Anand Ahuja
-
మోస్ట్ పాపులర్ హౌస్ కొన్న సోనమ్ కపూర్ జంట
ప్రముఖ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఇటీవల ముంబైలోని నీరవ్ మోదీకి చెందిన ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ 'రిథమ్ హౌస్'ను కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లిచకపోవడంతో దీనిని 2018లో మూసివేశారు. కాగా ఇప్పుడు 478.4 మిలియన్లకు (రూ.47.84 కోట్లు) సోనమ్ కపూర్ దంపతులు సొంతం చేసుకున్నారు.సుమారు 3,600 చదరపు అడుగుల రిథమ్ హౌస్ ఒకప్పుడు ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని నీరవ్ మోదీ నిర్వహణలో ఉండేది. దీనిని కొనుగోలు చేసినట్లు భానే ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి డీల్ విలువను వెల్లడించలేదు.భానే అనేది షాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్‌కు చెందిన ఒక విభాగం. ఇది ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహుజాకు చెందినది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అతిపెద్ద దుస్తులు తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయిస్తోంది.1940లో ప్రారంభమైన రిథమ్ హౌస్.. ఒకప్పుడు పండిట్ రవిశంకర్, ఇయాన్ ఆండర్సన్ వంటి సంగీత విద్వాంసులకు మాత్రమే కాకుండా ఎంతోమంది బాలీవుడ్ తారల బృందాలకు ఆతిథ్యం ఇచ్చింది.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్కొన్ని వారాల క్రితం సోనమ్ కపూర్, హరీష్ అహూజా లండన్‌లోని నాటింగ్ హిల్ జిల్లాలో 231.47 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ జంటకు ఢిల్లీలో రూ.173 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. అంతే కాకుండా వీరి వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే టైకాన్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. -
బాలీవుడ్ భామ బర్త్ డే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త!
అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ సోనమ్ కపూర్. ఇవాళ తాజాగా 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్లో సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ చివరిసారిగా బ్లైండ్ సినిమాలో కనిపించింది. సోనమ్ కపూర్ బర్త్ డే సందర్భంగా ఆమె భర్త ఆనంద్ అహుజా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్యకు రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి' బుక్‌ను పుట్టినరోజు కానుకుగా అందించారు. ఈ విషయాన్ని సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.సోనమ్ కపూర్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది నాకు అద్భుతమైన పుట్టినరోజు కానుక. నాకేం కావాలో నా భర్తకు మాత్రమే తెలుసు. ఠాగూర్ రాసిన గీతాంజలి మొదటి ఎడిషన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ అర్హత సాధించడానికి నీ కోసం ఏం చేశానో నాకు తెలియదు." అంటూ పోస్ట్ చేసింది. సోనమ్ బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి అనిల్ కపూర్ విషెస్ తెలిపారు. ఆమె తల్లి సునీతా కపూర్ సైతం సోషల్ మీడీయా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
Sonam Kapoor Latest Photos: వరల్డ్ కప్ కోసం వచ్చిన డేవిడ్ బెక్‌హామ్‌కు విందుపార్టీ ఇచ్చిన హీరోయిన్ (ఫోటోలు)
-
ఇది ప్రారంభం మాత్రమే!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. ‘శనివారం ఉదయం కొడుకు పుట్టాడు.. 2022 ఆగస్టు 20న ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు పేరు పేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే. చిన్నారి రాకతో మా జీవితాలు మారిపోతాయనే విషయం మాకు తెలుసు’ అంటూ ఆమె పోస్ట్ చేశారు. కాగా సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాలు 2018 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు సోనమ్. ఆ తర్వాత బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసుకున్నారు. సోనమ్–అహూజా తల్లితండ్రులయిన సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
కృష్ణాష్టమి తెల్లవారే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఉదయం కొడుకు పుట్టాడంటూ సోనమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో గుడ్‌న్యూస్ పంచుకుంది. 'ఆగస్టు 20, 2022.. ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే, బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు- సోనమ్ - ఆనంద్' అని రాసుకొచ్చింది. కాగా సోనమ్, ఆనంద్ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించిందీ హీరోయిన్. ఆ తర్వాత మెటర్నటీ షూట్ చేయించుకున్న ఫొటోలను సైతం వదిలింది. ఆ మధ్య లండన్‌లో సీమంతం జరుపుకోగా ఆ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే! View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) చదవండి: హీరో వరుణ్‌తేజ్‌తో రిలేషన్.. నోరు విప్పిన అందాల రాక్షసి అన్ని వారాల తర్వాత ఓటీటీలోకి రానున్న లైగర్! -
లండన్‌లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆగష్టులో బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం తన భర్త, సోదరి రియా కపూర్ అత్యంత సన్నిహితుల మధ్య సోనమ్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోదరి రియా కపూర్ షేర్ చేసింది. ఈ వేడుకలో సింగర్ లియో కల్యాణ్ పాట పాడుతూ అందరిని అలరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సీమంతం వేడుకలో సోనమ్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్యూట్‌గా నవ్వుతు ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా సోనమ్ ప్రస్తుతం తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్‌లో ఉంటుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Leo Kalyan (@leokalyan) -
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో దొంగతనం జరిగింది. న్యూఢిల్లీలోని ఆమె నివాసంలోకి చొరబడ్డ దుండగులు సుమారు రూ.1.41 కోట్ల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఫిబ్రవి 23న జరగగా,హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు దీన్ని గోప్యంగా ఉంచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న 25మంది ఉద్యోగులతో పాటు 9మంది కేర్‌టేకర్స్, డ్రైవర్లు, తోటమాలి, ఇతర పనివాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీని సైతం పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఇంట్లో సోనమ్ భర్త ఆనంద్ అహుజా పేరేంట్స్‌తో పాటు అతని నానామ్మ సరళ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. దొంగతనం అనంతరం ఒక రోజు అల్మారాలోని నగలు, డబ్బు తనిఖీ చేసినప్పుడు చోరీ జరిగిందన్న విషయం తెలిసిందని ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు గర్భవతిగా ఉన్న సోనమ్ ప్రస్తుతం తల్లి దగ్గర ఉంటున్నట్లు తెలుస్తుంది. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సోనమ్ ఇటీవలె బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
ప్రెగ్నెన్సీని ప్రకటించిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్
Sonam Kapoor Announces Her Pregnancy, Shares Baby Bump Pics: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోనమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భర్తలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. 'నాలుగు చేతులు. మేము చేయగలిగినంత ఉత్తమంగా నిన్ను పెంచడానికి. రెండు హృదయాలు. అవి నీతో కలిసి అడుగడుగునా కొట్టుకుంటాయి. నీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు కురిపించే ఒక కుటుంబం నీ రాక కోసం ఎదురుచూస్తుంది'. అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో కరీనా కపూర్, జాన్వీ కపూర్, ఏక్తా కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు,నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) -
అదృష్టవశాత్తూ బాలీవుడ్ వ్యక్తిని పెళ్లాడలేదు: హీరోయిన్
లండన్/ముంబై: బాలీవుడ్ బంధాలపై హీరోయిన్ సోనం కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదృష్టవశాత్తూ తాను ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని పేర్కొన్నారు. కాగా హృతిక్ రోషన్- సుజానే ఖాన్, ఆర్బాజ్‌ఖాన్- మలైకా అరోరా, సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ వంటి పలు బీ-టౌన్ జంటలు ఇప్పటికే వైవాహిక బంధానికి స్వస్తి పలకగా, తాము కూడా విడిపోతున్నట్లు ఆమిర్ ఖాన్- కిరణ్ రావు శనివారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వోగ్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనం మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేవుడి దయ వల్ల నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోలేదు. అందుకు నిజంగా కృతజ్ఞురాలిని. ఎందుకంటే, అక్కడ(బాలీవుడ్) పనిచేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్లో జరుగుతున్నది ఇదే. నాలాగా ఆలోచించే, ఫెమినిస్ట్‌ను పెళ్లాడటం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి’’ అని సోనం పేర్కొన్నారు. ఇక వివాహం తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ... ‘‘పెళ్లైన నాటి నుంచి ఈ ఏడాదే మేం ప్రతి రాత్రి కలిసి గడపగలుగుతున్నాం. ఎందుకంటే ముంబై- ఢిల్లీ- లండన్ల మధ్య ప్రయాణాలకే సమయం సరిపోయేది. మాకు ఒకరి పట్ల ఒకరికి అవిజ్యామైన ప్రేమ ఉంది. ఇద్దరం కలిస్తే సంతోషాలకు కొదవే ఉండదు. లండన్‌లో ఒంటరిగా ప్రయాణించడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఇక్కడ భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ఎంతో మంది ప్రజలను చూశాను. వాళ్లకి బాలీవుడ్ అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుందని నాకు అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా 2018లో సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
లిప్‌లాక్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం
బాలీవుడ్ జంట సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. తన భర్త ఆనంద్‌ను గాఢంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. 2021కు స్వాగతం పలుకుతున్నా.. ఈ ఏడాదంతా స్నేహితులు, ప్రేమ, పని, ప్రయాణాలు, ఆధ్యాత్మిక, ఇలా అన్నింటి మేళవింపుతో నిండనుంది. మరిన్ని మంచి క్షణాలు ఎంజాయ్ చేసేందుకు ఎదురు చూస్తున్నాను. గడిచిన వాటి కోసం ఆలోచించడం మానేసి కలిసి పని చేద్దాం.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారగా ఆమె అభిమానులు సోనమ్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ జంట లండన్‌లోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. (చదవండి: 'ఓసారి నీ భర్తను చూడు, ఎంత దరిద్రంగా ఉన్నాడో') ఇదిలా వుంటే సోనమ్ కపూర్ "ఏకే వర్సెస్ ఏకే" అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో నటించారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె తండ్రి అనిల్ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాలో అనిల్ కపూర్ నిజం అనిల్ కపూర్‌లా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిజం అనురాగ్ కశ్యప్లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్ కెరీర్ల మీద పంచ్‌లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్ కశ్యప్ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను’ అని దర్శకుడు అనురాగ్ కశ్యప్ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్ కపూర్ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు సోనమ్ కిడ్నాప్ ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. (చదవండి: అనిల్ కపూర్ కుమార్తె సొనమ్ కిడ్నాప్) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) -
నీ భర్త దరిద్రంగా ఉన్నాడు: హీరోయిన్‌కు మెసేజ్
బాలీవుడ్ స్టార్ కిడ్ సోనమ్ కపూర్‌పై ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. తనపై వచ్చే విమర్శలకు ఆమె ధీటైన సమాధానాలిస్తారు కూడా! అయితే ఈ సారి సోనమ్‌ను కాకుండా ఆమె భర్తను టార్గెట్ చేయడంతో ఆమె తన సహనాన్ని కోల్పోయారు. ఓ అమెరికన్ ఇన్ఫ్లూయెన్సర్.. సోనమ్‌ను నెపోటిజం ఉత్పత్తిగా పిలుస్తూ ఘాటు విమర్శలు చేసింది. అక్కడితో ఆగకుండా "నీ భర్త ఏమైనా హాట్‌గా ఉన్నాడని ఫీలవుతున్నావా? అంత సీన్ లేదు, ఒకసారి కళ్లు తెరిచి చూడు, అతను ఎంత దరిద్రంగా ఉన్నాడో" అని రాసుకొచ్చింది. ఈ మెసేజ్ చూసిన సోనమ్‌కు కోపం నషాళానికంటింది. తన వరకు ఏమైనా అంటే ఊరుకునేదేమో కానీ, మధ్యలో తనను భర్తను లాక్కొచ్చినందుకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు. ఆమె చేసిన మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేశారు. (చీరకట్టుకు లక్ష రూపాయలు) "ఈ పోస్ట్ వల్ల మీకు ఫాలోవర్లు పెరుగుతారు. ఇదే కదా, నువ్వు నా నుంచి ఆశించింది. మనసులో అంత ద్వేషం పెట్టుకోవడం మీకంత మంచిది కాదు. నాకు తెలుసు, కేవలం తారల దృష్టిని ఆకర్షించేందుకే ఇలాంటి పోస్టులు చేస్తుంటారు. ఏదైతేనేం, నీ కోరిక నెరవేర్చా" అని సోనమ్ చెప్పుకొచ్చారు. కాగా ఇలాంటి ప్రతికూల మెసేజ్‌లను అసలు పట్టించుకోకండని ఆమె అభిమానులు సూచిస్తున్నారు. కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ భామ ప్రస్తుతం తన భర్త ఆనంద్‌తో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. ఆమె చివరిసారిగా 'జోయా ఫ్యాక్టర్' సినిమాలో నటించారు. (నెటిజన్ ట్రోల్.. సోనమ్ గట్టి కౌంటర్) -
వైరల్: భర్తతో సోనమ్ సందడి..!
ముంబై: దీపావళి సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సందడి చేశారు. తన తండ్రి అనిల్ కపూర్ ఏర్పాటు చేసిన పార్టీలో సోనమ్ భర్త ఆనంద్ అహుజాతో కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌లతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా పార్టీలో సందడి చేస్తూ.. అటు ఇటు కలియదిరుగుతూ.. మీడియా ఛానెల్ పాపారాట్సీలకు, పార్టీలోని గెస్ట్‌లకు లడ్డూలు పంచుతూ.. ఒకింత రెట్టింపు ఉత్సాహంతో అందరికి హ్యపీ దీపావళి అని శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అభిమానులను అలరిస్తోంది. ఇక మిగతా బాలీవుడ్ ప్రముఖులు దీపావళి సంబరాల్లో మునిగిపోతూ.. వేర్వేరు చోట్ల ఫోటోలకు పోజిచ్చారు. View this post on Instagram @anandahuja #with #wife @sonamkapoor at #anilkapoor Diwali Bash in #Mumbai . #happydiwali #diwali #celebrations #festival #lights #colourful #gogreen #nopollution #yogenshah @yogenshah_s @anilskapoor A post shared by yogen shah (@yogenshah_s) on Oct 27, 2019 at 7:47pm PDT -
అందుకే భార్య షూ లేసులు కట్టాడేమో?!
బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనమ్ కపూర్ అహుజా మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ప్రియుడు ఆనంద్ అహుజాను పెళ్లాడిన ఆమె తల్లికాబోతున్నారంటూ బీ- టౌన్లో టాక్ వినిపిస్తోంది. గురువారం జరిగిన ఓ ప్రముఖ షూ కంపెనీ కొత్త బ్రాండ్ లాంచింగ్ కార్యక్రమానికి సోనమ్ భర్తతో కలిసి హాజరయ్యారు. ఇందులో భాగంగా భార్యాభర్తలిద్దరు ఒకే రంగు షూ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే షూ వేసుకునే క్రమంలో సోనమ్‌కు ఇబ్బంది కాకూడదని భావించిన ఆనంద్.. ఆమె షూ లేసులు కట్టిన దృశ్యం అక్కడున్న వారితో పాటు ఫొటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఇంకేముంది.. వెంటనే తమ కెమెరా కన్నుకు పనిచెప్పి చకచకా క్లిక్‌మనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భార్యపై ఆనంద్‌కు ఎంత ప్రేమో అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘భర్తతో షూలేసులు కట్టించుకోవడమేంటి సోనమ్.. నీకిది తగునా’ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఓ అడుగు ముందుకేసి.. ‘సోనమ్ తల్లికాబోతోంది. ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తనకు కష్టం కాకూడదనే ఆనంద్ షూ లేసులు కడుతున్నాడు’ అంటూ కథనాలు అల్లేస్తున్నారు. కాగా బాలీవుడ్ స్టార్ భామ దీపికా పదుకునే గురించి కూడా ఇలాంటి రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన దీపికా.. ‘పెళ్లైన వెంటనే తల్లి కావాలా..? అంటూ ప్రశ్నించింది. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. పెళ్లైన వాళ్లను పిల్లల గురించి అడిగి విసిగించడం ఎందుకు’ అంటూ దీపిక ఫైర్ అయ్యారు. -
పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్..!
బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న భామ సోనమ్ కపూర్. కపూర్ ఫ్యామిలీ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనమ్ కెరీర్లో ఒక్క నీర్జా తప్ప ఘన విజయం సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. సినిమా మాట ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం సోనమ్ ఫుల్ యాక్టివ్. తన సినిమాల అప్డేట్స్తో పాటు ఫొటోలను అప్డేట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరును మార్చేసింది. గతంలో ఆనంద్ అహూజాతో వివాహం తరువాత సోనమ్ కపూర్‌గా ఉన్న తన పేరును సోనమ్ కె అహూజాగా మార్చిన సోనమ్, తాజాగా తన పేరును జోయా సింగ్ సోలంకీగా మార్చేసింది. ప్రస్తుతం తన హీరోయిన్గా నటిస్తున్న ది జోయా ఫ్యాక్టర్‌లో సోనమ్ క్యారెక్టర్ పేరు జోయా సింగ్ సోలంకీ అందుకే సినిమా ప్రమోషన్లో భాగంగానే సోనమ్ ఈ పని చేసిందట. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
‘ఆ విషయంలో కరీనానే బెస్ట్’
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అనగానే ప్రస్తుతం చాలా మందికి గుర్తొచ్చే పేరు సోనమ్ కపూర్. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఫ్యాషన్ దివా అంటే సోనమే అనేంతగా లుక్స్‌తో ఆకట్టుకున్నారు కూడా. అయితే ఫ్యాషన్ విషయంలో సోనమ్ కంటే కూడా కరీనా కపూరే ది బెస్ట్ అనే స్టేట్మెంట్ సోనమ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిపై వారు తమ ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్లగక్కలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు... సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..బాలీవుడ్ స్టైల్ ఐకాన్ అంటే తనకు కరీనా కపూరే గుర్తుకువస్తుందని ఆనంద్ పేర్కొన్నారు. ‘కరీనా కపూర్ మోస్ట్ స్టైలిస్ట్ వుమన్... ఇటీవల లండన్ వెకేషన్లో భాగంగా ఆమెను దగ్గరగా చూసే అవకాశం కలిగింది. మేకప్ లేకుండా కూడా ఆమె చాలా స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. సో.. నేనైతే ఫ్యాషన్ విషయంలో కరీనానే బెస్ట్ అని చెబుతానని, అలా సోనమ్‌ని తక్కువ చేసి మాట్లాడటం తన ఉద్దేశం కాదని’ ఆనంద్ వ్యాఖ్యానించారు. కాగా ఫ్యాషన్ పట్ల ఇద్దరికి ఉన్న ఆసక్తే తమను ఒక్కటి చేసిందని, ఆనంద్‌ను వివాహం చేసుకోవడానికి అది కూడా ఒక కారణమని ఇటీవలే సోనమ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం భర్త ఇచ్చిన స్టేట్మెంట్కు ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. -
ఇండస్ట్రీని తప్పు పట్టొద్దు!
పెళ్లి చేసుకున్నంత మాత్రాన అవకాశాలు తగ్గిపోవని రీసెంట్గా నటి ఆలియా భట్ బీ టౌన్ మీడియా ముందు స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు సోనమ్ కపూర్ కూడా ఇదే విషయంపై స్పందించారు. ‘పెళ్లి చేసుకున్నారు కదా. హీరోయిన్గా చాన్స్‌లు తగ్గిపోతాయని భయపడుతున్నారా?’ అన్న ప్రశ్నను మీడియా వారు సోనమ్‌ను అడిగినప్పుడు– ‘‘వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నటి డింపుల్ కపాడియా ‘సాగర్’ అనే సినిమాలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. పెళ్లి తర్వాత చాన్స్‌లు తగ్గిపోతాయని నేను భయపడటం లేదు. ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్నాయని ఇండస్ట్రీ నన్ను నమ్మినంత కాలం నాకు చాన్సులు వస్తూనే ఉంటాయి. ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత కథానాయికలకు చాన్స్‌లు రావు అనుకుంటే.. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా, కాజోల్, లేటెస్ట్గా కరీనా కపూర్లకు ఇండస్ట్రీలో పని దొరికేది కాదు. ఈ విషయంలో ఇండస్ట్రీని తప్పుపట్టవద్దు. ఇండస్ట్రీలోనే కాదు సమాజంలోనూ మహిళలకు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటే బాగుంటుంది’’ అన్నారు. ఈ ఏడాది మేలో వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో సోనమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. -
‘అందుకే అతన్ని వివాహం చేసుకున్నాను’
సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజ రెండు నెలల క్రితం వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. వివాహం అయిన దగ్గర నుంచి ఈ జంట ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అంశాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. సోనమ్ కపూర్ అంటేనే ఫ్యాషన్ ఐకాన్. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆనంద్ అహుజా కూడా ఫ్యాషన్ ప్రియుడే. ఫ్యాషన్ పట్ల ఇద్దరికి ఉన్న ఆసక్తే తమను ఒక్కటి చేసిందింటున్నారు సోనమ్. ఈ విషయం గురించి సోనమ్ తన ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. దానిలో ‘ఫ్యాషన్ అంటే నాకు ఎంత ఇష్టమో అందరికి తెలిసిన విషయమే. నేను ఆనంద్‌ను వివాహం చేసుకుంది కూడా ఈ కారణం వల్లే. ఎందుకంటే ఆనంద్ ఫ్యాషన్ రంగంలో, రిటైల్ రంగంలో స్థిరపడిన వ్యక్తి కాబట్టి నాకు తొందరగా నచ్చాడు. ఫ్యాషన్ పట్ల ఉన్న ఆసక్తి వల్లే మేము ఇద్దరం వివాహం చేసుకున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ అహుజా ఢిల్లీకి చెందిన రిటైల్ వ్యాపారి. అంతేకాక దేశంలో తొలి మల్టీ బ్రాండ్ ‘స్నీకర్’ బోటిక్‌ను ప్రారంభించింది కూడా ఆనంద్ అహుజానే. దీంతోపాటు ‘భనే’ అనే బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు. ఈ ఏడాది మే 8న సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే సోనమ్ ‘క్యాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018’లో పాల్గొన్నారు. -
ఆనందమానందమాయె
మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో ఆమె వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపార వ్యవహారాల రీత్యా సోనమ్ భర్త ఆనంద్ ఢిల్లీలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి వస్తోందట. దీంతో పెళ్లైన తర్వాత ఢిల్లీకి సోనమ్ రాకపోకలు బాగా పెరిగాయి. అలాగే లండన్‌లోనూ ఆనంద్కి వ్యాపారాలు ఉన్నాయట. అప్పుడప్పుడూ భర్తతో టైమ్ స్పెండ్ చేయడం కోసం లండన్ కూడా వెళ్తున్నారట సోనమ్. దీంతో సోనమ్ కోసం ఆనంద్ తన వ్యాపారాలను ముంబైలో కూడా పెంచాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నది బీటౌన్ టాక్. అలాగే సోనమ్ కూడా మూడేళ్ల క్రితం దాదాపు 30 కోట్లతో బాంద్రాలో కొన్న తన ఇంటిని రీ డిజైన్ చేయిస్తున్నారని బాలీవుడ్ సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఈ ఇంటి డిజైనింగ్ కంప్లీట్ అవుతుందని, ముంబైలో ఉన్నప్పుడు వీరిద్దరూ ఈ ఇంట్లోనే ఉండబోతున్నారనేది బాలీవుడ్ కథనాల సారాంశం. ఆనంద్‌ని పెళ్లి చేసుకున్నాక సోనమ్ లైఫ్ ఇంకా ఆనందంగా మారిందని పరిశీలకులు అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. .‘జోయా ఫ్యాక్టర్’, ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ సినిమాలతో బిజీగా ఉన్నారు సోనమ్. -
సోనమ్ బర్త్‌డే.. ఆనంద్ ఫన్నీ విషెస్
పుట్టినరోజు పండుగే అందరికీ... మరి అలాంటి ప్రత్యేకమైన రోజున మనకెంతో ప్రియమైన వారితో కలిసి సమయం గడపడమనేది ఒక అందమైన అనుభూతి. ప్రస్తుతం బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ కాదు కాదు శ్రీమతి సోనమ్ కపూర్ అహుజా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈరోజు (శనివారం) 33వ వసంతంలోకి అడుగుపెడుతున్న సోనమ్.. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్‌లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సోనమ్ ఫొటో షేర్ చేసిన ఆనంద్.. ‘తన పుట్టినరోజున సోనమ్ కేక్‌ను ఇలా చూస్తూ ఉంటుంది. తనను ఇలా చూడటం నాకు సరదాగా ఉంటుంది’ అంటూ చేసిన కామెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేసేందుకు సోదరి రియా కపూర్, కరీనా కపూర్, అర్జున్ కపూర్లతో సోనమ్ లండన్ వెళ్లారు. భార్య బర్త్‌డే సెలబ్రేట్ చేయడం కోసం ఆనంద్ కూడా లండన్ చేరుకున్నారు. అంతేకాకుండా పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో జీవితాంతం గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాడట. -
లండన్‌లో తొలి బర్త్‌డే!
ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను లండన్‌లో ప్లాన్ చేశారు బాలీవుడు బ్యూటీ సోనమ్ కపూర్. ఆల్రెడీ 32 సార్లు బర్త్‌డే కేక్‌ను కట్ చేసిన సోనమ్‌కి తొలి బర్త్‌డే ఏంటి బాస్? అంటే.. నిజమే. ఇప్పటివరకూ జరుపుకున్న బర్త్ డేలకు కేక్‌లను ముక్కలు చేసింది కుమారిగా. ఇప్పుడు శ్రీమతి అయ్యాక జరుపుకుంటున్న తొలి బర్త్‌డే ఇది. ఈ ఏడాది మేలో ఆనంద్ ఆహుజాతో సోనమ్ కపూర్ ఏడు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న సోనమ్ పుట్టినరోజు. సోనమ్ 33వ బర్త్‌డే సెలబ్రేషన్స్ లండన్‌లో జరగనున్నాయి. ‘‘ఓ పని మీద లండన్ వెళ్తున్నాను. ఆనంద్ కూడా అక్కడికి వస్తాడు. సో.. నా బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుగుతాయి. ఈ సెలబ్రేషన్స్‌లో నా సిస్టర్ రియా, స్నేహితులు సెహాల్యఖాన్, సయంక్తా నాయర్ కూడా పాల్గొంటారు. స్వర భాస్కర్ని జాయిన్ అవ్వమన్నాను. కానీ ‘వేరే వర్క్స్ వల్ల రాలేకపోతున్నాను’ అని స్వర చెప్పింది’’ అని సోనమ్ కపూర్ పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘సంజు’, తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి నటిస్తోన్న ‘ఎక్ లడ్కీ కో దేఖా తో ఏసా లగా’ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. -
ఫ్రెండ్ కోసం పెళ్లి తేదీ మార్చుకున్న హీరోయిన్
సాక్షి, ముంబై : జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకగా భావించే వివాహానికి ప్రాణ స్నేహితులు, సమీప బంధువులు రాలేరని తెలిస్తే మనసు చిన్న బుచ్చుకోవడం సహజం. వారి కోసం వివాహ తేదీలో మార్పు చేసుకోవడమంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే సోనమ్ కపూర్ ఇందుకు మినహాయింపు. స్నేహితురాలి కోసం ఏకంగా పెళ్లి తేదీనే మార్చుకున్నారు. అసలు విషయమేమిటంటే.. ఈనెల (మే) 8న తేదీన సోనమ్ కపూర్ పెళ్లి వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో జరిగిన విషయం తెలిసిందే. అయితే వారి వివాహం మార్చి 12నే జరగాల్సిందట. కానీ ఆరోజే సోనమ్ స్నేహితురాలు స్వరా భాస్కర్ సోదరుడు ఇషాన్ వివాహం జరగనుండడంతో.. సోనమ్ తల్లిదండ్రులను ఒప్పించి మరీ వివాహ తేదీని మే 8కి మార్పించారట. తాజాగా ఈ విషయాన్ని స్వరా భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సోనమ్ చాలా డల్‌గా కన్పించింది. ఇషాన్ వివాహ తేదీని మార్చాల్సిందిగా నా తల్లిదండ్రులను ఒప్పించమని నన్ను అడిగింది. అలా కుదరకపోవడంతో తనే పెళ్లి తేదీని మార్చుకుని స్వీట్ షాక్ ఇచ్చిందంటూ’ స్వరా భాస్కర్ తమ మధ్య ఉన్న స్నేహబంధం గురించి చెబుతూ మురిసిపోయారు. -
మల్టీ టాస్కింగ్ సోనమ్...!!
ముంబై : ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది మధుర ఙ్ఞాపకం. వివాహం కొత్త బంధాలతో పాటు బాధ్యతలు కూడా తీసుకువస్తుంది. ఈ విషయంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా సమానమే. అందుకు బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్... కాదు కాదు శ్రీమతి సోనమ్ కపూర్ అహుజా తాను కూడా మినహాయింపు కాదంటున్నారు. సోనమ్ కపూర్ ఈ నెల 8న వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన సోనమ్ అక్కడి నుంచి తిరిగి రాగానే.. ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అంత బిజీ షెడ్యూల్లోనూ భార్యగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. వ్యాపారంతో నిత్యం బిజీగా ఉండే తన భర్త ఆనంద్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. భర్తను చూడగానే సంతోషంతో సోనమ్ ముఖం వెలిగిపోయింది. అంతే ఇక ఈ కొత్త జంటను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. పెళ్లి, కెరీర్ ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం కాస్త కష్టమైన విషయమే. కానీ అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికితే అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ విషయంలో సోనమ్ అదృష్టవంతురాలే అనుకోవచ్చంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అది నా వ్యక్తిగత నిర్ణయం : సోనమ్
అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ వివాహం ఈనెల(మే) 8న వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తంతు ముగిసిన వెంటనే సోనమ్.. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో తన పేరును సోనమ్ కె అహుజాగా మార్చుకున్నారు. అయితే సోనమ్ ఈ నిర్ణయంపై ఆమె అభిమానులు, ఫెమినిస్టులు మండిపడుతున్నారు. ఫెమినిస్ట్‌గా గుర్తింపు పొందిన మీరు ఇలా ఎలా చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సోనమ్ స్పందించారు. ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్లిన సోనమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చాలా రోజుల క్రితమే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చాను. దీర్ఘకాలం నుంచి రిలేషన్ షిప్లో ఉన్న నేను.. ప్రస్తుతం పెళ్లి చేసుకున్నాను. ఇక ఇంటి పేరు మార్చుకోవడం అనేది వ్యక్తిగతమైన అంశ’మంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘ఫెమినిజం అనే కాన్సెప్ట్‌ను సరిగా అర్థం చేసుకోలేని వాళ్లు ఆన్‌లైన్‌కు వెళ్లి ఓసారి చెక్ చేయాలి. అయినా ఆనందే నా పేరు మార్చాడని మీకెలా తెలుసంటూ’ ఘాటుగా స్పందించారు. -
మీ ప్రేమే నా బలం: సోనమ్ కపూర్
అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ వివాహ వేడుక ఎంత వైభవంగా జరిగిందో అందరికి తెలిసిన విషయమే. మెహందీ, సంగీత్, వివాహం, రిసెప్షన్ ఇలా ప్రతి వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా నిర్వహించారు కుటుంబ సభ్యులు. తన వివాహ వేడుకను ఇంత ఘనంగా, వైభవంగా నిర్వహించిన తల్లిదండ్రులకు, ఆప్తులకు కృతజ్ఞతలు తెలిపారు సోనమ్. ఈ సందర్భంగా తన ఇన్స్టామ్గ్రామ్లో ఒక మెసేజ్‌ను పోస్టు చేశారు. ‘మా వివాహన్ని ఆశిర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెండురోజుల ఈ వేడుక మా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఇంత అద్భుతంగా మలచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. అలానే కుటుంబాన్ని ఉద్ధేశించి మరో పోస్టులో ‘మా కుటుంబమే మా బలం. కపూర్ కుటుంబ సభ్యులందరికి చాలా ధన్యవాదాలు. సునీత నువ్వు ఈ ప్రపంచంలోనే అందరికంటే మంచి అమ్మవి. నాన్న నువ్వు నన్ను, ఆనంద్‌ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావ్...మీ ప్రేమకు, మద్దతకు చాలా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ నెల 8న సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తుల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం చాలా వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుకకు అమితాబ్, బాలీవుడ్ ఖాన్‌త్రయంతో పాటు కత్రినా, రాణి ముఖర్జీ హజరయ్యారు. -
ఇక నో సీక్రెట్
తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నటాషా దలాల్‌తో వరుణ్ ధావన్ లవ్‌లో ఉన్నారని ఎప్పట్నుంచో బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. వరుణ్, నటాషా కెమెరా కంట పడకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, థియేటర్స్‌కు సీక్రెట్‌గా వెళుతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్ మీటింగ్స్‌కి ఫుల్స్టాప్ పెట్టిందీ జంట. సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా రిసెప్షన్ వేడుకకు వీరిద్దరూ జోడీగా హాజరయ్యారు. దీంతో ఇక నో సీక్రెట్స్ అని చెప్పకనే చెప్పారు వరుణ్ అండ్ నటాషా. ఇలా జంటగా నలుగురికీ కనిపించడంతో వరుణ్, నటాషా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబో తున్నారన్న కొత్త రాగం బాలీవుడ్లో మొద లైంది. రీసెంట్గా తాను హీరోగా నటించిన ‘అక్టోబర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఏడాదిలో వివాహం చేసుకుంటానేమోనని వరుణ్ చెప్పడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ‘కళంక్’ సినిమాలో నటిస్తున్నారు వరుణ్«. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం ఆయన స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. -
సోనమ్ పెళ్లిలో ‘ఖాన్’ల హవా!
బాలీవుడ్లో సోనమ్ కపూర్ ఆనంద్ అహుజాల పెళ్లి ఘనంగా జరిగింది. బాలీవుడ్లో ఎక్కడ చూసినా... మొత్తం ఈ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లే వినబడుతున్నాయి. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి స్టార్స్ అందరూ హాజరయ్యారు. మెహెందీ, సంగీత్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లి వేడుకలో ఖాన్ ద్వయం వేసిన స్టెప్స్‌లు వైరల్‌గా మారాయి. షారుఖ్, సల్మాన్, రణవీర్, అనిల్‌కపూర్ వేసిన డ్యాన్సులు ప్రోగ్రామ్‌కే హైలెట్‌గా నిలిచాయి. వీరి స్టెప్పులతో, డీజేలతో ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. రణవీర్‌సింగ్, పెళ్లి కొడుకు ఆనంద్‌ను ఎత్తుకుని డ్యాన్స్ చేయడం, షారుఖ్ సోనమ్‌ను డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించడం, తను కూడా నృత్యం చేయడం ఇవన్నీ హైలెట్‌గా నిలిచాయి. -
సోనమ్ పెళ్లి వేడుకలో సల్మాన్,షారుఖ్ స్టెప్పులు
-
సోనమ్ కీ షాదీ
మనసుకి నచ్చిన వ్యక్తిని మనువాడితే ఆ ఆనందం అంతా మనసులోనే కాదు.. ముఖారవిందంలో కూడా కనిపిస్తుంది. మంగళవారం సోనమ్ కపూర్ ఫేస్‌లో ఆ హ్యాపీనెస్ కనిపించింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఆనంద్ అహూజా, సోనమ్ కపూర్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా భార్యాభర్తలయ్యారు. సిక్కు సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. ముంబైలోని కపూర్ ఫ్యామిలీకి చెందిన రాక్‌డేల్ బంగళా ఈ పెళ్లికి వేదిక అయింది. ఎరుపు రంగు లెహంగా, చోళీ, డిజైనర్ జ్యువెలరీలో సోనమ్ మెరిసిపోయారు. బంగారు వర్ణం డిజైనర్ షేర్వానీలో ఆనంద్ హ్యాండ్సమ్గా కనిపించారు. ఈ వేడుకకు అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతానందా, ఆమిర్ ఖాన్, ఆయన సతీమణి కిరణ్ రావ్, ముద్దుల తనయుడు తైముర్తో సహా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహార్, కరిష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. జాన్వీకి సారీ చెప్పిన సోనమ్ సోనమ్ పెళ్లి వేడుకల్లో శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ సెంటరాఫ్ ఎట్రాక్షన్. అలాగే జాన్వీకి సోనమ్ ‘సారీ’ చెప్పడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. సోనమ్ సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పెళ్లికి ఆచరించే సంప్రదాయాల్లో పెళ్లి కూతురు చేతికి ఎరుపు, తెలుపు గాజులు, వాటికి వేలాడుతూ ‘కలేరి’ ధరించాల్సి ఉంటుంది. ఈ కలేరి అవివాహితుల తలకు తగిలితే వాళ్లకు త్వరగా పెళ్లవుతుందని విశ్వాసం. సోనమ్ సరదాగా జాన్వీ తలకు కలేరీని తగిలించబోతే జాన్వీ కంగారు పడింది. పెదనాన్న (బోనీకపూర్) కూతురు, చెల్లెలు జాన్వీని అలా ఆటపట్టించి, ‘సారీ’ చెప్పారు సోనమ్. తన తలకు కలేరి తగలకపోవడంతో జాన్వీ ఫేస్‌లో రిలీఫ్ కనిపించింది. ఇలాంటి చమక్కులతో సోనమ్ కీ షాదీ సందడి సందడిగా జరిగింది. మధ్యాహ్నం పెళ్లి.. సాయంత్రం చేంజ్! మెహందీ, సంగీత్, పెళ్లి.. ఒక్కో రోజు ఒక్కో వేడుక. మూడు రోజులు సోనమ్ కపూర్ పెళ్లి పనులు సరదాగా జరిగాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోనమ్‌కు మంగళవారం సాయంత్రం వరకూ తన పెళ్లి ఫొటోలను పోస్ట్ చేసే తీరిక లేకపోవడం సహజం. అయితే తనను ఇన్స్టాగ్రామ్, ట్వీటర్లలో ఫాలో అవుతున్న 12లక్షల మందికి పైగా ఫాలోయర్స్‌కు మాత్రం ‘ఒక్క చేంజ్’తో పెళ్లయిన విషయాన్ని చెప్పారీ కొత్త పెళ్లికూతురు. ఎలా అంటే.. ఇన్స్టాగ్రామ్, ట్వీటర్ అకౌంట్ యూజర్ నేమ్‌ను చేంజ్ చేశారామె. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి చేసుకున్న సోనమ్ సాయంకాలానికల్లా యూజర్ నేమ్‌ను ‘సోనమ్‌కపూర్ అహుజా’ అని మార్చారు. -
అంగరంగ వైభవంగా సోనమ్- ఆనంద్‌ల వివాహం
అనిల్ కపూర్ గారాల పట్టి, బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సోనమ్ ఆంటీ కవితా సింగ్‌కు చెందిన వారసత్వ బంగ్లాలో వీరి పెళ్లి వేడుకను నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం మంగళవారం ఉదయం 11- 12.30 గంటల ప్రాంతంలో సోనమ్- ఆనంద్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫ్యాషన్ ఐకాన్‌గా పేరొందిన సోనమ్.. వివాహ వేడుకలో అనురాధా వాకిల్ రూపొందించిన లెహంగా ధరించారు. ఎరుపు రంగు లెహంగాపై బంగారు వర్ణం తామరపువ్వులతో కూడిన డిజైన్‌తో సంప్రదాయ దుస్తుల్లో అచ్చం రాజకుమారిలా కనిపించారు సోనమ్. బంగారు వర్ణం షేర్వాణీ ధరించిన ఆనంద్ మెడలో రూబీ మాలతో సింప్లీ సూపర్బ్ అనిపించారు. ముంబైలోని బాంద్రాలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన సోనమ్- ఆనంద్‌ల పెళ్లి వేడుకకు బంధువులతో పాటు, బాలీవుడ్ తారాలోకం కూడా కదిలి వచ్చింది. సోనమ్ కజిన్స్ అర్జున్ కపూర్, అన్షులా, జాహ్నవీ కపూర్, ఖుషీ కపూర్లు పెళ్లిలో సందడి చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, రాణీ ముఖర్జీ, కరీనా- సైఫ్ అలీఖాన్ దంపతులు, కరీష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్వరా భాస్కర్ తదితరులు హాజరై సందడి చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లి కూతురుగా ముస్తాబైన సోనమ్...
కపూర్ల గారాల పట్టి సోనమ్ పెళ్లి కబురు తెలిసిన దగ్గరనుంచి అభిమానుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. అసలు సోనమ్ కపూర్ అంటేనే కొత్త ఫ్యాషన్లకు ఐకాన్‌గా చెప్పుకుంటారు. అలాంటిది ఇక వివాహమంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. శనివారం నుంచే కపూర్ మాన్షన్‌లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన మెహంది, అనంతరం జరిగిన సంగీత్ వేడుకలు ఎంత అట్టహాసంగా జరిగాయో వీటికి సంబంధించిన ఫోటోలు చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ రోజు ఉదయం 11 - 12.30 గంటల ప్రాంతంలో జరిగిన వివాహ తంతుతో సోనమ్ కపూర్, ఆనంద్ అహూజా ఒక్కటయ్యారు. గులాబీ బాల పెళ్లికి గులాబి రంగులో అలంకరించిన వివాహ వేదిక ఆహుతుల చూపులను కట్టిపడేసింది. సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో చక్కనమ్మ సోనమ్ దేవకన్యలకే అసూయ పుట్టించేలా ముస్తాబయింది. సోనమ్ అనురాధ వాకిల్ రూపొందించిన తామరపూవ్వులతో ఉన్నఎరుపు లెహాంగాలో దివినుంచి దిగివచ్చిన చందమామలా ఉన్నారు. వరుడు ఆనంద్ అహుజా ఒక గంట ముందే వేదిక వద్దకు వచ్చాడు. ఆనంద్ బంగారు వర్ణంలో ఉన్న షేర్వాని ధరించి మెడలో రూబీ మాలతో రాజకుమారుడికి ధీటుగా ఉన్నాడు. వీరి వివాహ వేడుక బంద్రాలో జరిగింది. వీరి వివాహానికి బాలీవుడ్ తారాలోకం తరలి వచ్చింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కుమారుడు, కూతురుతో వేడుకకు విచ్చేసారు. వీరితో పాటు కరీనా కపూర్, భర్త సైఫ్ అలీఖాన్, కుమారుడు తైమూర్ ఖాన్‌తో పాటు అక్క కరిష్మా కపూర్ కూడా వచ్చారు. సోనమ్ స్నేహితులు స్వర భాస్కర్, జాక్వేలిన్, నిర్మాత కరణ్ జోహర్, కజిన్స్ జాహ్నవి, ఖుషి కపూర్ హాజరయ్యారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. ఈ రోజు సాయంత్రం నూతన వధూవరుల కోసం రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. Breathtaking! We can't keep our eyes off @sonamakapoor in her bridal lehenga. #SonamKiShaadi #EverydayPhenomenal pic.twitter.com/7Y6HcdEWYP — Filmfare (@filmfare) May 8, 2018 -
వైరల్ వీడియో : సంగీత్‌లో కరణ్, శిల్పా, అనిల్ డ్యాన్స్
బాలీవుడ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. ఎన్నో రూమర్ల అనంతరం సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల పెళ్లి నిశ్చయమైంది. రూమర్లకు చెక్‌పెడుతూ... ఇరువర్గాల కుటుంబాలు మే 8న పెళ్లి జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్ నటి సోనమ్, ఆనంద్ జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను, సోమవారం సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోనమ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమాలకు అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్ జోహర్‌తో పాటు సన్నిహితులు, బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు సంగీత్ వేడుకలో పలువురు బాలీవుడ్ నటులతో పాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొన్నారు. సంగీత్ కార్యక్రమంలో కరణ్ జోహార్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి చేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరణ్ జోహర్ డ్యాన్స్ చేస్తుండగా... మధ్యలో అనిల్ కపూర్ రావడం... అనిల్ కపూర్, శిల్పా శెట్టిని డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించడం... శిల్పా డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
సంగీత్‌లో కరణ్, శిల్పా, అనిల్ డ్యాన్స్
-
పెళ్లిలో సీరియస్నెస్సా.. హాహాహా!
ముంబై : పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్ నటి సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజా జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. వీరి వివాహం మంగళవారం జరగనుండగా.. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను ఘనంగా నిర్వహించారు. సోనం ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్ జోహర్‌తో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నేడు సంగీత్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ నటులతోపాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొననున్నారు. మరోవైపు సోనం పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వివాహమనేది సంతోషంగా చేసుకునే వేడుక. అందులో సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒకటవుతున్న వేళ.. అందరు ఒక దగ్గర చేరి చేసుకునే పార్టీ లాంటిది. పెళ్లి అనేది సీరియస్ అంశమే. కానీ పెళ్లితో ఏదో జరిగిపోతోంది.. కొత్తగా మొదలవుతుంది అంటూ ఉండదు. కాబట్టి ఆ తర్వాత ఏమిటన్నది సీరియస్‌గా తీసుకోకూడదు. ఇప్పటివరకు నటించాను.. పెళ్లి తర్వాత కూడా నటిస్తాను’ అని సోనమ్ పేర్కొన్నారు. -
ఆ జంటకు బహుమతుల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : మే 8న వివాహ బంధంతో ఒక్కటవుతున్న సోనం కపూర్, ఆనంద్ అహుజాలకు సెలెబ్రిటీ స్నేహితులు, సన్నిహితుల నుంచి పుష్పగుచ్ఛాలు, విలువైన బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి పత్రికపై బహుమతులు వద్దని వినతిని జోడించినా కపూర్ మాన్షన్‌కు గిఫ్ట్‌లు తరలివస్తున్నాయి. సోనంకు సన్నిహితంగా మెరిగే చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు కాంచీపురం చీర, అమ్రపాలి జుంకాలు, చెవిరింగులను బహుమతిగా ఇవ్వనున్నారు. మే 8న వివాహ వేడుకతో పాటు అదే రోజు సాయంత్రం సోనం, ఆనంద్ అహుజాల వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక సోనంకు సన్నిహితంగా మెలిగే సహనటీనటులు సంగీత్‌లో సందడి చేసేందుకు డ్యాన్స్ రిహార్సల్స్‌తో హోరెత్తిస్తున్నారు. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న సోనం, ఆనంద్‌లు ఎన్నడూ తమ అనుబంధంపై ఎక్కడా నోరుమెదపలేదు. పార్టీలు, ఈవెంట్లకు సైతం ఇద్దరూ కలిసే హాజరైనా వదంతులపై మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఇక మే 8న వీరి వివాహం జరుగుతుందని ఇరు కుటుంబాలు అధికారికంగా నిర్ధారించడంతో వివాహ వేడులకపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు సోనం నటించిన వీరే ది వెడ్డింగ్ జూన్ 1న విడుదలకు ముస్తాబవుతోంది. -
పెళ్లికళ వచ్చేసింది
మే 8... మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12:30. ఈ డేట్ అండ్ టైమ్ స్పెషాల్టీ ఏంటీ అనుకుంటున్నారా? బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌కు శ్రీమతిగా కొత్త జీవితం ఆరంభమయ్యే ముహూర్తపు టైమ్ అది. అవును.. ఇక నో మోర్ డౌట్స్. సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజాల వివాహం మే 8న ముంబైలో జరగనుంది. అన్నట్లు ఇంకో మాట.. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగూ లంచ్ ఉంది. అలాగే అదే రోజు రాత్రి పార్టీ కూడా ఎరేంజ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఆల్రెడీ సోనమ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయ్యింది. పెళ్లి జరగడానికి ఇంకా నాలుగు రోజులు ఉన్నా.. అప్పుడే సోనమ్ కపూర్ ఫేస్‌లో పెళ్లి కళ వచ్చేసిందని ఆమె సన్నిహితులు సరదాగా ఆటపట్టిస్తున్నారట. ఆల్రెడీ సోనమ్ కపూర్ ఇల్లు పెళ్లి ఏర్పాట్లతో హడావిడిగా మారింది. అలంకరణ కూడా పూర్తి అయ్యింది. పెళ్లి వేడుకలకు ధరించబోయే డిజైనర్ డ్రెస్సులను తన అభిరుచికి తగ్గట్టుగా చేయించుకున్నారట సోనమ్. ‘ఫ్యాషన్ ఐకాన్’ అని పేరు తెచ్చుకున్న సోనమ్ పెళ్లి వేడుకల్లో ధరించబోయే దుస్తులు ఎలా ఉంటాయో చూడాలని చాలామంది వెయిటింగ్. ఇక సోనమ్ కపూర్ కాబోయే భర్త ఆనంద్ ఆహుజా గురించి చెప్పాలంటే ఆయన వ్యాపారవేత్త. సోనమ్ పెళ్లికి దీపిక రాదా? యస్.. సోనమ్ పెళ్లికి దీపికా పదుకొన్ హాజరు కావడం లేదా? అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అందుకు తగ్గట్లు ఒక విశ్లేషణను చెబుతున్నాయి. టైమ్ మ్యాగజీన్ వంద మంది మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్స్‌లో ఒకరుగా దీపికా పదుకొన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న టైమ్ మ్యాగజీన్ జరపనున్న ఓ ఈవెంట్లో పాల్గొనున్నారు దీపిక. ఆ నెక్ట్స్ మే 8 నుంచి 19 వరకు జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాల్సి ఉందట. సో.. సోనమ్ పెళ్లికి దీపికా రావడం లేదట. -
అందుకే హీరోలతో డేటింగ్‌కు దూరం : సోనం
సాక్షి, ముంబయి : పదేళ్లకు పైగా బాలీవుడ్లో పలువురు హీరోలతో ఆడిపాడినా ఎవరితో డేటింగ్ చేయని అనిల్‌కపూర్ గారాలపట్టి సోనం కపూర్ దీనిపై నోరువిప్పారు. తెరపై కెమిస్ర్టీని పండించినా తెరవెనుక హీరోలతో తనకు సాన్నిహిత్యం లేదని ఏ హీరోతోనూ తనను ముడిపెట్టి వదంతులు రాకపోవడాన్ని ప్రస్తావించారు. తాను సినిమాల్లో కలిసి నటించిన హీరోలు అప్పట్లో రిలేషన్షిప్లో ఉన్నారని, దాంతో వారితో చనువుగా మెలిగే స్పేస్ తనకు లభించలేదని చెప్పారు. గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్న ఢిల్లీ బిజినెస్మెన్ ఆనంద్ అహుజాతో సోనం వివాహ వేడుక మే 8న జరగనున్న విషయం తెలిసిందే. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు అధికారికంగా నిర్ధారించాయి. వివాహం అనంతరం సోనం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై నడిచేందుకు వెళతారు. అనంతరం భారత్‌కు తిరిగివచ్చి తాను నటించిన వీరే ది వెడ్డింగ్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు. -
ఎవరీ ఆనంద్ అహుజా?
బాలీవుడ్ స్టార్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాల వివాహం ఖాయమైనట్లు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించేశాయి. దీంతో ఇన్నాళ్లు వచ్చిన రూమర్లకు తెరపడింది. మే 8న ముంబైలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగనున్నాయి. మరీ సోనం పెళ్లిచేసుకోబోతున్న.. ఆనంద్ అహుజా ఎవరు అంటే ఆయన ఒక యువ వ్యాపారవేత్త.. భానే బ్రాండెడ్ దుస్తుల కంపెనీకి యజమాని. వ్యాపార రంగంలో దిట్ట అయిన హరిష్ అహుజాకు ఆనంద్ మనుమడు. వీరి పెళ్లికి సంబంధించి ముంబైలో ఒక వేడుకను కపూర్ ఫ్యామిలీ నిర్వహించగా... ఢిల్లీలో అహుజా ఫ్యామిలీ మరో వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కపూర్ సపరివారమంతా కలిసి వస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను షెడ్యుల్ కూడా చేశారని సమాచారం. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. సంగీత్‌లో జాన్వీ కపూర్, కరణ్ జోహర్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్లు పాల్గొంటారు. ఆట పాటలతో సంగీత్ కార్యక్రమాన్ని అలరించబోతున్నారు. బాలీవుడ్ తారాగణం అంతా ఈ పెళ్లికి తరలిరాబోతున్నారు. పెళ్లి శుభలేఖలను ముద్రించకుండా... పేపర్ వేస్టేజ్‌ను తగ్గించే పనిలో భాగంగా... ఈ-వెడ్డింగ్ కార్డును ఉపయోగిస్తున్నారని బీ టౌన్ అంటోంది. సోనమ్ తాజా సినిమా ‘వీరే దీ వెడ్డింగ్’.. ఈ సినమా ప్రమోషన్లో భాగంగా త్వరలోనే జరగబోయే కేన్స్ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై సోనమ్ నడవనున్నారు. -
సోనమ్-ఆనంద్‌ల పెళ్లి ఫిక్స్
బాలీవుడ్ స్టార్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాల వివాహం ఖాయమైనట్లు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించేశాయి. దీంతో ఇన్నాళ్లు వచ్చిన రూమర్లకు తెరపడింది. మే 8న ముంబైలో అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు కపూర్ సపరివారమంతా హాజరుకానుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను షెడ్యుల్ కూడా చేశారని సమాచారం. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. సంగీత్‌లో జాన్వీ కపూర్, కరణ్ జోహర్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్లు పాల్గొంటారు. ఆట పాటలతో సంగీత్ కార్యక్రమాన్ని అలరించబోతున్నారు. బాలీవుడ్ తారాగణం అంతా ఈ పెళ్లికి తరలిరాబోతున్నారు. పెళ్లి శుభలేఖలను ముద్రించకుండా... పేపర్ వేస్టేజ్‌ను తగ్గించే పనిలో భాగంగా... ఈ-వెడ్డింగ్ కార్డును ఉపయోగిస్తున్నారని బీ టౌన్ అంటోంది. ప్రస్తుతం సోనమ్ ‘వీరే దీ వెడ్డింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే జరగబోయే కేన్స్ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై సోనమ్ నడవనున్నారు. -
సోనం పెళ్లి అప్పుడే..
సాక్షి, న్యూఢిల్లీ : సోనం కపూర్, ఆనంద్ అహుజా పెళ్లిపై వదంతులకు బ్రేక్ పడింది. వీరి వివాహం మే 8న జరుగుతుందని నిర్ధారిస్తూ కపూర్, అహుజా కుటుంబాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సోనం, ఆనంద్‌ల వివాహం ఈనెల 8న ముంబయిలో జరుగుతుందని, ఈ కార్యక్రమం సన్నిహితుల సమక్షంలో జరగాలని భావిస్తుండటంతో కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరతున్నామని ఇరు కుటుంబాలు ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా, సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ను కపూర్ కుటుంబం సంప్రదించినట్టు సమాచారం. సంగీత్‌లో సోనం కజిన్ జాన్వి తన తల్లి శ్రీదేవి పాటలకు నృత్యం చేయనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జాన్వీతో పాటు కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్లు సోనం, ఆనంద్‌ల సంగీత్‌లో సందడి చేయనున్నారు. తమ పెళ్లికి ఆహ్వాన పత్రికలను ముద్రించకుండా పర్యావరణ అనుకూల ఈ-ఇన్వైట్స్ను పంపాలని సోనం, ఆనంద్‌లు నిర్ణయించుకున్నారు. సోనం, ఆనంద్‌ల వివాహం కేవలం బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. -
కూతురి పెళ్లిపై స్పందించిన హీరో..!
సాక్షి, ముంబయి : అనిల్ కపూర్ గారాలపట్టి సోనం కపూర్, ఢిల్లీ కుబేరుడు ఆనంద్ అహుజాల వివాహం మే 8న ముంబయిలో అట్టహాసంగా జరుగుతుందన్న వదంతులపై అనిల్ కపూర్ స్పందించారు. సోనం వివాహానికి సంబంధించి త్వరలోనే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సంగీత్, మెహందీ ఎప్పుడు జరుగుతుంది..పెళ్లి వేడుకలు ఎలా ప్లాన్ చేశారనే దానిపైనా సస్పెన్స్ కొనసాగుతున్నాయి. ఈ విషయమై సోనం, ఆనంద్ అహుజాలు నోరుమెదపడం లేదు. అనిల్ కపూర్ ఇల్లును ముస్తాబు చేస్తుండటంతో వివాహ తంతుపై మరింతగా వార్తలు గుప్పుమన్నాయి. కాగా, తమ కెరీర్ ప్రారంభం నుంచి మీడియా తమకు అండగా నిలుస్తోందని..సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. తన పెళ్లి వేడుకలపై ఇటీవల సోనం మీడియాతో మాట్లాడుతూ వివాహ వేడుకలకు రూ లక్షలు దుబారా చేయడం తనకిష్టం లేదని ఇంట్లోనే వైభవంగా పెళ్లి చేసుకోవాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. -
పెళ్లింట... బ్యాండ్ బాజా
పెళ్లింట ధూమ్ ధామ్‌గా దుమ్ము రేపే డ్యాన్స్‌తో హంగామా చేయడానికి సోనమ్ కపూర్ అండ్ గ్యాంగ్ రెడీ అయ్యారు. అదేంటీ ఆనంద్ అహూజాతో సోనమ్ పెళ్లి మేలో కదా? ఇప్పుడే గానా భజానాకి ఎందుకు రెడీ అయ్యారు అనుకుంటున్నారా? నిజమే. పెళ్లికి టైమ్ ఉంది. కానీ ఆమె నటిస్తున్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతోంది. ట్రైలర్ రిలీజ్‌కు జస్ట్ ఐదారు రోజులే ఉంది. ఆ ట్రైలర్ కోసమే ఈ హంగామా. పైగా రియల్ వెడ్డింగ్కన్నా ముందే షూటింగ్ పూర్తి చేసేయాలని సోనమ్ హడావిడి పడుతున్నారట. ప్రస్తుతం తీస్తున్న పాట తాలూకు చిన్న బిట్‌ను ట్రైలర్లో చూపించాలనుకుంటున్నారట. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో సోనమ్ కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, తన్సానీయా ముఖ్య పాత్రలుగా రూపొందిన సినిమా ‘వీరే ది వెడ్డింగ్’. నలుగురు అమ్మాయిల మ్యారేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగనుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కరీనా కపూర్ నటిస్తున్న తొలి చిత్రమిదే. ప్రస్తుతం ఆ సినిమాలో ‘తరీఫన్...’ అనే స్పెషల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. తరీఫన్ అంటే పంజాబీలో కాంప్లిమెంట్స్ అని అర్థం అట. ఈ సాంగ్‌కు ఫరాఖాన్ కుందర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేయడానికే సోనమ్ అండ్ గ్యాంగ్ రెడీ అయింది. ‘‘ఫైనల్‌గా సోనమ్ కపూర్‌తో లవ్లీ సాంగ్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు ఫరాఖాన్. ‘‘ఫరా.. మీతో కలిసి వర్క్ చేయడం నా లక్. ఈ సాంగ్ చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు సోనమ్. మరి... ఈ పెళ్లింట బ్యాండ్ బాజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ముహూర్తం కుదిరిందా ?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌కి పెళ్లి ఘడియలు సమీపించాయన్న వార్తలు బీటౌన్‌లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ముహూర్తం డేట్స్, ప్లేస్ కూడా ఫిక్స్ అయ్యాయని బాలీవుడ్ ఖబర్. తన బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజాతో స్విట్జర్లాండ్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట సోనమ్‌కపూర్. మే 11, 12 తేదీల్లో ఆనంద్–సోనమ్‌ల వివాహం జరగనుందనీ, అందుకు ఏర్పాట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారని సమాచారం. బీటౌన్ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీ కాస్త పెద్దదే. బోనీకపూర్, సంజయ్ కపూర్, అనిల్ కపూర్ వంటి బిగ్ సినీ సెలబ్రిటీలతో పాటు అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ వంటి కుర్రకారు ఉన్నారు. సో.. కపూర్ ఫ్యామిలీ అంతా మ్యారేజ్ టైమ్‌కి మూవీ షూటింగ్స్‌కు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ఆనంద్ అహుజా ఫ్యామిలీ మెంబర్స్, కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఢిల్లీ నుంచి, మరికొందరు ముంబై నుంచి స్టారై్ట స్విట్జర్లాండ్ చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. -
శ్రీదేవి కుటుంబంలో శుభకార్యం!
ముంబై: దివంగత మహానటి శ్రీదేవి కుటుంబంలో శుభకార్యం జరుగబోతున్నట్లు సమాచారం. పెద్దకోడలి మరణంతో షాక్ గురైన కపూర్ ఫ్యామిలీ.. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నవేళ ఇది శుభవార్తేనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కూతురు, ప్రముఖ నటి సోనమ్ కపూర్ పెళ్లిపీటలెక్కబోతుండటం ఆ వార్త. 32 ఏళ్ల సోనమ్.. పారిశ్రామికవేత్త ఆనంద్ ఆహుజాలు చాలా కాలంగా లివిన్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి తేదీ, వేదికలు ఖరారైనట్లు ముంబై మిర్రర్ ప్రచురించిన కథనం వైరల్ అయింది. మే 11 లేదా 12న జెనీవా వేదికగా ఈ జంట ఒక్కటి కాబోతున్నట్లు, ఈ మేరకు ఇరు కుటుంబాలూ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అతిథులను విదేశానికి తరలించేందుకుగానూ ఇప్పటికే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలిసింది. 2008లో సావరియా సినిమాతో నటిగా పరిచయమైన సోనమ్.. 2016లో వచ్చిన నీర్జా సినిమాకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్యాడ్‌మ్యాన్‌తో మెప్పించిన ఆమె.. ఈ ఏడాది వీరే ది వెడ్డింగ్, సంజూ ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాయ్‌ఫ్రెండ్ ఆనంద్‌తో సోనమ్ -
పెళ్లెప్పుడని వాళ్లని అడగరేం?
సాధారణంగా పెళ్లి కాని కథానాయికలను ‘మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. ఈ ప్రశ్నకు కొందరు ఓ చిన్ని చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంటారు. మరికొందరు ‘అప్పుడేనా.. అందుకు ఇంకా చాలా టైమ్ ఉంది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే’ అంటుంటారు. ఇంకొందరు ‘పెళ్లికేంటి తొందర. ఆ టైమ్ వచ్చినప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాం’ అని సమాధానం ఇస్తుంటారు. సోనమ్ కపూర్ అయితే వీటికి భిన్నంగా స్పందిస్తారు. ‘మీ పెళ్లెప్పుడు’ అని ఇటీవల సోనమ్ కపూర్‌ని మీడియావారు అడిగారు. ఈ ప్రశ్నకు ఈ బ్యూటీ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘పెళ్లెప్పుడు అంటూ ఎప్పుడూ హీరోయిన్లనే అడుగుతారెందుకు? ఇదే ప్రశ్నని హీరోలను అడుగుతారా? రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ వంటి వాళ్లను ఎప్పుడైనా ప్రశ్నించారా? మాకూ పర్సనల్ లైఫ్ ఉండదా? పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాం కదా? పెళ్లి అయినా నర్గీస్, వహీదా రెహమాన్, షర్మిలా ఠాగూర్, డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, కాజోల్, కరీనా కపూర్ వంటి ఎంతో మంది సెకండ్ ఇన్నింగ్స్‌లో తాము ఎవరికీ తక్కువ కాదంటూ నిరూపించుకోలేదా?’’ అంటూ మండిపడ్డారట సోనమ్. ఇదిలా ఉంటే.. వ్యాపారవేత్త ఆనంద్ అహుజా, సోనమ్ కపూర్ ప్రేమలో ఉన్నారనీ, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారనీ బాలీవుడ్ మీడియా కూడై కూస్తోన్న విషయం తెలిసిందే. -
‘దమ్ముంటే.. ఆ హీరోలను ఇదే ప్రశ్న అడగండి’
ముంబయి: స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హిట్లు లేకున్నా నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ ఐకాన్ గా పేరున్న ఈ బ్యూటీ వివాహం ఎప్పుడంటూ ఆమెకు ఎదురైన ప్రశ్నకు ఘాటుగా బదులిచ్చింది. కేవలం హీరోయిన్లనే ఎందుకు టార్గెట్ చేస్తారు. మాకంటూ వ్యక్తిగత జీవితం ఉండదా అంటూ ప్రశ్నించింది. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైతే ముందుగా అందరికీ వెల్లడించి ఆ తర్వాతే వివాహం అని గతంలో చెప్పిన విషయాన్ని మళ్లీ గుర్తుచేసింది సోనమ్. వివాహం ఎప్పుడూ అంటూ హీరోయిన్లను అడుగుతున్నందుకు నాకేం ఇబ్బంది లేదు. కానీ కేవలం హీరోయిన్లను మాత్రమే ఈ ప్రశ్న అడగటమే తనకు నచ్చదని చెప్పింది. దమ్ముంటే.. హీరోలు రణ్‌బీర్ కపూర్, రణవీర్ సింగ్‌లను ఈ ప్రశ్న ఎప్పుడైనా అడిగారా.. లేకపోతే ఎందుకు అడగలేక పోతున్నారో చెప్పాలని ఘాటుగా స్పందించింది ఈ బ్యూటీ. ‘వివాహంతో ఏదీ మారదు. క్యాలెండర్లో అంకెలు తప్ప. నర్గీస్, వహీదా రెహమాన్, షర్మిలా ఠాగూర్, డింపుల్ కపాడియా, మాధురీ దీక్షిత్, కాజోల్, కరీనా కపూర్.. ఇలా ఎంతో మంది నటీమణులు పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభి తాము ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకున్నారంటూ’ నటి సోనమ్ చెప్పుకొచ్చింది. లేటెస్ట్ సినిమాలు 'పాడ్‌మాన్', ‘వీర్ డి వెడ్డింగ్’ పనుల్లో ఆమె బిజీబిజీగా ఉంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజా, సోనమ్ కపూర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. డేటింగ్ చేస్తున్న ఈ జంట పలు పార్టీలు, ఈవెంట్లకు కలిసి వెళ్తోంది. అయితే తమ ప్రేమ వ్యవహారంపై నోరు మాత్రం మెదపడం లేదన్న సంగతి తెలిసిందే. -
పర్సనల్.. పర్సనల్...
బాలీవుడ్ అభిమానులకు సినిమాలు ఎంత ఎంటర్టైన్మెంటో.. ఆ సినిమాల్లోని స్టార్స్ పర్సనల్ విషయాలూ అంతే ఎంటర్టైన్మెంట్! పర్సనల్ అంటే ముఖ్యంగా వాళ్ల ఫేవరెట్ స్టార్స్ ఎవరితో డేట్ చేస్తున్నారు? ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు? ఎవరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎవరెవరు గొడవ పడుతున్నారు? ఇలాంటివి. దీపికా, కత్రినా, సల్మాన్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ.. ఇలా ఈ స్టార్స్ లవ్స్టోరీలన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఓ లవ్‌స్టోరీ బాలీవుడ్ సర్కిల్లో బాగా చక్కర్లు కొడుతోంది. అదే మన సోనమ్ కపూర్–ఆనంద్ అహుజాలది. సోనమ్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు సరే, ఈ ఆనంద్ అహుజా ఎవరు? ఆనంద్.. సోనమ్ కపూర్ బాయ్‌ఫ్రెండ్. తనకంటూ ఒక స్టైల్ సెట్ చేసుకుంటోన్న బిజినెస్‌మేన్ ఆనంద్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జంట కబుర్లే! మొన్న కొత్త సంవత్సర వేడుకల కోసం కూడా ఈ జంట లండన్ వెళ్లింది. సెలెబ్రేషన్ అంతా అక్కడే! ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, తీసుకున్న వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్. ఇంకేముంది? అందరూ ‘‘ఆనంద్‌తో లవ్వా?’’ అని అడిగేస్తున్నారు సోనమ్‌ను. ‘‘అవన్నీ పర్సనల్.. పర్సనల్.. చెప్పను. అలాగని దాచడానికీ ఏం లేదు..’’ అనేసింది సోనమ్. సోనమ్ తండ్రి అనిల్ కపూర్ కూడా.. ‘‘అది వాళ్ల పర్సనల్..’’ అనేశాడు. వీళ్లు చెప్పకున్నా అభిమానులు మాట్లాడుకోకుండా ఉండరుగా!! -
స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్..?
స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ సోనమ్ కపూర్. కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేకపోయినా.. గ్లామర్ షోతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ.. నీర్జా సినిమాతో నటిగానూ అందరి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఫ్యాషన్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కనుందట. ఢిల్లీకి చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్ ఆనంద్ అహుజా, సోనమ్ కపూర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి హాలీడే ట్రిప్‌లకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా ఓకె చెప్పేశారట. దీంతో త్వరలోనే వీరిద్దరూ ఓ ఇంటివారు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే హిట్ ట్రాక్ ఎక్కిన ఈ భామ.. అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. -
ప్రియుడితో కలిసి కేక్ కట్ చేసిన నటి
బాలీవుడ్ భామ సోనం కపూర్ శుక్రవారం 32వ వసంతంలో అడుగుపెట్టింది. ‘నీర్జా’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న ఈ అమ్మడి పుట్టినరోజు వేడుకను కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నిర్వహించారు. సోనం పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే ఆమె ప్రియుడు ఆనంద్ ఆహుజా అనే చెప్పాలి. సోనం పుట్టినరోజు సంబరాలు ఎలా జరుగుతున్నాయో పోస్టులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు ఆహూజా. బ్యాక్‌గ్రౌండ్‌లో సోనం అని విద్యుత్ దీపాలతో రాసి ఉండగా.. సోనం మినీగోల్ఫ్ ఆడుతున్న ఫన్నీ వీడియోను అతను షేర్ చేశాడు. ఇక ఆ తర్వాత సోనం బర్త్‌డే కేక్‌ను కట్ చేస్తున్న స్పెషల్ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో సోనం సోదరి రెయా కపూర్‌తోపాటు సోనం బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ కూడా పక్కనే ఉన్నాడు. వైట్‌డ్రెస్‌లో చాలా సంతోషంగా కనిపించిన సోనం ప్రియుడు ఆనంద్, కుటుంబసభ్యులతో చాలా సంబరంగా పుట్టినరోజు జరుపుకున్నదని సన్నిహితులు చెప్తున్నారు. -
బాయ్‌ఫ్రెండ్ తో హీరోయిన్ మళ్లీ షికార్లు!
ముంబై: ప్రేమ వ్యవహారాలు బాలీవుడ్ నటీనటులకు కొత్తే కాదు. అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీగా ఎంట్రీ ఇచ్చినా అనతికాలంలోనే తానేంటో నటిగా నిరూపించుకుంది సోనమ్ కపూర్. ఫ్యాషన్ ఐకాన్ గానూ ఆమెకు పేరుంది. నీర్జా బానోతు జీవిత కథాశంతో తీసిన మూవీలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే సోనమ్ వార్తల్లో నిలుస్తోంది. బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహూజాతో ఆమె ప్రమాయణంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా నో కామెంట్ అని బదులిస్తుంది. తాజాగా రెండు రోజుల కిందట ఈ ప్రేమ జంట ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అహుజాతో కలిసి లాస్ ఎంజెలిస్ కు వెళ్లిన సోనమ్ అక్కడ కొన్ని రోజులు షికారు చేసి ముంబైకి తిరిగొచ్చిందని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఈ నెల 13న జరగనున్న ఫెస్టివల్ పార్టీకి, కొన్ని ఫ్యాషన్ షోలకు అహుజాతో కలిసి సోనమ్ హాజరుకానున్నట్లు ముంబై స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. రెండు నెలల కిందట తన సోదరడు హర్షవర్ధన్ కు ప్రమోట్ చేసే కార్యక్రమం కోసం లండన్ వెళ్లినపుడు ఆమె వెంట ఆనంద్ అహుజా ఉన్నారు. అతడితో కలిసి షాపింగ్ చేయడం ఆమెకు అలవాటుగా మారింది. ఎవరైనా ఆనంద్ తో రిలేషన్ గురించి అడిగితే గుడ్ ఫ్రెండ్ అని చెప్పడం అంతకుమంచి ఏమైనా ఉందా అని సూటిగా అడిగితే మాత్రం ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఈ ఫ్యాషన్ బ్యూటీ. -
డేటింగ్‌పై నో కామెంట్.. ఫొటోలతో క్లారిటీ!
వెయ్యిమాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పొచ్చు అంటారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న నటి సోనం కపూర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ ఆహూజా ఫొటోలు ఇదే చెప్తున్నాయని బాలీవుడ్ జనాలు అంటున్నారు. సోనం కపూర్ స్నేహితురాలి నిశ్చితార్థం ఇటీవల లండన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సోనం, ఆనంద్ జంటగా వెళ్లిన ఫొటోలు బయటపడి.. సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వారిద్దరూ ఫొటోల్లో కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రేమపక్షులుగా చెప్పబడుతున్న ఈ ఇద్దరి ఫొటోలు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. అయితే, బుధవారం ముంబైలో జరిగిన బ్రాండ్ విజన్ సమ్మిట్ 2016లో పాల్గొన్న సోనంను ఆనంద్‌తో బంధం గురించి ప్రశ్నించగా.. నో కామెంట్ అంటూ పేర్కొంది. ‘నా వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడాను. పదేళ్లుగా నేను ఇండస్ట్రిలో ఉన్నాను. నేను ఎప్పడు నా జీవితం గురించి చెప్పలేదు. నేనెప్పుడు అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రానున్న ‘కాఫీ విత్ కరణ్’షోలోనైనా ఆనంద్‌తో డేటింగ్‌పై సోనం నుంచి ఏమైనా వివరాలు రాబడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.