాయికలను ‘మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. ఈ ప్రశ్నకు కొందరు ఓ చిన్ని చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంటారు. మరికొందరు ‘అప్పుడేనా.. అందుకు ఇంకా చాలా టైమ్ ఉంది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే’ అంటుంటారు. ఇంకొందరు ‘పెళ్లికేంటి తొందర. ఆ టైమ్ వచ్చినప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాం’ అని సమాధానం ఇస్తుంటారు. సోనమ్ కపూర్ అయితే వీటికి భిన్నంగా స్పందిస్తారు. ‘మీ పెళ్లెప్పుడు’ అని ఇటీవల సోనమ్ కపూర్‌ని మీడియావారు అడిగారు. ఈ ప్రశ్నకు ఈ బ్యూటీ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘పెళ్లెప్పుడు అంటూ ఎప్పుడూ హీరోయిన్లనే అడుగుతారెందుకు? ఇదే ప్రశ్నని హీరోలను అడుగుతారా? రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ వంటి వాళ్లను ఎప్పుడైనా ప్రశ్నించారా? మాకూ పర్సనల్ లైఫ్ ఉండదా? పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాం కదా? పెళ్లి అయినా నర్గీస్, వహీదా రెహమాన్, షర్మిలా ఠాగూర్, డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, కాజోల్, కరీనా కపూర్ వంటి ఎంతో మంది సెకండ్ ఇన్నింగ్స్‌లో తాము ఎవరికీ తక్కువ కాదంటూ నిరూపించుకోలేదా?’’ అంటూ మండిపడ్డారట సోనమ్. ఇదిలా ఉంటే.. వ్యాపారవేత్త ఆనంద్ అహుజా, సోనమ్ కపూర్ ప్రేమలో ఉన్నారనీ, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారనీ బాలీవుడ్ మీడియా కూడై కూస్తోన్న విషయం తెలిసిందే. -
ఆయన కూతురుగా పుట్టడం నా అదృష్టం
ముంబాయి : బాలీవుడ్ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ కూతురిగా పుట్టడం తన అదృష్టమని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వెల్లడించారు. ఆదివారం అనిల్ కపూర్ 61 జన్మదినం. ఈ సందర్భంగా తన తండ్రితో ఆమెకున్నసాన్నిహిత్యాన్ని, అనుభవాలను కొన్ని ఫోటోల ద్వారా ట్వీట్ చేసింది. తన తండ్రి లేకపోతే నేను ఇప్పుడు ఉన్న స్థాయిలో సగానికి కూడా ఎదిగేదాన్ని కానని ట్వీట్ చేసింది. ఈ ప్రపంచంలో తనను బాగా అర్ధం చేసుకున్నవ్యక్తి తన తండ్రేనని చెప్పింది. ఈ సందర్భంగా తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అనిల్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎప్పుడూ 39 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్న వారిగా కనిపిస్తారని అనుపర్ ఖేర్ ట్వీట్ చేశారు. అలాగే సినిమాల్లో మంచి పాత్రలు మీకు రావాలని కోరుకుంటున్నట్లు అనుపమ్ తెలిపారు. 1980, 1990, 2000, 2010 దశకాల్లో అనిల్ కపూర్ ఎప్పుడూ ఒకే విధంగా, యువకుడిగా కనిపిస్తున్నాడని నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశాడు. డ్రామా, యాక్షన్, రొమాన్స్, కామెడీ లాంటి విభిన్నమైన సినిమాల్లో అనిల్ కపూర్ తన నటన ద్వారా జీవించారని, ఆయనలో ఉత్సాహం చూసి కొత్తగా సినీరంగంలోకి వచ్చేవారు కూడా అసూయపడతారని పేర్కొన్నారు. -
కరీనా పెళ్లికి ఇదే ఆహ్వానం!
కరీనా కపూర్ పెళ్లి సైఫ్ అలీ ఖాన్‌తో అయింది కదా! ఇప్పుడు పెళ్లికి ఆహ్వానం ఏంటి? అని ఆశ్చర్యపోవచ్చు. అసలు విషయంలోకి వెళదాం. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి రెడీ అవ్వడం అంటేనే ఆడవాళ్లకు అదో పెద్ద విషయం. చీర అంటే దానికి తగ్గ నగలు, లెహెంగా అంటే దానికి మ్యాచింగ్ జ్యువెలరీ... పెట్టుకొనే బొట్టు, వేసుకునే జడ, దిద్దుకునే కాటుక, లిప్‌స్టిక్... ఇలా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటారు. ఇక్కడున్న రెండు ఫొటోల్లో ఒక ఫొటోలో అమ్మాయిలు సీరియస్‌గా రెడీ అవుతున్న దృశ్యాన్ని చూస్తున్నారు కదా. ఒక బ్యూటీ ఇంకో బ్యూటీకి కొంగు సాయం చేస్తోంటే, మరో సుందరి పాదరక్షలు వేసుకుంటోంది. ఇంకో అమ్మాయి జాకెట్ హుక్స్ పెట్టడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా? అన్నట్లు చూస్తోంది. ఇక, ఒక అమ్మాయి మాత్రం ఏ యాక్టివిటీ లేకుండా అలా నిలబడి ఉంది. అంటే... ఆల్రెడీ రెడీ అయిందన్న మాట. ఇంతకీ ఈ నలుగురూ ఎవరంటే? కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానియా. ఈ నలుగురి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘వీరీ ది వెడ్డింగ్’. కరీనా కపూర్ పెళ్లి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సినిమా మొత్తం వేడుకలే. పెళ్లికి అందరూ రెడీ అవుతున్న ఒక ఫొటోను ఫస్ట్ లుక్‌గా చిత్రబృందం విడుదల చేసింది. బుధవారం మరో స్టిల్ రిలీజ్ చేసింది. ‘ముహూర్తం ఫిక్స్’ అనే పోస్టర్ అది. అంటే... విడుదల తేదీ ముహూర్తం అన్నమాట. ‘ఇదే మా ఆహ్వానం.. సేవ్ ది డేట్’ అని రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది మే 18న ఈ చిత్రం విడుదల కానుంది. శశాంకా ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాలో కరీనా పెళ్లి వేడుకలు పసందుగా ఉంటాయట. విడుదల చేసిన రెండు లుక్స్‌లో ఆ కళ కనిపిస్తోంది కదూ! నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఇంగ్లిష్ మూవీ ‘క్విక్ గన్ మురుగన్’ తీసిన శశాంకా హిందీలో ‘ముంబై కట్టింగ్’, ‘కూబ్సూరత్’ సినిమాలు తీశారు. వీటిలో ‘ముంబై కట్టింగ్’ 11 కథలతో తీసిన సినిమా. ఒక కథకు శశాంకా దర్శకత్వం వహించారు. -
సోనారే సోనా
హిందీలో సోనా అంటే బంగారం. సోనమ్ కపూర్‌లా సంప్రదాయాన్ని, ఆధునికతను మిక్స్ చేసి డ్రెస్ చేసుకుంటే.. బంగారానికి అందాల పూత పోసినట్లుంటుంది. మన ఇంటి బంగారు తల్లులు కూడా ఇలా... ఒద్దికైన బట్టల్లో మోడర్న్‌గా కనిపించవచ్చు. ►సన్నగా ఉన్నవారు జార్జెట్, నెటెడ్ వంటి చీరలు కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు ఇంకా సన్నగా కనపడతారని. కానీ, ఇలా డిజైనర్ బ్లౌజ్ దానికి తగ్గట్టు చీర కట్టు, కేశాలంకరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఈవెనింగ్ పార్టీలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. ►ఇది లాంగ్ అనార్కలీ, పలాజో డ్రెస్. గౌన్ ధరించినప్పుడు కరెక్ట్ ఫిట్‌తో పాటు కలర్ కాంబినేషన్ తప్పనిసరి సరిచూసుకోవాలి. ఈ డ్రెస్ మీదకు ఆభరణాల అలంకరణ ఎంత తక్కువగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. ►డిజైనర్ ధోతీప్యాంట్ వేసుకొని, టాప్ కోసం అదే రంగు స్లీవ్‌లెస్ ట్యూనిక్, ఆ పైన ఎంబ్రాయిడరీ చేసిన ఓవర్ కోట్ ధరిస్తే పార్టీలో ఓ కొత్త లుక్‌తో మెరిసిసోవచ్చు. చెవులకు ఆభరణాలు, ఫిష్‌టెయిల్ హెయిర్‌స్టైల్ మిమ్మల్ని నలుగురిలో వినూత్నంగా కనిపించేలా చేస్తుంది. ►సింగిల్ పీస్ ఫ్లోరల్ ప్రింట్స్ లాంగ్ స్లీవ్స్ గౌన్ ధరించి, ఒక బెల్ట్‌తో పూర్తి లుక్ మార్చేయవచ్చు. ఇదే స్టైల్‌ని చీరకట్టు, గాగ్రాచోళీతోనూ తెప్పించవచ్చు. పీటర్ప్యాన్ కాలర్‌నెక్ బ్లౌజ్‌ని ఎంచుకుంటే చాలు. ఇండో వెస్ట్రన్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తారు. ►ఈ కంచిపట్టు చీర అంచు, పల్లూలోనూ రాజస్థానీ థీమ్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. పండుగలు, పెళ్ళిళ్లు వంటి శుభకార్యాలకు పట్టుచీరలు సంప్రదాయ కళను తీసువస్తాయి. ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, వీటి మీదకు పాతకాలం నాటి టెంపుల్ జువెల్రీ ధరిస్తే అందమంతా ఒక్క చోట కుప్పపోసినట్టుగా ఇల్లంతా కళకళలాడిపోతుంది. ► పాశ్చాత్య లేదా సంప్రదాయ వేడుకలకు ఏ తరహా డ్రెస్సింగ్ బాగుంటుందని ఎక్కువ హైరానా పడనవసరం లేదు. లాంగ్ అనార్కలీ ్రడ్రెస్ ఉంటే దాని మీదకు ఎంబ్రాయిడరీ చేసిన ఓవర్‌కోట్, ష్రగ్ వంటివి ధరిస్తే గ్రాండ్‌గా కనిపిస్తారు. ►ఇది త్రీ పీస్ శారీ డ్రెస్. సంప్రదాయ వేడుకల్లో యువరాణిలా వెలిగిపోవాలంటే ఈ తరహా డ్రెస్సింగ్ మంచి ఎంపిక. ప్లెయిన్ క్రీమ్ కలర్ చీర కట్టు దాని మీదకు, ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఆ పైన బంగారు రంగు లాంగో ఓవర్ కోట్« దరిస్తే వైవిధ్యంగా కనిపిస్తారు. ఒక చిన్న మార్పుతో ఎక్కడ ఉన్నా యువరాణిని తలపిస్తారు. ► ఏ ఫంక్షన్ జరిగినా అమ్మాయిలు డిజైనర్ లంగా ఓణీలు, గాగ్రాచోళీలు «ధరించడం సాధారణమైపోయింది. వీటిలోనూ మీదైన స్టైల్ కనిపించాలంటే బ్లౌజ్లో ఓ చిన్న మార్పు తీసుకువచ్చి లుక్‌లో సెలబ్రిటీ స్టైల్ తీసుకురావచ్చు. సెల్ఫ్ ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా, సింగిల్ స్లీవ్ బ్లౌజ్‌కే ఒన్ సైడ్ దుపట్టా జత చేయడం ఈ స్టైల్ ప్రత్యేకత. నిర్వహణ: ఎన్.ఆర్. -
అందుకే హీరోయిన్లు స్నేహంగా ఉండరట
ముంబై: కేవలం ఇన్సెక్యూరిటీ కారణంగానే బీ టౌన్ భామలు దూరం దూరంగా ఉంటారంటోంది హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అభద్రతా భావం వల్లే బాలీవుడ్ హీరోయిన్లు స్నేహంగా ఉండరట. అంతేకాదు మీరు అభద్రతగా ఫీలయితే ఇంకెవరితోనూ స్నేహితుల్లా కలవరలేని సలహా కూడా ఇస్తోంది. కానీ తను అలా కాదట. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ లాగా తను చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటానని చెబుతోంది. అందుకే తనకు సోనమ్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఆమె చాలా తెలివైందని, చాలా ఆత్మ విశ్వాసంతో ఉంటుందని అంది. అందుకే ఆమె చిన్న వయసులోనే చాలా విజయాలు సాధించిందంటోంది. అందుకే సోనమ్ ని ఫాలో అయిపోతానంటోంది ఈ బ్రదర్స్ భామ. ఇప్పటికే శ్రీలంకలో ఒక హోటల్‌ను నడుపుతున్న ఈ ముప్పయేళ్ల హీరోయిన్ భారత్‌లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు యోచిస్తోంది. భారతీయులకు శ్రీలంక రుచులను పరిచయం చేయాలనుకుంటోందిట. అందుకే ముంబైలో ఒక రెస్టారెంట్నొకదాన్నిఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నానని చెబుతోంది. భారత్, శ్రీలంక ఆహారపు అలవాట్లు దాదాపు ఒకేలా ఉంటాయని పేర్కొంది. ఒక సారి తన హెటల్ ఫుడ్ తిన్నవారు మళ్లీమళ్లీ రావాల్సిందే అంటోంది. బాలీవుడ్ స్టయిలిష్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న జాక్వెలిన్ దుస్తుల బిజినెస్‌లోకి మాత్రం రానంటోంది. అది సోనమ్ లైన్ తనది నాది కాదని చమత్కరించింది.