రేణుకాస్వామి హత్య కేసు.. సీన్‌లోకి కమెడియన్‌ చిక్కణ్ణ | - | Sakshi
Sakshi News home page

రేణుకాస్వామి హత్య కేసు.. సీన్‌లోకి కమెడియన్‌ చిక్కణ్ణ

Jun 18 2024 12:22 AM | Updated on Jun 18 2024 9:01 AM

-

 దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్రగౌడతో పాటు రోజుకొక కొత్త ముఖం పేరు వినిస్తోంది. తాజాగా కమెడియన్‌ చిక్కణ్ణను వెంటాడుతోంది. రేణుకాస్వామి హత్య జరిగిన రోజు అంటే ఈ నెల 8వ తేదీన నగరంలోని స్టోని బ్రూక్‌ రెస్టారెంట్‌లో దర్శన్‌తో పాటు చిక్కణ్ణ కూడా ఉన్నట్టు సమాచారం. వారితో పాటు దర్శన్‌ అనుచరులు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి పార్టీలో పాల్గొన్న దర్శన్‌ సాయంత్రం వేళకు అర్జెంట్‌ పని ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పారీ్టలో చిక్కణ్ణ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కామాక్షిపాళ్య పోలీసులు దర్శన్‌ అనుచరునిగా పేరున్న ధనరాజ్‌ ఆలియాస్‌ రాజ అనే మరో నిందితున్ని అరెస్టు చేశారు. రేణుకాస్వామిపై దాడి చేసిన సమయంలో దర్శన్‌తో పాటు అతడు కూడా ఉన్నట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ధనరాజ్‌.. పవిత్రగౌడ ఇంట్లో పనిచేసేవాడు.   

మజా చేసిన పబ్‌లో విచారణ 
బెంగళూరు ఆర్‌ఆర్‌ నగరలోని స్టోని బ్రూక్‌ పబ్‌లో సోమవారం నాడు పోలీసులు మహజర్‌ చేపట్టారు. దర్శన్, రెస్టారెండ్‌ యజమాని వినయ్, ప్రదోశ్, పవన్‌ ఇతర నిందితులతో పాటు కమెడియన్‌ చిక్కణ్ణను కూడా పోలీసులు తీసుకువచ్చారు. హత్య జరిగిన 8వ తేదీన పబ్‌లో జరిగిన పారీ్టలో చిక్కణ్ణ కూడా ఉన్నాడని తెలిసి ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చి మహజర్‌కు తీసుకువచ్చారు. ఈ సమయంలో పరిసరాల్లో బందోబస్తు పెంచారు.    

నన్ను వదిలేయండి ప్లీజ్‌ 
సినిమాలు, నిజ జీవితంలో దర్జా  అనుభవించే దర్శన్‌కు పోలీస్‌ ఠాణా, విచారణ చాలా కష్టంగా ఉన్నాయి. కాళ్లు పట్టుకుంటాను... నన్ను వదిలేయండి అని పోలీసులను దర్శన్‌ వేడుకుంటున్నట్టు సమాచారం. ఈ హత్య తాను చేయమని చెప్పలేదని, ఏ తప్పూ చేయలేదని ప్లీజ్‌ వదిలేయండి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడని తెలిసింది. గత వారం రోజులుగా దర్శన్‌ ఏ ప్రశ్నలు వేసినా ఇదే సమాధానం ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు.   

రాజకాలువలో మొబైల్‌ కోసం 
రేణుకాస్వామి మొబైల్‌ఫోన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేణుకాస్వామిని హత్య చేశాక అతని మొబైల్‌ను సుమనహళ్లి అనుగ్రహ లేఔట్‌లో బ్రిడ్జ్‌ వద్ద ఉన్న రాజకాలువలో శవాన్ని, మొబైల్‌ని పారేసినట్టు నిందితుడు వినయ్‌ చెప్పడంతో, సోమవారంనాడు ఫోన్‌ కోసం రాజకాలువలో వెతికారు.   బీబీఎంపీ పౌర కారి్మకులతోనూ గాలించినా ఫోన్‌ ఇంకా దొరకలేదు.

తప్పు చేస్తే శిక్ష పడాలి: ఉపేంద్ర  
రేణుకాస్వామి హత్యపై కన్నడ హీరోలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు.  సోమవారంనాడు ప్రముఖ హీరో ఉపేంద్ర ఎక్స్‌లో స్పందిస్తూ, ఈ హత్య కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనంగా మారింది. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలి. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రమ్య, చేతన్, సుదీప్‌ తదితరులు ఇదివరకే స్పందిస్తూ రేణుకాస్వామి భార్యకి పుట్టబోయే బిడ్డకు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓ టీవీ నటి దర్శన్‌ చేసిన దానధర్మాలే ఆయనను కాపాడతాయని పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement