ఇండస్ట్రీని తప్పు పట్టొద్దు! | Not just Sonam Kapoor, many Bollywood stars won't marry from film industry | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీని తప్పు పట్టొద్దు!

Jul 22 2018 3:52 AM | Updated on Mar 28 2019 6:18 PM

Not just Sonam Kapoor, many Bollywood stars won't marry from film industry - Sakshi

సోనమ్‌ కపూర్‌

పెళ్లి చేసుకున్నంత మాత్రాన అవకాశాలు తగ్గిపోవని రీసెంట్‌గా నటి ఆలియా భట్‌ బీ టౌన్‌ మీడియా ముందు స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు సోనమ్‌ కపూర్‌ కూడా ఇదే విషయంపై స్పందించారు. ‘పెళ్లి చేసుకున్నారు కదా. హీరోయిన్‌గా చాన్స్‌లు తగ్గిపోతాయని భయపడుతున్నారా?’ అన్న ప్రశ్నను మీడియా వారు సోనమ్‌ను అడిగినప్పుడు– ‘‘వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నటి డింపుల్‌ కపాడియా ‘సాగర్‌’ అనే సినిమాలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు.

పెళ్లి తర్వాత చాన్స్‌లు తగ్గిపోతాయని నేను భయపడటం లేదు. ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్నాయని ఇండస్ట్రీ నన్ను నమ్మినంత కాలం నాకు  చాన్సులు వస్తూనే ఉంటాయి. ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత కథానాయికలకు చాన్స్‌లు రావు అనుకుంటే.. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా, కాజోల్, లేటెస్ట్‌గా కరీనా కపూర్‌లకు ఇండస్ట్రీలో పని దొరికేది కాదు. ఈ విషయంలో ఇండస్ట్రీని తప్పుపట్టవద్దు. ఇండస్ట్రీలోనే కాదు సమాజంలోనూ మహిళలకు ఫ్రీడమ్‌ ఆఫ్‌ చాయిస్‌ ఉంటే బాగుంటుంది’’ అన్నారు. ఈ ఏడాది మేలో వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహూజాతో సోనమ్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement