Dulkar Salman
-
'లక్కీ భాస్కర్' ఎఫెక్ట్.. మరోసారి ఆ తప్పు చేయను: మీనాక్షి చౌదరి
తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటి మీనాక్షిచౌదరి. ఇటీవల ఆమెకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా తమిళంలో విజయ్‌ఆంటోనీకి జంటగా 'కొలై' చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నటుడు ఆర్జే బాలాజి సరసన నటించిన 'సెలూన్' చిత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్‌కు జంటగా 'గోట్' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో మీనాక్షిచౌదరికి పెద్దగా నటించే అవకాశం లేకపోయినా భారీ చిత్రం కావడంతో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు భార్యగా, ఒక బిడ్డకు అమ్మగా ఆమె నటించి షాకిచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని కూడా అందుకుంది. దీంతో ఆమె కూడా బాగా సంతోషించింది. అయితే, ఈ సినిమాలో భార్యగా, తల్లిగా నటించడం రుచించలేదట. దీంతో ఇకపై భార్య, అమ్మ పాత్రల్లో నటించరాదని నిర్ణయం తీసుకున్నారట. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు భార్యగా నటించినందుకు తనకు ప్రశంసలు లభించినా కొందరు స్నేహితులు తనను భయపెడుతున్నారని చెప్పారు. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలా భార్యగా, తల్లికి బిడ్డగా నటించకపోవడం చాలా మంచిదనే అభిప్రాయాన్ని తన స్నేహితులు సలహా ఇచ్చినట్లు తెలిపింది. అలాంటి పాత్రలకు ఇంకా చాలా కాలం ఉందని సూచించినట్లు పేర్కొన్నారు. అలా కాకుంటే త్వరలోనే అక్క, అమ్మ పాత్రలకు పరిమితం చేస్తారని గట్టిగానే భయపెట్టారని తెలిపింది. దీంతో ఇకపై తాను హీరోకు భార్యగా, బిడ్డకు తల్లిగా నటించే పాత్రలను అంగీకరించరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా యాక్షన్‌తో కూడిన కమర్షియల్ కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాట్లు మీనాక్షిచౌదరి చెప్పారు.లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి చౌదరి నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఒక భార్యగా మాత్రమే కాకుండా తల్లిగా నటించడంలో తనదైన మార్క్ చూపింది. ఈ సినిమా తన కెరీర్లో బెస్ట్ చిత్రంగా ఉండనుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్లకు పైగానే రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
పుట్టినరోజు విషెస్.. 'సీతారామం' హీరో భార్యని చూశారా? (ఫొటోలు)
-
కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్.. ఎవరెవరు ఎంత..?
కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.సౌత్ ఇండియా స్టార్ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు కేరళ మంత్రి పి రాజీవ్‌కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్ ప్యాడ్‌పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
'కల్కి'లో మరో ఇద్దరు తెలుగు హీరోలు..
పాన్ ఇండియా హీరో ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). దీని కోసం ప్రభాస్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అందుకే దీనికి సంబంధించిన చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరలవుతోంది. గతేడాది వచ్చిన సలార్ చిత్రం విజయంతో మంచి జోష్‌లో ఉన్న ప్రభాస్ మార్కెట్ కల్కి సినిమాతో మరోస్థాయికి చేరుకోవడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ స్టార్స్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల హాసన్, దీపిక పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరందరితో పాటుగా క్యామియో రోల్స్‌లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా కల్కి చిత్రంలో కనిపించనున్నారని గతంలో భారీగానే ప్రచారం జరిగింది. 'కింగ్ ఆఫ్ కోథా' సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ కల్కి గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఆ సినిమా సెట్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయిని చెప్పిన ఆయన కల్కిలో భాగం అవుతున్నారా అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఆయన మాటలను బట్టి కల్కిలో దుల్కర్ నటిస్తున్నారనే ప్రచారం మాత్రం గట్టిగానే జరిగింది. కల్కి సినిమా ఎండింగ్లో వచ్చే కీలకమైన సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్, నాని కూడా కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. కల్కి చిత్రంలో కృపాచార్యగా నాని కనిపిస్తే పరశురాముడిగా ఎన్టీఆర్ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘కల్కి’లో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. అలాంటిది నాని, తారక్ పేర్లు తెరపైకి రావడంతో సినిమా మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం భారీగా ప్రచారం జరుగుతుంది. మే 9న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కీ ఈ తేదీతో ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. 'కల్కి 2898 ఎ.డి' చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. -
నాకు సోదరి కూడా ఉందంటూ ఫోటో షేర్ చేసిన దుల్కర్
సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్లో జెండా పాతిన హీరోల్లో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. సీతారామం, చుప్,కింగ్ ఆఫ్ కొత్త లాంటి సినిమాల ద్వారా ఇటు మలయాళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో తన అక్క సురుమి తీసినట్లు ఆయన తెలిపాడు. మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్.. తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొడుతున్నాడు. కానీ ఆయన సోదరి సురుమి మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె చాలా పెయింటింగ్స్ వేయడం జరిగింది. దుల్కర్, సురుమి ఇద్దరూ కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు. తన సోదరి సురుమి తీసిన ఫోటోను దుల్కర్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో దుల్కర్‌తో ఉన్న వ్యక్తి సురుమి భర్త డా. ముహమ్మద్ రేహాన్ షాహిద్ అని అభిమానులు గుర్తించారు. ఆ ఫోటోకు క్యాండిడ్ క్యాప్చర్ అనే టైటిల్‌ను ఆయన చేర్చాడు. మై వన్ అండ్ ఓన్లీ, సిబ్లింగ్ క్లిక్, బెస్ట్, క్యాండిడ్ ఫోటోలు, స్పెషల్ సమ్మిట్, క్లీనింగ్ అప్, బిజినెస్మెన్ అనే ట్యాగ్‌లతో దుల్కర్ చిత్రాన్ని పంచుకున్నాడు. సోదరి తీసిన ఆ ఫోటో అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. బావ బావమరుదుల ముఖాలు కూడా స్పష్టంగా ఉండేలా ఫోటో షేర్ చేసి ఉంటే బాగుండని వ్యాఖ్యానిస్తున్నారు. దుల్కర్ తన బావతో కలిసి ఫార్మల్ డ్రెస్‌లో స్టైలిష్ స్మైల్‌తో ఫోటోలో కనిపించాడు. 'నాకు ఒక సోదరి ఉంది.. ఆమె నేరుగా నిలబడి ఫోటోకు ఎలా పోజులివ్వాలో కూడా ఆమెకు తెలియదు. దుల్కర్ తరచుగా తండ్రి, సోదరి మోడల్‌గా పోజులిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఒక సినిమాలో భాగంగా దుల్కర్‌తో మమ్ముట్టి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ సినిమాకు సురుమి మాత్రమే ఎందుకు రాలేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. వాటికి స్వయంగా సురుమినే సమాధానమిచ్చింది. తనకు సినిమాలంటే ఇష్టమని, అయితే కెమెరా ముందుకు రాలేనని, తెరపై సోదరుడిలా కనిపించడం తనకు ఇష్టం లేదని సురుమి తెలిపింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సురుమి పెయింటింగ్ అక్కడి ఎగ్జిబిషన్లో పాపులర్ అయింది. తొమ్మిదో తరగతి నుంచి చిత్రలేఖనంపై ఆమెకు పట్టు ఉంది. సురుమికి ఇద్దరు కుమారులు. బెంగుళూరులో తన భర్త ముహమ్మద్ రేహాన్ షాహిద్‌తో సురుమి ఉంది. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
మమ్ముట్టికి మైల్స్టోన్ చిత్రంగా 'కన్నూర్ స్క్వాడ్'.. కథ ఏంటంటే?
శాండిల్‌వుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా విడుదల చేసిన 'కన్నూర్ స్క్వాడ్' 100 కోట్ల క్లబ్లో చేరింది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మమ్ముట్టి నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా మమ్ముట్టి సంస్థ షేర్ చేసింది. 100 కోట్ల క్లబ్లో చేరిన మమ్ముట్టికి ‘కన్నూర్ స్క్వాడ్’ నాలుగో చిత్రం. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) గతంలో 'భీష్మ పర్వం', 'మధురరాజా', 'మామాంగమ్' చిత్రాలు కూడా మమ్ముట్టి 100 కోట్ల క్లబ్లో చేరిన మలయాళ సినిమాలు. ‘కన్నూర్ స్క్వాడ్’ చిత్రం విడుదలైన రోజు నుంచి థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికీ కూడా వీకెండ్లో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. 'కన్నూర్ స్క్వాడ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరి మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. 'కన్నూర్ స్క్వాడ్' కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమా విజయాన్ని అభినందించారు. ‘కన్నూర్ స్క్వాడ్’ చూనిట్ సభ్యులందరికీ సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంపై చూపిన అంతులేని ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. కథ ఏంటి..? కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆదారాలు లేని ఈ క్రైమ్‌ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్‌పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకుతెస్తుంది. -
మ్యాడ్ బ్లాక్‌బస్టర్ అవుతుంది
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయం అవుతూ, సాయి సౌజన్య సహ–నిర్మాతగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఓ ముఖ్య అతిథిగా హాజరైన దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ ట్రైలర్ నిజంగానే మ్యాడ్‌గా, చాలా ఫన్నీగా ఉంది. నటీనటులు ఎవరూ కొత్తవాళ్లలా లేరు. ‘మ్యాడ్’ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. మరో అతిథి సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ స్టోరీ లైన్ నాకు తెలుసు. సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘గుంటూరు కారం’ సెట్స్‌లో ‘మ్యాడ్’ ప్రస్తావన విన్నాను. ‘మ్యాడ్’ చిత్రం ‘మ్యాడ్’గా ఉంటుందట’’ అన్నారు శ్రీ లీల. ‘నా ఫ్రెండ్ అనుదీప్ లేక΄ోతే నేను లేను’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
మీనాక్షి చౌదరినే కావాలని పట్టుబట్టిన త్రివిక్రమ్ భార్య
త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అతను ఇటీవల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. సినిమాకు సంబంధించిన పలు పనుల్లో అతని భార్య సాయి సౌజన్య కూడా చురుకుగా పాల్గొంటున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో కూడా సౌజన్య పాల్గొంటోంది. ఇప్పుడు, ఆమె సితార ఎంటర్టైన్మెంట్తో కలిసి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ని నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: రవితేజ, విజయ్ దేవరకొండ ఎవరైతే ఏంటి.. శ్రీలీల పరిస్థితి ఇదీ!) అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని టీమ్ ఎంపిక చేసింది. మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం కోసం త్రివిక్రమ్ కాంపౌండ్‌లోకి ప్రవేశించింది. ఆమె ఈ చిత్రంలో ద్వితీయ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ధనుష్ తొలి తెలుగు స్ట్రైట్ మూవీ అయిన 'సార్'ను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పుడు దుల్కర్ సినిమాను కూడా ఆయన తెరకెక్కించనున్నారు. లక్కీ భాస్కర్లో దుల్కర్‌కు సరిజోడిగా మీనాక్షి అయితే బాగుంటుందని సౌజన్య పట్టుబట్టి మరీ తీసుకున్నారట. ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోందని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సతీమణి సౌజన్యతో మీనాక్షి చౌదరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, కనులు కనులు దోచాయంటే, సీతారామం వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి కాబట్టే ఆయన సినిమాలపై తెలుగు వారు కూడా ఆ వైపు ఓ కన్నేస్తుంటారు. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న కింగ్ ఆఫ్ కొత్త (కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం) సినిమా విడుదలైంది. ఇదీ చదవండి నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్‌హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 22 విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పటి వరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ సినిమా డిస్నీప్లస్‌హాట్ స్టార్‌లో రేపు సెప్టెంబర్ 22 విడుదల కావడం లేదు. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు అనుబంధంగా ఉన్న వర్గాలు తెలుపుతున్న ప్రకారం సెప్టెంబర్ 28 లేదా 29న ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అభిలాష్ జోషీ దర్శకత్వంలో దుల్కర్ నటించిన ఈ మూవీ ఓ మోస్తారుగా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇదులో యాక్షన్ సీన్స్ అందరినీ కట్టిపడేస్తాయి. గ్యాంగస్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింగా. గురు సినిమా ఫేమ్ రితికా సింగ్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. -
సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ
సౌత్ ఇండియా స్టార్ హీరో 'సూర్య' ఇప్పుడు తన పాన్ ఇండియా చిత్రం 'కంగువ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇందులో అతను గిరిజన లెజెండ్‌గా నటిస్తున్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్‌తో మళ్లీ జతకట్టనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)లో కలిసి పనిచేశారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) 'సూర్య 43' ప్రాజెక్ట్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా సూర్య 43 లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్‌లో ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్‌తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమచారం. అలాగే, సూర్య 43లో విలన్‌గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ వర్మ డార్లింగ్స్ వంటి పలు చిత్రాలలో తన నటనతో విశ్వసనీయ నటుడిగా స్థిరపడ్డాడు, దహాద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ 2 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు ఉంది. దీంతో దర్శకులు,నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సుధా కొంగర ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా సూరరై పొట్రు హిందీ రీమేక్‌ని పూర్తి చేసే దశలో ఉంది. అది పూర్తి అయిన వెంటనే సూర్య 43 ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్తుందని సమచారం. -
ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతోమంది మనసు దోచేసిన కస్తూరి.. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తోంది. తాజాగా నటుడు దుల్కర్ సల్మాన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే తన లైఫ్‌లో కూడా చోటుచేసుకుందని ఓ ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కస్తూరి ఎమోషనల్ అయింది. దుల్కర్ సల్మాన్‌ను అసభ్యంగా టచ్ చేసిన మహిళ గతంలో ఓ అభిమాని ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని నటుడు దుల్కర్ సల్మాన్ ఓపెన్‌గానే తెలిపారు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ప్రమోషన్స్ సమయంలో చెప్పారు. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ తన బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయానని దుల్కర్ చెప్పాడు. గతంలో ఒక పెద్దావిడ వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానని ఆమె తనను అభ్యంతరకరంగా తాకడంతో ఎంతో బాధనిపించిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. టచ్ చేసి అక్కా సారీ.. సారీ అంటే ఎలా ఇలాంటి ఘటనే సీనియర్ నటి కస్తూరి జీవితంలో జరిగిందని తెలిపింది. కోలీవుడ్‌లో స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్లో తనపై లైంగిక దాడి జరిగిందని ఇలా చెప్పుకొచ్చింది. ‘‘ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఒక ఈవెంట్‌ను ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా భారీగా జనం తరలివచ్చారు. ఎవరో నన్ను వెనుక నుంచి నొక్కుతున్నట్లు అనిపించింది. ఇది జరిగినప్పుడు మా నాన్న నాతోనే ఉన్నారు. నేను వెంటనే అతని చెయి పట్టుకుని నా ముందుకు లాగాను. దీంతో వాడు ఆ సమయంలో విపరీతంగా ఏడ్చాడు.. అక్కా సారీ.. సారీ అంటూ గట్టిగా ఏడవడం మెదలుపెట్టాడు. ఇలాంటి చెత్త పనులు చేసి అక్కా అని వేడుకోవడం ఎందుకు' అని నటి కస్తూరి చెప్పింది. కామెంట్ బాక్స్‌లోకి వచ్చి ఇలాంటి కామెంట్లు ఇలాంటి వారి వల్ల ఇండస్ట్రీలో చాలమంది నటీమణులు ఇబ్బందులకు గురైన వారున్నారు. ఇలాంటి ఘటనలపై కొందరు నటీనటులు బహిరంగంగానే ఇప్పుడు చెబుతున్నారని కస్తూరి తెలిపింది. అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కొందరు తమపై సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేస్తూ సైబర్ దాడులకు దిగుతుంటారని పేర్కొంది. సోషల్ మీడియాలో చాలామంది తమ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి గురవుతున్నారు. తమ కోపాన్ని ఎక్కడ బయట పెట్టాలో తెలియడం లేదు. అందుకే కామెంట్ బాక్స్‌లోకి వచ్చి ఇలా రచ్చ సృష్టిస్తున్నారని కస్తూరి చెప్పింది. -
‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ రివ్యూ
టైటిల్: కింగ్ ఆఫ్ కొత్త నటీనటులు: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కళ్ళరక్కల్, అనిఖా సురేంద్రన్, నైలా ఉషా, షాహుల్ హసన్, గోకుల్ సురేశ్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ దర్శకత్వం: అభిలాష్ జోషి నేపథ్య సంగీతం: జాక్స్ బిజోయ్ పాటలు : షాన్ రెహమాన్, బిజోయ్ సినిమాటోగ్రఫీ: నిమేష్ రవి విడుదల తేది: ఆగస్ట్ 24, 2023 మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. తనదైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మలయాళ హీరో అయినప్పటికీ మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. తాజాగా దుల్కర్ నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘కింగ్ ఆఫ్ కొత్త’కథేంటంటే.. ఈ మూవీ కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్‌కి చెందిన రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. అనుకున్నట్లే పెద్ద రౌడీ అయి కోతా టౌన్‌ని తన గుప్పింట్లోకి తెచ్చుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్లోనే స్నేహితుడు కన్నా(షబీర్ కళ్లరక్కల్)తో కలిసి వేరుగా ఉండేవాడు. స్వతాహా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన రాజు.. ఆ ఏరియాలో ఎక్కడ పోటీలు నిర్వహించిన తన గ్యాంగ్‌తో కలిసి పాల్గొనేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాడు. ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. దీంతో అతని గ్యాంగ్ అంతా వేరు వేరు ప్రాంతాలకు వెళ్లిపోతారు. కొన్నాళ్లకు కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్‌గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్‌ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. ఆ ఏరియా పోలీసు అధికారులు సైతం కన్నాభాయ్‌కి భయపడతారు. అయితే ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్‌ని మట్టుపెట్టిన సీఐ శావుల్(ప్రసన్న) కోతాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. కన్నాభాయ్‌కి చెక్ పెట్టేందుకై రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? పదేళ్ల పాటు రాజు ఎక్కడికి వెళ్లాడు? అక్కడ ఏం చేశాడు? కన్నాభాయ్ ఆగడాలకు రాజు ఎలా చెక్ పెట్టాడు? ప్రాణంగా ప్రేమించిన తారకు రాజు ఎందుకు దూరమయ్యాడు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్ ఆఫ్ కోతా’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. దానికి కారణం కథ, కథనం కొత్తగా ఉండడం. ‘కింగ్ ఆఫ్ కొత్త’లో అసలు కొత్తదనం అనేదే లేదు. అవే కత్తి పోట్లు.. తుపాకుల తూట్లు.. వెన్నుపోట్లు. కథ పరంగా ఎక్కడా కొత్తగా అనిపించదు కానీ కథనం మాత్రం కాస్త వెరైటీగా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు ప్రేమ, స్నేహ బంధం..