బాలీవుడ్ భామ బర్త్‌ డే.. స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త! | Sonam Kapoor Birthday Gift By Her Husband Anand Ahuja Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sonam Kapoor: సోనమ్ కపూర్‌ బర్త్‌ డే.. స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త!

Published Sun, Jun 9 2024 7:05 PM | Last Updated on Sun, Jun 9 2024 7:24 PM

Sonam Kapoor birthday gift by her by husband Anand Ahuja post Goes Viral

అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ సోనమ్ కపూర్‌. ఇవాళ తాజాగా 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో సావరియా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ చివరిసారిగా బ్లైండ్‌ సినిమాలో కనిపించింది.   సోనమ్ కపూర్ బర్త్‌ డే సందర్భంగా ఆమె భర్త ఆనంద్ అహుజా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్యకు రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి' బుక్‌ను పుట్టినరోజు కానుకుగా అందించారు. ఈ విషయాన్ని సోనమ్ కపూర్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

సోనమ్ కపూర్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది నాకు అద్భుతమైన పుట్టినరోజు కానుక. నాకేం కావాలో నా భర్తకు మాత్రమే తెలుసు. ఠాగూర్ రాసిన గీతాంజలి మొదటి ఎడిషన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ అర్హత సాధించడానికి నీ కోసం ఏం చేశానో నాకు తెలియదు." అంటూ పోస్ట్ చేసింది. సోనమ్ బర్త్‌ డే సందర్భంగా ఆమె తండ్రి అనిల్ కపూర్‌ విషెస్ తెలిపారు. ఆమె తల్లి సునీతా కపూర్‌ సైతం సోషల్ మీడీయా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement