sonam kapur
-
నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్ కపూర్ సైతం..
అప్పుడే పుట్టిన పిల్లలకు కొందరు తేనె పెడుతుంటారు. మాటలు తెనె పలుకుల్లా ఉంటాయని మన పెద్దవాళ్ల ఆలోచన. చెప్పాలంటే తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా మన పెద్దలు అప్పుడే పుట్టిన పిల్లలకు తేనె పెడుతుంటారు. ఇలా పెట్టడంతో పిల్లలు చనిపోయిను ఉదంతాలు కూడా ఉన్నాయి. ఐతే అసలు తేనె పిల్లలకు పెట్టొచ్చా? ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధా గుణాలు కలిగిన తేనె చిన్నారుల పాలిట విషమా? తదితరాల గురించే ఈ కథనం. ఏదీఏమైనా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు తేనె అస్సలు పెట్టొదనే అంటున్నారు ఆరోగ్య నిపుణలు. బాలీవుడ్ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ సైతం ఇదే చెబుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలా చేసినప్పటికీ నిర్మొహమాటంగా మీ ముక్కు పచ్చలారని చిన్నారులకు తేనెను ఇవ్వనని గట్టిగా చెప్పండి అని అంటోంది సోనమ్. అది వారి ప్రాణాలను హరించే విషం అంటూ హితవు పలుకుతుంది. తాను కూడా తన కొడుకు వాయు కపూర్‌కి ఇవ్వలేదని. ఇది మన ఆచారమే అయినా..దాన్ని తను స్కిప్ చేశానని. అలాగే మీరు కూడా చేయండి అని సోషల్ మీడియా వేదికగా చెబుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో పూర్తిస్థాయి జీర్ణవ్యవస్థ ఉండదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రాణాంతకం కూడా కావచ్చు. దయచేసి ఇలాంటి పనులు మానుకుండి. కోరి కోరి గర్భశోకాన్ని అనుభవించొద్దు ఓ తల్లిగా చెబుతున్నా అని సోనమ్ స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తోంది. “had an argument with Pandit ji for feeding Honey to newly born child because i don’t believe in these traditions”, like seriously ??? Wokeism at its peak!! pic.twitter.com/fBbQ7TVGVL — Moana (@ladynationalist) September 27, 2023 శిశువులకు తేనె ఎందుకు సురకక్షితం కాదంటే... శిశువులకు తేనె ఎందుకు సురక్షితం కాదని తెలుసుకోవడానికి తాను ఆరోగ్య నిపుణులను కూడా సంప్రదించినట్లు తెలిపింది సోనమ్. అంతేగాదు ఆమె శిశువులకు తేనె ఎందుకు ఇవ్వకూడదో వివరిస్తూ, సికె బిర్లా హాస్పిటల్ గురుగ్రామ్‌లోని నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ డాక్టర్ శ్రేయా దూబే చెప్పిన విషయాలను కూడా పంచుకుంది. తేనెలో క్లోస్ట్రిడియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుల ప్రేగులలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదికాస్త శిశు బోటులిజం అనే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ఈ బొటులిజంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో.. ఒకటి ఆహారం ద్వారా వచ్చేవి, రెండు గాయం ద్వారా వచ్చే శిశు బొటులిజం. ఈ బ్యాక్టీరియా శిశువుల నరాలపై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల, తేనెనూ ఏ విధంగానూ శిశువులకు తినిపించకపోవడమే మంచిదిని సోనమ్ గట్టిగా నొక్కి చెబుతోంది. వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తేనెలో "క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే తక్కువ ఆక్సిజన్ పరిస్థితులలో ప్రమాదకరమైన టాక్సిన్లను (బోటులినమ్ టాక్సిన్స్) ఉత్పత్తి చేసే బాక్టీరియం ఉంటుందని పేర్కొంది. శిశు వైద్యురాలు డాక్టర్ మీనా జే మాట్లాడుతూ..వడకట్టలేని లేదా ప్రాసెస్ చేయని తేనె శిశువులకు ఇవ్వడం వల్ల న్యూరోటాక్సిసిటీకి గురై కండరాల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది శిశువుని మరణం అంచులదాక తీసుకువెళ్తుందని తెలిపారు. తొలుత మలబద్దకం, హైసోటోనియాతో మొదలవుతుంది. క్రమేణ పక్షవాతానికి దారితీసి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. చివరికి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌లోని యశోద ఆస్పతత్రిలోని శిశు వైద్యుడు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి మాట్లాడుతూ.. తేనె వల్ల శిశు బొటులిజంకి గురవ్వుతారని అన్నారు. దీనివల్ల కండరాల బలహీనతకు దారితీసి కనీసం పాలను కూడా ఫీడ్ చేయలేనంత బలహీనంగా మారిపోయి విరేచనలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. నవజాత శిశువుల్లో అప్పుడే రోగ నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. దీని ఫలితంగా మనం ఆచారం పేరుతో శిశువులకు తేనెను ఇచ్చేస్తాం. వారి ప్రేగుల్లో తేనెలో ఉన్న టాక్సిన్స్‌తో పోరాడే రక్షణ పూర్తిగా ఉండదు. జీర్ణసమస్యలు ఏర్పడి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీసస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు తేనె ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి. ఇక ఇండియన్ పీడియాట్రిక్ ప్రకారం అప్పుడే పుట్టిన శిశువులకు జంతువులకు సంబంధించిన పాలు, పాల పొడి, టీ, నీరు, గ్లూకోజ్ నీరు లేదా ఇతర ఏ ద్రవాలు ఆహారంగా వ్వకూడదని హానికరం అని పేర్కొంది. ప్రజలు తేనెని శిశువులోని ప్రేగు కార్యకలాపాలను ఉత్తేజపరిచి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుందని భావిస్తారు. వాస్తవానికి తేనె శరీరంలో చాలా నీటిని తీసుకుంటుంది. ఫలితంగా వదులుగా ఉండే మలం వస్తుంది .కానీ అప్పుడే ఉండే శిశువు శరీరంలో ఆ స్థాయిలో నీరు ఉండదు, పైగా అరిగించుకునేంత జీర్ణవ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉండదు. అందువల్ల ఇలాంటి ఆచారాన్ని మానుకోవాలని డాక్టర్ అమిత్ గుప్తా చెబుతున్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నవజాత శిశువుల తొలి ఆహారంగా ఆవుపాలు లేదా తేనె వంటివి ఇస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పుని గట్టిగా నొక్కి చెబుతున్నారు. తల్లిపాలు తప్ప మిగతావన్నీ శిశువుకు లేనిపోని ఆరోగ్య సమస్యలను కలిగించేవేనని అధ్యయనంలో వెల్లడైంది. కావునా మనం ఆ సంస్కృతులు, ఆచారాలు అనేవి ఆయా పరిస్థితులు దృష్ట్యా వచ్చినవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు అంతటి స్థాయిలో లేవు అనేదాన్ని కూడా మనం గమనించి విచక్షణతో వ్యవహరించాల్సి ఉంది. (చదవండి: ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..) -
అమ్మా తప్పు చేశానా?
మంచివాళ్లనుకున్న అబ్బాయిలు మంచి స్కూళ్లలోని అబ్బాయిలు మంచి కుటుంబాల అబ్బాయిలు ఇలా ఎలా చేయగలుగుతారు?.. మోనా తల్లి విస్మయం. మోనాకైతే లోకం మీదే నమ్మకం పోయింది. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి వందల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి వేల లైక్స్ ఉండే అమ్మాయి బాయ్స్ దగ్గర తన మార్ఫింగ్ ఫొటోలు చూసి గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అబ్బాయిలూ.. ఆలోచించండి. ఏడిపించడం ఫన్ అవుతుందా?! ‘‘అమ్మా.. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు వద్దంటున్నా వినకుండా ఫొటోలు షేర్ చేసి తప్పు చేశాను కదా..’’ గట్టిగా ఏడుస్తోంది మోనా (పేరు మార్చాం). పద్నాలుగేళ్ల అమ్మాయి. ఢిల్లీలో మంచి పేరున్న స్కూల్లో చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ ‘బాయ్స్ లాకర్ రూమ్’ స్క్రీన్ షాట్స్‌లో మోనా మార్ఫింగ్ ఫొటో ఉంది. మోనాపై బాయ్స్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఉన్నాయి. వాటిని తనే తల్లికి చూపించింది. ‘‘లేదురా.. నువ్వు తప్పేం చేయలేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. అబ్బాయిలదే తప్పు. నేను నీవైపే ఉన్నాను. వాళ్లకు బద్ధొచ్చేలా చేస్తాను’’ అన్నారు మోనా తల్లి. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. అబ్బాయిలు మళ్లీ ఇలాంటి పని చేయకుండా గట్టి శి„ý పడేలా చేయడానికి ఏమేమి చట్టాలు ఉన్నాయో పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టారు. ∙∙ ఇది ఢిల్లీలో జరిగిన ఘటన. అయితే మిగతా చోట్ల భవిష్యత్తులో బయట పడబోయే ఘటన కూడా కావచ్చు! ‘బాయ్స్ లాకర్ రూమ్’ అనే మాటను దేశం ఈ ఆదివారం తొలిసారిగా వినింది. ఇదేమీ భారత్‌పై ఉగ్రవాదులు తలపెట్టిన దాడుల ఆపరేషన్ పేరు కాదు. దేశవిద్రోహల కోడ్ లాంగ్వేజి కూడా కాదు. ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అకౌంట్ పేరు. అందులో ఉన్నవాళ్లంతా పసితనం వీడని పద్నాలుగూ పదిహేనేళ్ల మగ పిల్లలే. ఢిల్లీలోని ఐదారు స్కూళ్లలోని వాళ్లు. వాళ్లలోనే ఒకరిద్దరు అడ్మిన్లు. ఆ అకౌంట్ చాట్ గ్రూప్‌లో జరిగే రహస్య సంభాషణలన్నీ తమ క్లాస్మేట్స్ అయిన ఆడపిల్లల గురించే! వాళ్ల ఫొటోలను షేర్ చేస్తారు. మార్ఫింగ్ చేస్తారు. కామెంట్స్ రాస్తారు. నవ్వుకుంటారు. వాటిల్లో బాడీ షేమింగ్ ఉంటుంది, రేపిస్టు మెంటాలిటీ ఉంటుంది. వీళ్ల చాటింగ్ స్క్రీన్ షాట్స్ కొందరు అమ్మాయిల (వాళ్లలో మోనా కూడా ఉంది) ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో షేర్ అవడంతో ‘బాయ్స్ లాకర్ రూమ్’ సంగతి బయటపడింది. ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లల్ని మానసికంగా కృంగదీసి, వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే చాటింగ్ అది. సున్నిత మనస్కులు తట్టుకోలేరు. కరోనా వైరస్‌ను వుహాన్‌లో మొదట ఒక చైనా నర్సు గుర్తించారు. అలా ఈ ప్రమాదాన్ని మనదేశంలో వెంటనే గుర్తించిన వ్యక్తి.. స్వాతీ మలీవాల్. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్. ఢిల్లీపోలీసులకు, ఇన్స్టాగ్రామ్ సంస్థకు మర్నాడే.. అంటే సోమవారమే.. ఆమె నోటీసులు పంపారు. ఇలాంటి తత్వం ఉన్న మగపిల్లలకు తక్షణం ఒక బలమైన హెచ్చరిక వెళ్లాలి అని స్వాతి అనుకున్నారు. ∙∙ మంగళవారం ఉదయానికి పోలీసులు లాకర్ రూమ్ సభ్యుడొకరిని కనిపెట్టారు. పద్నాలుగేళ్ల విద్యార్థి అతడు. ఢిల్లీలో పేరున్న స్కూల్లో చదువుతున్నాడు. ‘రూమ్’ తాళం చెవిలా దొరికాడతడు. మిగతా సభ్యులు పేర్లు, వాళ్లు ఏయే స్కూళ్లలో చదువుతున్నదీ అతడి నుంచి, అతడి స్నేహితుల నుంచి పోలీసులు రాబట్టారు. వాళ్లలో ఒకరిద్దరు ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏప్రిల్ మొదటివారంలో ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొదలైంది. ఒకర్నుంచి ఒకరు జమ అయ్యారు. ఇద్దరు అడ్మిన్లు కాబట్టి గ్రూపు త్వరత్వరగా వృద్ధిచెందింది. గ్రూపు టాపిక్ ఒక్కటే.. అమ్మాయిలు.. అమ్మాయిలు.. అమ్మాయిలు! తెలిసిన అమ్మాయిలు. క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు! వాళ్ల ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సంపాదించడం, ఇందులో షేర్ చేయడం. షేమింగ్ చేయడం! బుధ, గురువారాల్లో వీళ్లలో మరికొందరు బయటపడ్డారు. వీరిపైన ఏం చర్య తీసుకుంటారని తెలియకపోయినా, ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రం.. ‘పోలీసులు ఇంటికి రావడం’ అనే శిక్షను అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్‌తో జువెనైల్ జస్టిస్ బోర్డు.. కేసులేమీ తీసుకోవడం లేదు. దాంతో పోలీసులు నిందిత విద్యార్థులను ప్రస్తుతానికి వాళ్ల తల్లిదండ్రుల అదుపులోనే ఉంచుతున్నారు. మొబైల్ ఫోన్స్ తీసేసుకున్నారు. తమకు తెలియకుండా వాళ్లను సిటీ బయటికి పంపించడం చేయకూడదని చెప్పి వెళుతున్నారు. బాయ్స్ లాకర్ రూమ్ చాట్‌లో తమ కూతుళ్ల ఫొటోలు ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రుల పరిస్థితీ దాదాపుగా అలానే ఉంది. ‘‘అమ్మా.. నా తప్పేమీ లేదు కదా’’ అని కూతురు అపరాధిలా అడగడం ఏ తల్లిని మాత్రం బాధించదు! ∙∙ తల్లి చెబుతున్న దానిని బట్టి మోనాకైతే ఈ అనుభవం తర్వాత లోకం మీదే నమ్మకం పోయింది! ‘నేనీ సమాజంలో ఉండలేను మమ్మీ’ అంటోంది. ‘ఫొటోలు షేర్ చెయ్యకమ్మా.. ఎవరైనా మిస్ యూజ్ చేస్తారు’ అని మొదట్లో తల్లి చెప్పినప్పుడు మోనా నవ్వింది. ‘పిచ్చి భయాలు మమ్మీ నీవన్నీ. మీ రోజుల్లో అలా ఉండేదేమో. బాయ్స్ ఇప్పుడు మర్యాదగా ఉంటున్నారు. గర్ల్స్‌ని, ఆడవాళ్లని రెస్పెక్ట్ చేస్తున్నారు’ అని మోనా అంది. ఇప్పుడు అదే బాయ్స్ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు! ఎందుకిలా చేశారు అని అడితే.. ‘ఫర్ ఫన్’ అంటున్నారు! దుర్గంధం ఈ దర్గంధపూరిత ప్రవర్తనకు అబ్బాయిల తల్లిదండ్రులనే నిందించాలి. ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వక పోవడం మీ హక్కు అన్నట్లు అబ్బాయిల్ని పెంచుతున్నారు. బాయ్స్.. ఈ పనికి మీరు సిగ్గుపడాలి. – నటి సోనమ్ కపూర్ ఇంత విషమా! ఈ వయసులో ఇంత పురుషాహంకారం అంటే ఈ విషం ఎంతవరకూ పాకపోబోంది! అత్యాచారాలను ప్రేరేపించే ఇలాంటి ఆలోచనా ధోరణులను ఇప్పుడే అదుపులో పెట్టాలి. – నటి స్వరా భాస్కర్ -
అదృష్ట దేవత
చేసే పని కలసి రావాలని కొందరు రకరకాల నమ్మకాలను అనుసరిస్తుంటారు. ‘నేనుంటే ఇంకేదీ అవసరం లేదు. నేను అదృష్టాన్ని’ అంటున్నారు సోనమ్ కపూర్. దుల్కర్ సల్మాన్, సోనమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జోయా ఫ్యాక్టర్’. అభిషేక్ శర్మ దర్శకుడు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగుతుంది. దుల్కర్ క్రికెటర్ పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల టీమ్‌కు లక్కీ చార్మ్‌గా సోనమ్ కనిపిస్తారట. సోనమ్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ‘‘జోయా సోలంకీ ఉండగా నిమ్మకాయలు, మిరపకాయలు ఎవరికి కావాలి? ఇండియాకి లక్కీ చార్మ్ నేను. మ్యాచ్‌లు గెలిపిస్తాను’’ అని తన ఫస్ట్‌లుక్ ఫొటోకి క్యాప్షన్ చేశారు సోనమ్. ‘జోయా ఫ్యాక్టర్’ సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. -
వివేకం కోల్పోయావా వివేక్?
ముంబై: సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ షేర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే దేశం యావత్తు ఉలిక్కిపడేలా ప్రకంపనలు రేగుతాయి. ఇలాంటి ట్విట్టర్ దుమారమే మరోసారి చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, ఐశ్వర్యరాయ్‌ను కించపరిచేలా ఉన్న ఒక మీమ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో సల్మాన్‌తో ఐశ్వర్య ఉన్న ఫొటోకు ఒపీనియన్ పోల్, వివేక్–ఐశ్వర్య చిత్రానికి ఎగ్జిట్ పోల్, అభిషేక్, ఆరాధ్య, ఐశ్వర్య కలిసి ఉన్న చిత్రానికి రిజల్ట్ అని టైటిల్ ఇచ్చి, ఈ మూడు చిత్రాలతో కూడిన మీమ్‌ను రూపొందించారు. ‘హ..హ.. క్రియేటివ్, రాజకీయాల్లేవు, కేవలం జీవితం’ అని టైటిల్‌తో దీనిని వివేక్ ట్విట్టర్లో షేర్ చేశారు. కొద్ది వ్యవధిలోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారి నెటిజన్లను మండిపాటుకు గురిచేసింది. అతని స్థాయిని సూచిస్తోంది ఈ ట్వీట్ అసహ్యంగా ఉందంటూ నటి సోనమ్ కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, పలువురు మహిళా జర్నలిస్టులు, ప్రముఖులు ట్విట్టర్లో స్పందించారు. వివేక్‌కు నోటీసులు పంపుతామన్నారు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్. అతని నీచ బుద్ధిని.. అతను జీవితంలోను, రాజకీయాల్లోను సమర్థుడు కాదని తేల్చడానికి ఇదే సాక్ష్యం అంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్. -
నిర్మాతగా సోనమ్
భూతాపం ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. దీనిపై ప్రపంచ దేశాలు సదస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఎంటర్టైన్మెంట్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. అందుకే ఓ డాక్యుమెంటరీని తీయాలని నిర్ణయించుకుని, నిర్మాతగా మారారు. ఈ డాక్యుమెంటరీలో సోనమ్ కూడా నటిస్తారట. ఇంకో విశేషం ఏంటంటే.. ఐదుగురు డైరెక్టర్స్ ఈ డాక్యుమెంటరీ కోసం వర్క్ చేస్తారట. దీనికోసం ఇండియా, యూరప్, ఆస్ట్రేలియా, యూఎస్ దర్శకులను వెతికే పనిలో పడ్డారట సోనమ్ అండ్ టీమ్. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. సింగపూర్ బేస్డ్ రచయిత కృష్ణ ఉదయశంకర్ రాసిన ‘ఆర్యావర్తా క్రానికల్స్’ బుక్ రైట్స్‌ని కూడా సోనమ్ దక్కించుకున్న సంగతి తెలిసందే. -