ఇలా అన్ని అంశాలు ఉన్నాయి . కానీ వాటిని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఈ మూవీ కథ కోత అనే పట్టణంలో జరుగుతుంది. (కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోతా అని వాడారు ) ప్రారంభమవుతుంది. కోతా పట్టణానికి కొత్తగా వచ్చిన సీఐ శావుల్కి అక్కడి ఎస్సై టోని.. రాజు, కన్నాల ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం ప్రారంభించినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఫుట్‌బాల్ పోటీకి సంబంధించిన సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఇక తారతో రాజు ప్రేమాయణానికి సంబంధించినసన్నివేశాలు రొటీన్‌గా సాగుతుంది. రంజియ్ భాయ్ పాత్ర మాట్లేడే ఇంగ్లీష్ నవ్వులు పూయిస్తుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌లో కథ ఏమీ ఉండదు.. అలా సాగిపోతుంది అంతే. ఇక ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండాఫ్ ఎలా ఉండబోతుందనేది ఈజీగా అర్థమవుతుంది. రాజు తిరిగి కోతాకి రావడం.. కన్నాభాయ్ మనుషులపై దాడి చేయడం..ఇలా రొటీన్‌గా కథ సాగుతుంది. ఇక క్లైమాక్స్‌కి అరగంట ముందు వరుసగా ట్విస్టులు ఉంటాయి. కాని అవి బోరింగ్ అనిపిస్తాయి. ఇక సినిమా ముగుస్తుందిలే అని అనుకున్న ప్రతిసారి మరో మలుపు రావడం.. సాగదీతగా అనిపిస్తుంది. ఇక దర్శకుడిని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే.. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకోవడం. ఎవరెలా చేశారంటే.. దుల్కర్ సల్మాన్ గ్యాంగ్‌స్టర్‌గా చేయడం ఇదే తొలిసారి. అయినప్పటికీ తనదైన నటనతో గ్యాంగ్‌స్టర్ రాజు పాత్రకి న్యాయం చేశాడు. యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక దుల్కర్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర షబిర్ది. కన్నా అలియాస్ కన్నాభాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్ర తనది. ఇక గ్యాంగ్‌స్టర్ రాజు ప్రియురాలు తారాగా ఐశ్వర్య లక్ష్మీ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరో సోదరి రీతూగా అనిఖా సురేంద్రన్ తన పాత్రకు న్యాం చేసింది. సీఐ శావుల్గా ప్రసన్న, ఎసై టోనీగా గోకుల్ సురేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జేక్స్ బిజోయ్. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. బీజీఎం కారణంగా కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. నిమేష్ రవి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
దుమారం రేపిన నాని వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ఫైర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కోతా' పాన్ ఇండియా రేంజ్లో ఆగష్టు 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో తాజాగ జరిపారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. (ఇదీ చదవండి: వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి) ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్లో పాన్ ఇండియా గురించి నాని ఇలా చెప్పుకొచ్చాడు. 'మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజమైన నిర్వచనం ఇదే' అని అన్నారు నాని. దీంతో టాలీవుడ్లో ఉండే పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ అందరూ నానిపై ఫైర్ అవుతున్నారు. దుల్కర్ మంచి నటుడే... పాన్ ఇండియా రేంజ్‌ను అందుకునే అర్హత ఆయనకు ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలుపుతూనే నాని వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా హీరో అని ఎలా చెబుతావ్ నాని అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కి ఎప్పటికీ చేరుకోలేడు కాబట్టే నానికి ఆ పదం పెద్దగా నచ్చదని అంటున్నారు. (ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత) సౌత్ ఇండియా ప్రస్తుత టాప్ హీరోల్లో అందరికంటే ముందుగా బాలీవుడ్లో జెండా పాతిన ప్రభాస్.. ఆ తర్వాత రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లందరూ గల్లీ హీరోలు అనుకుంటున్నావా..? అంటూ నానిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'అసలు నాని ఎవడు.. ? ఒకరికి పాన్ ఇండియా హీరో అని గుర్తింపు ఇవ్వడానికి.. సినిమాలు చూసేది మేము. గుర్తింపు ఇవ్వాల్సింది మేము. ఇలాంటి ఆటిట్యూడ్ వ్యాఖ్యలతో పాటు కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిది.' అని వారు సలహా ఇస్తున్నారు. -
'నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు'.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లోనూ కనిపించింది. సీతారామం చిత్రంలో చాలా పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్‌లో మరింత బోల్డ్‌గా కనిపించి అందరికీ షాకిచ్చింది. (ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం తెలుగులో ఎంట్రీ ఇచ్చానని తెలిపింది. ఈ ప్రయాణంలో మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ సీతారామం మూవీ వీడియోను పంచుకుంది. సీతారామం విడుదలై ఈ రోజుకు ఏడాది పూర్తి కావడంతో మృణాల్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. తనను తెలుగు అమ్మాయిలా భావించి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మృణాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ప్రియమైన ప్రేక్షకులారా.. ఇది నా మొదటి తెలుగు సినిమా. మీరందరూ నాపై కురిపించిన ప్రేమ.. నా కలలకు మించిపోయింది. మీరు నన్ను మీ తెలుగు అమ్మాయిలా అంగీకరించారు. ఈ అందమైన ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో మరిన్నీ విభిన్నమైన పాత్రలతో మిమ్మల్ని అలరిస్తానని మాట ఇస్తున్నా. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. సీత ఉత్తమ వెర్షన్‌ని తీసుకురావడంలో నాకు సహాయం చేసినందుకు హను రాఘవపూడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మొత్తం అనుభవాన్ని ఎంత చిరస్మరణీయం చేసినందుకు దుల్కర్ సల్మాన్‌కు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఎప్పటికీ మా సీత నువ్వే కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న 'రసవతి'..!) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!
సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్ కిల్లర్ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్ కిల్లర్‌గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్ సల్మాన్ నటించారు.వచ్చే వారమే ‘చుప్’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్! అన్నట్టు నాడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్‌కు ఈ సినిమా నివాళి. బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్ఫ్లూయెన్స్ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు. బాల్కి అంటే ‘చీనీ కమ్’, ‘పా’, ‘పాడ్మేన్’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్’ సినిమా తీశాడు. సెప్టెంబర్ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్ వంటి సీనియర్లు, దుల్కర్ సల్మాన్ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్ థ్రిల్లర్’. ‘రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్లో సీరియల్ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్. సన్ని డియోల్ మాత్రం పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు. పూజా భట్ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్‌ను చంపుతున్న సీరియల్ కిల్లర్ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట. ఊరికే ఉండాలా? సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా? మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్‌కి ఒక రివ్యూయర్ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్ కిల్లర్ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్ కిల్లర్ బయలుదేరుతాడన్నమాట. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి. గురుదత్ బాధకు జవాబు దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్‌కు అభిమాని కావచ్చు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్ చిత్రం. అంతే కాదు గురుదత్ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం. కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్ కే ఫూల్’ క్లాసిక్‌గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్‌గా ఉంది. బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్ కే ఫూల్ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్‌కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్’ తీశాడు. గురుదత్ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు. -
దుల్కర్‌తో ప్రతి ఏడాది ఒక మూవీ తీద్దామని చెప్పా: అశ్వినీదత్
మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ సల్మాన్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను’అని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది. ►ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ► ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, చిరంజీవితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం ఉండేది. ఇద్దరు పిల్లలు చదువుపూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను రాఘవపూడి ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్ లో తీశారు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు. సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది. ► సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను చాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ వుంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు. ► హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టు ఉంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్ ఇందులో విజువల్ ఫీస్ట్ గా ఉంటాయి. ► మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ ఉండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు. సుమంత్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ► ఈ సినిమా సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు ఉంటుంది. సినిమా ఫాస్ట్‌గా ఉంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఏకకాలంలో విడుదలవుతుంది. ► ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో ఉన్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలవుతుంది. -
అలా అయితే మంచి పాట వస్తుంది : విశాల్ చంద్రశేఖర్
‘‘నేను ఏ సినిమా చేసినా ఆ కథ వినను.. స్క్రిప్ట్ పూర్తిగా చదువుతాను. అప్పుడే ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో ఓ అవగాహన వస్తుంది. మంచి సంగీతం కుదరాలంటే కథ మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి. అప్పుడే మంచి పాట వస్తుంది. అలా మ్యూజిక్‌ని డిమాండ్ చేసిన కథ ‘సీతారామం’. ఈ చిత్రకథ ఇచ్చిన స్ఫూర్తితో అద్భుతమైన సంగీతం ఇచ్చాను’’ అని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘రంజిత్ బారోట్ అనే సంగీత దర్శకుడు నాకు స్ఫూర్తి. తమిళ్లో ప్రభుదేవా హీరోగా ‘వీఐపీ’ అనే సినిమాతో పాటు మరో చిత్రానికి సంగీతం అందించారాయన. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్‌గారి ట్రూప్‌లో మెయిన్ డ్రమ్మర్. హను రాఘవపూడిగారితో ‘పడిపడి లేచే మనసు’ సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం బాగుంటుంది. ‘సీతారామం’ వంటి చాలా గొప్ప కథ రాశారు. ఈ చిత్రంలో 9 పాటలు ఉన్నాయి. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్... ఇలా విదేశీ వాయిద్యకారులతో పాటు దాదాపు 140మంది మ్యుజీయన్స్ కలిసి నేపథ్య సంగీతం కోసం పని చేశారు. ఈ సినిమాలోని ‘కానున్న కల్యాణం..’ పాటని ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు రాశారు. ఈ పాట కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ్.. ఇలా అన్ని భాషల్లోని అలంకారాల గురించి నాకు వివరించారు. పాటల రచయితలు కేకేగారు, అనంత్ శ్రీరామ్‌లతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలోని పాటలని డబ్బింగ్‌లా కాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆ నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్‌గా చేశాం. మెలోడీ పాటలు నా బలం. నా తర్వాతి సినిమా మాధవన్‌గారితో ఉంటుంది.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
సినిమా కలకాలం నిలుస్తుంది – రమేశ్ ప్రసాద్
‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత ఎల్వీ ప్రసాద్) మూకీ సినిమా అప్పటినుంచి సినిమాల్లో భాగమయ్యారు. ఆ విధంగా మా ప్రసాద్స్ సంస్థకి సినిమాతో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ కరోనా కాలంలో సినిమా గడ్డు పరిస్థితి ఎదుర్కొనడం చూశాం. ప్రేక్షకుల ప్రేమతో ఇండస్ట్రీ ఈ కష్టకాలాన్ని అధిగమించింది. సినిమా కలకాలం నిలుస్తుంది. ‘సీతారామం’ టీమ్‌కి శుభాకాంక్షలు’’ అని ప్రసాద్స్ గ్రూప్ అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రలు చేశారు. 1965, 80 నేపథ్యంలో సాగే ప్రేమకథగా హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సోమవారం జరిగిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేశ్ ప్రసాద్ అతిథిగా పాల్గొన్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ – ‘‘అందరూ నన్ను రొమాంటిక్ హీరో అంటుంటే విసుగొచ్చి ఇక ప్రేమకథలు చేయకూడదనుకున్నాను. హనుగారు చెప్పిన ‘సీతారామం’ అద్భుతమైన ప్రేమకథ. క్లాసిక్ ఎపిక్ లవ్ స్టోరీ కాబట్టి చేశాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను చేసిన అఫ్రిన్ పాత్ర రెబల్. నా పాత్ర పై ఆడియన్స్‌కి కోపం వచ్చినా ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్‌తో కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘ఈ చిత్రంలో మ్యాజికల్ రొమాన్స్ వుంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. సుమంత్, హను రాఘవపూడి మాట్లాడారు. -
ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా : హను రాఘవపూడి
‘నాకు పాత పుస్తకాలు కొనుక్కోనే అలవాటు ఉంది. అలా ఒక్కసారి కోఠిలో కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఒక అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. అతను దాన్ని కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా . ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా’ అని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు లో హను రాఘవపూడి మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేయడానికి కారణం? మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్ అని రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. అయితే ఈ గ్యాప్ లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానాతో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు. లై, పడి పడి లేచే మనసు ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. అయితే నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ అలోచించలేదు. సీతారామంపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఈ అంచనాలని అధిగమిస్తుందా ? ఖచ్చితంగా అధిగమిస్తుంది. సీతారామం చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యురీయాసిటీ. సీతారామం థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత సీతారామం అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. సీతారామం కథకు ప్రేరణ? నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు ఉంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపింగదచింది. ఆ అలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్. తెలుగులో ఇంత మంది ఉండగ దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ? కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో ఉన్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖర్ ని తీసుకోవడానికి కారణం ? విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి ఉంది.ఇందులో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సీతారామం పాటలకు వృధ్యాప్యం రానేరాదు. పదేళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకుడిగా ఏం నేర్చుకున్నారు ? పదేళ్ళుగా నేర్చుకున్నది రేపటికి మారిపోవచ్చు. ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే. 'సీతారామం' 1964 నేపధ్యంలోనే సినిమా నడుస్తుందా ? ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి నడుస్తూ ఉంటుంది. రష్మిక మందన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది ? రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే. 'యుద్ధంతో రాసిన ప్రేమ' కథ ఏమిటి ? బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. 'యుద్ధంతో రాసిన ప్రేమ' ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది. ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో ఉంటుంది. వైజయంతి మూవీస్ లో పని చేయడం ఎలా అనిపించింది ? వైజయంతి మూవీస్ లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కాగితం మీద ఉన్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత ఉండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు. సీతారామం షూటింగ్ ప్రాసస్ లో ఎలాంటి సవాల్ ఎదురయ్యాయి ? ప్రకృతి ప్రాధాన సవాల్. కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో మైనస్ డిగ్రీలలో షూట్ చేశాం. ఇది కొంచెం టఫ్ జాబ్. మిగతావి పెద్ద కష్టపడింది లేదు. మీ సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన సినిమాలు ఏవి ? సీతారామం, అందాల రాక్షసి. ఈ రెండు నా మనసు దగ్గరగా వున్న చిత్రాలు. మీ లైఫ్ లో ప్రేమ కథ ఉందా ? లేదండీ. మన జీవితంలో ఏది ఉండదో అదే కోరుకుంటాం. అందుకే లవ్ స్టోరీస్ చేస్తున్నా (నవ్వుతూ) కొత్తగా చేయబోతున్న సినిమాలు ? బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్ తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్ తో ఒక వెబ్ సిరిస్ ప్లాన్ వుంది. -
సింగర్‌గా ఎందుకు అవకాశాలు రాలేదో తెలియదు: ఎస్పీ చరణ్
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లపైనే అవుతోంది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఒకేలా పాడాను. అయితే కొందరు నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) వాయిస్‌లా నా వాయిస్ ఉందన్నారు. నాకు వచ్చే పాటలను నా శక్తి మేరకు బాగా పాడాలని ప్రయత్నం చేస్తాను’’ అన్నారు గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత ఎస్పీ చరణ్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ జంటగా సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఓ సీత..’, ‘ఇంతందం..’ పాటలను ఎస్పీ చరణ్ పాడారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ చెప్పిన విశేషాలు.... ► హీరో దుల్కర్ సల్మాన్‌కు నేను పాడటం ఇదే తొలిసారి. ‘సీతా రామం’ చిత్రంలో ‘ఓ సీత’, ‘ఇంతందం..’ పాటలను పాడటం చాలా సంతోషంగా ఉంది. చిరకాలం నిలిచిపోయే పాటలివి. ‘ఓ సీత..’ పాటకు అనంత శ్రీరామ్, ‘ఇంతందం..’ పాటకు కేకే (కృష్ణకాంత్) మంచి సాహిత్యం అందించారు. మెలోడిపై మంచి పట్టు ఉన్న సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ►ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా పాటలు పాడిన నేను ఆ తర్వాత ఇదే స్పీడ్‌ను ఎందుకు కొనసాగించలేకపోయానన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి, ఆర్పీ పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా అందరి సినిమాల్లో నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి... జనాదరణ పొందాయి. అయితే ఆ తర్వాత ఓ సింగర్‌గా నాకు ఎందుకు అవకాశాలు కుదర్లేదో అయి తే తెలియదు. నిర్మాణ రంగంలో బిజీగా ఉండటం వల్ల నేను పాట పాడలేననే మాట ఎప్పుడూ చెప్పలేదు. రికార్డింగ్‌కు ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారీ నేను అందుబాటులోనే ఉన్నాను. ► సంగీతంలో వచ్చిన మార్పులను గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కాను నేను. పాట పట్ల నా అప్రోచ్ అయితే మారలేదు. కొత్త సంగీత దర్శకులు కూడా మంచి పరిజ్ఞానంతో ఉన్నారు. దర్శక–నిర్మాతలు కూడా కొత్త సంగీత దర్శకులు, సింగర్స్‌ను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నాన్నగారు చేసిన టీవీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్న సింగర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. భవిష్యత్‌లో ప్రతిభ గల సింగర్స్ మరింతమంది వస్తారని ఆశిస్తున్నాను. ► తమిళంలో ఓ సినిమాకి ప్రొడక్షన్ చేస్తున్నాను. సంగీత దర్శకత్వంపై దృష్టి పెట్టే ఆలోచన నాకు ఇప్పట్లో లేదు. -
ఓటీటీలకు తారల గ్రీన్ సిగ్నల్.. ఏకధాటిగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు
Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్డౌన్లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్ సైతం ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్‌కు చాలా మంది యాక్టర్స్ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్ తారలు యాక్టర్స్ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 1’ వెబ్ సిరీస్‌కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్ తారలు ఈ డైరెక్టర్స్‌తో వెబ్‌సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్ కపూర్‌తో రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే వెబ్ సిరీస్ చేశారు. రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి ఇతర లీడ్ రోల్స్ చేశారు. షాహిద్‌కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. ఇకపోతే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే (ఏప్రిల్ 24) సందర్భంగా రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్ చేసి ‘యాక్షన్ ప్యాక్డ్ ఇయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వరుణ్ డిజిటల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్ టాక్. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లోనే దుల్కర్ సల్మాన్ కూడా డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్‌లో దుల్కర్‌తోపాటు రాజ్‌కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారు సిద్ధార్థ్. రోహిత్ శెట్టి డైరెక్షన్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్‌సిరీస్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్ పాపులర్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ఓటీటీ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. ఇందులో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ప్రాజెక్ట్‌లో హృతిక్ రోషన్ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్‌గా ఆదిత్యారాయ్ కపూర్ రంగంలోకి దిగారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు ఆలియా భట్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ ఫిల్మ్‌లో ఇంగ్లీష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ది ఫాలెన్’గా వస్తున్న ఈ వెబ్ ఫిల్మ్‌కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్‌లో సోనాక్షి పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్‌తోనే కెరీర్‌ను స్టార్ట్ చేసే సాహసం చేశారు స్టార్ కిడ్స్ అగస్త్య నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్‌ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్ (షారుక్‌ఖాన్ కుమార్తె). ‘ది ఆర్చీస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ ఫిల్మ్‌కు జోయా అక్తర్ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్ మొదలైంది. బాలీవుడ్‌లోని మరికొంతమంది యాక్టర్స్ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్ టాక్. ఇక.. కొందరు సీనియర్ యాక్టర్స్‌లో అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్ దేవగన్ వంటి సీనియర్స్ డిజిటల్ వ్యూయర్స్ ముందుకు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్‌లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్‌హుడ్’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్ గేమ్’తో మాధురీ దీక్షిత్ ఇప్పటికే డిజిటల్లోకి వచ్చేశారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్ (సుజోయ్ ఘోష్ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్ ద ఎక్స్‌ప్రెస్’తో (మహిళా క్రికెటర్ జూలన్ గోస్వామి బయోపిక్) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్ వ్యూయర్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
దుల్కర్ సల్మాన్, రష్మికల కొత్త చిత్రం టైటిల్ ఇదే
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని వెల్లడిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి ‘సీతారామం’అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. రష్మిక పాత్రలో హనుమాన్ షేడ్స్ ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడికి ఆంజనేయుడు సహాయం చేసినట్లుగా.. యుద్దంలో మద్రాస్ ఆర్మీ ఆఫసర్ లెఫ్ట్‌నెంట్ రామ్( ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ పాత్ర పేరు)కు రష్మిక సహాయం చేస్తుంది. ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్దం అఫ్రీన్.. ఈ యుద్దంలో సీతారాములను నువ్వే గెలిపించాలి’అనే సుమంత్ వాయిస్ ఓవర్ ప్రారంభమైన ఈ స్పెషల్ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. -
రష్మిక బర్త్‌డే: దుల్కర్ సల్మాన్‌తో జతకట్టిన రష్మిక, ఫస్ట్‌లుక్ అవుట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నేటితో(ఏప్రిల్ 5) 26వ వసంతంలోకి అడుగు పెడుతుంది. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఆమె ‘పుష్ప 2’తో పాటు హిందీలో అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే రణ్‌బీర్ కపూర్-సందీప్ వంగ దర్శకత్వంలో వస్తున్న ఏనిమల్ వరల్డ్ చిత్రంలో హీరోయిన్ చాన్స్ కొట్టెసింది. ఇప్పుడు తాజాగా ఆమె మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జతకట్టబోతోంది. ఈ రోజు ఆమె బర్త్‌డే సందర్భంగా ఈ మూవీలోని తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఆమె పాత్ర పేరు కూడా ప్రకటించారు. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రొమాంటిగ్ లవ్ స్టోరీ తెరకెక్కినున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో ఆమె అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. (చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై అక్షయ్ భార్య సంచలన వ్యాఖ్యలు) -
ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే..
ఈ మధ్య ఎన్ఎఫ్టీ (NFT) పదాన్ని తరచుగా వింటున్నాం. పలు సెలబ్రిటీలు ఈ డిజిటల్ కరెన్సీని వాడటంతో భారతదేశంలో ఎన్ఎఫ్టీకి క్రేజ్ పెరిగింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సన్ని లియోన్ ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టడంతో వాటికి మరింత డిమాండ్ పెరిగింది. ఎన్ఎఫ్టీ అంటే నాన్ పంగీబుల్ టోకెన్స్. ఇవీ ఒక రకమైన డిజిటల్ ఆస్తులు. బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఓనర్షిప్ ఇస్తారు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలు, ఇతర సేకరణలను ఎన్ఎఫ్టీలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్లే మరెవ్వరూ దీనిపై ఓనర్షిప్ క్లైమ్ చేసుకోలేరు. అలా చేయాలంటే వాటిని కొనుగోలు చేయాల్సిందే. వీటిని సేకరణ కర్తలు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సెకండరీ మార్కె్ట్లో విక్రయించుకోవచ్చు. ఎన్ఎఫ్టీలను ప్రత్యేకంగా తయారు చేయాలా? కొద్ది మందికే విక్రయించాలా అన్నది క్రియేటర్ ఇష్టం. అయితే ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన టాప్ ఇండియన్ సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. 1. అమితాబ్ బచ్చన్ బియాండ్‌లైఫ్.క్లబ్‌తో పెరుతో తన సొంత ఎన్ఎఫ్టీలను ప్రారంభించిన మొదటి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. రితీ ఎంటర్టైన్మెంట్ వారి బియాండ్‌లైఫ్.క్లబ్, గార్డియన్లింగ్.ఐవోతో భాగస్వామ్యమైంది. గ్లోబల్ సెలబ్రిటీలు, ఆర్టిస్తులు, అథ్లెట్లకు వారి వారి చిత్రాలను ఎన్ఎఫ్టీలుగా (NFTs.Movie) మార్చడానికి ఈ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది. ఇటీవల, అమితాబ్ బచ్చన్ తన ఎన్ఎఫ్టీ వేలంతో మూడు సెట్ల కలెక్షన్లతో లైవ్‌లోకి వెళ్లారు. 2. సన్నీ లియోన్ సన్నీ లియోన్ నాన్-ఫంగిబుల్ టోకెన్ల (NFT) మార్కెట్ ప్లేస్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ నటిగా అవతరించింది. ఈమె మిస్ఫిజీ పేరుతో ఎన్ఎఫ్టీ తీసుకుంది. 3. దుల్కర్ సల్మాన్ మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ తన చిత్రం కురుప్ కోసం గత నెలలో ఎన్ఎఫ్టీ సేల్‌ను నిర్వహించడానికి అబుదాబికి చెందిన టెక్నాలజీ కంపెనీ అంబర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 4. రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన చిత్రం డేంజరస్‌ను బ్లాక్ చెయిన్ ఎన్ఎఫ్టీగా విక్రయించబడుతోందని ఆర్జీవీ ట్విటర్లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్ ఫిల్మ్‌ను ఎన్ఎఫ్టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేశారు. 5. విశాల్ మల్హోత్ర టీవీ హోస్ట్, నటుడు విశాల్ మల్హోత్ర నాన్ ఫంగిబుల్ టోకెన్ (NFT)ను ఆర్టిస్ట్ ఇషితా బెనర్జీతో కలిసి విడుదల చేశారు. అలా ఒక ఆర్టిస్ట్‌తో కలిసి విడుదల చేసిన మొదటి భారతీయ నటుడు విశాల్ మల్హోత్ర. ఈయన తన 25 ఏళ్ల బాలీవుడ్ కెరీర్లో ఎన్నో ప్రజాధరణ పొందిన పాత్రలు చేశారు. వీరితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రాపర్ రాఫ్తర్, సింగర్ మికా సింగ్, యూట్యూబర్ అమిత్ బదాన ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి దిగనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు, ప్రజలు డిజిటల్ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. -
దుల్కర్ చిత్రానికి రూ. 40 కోట్ల ఓటీటీ డీల్, ఒప్పందం రద్దు చేయించిన మమ్ముట్టి!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ తెరకెక్కి నవంబర్ 12న విడుదలకు సిద్దమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇటీవల విడుదలైన ‘కురుప్’ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ విడుదలపై హీరో దుల్కర్ సల్మాన్, చిత్ర బృందం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తిక వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. ‘కురుప్’ మూవీ షూటింగ్ ఎప్పుడో పూరైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మొదట ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారట. అంతేగాక డిజిటల్ విడుదలకు వారికి ఓటీటీ నుంచి రూ. 40 కోట్ల డీల్ కూడా కుదిరినట్లు వినికిడి. చదవండి: హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు అయితే దుల్కర్ సల్మాన్ తండ్రి, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమా చూసి ఓటీటీ డీల్‌ను రద్దు చేసి థియేటర్లో విడుదల చేయమని మేకర్స్‌ను ఒప్పించాడట. తండ్రి చెప్పడంతో వెంటనే రూ. 40 కోట్ల ఓటీటీ ఒప్పందాన్ని దుల్కర్ సల్మాన్ రద్దు చేసుకుని థియేటర్లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఈ చిత్రాన్ని స్యయంగా దుల్కర్ సల్మాన్ నిర్మించడం విశేషం. చదవండి: తెలుగు ప్రేక్షకులను మించిన సినీ ప్రేక్షకులు ఉండరేమో: హీరో