
బాలీవుడ్ అభిమానులకు సినిమాలు ఎంత ఎంటర్‌టైన్‌మెంటో.. ఆ సినిమాల్లోని స్టార్స్ పర్సనల్ విషయాలూ అంతే ఎంటర్‌టైన్‌మెంట్! పర్సనల్ అంటే ముఖ్యంగా వాళ్ల ఫేవరెట్ స్టార్స్ ఎవరితో డేట్ చేస్తున్నారు? ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు? ఎవరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎవరెవరు గొడవ పడుతున్నారు? ఇలాంటివి. దీపికా, కత్రినా, సల్మాన్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ.. ఇలా ఈ స్టార్స్ లవ్‌స్టోరీలన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఓ లవ్‌స్టోరీ బాలీవుడ్ సర్కిల్లో బాగా చక్కర్లు కొడుతోంది. అదే మన సోనమ్ కపూర్–ఆనంద్ అహుజాలది.
సోనమ్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు సరే, ఈ ఆనంద్ అహుజా ఎవరు? ఆనంద్.. సోనమ్ కపూర్ బాయ్‌ఫ్రెండ్. తనకంటూ ఒక స్టైల్ సెట్ చేసుకుంటోన్న బిజినెస్‌మేన్ ఆనంద్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జంట కబుర్లే! మొన్న కొత్త సంవత్సర వేడుకల కోసం కూడా ఈ జంట లండన్ వెళ్లింది. సెలెబ్రేషన్ అంతా అక్కడే! ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, తీసుకున్న వీడియోలు.. సోషల్ మీడియాలో హల్‌చల్. ఇంకేముంది? అందరూ ‘‘ఆనంద్‌తో లవ్వా?’’ అని అడిగేస్తున్నారు సోనమ్‌ను. ‘‘అవన్నీ పర్సనల్.. పర్సనల్.. చెప్పను. అలాగని దాచడానికీ ఏం లేదు..’’ అనేసింది సోనమ్. సోనమ్ తండ్రి అనిల్ కపూర్ కూడా.. ‘‘అది వాళ్ల పర్సనల్..’’ అనేశాడు. వీళ్లు చెప్పకున్నా అభిమానులు మాట్లాడుకోకుండా ఉండరుగా!!
Comments
Please login to add a commentAdd a comment