మౌనం అంగీకారం కాదు
‘‘ఎవరో హర్ట్ అవుతారని చెప్పి మౌనంగా ఉండిపోకండి. జరిగిన చేదు అనుభవాలను ధైర్యంగా బయటకు చెప్పండి. మార్పు మొదలైంది’’ అంటూ ‘మీటూ’ గురించి రాశారు సోనమ్ కపూర్ అహూజా. ప్రస్తుతం జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమం గురించి సోనమ్ కపూర్ రాసుకొచ్చారు. ‘‘మార్పుని అందరం కోరుకుంటాం. ఆ మార్పు రావాల్సిన మార్గంలో ప్రయాణించడానికి మాత్రం సంకోచిస్తాం. కానీ మార్పు అనేది పెద్ద కష్టం కూడా కాదు. చాలా సింపుల్. కొన్ని చిన్న చిన్న విషయాలు పాటిస్తే సులువే’’ అంటూ పలు పాయింట్స్ ప్రస్తావించారు. ‘‘బాధితులను నమ్మండి’. చాలా మంది బాధితురాలిని ప్రశ్నించడానికి రెడీగా ఉంటారు. తప్పు మీవైపే ఉంది అన్నట్టు కూడా మాట్లాడతారు. కానీ వాటిని పట్టించుకోకండి. ఎంతో ధైర్యం కూడదీసుకుని బయటకు వచ్చి చెబుతున్నవారికి మనం చేయగలిగింది కేవలం వాళ్లను నమ్మడమే. ఇప్పటికీ చాలామంది తల్లులు మగపిల్లలే ఎక్కువ అన్నట్టుగా భావిస్తున్నారు. అలానే పెంచుతున్నారు. అందులో మార్పు రావాలి. ఇద్దరూ సమానమే అన్నట్టుగా పిల్లల్ని పెంచాలి. ఎవరైనా మరొకర్ని కావాలనుకున్నా, తాకాలనుకున్నా కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. మౌనం అంగీకారం కాదు. నో అంటే నో అని. లింగ వివక్ష జోక్స్‌ని మొహమాటానికి కూడా అభినందించకండి. ట్యాగ్ తగిలించడం మానేయండి. ఐటమ్ సాంగ్స్ చేయడం తప్పు కాదు. వాటిని ఐటమ్ నంబర్స్ అని ముద్ర వేయడం పొరపాటు. నా స్నేహితురాలు ఒకామె మీటూ గురించి మాట్లాడటానికి భయపడుతోంది. ఎందుకంటే తనకి ఎప్పటికీ ‘బాధితురాలు’ అనే ట్యాగ్ తగిలిస్తారని. పని ప్రదేశాల్లో స్త్రీలు కూడా ఎక్కువగా పని చేసే వాతావరణాన్ని తీసుకురండి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొని, నిజం నిరూపితమైన వాళ్లతో పని చేయకండి’’ అని పేర్కొన్నారు సోనమ్. -
సోనమ్–కంగనాల మాటల తూటాలు
మనసుకి అనిపించినది ఎవరికీ భయపడకుండా బాహాటంగా మాట్లాడే స్వభావం ఉన్న నటి కంగనా రనౌత్. ఇటీవల తన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ దర్శకుడు వికాస్ బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే వాటిని సమర్థిస్తూ ‘అవును’ అంటూ ఆ ఆరోపణలు చేసిన స్త్రీని సపోర్ట్ చేశారు కంగనా. ఈ నేపథ్యంలో సోనమ్ కపూర్ ముందు బాలీవుడ్ మీడియా కంగనా గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. సోనమ్ తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించారు. ఆ మాటలకు కంగనా ప్రతిస్పందించారు. ఇద్దరి మాటలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కంగనాని నమ్మలేం వికాస్ బాల్‌పై ఆరోపణలు చేసిన స్త్రీని కంగనా సపోర్ట్ చేయడం పై మీ అభిప్రాయం ఏంటి? అని సోనమ్ కపూర్‌ని అడగ్గా – ‘‘స్త్రీలపై వేధింపులు దారుణం. చాలా బాధగా అనిపిస్తుంది. అయితే కంగనా మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తనని నమ్మడం కష్టం. కంగనా చాలా మాటలు మాట్లాడుతుంది. వాటిలో నిజం ఎంత? అనేది చెప్పలేం’’ అని సమాధానమిచ్చారు. – సోనమ్ సోనమ్ గొప్ప నటి కాదు ‘‘కంగనాని నమ్మలేం అంటే అర్థం ఏంటి? నాకు ఇలాంటి సంఘటన జరిగింది అని నేను చెప్పుకున్నప్పుడు నన్ను జడ్జ్ చేసే హక్కు సోనమ్‌కి ఎవరు ఇచ్చారు? కొందరిని నమ్మాలి.. మరికొందర్ని నమ్మకూడదు అనే లైసెన్స్ ఏమైనా తనకుందా? నా మాటలను నమ్మకపోవడానికి కారణమేంటో? మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తా అనే పేరు నాకుంది. మన దేశాన్ని గురించి పలు ప్రపంచ దేశాల సదస్సులలో ప్రసంగించాను. నా ప్రసంగాల ద్వారా యువతను ప్రభావితం చేయగలను అనే పేరు నాకుంది. అంతే కానీ మా నాన్నగారి వల్ల కానీ, ఆయన సంపాదించి పెట్టిన ప్లేస్ వల్ల కానీ కాదు. నాకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఉంది. అది స్వయంగా నేను సంపాదించుకున్నదే. సోనమ్ గొప్ప నటీ కాదు.. వక్త కూడా కాదు. నా గురించి మాట్లాడటానికి వాళ్లకు ఏం హక్కుందని?’’ అన్నారు. మొత్తానికి సోనమ్–కంగనాల వాడి వేడి మాటలు చాలామందికి వినోదం అయ్యాయి. నెక్ట్స్ వీళ్ల నుంచి వచ్చే తూటాల్లాంటి మాటల కోసం ఎదురు చూస్తున్నారు. – కంగనా -
ఇండస్ట్రీని తప్పు పట్టొద్దు!
పెళ్లి చేసుకున్నంత మాత్రాన అవకాశాలు తగ్గిపోవని రీసెంట్గా నటి ఆలియా భట్ బీ టౌన్ మీడియా ముందు స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు సోనమ్ కపూర్ కూడా ఇదే విషయంపై స్పందించారు. ‘పెళ్లి చేసుకున్నారు కదా. హీరోయిన్గా చాన్స్‌లు తగ్గిపోతాయని భయపడుతున్నారా?’ అన్న ప్రశ్నను మీడియా వారు సోనమ్‌ను అడిగినప్పుడు– ‘‘వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నటి డింపుల్ కపాడియా ‘సాగర్’ అనే సినిమాలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. పెళ్లి తర్వాత చాన్స్‌లు తగ్గిపోతాయని నేను భయపడటం లేదు. ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్నాయని ఇండస్ట్రీ నన్ను నమ్మినంత కాలం నాకు చాన్సులు వస్తూనే ఉంటాయి. ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత కథానాయికలకు చాన్స్‌లు రావు అనుకుంటే.. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా, కాజోల్, లేటెస్ట్గా కరీనా కపూర్లకు ఇండస్ట్రీలో పని దొరికేది కాదు. ఈ విషయంలో ఇండస్ట్రీని తప్పుపట్టవద్దు. ఇండస్ట్రీలోనే కాదు సమాజంలోనూ మహిళలకు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉంటే బాగుంటుంది’’ అన్నారు. ఈ ఏడాది మేలో వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో సోనమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. -
స్క్రీన్ టెస్ట్
1. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ యంగ్ రెబల్‌స్టార్‌కి హీరోగా ‘సాహో’ ఎన్నో సినిమానో తెలుసా? ఎ) 19 బి) 23 సి) 25 డి)16 2. సంజయ్‌దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. సంజు తల్లి ‘నర్గీస్‌దత్’ పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సోనమ్ కపూర్ బి) అనుష్కా శర్మ సి) విద్యాబాలన్ డి) మనీషా కోయిరాల 3. ‘కేరళ బ్లాస్టర్స్’ అనే ఫుట్‌బాల్ టీమ్ ఓనర్స్‌లో ఈ హీరో వన్నాఫ్ ది పార్టనర్స్. ఎవరా టాప్ హీరో కనుక్కోగలరా? ఎ) చిరంజీవి బి) వెంకటేశ్ సి) రజనీకాంత్ డి) కమల్ హాసన్ 4. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌దేవ్ నటించిన చిత్రం ‘విజేత’. ఆ చిత్రదర్శకుడెవరో తెలుసా? ఎ) అజయ్ భూపతి బి) రాకేశ్ శశి సి) రాహుల్ రవీంద్రన్ డి) ఇంద్రసేన .ఆర్ 5. వైవీయస్ చౌదరి దర్శకత్వంలో రామ్, ఇలియానా జంటగా వచ్చిన ‘దేవదాసు’ గుర్తుండే ఉంటుంది. అందులో స్పెషల్ క్యారెక్టర్లో నటించిన ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సమీరా రెడ్డి బి) త్రిష సి) శ్రియా శరన్ డి) జెనీలియా 6. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒకరు క్యాథరిన్ థెరిస్సా. మరొక హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) పూజా హెగ్డే బి) రకుల్‌ప్రీత్ సింగ్ సి) కియారా అద్వాని డి) అమలా పాల్ 7. వీవీ వినాయక్ ఏ హీరోతో సినిమా చేయటం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారో గుర్తుందా? ఎ) రామ్‌చరణ్ బి) రవితేజ సి) ప్రభాస్ డి) ఎన్టీఆర్ 8. ‘టెంపర్’ చిత్రంలో ఎన్టీఆర్సరసన నటించిన హీరోయిన్ ఎవరో చెప్పుకోండి? ఎ) ఇలియానా బి) కాజల్ అగర్వాల్ సి) తమన్నా డి) నివేథా థామస్ 9. ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే పాట ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా లోనిది. ఆ పాట రచయితెవరో తెలుసా? ఎ) వేటూరి సుందరామ్మూర్తి బి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సి) వంశీ డి) వనమాలి 10. ‘వెల్కమ్ టూ న్యూయార్క్’ అనే హిందీ చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించిన టాలీవుడ్ నటుడెవరో తెలుసా? ఎ) నానీ బి) రామ్ సి) రానా డి) అఖిల్ 11. 2010లో హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో హీరోయిన్గా 20 చిత్రాల్లో నటించిన ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి? ఎ) తాప్సీ బి) అంజలి సి) శ్రుతీహాసన్ డి) సమంత 12. ‘రాజీ’ చిత్రం ద్వారా మంచి పేరుతో పాటు హీరోయిన్గా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న బాలీవుడ్ భామ ఎవరో తెలుసా? ఎ) కంగనా రనౌత్ బి) ఆలియా భట్ సి) కరీనా కపూర్ డి) సోనాక్షీ సిన్హా 13. ‘హలో గురూ ప్రేమకోసమే రా జీవితం’ అనే పాటలో నాగార్జునతో కలిసి స్టెప్పులేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) అమల బి) రమ్యకృష్ణ సి) మీనా డి) టబు 14. ‘నీవెవరో’ అనే చిత్రంలో అంధునిగా నటిస్తున్న నటుడెవరో కనుక్కోండి? ఎ) నవీన్ చంద్ర బి) రాజ్ తరుణ్ సి) ఆది పినిశెట్టి డి) ఆది సాయికుమార్ 15. ‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కట్ వేసిండే’ అనే పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) స్మిత బి) అంజనా సౌమ్య సి) చిన్మయి డి) మధుప్రియ 16. 1971లో రిలీజైన ‘ప్రేమనగర్’ చిత్రంలో హీరో అక్కినేని. ఆయన తండ్రి పాత్రలో నటించిన నటుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) ప్రభాకర్ రెడ్డి బి) గుమ్మడి సి) సత్యనారాయణ డి) యస్వీ రంగారావు 17. రజనీకాంత్ ‘2.0’లో హీరోయిన్గా నటిస్తున్న నటి ఎవరు? ఎ) ఆండ్రియా బి) ఐశ్వర్యా రాయ్ సి) అమీ జాక్సన్ డి) దీపికా పదుకోన్ 18. ‘వెన్నెల’ చిత్రం ద్వారా దర్శకునిగా మారిన ఎన్నారై ఎవరో చెప్పుకోండి? ఎ) శేఖర్ కమ్ముల బి) దేవా కట్టా సి) ప్రవీణ్ సత్తార్ డి) సాయికిరణ్ అడివి 19. ఈ ఫొటోలోని చిన్న పాప ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్. ఆమె ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) సోనాక్షీ సిన్హా సి) కత్రినా కైఫ్ డి) శ్రద్ధాకపూర్ 20. సుజాత, ఎన్టీఆర్, మురళీమోహన్ నటించిన ఏ సినిమాలోని స్టిల్ ఇది.. కనిపెట్టండి? ఎ) మహాపురుషుడు బి) యుగపురుషుడు సి) డ్రైవర్ రాముడు డి) అడవి రాముడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) ఎ 4) బి 5) సి 6) బి 7) డి 8) బి 9) బి 10) సి 11) డి 12) బి 13) ఎ 14) సి 15) డి 16) డి 17) సి 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
వర్క్ మోడ్
పెళ్లి తర్వాత ఇన్ని రోజులు ఫ్యామిలీ మోడ్‌లో టైమ్ స్పెండ్ చేసిన సోనమ్ కపూర్ తిరిగి వర్క్‌మోడ్‌లోకి వచ్చేశారు. హిందీ చిత్రం ‘ఏక్ లడకీ కో దేఖా తో ఏసా లగా’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, సోనమ్ కపూర్, రెజీనా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు సోనమ్. ప్రస్తుతం జూహీ చావ్లా, సోనమ్ కపూర్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో సోనమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. -
ఆనందమానందమాయె
మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో ఆమె వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపార వ్యవహారాల రీత్యా సోనమ్ భర్త ఆనంద్ ఢిల్లీలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి వస్తోందట. దీంతో పెళ్లైన తర్వాత ఢిల్లీకి సోనమ్ రాకపోకలు బాగా పెరిగాయి. అలాగే లండన్‌లోనూ ఆనంద్కి వ్యాపారాలు ఉన్నాయట. అప్పుడప్పుడూ భర్తతో టైమ్ స్పెండ్ చేయడం కోసం లండన్ కూడా వెళ్తున్నారట సోనమ్. దీంతో సోనమ్ కోసం ఆనంద్ తన వ్యాపారాలను ముంబైలో కూడా పెంచాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నది బీటౌన్ టాక్. అలాగే సోనమ్ కూడా మూడేళ్ల క్రితం దాదాపు 30 కోట్లతో బాంద్రాలో కొన్న తన ఇంటిని రీ డిజైన్ చేయిస్తున్నారని బాలీవుడ్ సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఈ ఇంటి డిజైనింగ్ కంప్లీట్ అవుతుందని, ముంబైలో ఉన్నప్పుడు వీరిద్దరూ ఈ ఇంట్లోనే ఉండబోతున్నారనేది బాలీవుడ్ కథనాల సారాంశం. ఆనంద్‌ని పెళ్లి చేసుకున్నాక సోనమ్ లైఫ్ ఇంకా ఆనందంగా మారిందని పరిశీలకులు అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. .‘జోయా ఫ్యాక్టర్’, ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ సినిమాలతో బిజీగా ఉన్నారు సోనమ్. -
లండన్‌లో తొలి బర్త్‌డే!
ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను లండన్‌లో ప్లాన్ చేశారు బాలీవుడు బ్యూటీ సోనమ్ కపూర్. ఆల్రెడీ 32 సార్లు బర్త్‌డే కేక్‌ను కట్ చేసిన సోనమ్‌కి తొలి బర్త్‌డే ఏంటి బాస్? అంటే.. నిజమే. ఇప్పటివరకూ జరుపుకున్న బర్త్ డేలకు కేక్‌లను ముక్కలు చేసింది కుమారిగా. ఇప్పుడు శ్రీమతి అయ్యాక జరుపుకుంటున్న తొలి బర్త్‌డే ఇది. ఈ ఏడాది మేలో ఆనంద్ ఆహుజాతో సోనమ్ కపూర్ ఏడు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న సోనమ్ పుట్టినరోజు. సోనమ్ 33వ బర్త్‌డే సెలబ్రేషన్స్ లండన్‌లో జరగనున్నాయి. ‘‘ఓ పని మీద లండన్ వెళ్తున్నాను. ఆనంద్ కూడా అక్కడికి వస్తాడు. సో.. నా బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుగుతాయి. ఈ సెలబ్రేషన్స్‌లో నా సిస్టర్ రియా, స్నేహితులు సెహాల్యఖాన్, సయంక్తా నాయర్ కూడా పాల్గొంటారు. స్వర భాస్కర్ని జాయిన్ అవ్వమన్నాను. కానీ ‘వేరే వర్క్స్ వల్ల రాలేకపోతున్నాను’ అని స్వర చెప్పింది’’ అని సోనమ్ కపూర్ పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘సంజు’, తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి నటిస్తోన్న ‘ఎక్ లడ్కీ కో దేఖా తో ఏసా లగా’ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. -
సోనమ్ కీ షాదీ
మనసుకి నచ్చిన వ్యక్తిని మనువాడితే ఆ ఆనందం అంతా మనసులోనే కాదు.. ముఖారవిందంలో కూడా కనిపిస్తుంది. మంగళవారం సోనమ్ కపూర్ ఫేస్‌లో ఆ హ్యాపీనెస్ కనిపించింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఆనంద్ అహూజా, సోనమ్ కపూర్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా భార్యాభర్తలయ్యారు. సిక్కు సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. ముంబైలోని కపూర్ ఫ్యామిలీకి చెందిన రాక్‌డేల్ బంగళా ఈ పెళ్లికి వేదిక అయింది. ఎరుపు రంగు లెహంగా, చోళీ, డిజైనర్ జ్యువెలరీలో సోనమ్ మెరిసిపోయారు. బంగారు వర్ణం డిజైనర్ షేర్వానీలో ఆనంద్ హ్యాండ్సమ్గా కనిపించారు. ఈ వేడుకకు అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతానందా, ఆమిర్ ఖాన్, ఆయన సతీమణి కిరణ్ రావ్, ముద్దుల తనయుడు తైముర్తో సహా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, కరణ్ జోహార్, కరిష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. జాన్వీకి సారీ చెప్పిన సోనమ్ సోనమ్ పెళ్లి వేడుకల్లో శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ సెంటరాఫ్ ఎట్రాక్షన్. అలాగే జాన్వీకి సోనమ్ ‘సారీ’ చెప్పడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. సోనమ్ సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పెళ్లికి ఆచరించే సంప్రదాయాల్లో పెళ్లి కూతురు చేతికి ఎరుపు, తెలుపు గాజులు, వాటికి వేలాడుతూ ‘కలేరి’ ధరించాల్సి ఉంటుంది. ఈ కలేరి అవివాహితుల తలకు తగిలితే వాళ్లకు త్వరగా పెళ్లవుతుందని విశ్వాసం. సోనమ్ సరదాగా జాన్వీ తలకు కలేరీని తగిలించబోతే జాన్వీ కంగారు పడింది. పెదనాన్న (బోనీకపూర్) కూతురు, చెల్లెలు జాన్వీని అలా ఆటపట్టించి, ‘సారీ’ చెప్పారు సోనమ్. తన తలకు కలేరి తగలకపోవడంతో జాన్వీ ఫేస్‌లో రిలీఫ్ కనిపించింది. ఇలాంటి చమక్కులతో సోనమ్ కీ షాదీ సందడి సందడిగా జరిగింది. మధ్యాహ్నం పెళ్లి.. సాయంత్రం చేంజ్! మెహందీ, సంగీత్, పెళ్లి.. ఒక్కో రోజు ఒక్కో వేడుక. మూడు రోజులు సోనమ్ కపూర్ పెళ్లి పనులు సరదాగా జరిగాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోనమ్‌కు మంగళవారం సాయంత్రం వరకూ తన పెళ్లి ఫొటోలను పోస్ట్ చేసే తీరిక లేకపోవడం సహజం. అయితే తనను ఇన్స్టాగ్రామ్, ట్వీటర్లలో ఫాలో అవుతున్న 12లక్షల మందికి పైగా ఫాలోయర్స్‌కు మాత్రం ‘ఒక్క చేంజ్’తో పెళ్లయిన విషయాన్ని చెప్పారీ కొత్త పెళ్లికూతురు. ఎలా అంటే.. ఇన్స్టాగ్రామ్, ట్వీటర్ అకౌంట్ యూజర్ నేమ్‌ను చేంజ్ చేశారామె. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి చేసుకున్న సోనమ్ సాయంకాలానికల్లా యూజర్ నేమ్‌ను ‘సోనమ్‌కపూర్ అహుజా’ అని మార్చారు. -
పెళ్లికళ వచ్చేసింది
మే 8... మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12:30. ఈ డేట్ అండ్ టైమ్ స్పెషాల్టీ ఏంటీ అనుకుంటున్నారా? బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్‌కు శ్రీమతిగా కొత్త జీవితం ఆరంభమయ్యే ముహూర్తపు టైమ్ అది. అవును.. ఇక నో మోర్ డౌట్స్. సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజాల వివాహం మే 8న ముంబైలో జరగనుంది. అన్నట్లు ఇంకో మాట.. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగూ లంచ్ ఉంది. అలాగే అదే రోజు రాత్రి పార్టీ కూడా ఎరేంజ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఆల్రెడీ సోనమ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయ్యింది. పెళ్లి జరగడానికి ఇంకా నాలుగు రోజులు ఉన్నా.. అప్పుడే సోనమ్ కపూర్ ఫేస్‌లో పెళ్లి కళ వచ్చేసిందని ఆమె సన్నిహితులు సరదాగా ఆటపట్టిస్తున్నారట. ఆల్రెడీ సోనమ్ కపూర్ ఇల్లు పెళ్లి ఏర్పాట్లతో హడావిడిగా మారింది. అలంకరణ కూడా పూర్తి అయ్యింది. పెళ్లి వేడుకలకు ధరించబోయే డిజైనర్ డ్రెస్సులను తన అభిరుచికి తగ్గట్టుగా చేయించుకున్నారట సోనమ్. ‘ఫ్యాషన్ ఐకాన్’ అని పేరు తెచ్చుకున్న సోనమ్ పెళ్లి వేడుకల్లో ధరించబోయే దుస్తులు ఎలా ఉంటాయో చూడాలని చాలామంది వెయిటింగ్. ఇక సోనమ్ కపూర్ కాబోయే భర్త ఆనంద్ ఆహుజా గురించి చెప్పాలంటే ఆయన వ్యాపారవేత్త. సోనమ్ పెళ్లికి దీపిక రాదా? యస్.. సోనమ్ పెళ్లికి దీపికా పదుకొన్ హాజరు కావడం లేదా? అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అందుకు తగ్గట్లు ఒక విశ్లేషణను చెబుతున్నాయి. టైమ్ మ్యాగజీన్ వంద మంది మోస్ట్ ఇన్‌ఫ్లూయన్షియల్ పీపుల్స్‌లో ఒకరుగా దీపికా పదుకొన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న టైమ్ మ్యాగజీన్ జరపనున్న ఓ ఈవెంట్లో పాల్గొనున్నారు దీపిక. ఆ నెక్ట్స్ మే 8 నుంచి 19 వరకు జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాల్సి ఉందట. సో.. సోనమ్ పెళ్లికి దీపికా రావడం లేదట. -
ఆ ప్రశ్నలు ఇప్పుడొద్దు
నలుగురు అమ్మాయిల గ్యాంగ్. ఒకరు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. మరొకరు పెళ్లి కోసం ఇంటినుంచి బయటకు వచ్చారు. ఇంకొకరు విడాకుల కోసం వెయిట్ చేస్తున్నారు. నాలుగో అమ్మాయి ప్రస్తుతానికి పెళ్లికి రెడీ అవుతోందట. మరి.. ఫైనల్‌గా వీరి కథకు శుభం కార్డ్ ఎలా పడింది? అనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. శశాంక ఘో‹ష్ దర్శకత్వంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిక్షా తల్సానియా ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘వీరే ది వెడ్డింగ్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది. అమ్మాయిల గ్యాంగ్‌తో ట్రైలర్ మూవీపై ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాను జూన్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ట్రైలర్ లాంచ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అండ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ కామెంట్స్ గురించి సోనమ్ కపూర్ అండ్ స్వర భాస్కర్‌ను కొశ్చన్ చేశారు అక్కడి పాత్రికేయులు. అయితే క్యాస్టింగ్ కౌచ్ విషయాన్ని ఈజీగా దాటవేశారు ఈ బాలీవుడ్ భామలు. ‘‘మీరు అడిగిన ప్రశ్న ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాకు చెందినది కాదు.ఈ సినిమా ఫంక్షన్ నుంచి డైవర్ట్ కావడం ఇప్పుడీ సందర్భంలో సరికాదనిపిస్తోంది’’ అని తెలివిగా చెప్పారు స్వరభాస్కర్. ‘‘క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది కాదు. ఇప్పుడు సరోజ్‌ఖాన్ కామెంట్స్ గురించి స్వరభాస్కర్ స్పందిస్తే అది హెడ్లైన్ అవుతుంది. సినిమా గురించి కాదు’’ అని సోనమ్ కపూర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీనాకపూర్, తల్సానియా కూడా పాల్గొన్నారు. -
ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్
ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ట్రెండ్‌కు తగ్గట్టు చాలా చాలెంజ్‌లు చూశాం. ఇప్పుడు మరో చాలెంజ్‌ను మన ముందుకు తీసుకు వస్తున్నారు ఆమిర్ ఖాన్. అదే ‘ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్’. అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్య తారలుగా ఆర్.బాల్కీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్‌ఖాన్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్’ స్టార్ట్ చేశారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ నేప్కిన్లను తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆ విధంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణాచలమ్ కథతో ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ తీశారు. ఇతరుల్లో అవగాహన కలిగించే ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువ అవ్వాలని ఆమిర్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్‌కు నాంది పలికారు. ఇంతకీ ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాకి, ఆమిర్‌కీ సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఈ సినిమాను అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా నిర్మించారు. ట్వింకిల్, ఆమిర్ మంచి స్నేహితులు. ట్వింకిల్ అడగ్గానే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఫొటోలో చూస్తున్నారుగా! ఆమిర్ ఖాన్ శానిటరీ ప్యాడ్‌ను ఇలా పట్టుకొని ఫొటో పోస్ట్ చేసి ‘‘అవును.. నా చేతిలో ఉన్నది శానిటరీ ప్యాడే. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొన్నారు. అంతే కాదు.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కూడా ఇలా శానిటరీ ప్యాడ్ పట్టుకొని ఫొటో పోస్ట్ చేయమని చాలెంజ్ విసిరారు. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నది కాదు. సోషల్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేసిన చాలెంజ్. ఈ చాలెంజ్ ముఖ్య ఉద్దేశం ప్యాడ్స్ గురించి మాట్లాడటానికి మనం సిగ్గుపడకూడదని. ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. -
పర్సనల్.. పర్సనల్...
బాలీవుడ్ అభిమానులకు సినిమాలు ఎంత ఎంటర్టైన్మెంటో.. ఆ సినిమాల్లోని స్టార్స్ పర్సనల్ విషయాలూ అంతే ఎంటర్టైన్మెంట్! పర్సనల్ అంటే ముఖ్యంగా వాళ్ల ఫేవరెట్ స్టార్స్ ఎవరితో డేట్ చేస్తున్నారు? ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు? ఎవరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎవరెవరు గొడవ పడుతున్నారు? ఇలాంటివి. దీపికా, కత్రినా, సల్మాన్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ.. ఇలా ఈ స్టార్స్ లవ్స్టోరీలన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఓ లవ్‌స్టోరీ బాలీవుడ్ సర్కిల్లో బాగా చక్కర్లు కొడుతోంది. అదే మన సోనమ్ కపూర్–ఆనంద్ అహుజాలది. సోనమ్ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు సరే, ఈ ఆనంద్ అహుజా ఎవరు? ఆనంద్.. సోనమ్ కపూర్ బాయ్‌ఫ్రెండ్. తనకంటూ ఒక స్టైల్ సెట్ చేసుకుంటోన్న బిజినెస్‌మేన్ ఆనంద్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జంట కబుర్లే! మొన్న కొత్త సంవత్సర వేడుకల కోసం కూడా ఈ జంట లండన్ వెళ్లింది. సెలెబ్రేషన్ అంతా అక్కడే! ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, తీసుకున్న వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్. ఇంకేముంది? అందరూ ‘‘ఆనంద్‌తో లవ్వా?’’ అని అడిగేస్తున్నారు సోనమ్‌ను. ‘‘అవన్నీ పర్సనల్.. పర్సనల్.. చెప్పను. అలాగని దాచడానికీ ఏం లేదు..’’ అనేసింది సోనమ్. సోనమ్ తండ్రి అనిల్ కపూర్ కూడా.. ‘‘అది వాళ్ల పర్సనల్..’’ అనేశాడు. వీళ్లు చెప్పకున్నా అభిమానులు మాట్లాడుకోకుండా ఉండరుగా!! -
రైట్ రైట్... మహాభారతం
కౌరవులు, పాండవులు, ధర్మరాజు ధర్మాలు, దుర్యోధనుడి దురాగతాలు, శకుని కుట్రలు, కృష్ణుడి మాయలు, కర్ణుడి దానగుణం, అర్జునుడి పరాక్రమం, కురుక్షేత్ర రణరంగం... ‘మహాభారతం’ గురించి చెబుతున్నామన్న విషయం గ్రహించే ఉంటారు. సోనమ్ కపూర్‌కి ‘మహాభారతం’ అంటే ఇష్టం. అందుకే మహాభారతాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించాలనుకున్నారు. ‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా సింగపూర్ బేస్డ్ రైటర్ కృష్ణ ఉదయశంకర్ ఓ నవల రాశారు. ఇందులో ‘గోవిందా, కౌరవ, కురుక్షేత్ర’ అనే త్రీ పార్ట్స్ ఉన్నాయి. ఇందులోని ఫస్ట్ పార్ట్ ‘గోవిందా’ రైట్స్‌ను సోనమ్ కపూర్ కొన్నారు. ‘‘నేను ఏ క్యారెక్టర్ చేయబోతున్నానన్నది ప్రజెంట్ సస్పెన్స్. మహాభారతం గొప్ప పురాణ చరిత్ర’’ అని పేర్కొన్నారు సోనమ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. సోనమ్ ఇది వరకే అనూజా చౌహాన్ రాసిన ‘బాటిల్ ఫర్ బిట్టోర’, ‘జోయా ఫ్యాక్టర్’ బుక్స్ ఆధారంగా సినిమాలు చేయాలనుకున్నారు. మరి..‘మహాభారతం’ పట్టాలెక్కేదెప్పుడు? ఈ బుక్స్ బేస్డ్ మూవీస్ ప్రారంభమయ్యేది ఎప్పుడు? -
ఒకే తెరపై ముగ్గురు ముద్దుగుమ్మలు
ముంబయి: ఒకే సినిమాలో తెరపై ముగ్గురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఏక్తా కపూర్, రేఖ కపూర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన 'వీరే ది వెడ్డింగ్' అనే చిత్రంలో వీరంతా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నటి సోనమ్ కపూర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. 'వీరే ది వెడ్డింగ్ అనేది నా తదుపరి చిత్రం. రేఖా కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, షికా తాల్సానియా, ఏక్తా కపూర్ ఈ చిత్రంతో గతంలోని సరిహద్దులు చెరిపేయనున్నారు' అంటూ సోనమ్ ట్వీట్ చేసింది. సోనమ్, కరీనా కలిసి నటించడం ఇదే తొలిసారి. రాంజానా, ప్రేమ్ రతన్ ధన్ పాయే చిత్రంలో ఇప్పటికే స్వర భాస్కర్‌తో సోనమ్ నటించింది. -
రియల్ స్టోరీపై సోనమ్ కపూర్ ఆశలు
-
దుస్తులు లేకపోతేనే సౌఖ్యమట!
అహ్మదాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సినిమాలకు, నిజజీవితానికి ఓ దగ్గరి లంకె ఉంది. సల్మాన్ వెండితెర మీద చొక్కా విప్పి.. కనిపించగానే అభిమానులు వెర్రెత్తిపోతారు. అభిమానుల విజిల్స్‌తో, ఆనందంతో థియేటర్లు ఊగిపోతాయి. అదేవిధంగా నిజజీవితంలోనూ ఆయన దుస్తులు వేసుకోవడం అసౌకర్యంగా భావిస్తారట. ఇంటి వద్ద తాను, తన తండ్రి సలీంఖాన్ (సినీ రచయిత) అతి పొదుపుగా దుస్తులు వేసుకుంటామని ఆయన తెలిపారు. ఖాదీ దుస్తులు ధరించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌డీసీఐ) అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సల్మాన్ పాల్గొన్నారు. 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో'లో సల్మాన్‌తో జోడీకట్టిన సోనం కపూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ 'దుస్తులు అంటే నాకు చాలా చికాకు. దుస్తులు వేసుకోవాలంటేనే నాకు ఏదో అయిపోతుంది. కావాల్సిందంటే మీరే ఒకరోజు మా ఇంటికి వచ్చి చూడండి. నేనే కాదు మా నాన్న కూడా అతి తక్కువ దుస్తుల్లో ఉంటాం. ప్యాంటు, బనియన్ లేదా కొన్ని సందర్భాలు చొక్కా తొడగకుండా ఛాతిని అలా ఉత్తిని వదిలేస్తాం' అని తెలిపారు. ఇక సల్మాన్ నటించిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' సినిమా తెలుగులో 'ప్రేమలీల'గా డబ్ కానుంది.