
సాక్షి, న్యూఢిల్లీ : సోనం కపూర్, ఆనంద్ అహుజా పెళ్లిపై వదంతులకు బ్రేక్ పడింది. వీరి వివాహం మే 8న జరుగుతుందని నిర్ధారిస్తూ కపూర్, అహుజా కుటుంబాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సోనం, ఆనంద్‌ల వివాహం ఈనెల 8న ముంబయిలో జరుగుతుందని, ఈ కార్యక్రమం సన్నిహితుల సమక్షంలో జరగాలని భావిస్తుండటంతో కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరతున్నామని ఇరు కుటుంబాలు ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా, సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ను కపూర్ కుటుంబం సంప్రదించినట్టు సమాచారం.
సంగీత్‌లో సోనం కజిన్ జాన్వి తన తల్లి శ్రీదేవి పాటలకు నృత్యం చేయనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జాన్వీతో పాటు కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్‌లు సోనం, ఆనంద్‌ల సంగీత్‌లో సందడి చేయనున్నారు. తమ పెళ్లికి ఆహ్వాన పత్రికలను ముద్రించకుండా పర్యావరణ అనుకూల ఈ-ఇన్‌వైట్స్‌ను పంపాలని సోనం, ఆనంద్‌లు నిర్ణయించుకున్నారు. సోనం, ఆనంద్‌ల వివాహం కేవలం బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment