
సోనమ్ కపూర్
చేసే పని కలసి రావాలని కొందరు రకరకాల నమ్మకాలను అనుసరిస్తుంటారు. ‘నేనుంటే ఇంకేదీ అవసరం లేదు. నేను అదృష్టాన్ని’ అంటున్నారు సోనమ్ కపూర్. దుల్కర్ సల్మాన్, సోనమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జోయా ఫ్యాక్టర్’. అభిషేక్ శర్మ దర్శకుడు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగుతుంది. దుల్కర్ క్రికెటర్ పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల టీమ్‌కు లక్కీ చార్మ్‌గా సోనమ్ కనిపిస్తారట. సోనమ్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ‘‘జోయా సోలంకీ ఉండగా నిమ్మకాయలు, మిరపకాయలు ఎవరికి కావాలి? ఇండియాకి లక్కీ చార్మ్ నేను. మ్యాచ్‌లు గెలిపిస్తాను’’ అని తన ఫస్ట్‌లుక్ ఫొటోకి క్యాప్షన్ చేశారు సోనమ్. ‘జోయా ఫ్యాక్టర్’ సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment